Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Meets With Public Representatives Of Local Bodies Updates1
మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం: వైఎస్‌ జగన్‌

తాడేపల్లి: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు. కేసులకు, జైళ్లకూ భయపడకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. తెగువ, ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయి:’’ అంటూ వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మంగళవారం వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్‌ జగన్‌.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.‘‘మన హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం స్వీప్‌ చేశాం. తాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి 18, మనకు 16. టీడీపీ వాళ్లని లాక్కుందామని ఎమ్మెల్యే అడిగాడు. కాని, మన పార్టీ ఎమ్మెల్యేను మనం హౌస్ అరెస్ట్‌ చేయించాం. ప్రజాస్వామ్యంగా అక్కడ ఎన్నిక జరిగేలా చూశాం, కాబట్టే అక్కడ టీడీపీ గెలిచింది. రాష్ట్రంలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా, చివరకు టీడీపీ వాళ్ల సమస్యలనూ తీర్చాం...జగనన్నకు చెబుదాం నంబర్‌కు ఫోన్‌ చేస్తే చాలు వెంటనే స్పందించి పరిష్కారం చూపాం. స్పందన కార్యక్రమం ద్వారా కూడా వివక్ష లేకుండా పరిష్కారాలు చూపాం. అత్యధికంగా టీడీపీ వాళ్లకు చెందిన సమస్యలకు పరిష్కారాలు చూపి మంచి పరిపాలన అందించాం. ఇవాళ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీచేస్తున్నాడు’’ అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..👉స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు👉తిరువూరులో సంఖ్యాబలం లేని చోటకూడా టీడీపీ పోటీకి పెట్టి, లాగేసుకునే ప్రయత్నంచేస్తోంది👉అయినా సరే మెజార్టీ వైయస్సార్‌సీపీ ఉండడంతే ఎన్నికను ఆపుతున్నారు:👉పోలీసులు వైయస్సార్‌సీపీ వాళ్లని అరెస్టు చేస్తున్నారు, టీడీపీ వాళ్లని రోడ్డుపై విడిచిపెడుతున్నారు👉సంఖ్యాబలం లేకపోయినా నర్సారావుపేట, కారంపూడిల్లో గెలిచామని ప్రకటించుకున్నారు👉కుప్పం మొదలుకుని ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే👉రాప్తాడులో రామగిరి ఉప ఎన్నికలో అరాచకాలకు అంతులేదు👉ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గుర్తుమీద, ఒక పార్టీ బి-ఫాం మీద గెలిచినప్పుడు, సంఖ్యాబలంలేకపోయినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్లు అక్రమాలను ప్రోత్సహించడం ఎంతవరకూ సమంజసం👉పోలీసులను పెట్టి బెదిరిస్తున్నారు👉యలమంచిలిలో మన వాళ్లు గట్టిగా నిలబడి గెలుపును సాధించుకున్నారు👉ఏ ప్రభుత్వంపైన అయినా వ్యతిరేక రావాలంటే సమయం పడుతుంది👉కాని చంద్రబాబుగారి పరిపాలనలో నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది👉మనకన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు👉జగన్‌ ఇచ్చేవన్నీ ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇస్తానన్నాడు👉కాని వాటన్నింటినీ తుంగలో తొక్కాడు 👉కాని, మన ప్రభుత్వంలో ప్రతి కార్యకర్త మనం అమలు చేసిన మేనిఫెస్టోతో ప్రతి ఇంటికీ వెళ్లాడు👉గడపగడపకూ కార్యక్రమం కింద మూడుసార్లు ప్రతి ఇంటికీ వెళ్లారు:👉99శాతం హామీలను అమలు చేసిన పార్టీ భారతదేశ చరిత్రలో వైయస్సార్‌సీపీ మాత్రమే👉మనం చేసిన మంచి ఎక్కడకూ పోదు👉10 శాతం ప్రజలు చంద్రబాబు ఏదో చేస్తారని నమ్మారు👉ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్‌బాల్‌ తన్నినట్టు ఈ ప్రభుత్వాన్ని తంతారు👉వైఎస్సార్‌సీపీ మాదిరిగా ప్రతి ఇంటికీ వెళ్లే ధైర్యం టీడీపీకి ఉందా?