Fraud Case
-
కోట్లాది రూపాయల స్కాంలో 'పుష్ప 2' డబ్బింగ్ ఆర్టిస్ట్
సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. తాజాగా ప్రముఖ నటుడు శ్రేయస్ తల్పడే అలానే దొరికిపోయాడు. హిందీలో పలు చిత్రాల్లో నటించిన ఇతడు.. పుష్ప 2 హిందీ వెర్షన్ అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పాడు. ఇప్పుడు ఇతడిపై పోలీసులు కేసు పెట్టారు. ఇంతకీ ఏంటి విషయం?ఉత్తరప్రదేశ్ మహోబ జిల్లాలో చిట్ ఫండ్ పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసిన కేసులో నటుడు శ్రేయస్ తల్పడేతో పాటు మరో 14 మందిపై కేసు పెట్టారు. దాదాపు పదేళ్ల నుంచి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అర్బన్ మల్టీస్టేట్ క్రెడిట్ అండ్ థ్రిఫ్ట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కంపెనీతో శ్రేయాస్ కి సంబంధం ఉందని అంటున్నారు. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)పలువురు గ్రామస్థుల దగ్గర అధిక వడ్డీ ఆశ చూపించి కోట్లాది రూపాయలని ఈ కంపెనీ వసూలు చేసిందని, రూపాయి పెడితే రెండు రూపాయలు ఇస్తామని చెప్పి ఈ మోసానికి పాల్పడ్డారట. ఇప్పటికే ఏజెంట్లతో పాటు సదరు కంపెనీ బోర్డ్ తిప్పేసినట్లు తెలుస్తోంది.ఇదే కాదు గత నెలలోనూ శ్రేయస్ పై ఇలాంటి కేసు నమోదైంది. దాదాపు రూ.9 కోట్లని పెట్టుబడి దారుల దగ్గర నుంచి తీసుకుని తిరిగి ఇవ్వలేదని గోమతి నగర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతకు ముందు హర్యానాలోని సోనిపట్ లోనూ శ్రేయస్ పై మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్ లో కేసు నమోదైంది.(ఇదీ చదవండి: గాయం నుంచి కోలుకోని రష్మిక.. ఇప్పుడెలా ఉంది?) -
సోనుసూద్‌ను అరెస్ట్ చేయండి.. కోర్టు ఆదేశాలు
పాటియాలా: ప్రముఖ నటుడు సోనుసూద్‌కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది పంజాబ్‌లోని లూథియానా కోర్టు. ఈ మేరకు సోనుసూద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో కోర్టు ఇలా ఆదేశించింది.వివరాల ప్రకారం.. నటుడు సోనుసూద్ (Sonu Sood)కు లూథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా, లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూసూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై విచారణ చేపట్టిన లూథియానా కోర్టు.. సోనుసూద్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.పిటిషన్‌పై విచారణ అనంతరం..‘సోనుసూద్‌కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరుకాలేదు. వెంటనే అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి అని ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది. ఇక, సోనుసూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోనుసూద్ తెలుగు సహా బాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.Ludhiana’s Judicial Magistrate Ramanpreet Kaur has issued an arrest warrant against Bollywood actor Sonu Sood.The warrant was issued after Sonu Sood failed to appear in court to testify in a ₹10 lakh fraud case involving the fake Rijika coin. The case was filed by… pic.twitter.com/yZ5R3gk32p— Gagandeep Singh (@Gagan4344) February 6, 2025 -
డొనాల్ట్ ట్రంప్ ఓడిపోయి ఉంటేనా..
అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించడానికి ఇంకో వారం మాత్రమే ఉంది. ఈలోపు ఆయనకు సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ట్రంప్ గనుక ఓడిపోయే ఉంటే.. ఆయనకు కచ్చితంగా శిక్ష పడేదని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ మంగళవారం ఓ నివేదిక రిలీజ్ చేసింది.స్పెషల్ కౌన్సెల్ జాక్ స్మిత్(Jack Smith) నివేదిక ప్రకారం.. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఉద్దేశపూర్వకంగానే ఆయన అసత్య ప్రచారాలకు దిగారని, తద్వారా శాంతియుతంగా అధికార మార్పిడికి భంగం కలిగించారని అభియోగాలు నమోదయ్యాయి. దీనిని తీవ్ర నేరంగా స్పెషల్ కౌన్సల్ జాక్ స్మిత్ పరిగణించారు. అంతేకాదు.. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థను తన అబద్ధాలతో ట్రంప్ భ్రష్టు పట్టించే యత్నమూ చేశారనే పేర్కొన్నారు. ట్రంప్‌పై అభియోన్నింటికి సరైన ఆధారాలున్నాయి. ఒకవేళ ట్రంప్ కిందటి ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో గనుక ఓడిపోయి ఉంటే.. ఈ నేరాలకుగానూ కచ్చితంగా శిక్ష పడేది అని ఆ నివేదిక స్పష్టం చేసింది.అయితే అర్ధరాత్రి విడుదలైన ఈ నివేదికను ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ తప్పుబట్టారు. జాక్ స్మిత్‌ను తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉంటే.. 2020 ఎన్నికల వ్యవహారంపై గతంలో ట్రంప్ మీద స్మిత్ అనేక ఆరోపణలను నమోదు చేశారు. ట్రంప్‌పై నమోదైన రెండు ఫెడరల్ క్రిమినల్ కేసులను ఆయనే పర్యవేక్షించారు.అయితే ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడంతో ఆయన రాజీనామా చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజాగా ఆయన ట్రంప్‌పై పెట్టిన అన్ని కేసులను ఉపసంహరించుకున్నారు. అంతేకాదు.. తన నివేదిక బహిర్గతం అయ్యే సమయంలోనే తన పోస్టుకు సైతం రాజీనామా చేయడం గమనార్హం. -
బ్యాంకులో రూ.558 కోట్ల దొంగతనం!
ఖాతాదారులకు చెందిన సేఫ్ డిపాజిట్ బాక్స్‌ల నుంచి ఒక బిలియన్ యెన్ (సుమారు 6.6 మిలియన్ డాలర్లు-రూ.558 కోట్లు) సొమ్మును బ్యాంకు ఉద్యోగి దొంగలించినట్లు జపాన్‌లోని ప్రముఖ బ్యాంకు మిత్సుబిషి యుఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్ తెలిపింది. అందుకుగాను అధికారికంగా కస్టమర్లకు క్షమాపణలు చెప్పింది. 60 మంది క్లయింట్ల్లో సుమారు 20 మంది ఖాతాల్లో నుంచే 300 మిలియన్ యెన్ (దాదాపు 2 మిలియన్ డాలర్లు-రూ.169 కోట్లు) వరకు దొంగతనాలు జరిగినట్లు ధృవీకరించింది. కస్టమర్లు కోల్పోయిన నగదు పరిహారం కోసం కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: కొత్త సార్ ముందున్న సవాళ్లు!ఎంయూఎఫ్‌జీ ప్రెసిడెంట్, సీఈఓ జునిచి హంజావా విలేకరులతో మాట్లాడుతూ..‘టోక్యోలోని మిత్సుబిషి యుఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్ బ్యాంకు శాఖల్లో ఈ దొంగతనాలు జరిగాయి. ఏప్రిల్ 2020 నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు ఈమేరకు ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించాం. సేఫ్ డిపాజిట్ బాక్స్‌లను ఓ మహిళా ఉద్యోగి నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన కీ తనవద్దే ఉంటుంది. ఆ ఉద్యోగి డబ్బు తీసుకున్నట్లు, ఇతర పెట్టుబడులు, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు అంగీకరించింది. వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి విచారణ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశాం. జరిగిన దొంగతనానికి క్షమాపణలు కోరుతున్నాం. నగదు నష్టపోయిన కస్టమర్లకు పరిహారం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు. -
బ్యాంకులో రూ.6.5 కోట్లు మోసం.. అధికారులు ఏమన్నారంటే..
