రాష్ట్రాభివృద్ధి సాధించాలంటే అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాల ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని.. ప్రాంతాల మధ్య సమతుల్యత చేయాలనుకున్నారని చెప్పారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమది ఘనమైన చరిత్ర అని, రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు మాత్రమే సీమలో ఉన్నాయని టీడీపీ చిత్రీకరించిందని మండిపడ్డారు.