👉హామీల అమలుపై గట్టిగా నిలదీస్తారనే భయం వారికి ఉంది👉మాట ఇవ్వడం అంటే వెన్నుపోటు మాత్రమే అని చంద్రబాబుగారు నిరూపించారు👉పేదవాడి వైద్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు👉ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు👉రూ.3600 కోట్లు పెండింగ్‌లో పెట్టారు👉ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తివేశారు👉వైద్యంకోసం అప్పులు పాలు అయ్యే పరిస్థితి👉ఏ పంటకూ కనీస మద్దతు ధర రావడంలేదు👉ప్రభుత్వం రంగంలో వైయస్సార్‌సీపీ తీసుకొచ్చిన కాలేజీలను చంద్రబాబు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నాడు:👉కొత్తగా మూడు పోర్టులు నిర్మాణం ప్రారంభించాం👉శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లాం👉ఇప్పుడు ఆమూడు పోర్టులను కమీషన్లకోసం అమ్మేసేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడు👉ట్రైబల్‌ ప్రాంతాన్ని అభివృద్ధి పథాన నడిపించాం👉ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు, ట్రైబల్‌ యూనివర్శిటీ, మెడికల్‌ కాలేజీలు, సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు పెట్టాం👉బోగాపురం ఎయిర్‌పోర్టుకు గత చంద్రబాబు హయాంలో అనుమతులు లేవు, భూసేకరణ లేదు👉మనం అన్నీచేసి 30శాతం పనులు చేశాం👉రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి పనులు కేవలం వైయస్సార్‌సీపీ హయాంలోనే జరిగాయి👉ఈరోజు ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి👉వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నాడు👉ప్రజలను వెన్నుపోటు పొడిచాడు👉ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పరిస్థితులను తీసుకు వచ్చాడు👉రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు👉ఎవరైనా గొంతు విప్పితే వారిని అణచివేయాలని చూస్తున్నాడు👉చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు👉తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టిస్తున్నారు 👉గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు👉పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు👉ప్రతి కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నాను👉జగన్‌ 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది👉కోవిడ్‌ కారణంగా ఐదేళ్లపాలనలో అనుకున్నంతమేర సరిగ్గా చేయలేకపోయాం👉ఇవాళ మీ కష్టాలను చూస్తున్నాను 👉రేపు కచ్చితంగా వై​ఎస్సార్‌సీపీకి కార్యకర్తే నంబర్‌ ఒన్‌👉అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి👉కొడతానంటే.. కొట్టమనండి👉కాని, మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి👉కాని, ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం👉రిటైర్డ్‌ అయిన వారినీ లాక్కుని వస్తాం👉దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం👉అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాం👉మనకూ టైం వస్తుంది👉చంద్రబాబు నాటిని విత్తనాలు.. కచ్చితంగా ఈ పరిస్థితులకు దారితీస్తాయి👉చంద్రబాబు దుర్మార్గపు పాలనవల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డవారి కథలు వింటే చాలా ఆవేదన కలుగుతోంది👉మహిళలను అని చూడకుండా నెలలతరబడి జైళ్లలో పెడుతున్నారు👉ఒక కేసులో బెయిల్‌ వస్తుంది, అది రాగానే మరో కేసు పెడుతున్నారు👉ఇలా కేసులు మీదు కేసులు పెడుతన్నారు👉వల్లభనేని వంశీ విషయంలో ఇలాగే చేశారు👉దళితుడైన ఎంపీ నందిగం సురేష్‌ విషయంలోనే ఇలాగే దారుణాలు చేస్తున్నారు👉సుమారు నెలన్నరకుపైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ కేసుపెట్టి జైల్లో వేశారు👉తనను, తన కుటుంబ సభ్యులను తిడితే, ఎందుకు తిట్టావన్నందుకు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు👉చంద్రబాబు ఇవాళ నాటిన విత్తనం రేపు మహావృక్షం అవుతుందని మరిచిపోవద్దు👉రాబోయే రోజుల్లో ప్రజల తరఫున గట్టిగా పోరాటాలు చేద్దాం👉వచ్చేది మన ప్రభుత్వమే👉మంచి రోజులు కచ్చితంగా వస్తాయి