హైదరాబాద్‌లోని బేగంపేట యాక్సిస్ బ్యాంకులో ఇటీవల రూ.6.5 కోట్ల ఘరానా మోసం జరిగినట్లు వచ్చిన కథనాలపై బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించారు. ఎన్ఆర్ఐ బ్యాంకు కస్టమర్ పరితోష్ ఉపాధ్యాయ్ ఖాతా వివరాలు ఉపయోగించి బ్యాంకు సిబ్బంది అనధికారికంగా పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఈమేరకు బ్యాంకు సిబ్బందిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.‘పరితోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు యాక్సిస్ బ్యాంక్ అధికారులపై క్రిమినల్ అభియోగాలు నమోదైనట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు సదరు లావాదేవీలన్నీ పరితోష్కి పూర్తిగా తెలిసే జరిగాయి. యాక్సిస్ బ్యాంక్ సిబ్బందిపై ఆయన ఆరోపణలు నిరాధారమైనవి. ఈ విషయం సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా బ్యాంకు విచారణకు పూర్తి సహకారం అందిస్తుంది. బ్యాంకుపై గానీ, అధికారులపై గానీ తప్పుడు లేదా తమ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రకటనలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు బ్యాంకునకు పూర్తి హక్కులు ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్ ఎల్లప్పుడూ తమ కస్టమర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోంది’ అని ఉన్నతాధికారులు తెలిపారు.ఇదీ చదవండి: సహోద్యోగులతో పంచుకోకూడని అంశాలు..అసలేం జరిగిందంటే..ఆస్ట్రేలియాకు చెందిన పరితోష్ ఉపాధ్యాయ్‌కు బేగంపేటలోని యాక్సిస్ బ్యాంకులో 2017 నుంచి ప్రీమియం అకౌంట్ ఉంది. ఇటీవల అకౌంట్ క్లోజ్ అయిన విషయంపై పరితోష్‌కు మెయిల్ రావడంతో అతను వివరాలు ఆరా తీశారు. తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం అయిన విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. ఆన్లైన్ ద్వారా బ్యాంకు స్టేట్మెంట్ అడిగితే సిబ్బంది నిరాకరించినట్లు ఉపాధ్యాయ్ తెలిపారు. వెంటనే తన న్యాయవాది సాయంతో పంజగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బేగంపేట యాక్సిస్ బ్యాంకులోని కొంతమంది సిబ్బంది తన పేరుతో మొత్తం 42 నకిలీ చెక్కులను తయారు చేశారని ఉపాధ్యాయ్ తెలిపారు. -
ఏ బుర్రలో ఎన్ని పాములుంటాయో?
ఇదేమిటబ్బా.. ‘ఏ పుట్టలో ఏ పాముంటుందో?’ అనేది కదా సామెత! ఇక్కడేదో తేడా కొడుతోందే అనుకుంటున్నారు కదా? సామెత అదే గానీ.. ఇప్పుడు రోజులు మారిపోయాయి. మోసకారి బతుకులు బతికే వారి బుర్రల్లో రకరకాల విషనాగులు, అనకొండలు, ర్యాటిల్ స్నేక్ లు రకరకాల పాములు.. అనేక రకాల టక్కుటమారాల మాయోపాయాల రూపంలో దాగి ఉంటున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే.. ఎవడితో ఫోటో దిగాలన్నా సరే.. కూసింత సెలబ్రిటీ స్టేటస్ ఉండే వాడు వణికి చచ్చిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కంగారు పుడుతోంది. ఇక్కడ కట్ చేసి ఒక పాత ముచ్చట చెప్పుకుందాం..