Top Stories
ప్రధాన వార్తలు

మరోసారి కాల్పులు జరిపితే అంతు చూస్తాం..పాక్‌కు ఇండియన్ ఆర్మీ వార్నింగ్
ఢిల్లీ: ఉగ్రవాదం నిర్మూలనే లక్ష్యంతో తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌తో సుమారు 100మందికి పైగా ఉగ్రవాదుల్ని హత మార్చినట్లు త్రివిధ దళాల డీజీఎంవోలు (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉగ్రవాదం అంతానికి ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాంఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశాంఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లను ముందే గుర్తించాందాడికి ముందే ట్రైనింగ్ సెంటర్లను ఖాళీ చేశారుమురిద్కేలో ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను తొలిసారి నాశనం చేశాంఅజ్మల్ కసబ్,డేవిడ్ హెడ్లీ లాంటి వాళ్లు ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు9 ఉగ్రవాదుల క్యాంపులపై దాడి చేశాం100 మంది ఉగ్రవాదులు ఎయిర్ స్ట్రైక్‌లో హతమయ్యారుమేం ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత పీవోకే వద్ద పాక్ కాల్పులు జరిపిందిఉగ్రవాద శిబిరాలపై దాడి వీడియోలు, ఆ వీడియోల్ని విడుదల చేస్తున్నాంపాకిస్తాన్ మాత్రం ప్రార్ధనా స్థలాలు,స్కూళ్లను టార్గెట్ చేసింది.ఉగ్రవాదులు వారికి సంబంధించిన స్థలాలు మాత్రమే టార్గెట్ చేశాంలాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాం లాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాంఈనెల 8,9వ తేదీవరకు శ్రీనగర్ నుంచి నలియా వరకు డ్రోన్లతో దాడులు చేసిందిఈ నెల 7 నుంచి 10వ తేదీల మధ్యలో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మృతి చెందారు మరోసారి కాల్పులు జరిపితే పాక్‌ను వదిలిపెట్టంనిన్న మధ్యాహ్నం 3.15గంటలకు పాక్ డీజీఎంవో మాకు ఫోన్ చేశారుకాల్పుల విమరణకు అంగీకరించాలని పాక్ ప్రాధేయ పడిందివిరమణకు అంగీకరించాంకాల్పుల విరమణకు అంగీకరించామో లేదో.. కొన్ని గంటల్లోనే పాక్ కాల్పులకు విమరణకు పాల్పడిందికాల్పులు జరిపింనందుకు పాక్‌కు వార్నింగ్ మెసేజ్ పంపాంఒకవేళ ఈ రోజు రాత్రి కాల్పులు జరిపితే పాక్‌పై దాడి చేసేందుకు ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉందిమరోసారి కాల్పులు జరిపితే పాక్ అంతు చూస్తాంపాక్ కాల్పుల్లో చనిపోయిన సైనికులకు మా నివాళులుఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారుభారత సైనికుల త్యాగం వృధా కాదుఈ రోజు రాత్రి ఏం జరుగుతుంతో మానిటర్ చేస్తున్నాం

ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్
న్యూఢిల్లీ: -అగ్రరాజ్యం అమెరికా సాక్షిగా భారత్-పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ చర్చలకు ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీకి యూఎస్ఏ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్ చేసి మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలపై మోదీతో మాట్లాడారు జేడీ వాన్స్. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు జేడీ వాన్స్. అయితే పాక్ దాడి చేస్తే తాము దాడికి దిగుతామంటూ జేడీ వాన్స్‌కు మోదీ స్పష్టం చేశారు. తమ సంయమనం బలహీనత కాదని, దేశ భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని మోదీ పేర్కొన్నారు ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదని జేడీ వాన్స్‌కు తేల్చిచెప్పారు నరేంద్ర మోదీ. రేపు(సోమవారం) పాకిస్తాన్ తో కాల్పుల విరమణ అంశానికి సంబంధించి చర్చలు జరుగుతున్న సమయంలో జేడీ వాన్స్ ఫోన్ చేసి మాట్లాడటం చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ నేతృత్వంలో భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ అంశంపై చర్చలు జరుగునున్న తరుణంలో జేడీ వాన్స్ ముందగా పోన్ చేసి మోదీతో మాట్లాడారు. అయితే అంతకమునుపే కశ్మీర్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పీవోకే విషయంలో భారత్ రాజీపడే ప్రసక్తే ఉండదన్నారు. దీనికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని అమెరికాకు పరోక్షంగా చెప్పేశారు మోదీ. పీవోకే తమదేనని, ఇందులో ఎవరు జోక్యం అవసరం లేదన్నారు. పీవోకేను తమకు అప్పగించడం ఒక్కటే పాకిస్తాన్ కు ఉన్న ఆప్షన్ అని మోదీ తెగేసి చెప్పేశారు. కాగా, భారత్, పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి. పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్ కాదా?. అందుకు పహల్గామ్ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ సిద్ధంగానే ఉందనే సంకేతాలు పంపింది భారత ప్రభుత్వం.

పీవోకే విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు: మోదీ
ఢిల్లీ: పీవోకేపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో తమ వైఖరిని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుకునేది లేదని తేల్చి చెప్పారు.. పీవోకేను మాకు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదన్నారు మోదీ. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియ లేదని, పాక్ కాల్పులు జరిపితే భారత్ దాడులు చేయడం ఖాయమన్నారు.. ‘వాళ్లు (పాక్) ఒక్క తూటా పేలిస్తే.. మీరు క్షిపణితో దాడి చేయండి’ అంటూ త్రివిధ దళాలకు మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. రేపు పాకిస్తాన్‌తో చర్చల వేళ భారత్ వైఖరి ఏమిటో ప్రధాని మోదీ ఒక్కరోజు ముందుగానే ప్రపంచానికి తేల్చి చెప్పారు. పీవోకే విషయంలో అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసలు పీవోకే విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, దానిని పాక్ తమకు అప్పగించడం తప్పితే మరో మార్గం లేదని మోదీ వ్యాఖ్యానిండంతో ట్రంప్ దీనికి మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదనే విషయాన్ని మోదీ సూటిగా చెప్పేశారు.ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్,సీడీఎస్‌తో పాటు త్రివిధ దళాదిపతులు హాజరయ్యారు.ఈ సమావేశంలో ప్రధాని మోదీ పీవోకే విషయంలో ప్రపంచ దేశాలకు ఓ సందేశాన్ని పంపించారు. అదే సమయంలో పాక్‌కు గట్టిగా బదులివ్వాలని త్రివిధ దళాలకు ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది #WATCH | Delhi: Prime Minister Narendra Modi chairs a meeting at 7, LKM. Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar, NSA Ajit Doval, CDS, Chiefs of all three services present. pic.twitter.com/amcU1Cjmbu— ANI (@ANI) May 11, 2025కాగా, భారత్, పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి.పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్ కాదా?. అందుకు పహల్గామ్ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే కాల్పులు విరమణ అంగీకారం అన్న మూడు గంటల వ్యవధిలోనే పాక్ మళ్లీ దానిని ఉల్లంఘించి భారత్ పై కాల్పులకు దిగింది. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్తాన్ దుస్సాహసాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచకల్గింది. ఈ పరిస్థితుల నడుమ దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ సిద్ధంగానే ఉందనే సంకేతాలిచ్చింది భారత్.

పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
మాంగోచార్ తమకు స్వతంత్ర దేశం కావాలని ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్న బలూచ్ తిరుగుబాటు దారులు.. మరోసారి కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా గుర్తించాలంటూ డిమాండ్ చేశారు. అదే సమయంలో పాక్ ఉగ్రస్థావరాలపై దాడులకు దిగిన భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్‌పై భారత్ సైనిక చర్య తీసుకుంటే, పశ్చిమ సరిహద్దుల నుంచి పాక్‌పై తిరుగుబాటు చేస్తామన్నారు. భారత్‌కు సైనిక శక్తిగా నిలుస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్లో 40 శాతం భూభాగం తమదేనని, తమకు ప్రత్యేక దేశం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్‌కు నిద్ర పట్టకుండా చేస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదులు ఏరివేతే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టగా, అందుకు బలూచ్ తిరుగుబాటుదారులు సైతం మద్దతు తెలుపుతున్నారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?
భారతదేశంలో దాదాపు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న భారతీయ కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి అందరికి తెలుసు. కానీ ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారు కూడా అని కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.ముకేశ్ అంబానీకి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సుమారు 600 ఎకరాల మామిడి తోట ఉంది. ఇక్కడ 200 కంటే ఎక్కువ మామిడి పండ్ల రకాలు ఉన్నట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడితోట కావడం గమనార్హం. ఇందులో కేసర్, అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ మామిడి జాతులు.. ఫ్లోరిడాకు చెందిన టామీ అట్కిన్స్, కెంట్ & ఇజ్రాయెల్ దేశానికి చెందిన లిల్లీ, కీట్, మాయా వంటి అంతర్జాతీయ రకాలు ఉన్నట్లు సమాచారం.ముకేశ్ అంబానీ మామిడి తోటలో ప్రతి ఏటా 600 టన్నుల కంటే ఎక్కువ అధిక నాణ్యత కలిగిన మామిడి పళ్ళు ఉత్పత్తి అవుతాయి. వీటిని రిలయన్స్ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తూ.. ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారుగా రికార్డ్ సృష్టించింది.ఇదీ చదవండి: సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?మామిడి తోట పెట్టడానికి కారణం1997లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న చమురు శుద్ధి కర్మాగారం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని.. కాలుష్య నియంత్రణ మండలి తగిన చర్యలు తీసుకోవలసి వచ్చింది. అలాంటి సమయంలో అక్కడ మామిడి తోటను ఏర్పాటు చేయడం జరిగింది. అదే నేడు ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి తోటగా గుర్తింపు తెచ్చింది. ఈ మామిడి తోట ద్వారా ఏడాదికి రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం.

మోదీ జీ.. ఇలా చేస్తే మంచిది: రాహుల్ గాంధీ లేఖ
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి.పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్ కాదా?. అందుకు పహల్గామ్ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్ కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే కాల్పులు విరమణ అంగీకారం అన్న మూడు గంటల వ్యవధిలోనే పాక్ మళ్లీ దానిని ఉల్లంఘించి భారత్ పై కాల్పులకు దిగింది. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్తాన్ దుస్సాహసాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచకల్గింది. ఈ పరిస్థితుల నడుమ దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ సిద్ధంగానే ఉందనే సంకేతాలిచ్చింది భారత్.ఇదంతా ఒకటైతే, అసలు ఆపరేషన్ సిందూర్‌తో పాటు పలు అంశాల్ని పార్లమెంట్ లో చర్చించాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఏఐసీసీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ విన్నపాన్ని మోదీ జీ త్వరగా పరిశీలిస్తారని అనుకుంటున్నానని, ఇలా చేయడం మంచిదని రాహుల్ గాంధీ లేఖ ద్వారా తెలిపారు.ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయండిపాకిస్తాన్ తో యుద్ధంలో భాగంగా ఆపరేషన్ సిందూర్ తదితర అంశాలను పార్లమెంట్ వేదికగా చర్చించాలని కోరుతున్నారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు.‘ మోదీ జీ.. మీరు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ను నిర్వహించండి. ఈ ప్రత్యేక పార్లమెంట్ సెషన్ లో ఆపరేషన్ సిందూర్ అంశంతో పాటు కాల్పుల విరమణ అంశాన్ని కూడా చర్చిద్దాం. ఈ విషయాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఆ విషయాల గురించి చెప్పడం అత్యంత కీలకంగా భావిస్తున్నాను. కాల్పుల విరణమ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలి. ఈ విషయాలను చర్చించడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి. మన ముందున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడానికి ఇదొక సువర్ణావకాశం అవుతుంది. ఈ మా డిమాండ్ ను త్వరగా పరిశీలిస్తారని విశ్వసిస్తున్నాను’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే కూడా ఇదే విషయాన్ని మోదీకి లేఖ ద్వారా తెలిపినట్లు మరొక కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.LoP Lok Sabha and LoP Rajya Sabha have just written to the PM requesting for a special session of Parliament to be convened immediately. Here are the letters pic.twitter.com/exL6H5aAQy— Jairam Ramesh (@Jairam_Ramesh) May 11, 2025

‘ఇది చాలా బాధాకరం.. మనం ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా?’
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ల మధ్య కాల్పుల విరమణ అంగీకారాన్ని భారత విదేశాంగా కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించిన తర్వాత ఆయన ట్రోలింగ్ బారిన పడ్డారు. విక్రమ్ మిస్రీని ఆయన కుటుంబంపై కొంతమంది పనిగట్టుకుని విమర్శలకు దిగారు. దీన్ని ప్రధాన పార్టీలన్నీ ఖండించాయి. ప్రజాస్వామ్య యుత దేశంలో ఉన్న మనం ఈ రకంగా ఓ అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని, కీలక ఆపరేషన్ సంబంధించిన వివరాలను వెల్లడించిన క్రమంలో విక్రమ్ మిస్రీని విమర్శించడం తగదంటూ పలువురు నేతలు ఖండించారు.విక్రమ్ మిస్రీపై విమర్శల చేయడాన్నిభారత మాజీ విదేశాంగశాఖ మంత్రి, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తీవ్రంగా ఖండించారు. ‘ మిస్రీని టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు చేయడం చాలా బాధాకరం. విక్రమ్ మిస్రీతో పాటు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లది ఆపరేషన్ సిందూర్ లో ఓ కీలక పాత్ర. అత్యున్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు. ఇందులో ఆయన తప్పేముంది. నాగరిక సమాజంలో ఉన్న మనం ఇలా ఓ వ్యక్తిని ఎలా ట్రోల్ చేస్తాం. విక్రమ్ మిస్రీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఇది చాలా చాలా బాధాకరం. మనం ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా?, మన హక్కుల్ని కాపాడుకునే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. ఈ రకంగా ట్రోలింగ్ చేసి అధికారులపై మానసికంగా ఒత్తిడి కలిగేలా చేయడం సరైంది కాదు’ అంటూ సల్మాల్ ఖుర్షీద్ ధ్వజమెత్తారు.థాంక్స్ చెప్పడం రాకపోతే..నోరు మూసుకుని కూర్చోండిఅంతకుముందు మరొక కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ అనీస్ సోజ్ కూడా విక్రమ్ మిస్రీని కొంతమంది ట్రోల్ చేయడాన్ని తప్పుబట్టారు. కశ్మీర్ కు చెందిన విక్రమ్ మిస్రీ దేశ గౌరవాన్ని నిలబెట్టేలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆయన దేశానికి చేసిన సేవలకు మనం ఇచ్చే గౌరవం విమర్శలా?, చేసిన దానికి కృతజ్ఞత చెప్పే సంస్కృతి లేకపోతే నోరు మూసుకుని కూర్చోవడం మంచిది’ అంటూ హితవు పలికారు.Vikram Misri, a Kashmiri, has done India proud. No amount of trolling can diminish his service to the country. If you can't say thank you, learn to shut up.— Salman Anees Soz (@SalmanSoz) May 11, 2025 నిజాయితీ, కష్టపడే తత్వం కల్గిన వ్యక్తి విక్రమ్ మిస్రీనిజాయితీ, కష్టపడే తత్వం కల్గిన వ్యక్తి విక్రమ్ మిస్రీ అంటూ ఏఐఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఆ తరహా వ్యక్తిని ట్రోల్ చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని విమర్శలకునుద్దేశించి ట్వీట్ చేశారు. కార్యనిర్వహక వ్యవస్థలో సేవ చేసే వారిని గౌరవించడం నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. కార్యనిర్వహక వ్యవస్థలో ఉన్న వారిని విమర్శించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదన్నారు ఓవైసీ. Mr Vikram Misri is a decent and an Honest Hard working Diplomat working tirelessly for our Nation.Our Civil Servants work under the Executive this must be remembered & they shouldn’t be blamed for the decisions taken by The Executive /or any Political leadership running Watan E… https://t.co/yfM3ygfiyt— Asaduddin Owaisi (@asadowaisi) May 11, 2025

ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్.. ఫైనల్లో శ్రీలంక చిత్తు
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 97 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ తుది పోరులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్ సాధించింది.భారత బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. మంధాన క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించింది. మొత్తంగా 101 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించింది. ఆమెతో పాటు హర్లీన్ డియోల్(47), రోడ్రిగ్స్(44), హర్మన్ ప్రీత్ కౌర్(41) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లంక బౌలర్లలో మల్కీ మదార, విహంగా, కుమారి తలా వికెట్ సాధించారు.అమన్ అదుర్స్.. నాలుగేసిన రాణాఅనంతరం 343 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక అమ్మాయిల జట్టు భారత బౌలర్ల దాటికి 48.2 ఓవర్లలో 245 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చమీరా ఆతపట్టు(51), నీలాక్షి డి సిల్వా(48), విష్మి గుణరత్నే(36) రాణించారు. మిగితా బ్యాటర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టగా.. అమన్‌జోత్ కౌర్ మూడు వికెట్లు సాధించారు. కాగా భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా పాల్గొన్న ఈ టోర్నమెంట్లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన హర్మన్ సేన... 6 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలిచింది.

బ్రహ్మోస్ పనీతీరు ఎలా ఉంటుందో పాక్‌కు తెలుసు: సీఎం యోగి
లక్నో: భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రక్షణ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) యూపీ (Uttarpradesh)లోని లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి (BrahMos missile) తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ‘ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్’లో ఈ కేంద్రాన్ని నిర్మించారు. రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి పాల్గొన్నారు. ఈ యూనిట్‌కు 80 హెక్టార్ల భూమిని యూపీ సర్కార్ ఉచితంగా ఇచ్చింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇదే రోజున మన శాస్త్రవేత్తలు పోఖ్రాన్లో అణు పరీక్షలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. నేను లక్నో ఎందుకు రాలేదో మీ అందరికీ తెలుసు. ఇంత తక్కువ సమయంలో ఈ యూనిట్ సిద్ధం చేసిన వారికి అభినందనలు. 40 నెలల్లోనే ఈ ప్రొడక్షన్ యూనిట్‌ను పూర్తి చేశారు అని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబు ఇచ్చాం. కేవలం పాక్ సరిహద్దే కాదు, రావల్పిండిపైనా దాడి చేశాం. బ్రహ్మోస్ క్షిపణితో శత్రువుకు మన శక్తి తెలియజేశాం. ఆపరేషన్ సిందూర్‌తో ప్రజలను ఎక్కడా టార్గెట్ చేయలేదు. ఉగ్రవాదాన్ని సహించబోమని ఆపరేషన్ సిందూర్‌తో ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆలయాలు, గురుద్వారాలపై పాక్ సైన్యం దాడి చేస్తే.. మన సైన్యం ఆ దాడులను ధీటుగా తిప్పికొట్టింది. యూరి, పుల్వామా, పహల్గాం దాడుల తర్వాత ప్రతీసారి మన శక్తిని ప్రపంచానికి చూపించాం’ అని అన్నారు. #WATCH | Defence Minister Rajnath Singh says, "At the inauguration of BrahMos Integration & Testing Facility Center today, I feel delighted to speak with you. I wanted to attend in person. But you know why I couldn't come. Looking at the situation we are facing, it was important… pic.twitter.com/rlRSOXXfQZ— ANI (@ANI) May 11, 2025అంతకుముందు.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ సమయంలో మీరు బ్రహ్మోస్ క్షిపణిని ఒకసారి చూసి ఉంటారు. పాకిస్తాన్‌పై బ్రహ్మోస్‌ను ప్రయోగించాం. బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాకిస్తాన్‌ను అడగండి. బ్రహ్మోస్ పనితీరును ప్రపంచమంతా చూసింది. ఉగ్రదాడి ఏదైనా యుద్ధంగానే పరిగణించాలి. భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయనంత వరకు ఉగ్రవాద సమస్య పరిష్కారం కాదు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాలంటే, మనమందరం ప్రధాని మోదీ నాయకత్వంలో ఏకగ్రీవంగా పోరాడాలి. ఉగ్రవాదం ప్రేమ భాషను ఎప్పటికీ అంగీకరించదు. దానికి దాని స్వంత భాషలోనే సమాధానం చెప్పాలి. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారతదేశం మొత్తం ప్రపంచానికి సందేశం ఇచ్చింది’ అని అన్నారు.#WATCH | Lucknow | UP CM Yogi Adityanath says, "You must have seen a glimpse of the BrahMos missile during Operation Sindoor. If you didn't, then just ask the people of Pakistan about the power of the BrahMos missile. PM Narendra Modi has announced that any act of terrorism going… pic.twitter.com/lv2LzYNcXs— ANI (@ANI) May 11, 2025ఇక, ఇక్కడ.. ఏడాది నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులు తయారుచేసేలా ఈ ప్రొడక్షన్ యూనిట్‌ను డిజైన్ చేశారు. రూ.300 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. భారత్, రష్యాల సంయుక్త వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్ క్షిపణి 290 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. ఈ క్షిపణిని ఫైర్ అండ్ ఫర్గెట్ గైడెన్స్ సిస్టమ్‌తో భూ ఉపరితలం నుంచి, సముద్ర తలం నుంచి, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. కొత్తగా ప్రారంభమవుతున్న ఈ క్షిపణి తయారీ కేంద్రం నుంచి 100 నుంచి 150 కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయనున్నారు. ఈ కొత్త తరం బ్రహ్మోస్ క్షిపణులు ఏడాదిలోగా డెలివరీకి సిద్ధం కానున్నాయి. ఈ న్యూజనరేషన్ బ్రహ్మోస్ క్షిపణి పరిధి 300 కిలోమీటర్లు. దీని బరువును తగ్గించారు. ప్రస్తుత బ్రహ్మోస్ క్షిపణి బరువు 2900 కిలోలు కాగా, న్యూ బ్రహ్మోస్ క్షిపణి బరువు 1290 కిలోలు. ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ఇది ప్రయాణించగలదు.

మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో సుమంత్ (Sumanth) పెళ్లి.. కొద్దిరోజులుగా వస్తున్న ఈ వార్తలపై తాజాగా సుమంత్ రియాక్ట్ అయ్యాడు. ఆయన నటించిన కొత్త సినిమా ‘అనగనగా’ (Anaganaga) ఓటీటీలో డైరెక్టగా మే 15న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మృణాల్ ఠాకూర్, సుమంత్ కలిసి దిగిన ఫోటో వెనుక ఉన్న అసలు విషయం చెప్పాడు.అక్కినేని కుటుంబంలో మరో పెళ్లి బాజా మోగబోతోందని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను సుమంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాటిపై ఇద్దరూ మౌనంగా ఉండటంతో నెటిజన్లలో అనుమానాలు మరింత పెరిగాయి. అయితే, ఎట్టకేలకు హీరో సుమంత్ క్లారిటీ ఇచ్చేశాడు. మృణాల్తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని కుండ బద్దలు కొట్టేశాడు. ఒక సినిమా సమయంలో తీసుకున్న ఫోటో కొద్దిరోజులుగా వైరల్ అవుతుందంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తనను ఎక్కడా కూడా కలిసింది లేదన్నాడు. 'సీతా రామం' సినిమాలో మృణాల్ ఠాకూర్, సుమంత్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ టైమ్‌లోనే వారిద్దరిలో స్నేహం మొదలైంది.పెళ్లి గురించి క్లారిటీపెళ్లి మీద తనకు ఎలాంటి ఆసక్తి లేదని సుమంత్ చెప్పాడు. ఇలా సింగిల్‌గా ఉండడమే లైఫ్ బాగుందని తెలిపాడు. ఈ క్రమంలో తానెప్పుడు ఒంటరితనాన్ని ఫీలవ్వలేదని క్లారిటీ ఇచ్చేశాడు. జీవితంలో ఒక తోడు కావాలని కూడా ఎప్పుడూ అనిపించలేదని చెప్పుకొచ్చాడు. అసలు లైఫ్‌లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదని సుమంత్ హింట్ ఇచ్చేశాడు. సుమంత్‌కు గతంలో పెళ్లి అయి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయం నుంచి ఆయన సింగిల్‌గానే ఉంటున్నాడు.
ఐపీఎల్-2025 ఫైనల్ వేదిక, తేదీ మార్పు?
నాన్న మరణించిన రోజు.. నవ్వుతూ ఫోటోలు దిగా: సమంత
రూ. 51వేలతో బుకింగ్: లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కారు
మదర్స్ డే స్పెషల్.. 'అమ్మ'తో టాలీవుడ్ హీరోయిన్లు
పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
స్టార్ జంటపై విడాకుల రూమర్స్.. తన భర్తపై పూర్తిగా నమ్మకముందన్న భార్య!
మరోసారి కాల్పులు జరిపితే అంతు చూస్తాం..పాక్‌కు ఇండియన్ ఆర్మీ వార్నింగ్
ఎల్లుండి కళ్ళితండాకు వైఎస్ జగన్
నేనేం RRR లాంటి సినిమా తీయట్లేదుగా..: లోకేశ్ కనగరాజ్
అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
మరో జెట్ విమానాన్ని కోల్పోయిన అమెరికా
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
ఆపరేషన్ సిందూర్
తమిళ సినీ నిర్మాత కూతురి పెళ్లిలో ప్రముఖులు (ఫోటోలు)
రీరిలీజ్‌లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
సార్! మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు! నేనూ వచ్చేదా!!
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
ఐపీఎల్ వాయిదా?
ఐపీఎల్-2025 ఫైనల్ వేదిక, తేదీ మార్పు?
నాన్న మరణించిన రోజు.. నవ్వుతూ ఫోటోలు దిగా: సమంత
రూ. 51వేలతో బుకింగ్: లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కారు
మదర్స్ డే స్పెషల్.. 'అమ్మ'తో టాలీవుడ్ హీరోయిన్లు
పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
స్టార్ జంటపై విడాకుల రూమర్స్.. తన భర్తపై పూర్తిగా నమ్మకముందన్న భార్య!
మరోసారి కాల్పులు జరిపితే అంతు చూస్తాం..పాక్‌కు ఇండియన్ ఆర్మీ వార్నింగ్
ఎల్లుండి కళ్ళితండాకు వైఎస్ జగన్
నేనేం RRR లాంటి సినిమా తీయట్లేదుగా..: లోకేశ్ కనగరాజ్
అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?
138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో
మరో జెట్ విమానాన్ని కోల్పోయిన అమెరికా
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
ఆపరేషన్ సిందూర్
రీరిలీజ్‌లో ‘జగదేక వీరుడు..’ వసూళ్ల సునామీ.. ఎంతంటే?
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’!
సార్! మన సైన్యం అంతా బార్డర్ నుంచి వచ్చి టెర్రరిస్టుల అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు! నేనూ వచ్చేదా!!
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్
ఈ రాశి వారికి ఆస్తి లాభం.. ఉద్యోగులకు కొత్త హోదాలు
విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!
కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
ఐపీఎల్ వాయిదా?
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
సినిమా

విజయ్ సేతుపతి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్!
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏస్'. ఈ సినిమాకు అరుముగకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సెవెన్ సీస్ ఎంటర్టైనర్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హీరో శివకార్తికేయన్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు.ఏస్ ట్రైలర్ చూస్తే మలేషియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సీన్స్ చూస్తే జూదం, స్మగ్లింగ్, దోపిడీ నేపథ్యంలో కథను రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో బోల్డ్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి అభిమానులను అలరించనున్నారు. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్లో విజయ్ సేతుపతి యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, బి.ఎస్. అవినాష్, ముత్తు కుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 23న థియేటర్లలో సందడి చేయనుంది.

పాకిస్తాన్‌కు చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకూడదు: హీరో నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం 'హిట్: ది థర్డ్ కేస్'. హిట్ సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మే 1వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియా- పాకిస్తాన్ యుద్ధం గురించి ఆయన మాట్లాడారు.హీరో నాని మాట్లాడుతూ..'ప్రస్తుతం పాక్‌తో యుద్ధం వల్ల పరిస్థితి సెన్సిటివ్‌గా ఉంది కదా మా టీమ్‌తో మాట్లాడా. అవతలి వాళ్లు మనకు ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు. దానికి మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా తిరిగి ఇచ్చేసింది. అంటే వాళ్ల వల్ల మనదేశంలో ఒక సినిమా ఈవెంట్ కూడా రద్దు అయిందన్న సంతోషం కూడా పాకిస్తాన్‌కు ఇవ్వకూడదు. అందుకే ఈరోజు సక్సెస్ మీట్ ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. దేశ సరిహద్దుల్లో ఉండి మనల్ని కాపాడుతున్నా ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్‌కు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు' అని తెలిపారు.అనంతరం సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ.. 'ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని పెద్ద మాస్ కమర్షియల్ సినిమాలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ప్రేక్షకుల స్పందన చూస్తే అద్భుతంగా అనిపించింది. మాకు ఇంతటి విజయాన్నిచ్చిన వారికి ధన్యవాదాలు’’ అని నాని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రోడక్షన్స్, వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు

ఆ హీరోయిన్ తో అస్సలు నటించను: టాలీవుడ్ హీరో
తెలుగు సినిమాలతో నటుడిగా మారిన హర్షవర్దన్ రాణే.. ఇక్కడ సరైన పాత్రలు, గుర్తింపు రాకపోయేసరికి బాలీవుడ్ కి వెళ్లిపోయాడు. అక్కడ హీరోగా పలు చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. అందులో ఒకటి 'సనమ్ తేరీ కసమ్'. ఈ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్ గా రీ రిలీజ్ చేస్తే అద్భుతమైన వసూళ్లు దక్కించుకుంది. దీంతో చిత్రనిర్మాతలు సీక్వెల్ ని ప్రకటించారు. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడింది.(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) నిన్నటివరకు భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మన దేశం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్ లోని పలు ఉగ్రస్థావరాల్ని మట్టుబెట్టింది. ఈ క్రమంలో పలువురు పాక్ నటీనటులు.. ఆపరేషన్ సిందూర్ పై నోటికొచ్చిన కామెంట్స్ చేశారు. వాళ్లలో నటి మావ్రా హోకెన్ ఒకరు. ఈమెనే గతంలో 'సనమ్ తేరీ కసమ్'లో హీరోయిన్ గా నటించింది.తాజాగా ఈమె.. 'ఆపరేషన్ సిందూర్'పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన హర్షవర్ధన్, సీక్వెల్ లో ఈమెతో నటించేది లేదని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.'ప్రస్తుత పరిస్థితులని నేను గౌరవిస్తున్నాను. నా దేశాన్ని ఉద్దేశించి కొందరు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నేనొక నిర్ణయానికి వచ్చాను. గతంలో నటించిన వాళ్లే ఇప్పుడు 'సనమ్ తేరీ కసమ్ 2'లోనూ నటిస్తానంటే.. నేను అందులో నటించాలని అనుకోవట్లేదు' అని హర్షవర్ధన్ చెప్పుకొచ్చాడు.అలానే మావ్రా హోకెన్ పోస్ట్ ని కూడా షేర్ చేసిన హర్షవర్ధన్.. ఏ దేశానికి చెందిన నటీనటుల్ని అయినా నేను గౌరవిస్తాను. కానీ నా దేశం గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు అని స్పందించాడు. ఇప్పుడు ఇది కాస్త హాట్ టాపిక్ అయింది.(ఇదీ చదవండి: రూ.60 కోట్ల దావా.. ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ జోక్యం)

రూ.60 కోట్ల దావా.. ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ జోక్యం
ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లలో రిలీజైన చాలా సినిమాలు.. తక్కువ రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. కానీ రీసెంట్ గా 'భోల్ చుక్ మాఫ్' అనే హిందీ చిత్రం మాత్రం విడుదలకు మరోరోజు ఉందనగా.. ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుకెక్కింది.లెక్క ప్రకారం 'భోల్ చుక్ మాఫ్' సినిమా మే 09న థియేటర్లలో రిలీజ్ అవ్వాలి. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేశారు. థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. చాలామంది టికెట్స్ కూడా కొనుకున్నారు. కానీ రిలీజ్ కి ఒకరోజు ముందు నిర్మాతలు అందరికీ షాకిచ్చారు. మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఒక్క ఫ్రేమ్ లో 19 మంది తెలుగు యంగ్ డైరెక్టర్స్.. ఏంటి విశేషం?) దీంతో ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్.. బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. ఈ సినిమా కోసం తాము చాలా ఖర్చు చేశామని, ఇప్పుడు ఇలా ఓటీటీలో రిలీజ్ చేయడం సరికాదని రూ.60 కోట్ల దావా వేసింది. కట్ చేస్తే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ స్టే ఇచ్చింది. అంటే తదుపరి ఆర్డర్ వచ్చేంతవరకు మూవీని ఎక్కడా విడుదల చేయడానికి వీల్లేదనమాట. రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలో భారత క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ ఐటమ్ సాంగ్ చేయడం విశేషం. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ వ్యవహారంలో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ)
న్యూస్ పాడ్‌కాస్ట్

కాల్పుల విరమణకు అంగీకారం.. కొద్దిసేపట్లోనే మళ్లీ కాల్పులు... పాకిస్తాన్ దుర్మార్గ వైఖరిపై భారత్ ఆగ్రహం

రెండో రోజు కూడా రెచ్చిపోయిన పాకిస్తాన్... 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి... పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం... సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ సైన్యం.. దీటుగా తిప్పికొడుతున్న భారత సేనలు... మూడు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత, ఇద్దరు పైలట్ల పట్టివేత

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం
క్రీడలు

IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా జితేష్ శర్మ..?
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్-2025ను బీసీసీఐ వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే పరిస్థితులు కాస్త చల్లారడంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. మే 15 నుంచి ఐపీఎల్ రీ స్టార్ట్ కానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు) మ్యాచ్‌లు నిర్వహించి, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మే 25న ఈ ఏడాది సీజన్‌కు ముగింపు పలకాలని బీసీసీఐ యోచిస్తోంది.ఆర్సీబీ కెప్టెన్‌గా జితేష్ శర్మ..ఇక ఇది ఇలా ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ గాయం కారణంగా కనీసం ఒక మ్యాచ్‌కైనా దూరమయ్యే అవకాశముంది. మే 3న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పాటిదార్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడికి రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో అతడు కనీసం రెండు మ్యాచ్‌లకైనా దూరమవుతాడని అంతా భావించారు.కానీ ఐపీఎల్-2025లో మధ్యలోనే ఆగిపోవడంతో ఆర్సీబీకి కలిసొచ్చింది. అతడు చేతి వేలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఒకవేళ ఐపీఎల్-2025 మే 15 నుంచి తిరిగి ప్రారంభమైతే.. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు పాటిదార్ కానున్నాడు. పాటిదార్ గైర్హజరీలో వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ ఆర్సీబీ జట్టును నడిపించనున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని జితేష్ శర్మ ధ్రువీకరించాడు."లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు పాటిదార్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో కెప్టెన్‌గా నాకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. ఇది నాకు, నా కుటుంబానికి చాలా గొప్ప విషయం. దేవదత్ పడిక్కల్, రజిత్ పాటిదార్ ఇద్దరూ అందుబాటులో లేనందున, వారిస్ధానాలను ఎవరితో భర్తీ చేయాలని నేను ఆలోచిస్తున్నాను. నాకు నిజంగా ఇది చాలా పెద్ద బాధ్యత" అని ఐపీఎల్ సస్పెన్షన్‌కు ముందు జితేష్ శర్మ ఆర్సీబీ బోల్డ్ డైరీస్‌లో పేర్కొన్నాడు. ఒకవేళ మే 15న ఐపీఎల్ తిరిగి ప్రారంభం కాకపోతే కెప్టెన్సీ అవకాశాన్ని జితేష్ కోల్పోయే ఛాన్స్ ఉంది.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మ స్థానంలో యువ సంచలనం..? ఇక భారత్‌కు తిరుగులేదు?

రోహిత్ శర్మ స్థానంలో యువ సంచలనం..? ఇక భారత్‌కు తిరుగులేదు?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకివ్వగా.. హిట్‌మ్యాన్ బాటలోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి నడుస్తున్నట్లు తెలుస్తోంది. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని కోహ్లి నిర్ణయించుకున్నట్లు సమాచారం.విరాట్ తన నిర్ణయాన్ని ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే ఇంగ్లండ్ సిరీస్ వరకు అయినా కొనసాగాలని కోహ్లిని ఒప్పించేందుకు బీసీసీఐ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. కోహ్లి టెస్టుల్లో కొనసాగుతాడా లేదా రోహిత్ బాటలోనే నడుస్తాడా? అన్నది మే 23న తేలిపోనుంది. ఆ రోజున ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టుతో పాటు కొత్త కెప్టెన్‌ను కూడా బీసీసీఐ ప్రకటించనుంది. కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపిక దాదాపు ఖాయం కాగా.. ప్లేయర్‌గా రోహిత్ శర్మ స్దానాన్నిమాత్రం తమిళనాడు యువ సంచలనం సాయిసుదర్శన్‌తో భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. సాయిసుదర్శన్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న సుదర్శన్ పరుగులు వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీలతో 509 పరుగులు చేశాడు. అతడి ఆటను చూసి మాజీలు ఫిదా అయిపోయారు. రవిశాస్రి వంటి దిగ్గజ క్రికెటర్లు సుదర్శన్‌ను ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లను సూచించారు.దీంతో భారత తరపున వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన సుదర్శన్.. ఇప్పుడు టెస్టుల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. సుదర్శన్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. రంజీ ట్రోఫీ సీజన్లలో తమిళనాడు తరపున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 7 సెంచరీలతో 1957 పరుగులు చేశాడు. సుదర్శన్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 213గా ఉంది. భారత్ తరుపున ఆడిన 3 వన్డేలలో 2 అర్ధ సెంచరీలతో 127 పరుగులు చేశాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా అతడికి ఉంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ స్థాన్నాన్ని సుదర్శన్‌తో భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్ 20 నుంచి భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కానుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్..!

IPL 2025: ఆటగాళ్లను రప్పించండి.. ఫ్రాంఛైజీలకు బీసీసీఐ ఆదేశాలు?
ఐపీఎల్-2025 టోర్నీని వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భావిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలనిఫ్రాంఛైజీలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.అదే విధంగా.. విదేశీ ఆటగాళ్లను కూడా వీలైంత త్వరగా భారత్‌కు రప్పించాలని ఆదేశించినట్లు సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మే 25న ఫైనల్ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబుల్ హెడర్ మ్యాచ్లుఇందులో భాగంగా డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు) మ్యాచ్‌లు నిర్వహించాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్ తాజా ఎడిషన్ 57 మ్యాచ్‌లు పూర్తైన తర్వాత వాయిదా పడిన విషయం తెలిసిందే.పహల్గామ్ ఉగ్రదాడికి.. భారత్ ఆపరేషన్ సిందూర్‌తో గట్టిగా బదులిస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్- పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రవాదులను లక్ష్యం చేసుకుని భారత్ దాడులు చేస్తే.. పాకిస్తాన్ మాత్రం సామాన్యులు, భారత సైనిక స్థావరాలపై దాడులకు తెగబడింది. అయితే, భారత సైన్యం వీటిని సమ ర్థవంతంగా తిప్పికొట్టింది.అర్ధంతరంగా ముగిసిపోయిందిఈ క్రమంలో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయింది. శత్రువును దారి మళ్లించే క్రమంలో ధర్మశాలలో బ్లాకవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) విధించడంతో ఆట మధ్యలోనే స్టేడియాన్ని ఖాళీ చేయించారు.ఈ నేపథ్యంలో తాజా ఐపీఎల్ సీజన్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. అయితే, శనివారం భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, దాయాది మరోసారి తన వంకర బుద్ధిని చూపి.. దాడులకు తెగబడింది. తెల్లవారిన తర్వాత మాత్రం పరిస్థితులు కాస్త సద్దుమణినట్లు తెలుస్తోంది.ఆ జట్టుకు మాత్రం తటస్థ వేదికఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం భేటీ అయిన బీసీసీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘మంగళవారం నాటికి అన్ని ఫ్రాంఛైజీలు తమ మ్యాచ్‌లు జరిగే వేదికలకు ఆటగాళ్లను చేర్చాలని బోర్డు ఆదేశించింది.పంజాబ్ జట్టుకు మాత్రం తటస్థ వేదిక ఉంటుంది. కాబట్టి ఇంకా వారి గమ్యస్థానాన్ని నిర్దేశించలేదు. త్వరితగతిన టోర్నీని పూర్తి చేసేందుకు డబుల్ హెడర్ మ్యాచ్‌లు నిర్వహించాలని బోర్డు భావిస్తోంది’’ అని తెలిపాయి.కాగా ఐపీఎల్-2025 ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టాప్-4లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతేభారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘‘మిగిలిన మ్యాచ్‌లను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాం. వేదికలు, తేదీలు కొత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది.స్టేక్హోల్డర్లు, జట్ల యజమానులు, ప్రసారకర్తలు.. ఇలా లీగ్‌లో భాగమైన ప్రతి ఒక్కరితో చర్చలు జరపాలి, ముఖ్యంగా ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు.చదవండి: BCCI: ప్లీజ్ కింగ్!.. కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు!

IND vs SL: ఫైనల్లో శతకంతో చెలరేగిన స్మృతి.. సరికొత్త చరిత్ర
శ్రీలంకతో ఫైనల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) సంచలన శతకంతో మెరిసింది. కేవలం 92 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. తన కెరీర్లో పదకొండవ వన్డే సెంచరీ నమోదు చేసింది.శ్రీలంక- భారత్- సౌతాఫ్రికా మధ్యతద్వారా మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. కాగా శ్రీలంక- భారత్- సౌతాఫ్రికా మహిళా జట్ల మధ్య త్రైపాక్షిక వన్డే సిరీస్‌కు లంక ఆతిథ్యమిస్తోంది. ఏప్రిల్ 27న శ్రీలంక- భారత్ మధ్య మ్యాచ్‌తో మొదలైన ఈ సిరీస్‌లో .. హర్మన్ సేన వరుస విజయాలు సాధించింది.తొలుత ఆతిథ్య లంకను, తర్వాత సౌతాఫ్రికాను ఓడించింది. మరుసటి మ్యాచ్‌లో లంక చేతిలో ఓడిన భారత జట్టు.. తర్వాత సౌతాఫ్రికాపై విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. మరోవైపు రెండు విజయాలతో శ్రీలంక కూడా తుదిపోరుకు అర్హత సాధించింది.101 బంతులు ఎదుర్కొనిఈ క్రమంలో ఇరుజట్ల (IND vs SL) మధ్య కొలంబో వేదికగా ఆదివారం (మే 11) ఫైనల్లో టాస్ గెలిచిన భారత్.. లంకను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ప్రతికా రావల్ (30), స్మృతి మంధాన శుభారంభం అందించారు. ప్రతికా కాసేపటికే పెవిలియన్ చేరినా.. స్మృతి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది.మొత్తంగా 101 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించింది. లంక కెప్టెన్ చమరి ఆటపట్టు బౌలింగ్‌లో వరుసగా నాలుగు బౌండరీలు బాది సెంచరీ మార్కును అందుకుని.. చక్కటి షాట్లతో అలరించింది.సరికొత్త చరిత్రఈ క్రమంలో స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా అవతరించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (52 సిక్సర్లు) వెనక్కి నెట్టి.. మొత్తంగా 54 సిక్సర్లతో ఈ ఫీట్ నమోదు చేసింది.అదే విధంగా.. మహిళల వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్ల జాబితాలో మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా- 15), సుజీ బేట్స్ (న్యూజిలాండ్- 13) తర్వాతి స్థానాల్లో నిలిచింది. ఇక మొత్తంగా ఇప్పటికి 102 వన్డేలు పూర్తి చేసుకున్న స్మృతి మంధాన ఖాతాలో 4473 పరుగులు ఉన్నాయి.ఫైనల్ క్వీన్సిరీస్ ఏదైనా ఫైనల్ అంటే ఆటగాళ్లపై సహజంగానే ఒత్తిడి ఒకింత ఎక్కువవుతుంది. అయితే, మంధాన మాత్రం ఒత్తిడిలోనే తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంది. గత ఐదు ఫైనల్స్‌లో ఆమె ఆట తీరే ఇందుకు నిదర్శనం. ఒక్కసారి డకౌట్ కావడం మినహా మిగతా నాలుగు సందర్బాల్లో స్మృతి నమోదు చేసిన గణాంకాలు 51 నాటౌట్, 46, 60, 116.ఇక ఏదేని ఫైనల్లో ఇంత వరకు సెంచరీ బాదిన భారత ఏకైక మహిళా క్రికెటర్‌గా కొనసాగుతున్న మాజీ బ్యాటర్ మిథాలీ రాజ్ రికార్డును స్మృతి.. తాజాగా సమం చేసింది.భారత్ తరఫున గత ఐదు ఫైనల్స్‌లో స్మృతి మంధాన గణాంకాలు👉శ్రీలంక మీద- ట్రై సిరీస్ ఫైనల్లో 101 బంతుల్లో 116, మే, 2025👉శ్రీలంక మీద- ఆసియా కప్ ఫైనల్లో 47 బంతుల్లో 60, జూలై 2024👉శ్రీలంక మీద- ఆసియా క్రీడల ఫైనల్లో 45 బంతుల్లో 46, సెప్టెంబరు 2023👉సౌతాఫ్రికాతో- ట్రై సిరీస్ ఫైనల్లో 0, ఫిబ్రవరి 2023👉శ్రీలంక మీద- ఆసియా కప్ ఫైనల్లో 25 బంతుల్లో 51, అక్టోబరు 2022.ఇక తాజాగా శ్రీలంక- సౌతాఫ్రికాలతో త్రైపాక్షిక సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లలో కలిపి స్మృతి మంధాన 264 పరుగులు సాధించింది. లంకతో ఫైనల్లో డెమీ విహంగ బౌలింగ్‌లో హర్షిత మాదవికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది.చదవండి: BCCI: ప్లీజ్ కింగ్!.. కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు!
బిజినెస్

వీకెండ్ ఇల్లు.. రూ.10 కోట్లయినా పర్లేదు..!
సాక్షి, సిటీబ్యూరో: వీకెండ్ వస్తే చాలు పబ్కో.. సినిమాలు, షికార్లకో వెళ్లే నగరవాసులు.. క్రమంగా ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే ఈ ఇళ్లు కాస్త ప్రత్యేకమైనవండోయ్! కాలుష్యం, రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రశాంతమైన పచ్చని వాతావరణంలో ఉంటే వీకెండ్ లేదా హాలిడే హోమ్స్‌కు పరుగులు పెడుతున్నారు. ఎంచక్కా కుటుంబంతో కలిసి వారాంతాన్ని అక్కడే గడిపేస్తున్నారు. కరోనాతో వీకెండ్ హోమ్స్‌కు ఆదరణ పెరిగింది.పెట్టుబడులు పెరిగాయి.. 29 శాతం మంది హెచ్ఎన్ఐలు హాలిడే హోమ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. లగ్జరీ హాలిడే హోమ్‌కు రూ.5–10 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాలని 71 శాతం మంది భావిస్తున్నారని లగ్జరీ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ఇండియా సోథెబీ ఇంటర్నేషనల్ రియల్టీ ఒక నివేదిక విడుదల చేసింది. 29 శాతం మంది రూ.10 కోట్ల పైన ధర ఉన్నా పర్వాలేదని చెప్పారు. లగ్జరీ అపార్ట్మెంట్ లేదా విల్లా అయితే రూ.10–25 కోట్ల వరకు పెట్టుబడికి సుముఖంగా ఉన్నట్లు 69 శాతం మంది చెప్పారు. 21 శాతం మంది రూ.5–10 కోట్ల బడ్జెట్లో, మిగిలిన 10 శాతం మంది రూ.25 కోట్లకు పైగా బడ్జెట్లో ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నారు.వచ్చే రెండేళ్లలో రెట్టింపు.. 200 హెచ్ఎన్ఐల అభిప్రాయాల ఆధారంగా దేశంలోని 8 ప్రధాన పట్టణాల్లో(హైదరాబాద్ సహా) రియల్ ఎస్టేట్ ధోరణులపై ఈ సంస్థ నివేదిక రూపొందించింది. సంపన్నుల్లో రియల్ ఎస్టేట్ పట్ల ధోరణి మారిందనడానికి ఈ ఫలితాలే నిదర్శమని పేర్కొంది. వచ్చే రెండేళ్లలో కొనుగోళ్లకు సముఖంగా ఉన్నామని చెప్పిన 75 శాతం మంది ప్రాధాన్యతలు గమనిస్తే.. 89 శాతం మంది ఖరీదైన ఇళ్లు(సిటీ అపార్ట్మెంట్లు, బంగళాలు, హాలిడే హోమ్స్)పట్ల ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది ఖరీదైన వాణిజ్య ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్నారు.ముఖ్యంగా గడిచిన 18 నెలల్లో ఇల్లు కొనుగోలు చేసినట్లు 26% మంది చెప్పారు. వారి జీవనశైలిని మెరుగుపరుచుకోవడం, మంచి పెట్టుబడులను సొంతం చేసుకునే ఆలోచనతోనే వారు కొన్నారు. రెండు మూడేళ్లలో హెచ్ఎన్ఐలు, అల్ట్రా హెచ్ఎన్ఐలు ఖరీదైన ఇళ్లను సొంత వినియోగానికే కొనుగోలు చేశారు. మంచి పెట్టుబడి అవకాశం కోసం కొనుగోలు చేయడం అంటే అది బుల్లిష్ ధోరణికి సంకేతమని ఓ సంస్థ తెలిపింది.

