తనపై జరిగిన దాడి వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ హస్తం ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే న్యాయ విచారణ చేసి వారిద్దరిని అరెస్ట్ చేయాలి ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఇంతకంటే దారుణాలకు పాల్పడతారని, భవిష్యత్తులో తనపై జరిగే దాడులు జరిగితే వారిద్దరే కారణమని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన చూసి ఓర్వలేకనే చంద్రబాబు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.