ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు సాధారణంగా...యాదృచ్ఛికంగా జరుగుతున్నవే కానీ, టిడిపి మీద పనికట్టుకుని చేస్తున్నవి కావని బీజేపీ ఎమ్మెల్సే సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఐటీ దాడులు పన్నులు ఎగ్గొట్టే వారిపైనా, అవినీతి పరులుపైనా జరుగుతాయన్నారు. ప్రత్యేకంగా చంద‍్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న దాడులు ఎంతమాత్రం కావన్నారు. ఐటీ దాడులను చూసి చంద్రబాబు ప్రభుత్వం విపరీతంగా భయపడిపోతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.