దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ ఆడుతున్న భారత జట్టును నీటి కష్టాలు ఇబ్బందులు పెడుతున్నాయి. ప్రస్తుతం కేప్‌టౌన్‌లో అత్యంత దారుణ దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో నీటికొరత తీవ్రంగా ఉంది. దీంతో భారత క్రికెటర్లు వినియోగించే నీటిపై అధికారులు ఆంక్షలు విధించారు. షవర్ కింద రెండు నిమిషాలు మాత్రమే స్నానం చేయాలని క్రికెటర్లకు అధికారులు స్పష్టం చేశారు. అలాగే టబ్ బాత్‌ను పూర్తిగా నిషేధించారు. ప్రస్తుతం కేప్‌టౌన్‌లో ఉష్ణోగత చాలా ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలనుంచి ఉపశమనం పొందేందుకు తాగే నీటిపైనా అధికారులు ఆంక్షాలు విధించారు.