ప్రపంచకప్ వంటి మెగా టోర్నీకి దూరం కావడంపై ధావన్ ఉద్వేగానికి లోనయ్యాడు. బీసీసీఐ అధికారిక ప్రకటన అనంతరం ధావన్ ఎంతో ఎమోషనల్ అవుతూ తన ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ‘బొటనవేలు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో ప్రపంచకప్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరం అవుతున్నాను. ఏది ఏమైనా టీమిండియా విజయపరంపర కొనసాగాలి. నాపై ప్రేమానురాగాలు చూపించిన వారికి, కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్’అంటూ వీడియో షేర్ చేశాడు.