CCS officials
-
143 మంది అత్యాచారం కేసు : 42 పేజీల ఎఫ్ఐఆర్!
-
143 మంది అత్యాచారం కేసు : 42 పేజీల ఎఫ్ఐఆర్!
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల తనపై 143 మంది లైంగిక దాడికి పాల్పడ్డారంటూ పంజగుట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన కేసును సీసీఎస్ పోలీసులు వేగవంతం చేశారు. ఎఫ్ఐఆర్, బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా నిందితులను విచారించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 143 మంది నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే 42 పేజీలతో ఎఫ్ఐఆర్ రెడీ చేశారు. 143మందిలో ప్రముఖ రాజకీయ నాయకుల పీఏలు, టీవీ నటులు, పోలీసులు, ఎస్ఎఫ్ఐ లీడర్లు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. (చదవండి : 5 వేల సార్లు అఘాయిత్యం) మరో వైపు యువతిపై అత్యాచారం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. సుమారు 27 మంది ఏబీవీపీ జెండాలతో కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. మహిళపై లైంగికదాడి చేసిన వారిని శిక్షించాల్సిన బాద్యత పోలీసులపై ఉందని, విచారణ మాత్రం నామమాత్రంగా జరుగుతుందంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. -
143 మంది అత్యాచారం.. రోజుకో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ అత్యాచారం కేసు పోలీసులకి తలనొప్పిగా మారింది. గడిచిన 11 ఏళ్లుగా తనపై 143 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ మిర్యాలగూడకు చెందిన ఓ యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సంచలనంగా మారిన ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో తెలియక పోలీస్ ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో లోతైన దర్యాప్తు కోసం కేసు బాధ్యతను ఎవరికి అప్పగించాలో కసరత్తు చేస్తున్నారు. ఈ కేసును సీఐడికి అప్పగించాలా లేదా సీసీఎస్‌కి బదిలీ చేయాలా అనే దాని గురించి ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానున్నట్లు తెలిసింది. ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. ఆధారాలు లేవు.. సీసీఫుటేజ్ దొరకడం అసాధ్యం నిజంగానే తొమ్మిదేళ్లుగా యువతిపై అత్యాచారం చేస్తూ వస్తున్నా ఎందుకు ఇప్పటి వరకు బాధితురాలు నోరు విప్పలేదు? పోలీస్ స్టేషన్లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజంగానే పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు అనుకున్న మరి మీడియా ముందుకు రావొచ్చు కదా అనే వారు కూడా లేక పోలేదు. అయితే ఈ ప్రశ్నల గురించి భరోసా సెంటర్లో కౌన్సలింగ్ చేస్తున్న పోలీసులు భాదితురాలను ప్రశ్నించగా కొన్నిటికి సమాదానాలు ఇచ్చింది. ‘ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే నిన్ను చంపేస్తాం .. నీకు వెనుక ముందు ఎవరు లేరు’ అని చాలా మంది కాల్స్ చేసి బెదిరించారని తెలిపింది. దాంతో ఆ వేధింపులు భరించలేక తానే ఆత్మహత్య చేసుకుందాం అని నిర్ణయం తీసుకొని మరణ వాంగ్మూలం కూడా రాసి పెట్టినట్లు బాధితురాలు వెల్లడించింది. (143 మంది అత్యాచారం చేశారు) ఈ ఆరోపణలకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని బాధితురాలిని ప్రశ్నించగా.. లేవని.. కానీ తాను వెళ్లిన హోటల్స్ అడ్రస్‌లు చెపుతాను అక్కడికి వెళ్లి దర్యాప్తు చేయండి అంటూ పోలీసులుకి సూచనలు చేసింది. ఈ మేరకు అక్కడకు వెళ్లిన పోలీసులకు తొమ్మదేళ్ళ క్రితం, ఐదేళ్ల క్రితం ఫుటేజ్ ఇప్పుడు దొరకడం అనేది అసాధారణంగా మారింది. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: నిందితులు ఎలాగో ఆధారాలు దొరకవు కాబట్టే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుందని.. ఆ అమ్మయిని మేము ఎప్పుడు చూడనే లేదని 139 మందిలో కొంత మంది పోలీసుల విచారణలో వెల్లడించారు. అయితే ఇన్ని సంచలనాలు ఉన్న కేసులో వాస్తవం ఏంటి.. అసలు ఈ కేసులో ఎవరైనా బాధితురాలను అడ్డం పెట్టుకొని మొత్తం కథ నడుపుతున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నిందితులు కొంత మంది పోలీసులుకి సమాచారం ఇచ్చారు. నిజంగా డబ్బులు కోసం బాధితురాలను పావుగా వాడుకొని ఇలా పథకం వేశారా.. బాధితురాలు వెనుక ఉండి ఓ ఎన్జీఓ ప్రతినిధి నడిపిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంత వాస్తవం ఉంది అనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. (యువతి శరీరంలో మూడేళ్లుగా బుల్లెట్!) కేసు సీఐడీకీ లేదా సీసీఎస్‌కు బదిలీ ఈ కేసుకు సంబంధించి విచారణ ఎలా చేయాలి? ఏవిధంగా ముందుకు వెళ్లాలి? అనుమానితులను ఏ విధంగా ప్రశ్నించాలి? మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వారిని ఏ విధంగా పిలవాలి? వీటన్నిటిపై పోలీసులు సమగ్ర ప్రణాళిక చేయబోతున్నారు. అయితే, పంజాగుట్ట పోలీసులతో విచారణ కాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలా? లేకుంటే సీసీఎస్‌కు ఈ కేసును బదిలీ చేయాలా? అనే దాని పైన ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోబోతున్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత అడుగు ముందుకేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి అనుమతిస్తే దర్యాప్తును సీఐడీకి అప్పగిస్తారు. లేదంటే ఈ కేసును పంజాగుట్ట ఠాణా నుంచి సీసీఎస్‌కు బదిలీ చేయాలా అనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. -
‘పరపతి’ పోయింది!
నా జీతం నుంచి కట్ చేసి సహకార పర పతి సంఘం (సీసీఎస్)లో డిపాజిట్ చేసిన డబ్బు రూ.రెండున్నర లక్షలు ఉంది. అందులోంచి రూ. 2.5 లక్షల రుణం కోరితే లేదంటే ఎలా?. అత్యవసరమై పిల్లల చదువు కోసం బయట అప్పు చేశా. ప్రతినెలా రూ.10 వేలు వడ్డీ కట్టాల్సి వస్తోంది. వేతనంలో అంత మొత్తం అటు పోతే మేము బతికేదెట్లా – నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ గోడు కుటుంబ అవసరాల కోసం ఓ కండక్టర్ వడ్డీ వ్యాపారి వద్ద రూ.9 లక్షలు అప్పు చేశాడు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇప్పుడు ఆయన కుటుంబం అప్పు తీర్చేదెలా అని లబోదిబోమంటోంది. అదే ఆర్టీసీ సహకార పరపతి సంఘం నుంచి లోన్ వచ్చి ఉంటే, నిబంధనల ప్రకారం ఆ అప్పు మాఫీ అయి ఉండేది. – హైదరాబాద్‌కు చెందిన కండక్టర్ కుటుంబం ఆవేదన ఇలా ఎంతో మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులు ప్రతినెలా తమ జీతంలో నుంచి దాచి పెట్టుకున్న నిధిని ఆర్టీసీ యాజమాన్యం స్వాహా చేసేయటమే దీనికి కారణం. ఏడాది కాలంగా ఆ మొత్తాన్ని సొంత అవసరాలకంటూ ఆర్టీసీ వాడేసుకుని, ఇప్పుడు చెల్లించలేమంటూ చేతులెత్తేయడంతో అత్యవసరాలకు రుణాలు అందక కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఇదీ ఆర్టీసీ సహకార పరపతి సంఘం దీనావస్థ. కాగా, యాజమాన్య తీరును నిరసిస్తూ ఆ సంఘం నిర్వాహకులు చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టారు. ఏమిటీ ఈ నిధి... ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు అవసరాల కోసం ప్రత్యేకంగా సహకార పరపతి సంఘం ఏర్పాటైంది. ప్రతి ఉద్యోగి జీతంలో బేసిక్‌పై 7 శాతం మొత్తాన్ని సంస్థ కట్ చేసి ఈ సంఘానికి జమ చేస్తుంది. అలా ప్రతినెలా తెలంగాణ ఆర్టీసీలో రూ.40 కోట్లు జమ కావాలి. అలా వచ్చే మొత్తం నుంచి కార్మికులు పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇళ్లు కట్టుకోవటం... తదితర అవసరాలకు రుణంగా పొందుతారు. ఆ మొత్తాన్ని బ్యాంకు వడ్డీ కంటే తక్కువ వడ్డీతో చెల్లిస్తారు. జరిగింది ఇదీ.. దాదాపు 12 నెలలుగా ఆర్టీసీ ఆ నిధులను సీసీఎస్‌లో జమ చేయటం లేదు. దీంతో ఏడు నెలలుగా సీసీఎస్ అధికారులు రుణాలు ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులూ రావటం లేదని, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఉపయోగం లేదని అధికారులు పేర్కొనటంతో గత్యంతరం లేక సీసీఎస్ హైకోర్టును ఆశ్రయించింది. గతంలో సీసీఎస్ నిధిని వాడుకుంటే ఆర్టీసీ వడ్డీతో సహా తిరిగి చెల్లించేది. కానీ టీఎస్ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి వడ్డీ ఇవ్వక రూ.45 కోట్ల బకాయిలు పడింది. దీంతో సీసీఎస్ అంటేనే కార్మికులకు నమ్మకం సడలింది. కొంతకాలంగా దాదాపు 4 వేల మంది కార్మికులు సభ్యత్వాన్ని రద్దు చేసుకుని బయటకొచ్చారు. – సాక్షి, హైదరాబాద్ -
షర్మిల ఫిర్యాదు.. దూకుడు పెంచిన పోలీసులు
-
షర్మిల ఫిర్యాదు.. దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ షర్మిల తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు షర్మిలపై అసత్య ప్రచారాలు చేస్తున్న సైట్లను గుర్తించారు. (ఎందుకింత దిగజారుడు రాజకీయాలు?) 12 యూఆర్ఎల్ నంబర్ల ఐపీ అడ్రస్‌ల కోసం పోలీసులు గూగుల్‌కు లేఖ రాశారు. ఐపీ అడ్రస్సులు అందగానే సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసుల జారీ చేయనున్నారు. రెండు రోజుల్లో గూగుల్ నుంచి ఐపీ అడ్రస్సులు అందే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఐపీ చిరునామా ఆధారంగా నిందితులను వెలికి తీస్తామని, రెండు మూడు రోజుల్లోనే ట్రోల్స్ చేస్తున్న వారి వివరాలు వెలుగులోకి వస్తాయని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇక పోలీసుల విచారణ తెలుసుకుని అసభ్యకర పోస్టులను నిందితులు తొలగించినట్లు తెలుస్తోంది. అయితే నిందితులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశమే లేదని పోలీసులు వివరించారు. (షర్మిల ఫిర్యాదుపై చంద్రబాబు ఎదురుదాడికి దిగడమేంటి?) -
వైఎస్ షర్మిల ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ఫిర్యాదును సైబర్ క్రైమ్ విభాగానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ బదిలీ చేయడంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులపై సెక్షన్ 67 ఐటీ యాక్ట్ 2000 (ఏ ఎలక్ట్రానిక్ పరికకరాల ద్వారానైనా అసత్యాలను ప్రచారం చేయడం), ఐపీసీ సెక్షన్ 509 (మహిళలను కించపరచడం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు డీసీపీ రఘువీర్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగనుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. (వారిపై చర్యలు తీసుకోండి: కమిషనర్‌ను కోరిన వైఎస్ షర్మిల) -
‘ముసద్దీలాల్’కు చెందిన ఖాతాలు ఫ్రీజ్
దర్యాప్తు ముమ్మరం చేసిన సీసీఎస్ అధికారులు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన నవంబర్ 8వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ తెల్లవారుజాము వరకు రూ.100 కోట్లకు పైగా వ్యాపారం చేసిన ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యుయెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్‌పై నమోదైన కేసు దర్యాప్తును నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) ముమ్మరం చేసింది. శుక్రవారం వరకు వీటికి చెందిన మొత్తం 14 బ్యాంకు ఖాతాలను సీసీఎస్ అధికారులు ఫ్రీజ్ చేశారు. ఆదాయ పన్ను శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ ఠాణాలో నమోదైన కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది. ఆరోపణలు ఎదుర్కొంటు న్న రెండు సంస్థలూ బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఈ సంస్థలకు చెందిన డైరెక్టర్లు నితిన్ గుప్తా, సీరా మల్లేష్, నరేంద్రజి గెల్లబోయిన, వినూత బొల్ల నిందితులుగా ఉన్నారు. 