నాకు తెలిసి సినీ రంగంలో చాలా పెద్దాయన ఉండేవాడు. చాలా అంటే చాలా అన్నమాట. సొంత బ్యానర్ మీద సినిమాలు తీసినా కూడా.. ఎన్నడూ ఆ సినిమా కోసం బయటి కార్యక్రమాలకు రాలేనంత పెద్దాయన. ఆయన సినిమాలకు రాష్ట్రంలో ఏవైనా సంస్థలు అవార్డులు ప్రకటిస్తే.. ఆ సమాచారం పెద్దాయనకు వెళ్లిన వెంటనే.. ‘థాంక్యూ’ అనే పదం వచ్చేది కాదు. అసలు ఆ అవార్డు తాము తీసుకోవాలా వద్దా? అనే మేధోమధనం చేసేవాళ్లు.. తన అనుంగు సహచరులతో కలిసి! తన డికెష్టీలను పరిశోధన కోసం పంపేవాళ్లు. ఆ సంస్థ ఎలాంటిది? దాని సారధులు ఎలాంటి వాళ్లు? వారి పుట్టుపూర్వోత్తరాలు, పుట్టుమచ్చలు ఏమిటి? అన్నీ ఆరా తీసేవాళ్లు.అంతా తేలిన తర్వాత.. ఆ అవార్డు తీసుకోవాలా వద్దా? తీసుకోదలచుకుంటే.. తాను వెళ్లాలా? తన ప్రతినిధులు వెళ్లాలా? అనేది ఆ పెద్దాయన డిసైడ్ అయ్యేవాళ్లు! అవార్డు ఇస్తానన్నారు కదా అని ఎగబడి వెళ్లి తీసేసుకుంటే.. తనతో దిగిన ఫోటోలను అవతలి వాళ్లు మార్కెట్ చేసేసుకుని.. లాభపడిపోతారేమో అని ఆ పెద్దాయనకు భయం. అంత అతిజాగ్రత్త అన్నమాట. ఈ ముచ్చట మొత్తం కొన్ని దశాబ్దాల కిందటిది. ఇప్పుడు ఆయన లేరు. కానీ అప్పట్లో ఆయన పాటించిన జాగ్రత్తలు మాత్రం అందరికీ అవసరమేమో అనిపిస్తున్నది. ఇక్కడ కట్ చేసి అసలు సంగతిలోకి వద్దాం..విశాఖకు చెందిన తొనంగి కాంతిదత్ అనే కుర్రాడున్నాడు. పదో తరగతి ఫెయిలయ్యాడు. సెలబ్రిటీలతో కార్యక్రమాలు నిర్వహించడం వారితో ఉన్న ఫోటోలు పరిచయాలను ప్రచారానికి వాడుకుని.. వారందరూ తనకు భాగస్వాములని, తన వ్యాపారాల్లో బినామీలుగా పెట్టుబడులు పెట్టారని చెప్పుకుంటూ.. ఇతరుల నుంచి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించడం.. అంతా అయిన కొన్నాళ్లకు ఆ వ్యాపారం బోర్డు తిప్పేయడం అనే టెక్నిక్ ను కనుగొన్నాడు.ఊళ్లమీదికొచ్చి చేయి చూసి జాతకం చెప్పే, సిగలో ఈకలు దూర్చుకున్న కొండదొర.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేషూ, నాగార్జునలతో దిగిన ఫోటోలని చూపించి డప్పు కొట్టుకున్నట్టే అన్నమాట! ఈ ప్రబుద్ధుడు ముందు విశాఖలో పింక్ థాన్ అనే కార్యక్రమం పేరుతో సెలబ్రిటీలు చాలా మంది అక్కడికొచ్చేలా ప్లాన్ చేశాడు. హైదరాబాదులో సస్టెయినబుల్ కార్ట్ అంటూ ఓ దుకాణం తెరిచాడు. ఓ సెలబ్రిటీతో రెండు కోట్లు పెట్టుబడి పెట్టించాడు. అందులో గందరగోళాలు గమనించి ఆమె త్వరగానే తప్పుకున్నారు.తర్వాత హైదరాబాదులో చైన్ ఆఫ్ హోటల్స్ ప్రారంభించి.. ఓ మాజీ మంత్రి, ఓ సినిమా ఫ్యామిలీ తన వాటాదారులని నమ్మించి ఇతరులతో కోట్లు పెట్టుబడి పెట్టించాడు. ఆ రెండు దుకాణాలను ఎత్తేసి.. తృతీయ జువెలర్స్ అంటూ కొత్త దందా మొదలెట్టాడు. సినీ నటి అందులో పార్టనర్ అని చెప్పుకుని.. ఇతరులతో మరికొన్ని కోట్లు పెట్టుబడి పెట్టించాడు. తీరా ఒకటి రెండు వ్యవహారాలు పోలీసు గడప తొక్కగానే ప్రస్తుతం కటకటాల్లో ఉన్నాడు.