No door delivery of ration  In AP Cabinet Meeting2
AP: మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలే.. డోర్ డెలివరీకి మంగళం

విజయవాడ: చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రేషన్‌ డోర్‌ డెలివరీకి మంగళం పాడింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్‌ను డోర్‌ డెలివరీని నిలిపివేస్తూ చంద్రబాబు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈరోజు(మంగళవారం) సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోగా, అందులో రేషన్‌ డోర్‌ డెలివరీని నిలిపివేయడం ఒకటి. ఫలితంగా ఎండీయూ ఆనరేటర్లను రోడ్డున పడేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దాంతో 9260 రేషన్ డెలివరీ వాహనాలు నిలిచిపోనున్నాయి. మళ్లీ పాత పద్ధతిలోనే రేషన్‌ షాపుల నుండి సరఫరా చేయాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించారు. మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలే..రేషన్ డోర్ డెలివరీని నిలిపివేసే అంశాన్ని ఎండీయూ ఆపరేటర్లు గతంలో వ్యతిరేకించినా దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఎండీయూ ఆపరేటర్లపై జాలి లేకుండా వ్యవహరించడమే కాకుండా మళ్లీ ప్రజలు పాత పద్ధతిలో షాపుల వద్ద క్యూ లో ఉండి తీసుకునే విధానానికే ప్రభుత్వం మళ్లీ మొగ్గుచూపింది. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయంతో రేషన్‌ను ఇప్పటివరకూ డోర్‌ డెలివరీ ద్వారా ప్రజలు ఇంటి వద్దనే పొందుతుండగా మళ్లీ వెనకటి రోజుల గుర్తు చేయడానికి సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. దాంతో ప్రజలకు మళ్లీ రేషన్ కష్టాలు తప్పదనే సంకేతాన్ని, సందేశాన్ని కేబినెట్ సాక్షిగా ఇచ్చేశారు చంద్రబాబు. ఇప్పటికే 2.50 లక్షల వాలంటీర్లను తీసేసిన ప్రభుత్వం.. తాజాగా ఎండీయూ ఆపరేటర్లు, రేషన్ వాహనాలు అవసరం లేదనే నిర్ణయానికి వచ్చేసింది.

IPL 2025 Final shifted to Ahmedabad from Kolkata, Mullanpur to host Qualifier 1, Eliminator Matches3
ఐపీఎల్‌-2025 ఫ్లే ఆఫ్స్ వేదికలు ఖరారు.. ఫైనల్ ఎక్కడంటే?

ఐపీఎల్‌-2025 ప్లే ఆఫ్స్‌, ఫైన‌ల్ వేదిక‌ల‌ను బీసీసీఐ ఖరారు చేసిన‌ట్లు తెలుస్తోంది. క్రిక్‌బ‌జ్ రిపోర్ట్ ప్ర‌కారం.. ఈ ఏడాది సీజ‌న్ ప్లే ఆఫ్స్‌లోని మొద‌టి రెండు మ్యాచ్‌ల‌ను ముల్లాన్‌పూర్ వేదిక‌గా నిర్వ‌హించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. అదేవిధంగా క్వాలిఫ‌య‌ర్‌-2, ఫైన‌ల్ మ్యాచ్‌ల‌కు ఆహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియం వేదిక కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.మంగ‌ళవారం జ‌రిగిన స‌మావేశంలో బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు క్రిక్‌బ‌జ్ తెలిపింది. త్వ‌రలోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశ‌ముంది. కాగా షెడ్యూల్ ప్ర‌కారం.. మే 25న కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉండేది.అయితే భార‌త్ -పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్త‌ల కార‌ణంగా వారం రోజులు పాటు ఈ ఏడాది సీజ‌న్ వాయిదా ప‌డ‌డంతో.. షెడ్యూల్‌లో బీసీసీఐ మార్పులు చేసింది. ఫైన‌ల్ మే 25కు బ‌దులుగా జూన్ 3న నిర్వ‌హించినున్న‌ట్లు భార‌త క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది. కానీ ఫైన‌ల్ మ్యాచ్ వేదిక‌ను మాత్రం ఖారారు చేయ‌లేదు. తుదిపోరుకు ఆతిథ్య‌మిచ్చేందుకు బెంగాల్ క్రికెట్ ఆసోషియేష‌న్ సిద్దంగా ఉన్న‌ప్ప‌టికి.. నైరుతి రుతుప‌వ‌నాలు కార‌ణంగా కోల్‌క‌తాకు భారీ వ‌ర్ష సూచ‌న ఉంది. ఈ క్ర‌మంలో బీసీసీఐ ఫైన‌ల్‌ను అహ్మ‌దాబాద్‌లో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఐపీఎల్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి కానుంది. గ‌తంలో 2022, 2023 సీజ‌న్‌ల‌లో ఈ వేదికలోనే ఫైన‌ల్ మ్యాచ్‌లు జ‌రిగాయి. వాస్త‌వానికి.. ఫైనల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ల సొంత మైదానంలో నిర్వహిస్తారు.ఐపీఎల్‌-2023 విజేత‌గా చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచినందున గ‌తేడాది సీజ‌న్ ఫైన‌ల్‌కు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఇప్పుడు అనివార్య కార‌ణాల‌ వల్ల ఫైనల్ వేదిక కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు తరలిపోనుంది.ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ తాత్కాలిక‌ షెడ్యూల్మే 29: క్వాలిఫైయర్ 1 – ముల్లన్‌పూర్మే 30: ఎలిమినేటర్ – ముల్లన్‌పూర్జూన్ 1: క్వాలిఫైయర్ 2 – అహ్మదాబాద్జూన్ 3: ఫైనల్ – అహ్మదాబాద్

Tiruvuru Municipal Chairman Election Postponed Indefinitely4
తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా

సాక్షి, విజయవాడ: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా పడింది. కోరం లేక ముగించిసనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. నిన్న, ఈ రోజు టీడీపీ అరాచకం వల్ల ఎన్నిక జరగలేదు. ఎన్నికలు జరగకుండా టీడీపీ గూండాలు అల్లర్లు సృష్టించారు. టీడీపీ గూండాల బీభత్సంతో రెండు రోజులు ఎన్నిక జరగలేదు. వైసీపీ కౌన్సిలర్లు తిరువురు వెళ్లకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు.హైకోర్టు చెప్పినా కానీ పోలీసులు భద్రత కల్పించలేదు. టీడీపీ నేతల దాడితో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఎన్నికకు హాజురుకాలేకపోయారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కౌన్సిల్ సభ్యులు రాకపోవడంతో ఆర్డీవో కే.మాధురి ముగించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం తదుపరి కార్యచరణ ఉంటుందని ఆర్డీవో ప్రకటించారు.దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసు వాహనం ఎక్కనివ్వకుండా టీడీపీ టీడీపీ నేత రమేష్ రెడ్డి, టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై కూడా టీడీపీ గూండాల దాడి చేశారు. దేవినేని అవినాష్ , మొండితోక అరుణ్ కుమార్‌లను రెడ్డిగూడెం స్టేషన్‌కు పోలీసులు తరలిస్తున్నారు.

Kaleshwaram Commission Issues Notice to Kcr and Harish Rao and Etela Rajender5
KCR: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు

సాక్షి,హైదరాబాద్‌: కాళేశ్వరం కమిషన్‌ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు మంగళవారం (మే 20) నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో జూన్ 5న కేసీఆర్, 6న హరీశ్ రావు, 9వ తేదీన ఈటల రాజేందర్ విచారణకు రావాలని ఆదేశించింది. తాము పంపించిన నోటీసులకు 15 రోజుల్లో రిప్లై ఇవ్వాలని సూచించింది. కాగా, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ హయాంలో హరీష్‌రావు నిటి పారుదల వ్యవసాయ శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేశారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచార‌ణ గడువు పొడిగింపు కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ (Kaleshwaram commission) విచార‌ణ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మరో రెండు నెలలపాటు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో వ్య‌క్తిగ‌తంగా విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ కేసీఆర్‌,హ‌రీష్‌రావు,ఈటల రాజేంద‌ర్‌కు కాళేశ్వ‌రం క‌మిష‌న్ నోటీసులు పంపించింది.

Janhvi Kapoor and Sara Ali Khan’s IV drip therapy: Experts Explain6
జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌ల 'IV డ్రిప్ థెరపీ'..! ఆరోగ్యానికి మంచిదేనా..?