స్విగ్గీకి ‘క్విక్’గా వచ్చిన నష్టాలు.. 3 నెలల్లో డబుల్!
ఫుడ్ డెలివరీ, క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టం రెట్టింపై రూ. 1,081 కోట్లను తాకింది. క్విక్కామర్స్పై భారీ పెట్టుబడులు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 555 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,046 కోట్ల నుంచి రూ. 4,410 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు మరింత అధికంగా రూ. 3,668 కోట్ల నుంచి రూ. 5,610 కోట్లకు పెరిగాయి. ఫుడ్ డెలివరీ విభాగంలో స్థూల ఆర్డర్ విలువ 18 శాతం అధికమై రూ. 7,347 కోట్లకు చేరినట్లు స్విగ్గీ వెల్లడించింది. నిర్వహణ లాభం(ఇబిటా) ఐదు రెట్లు ఎగసి రూ. 212 కోట్లను తాకింది. స్విగ్గీ స్మార్ట్ సగటు ఆర్డర్ విలువ 13 శాతం మెరుగుపడి రూ. 527కు చేరగా.. 316 డార్క్ స్టోర్లను జత కలుపుకుంది.కాగా స్విగ్గీ ప్రధాన పోటీదారు ఈ మధ్యనే ఎటర్నల్‌గా పేరు మార్చుకున్న జొమాటో నికర లాభాలు కూడా భారీగా పడిపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో సంస్థ నికర లాభాలు 78 శాతం పతనమై రూ39 కోట్లతో సరిపెట్టుకుంది. సంస్థ రెవెన్యూ 64 శాతం పెరిగి రూ.5,833 కోట్లుగా చోటు చేసుకుంది. కంపెనీ వ్యయాలు 68 శాతం పెరిగి రూ.6,104 కోట్లకు చేరడంతో లాభాల్లో తగ్గుదల చోటు చేసుకున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది.

అడుగేస్తే ఆఫీస్..! ఇలాంటి ఇళ్లకే డిమాండ్
కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. కోవిడ్‌తో వర్క్ ఫ్రం హోమ్ అలవాటైన ఉద్యోగస్తులు తిరిగి కార్యాలయానికి వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. గంటల కొద్దీ ప్రయాణం చేస్తూ.. కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులతో ఆఫీసుకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లకు డెవలపర్లు శ్రీకారం చుట్టారు. ఆఫీసులకు చేరువలోనే గృహాలతో పాటు స్కూల్, ఆస్పత్రి, షాపింగ్ మాల్, పార్కు వంటి అన్ని రకాల వాణిజ్య ఏర్పాట్లు ఉండటం వీటి ప్రత్యేకత. దీంతో ఈ తరహా ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. - సాక్షి, సిటీబ్యూరోపనిచేసే కార్యాలయానికి చేరుకోవడానికి అత్యధిక శాతం మంది తక్కువలో తక్కువ గంటసేపు బస్సుల్లోనో లేదా ఇతరత్రా వ్యక్తిగత వాహనాల్లోనో గడిపేస్తున్నారు. దీంతో విలువైన సమయం వృథా అవుతోంది. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. అయితే ఈ వాక్ టు వర్క్ ప్రాజెక్ట్స్‌లో ఇల్లు, ఆఫీసు, మాల్, పార్కులు, స్కూల్, ఆస్పత్రి.. ఇలా సమస్త అవసరాలూ ఒకే చోట ఉంటాయి.ఈ ప్రాజెక్ట్‌లతో వేగంగా అభివృద్ధి నడిచి వెళ్లేందుకు అనువైన దూరంలో కార్యాలయం, షాపింగ్ మాల్స్ ఉండాలని కోరుకునే వారి సంఖ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతోంది. ‘ఈ మధ్యకాలంలో మా వద్దకు వచ్చే ఐటీ నిపుణులు చాలా మంది ఇలాంటి ఫ్లాట్లే కావాలని అడుగుతున్నారు. అయితే ఈ వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌ల్లో కేవలం అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉంటే సరిపోదు. ఆ ప్రాంతం కూడా అభివృద్ధికి చిరునామాగా నిలవాలి. అందుకే ఐటీ, బీపీఓ వంటి వాటితో గచి్చ»ౌలి, మాదాపూర్లు ఎలా అయితే వృద్ధి చెందాయో అంతకు రెట్టింపు అభివృద్ధి జరుగుతుంది.నగరం నలువైపులా.. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వాక్ టు వర్క్ ప్రాజెక్టులు ఇప్పుడు నగరం చుట్టూ విస్తరిస్తున్నాయి. ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లకు మరింత ఊపొచి్చంది. ఆదిభట్ల, ఉప్పల్, పోచారం, మహేశ్వరం వంటి శివారు ప్రాంతాల్లోనూ ఐటీ సంస్థలు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతాలకు చుట్టూ 4 కి.మీ. పరిధిలో వాక్ టు వర్క్ ప్రాజెక్టులు నిర్మించేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారు.నగరంలోని మొత్తం రెండు లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగుల్లో అత్యధికులు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తుంటారు. ఇక్కడికి సిటీ నలువైపుల నుంచి వచ్చే వారు కొందరైతే, ఐదారు కిలోమీటర్ల దూరం నుంచి వచి్చపోయేవారు మరికొందరు. వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లతో ఇప్పుడు ఈ దూరం కూడా తగ్గిపోతుంది. ఒకవైపు కార్యాలయాలు, మరోవైపు గృహ నిర్మాణాలు.. ఇంకేం ఎంచక్కా నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్లిపోవచ్చు. ఉదయం నడకకు బద్ధకించేవారికి ఇదొక వాకింగ్ గానూ ఉపయోగపడుతోంది. ఆరోగ్యం దృష్ట్యా సైకిల్‌పైనా ఆఫీసులకు కూడా వెళ్లొచ్చు.

1,600 డీల్స్.. వీసీ పెట్టుబడుల జోరు..
న్యూఢిల్లీ: రెండేళ్ల పాటు నెమ్మదించిన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ (పీఈ–వీసీ) పెట్టుబడులు గతేడాది మళ్లీ జోరందుకున్నాయి. 9 శాతం పెరిగి 43 బిలియన్ డాలర్లకు చేరాయి. సుమారు 1,600 డీల్స్ నమోదయ్యాయి. ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ), బెయిన్ అండ్ కంపెనీ రూపొందించిన ’ఇండియా ప్రైవేట్ ఈక్విటీ రిపోర్ట్ 2025’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.ఆసియా–పసిఫిక్‌లోకి వచ్చిన మొత్తం పీఈ–వీసీ పెట్టుబడుల్లో దాదాపు ఇరవై శాతం భారత్‌లోకి ప్రవహించాయని రిపోర్ట్ వివరించింది. తద్వారా ఈ ప్రాంతంలో పీఈ–వీసీ ఇన్వెస్ట్మెంట్లకు రెండో అతి పెద్ద గమ్యస్థానంగా భారత్ స్థానం మరింత పటిష్టమైందని తెలిపింది. దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వంపై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ఇన్వెస్టర్లు పెట్టుబడుల ద్వారా స్వల్ప వాటాలతో సరిపెట్టుకోకుండా సంస్థలను పూర్తిగా కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. 2022లో నమోదైన పీఈ డీల్స్ విలువలో సంస్థల కొనుగోళ్ల ఒప్పందాల వాటా 37 శాతంగా ఉండగా 2024లో 51 శాతానికి పెరిగింది. వివిధ రంగాలవ్యాప్తంగా అత్యంత నాణ్యమైన అసెట్స్‌లో నియంత్రణాధికారాలను చేజిక్కించుకోవడంపై ఇన్వెస్టర్లు మరింతగా దృష్టి పెడుతుండటాన్ని ఇది సూచిస్తోంది. గతేడాది వచ్చిన మొత్తం పీఈ–వీసీ పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు 16 శాతం వాటా దక్కించుకున్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే డీల్ విలువ 70 శాతం పెరిగింది. ఆర్థిక సేవల విభాగం 25 శాతం వృద్ధి చెందింది. 14 డీల్స్ నమోదయ్యాయి. వీటిలో 100 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే డీల్స్ ఏడు ఉన్నాయి. హెల్త్‌కేర్ విభాగంలోకి కూడా గణనీయంగా నిధులు వచ్చాయి. హెల్తియం వంటి భారీ మెడ్‌టెక్ లావాదేవీల దన్నుతో ఒప్పందాల పరిమాణం 80 శాతం పెరిగింది. ఫార్మా సీడీఎంవోల్లోకి పెట్టుబడులు పెరిగాయి. పెర్ఫీషియంట్ (3 బిలియన్ డాలర్లు), ఆల్టిమెట్రిక్ (900 మిలియన్ డాలర్లు), జీఈబీబీఎస్ (865 మిలియన్ డాలర్లు) లాంటి భారీ డీల్స్ ఊతంతో ఐటీ ఆధారిత సర్వీసులు, ఐటీ రంగం 300 శాతం మేర అసాధారణ వృద్ధి కనపర్చింది. ఇన్వెస్టర్లు పలు సంస్థల నుంచి నిష్క్రమించడంలోనూ ఆసియా–పసిఫిక్‌లోని ఇతర మార్కెట్లను భారత్ అధిగమించింది. ఇలాంటి డీల్స్ విలువ 33 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మెరుగ్గా ఉన్న ఈక్విటీ మార్కెట్లలో తమ వాటాలను విక్రయించడం ద్వారా వైదొలగడం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దేశీయంగా నిధుల సమీకరణ 2024లో కొత్త గరిష్టాలకు చేరింది. కేదార క్యాపిటల్ 1.7 బిలియన్ డాలర్ల నిధులు, క్రిస్‌క్యాపిటల్ 2.1 బిలియన్ డాలర్లు సమీకరించాయి. పటిష్టమైన జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ప్రైవేట్ వినియోగం పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగుపడటం, పాలసీలపరంగా సానుకూల చర్యలు మొదలైన అంశాల తోడ్పాటుతో 2025పై అప్రమత్తతతో కూడుకున్న ఆశావహ అంచనాలు నెలకొన్నాయి.
ఫ్యామిలీ

అమ్మ అంటేనే ఆనందం..!: హీరోయిన్ ప్రణీత.
గాఢ నిద్రలో ఉన్న ప్పుడు కేరింతల శబ్దం... ఆ శబ్దం అమ్మకు ఓ ఆనందం... అన్నం తింటుంటే బుడి బుడి అడుగులతో అల్లరి... అమ్మకు ఇదీ ఆనందం... చిట్టి చేతులు చెంపను తాకుతుంటే... అదో ఆనందం... చిన్నారి నవ్వు... ఓ స్ట్రెస్ బస్టర్. ‘‘కొన్ని త్యాగాలు... ఎన్నో ఆనందాల మధ్య అమ్మ అనే ఈ ప్రయాణం చాలా ఆనందంగా ఉంది’’ అంటున్నారు ప్రణీత. అసలు ‘అమ్మ అంటేనే ఆనందం’ అని ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారామె. ఇంకా ‘మదర్స్ డే సందర్భంగా’ ఇద్దరు పిల్లల తల్లిగా తన జీవితం ఎలా ఉందో పంచుకున్నారు హీరోయిన్ ప్రణీత.పెళ్లి కాకముందు, తల్లి కాక ముందు ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా ఉండేదాన్ని. ఇప్పుడు అదనంగా తల్లిగానూ ఫుల్ బిజీ. అయితే సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఇటు ఫ్యామిలీని చూసుకుంటూనే అటు కెరీర్‌ని కూడా కొనసాగించవచ్చు. నేనలానే చేస్తున్నాను. కానీ ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు సినిమాలు కాస్త తగ్గించుకున్నాను. అయితే టీవీ షో, యాడ్స్ చేస్తూ కెరీర్పరంగానూ బిజీగా ఉంటున్నాను. తల్లవగానే ఇంటికి పరిమితం అయిపోవాలన్నట్లుగా ఇప్పుడు ప్రపంచం లేదు. అమ్మాయిలకు కెరీర్ కూడా ముఖ్యమే. పిల్లలు స్కూల్‌కి వెళ్లేవరకూ కెరీర్‌ని పూర్తిగా మానేసుకోకుండా కాస్త స్లో చేసి, ఆ తర్వాత స్పీడప్ చేసుకోవచ్చు. మా పాప అర్నాకి ఇప్పుడు మూడేళ్లు... బాబు జైకృష్ణకి ఇంకా ఏడాది కూడా నిండలేదు. పాపని ప్లే స్కూల్‌కి పంపుతున్నాం. మార్నింగ్ తొమ్మిది గంటలకు వెళితే మధ్నాహ్నం ఒంటి గంటకు వస్తుంది. ఈలోపు బాబు పనులు పూర్తి చేసేసి, పాపకి ఫుడ్ తయారు చేసి, రాగానే తినిపించేస్తాను. ఆ తర్వాత ఇద్దర్నీ నిద్రపుచ్చుతాను. అప్పుడు నాకు కాస్త తీరిక దొరుకుతుంది. మళ్లీ ఇద్దరూ నిద్ర లేచే సమయానికి ఏదైనా తినిపించడానికి ప్రిపేర్ చేస్తాను. ఆ తర్వాత ఆటలు, డిన్నర్ టైమ్, నిద్రపుచ్చడం... ఇలా నా ఆలోచలన్నీ ఏం పెట్టాలి? ఎలా నిద్రపుచ్చాలి... అనేవాటి చుట్టూ తిరుగుతుంటాయి.సెలబ్రిటీ మదర్ అయినా, కామన్ మదర్ అయినా ఎవరైనా తల్లి తల్లే. పనులు చేసి పెట్టడానికి హెల్పర్స్‌ని పెట్టుకున్నప్పటికీ తల్లిగా పిల్లలకు చేయాల్సిన పనులు ఏ తల్లికైనా ఉంటాయి. ఉదాహరణగా చె΄్పాలంటే... పిల్లల బట్టలు మడతపెట్టడానికి, వంట చేయడానికి మనుషులు ఉన్నప్పటికీ పిల్లలకు మాత్రం నేనే తినిపిస్తాను. ‘అమ్మ తినిపిస్తుంది’ అనేది వాళ్లకు అర్థం అవ్వాలి. తినిపించడం, ఆడించడం అన్నీ అమ్మే చేయాలి. పిల్లలకు అర్థమయ్యేవన్నీ అమ్మే చెయ్యాలి.ఒక నటిగా ఫిజిక్‌ని పర్ఫెక్ట్గా మెయిన్టైన్ చేయడం చాలా అవసరం. అయితే తల్లయ్యాక అది సరిగ్గా వీలుపడటం లేదు. ఎందుకంటే ఇంతకు ముందైతే ఓ గంట వర్కవుట్ చేసి, అలసట తీరేంతవరకూ రిలాక్స్ అయ్యేదాన్ని. ఇప్పుడు వర్కవుట్ పూర్తి కాగానే పిల్లల పనులు ఉంటాయి. ఇక, అలసట తీర్చుకునేది ఎప్పుడు? అందుకే ఒక్కోసారి వర్కవుట్స్ మానేస్తున్నాను. అయితే పిల్లల కోసం చేసేది ఏదైనా హ్యాపీగా ఉంటుంది. ఫిజిక్ గురించిన ఆలోచన పక్కకు వెళ్లి΄ోతుంది (నవ్వుతూ). అలాగే కెరీర్ బ్యాక్సీట్లోకి వెళ్లి΄ోవడం సహజం. ఈ ప్రపంచంలో ‘మదర్‌హుడ్’ అనేది బెస్ట్ జాబ్ అని నా ఫీలింగ్. ఆ అద్భుతమైన అనుభూతి కోసం చేసే చిన్ని త్యాగాలు ఆనందాన్నే ఇస్తాయి.పాప పుట్టాక ఏం చేసినా.. పాపకు సౌకర్యంగానే ఉందా? సరిగ్గా చూసుకుంటున్నామా?’ అనిపించేది. బాబు పుట్టాక కూడా అది కంటిన్యూ అవుతోంది. పిల్లలు పెద్దయ్యాక కూడా తల్లికి ఈ డౌట్ ఉంటుందేమో! మొత్తం మీద నాకు అర్థమైందేంటంటే పిల్లలను ఎంత బాగా చూసుకున్నా తల్లికి తృప్తి ఉండదేమో. మావారు (నితిన్ రాజు) వీలు కుదిరినప్పుడల్లా పిల్లలను చూసుకుంటారు. ఇంటికి రాగానే పిల్లలను ప్లే ఏరియాకి తీసుకెళ్లడం, ఆడించడం చేస్తుంటారు. మా పాపను స్విమ్మింగ్‌లో చేర్పించాం. ఆ క్లాస్‌కి తీసుకెళతారు. ఇలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. – డి.జి. భవాని (చదవండి: అమ్మ వల్లే డాక్టర్‌నయ్యా!)

Mother's Day: అమ్మ వల్లే డాక్టర్‌నయ్యా!
తెలుగు రాష్ట్రాల్లోని అరుదైన ఆర్థోపెడిక్ నిపుణుల్లో డాక్టర్ తేతలి దశరథరామారెడ్డి ఒకరు. తండ్రి నారాయణ రెడ్డి పేరు మీద సొంతూర్లో ఒక ట్రస్ట్ పెట్టి.. అవసరంలో ఉన్న వాళ్లకు వైద్యసహాయం అందిస్తున్నారు. అమ్మ సంకల్పబలం వల్లే తాను డాక్టర్నయ్యానని చెప్పే ఆయన ఇంటర్వ్యూ మదర్స్ డే సందర్భంగా..! ‘‘మా సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి. మా నాన్న నారాయణ రెడ్డి. ఆ రోజుల్లో బీఏ హానర్స్ చేశారు. అమ్మ అచ్చాయమ్మ.. పెద్దగా చదువుకోలేదు. నాకు రెండున్నరేళ్లున్నప్పుడు మా నాన్న రోడ్ యాక్సిడెంట్ పాలయ్యారు. మేం మొత్తం ఆరుగురం. నాకు ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య, ఒక చెల్లి. అమ్మ మోటివేషన్.. నేను చిన్నప్పుడు యావరేజ్ స్టూడెంట్‌ని. బాగా అల్లరిచేసే వాడిని కూడా! నేను డాక్టర్ అవడానికి స్ఫూర్తి మా చిన్నాన్న (కంటి డాక్టర్ సత్యనారాయణ రెడ్డి) అయితే మోటివేషన్ మాత్రం అమ్మదే! అమ్మ చాలా డిసిప్లిన్డ్.. కష్టపడే తత్వం.. చాలా ఫోకస్డ్.. డెడికేటెడ్. కమాండింగ్ నేచర్! మమ్మల్ని పొద్దున నాలుగింటికి లేపి చదువుకు కూర్చోబెట్టేది. మాతోపొటే తనూ కూర్చుని.. మేం చదువుకుంటుంటే ఆమె రామకోటి రాసేది. అమ్మ ఆశయమల్లా మాలో ఎవరినైనా డాక్టర్ చేయాలన్న నాన్న కోరికను నెరవేర్చడమే! ఏమాత్రం చదువును నిర్లక్ష్యం చేసినా.. మా చిన్నాన్నను ఉదాహరణగా చూపిస్తూ చక్కగా చదువుకుంటే అలా గౌరవం పొందుతారని చెప్పేది! మా బద్ధకాన్ని ఏమాత్రం సహించేది కాదు. తండ్రిలేని పిల్లలు కదా.. తనేమాత్రం అశ్రద్ధ చేసినా పాడైపోతారనే భయం అమ్మకు. అందుకే మమ్మల్ని పెంచడంలో ఎక్కడా రాజీ పడలేదు ఆవిడ. గారాబం గారాబమే. స్ట్రిక్ట్‌నెస్ స్ట్రిక్ట్నెసే! బద్ధకం అనేది ఆమె డిక్షనరీలో లేదు. ఎవరి పనులు వాళ్లు చేసుకోవాలి అనేవారు. మా అందరినీ సమర్థులైన ఇండివిడ్యువల్స్‌గా తయారు చేశారు. ఇటు మరుదులు.. అటు తమ్ముళ్లు అందరూ ఆమె మాటను గౌరవించేవారు. నిజానికి మా ఇంట్లో నానమ్మ తర్వాత మా మేనత్త మాణిక్యం. ఆ తర్వాత అమ్మే! నాన్న లేకపోయినా ఆ ఉమ్మడి కుటుంబాన్ని చెదరనివ్వలేదు అమ్మ. అందుకే చిన్నాన్నలకు అమ్మంటే చాలా గౌరవం. అలా అమ్మ మోటివేషన్, నాన్న కోరిక, చిన్నాన్న స్ఫూర్తితో నేను డాక్టర్‌ను అయ్యాను. మా మేనమామలకైతే ఆవిడ వాళ్లమ్మతో సమానం. మేమెప్పుడైనా అమ్మను చిన్నగా విసుక్కున్నా మా మేనమామలు మమ్మల్ని కేకలేసేవారు. ఆమె ఎప్పుడు హైదరాబాద్‌కి వచ్చినా.. ఇంట్లోకి రావడం రావడమే తిరుగు ప్రయాణానికి టికెట్ ఎప్పుడు రిజర్వ్ చేస్తావని అడిగేది. ఆ రావడం కూడా ఒంట్లో బాలేక΄ోతేనే వచ్చేది. ఆసుపత్రిలో చూపించుకుని వెంటనే వెళ్లిపోయేవారు. ఎంత అడిగినా ఉండేవారు కారు. ఎక్కువగా తన తమ్ముళ్లతో ఉండటానికి ఇష్టపడేవారు. మా అమ్మ విషయంలో నాకున్న ఒకే ఒక అసంతృప్తి.. మా ఇంట్లో ఇప్పుడు దాదాపు 17 మంది దాకా డాక్టర్లున్నారు. అమ్మ మా సక్సెస్ చూశారు కానీ.. మా పిల్లల సక్సెస్ చూడకుండానే పోయారు. 2016లో చనిపోయారావిడ.మహాగొప్ప మేనమామలు..మా నాన్నగారు పోయాక అమ్మ మానసికంగా కుంగిపోతే.. అమ్మమ్మ వాళ్లు తీసుకెళ్లి కొన్నాళ్లు అక్కడే పెట్టుకున్నారు. అప్పుడు అమ్మను కంటికి రెప్పలా కాచుకుంది మా మేనమామలే! ఆ కష్టకాలంలో మా ఫ్యామిలీ నిలబడ్డానికి ప్రధాన కారణం మా అమ్మమ్మ గారి కుటుంబమే! మా అమ్మాయి డాక్టర్. అమెరికాలో మాస్టర్స్ చేస్తోంది. అబ్బాయేమో ఆస్ట్రేలియాలో సప్లయ్ అండ్ చైన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేస్తున్నారు. నా భార్య సింధు. హోమ్ మేకర్. ఆమె కూడా అమ్మలాగే మంచి డిసిప్లిన్డ్. ఈ విషయంలో ఆమె మీద అమ్మ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. గ్రేట్ మదర్. మా పెద్ద కుటుంబంలో చక్కగా ఇమిడిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే సింధు.. స్వీట్ హార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ.’’– సరస్వతి రమ (చదవండి: అమ్మ మనసు తెలుసా?)

Istanbul Airport: అక్కడ తింటే.. పర్సు ఖాళీ!
చేతిలో ఐఫోన్, ముంజేతికి రోలెక్స్ వాచ్ ఉన్న వాడు కాదు రిచ్‌కిడ్ అంటే, ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో బర్గర్ తిన్నవాడే నిజమైన రిచ్‌కిడ్. ఎందుకంటే, ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాశ్రయాల్లో ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ ఒకటి. అక్కడి తినుబండారాల ధరలు ఏకంగా అంతరిక్షాన్నే దాటేస్తున్నాయి. ఒక లాసాగ్నే (ఇటాలియన్ వంటకం) రూ. 2,180. అదిపెద్ద డిన్నరేం కాదు, ఈ వంటకంలోని చిన్న ముక్క మాత్రమే సర్వ్ చేస్తారంతే! ఇక చిన్న బర్గర్ ధర అయితే రూ. 2,245, నాలుగు చికెన్ వింగ్ ఫ్రైస్ రూ.1,560. బయట దొరికే బీరు బాటిల్ రూ.రెండువందలైతే, ఇక్కడ బీరు ధర రూ. 1,915. అది కూడా పూర్తిగా బాటిల్ ఇవ్వరు, కేవలం వంద మిల్లీలీటర్లే! వీటి ధరలన్నీ తెలిసి తలనొప్పి వస్తుందని ఒక కప్పు కాఫీ అడిగారో మరో రూ. 700 ఖర్చు చేయాలి. అదీ తెలిసి, బీపీ పెరిగిందని కనీసం అరటిపండు కొనాలనుకుంటే రూ.535 ఖర్చు చేయాలి. చివరికి మంచినీళ్లు అయినా తాగి గొంతు తడుపుకుందాం అనుకుంటే లీటరు వాటర్ బాటిల్ రూ. 300. ఏదేమైతేనేం, బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకొని అయినా, అంత ఖర్చు చేసి, బాగా తిని రిలాక్స్ అయ్యారనుకోండి, మీ బ్యాగ్ జాగ్రత్త! ఎందుకంటే, ప్రపంచంలోనే చోర భయం ఎక్కువగా ఉండే ఎయిర్‌పోర్టుల్లో ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు నంబర్ వన్ అని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ కంటే ముందే బ్యాగు, పర్సు రెండూ టేకాఫ్ అయిపోతున్నాయని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు బాధితులు సోషల్ మీడియాలో లబోదిబో మంటున్నారు.(చదవండి: బలమైన ఎముకలకు బెస్ట్ ఇండియన్ గైడ్ ఇదే..! ఆ నాలుగింటిని మాత్రం..)

Hyderabad: సిటీలో.. మదర్స్‌డే.. సందడి..
సాక్షి, హైదరాబాద్: మదర్స్ డే సందర్భంగా నగరంలో ఆదివారం అనేక ప్రత్యేక కార్యక్రమాలు, జరగనున్నాయి. వీటిలో భోజన విందులు, గిఫ్ట్ ఆఫర్లు మరెన్నో ఉన్నాయి. నగరంలోని మారియట్ హోటల్లో ఉన్న బక్రా రెస్టారెంట్లో ప్రత్యేక బ్రంచ్ మెనూ అందిస్తున్నారు. గచ్చిబౌలిలోని షెరటన్ హోటల్ లోని ఫీస్ట్ రెస్టారెంట్లో విత్ లవ్ మమ్స్ కిచెన్ థీమ్‌తో ప్రత్యేక బ్రంచ్. ఫొటో బూత్, గేమ్స్, బహుమతులతో మదర్స్‌డే ఈవెంట్ నిర్వహిస్తున్నారు. హైటెక్ సిటీలోని ది వెస్టిన్ హోటల్లో సీజనల్ టేస్ట్స్ రెస్టారెంట్లో కాంటినెంటల్, నార్త్ ఇండియన్, ఇటాలియన్ వంటకాలతో ప్రత్యేక డైనింగ్ తగ్గింపు ధరలో అందిస్తున్నారు. ఇలాంటి మెనూ మార్పులే కాకుండా పలు ఆఫర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నగర శివార్లలోని వండర్ లా అమ్యూజ్మెంట్ పార్క్‌లో మదర్స్ డేని పురస్కరించుకుని మూడు ఎంట్రీలు కొంటే ఒక ఎంట్రీ ఉచితంతో పాటు మదర్స్ డే థీమ్‌తో పలు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. కాలిఫోర్నియా ఆల్మండ్స్ మదర్స్ డే సందర్భంగా అమ్మకు బహుమతులు అందించండి అంటూ ప్రత్యేక ఆల్మండ్స్ గిఫ్ట్ ప్యాక్స్‌ను నగర మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. అమ్మకు అందించాల్సిన పోషకాహారంపై ఆన్లైన్ వేదికలపై పలు న్యూట్రిషనిస్ట్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి పలు వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ బాదం వంటి పోషకాలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు.
ఫొటోలు


తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)


మదర్స్ డే స్పెషల్.. హీరోయిన్ ప్రణీత పిల్లల్ని చూశారా? (ఫొటోలు)


డాక్టర్ బాబు నిరుపమ్ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)


వైభవంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 11-18)


మిస్ వరల్డ్ 2025 ఆరంభం: స్పెషల్ ఎట్రాక్షన్‌గా నందిని గుప్తా (ఫొటోలు)


Miss World 2025 : ఘనంగా హైదరాబాద్‌లో మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభం (ఫొటోలు)


సీరియల్ నటి విష్ణుప్రియ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)


లండన్ లో రామ్ చరణ్.. చుట్టుముట్టిన మెగాఫ్యాన్స్ (ఫొటోలు)


పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్ (ఫొటోలు)
అంతర్జాతీయం

మదర్సా విద్యార్థులే రక్షణ కవచాలు!
అతివాద నెట్‌వర్క్‌లతో పాక్ సైన్యానిది విడదీయరాని బంధమని మరోసారి రుజువైంది. దాయాది యుద్ధోన్మాదం చివరికి మత శిక్షణ సంస్థలను కూడా వదలడం లేదు. భారత్‌తో పోరులో సైన్యం చేతులెత్తేసే పరిస్థితి నెలకొనడంతో పాక్ ముసుగులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతు న్నాయి. అవసరమైతే మదర్సా విద్యార్థులను కూడా యుద్ధ రంగంలోకి పంపుతామని బాహాటంగా ప్రకటించేసింది. మతిలేని, వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధుడైన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ శనివారం సాక్షాత్తూ పాక్ పార్లమెంటులోనే ఈ మేరకు ప్రకటన చేశారు. వారిని ‘సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్’గా ఆయన అభివర్ణించారు. అవసరమైనప్పుడు మదర్సా విద్యార్థులను యుద్ధ విధుల్లో 100 శాతం వాడుకుని తీరతామని కుండబద్దలు కొట్టారు. భారత డ్రోన్లన్నింటినీ ఎక్కడికక్కడ అడ్డుకుని కూల్చేశామని ఒకవైపు పాక్ సైన్యం ప్రకటించగా, అ లాంటిదేమీ లేదంటూ ఆసిఫ్ కొట్టిపారేయ డం తెలిసిందే. ‘‘భారత డ్రోన్లను కూల్చ కపోవడానికి కారణముంది. మా సైనిక స్థావరాలకు సంబంధించిన సున్ని తమైన సమాచారం లీక్ కావద్దనే అలా చేశాం’’ అంటూ విచిత్రమైన వివరణ ఇచ్చి ఇంటాబయటా నవ్వులపాలయ్యా రు. భారత ఫైటర్ జెట్లను కూల్చేశామని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో చెప్పుకుని, రుజువులడిగితే, ‘అలాగని భారత సోషల్ మీడియాలోనే వస్తోందిగా’ అని చెప్పి అభాసు పాలయ్యారు. రక్షణ మంత్రి అయ్యుండి సోషల్ మీడియా వార్తల ఆధారంగా ప్రకటనలు చేస్తారా అంటూ సీఎన్ఎన్ విలేకరి ఆండర్సన్ నిలదీయడంతో నీళ్లు నమిలారు.– సాక్షి, నేషనల్ డెస్క్

