ఒటాగో తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 48 ఓవర్ ఐదో బంతిని రిప్పన్ ఫైన్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. అయితే తొలి పరుగును పూర్తి చేసుకున్న రిప‍్పన్.. రెండో పరుగు కోసం నాన్ స్ట్రైకింగ్ ఎండ్ నుంచి వచ్చే క్రమంలో జారి పడ్డాడు. ఇది గమనించని నాథన్ స్మిత్ బంతి వైపు చూస్తూ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లోకి దాదాపుగా వచ్చేశాడు. అయితే రిప్పన్ జారిపడ్డ విషయాన్ని ఒక్కసారిగా చూసిన నాథన్ స్మిత్ కూడా జారిపడిపోయాడు.