కట్ చేస్తే.. జనం ఇంత సులువుగా ఎలా మోసపోతున్నారనేది ఆలోచించాల్సిన సంగతి. అలాగే సెలబ్రిటీలు ఎవరికైనా తమకు పుట్టుపూర్వోత్తరాలతో సహా తెలియని వ్యక్తులు వచ్చి కార్యక్రమాలకు, అవార్డులకు పిలిస్తే వెళ్లడానికి భయపడాల్సిన పరిస్థితి. ఏ అవార్డు పుచ్చుకుంటే.. ఆ ఫోటోలతో ఎవరెలాంటి కొత్త మోసాలను ప్లాన్ చేస్తుంటారో ఎవ్వరికీ బోధపడని ఆధునిక రోజులు. సైబర్ మోసాల ద్వారా.. అమాయకులైన పేద ప్రజలు అకౌంట్లలో ఉన్నదంతా ఊడ్చుకుపోయేలా మోసపోవడం చాలా చూస్తున్నాం. ఇప్పుడిలా సెల్రబిటీలు మోసపోయే వారు కొందరు.. మోసాల క్రీడలో తాము పావులుగా మారుతున్నవారు మరికొందరు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు. ఇలాంటివి మరికొన్ని జరిగితే.. ఎవరు ఏ అవార్డు ఆఫర్ చేసినా, గెస్టుగా పిలిచినా.. సెలబ్రిటీలు.. ముందు చెప్పుకున్న పెద్దాయన సిద్ధాంతాన్ని ఫాలో అయి.. వంద ఆలోచిస్తారేమో మరి!-ఎం. రాజేశ్వరి. -
అదానీపై కేసు ఎఫెక్ట్.. రూ.6,216 కోట్ల డీల్ రద్దు?
అదానీ గ్రూప్‌తో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃపరిశీలిస్తామని కెన్యా ప్రకటించింది. కెన్యాలో విమానాశ్రయ అభివృద్ధితోపాటు ఎనర్జీ ప్రాజెక్ట్‌ల విస్తరణ కోసం అదానీ గ్రూప్ గతంలో ఒప్పందం చేసుకుంది. ఇటీవల అదానీ సంస్థలపై చెలరేగుతున్న నేరాభియోగాల వల్ల కెన్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఉదంతం నుంచి కోలుకుని, క్రమంగా పుంజుకున్న అదానీ గ్రూప్‌నకు మళ్లీ షాక్ తగిలింది. భారత్‌లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లు పొందేందుకు దాదాపు రూ.2,200 కోట్లు (సుమారు 265 మిలియన్ డాలర్లు) లంచాలు ఇచ్చినట్లు అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ అధినేత గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై మోసం, లంచం, అవినీతి కేసులు నమోదయ్యాయి.ఇదీ చదవండి: సోలార్ ఎనర్జీ తయారీ 20 రెట్లు వృద్ధి: ఐఎస్ఏ నివేదికఈ నేపథ్యంలో కెన్యా అధ్యక్షుడు విలియం రుటో ప్రకటన విడుదల చేశారు. కెన్యాలో విమానాశ్రయాలు, పవర్ ట్రాన్స్మిషన్లైన్ల విస్తరణకు అదానీ గ్రూప్‌తో గతంలో చేసుకున్న ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు చెప్పారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశాక దీనిపై పునరాలోచిస్తామన్నారు. ఈ డీల్ విలువ 736 మిలియన్ డాలర్లు(రూ.6216 కోట్లు). ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించారు. -
తస్మాత్ జాగ్రత్త! రియల్టీ సంస్థల నయా మోసం
ప్రీలాంచ్, సాఫ్ట్ లాంచ్ పేర్లతో స్థిరాస్తి కొనుగోలుదారులు, పెట్టుబడిదారులను మోసం చేస్తున్న రియల్టీ సంస్థలు..తాజాగా బై బ్యాక్ స్కీమ్‌కు తెరలేపాయి. ముందస్తుగా కొంత మేర కంపెనీలో డిపాజిట్ చేస్తే ప్రతీ నెలా అధికంగా వడ్డీ చెల్లించడంతో పాటు కొంత స్థలం లీజు డీడ్ చేసిస్తామని మోసం చేయడం ఈ స్కీమ్ స్కామ్. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 120 మంది బాధితుల నుంచి రూ.24 కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేశారు. స్క్వేర్స్ అండ్ యార్డ్స్ ఇన్ఫ్రా, యాడ్ అవెన్యూస్ కంపెనీలకు చెందిన నలుగురు ప్రతినిధులను సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. డీసీపీ కె.