ఏఐ మానవాళికి ప్రధాన సవాల్
వాటికన్ సిటీ: మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత సంక్లిష్టమైన సవాళ్లలో కృత్రిమ మేధ(ఏఐ)ఒకటని నూతన పోప్ లియో 14 పేర్కొన్నారు. దివంగత పోప్ ఫ్రాన్సిస్ అనుసరించిన ప్రాథమ్యాల్లో కొన్నిటిని తానూ కొనసాగిస్తానని ప్రకటించారు. శనివారం వాటికన్ సిటీలోని సినోడ్ హాల్లో కార్డినల్స్ ను ఉద్దేశించి ఆయన ఇటాలియన్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రాన్సిస్ పేరును పదేపదే తలచుకుంటూ నివాళులర్పించారు. 2013లో పోప్‌గా బాధ్యతలు చేపట్టే సమయంలో ఫ్రాన్సిస్ చేసిన ప్రకటనను ఉదహరిస్తూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. కేథలిక్ చర్చిని మరింత సమ్మిళితంగా మార్చేందుకు విశ్వాసులకు దగ్గరయ్యేందుకు, తిరస్కృతులను అక్కున చేర్చుకునేలా తయారు చేసేందుకు కట్టుబడి ఉంటానన్నారు. చర్చిని ఆధునీకరించేందుకు 1960ల్లో వాటికన్ రెండో కౌన్సిల్ ప్రకటించిన సంస్కరణలను అమలు చేస్తానని స్పష్టం చేశారు. ‘మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఏఐ ఒకటి. ఇది మనిషి గౌరవం, న్యాయం, శ్రమను రక్షించడంలో సవాళ్లు విసురుతోంది’అని అన్నారు. పోప్ ఫ్రాన్సిస్ సైతం ఏఐతో తలెత్తనున్న సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అడ్డుకునేందుకు చట్టాలు చేయాలని ప్రపంచ దేశాలను సైతం ఆయన కోరారన్నారు. లియో 14గా తన పేరును ఎంపిక చేయడంలో ఏఐ పాత్రను ఆయన వివరించారు. 1878–1903 వరకు పోప్‌గా లియో 13 కొనసాగారు. ఆధునిక కేథలిక్ సామాజిక ఆలోచనకు పునాది వేసిందీయనే. పారిశ్రామికీకరణ ప్రారంభంలో కారి్మకుల హక్కులు, పెట్టుబడిదారీ విధానాన్ని ఉద్దేశించి 1891లో ఈయన రోమన్ కేథలిక్ చర్చి బిషప్‌లకు రాసిన లేఖ ప్రముఖంగా మారింది. లియో 13 పేర్కొన్న విధంగా ‘క్రైస్తవులం మనం అనేకులమైనప్పటికీ, ఒకే క్రీస్తులో మనమంతా ఒక్కటే’అన్న సెయింట్ ఆగస్టీన్ మాటలను ఈ సందర్భంగా ఉటంకించారు. అంతకుముందు, ప్రసంగించేందుకు వస్తున్న లియో 14కు కార్డినల్స్ అంతా లేచి నిలబడి చప్పట్లతో ఆహ్వానం పలికారు. పోప్ తయారు చేసిన ప్రసంగ పాఠాన్ని చదువుతూ మధ్యమధ్యలో తలెత్తి చూశారు. సెయింట్ పీటర్స్ బసిలికా వేదిక నుంచి గురువారం రాత్రి మొట్టమొదటి సారిగా కనిపించిన సమయంలో కూడా ప్రసంగ పాఠాన్నే చదివి వినిపించారు.

పాక్ ఫేక్ ప్రచార సారథి... ఓ ఉగ్రవాది కొడుకు
లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి. భారత్‌పై పాకిస్తాన్ సాగిస్తున్న గోబెల్స్ ప్రచారానికి సారథి. పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) డైరెక్టర్ జనరల్. పహల్గాం ఉగ్ర దాడి నుంచీ భారత్‌పై పథకం ప్రచారం దాయాది తలపెట్టిన తప్పుడు ప్రచారానికి కర్త, కర్మ, క్రియ అన్నీ చౌధురే. అతను ఓ ఉగ్రవాది కుమారుడు కావడం విశేషం. ఉగ్రవాదంతో విడదీయలేని రీతిలో పెనవేసుకు పోయిన పాకిస్తాన్ బంధానికి నిలువెత్తు నిదర్శనం. దారితప్పిన సైంటిస్టు చౌధురి తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ మెహమూద్. అవడానికి అణు శాస్త్రవేత్త. పాక్ అణ్వాయుధ పిత అబ్దుల్ ఖదీర్ఖాన్తో కలిసి అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించాడు. యురేనియం శుద్ధి తదితరాల్లో చురుగ్గా వ్యవహరించాడు. అందుకోసం గ్యాస్ సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీని నెదర్లాండ్స్ నుంచి తస్కరించాడు. కానీ నిజానికి అతనో కరడుగట్టిన మతోన్మాది. అంతకుమించి పేరుమోసిన ఉగ్రవాది. నరనరానా భారత విద్వేషాన్ని నింపుకున్న వ్యక్తి. ఐరాస భద్రతా మండలి ప్రకటిత అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. పాక్ అణ్వాయుధ పరిజ్ఞానాన్ని దాదాపుగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదా చేతిలో పెట్టిన ధూర్తుడు. అప్పటి అల్‌కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడు. బషీర్ చేసిన ఈ నిర్వాకం అప్పట్లో పాశ్చాత్య దేశాలకు పెద్ద సంకటంగా మారింది. అలాంటి వ్యక్తి కొడుకైన చౌధురి భారత్‌తో సైనిక సంఘర్షణ గురించి పాక్ తరఫున నాలుగు రోజులుగా అధికారికంగా బయటి ప్రపంచానికి చెబుతున్నాడు! ఓ అంతర్జాతీయ ఉగ్రవాది కొడుకే పాక్‌కు అంతర్జాతీయ గొంతుకగా మారాడు. ‘మాది ఉగ్రవాద బాధిత దేశం’అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. అంతేగాక అధికారికంగానూ, ఆన్‌లైన్‌లోనూ భారత్‌పై ఇబ్బడిముబ్బడిగా ఫేక్ న్యూస్ ప్రచారం వ్యాప్తి చేస్తున్నాడు. చౌధురి తీరును పాక్ ప్రజలు కూడా ఛీదరించుకుంటున్నారు. భారత సైన్యం చేతిలో పాక్ రోజూ చావుదెబ్బలు తింటున్నా అతను మాత్రం ఆ వాస్తవాలను పూర్తిగా కప్పిపుచ్చి లేనిపోని గొప్పలకు పోతున్నాడంటూ మండిపడుతున్నారు. డీఎన్ఏలోనే ఉగ్రవాదం లెఫ్టినెంట్ జనరల్ చౌధురి తండ్రి బషీర్‌ను 2001లో ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. బిన్‌లాడెన్ ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా దన్నుగా నిలుస్తున్నాడని స్పష్టంగా పేర్కొంది. అంతర్జాతీయ ఒత్తిడితో మరో దారిలేక అదే ఏడాది పాక్ ఐఎస్ఐ అతన్ని అరెస్టు చేసింది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ బషీర్‌ను స్వయంగా విచారించింది. బిన్‌లాడెన్‌ను కలిసినట్టు దర్యాప్తులో అతను అంగీకరించాడు. 2009లో ప్రభుత్వ విధుల నుంచి తప్పించింది. ముసుగు తొలగిపోవడంతో బషీర్ మరింత రెచ్చిపోయాడు. ఉమ్మా తమీరీ నౌ (యూటీఎన్) అనే స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఓ ఉగ్ర సంస్థను స్థాపించాడు. రసాయన, జీవాయుధాలతో పాటు ఏకంగా అణ్వాయుధాలను గురించి లాడెన్‌కు, తాలిబన్లకు కావాల్సిన సమాచారం అందించడం మొదలుపెట్టాడు. తాలిబన్ల నాటి చీఫ్ ముల్లా ఒమర్‌తో తరచూ భేటీ అయ్యేవాడు. మునీర్.. ఓ మతోన్మాది పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్‌ది కూడా పూర్తిగా జిహాదీ నేపథ్యమే. ఆయన తండ్రి సయ్యర్ సర్వర్ మునీర్ ఓ మదర్సాలో ఇస్లాం బోధకుడు. ఆ ఛాయల్లో పెరిగిన మునీర్ కూడా కరడుగట్టిన మతోన్మాదిగా మారాడు. నరనరానా భారత వ్యతిరేకతను నింపుకున్నాడు. 2019లో జమ్మూలోని పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఆత్మాహుతి ఉగ్ర దాడికి మునీరే వ్యూహకర్త. అప్పట్లో పాక్ నిఘా విభాగం ఐఎస్ఐ చీఫ్‌గా ఆ దాడిని దగ్గరుండి పర్యవేక్షించాడు. – సాక్షి, నేషనల్ డెస్క్

కాల్పుల విరమణ పాటిద్దాం
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు తేవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో యూరప్ ప్రధాన దేశాల నేతలు రంగంలోకి దిగారు. ఫ్రాన్స్, జర్మనీ, పోలెండ్, యూకే దేశాల నేతలు శనివారం కీవ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రష్యా ప్రకటించిన మూడు రోజుల కాల్పుల విరమణ శనివారంతో ముగియనుండటం గమనార్హం. ఈ సందర్భంగా నేతలు కీవ్‌లోని ప్రధాన ఇండిపెండెన్స్ స్క్వేర్‌లో జరిగిన 80వ విక్టరీ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు, నేలకొరిగిన సైనికులకు నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా వారు 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను రష్యా ముందుంచారు. మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా చర్చలకు ముందుకు రావాలని అధ్యక్షుడు పుతిన్‌కు పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చిన శాంతి ఒప్పందానికి మద్దతు ప్రకటించారు. సోమవారం మొదలుకొని నెల రోజులపాటు అమలయ్యే పూర్తిస్థాయి, బేషరతు కాల్పుల విరమణకు అంగీకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోపాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, జర్మనీ ఫ్రెడరిక్ మెర్జ్, పోలెండ్ ప్రధాని టస్క్, యూకే ప్రధాని కెయిర్ స్టార్మర్ పాల్గొన్నారు. కాగా, నాలుగు దేశాల నేతలు కలిసి ఉక్రెయిన్ రావడం ఇదే మొదటిసారి. వీరిలో జర్మనీ ఛాన్స్లర్ మెర్జ్‌కు ఇదే మొట్టమొదటి ఉక్రెయిన్ పర్యటన. ఈ సందర్భంగా జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్లో చర్చలు జరిపినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండీ సిబిహా వెల్లడించారు. ఇలా ఉండగా, సుమారు 1,600 కిలోమీటర్ల పొడవైన ఫ్రంట్లైన్లో రష్యా ఆర్మీ శనివారం కూడా పలు చోట్ల దాడులు కొనసాగించింది. ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంపై శుక్రవారం జరిగిన దాడిలో ముగ్గురు పౌరులు మరణించగా నలుగురు గాయపడ్డారు.
జాతీయం

పాక్‌తో కాల్పుల విరమణ.. 1971లో ఇందిర నిర్ణయంపై చర్చ!
ఢిల్లీ: భారత్, పాక్ యుద్ధానికి(India-Pakistan War) శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. కొందరు హస్తం నేతలు కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇందిర కాలం నాటి పరిస్థితులను ప్రస్తావిస్తున్నారు.భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత ఎంపీ శశిథరూర్ స్పందించారు. శశిథరూర్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నాకు చాలా సంతోషంగా ఉంది. భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోలేదు. కానీ ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలనుకుంది. ఆ గుణపాఠం చెప్పారని నేను నమ్ముతున్నాను. అలాగే, మాట తప్పడం పాకిస్తాన్ నైజం. వారి వాగ్దానాలను ఎలా నమ్ముతాం? అని సెటైరికల్ కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో 1971లో జరిగిన యుద్ధంపై కూడా శశిథరూర్ స్పందించారు. ఈ సందర్భంగా శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘1971లో ఒక గొప్ప విజయం అందుకున్నాం. ఇందిరా గాంధీ ఉపఖండం మ్యాప్‌ను తిరగ రాశారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బంగ్లాదేశ్ నైతిక లక్ష్యంతో పోరాడుతోంది. పాకిస్తాన్‌పై దాడులు చేయడం, బాంబులు పేల్చడం మాత్రమే స్పష్టమైన లక్ష్యం కాదు అని కామెంట్స్ చేశారు.#WATCH | Delhi | "1971 was a great achievement, Indira Gandhi rewrote the map of the subcontinent, but the circumstances were different. Bangladesh was fighting a moral cause, and liberating Bangladesh was a clear objective. Just keeping on firing shells at Pakistan is not a… pic.twitter.com/Tr3jWas9Ez— ANI (@ANI) May 11, 2025అయితే, పాకిస్తాన్‌తో కాల్పులు విరమణ ఒప్పందం జరిగిన వేళ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా తీసుకున్న చర్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరితో పోల్చుతూ సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది. దీనిపై పలు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.మరోవైపు.. పాకిస్తాన్‌తో కాల్పులు విరమణ ఒప్పందంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా.. కాల్పుల విరమణ అంశంపై తక్షణం ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పార్లమెంటు ప్రత్యేక సెషన్ నిర్వహించి ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్విట్టర్ వేదికగా.. ‘వాషింగ్టన్ నుంచి కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన తక్షణం అఖిలపక్ష సమావేశం జరగాలి. పార్లమెంటు ప్రత్యేక భేటీని ఏర్పాటుచేసి గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలను చర్చించాలి’ అని డిమాండ్ చేశారు. This is Prime Minister Indira Gandhi's historic letter to President Nixon of Dec 12, 1971. Four days later Pakistan surrendered.She ensured that there was no "neutral site" which has now been agreed to. pic.twitter.com/Fvvcmn6VkZ— Jairam Ramesh (@Jairam_Ramesh) May 10, 2025 మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేడా స్పందిస్తూ.. గత 5,6 రోజుల్లో దేశం ఏం సాధించిందో, ఏం కోల్పోయిందో ప్రజలకు ప్రభుత్వం చెప్పాలని పేర్కొన్నారు. అలాగే, 1971 యుద్ధం సందర్భంగా సైనికులతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దిగిన ఫొటోలను కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇందిర లేని లోటు కనిపిస్తోందని పేర్కొంది. ‘ఇందిర ధైర్యం చూపారు. దేశం కోసం నిలబడ్డారు. జాతి పౌరుషంతో ఆమె రాజీ పడలేదు’ అని కాంగ్రెస్ తెలిపింది. India misses Indira. pic.twitter.com/TUluFLh1Hj— Pawan Khera 🇮🇳 (@Pawankhera) May 10, 2025The Most famous speech of Indira Gandhi..!!! "FIGHT BACK INDIA"!!!#ceasefire pic.twitter.com/fkGX2zwfep— Samir Karki (@SarojKarki65) May 11, 2025

