ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైం పోలీసులు దూకుడు పెంచారు. సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ షర్మిల తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.