జాన్వీకపూర్‌, సారా అలీఖాన్‌లు, ప్రముఖ సెలబ్రిటీలు IV డ్రిప్ థెరపీలు చేయించుకున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. వారి ప్రకాశవంతమైన చర్మ రహస్యం ఆ థెరపీనే అని పలువురు నిపుణులు చెబుతున్నారు కూడా. ప్రస్తుతం ఈ కొత్త ఇన్ఫ్యూషన్‌ థెరపీ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అసలు ఇదేంటి..?. ఆరోగ్యానికి మంచిదేనా తదితర విశేషాలు గురించి సవివరంగా చూద్దాం. ఇది ఒక కొత్త ఇన్ఫ్యూషన్‌ థెరఫీ. దీని సాయంతో హీరోయిన్‌, సెలబ్రిటీలు మిలమిలాడే నవయవ్వన శరీరంతో మెరిసిపోతుంటారట. ఈ థెరపీలో పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు నేరుగా రక్తప్రవాహంలోకి వెళ్లేలా ఇంజెక్ట్‌ చేయించుకుంటారట. తద్వారా శరీర రోగనిరోధక వ్యవస్థను, శక్తిని పెంచి..చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే గాక వృద్ధాప్య ప్రభావాలని తగ్గిస్తుందట. ఇందులో ఏముంటాయంటే..ఈ డ్రిప్స్‌లో విటమిన్ సీ, జింక్, మెగ్నీషియంతో పాటు కొల్లాజెన్ వంటి ప్రోటీన్లు, గ్లూటాతియోన్ వంటి యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు తదితరాలు ఉంటాయని చెబుతున్నారు చర్మ వ్యాధి నిపుణులు. దీన్ని ఒక్కోసారి కొద్దిమొత్తంలో నోటి ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ✨ Revitalize Your Health with Our IV Drip Therapy! ✨Feeling drained or need a boost? Our private clinic offers premium IV drips tailored just for YOU!Why IV Therapy? 🌟 Immediate Absorption 🌟 Enhanced Immunity 🌟 Glowing Skin 🌟 Increased Vitality pic.twitter.com/7ICKp3ouXM— Eskulap Clinic (@polskaklinika) February 11, 2025 ఎలా పనిచేస్తుందంటే..నిజానికి గ్లూటాథియోన్ అనేది మన శరీరం సహజంగా ఉత్పత్తి చేసే యాంటీఆక్సిడెంటే. ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. కణాల నష్టంతో పోరాడటమే గాక, చర్మ రంగుకు కారణమైన మెలనిన్‌ ఉత్పత్తిని తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. దీన్ని మూడు అమైనా ఆమ్లాలు సిస్టీన్, గ్లూటామిక్ , గ్లైసిన్‌ అనే ఆమ్లాలతో రూపొందిస్తారు. శరీరంలోని ప్రతికణంలో ఇది కనిపిస్తుంది, కానీ వయసు పెరిగే కొద్దీ మన శరీరాలు తక్కువ గ్లూటాథియోన్‌ను ఉత్పత్తి చేస్తాయట. ఫలితంగా అనేక రకాల ఆరోగ్య సమస్యల బారినపడటం జరుగుతుందట. అందువల్ల ఇలా IV డ్రిప్‌ థెరపీ రూపంలో తీసుకుంటారట సెలబ్రిటీలు. ఇవి నేరుగా రక్తప్రవహంలోకి వెళ్లి శరీరం త్వరగా గ్రహించడానికి అనుమతిస్తుందట. ఇది ఇచ్చిన మోతాదుని అనుసరించి వారాలు లేదా నెలలు వరకు ఆ థెరపీ సమర్థవంతమైన ప్రభావం ఉంటుందట. సాధారణంగా ఇది ఒక ఏడాదికి పైగా ప్రభావవంతంగా ఉంటుందట.సురక్షితమేనా?వాస్తవానికి కాస్మెటిక్ స్కిన్ లైటనింగ్ కోసం US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) దీనిని ఉపయోగించడాన్ని ఆమోదించదు. దీర్ఘకాలికంగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవనేందుకు సరైన ఆధారాలు లేకపోవడంతో దీన్ని యూఎస్‌ ఆరోగ్య అధికారులు అనుమతించరట. అలాగే కౌమర దశలో ఉన్న అమ్మాయిలకు ఇవ్వకూడదు కూడా. సౌందర్యాన్ని ప్రతిష్టగా భావించేవారు..తెరపై కనిపించే కొందరు సెలబ్రిటీలు తప్పసరి అయ్యి ఈ అనారోగ్యకరమైన పద్ధతికి వెళ్తారని చెబుతున్నారు నిపుణులు. కానీ వాళ్లంతా నిపుణులైన వైద్యుల సమక్షంలోనే చేయించుకుంటారు కాబట్టి కాస్త ప్రమాదం తక్కువనే చెప్పొచ్చు. ఇక ఆరోగ్యవంతులైన యువతకు ఈ గ్లూటాథియోన్‌ అనేది సహజసిద్ధంగానే శరీరంలో తయారవుతుంది కాబట్టి ఆ అవసరం ఏర్పడదని అంటున్నారు నిపుణులు. దీన్ని 21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారెవ్వరూ తీసుకోకూడదట. చర్మం కాంతిగా నవయవ్వనంగా ఉండాలనుకునే వారంతా..యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం, పుష్కలంగా నీరు త్రాగడం, మంచి నిద్ర తదితరాలను మెయింటైన్‌ చేస్తే చాలని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సం‍ప్రదించడం ఉత్తమం. (చదవండి: ప్రపంచంలోనే తొలి మూత్రాశయ మార్పిడి..!)

Tamil actress Aishwarya Raghupathi blasts reporter for sleeveless comment7
'నా దుస్తులతో మీకేం పని?': రిపోర్టర్‌కు ఇచ్చిపడేసిన నటి ఐశ్వర్య