మాకు పీవోకేను పాక్ అప్పగించడం తప్పితే వేరే మార్గం లేదు: మోదీ
War Related Updates..ప్రధాని మోదీకి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్భారత్, పాక్ ఉద్రిక్తతలపై మోదీతో మాట్లాడిన జేడీ వాన్స్పాక్ దాడి చేస్తే దీటుగా బదులిస్తామని చెప్పిన మోదీమా సంయమనం బలహీనత కాదుదేశ భద్రతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడంఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదని జేడీ వాన్స్ కు మరోసారి చెప్పిన మోదీ పీవోకేపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలుఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది. ముగియలేదు. పీవోకే విషయంలో మాకు మధ్య వర్తిత్వం అవసరం లేదుపీవోకేని మాకు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదు : మోదీ 3:10 PMప్రధానితో ముగిసిన త్రివిధ దళాధిపతుల భేటీసమావేశంలో పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్, జై శంకర్, సీడీఎస్కాల్పుల విరమణ ప్రకటన తర్వాత తాజా పరిస్థితులపై చర్చరేపు భారత్, పాక్ మధ్య కీలక చర్చలుకాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తత తగ్గింపుపై చర్చలు ఢిల్లీ..ప్రధాని మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్పాకిస్తాన్ సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీసమావేశానికి హాజరైన ఎయిర్‌ఫోర్స్ చీఫ్, నేవీ చీఫ్ అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్ ఎత్తివేత.తాజా పరిణామాలపై ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ మీడియా సమావేశంకాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పరిస్థితులపై వివరణ ఢిల్లీ..భారత్, పాక్ సరిహద్దులలో సాధారణ పరిస్థితిఆగిపోయిన కాల్పులు, కనిపించని డ్రోన్లుకాల్పుల విరమణ అవగాహన అతిక్రమిస్తే పాక్‌దే బాధ్యత అని రాత్రే స్పష్టం చేసిన భారత్#WATCH | Rajasthan | Situation seems normal this morning in Barmer. No drones, firing, or shelling were reported overnight. pic.twitter.com/lJOcUvMwY4— ANI (@ANI) May 11, 2025#WATCH | J&K | Visuals this morning in Kupwara. After days of heavy shelling by Pakistan, situation seems normal today. No drones, firing or shelling was reported overnight. pic.twitter.com/3S2s8WFiVQ— ANI (@ANI) May 11, 2025#WATCH | J&K | Situation seems normal this morning in Samba. No drones, firing, or shelling were reported overnight. pic.twitter.com/QPOnrefFHw— ANI (@ANI) May 11, 2025అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్‌అమృత్‌సర్‌లో ఇంకా మోగుతున్న సైరన్లు.ప్రజలు ఎవరూ బయటకు రావద్దని డిప్యూటీ కమిషనర్ సూచన.ఇళల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ.నగరంలో విద్యుత్ సరఫరా పునరుద్దణ. 👉కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకుంది. విరమణ అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్ మళ్లీ దాడులకు తెగబడింది. శనివారం రాత్రి జమ్ము కశ్మీర్‌తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ డ్రోన్ దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం.బ్లాకౌట్ ఎత్తివేత.. మళ్లీ విధింపు 👉కాల్పుల విరమణ ప్రకటన రాగానే పంజాబ్‌లో బ్లాకౌట్‌ను అధికారులు ఎత్తేశారు. ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించినట్లు వార్తలు రాగానే దానిని తిరిగి విధించారు. గుజరాత్, కశ్మీర్, రాజస్థాన్‌లలో బ్లాకౌట్‌ను కొనసాగిస్తున్నారు. గుజరాత్‌లోని కచ్‌లోనూ డ్రోన్లు కనిపించాయి. కశ్మీర్‌లోని నగ్రోటా వద్ద చొరబాట్లకు జరిగిన యత్నాన్ని కాల్పులతో సైన్యం వమ్ము చేసింది. #WATCH | J&K: Red streaks seen and explosions heard as India's air defence intercepts Pakistani drones amid blackout in Srinagar(Visuals deferred by unspecified time) pic.twitter.com/XObqcbiQCe— ANI (@ANI) May 10, 2025👉కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వెంబడి శనివారం రాత్రి అనేక ప్రాంతాల్లో పాక్ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపుర్, శ్రీనగర్‌లలో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పాక్ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోఖ్రాన్లో, శ్రీనగర్‌లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం.#WATCH | Punjab: A complete blackout has been enforced in Pathankot(Visuals deferred by an unspecified time) pic.twitter.com/z8ovHXi0sT— ANI (@ANI) May 10, 2025👉మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, ఫిరోజ్‌పుర్, రాజస్థాన్‌లోని జైసల్మేర్, బాడ్‌మేర్‌లలో పూర్తిగా కరెంటు నిలిపివేశారు. కఠువాలో బ్లాక్అవుట్ పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. పంజాబ్‌లోని మోగాలోనూ కరెంటు నిలిపివేశారు.గుజరాత్‌లోనూ డ్రోన్ దాడులు?👉గుజరాత్‌లోనూ డ్రోన్ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. కచ్ జిల్లాలో అనేక చోట్ల డ్రోన్లు కనిపించాయని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు. ప్రస్తుతం పూర్తి బ్లాక్అవుట్ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, భయాందోళనలకు గురికావద్దని ‘ఎక్స్’ వేదికగా సూచించారు.#WATCH | Haryana: A complete blackout has been enforced in Ambala(Visuals deferred by an unspecified time) pic.twitter.com/nyGQK8Jet2— ANI (@ANI) May 10, 2025👉శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ సంగతేంటని ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. #WATCH | Gujarat | A complete blackout has been enforced in Bhuj in Kachchh(Visuals deferred by an unspecified time) pic.twitter.com/vBnYnoIkfm— ANI (@ANI) May 10, 2025

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఐదుగురు హతం!
న్యూఢిల్లీ: పహల్గాం పాశవిక ఉగ్రదాడికి ప్రతిస్పందనగా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరాలను భారత్ మే 7వ తేదీ అర్ధరాత్రి తర్వాత దాడిచేయడం తెల్సిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ గడ్డపై జరిపిన ఈ క్షిపణి దాడుల్లో తొమ్మిది కీలకమైన ఉగ్ర స్థావరాలు నేలమట్టమై కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన ఐదుగురు సైతం చనిపోయినట్లు కేంద్రం సంబంధిత వివరాలను శనివారం వెల్లడించింది. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులతో పాటు లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో కీలక ఉగ్రవాది, మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టినట్లు భారత అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ ఉన్నతాధికారులు, పోలీసులు సిబ్బంది హాజరయ్యారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సు మహిళా ముఖ్యమంత్రి మర్యం నవాజ్ తరఫున అధికారులు పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించిన ఫొటోలు మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో ఉగ్రసంస్థలతో పాక్ ప్రభుత్వ చెలిమి మరోసారి బహిరంగంగా బట్టబయలైంది. ఆ ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల గురించి క్లుప్తంగా..మొహమ్మద్ యూసుఫ్ అజార్ భారతసర్కార్ గతంలో తయారుచేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో 21వ నంబర్‌గా మొహమ్మద్ యూసుఫ్ అజార్ పేరు ఉంది. దాదాపు 50 ఏళ్లకుపైబడిన వయస్సుండే ఇతను జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు బావమరిది. 1999 డిసెంబర్లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఐసీ–814 విమానం హైజాక్ ఉదంతంలో ఇతను కీలక సూత్రధారి. 1998లో అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తిద్వారా తప్పుడు పాస్‌పోర్ట్‌తో భారత్‌లోకి వచ్చాడు. జైషేకు చెందిన బహావల్పూర్ ప్రధాన స్థావరంలో కొత్త ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే బాధ్యతలను యూసుఫ్ చూసుకునేవాడు. యూసుఫ్ కుటుంబం సైతం అదే స్థావరప్రాంగణంలో నివసిస్తోంది. ఇతనికి ఉస్తాద్ జీ, మొహమ్మద్ సలీమ్, ఘోసీ సాహెబ్ వంటి మారు పేర్లు ఉన్నాయి. ఆయుధాలను ఎలా వాడాలో యువతకు శిక్షణ ఇస్తాడు. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులకు పథకరచన చేశాడు. ఇతనికి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ గతంలోనే రెడ్‌నోటీస్ ఇచి్చంది. ఇతడిని తమకు అప్పగించాలని 2002లోనే భారత్ పాకిస్తాన్‌ను కోరింది. అజార్‌ను జమ్మూ జైలు నుంచి తప్పించేందుకు పలుమార్లు ప్లాన్లు వేసి విఫలమయ్యాడు. చివరకు భారత ఎయిర్‌పోర్టులో భద్రతావైఫల్యాలు ఉన్నట్లు పసిగట్టి హైజాక్ ప్లాన్‌ను అమలుచేశాడు. హైజాక్ జరిగిన 26 ఏళ్ల తర్వాత సూత్రధారిని భారతబలగాలు అంతం చేశాయి. హఫీజ్ మొహమ్మద్ జమీల్ఇతను కూడా జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు పెద్ద బావమరిది. యూసుఫ్‌కు ఇతను అన్నయ్య అవుతాడు. జైషేకు చెందిన మర్కాజ్ సుభాన్ అల్లాహ్‌లోని అతిపెద్ద శిక్షణా కేంద్రానికి ముహమ్మెద్ జమీల్ ఇన్చార్జ్గా ఉన్నాడు. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేసి, టెర్రరిస్ట్‌లుగా మార్చాల్సిన ప్రధాన బాధ్యత ఇతనిదే. జైషే ఉగ్రసంస్థలో కీలకమైన వ్యక్తి. జైషే సంస్థ కోసం నిధులను సేకరించడంలోనూ అత్యంత చురుగ్గా ఉంటాడు. ముదస్సార్ ఖదియాన్ ఖాస్ లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో ముదస్సార్ ఖదియాన్ ఖాస్ అత్యంత కీలకమైన వ్యక్తి. ఇతనికి అబూ జుందాల్ అనే మారుపేరు ఉంది. సరిహద్దు నుంచి కేవలం పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిద్కేలోని మర్కాజ్ తైబా ఉగ్రస్థావరానికి ఇతనే సారథ్యం వహిస్తున్నాడు. ముంబైదాడుల్లో ప్రాణాలకు తెగించి పోలీసులు పట్టుకున్న ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఈ స్థావరంలోనే శిక్షణ పొందాడు. మే 7 అర్థరాత్రి తర్వాత భారత దాడుల్లో ఖదియాన్ హతమయ్యాడు. ఈ వార్త తెల్సి పాకిస్తాన్ సైన్యం ఉలిక్కిపడింది. వెంటనే ఇతని అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించింది. లష్కరే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో అంత్యక్రియలు జరిగాయి. ఆర్మీ చీఫ్ మునీర్ తరఫున లెఫ్టినెంట్ జనరల్, పోలీస్‌విభాగం తరఫున పంజాబ్ ప్రావిన్సు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హాజరయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఇతని మృతదేహం వద్ద సైనికవందనం చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. దీంతో పాక్ ఆర్మీ, ఉగ్రసంస్థలకు మధ్య ఉన్న సత్సంబంధాలు ఇతని అంత్యక్రియల వీడియోతో మరోసారి ప్రపంచానికి తెల్సివచ్చాయి. ఖలీద్ అలియాస్ అబూ అకాషా లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కమాండర్ అయిన ఖలీద్ అలియాస్ అబూ అకాషా సైతం ఈ దాడుల్లో హతమయ్యాడు. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులతో ఇతని ప్రత్యక్ష సంబంధం ఉంది. అఫ్గానిస్తాన్ నుంచి లష్కరే తోయిబా కోసం ఆయుధాలను అక్రమంగా తీసుకొచ్చేవాడు. ఇతని అంత్యక్రియలు పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పాక్ ఆర్మీ సీనియర్ అధికారులు, పోలీస్‌విభాగం తరఫున పైసలాబాద్ డెప్యూటీ కమిషనర్ ఈ ఖనన క్రతువులో పాల్గొన్నారు. మొహమ్మద్ హసన్ ఖాన్ జమ్మూకశ్మీర్‌లో వేర్వేరు ఉగ్రదాడులకు సమన్వయం చేయడంలో, సహాయసహకారాలు అందించడంలో మొహమ్మద్ హసన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రస్థావర నిర్వహణ బాధ్యతలను చూసుకునే సీనియర్ ఉగ్రవాది ముఫ్తీ అస్ఘర్ ఖాన్ కశ్మీరీ కుమారుడే ఈ హసన్ ఖాన్.

సరిహద్దుల్లో కాల్పుల మోత
న్యూఢిల్లీ/జమ్మూ/శ్రీనగర్: సరిహద్దుల వెంబడి పాక్ సైన్యం కాల్పులు శనివారం వరుసగా పదహారో రోజు కూడా కొనసాగాయి. దాంతో పశ్చిమ సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లాయి. ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ (పడగొట్టలేని దృఢమైన గోడ) పేరిట శుక్రవారం అర్ధరాత్రి నుంచి జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా సైన్యం భారీ కాల్పులకు పాల్పడింది. సైనిక స్థావరాలతో పాటు సాధారణ జనావాసాలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, హోషియార్పూర్, అమృత్సర్, ఫిరోజ్‌పూర్, తార్న్‌తరన్, హరియాణాలోని సిర్సాలో కాల్పులు, పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. పాక్ కాల్పులను సైన్యం దీటుగా తిప్పికొట్టింది. మన ప్రతిదాడుల భయంతో శనివారం తెల్లవారుజాము 3.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా పాక్ తన గగనతలాన్ని పూర్తిగా మూసేసింది. ప్రభుత్వాధికారి సహా ఆరుగురి మృతి పాక్ కాల్పుల్లో జమ్మూలో ఆరుగురు మరణించారు. 8 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది సహా 20 మంది గాయపడ్డారు. మృతుల్లో రాజౌరీ జిల్లా అభివృద్ధి విభాగం అదనపు కమిషనర్ రాజ్‌కుమార్ థాపా, ఓ సైనికాధికారితో పాటు రెండేళ్ల బాలిక ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పాక్ సైన్యం సామాన్యులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటమే గాక డ్రోన్లు ప్రయోగించిందని పేర్కొన్నారు. జమ్మూ సహా పలు పట్టణాలు, గ్రామాల్లో శుక్రవారం నుంచి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. సైరన్లు నిరంతరాయంగా మోగుతుండడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం ఉదయం 5 గంటలకు భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రాజ్‌కుమార్ థాపా అధికారిక నివాసంపై కాల్పుల్లో ఆయనతో పాటు ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. థాపా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. దాంతో స్థానికంగా విషాదం అలుముకుంది. థాపా శుక్రవారం సైతం విధుల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రితో కలిసి జిల్లావ్యాప్తంగా పర్యటించారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. పాక్ దాడుల్లో రాజౌరీ టౌన్లో ఐషా నూర్ (2), మొహమ్మద్ షోహిబ్(35) మృతిచెందారు. పూంఛ్ జిల్లాలో రషీదా బీ(55) ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయాలపాలయ్యారు. జమ్మూ జిల్లా ఆర్.ఎస్.పురా సెక్టార్లో అశోక్ కుమార్ అనే పౌరుడు విగతజీవిగా మారాడు. పూంఛ్‌లోని కృష్ణఘాటీ సెక్టార్లో బాంబు పేలుడులో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్ అమరుడయ్యాడు. జమ్మూ శివార్లలోని ఖేరీ కేరాన్ గ్రామంలో జకీర్ హుస్సేన్ (45) మరణించాడు. శ్రీనగర్‌లో భారీ పేలుళ్లు శ్రీనగర్ శనివారం పేలుళ్లతో దద్దరిల్లింది. ఉదయం 11.45 గంటల వేళ ఎయిర్‌పోర్టు సమీపంలో రెండు శక్తిమంతమైన పేలుళ్లు సంభవించినట్లు అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అంతకుముందు నగరంలో పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. శ్రీనగర్‌లోని ఓల్డ్ ఎయిర్‌ఫీల్డ్ వైపు దూసుకొచి్చన ఓ డ్రోన్‌ను సైన్యం కూల్చివేసింది. సీఎం ఒమర్ సంతాపం రాజ్‌కుమార్ థాపా మరణం పట్ల జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం ప్రకటించారు. అంకితభావం కలిగిన సీనియర్ అధికారిని కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. జమ్మూలో దాడులు జరిగిన ప్రాంతాల్లో ఒమర్ పర్యటించారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి ప్రజలకు స్థైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.హిమాచల్‌లో డ్రోన్, క్షిపణుల శకలాలు హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం ఉనా జిల్లాలోని బెహాద్ గ్రామంలో శనివారం క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. కాంగ్రా జిల్లా నూర్పూర్లో రెండుచోట్ల డ్రోన్, మిస్సైల్ విడిభాగాలను గుర్తించారు. అవి సైన్యం కూల్చివేసిన పాక్ డ్రోన్లు, క్షిపణుల విడిభాగాలని అంచనా వేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అక్కడ భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సైనిక పోస్టులు, ఉగ్ర లాంచ్ప్యాడ్లు ధ్వంసం జమ్మూ సమీపంలో పాకిస్తాన్ భూభాగంలో సైనిక పోస్టులతో ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ‘‘భారత్‌పై డ్రోన్ దాడులకు ఈ లాంచ్ప్యాడ్లనే వాడారు. ఇవి పాక్‌లోని సియాల్కోట్ జిల్లా లూనీలో ఉన్నాయి’’ అని బీఎస్ఎఫ్ వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ భూభాగం నుంచి జరిగిన కాల్పులకు గట్టిగా బదులిచ్చామని వెల్లడించింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బీఎస్ఎఫ్ పోస్టులే లక్ష్యంగా పాక్ సైన్యం దాడులకు దిగింది. దాంతో పాక్ రేంజర్ల క్యాంపులపై బీఎస్ఎఫ్ విరుచుకుపడింది.మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలుకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూ: పాకిస్తాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సరిహద్దు ప్రాంతాల్లోని వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, జమ్మూ సెక్టార్లపై నాలుగు రోజుల పాటు జరిగిన కాల్పుల్లో జిల్లా అదనపు అభివృద్ధి కమిషనర్ సహా 19 మంది చనిపోయారు. ‘పాక్ వైపు నుంచి జరిగిన కాల్పుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర వేదన కలిగించింది. మా ప్రజలకు కలిగిన నష్టాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటాం. ఆప్తులను కోల్పోయిన వారి వేదనను తగ్గించలేకపోవచ్చు గానీ ఆ కుటుంబాలకు మా వంతు మద్దతుగా రూ.10 లక్షల చొప్పున అందజేస్తాం’అని సీఎం ఒమర్ పేర్కొన్నారు.
ఎన్ఆర్ఐ

