జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని ఎంబీ భవన్‌లో పవన్ విలేకరులతో మాట్లాడారు. ‘ 2014 ఎన్నికల్లో 60 లేదా 70 స్థానాలకు పోటీ చేస్తానని చంద్రబాబుతో చెప్పాను..మీరు విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల తర్వాత రాజ్యసభ సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఆ రోజు మాట్లాడింది వేరు మరుసటి రోజు వారి పేపర్లలో చంద్రబాబు రాయించింది వేరు.