8 గంటల్లో 100 కోట్ల వ్యాపారం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం నవంబర్ 8వ తేదీ రాత్రి వెల్లడించింది. ఎక్కువ ధరకు బంగారం కొనుగోలు చేయ డానికి సిద్ధమైన వారి నుంచి రద్దయిన పాత నోట్లను తీసుకో వడానికి సిద్ధమైన ఈ రెండు సంస్థల యాజ మాన్యాలూ అక్రమ వ్యాపారానికి తెరలేపా యి. 8వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ తెల ్లవారు జాము వరకు 8 గంటల వ్యవధి లోనే 5,200 మంది వినియోగదారులకు రూ.100 కోట్ల విలువ చేసే ఆభరణాలను విక్రయించి నట్లు ఈ సంస్థలు రికార్డులు రూపొందించా యి. ముసద్దీలాల్ జ్యువెల్లర్స్ యాజమాన్యం పంజ గుట్టలోని ఎస్బీఐ బ్రాంచ్‌లో నవంబర్ 10న రూ.57.85 కోట్లు, 11న రూ.24.8 కోట్లు, 15న రూ.27.2 కోట్లు పెద్దనోట్లను జమ చేసింది. వైష్ణవి బులియన్ జూబ్లీహిల్స్ యాక్సిస్ బ్యాం కులో గత నెల 10న ఓ కొత్త అకౌంట్ తెరిచి రూ.40 కోట్ల పాతనోట్లను జమ చేసింది. వివిధ ఖాతాలకు నిధుల మళ్లింపు ఎస్బీఐలో జమ చేసిన రూ.57.85 కోట్లను మసద్దీలాల్ యాజమాన్యం వివిధ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసింది. నవంబర్ 11–23 తేదీల మధ్య ఈ నగదును దాదాపు 31 దఫాలుగా వివిధ ఖాతాల్లోకి మార్చారని సీసీఎస్ గుర్తిం చింది. శ్రీబాలాజీ గోల్డ్, ఎంఎస్ ఇంప్లెక్స్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ తది తర కంపెనీల పేర్లతో ఉన్న ఖాతాల తోపాటు డైరెక్టర్ నితిన్ వ్యక్తిగత ఖాతా లోకీ మళ్ళించారని తేలింది. యాక్సిస్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన రూ.40 కోట్ల నగదును అష్టలక్ష్మీ గోల్డ్ ఖాతాలోకి బదిలీ చేశారు. దీని నుంచి 36 దఫాల్లో బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారు. ఒక్కో ఖాతాలోకి కనిష్టంగా రూ.99 లక్షల నుంచి గరిష్టంగా రూ.4 కోట్ల వరకు బదిలీ చేసినట్లు సీసీ ఎస్ అధికారులు గుర్తించారు. నగదు బది లీ అయిన ఖాతాలపై ఆరా తీస్తున్నారు. -
ఏటీఎం గోల్మాల్ ఆర్సీఐ పనే
సాక్షి, హైదరాబాద్: ఏటీఎం కేంద్రాల్లో పెట్టాల్సిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు చెందిన రూ.9.98 కోట్ల గోల్మాల్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ అధికారులు శుక్రవారం ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. సబ్-కాంట్రాక్ట్ ద్వారా ఈ వ్యవహారాలు నెరపుతున్న ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ యాజమాన్యమే తొలుత దారి తప్పిందని, ఆపై దాని ఉద్యోగులు, కస్టోడియన్లు సైతం నగదు స్వాహా చేశారని డీసీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. దాదాపు ఏడాది పాటు ఈ వ్యవహారాలు సాగాయన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే, నిర్వహణ బాధ్యతల్ని ఎఫ్ఎస్ఎస్ సంస్థ కాంట్రాక్ట్ పద్ధతిన చేపడుతోంది. హైదరాబాద్‌కు సంబంధించి 116 ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే బాధ్యతల్ని ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 2013 నవంబర్ 15న సబ్-కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆర్సీఐకి చెందిన హైదరాబాద్ వాసులు సుదీప్‌కుమార్, పవన్‌కుమార్ గుప్తా డెరైక్టర్లు. జి.నాగరాజును ఆపరేషన్స్ విభాగం మేనేజర్‌గా, కె.లోకేశ్వర్‌రెడ్డి, కర్రె అజయ్‌కుమార్, జి.ప్రవీణ్‌కుమార్, ఆర్.పండు, నర్సింగ్రావుని కస్టోడియన్లుగా నియమించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో దారి తప్పి... మహేంద్రాహిల్స్ త్రిమూర్తి కాలనీలోని ఆర్సీఐ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఏడాది క్రితం సుదీప్తో పాటు సంస్థకు చెందిన గిరిరాజు తమ ఉద్యోగుల్ని దారి తప్పించారు. ఏటీఎం కేంద్రాల్లో నింపాల్సిన నగదులో రూ.2.15 కోట్లను తెప్పించుకుని, తమ అవసరాలకు వాడుకున్నారు. దీన్ని అదనుగా చేసుకున్న ఆపరేషన్స్ మేనేజర్, కస్టోడియన్లు రూ.7.83 కోట్లను స్వాహా చేశారు. ఈ నగదుతో భారీ మొత్తంలో క్రికెట్ బెట్టింగ్స్ కట్టి పోగొట్టుకున్నారు. ఇన్సూరెన్స్ రెన్యువల్‌తో వెలుగులోకి... ఒప్పందం ప్రకారం గడువు (ఏప్రిల్ 28) ముగిసినా ఆర్సీఐ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకోకపోవడంతో ఎఫ్ఎస్ఎస్ ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే నగదు, బ్యాంకు స్టేట్మెంట్లు పరిశీలించిన ఎఫ్ఎస్ఎస్ రూ.9.98 కోట్లు గోల్మాల్ అయినట్లు గుర్తించింది. ఈ నెల మొదటి వారంలో నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు సీసీఎస్ అధికారులు విచారణ ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఆర్సీఐ నిర్వాహకులు మేనేజర్ నాగరాజు ద్వారా తమ కస్టోడియన్లపై పోలీసులకు ఫిర్యాదు ఇప్పించారు. అదనపు డీసీపీ విజయేందర్‌రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు శుక్రవారం నాగరాజు, లోకేశ్వర్, అజయ్, ప్రవీణ్, పండు, నర్సింగ్రావును అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.34 కోట్ల నగదు, రెండు కార్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సుదీప్ తదితరుల కోసం గాలిస్తున్నారు. -
‘కళానికేతన్’ వెనుక మాస్టర్‌మైండ్!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కళానికేతన్ ఎండీ లీలాకుమార్ చేసిన మోసాల వెనుక ఓ ‘మాస్టర్‌మైండ్’ ఉన్నాడా..? మోసాలు ఎలా చేయాలో సలహాలు, సూచనలు ఇస్తూ తెరవెనుక ఉండి మొత్తం కథ నడిపించింది అతనేనా..? దీనికి అవుననే అంటున్నారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు. కళానికేతన్ మోసాల వేనుక మాస్టర్‌మైండ్ ఉన్నాడని, తెరవెనుక ఉండి కథ నడిపించిన ఈ వ్యక్తినీ నిందితుల జాబితాలో చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. లీలాకుమార్‌తో పాటు ఆయన భార్య శారదను శనివారం పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. బాధితుడిగా సీసీఎస్ తలుపుతట్టిన లీలాకుమార్ చివరకు నిందితుడిగా మారి జైలుకు వెళ్లాడని అధికారులు చెప్తున్నారు. వ్యాపారంలో భాగస్వామ్యం పేరుతో పరిచయస్తులు, స్నేహితులు, ఇతర వ్యాపారులు.. ఇలా అనేక మందికి వల వేసే లీలాకుమార్.. ప్రాథమికంగా వారి స్థిరాస్తులపై హక్కులు సాధిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఆపై ఈ పత్రాల ఆధారంగా వివిధ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. ఆనక తమ ‘పార్ట్నర్స్’ను మోసం చేయడంతో పాటు కొందరికి మాత్రం భాగస్వామ్యం ఇస్తున్నట్లు కొన్ని పత్రాలనూ ఇచ్చినట్లు సీసీఎస్ అధికారులు చెప్తున్నారు. లీలాకుమార్‌ను లోతుగా విచారించిన అధికారులు ఇలా ఇటు వ్యక్తులు, అటు బ్యాంకుల్ని ఒక్కడే మోసం చేయలేదని భావించారు. దాదాపు రూ.100 కోట్లకుపైగా మోసం చేయడం వెనుక ఎవరో ఒకరు ఉన్నారన్న అనుమానంతో ఆరా తీశారు. ఫలితంగా ఓ వ్యక్తి వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. నేరాన్ని ప్రేరేపించడం, నేరగాళ్లకు సహరించడం తదితర ఆరోపణల కింద ఈ కేసులో ఆ మాస్టర్‌మైండ్‌ను నిందితుల జాబితాలో చేర్చాలని నిర్ణయించారు. దీనికి న్యాయస్థానం అనుమతి అవసరమని యోచిస్తున్న అధికారులు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఆస్తులపై హక్కు కాజేసి, బ్యాంకు రుణాలు పొందడం ద్వారానే కాక వస్త్ర సరఫరాదారుల్నీ లీలాకుమార్ మోసం చేసినట్లు సీసీఎస్ అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా కళానికేతన్ సంస్థకు 21 బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిలో విక్రయించడానికి అవసరమైన వస్త్రాలను అనేక మంది హోల్‌సేలర్లతో పాటు కంపెనీల నుంచి ఖరీదు చేస్తుంటారు. ఇలాంటి సరఫరాదారులకు లీలాకుమార్ రూ.75 కోట్ల మేర బకాయిపడినట్లు అధికారులు చెప్తున్నారు. నగరంలోని షేక్‌పేట నివాసి ఏవీఎన్ రెడ్డి తనను మోసం చేశాడంటూ లీలాకుమార్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా బాధితుడిగా వచ్చిన ఈయన అసలు వ్యవహారాన్ని దర్యాప్తు నేపథ్యంలో గుర్తించిన అధికారులు మరో కేసుతో నిందితుడిగా మార్చి అరెస్టు చేశారు. కళానికేతన్ శాఖల కోసం తమ దుకాణాలను అద్దెకు ఇచ్చిన వ్యక్తులూ సీసీఎస్‌ను ఆశ్రయిస్తున్నారు. వస్త్ర దుకాణాలను రాత్రికి రాత్రే మూసేసి అద్దె చెల్లించకుండా మోసం చేశారని వాపోతున్నారు. ఏవీఎన్ రెడ్డి ఫిర్యాదుతో నమోదైన కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీసీఎస్ అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. రూ.50 లక్షల మోసానికి సంబంధించి లీలాకుమార్‌పై గత నెల 30న పంజగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైన కేసునూ దర్యాప్తు నిమిత్తం స్వీకరించాలని సీసీఎస్ నిర్ణయించింది. -
మ్యారేజ్ బ్యూరో పేరిట టోకరా
♦ ఇరు రాష్ట్రాల్లో 150కి పైగా బాధితులు ♦ నిందితురాలి అరెస్టు సాక్షి, హైదరాబాద్: వివిధ కులాల వారికి పెళ్లి సంబంధాలంటూ పత్రికల్లో ప్రకటనలిచ్చి మో సాలకు పాల్పడుతున్న మహిళను సీసీఎస్ ఆధీనంలోని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 150 మందికి పైగా మోసపోయిన వారు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లోని అంబర్పేట్ ప్రాంతానికి చెందిన సరిత స్థానికంగా ‘శ్రీరస్తు మ్యారేజ్ బ్యూరో’ నిర్వహిస్తోంది. వివిధ తెలుగు పత్రికల్లోని ప్రత్యేక ఎడిషన్లలో కులాల వారీగా పెళ్లి సంబంధాలున్నాయంటూ ప్రకటనలు ఇచ్చేది. వీటిలో ఉన్న ఫోన్ నెంబర్లో ఎవరైనా సంప్రదిస్తే... వారి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.2,000 నుంచి రూ.5,000 వరకు వసూలు చేసేది. ఆపై వారి ఆసక్తిని బట్టి ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఫొటోలు, నకిలీ ప్రొఫైల్స్ పంపేది. రకరకాల కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ చివరకు సదరు వ్యక్తికి వివాహమైందని, మరో ప్రొఫైల్ పంపిస్తున్నానని నమ్మబలికేది. కొన్ని రోజులకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లు విసిగి వదిలేసేవారు. ఈ పంథాలో మోసాలకు పాల్పడుతున్న సరిత వ్యవహారాలపై సమాచారం అందుకున్న మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇన్స్పెక్టర్ శంకర్ రాజు నేతృత్వంలోని బృందం లోతుగా ఆరా తీసింది. నలుగురు బాధితుల్ని గుర్తించిన మీదట నిందితురాలిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. బాధితుల సంఖ్య 150కి పైగా ఉంటుందని, వారిలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని సీసీఎస్ అధికారులు చెప్పారు.