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

అమ్మా.. నాన్న క్షమించండి
కర్నూలు: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. అక్క క్షమించు.. అమ్మ నాన్న క్షమించు’ అంటూ ఒక లేఖ రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి ఈడిగ వంశీక్రిష్ణ (29) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలులోని రామచంద్రనగర్‌లో నివాసం ఉంటున్న ఈడిగ వంశీక్రిష్ణ ఎంఎస్సీ వరకు చదువుకున్నాడు. తండ్రి శ్రీనివాసగౌడ్ ఫారెస్ట్ రేంజ్ అధికారి. శ్రీనివాసగౌడ్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి పెద్ద కుమారుడు రాకేష్ గౌడ్ పెళ్లి అయిన 20 రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో కుమారుడు వంశీక్రిష్ణ పెళ్లి కాకుండానే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయంశమైంది. రైలు పట్టాలపై మృతదేహంలా.. వివాహ వేడుకకు ఈనెల 7వ తేదీన వేరే ఊరికి శ్రీనివాసగౌడ్, శ్రీదేవి వెళ్లారు. తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చారు. కుమారుడు వంశీక్రిష్ణ ఇంట్లో లేకపోవడంతో కర్నూలు చుట్టుపక్కల అంతా గాలించారు. ఎండోమెంట్ కాలనీ సమీపంలో అబ్బాస్ నగర్ రైల్వే పట్టాల పక్కన శనివారం వంశీక్రిష్ణ మృతదేహమై కనిపించాడు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు రైల్వే ఎఎస్ఐ కేవీఎం ప్రేమ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్న మృతిని తట్టుకోలేక.. ఈడిగ వంశీక్రిష్ణ అన్న రాకేష్ గౌడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. పెళ్లి అయిన 20 రోజులకే నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి వంశీక్రిష్ణ మానసిక కుంగుబాటుతో బాధపడేవాడు. అన్న మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

‘వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపేస్తా ’
హైదరాబాద్: పెళ్లి చేసుకోవాలని ఓ యువతిని ఒత్తిడి చేయడమే కాకుండా..ఆమె వివాహ నిశ్చితార్థాన్ని చెడగొట్టి.. వేరెవరినైనా పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరించిన యువకుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ జిల్లా బాల్కొండ ప్రాంతానికి చెందిన యువతి (21) నగరంలోని ఓ హాస్టల్లో ఉంటూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. కామారెడ్డిలో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసే శేషుకుమార్ (28) గత తొమ్మిది నెలల క్రితం సదరు యువతిని బస్సులో కలిశాడు. నెల తర్వాత శేషు ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు. దీనికి ఆమె నిరాకరించి స్నేహితులుగా ఉందామని చెప్పింది. ఈ క్రమంలో ఇరువురూ కలిసి ఫొటోలు దిగారు. ఇదిలా ఉండగా తన వివాహ నిశ్చితార్థం ఖరారు అయ్యిందని యువతి స్నేహితులకు చెప్పగా వారి ద్వారా శేషు ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. దీంతో ఈ నెల 6న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బేగంపేట ఫ్లైఓవర్ వద్ద ఆమెను కలుసుకుని ఘర్షణకు దిగాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆమెతో వివాహ నిశ్చితార్థం జరుపుకునే యువకుడి ఫోన్ నెంబర్ తీసుకుని వారిద్దరూ దిగిన ఫోటోలను అతనికి పంపించడంతో పాటు లేనిపోని ఆరోపణలు చేశాడు. దీంతో ఆ నిశితార్థం ఆగిపోయింది. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి పెంచాడు. తనను కాదని వేరే వారిని పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తల్లీబిడ్డను కాటేసిన కరెంట్
నిజాంసాగర్ (జుక్కల్): ఇంట్లోని ఇనుప కూలర్‌కు కరెంట్ సరఫరా కావడంతో తల్లీకూతురు మరణించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద గుల్లా తండాకు చెందిన చవాన్ ప్రహ్లాద్, శంకబాయి (36) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ప్రహ్లాద్ డ్రైవర్‌గా, శంకబాయి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి శంకబాయి, చిన్న కూతురు శ్రీవాణి (12), కుమారుడు ఇంట్లో నిద్రించారు. తల్లి, కూతురు ఒకేచోట ఇనుప కూలర్ ముందర నిద్రించగా, కుమారుడు ప్రతీక్ కొద్ది దూరంలో పడుకున్నాడు. రాత్రి వేళ కూలర్ అడుగు భాగంలోని నీటిలో శ్రీవాణి కాలుపడటంతో కరెంట్ షాక్ సరఫరా జరిగి శ్రీవాణితో పాటు పక్కనే పడుకున్న తల్లి శంకబాయి మృతి చెందింది. ఉదయం నిద్ర లేచిన ప్రతీక్ తల్లి, సోదరి మృతి చెందడాన్ని గమనించి తండా ప్రజలకు చెప్పాడు. సమాచారం తెలుసుకున్న బిచ్కుంద సీఐ నరేశ్, జుక్కల్ ఎస్సై భువనేశ్వర్, ట్రాన్స్‌కో ఏఈ బాలాజీ తండాకు చేరుకున్నారు. ఇనుప కూలర్‌కు కరెంట్ సరఫరా కావడంతోనే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనగనగా ఓ కేసు!
‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిన్ డినైడ్’ అనేది న్యాయశాస్త్ర ప్రాథమిక సూత్రాల్లో ఒకటి. అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ కొన్ని కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మానవ వనరుల లేమి, మౌలిక వసతుల కొరత సహా అనేక కారణాలు దీనికి దోహదం చేస్తున్నాయి. హైదరాబాద్ శివార్లలో ఉన్న కుషాయిగూడ పోలీసుస్టేషన్లో 2001 ఫిబ్రవరిలో నమోదైన ‘భారీ దొంగతనం’ కేసు విచారణ కోర్టులో 24 ఏళ్లు సాగింది. చివరకు 2025 ఏప్రిల్ 2న వీగిపోయింది. ఈ కేసులో పదిమంది నిందితులు ఉండగా, కోర్టు తీర్పు వెలువడే నాటికి ఐదుగురు చనిపోయారు. అది కుషాయిగూడలోని కమలనగర్ ప్రాంతం. అక్కడి శ్రీ సాయి అపార్ట్మెంట్లో ఎ.కృష్ణమూర్తి అనే వ్యాపారి ‘రూప క్లాత్ ఎంపోరియం’ పేరుతో వస్త్ర దుకాణం ఏర్పాటు చేశారు. విక్రయాల కోసం పనివాళ్లను ఏర్పాటు చేసుకోకుండా, స్వయంగా నిర్వహణ బాధ్యతలు చూసుకునే వారు. నాటి వ్యాపార వేళలు నేటికి భిన్నంగా ఉండేవి. సాధారణ రోజుల్లో ఉదయం 9 గంటలకే వస్త్ర దుకాణాలు తెరుచుకునేవి. ఎప్పటిలాగే 2001 ఫిబ్రవరి 16 ఉదయం ఆయన తన షాపు తెరిచారు. ఆ వెంటనే తన దైనందిన కార్యకలాపాల్లో ముగినిపోయారు. ఎప్పుడూ లేని విధంగా ఆ రోజు ఉదయం 11 గంటలకే పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు రావడం ప్రారంభమైంది. దీంతో ఆ రోజు తన పంట పండిందని భావిస్తూ కస్టమర్లకు స్వాగతం పలికారు. అలా వచ్చిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ఎవరికి వారు తమకు కావాల్సిన వస్త్రాలను చూపించాలని కోరడంతో దుకాణం మొత్తం హడావుడి నెలకొంది. అయితే చివరకు కృష్ణమూర్తి ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు.కస్టమర్లు వెళ్లిపోయాక వారికి చూపించడానికి బయటకు తీసిన వస్త్రాలన్నింటినీ కృష్ణమూర్తి సర్దుకోవడం మొదలెట్టారు. అప్పుడు స్టాకులో తేడా రావడాన్ని గమనించి, దుకాణంలో చోరీ జరిగినట్లు గుర్తించారు. షాపు తెరిచిన వెంటనే కొనుగోలుదారులుగా వచ్చిన వాళ్లల్లో ఎవరో తస్కరించినట్లు అనుమానించారు. దుకాణం మూసి బయటకు వెళ్లిన కృష్ణమూర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో వారి ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆయన నేరుగా కుషాయిగూడ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు అధికారి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడంటే ఏదైనా ఓ నేరం జరిగిందని ఫిర్యాదు వచ్చిన వెంటనే సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్, నిందితులు వినియోగించిన సెల్ నెంబర్, ఫోన్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫికేషన్ (ఐఎంఈఐ) నెంబర్ల పైనే పోలీసుల దృష్టి పడుతోంది. సీసీ కెమెరాలు లేని, సెల్ఫోన్లు అంతగా వినియోగంలోకి రాని రోజులు కావడంతో సంప్రదాయ దర్యాప్తు విధానాలతోనే ముందుకు వెళ్లారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నగరంలోని పాత నేరగాళ్ల వివరాల ఆరా తీశారు. ఇలాంటి నేరాలు గతంలో చేసిన వాళ్లు ఎవరెవరు? ప్రస్తుతం వాళ్లు ఎక్కడ ఉన్నారు? తదితర అంశాలపై దృష్టి పెట్టడంతో పాటు వేగులకూ పని చెప్పారు. నేరం జరిగిన తీరును బట్టి వ్యవస్థీకృత నేరగాళ్ల పనిగా భావించారు. ఇలాంటి వాళ్లు పదేపదే నేరాలు చేసే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతంలోని అన్ని వస్త్రదుకాణాల యజమానులను అప్రమత్తం చేశారు. కుషాయిగూడ పోలీసులు తీసుకున్న ఈ చర్య ఫలితాన్ని ఇచ్చింది. రూప క్లాత్ ఎంపోరియంలో చోరీ జరిగిన వారం రోజులకు మరో వస్త్ర దుకాణాన్ని టార్గెట్ చేసిన ముఠాలోని కొందరు ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ షాపులో బేరసారాలు చేయడం మొదలెట్టారు. వీరి వ్యవహారశైలి, వస్త్రధారణ, నేరం చేసే తీరు తదితర అంశాలపై పోలీసులు ప్రచారం చేసి ఉండటంతో ఆ దుకాణం యజమాని గుర్తించాడు. వెంటనే స్థానికుల సహాయంతో పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆ నిందితులను విచారించగా నేరం అంగీకరించారు. రూప క్లాత్ ఎంపోరియంలోకి తమతో పాటు వచ్చి, నేరంలో పాలుపంచుకున్న అనుచరుల వివరాలను బయటపెట్టారు. దీంతో కుషాయిగూడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, మొత్తం పది మందిని అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని లంబాడికుంట తండాకు చెందిన ఈ పదిమంది వ్యాపారి కృష్ణమూర్తి దృష్టి మరల్చి చోరీ చేసినట్లు తేల్చారు. ఆధారాలు సేకరించిన కుషాయిగూడ పోలీసులు న్యాయస్థానంలో అదే నెల 28న అభియోగపత్రాలు దాఖలు చేశారు. కాలక్రమంలో బెయిల్ పొందిన నిందితులు జైలు నుంచి బయటకు రాగా, కొన్నాళ్లకు కేసు విచారణ ప్రారంభమైంది. అనివార్య కారణాల వల్ల 2025 ఏప్రిల్ 2 వరకు దీని విచారణ కొనసాగింది. ఈ కేసు దర్యాప్తు సమయంలో సబ్ ఇన్స్పెక్టర్గా (ఎస్సై) ఉన్న అధికారి పదోన్నతుల తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్పీ) హోదాలో కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఈ కేసుకు సంబంధించి 2001లో నిందితుల కోసం గాలించిన పోలీసులు కొన్నాళ్లకు ఫిర్యాదుదారుడైన కృష్ణమూర్తి, ఇతర సాక్షుల కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. న్యాయస్థానంలో వీరు చెప్పే సాక్ష్యాలు అత్యంత కీలకం. అయితే కేసు విచారణ కీలక దశకు చేరుకునే సరికి కృష్ణమూర్తి తన వ్యాపారం మానేశారు. శ్రీసాయి అపార్ట్‌మెంట్స్‌తో పాటు అప్పట్లో ఆయన నివసించిన ఇంటి వద్దకూ వెళ్లిన పోలీసులు కృష్ణమూర్తి వివరాల కోసం ఆరా తీశారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, కృష్ణమూర్తితో పాటు ఇతర సాక్షుల ఆచూకీ లభించలేదు. ఈ కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడితో (ఏ–1) పాటు మూడు, నాలుగు, ఐదు, పదో నిందితులు చనిపోయారు. మిగిలిన ఐదుగురిపై తుది వరకు విచారణ సాగినా, చివరకు కేసు వీగిపోయింది. ఇన్ని మలుపులు తిరిగిన ఈ కేసులో కృష్ణమూర్తి దుకాణం నుంచి చోరీ అయినవి ఏంటో తెలుసా? ఐదు తానుల కాటన్ వస్త్రం, మూడు లంగాలు, ఒక రవిక ముక్క. కుషాయిగూడ పోలీసు రికార్డుల ప్రకారం అప్పట్లో వీటి విలువ రూ.8 వేలు.
వీడియోలు


శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం


పాకిస్తానీ నటితో చేయను: బాలీవుడ్ హీరో


ముగిసిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు


ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన సమావేశం


బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాక్ కు అడగండి


Miss World Competition: తారలు దిగివచ్చిన వేళ..!


పాక్ ను వణికించిన BRAHMOS


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన


Jana Tantram: కాల్పుల విరమణ వ్యవహారంలో ట్రంప్ పాత్రపై ఆసక్తికరం


పాక్ వైమానిక కీలక స్థావరాలను లక్ష్యంగా విరుచుకుపడ్డ బ్రహ్మోస్