హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు విశ్వహిందు పరిషత్(వీహెచ్‌పీ) ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ బహిరంగ సభలో హిందువులను అవమానించేలా మాట్లాడిన కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. కరీంనగర్ సభలో ‘హిందూ గాళ్లు, బొందు గాళ్లు.. దిక్కుమాలిన దరిద్రుల చేతిలో దేశం ఉంది’అంటూ హిందువులను కించపరిచేలా వ్యాఖ్యానించారని ఆ ఫిర్యాదులో పేర్కొంది.