తమిళ నటి, ప్రముఖ యాంకర్ ఐశ్వర్య రఘుపతి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో ఆమె దుస్తులను ఉద్దేశించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంపై ఇప్పటికే ఓ నోట్ రిలీజ్ చేసింది. అయితే మరోసారి తాజాగా జరిగిన ఈవెంట్‌లోనూ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె స్లీవ్‌లెస్‌ దుస్తులపై ఓ రిపోర్టర్‌ ప్రశ్నించడంతో ఐశ్వర్య ఆగ్రహం వ్యక్తం చేసింది.తాజాగా సాయిధన్సిక మూవీ యోగిదా ఈవెంట్‌కు హాజరైన ఐశ్వర్య.. వేసవికాలంలో వేడిని తట్టుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని మీడియాను కోరారు. ‍అయితే దీనికి ప్రతిస్పందనగా.. ఒక రిపోర్టర్ ఆమెను ప్రశ్నిస్తూ.. మీరు ధరించిన స్లీవ్‌లెస్ బ్లౌజ్ కూడా వేడిని తట్టుకునే ప్రణాళికలో భాగమేనా అని అడిగారు. దీనికి ఆశ్చర్యపోయిన ఐశ్వర్య.. ఒక సినిమా కార్యక్రమంలో తన దుస్తులపై చర్చ ఎందుకంటూ అతన్ని ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. ఐశ్వర్య దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గత వారంలో ఐశ్వర్య రఘుపతి ఈ సమస్యను ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. నేటికి కూడా మన సమాజంలో చాలా మంది పురుషులు అహంకారం, దురభిమాన భావనను కలిగి ఉండటం నిరాశ కలిగించే అంశమని తెలిపింది. ఒక రిపోర్టర్ లాంటి వ్యక్తి నుంచి అలాంటి ప్రవర్తన వచ్చినప్పుడు మరింత నిరాశకు గురి చేసిందన్నారు. ఈ విషయాన్ని మీరు గ్రహించాలని ఐశ్వర్య తన ప్రకటనలో రాసుకొచ్చింది.ఇలా వేదికలపై తాను ఇలాంటి అసౌకర్య క్షణాలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ నటుడు తనకు దండలు వేయడానికి ప్రయత్నించేటప్పుడు హద్దులు మీరి వ్యవహరించాడని.. ఆ సంఘటన తన మానసికంగా ప్రభావితం చేసిందని ఐశ్వర్య చెప్పింది. కాగా.. ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్‌ చిత్రంలో ఐశ్వర్య రఘుపతి కనిపించింది. View this post on Instagram A post shared by Aishwarya Ragupathi (@aishwarya_ragupathi)

Gary Lineker resigned from BBC after 30 years8
సోషల్‌ మీడియా పోస్ట్‌తో.. రూ. 14 కోట్ల జాబ్ పోయింది

లండన్‌: ఇంగ్లండ్‌ మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు, కామెంటేటర్‌ గ్యారీ లినేకర్‌ (Gary Lineker) బీబీసీ వ్యాఖ్యాత స్థానం నుంచి వైదొలగనున్నాడు. సామాజిక మాధ్యమాల్లో జియోనిజానికి సంబంధించిన పోస్ట్‌ పెట్టిన కారణంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న గ్యారీ... ఇప్పుడు వ్యాఖ్యాతగా తప్పుకోనున్నాడు. మీడియా సెలబ్రిటీగా మంచి పేరున్న 64 ఏళ్ల లినేకర్‌... అత్యధిక పారితోషికం అందుకుంటున్న బ్రిటిష్‌ జాతీయ ప్రసారకుడిగా ఉన్నాడు. బీబీసీలో వ్యాఖ్యాతగా అతడు ఏడాదికి దాదాపు 1.7 మిలియన్ల అమెరికా డాలర్లు (రూ. 14 కోట్ల 52 లక్షలు) ప్రతిఫలంగా పొందుతున్నాడు.‘జియోనిజం రెండు నిమిషాల్లో వివరించొచ్చు’ అనే క్యాప్షన్‌తో కూడిన ఎలుక చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో లినేకర్‌పై విమర్శలు గుప్పుమన్నాయి. యూదు వ్యతిరేక భావజాలం కలిగిన ఇలాంటి పోస్టు పెట్టినందుకు లినేకర్‌ ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పినప్పటికీ... బీబీసీ గౌరవ మర్యాదలకు భంగం కలిగించినందుకు సోషల్‌ మీడియా పాలసీ (Social Media Policy) ప్రకారం అతడిపై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఇంగ్లండ్‌ జాతీయ జట్టు తరఫున 80 మ్యాచ్‌లాడిన లినేకర్‌... 48 గోల్స్‌ చేశాడు. 1986 ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా నిలిచాడు.చ‌ద‌వండి: భారత టాప్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాపై గ‌గ‌న్ నారంగ్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌

New evidence emerges in Jyoti Malhotra espionage case9
NIA విచారణ, జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు

చండీఘడ్‌: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఎన్‌ఐ విచారణలో ఆమె పాకిస్తానీ ఏజెంట్లతో నేరుగా సంబంధాలు కొనసాగించిందని, వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్‌క్రిప్టెడ్‌ డివైజ్‌లు వినియోగించిన‌ట్లు తేలింది. ఎన్ఐఏ విచార‌ణ‌లో ఆమె సోషల్ మీడియాను వీడియోలు పోస్టు చేస్తూ ప్ర‌పంచానికి తాను వ్లాగ‌ర్‌గా ప్ర‌మోట్ చేసుకుంటుంది. కానీ అస‌లు విష‌యం ఏంటంటే? ఎన్‌క్రిప్టెడ్ డివైజ్‌ల‌ను ఉప‌యోగించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాకిస్తానీ ఏజెంట్లతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉండేద‌ని హర్యానా పోలీసులు తెలిపారు. హర్యానా రాష్ట్రం హిస్సార్‌కు చెందిన జ్యోతి ‘ట్రావెల్‌ విత్‌ జో’పేరిట ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్‌కు 3.77 లక్షల మంది సబ్‌స్కైబ‌ర్లు ఉన్నారు. ఈమె ట్రావెల్‌విత్‌జో1 ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. అమె తీసిన యూట్యూబ్ వీడియోలు, సోష‌ల్ మీడియా పోస్టుల్లో భారతీయుల‌కు పాకిస్తాన్ మంచి దేశంగా చూపించే ప్ర‌య‌త్నం చేయ‌డం,ఉగ్ర‌దాడికి ముందు ప‌హ‌ల్గాంలో ప‌ర్య‌ట‌న, ఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాల‌యం ఉద్యోగి ఇషాన్ దార్‌తో స‌న్నిహితంగా ఉండ‌డంతో మే 16న జ్యోతిపై సివిల్‌ లైన్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ ఐఆర్ న‌మోదైంది.గూఢ‌చ‌ర్యం కేసులో ఆమెను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ విచారణలో ఈషాన్ దార్‌తో సన్నిహిత సంబంధాలు, పాకిస్తాన్‌లో పర్యటన, ఐఎస్‌ఐతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు పహల్గామ్‌ ఉగ్రదాడికి ముందు కశ్మీర్‌ సందర్శన, కశ్మీర్‌ పర్యటనకు ముందు పాకిస్తాన్‌కు వెళ్లడం, ఈ రెండు పర్యటనల మధ్య సంబంధం ఉందా? అన్న కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రా అరెస్ట్‌పై ఆమె తండ్రి హరీష్ మల్హోత్రాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం కొత్త అనుమానాలకు తెరతీసినట్లైంది.ఒక సారి తన కుమార్తె జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ కోసం వీడియోలు షూట్ చేసేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు తనకు చెప్పిందని, కానీ పాకిస్తాన్‌కు వెళ్లిన విషయం తనకు తెలియదని చెప్పారు. మరోసారి ఢిల్లీకి కాదు తాము ఉంటున్న ఇంట్లోనే వీడియోలు తీసేదని చెప్పారు. ఇంకోసారి తన కూతురు తాను ఏం చేస్తుందో ఎప్పుడూ చెప్పలేదని జ్యోతి తండ్రి హరీష్‌ మల్హోత్రా చెప్పడంపై చర్చాంశనీయంగా మారింది.

Tdp Conspiracy Politics In Tiruvuru Municipal Chairman Elections10
వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడి

