హ్యాట్రిక్‌ సిక్సర్లతో దుమ్మురేపిన యువీ | Yuvraj SIngh Gets Hat trick of sixes in IPL | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ సిక్సర్లతో దుమ్మురేపిన యువీ

Mar 28 2019 9:22 PM | Updated on Mar 21 2024 10:58 AM

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు యువరాజ్‌ మెరుపులు మెరిపించాడు. క్రీజ్‌లో ఉన్నది కాసేపు అయినా బెంగళూరుకు దడపుట్టించాడు. ప్రధానంగా ఆర్సీబీ స్పిన్నర్‌ చహల్‌ వేసిన 14వ ఓవర్‌లో యువీ దుమ్మురేపాడు. హ్యాట్రిక్‌ సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే నాల్గో బంతికి సైతం భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. బౌండరీ లైన్‌వద్ద సిరాజ్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో యువరాజ్‌ ఇన్నింగ్స్ ముగిసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement