వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ప్రధాని మోదీతో సమావేశం అనంతరం అమిత్ షా నివాసానికెళ్లి.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కేంద్రంలో రెండోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అమిత్ షాను జగన్ అభినందించారు.