రెండు గంటల పాటు టిడిపి గూండాలు భయోత్పాతం సృష్టించారుఎమ్మెల్సీ ,మొండితోక అరుణ్ కుమార్తిరువూరు వెళ్లడానికి మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదుపోలీసులే దగ్గరుండి టిడిపి గూండాలతో మాపై దాడి చేయించారుమేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాంనా కారును ధ్వంసం చేస్తున్నా.. పోలీసులు చోద్యం చూశారుకౌన్సిలర్లకు భద్రత కల్పించమని ఎన్నికల కమిషనర్ , హైకోర్టు ఆదేశాలున్నా పోలీసులు పెడచెవిన పెట్టారుఒక్కో కౌన్సిలర్ కు ఒక్కొక్క గన్ మెన్ ఇవ్వాలని ఆదేశాలున్నాయ్పోలీసులు రక్షణ ఇవ్వకపోతే మేమే రక్షణ కవచంలా నిలిచాంమా కారును ధ్వంసం చేసి మా పై హత్యాయత్నం చేశారుతిరువూరు టిడిపి ఎమ్మెల్యే వీధి రౌడీలా ప్రవర్తించాడుమా కారును అడ్డగించి మా పై దాడి చేసారునన్ను , స్వామిదాస్ ను కులం పేరుతో దూషించి చంపేస్తామని బెదిరించారు కులం పేరుతో దూషించి బెదిరించిన వారి పై నేను , స్వామిదాస్ కేసు పెట్టి... హై కోర్టుకు ఈడుస్తాంకోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు: తిరువూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి,నల్లగట్ల స్వామిదాస్నేను 35 ఏళ్లుగా తిరువూరు రాజకీయాలు చూస్తున్నాతిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఒక గూండా మాదిరి వ్యవహరించారుఇలాంటి ఎమ్మెల్యేని తిరువూరు ప్రజలు ఎన్నడూ చూడలేదుకూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారుటిడిపి నేతలను చట్టపరంగా శిక్షిస్తాంమాకు రక్షణ కల్పించమని కోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదువైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లను బలవంతంగా లాక్కెళ్లిపోయారుఅసలు ఈ రాష్ట్రం ఎటుపోతుందిరాజ్యాంగబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుచుకోవడం లేదురాబోయేది జగన్ మోహన్ రెడ్డి 2.0 పాలనేతప్పుచేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాంమాపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారి పై కేసు పెట్టి చట్టం ముందు నిలబెడతాంప్రశాంతమైన తిరువూరులో టీడీపీ గూండాలు విధ్వంసం స్పష్టించారు: దేవినేని అవినాష్‌టీడీపీ గూండాలు మాపై దాడి చేశారుకేశినేని చిన్నియే టీడీపీ గూండాలను మాపైకి పంపారుమా కారును ధ్వంసం చేశారు.. మమ్మల్ని హతమార్చాలని చూశారుటీడీపీ గూండాల దాడికి పోలీసులు సహకరించారుమాపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలి పెట్టంపోలీసులే రాజకీయం చేస్తున్నారుకౌన్సిలర్లకు వారి ఇంటి నుంచి భద్రత ఇస్తామని వితండవాదం చేశారుమా కౌన్సిలర్లకు మేమే రక్షణగా నిలిచాంటిడిపి ఎంపీ కేశినేని చిన్ని మందు పోయించి టిడిపి గూండాలను మా పైకి రెచ్చగొట్టారు మా కారును పైకి లేపి పల్టీలు కొట్టించి...ధ్వంసం చేయాలని చూశారుమా కారు ధ్వంసం చేసే వరకూ పోలీసులు చూస్తూ ఊరురున్నారు 👉వైఎస్సార్‌సీపీ నేతలు అరెస్ట్‌దేవినేని అవినాష్‌, అరుణ్‌కుమార్‌లు అరెస్ట్‌తిరువూరు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులురెడ్డిగూడెం స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు👉తిరువూరులో టీడీపీ గూండాల అరాచకంవైఎస్సార్‌సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడిదేవినేని అవినాష్‌, అరుణ్‌కుమార్‌ వాహనాలపై దాడివైఎస్సార్‌సీపీ నేతల కారు అద్దాలు పగలగొట్టిన టీడీపీ గూండాలుదారికాసి వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ గూండాలుఎ.కొండూరు మండలం రేపూడి క్రాస్‌ వద్ద టీడీపీ గూండాల విధ్వంసంసాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు బరి తెగించేశారు.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, వైఎస్సార్‌సీపీ నేతలను తిరువూరు వెళ్లకుండా చేసేందుకు కుట్రలకు తెరతీశారు. తిరువూరు వెళ్లే మార్గంలో రామచంద్రాపురం, చీమల పాడు వద్ద టీడీపీ.. భారీగా కార్యకర్తలను మోహరింపచేసింది. వైఎస్సార్‌సీపీ నేత స్వామిదాస్‌ ఇంటిని టీడీపీ గూండాలు ముట్టడించారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల కుటుంబసభ్యులపై టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగారు.వైఎస్సార్‌సీపీ నేతల్ని దారికాసి టీడీపీ గూండాలు అడ్డగించారు. అవినాష్‌, స్వామిదాస్‌ అరుణ్‌ వాహనాలను అడ్డగించారు. వాహనాలు కదలకుండా టీడీపీ గూండాలు చుట్టుముట్టారు. అవినాష్‌, స్వామిదాస్‌పై టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసింది. 13వ వార్డు కౌన్సిలర్‌ తండ్రితో టీడీపీ ఫిర్యాదు చేయించింది. ఓటమి భయంతో టీడీపీ గూండాలు దౌర్జన్యాలు చేస్తున్నారు. కాగా.. భద్రత కల్పించడంలో ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలను కూడా పోలీసులు లెక్కచేయడం లేదు. తిరువూరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల రక్షణ విషయంలో వితండవాదం చేస్తున్నారు.తిరువూరు వస్తేనే భద్రత కల్పిస్తామని పోలీసులు అంటున్నారు. నిన్న టీడీపీ గూండాల దాడితో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ఎన్నిక జరిగే వరుకు కౌన్సిల్‌ హాలు వరకు రక్షణ కల్పించాలని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కోరుతున్నారు. టీడీపీ గూండాల దాడులపై ఈసీకి వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.తిరువూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్‌ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి నేటికి (మంగళవారం) వాయిదా వేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement