
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ఫిర్యాదును సైబర్ క్రైమ్ విభాగానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ బదిలీ చేయడంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులపై సెక్షన్ 67 ఐటీ యాక్ట్ 2000 (ఏ ఎలక్ట్రానిక్ పరికకరాల ద్వారానైనా అసత్యాలను ప్రచారం చేయడం), ఐపీసీ సెక్షన్ 509 (మహిళలను కించపరచడం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదనపు డీసీపీ రఘువీర్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగనుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. (వారిపై చర్యలు తీసుకోండి: కమిషనర్‌ను కోరిన వైఎస్ షర్మిల)
Comments
Please login to add a commentAdd a comment