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన బైర చంద్రశేఖర్, విజయవాడకు చెందిన వేములపల్లి జాన్వీ, రెడ్డిపల్లి కృష్ణ చైతన్య, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు చెందిన గరిమెల్ల వెంకట అఖిల్ నలుగురు కలిసి డైరెక్టర్లుగా పేర్కొంటూ కూకట్‌పల్లిలోని మంజీరా ట్రినిటీ మాల్లో స్క్వేర్స్ అండ్ యార్డ్స్ ఇన్ఫ్రా, యాడ్ అవెన్యూస్ పేర్లతో రెండు స్థిరాస్తి సంస్థలను ఏర్పాటు చేశారు. నెలకు అధిక వడ్డీ చెల్లిస్తామంటూ కస్టమర్లకు, పెట్టుబడిదారులకు ఆశ పెట్టారు. రూ.17 లక్షలు డిపాజిట్ చేస్తే వంద నెలల పాటు ప్రతీ నెలా రూ.20 వేల వడ్డీ చెల్లిస్తామని, అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలోని తిరుమలగిరిలో 267 గజాల వ్యవసాయ భూమిని రిజిస్టర్ చేసి ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ భూమిలో శాండల్‌వుడ్ చెట్లను పెంచుతామని, 13–15 ఏళ్ల తర్వాత ఈ చెట్లను విక్రయించగా వచ్చిన సొమ్ములో 50 శాతం లాభాలను కూడా అందిస్తామని ఆశ పెట్టారు.బాధితులను నమ్మించేందుకు లీజు డీడ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ), చెక్‌లను అందించారు. కొన్ని నెలల పాటు వడ్డీ చెల్లించి, ఆ తర్వాత చెల్లించడం మానేశారు. వడ్డీలు చెల్లించకపోవడంతో కస్టమర్లు ఆఫీసుకు రావడం మొదలుపెట్టారు. దీంతో నిందితులు కూకట్పల్లి నుంచి జూబ్లీహిల్స్‌కు కార్యాలయాన్ని మార్చి, తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు కార్యాలయ జాడను బాధితులు పట్టేయడం, చెల్లించిన సొమ్ము తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి చేయడంతో నిందితులు రాత్రికి రాత్రే ఆఫీసుకు తాళం వేసి పరారయ్యారు. దీంతో కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన అల్లం నాగరాజు ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఠాణాలో తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999 కింద కేసులు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.ఇదీ చదవండి: ‘నా పెళ్లి కోసం అన్నయ్య పెళ్లి వాయిదా’కష్టపడి పొదుపు చేయాలకున్న సొమ్మును ఇలా ఎలాంటి నియంత్రణ ఆధ్వర్యంలోలేని కంపెనీల్లో పెట్టుబడి పెట్టి మోసపోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చే ఈక్విటీ మార్కెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఈటీఎఫ్..వంటివి ఎంచుకోవాలని చెబుతున్నారు. ప్రధానంగా ఎలాంటి నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలోని లేని కంపెనీలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. -
మరో స్టార్ కొరియోగ్రాఫర్‌పై చీటింగ్ కేసు
టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇప్పటికే రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాపై చీటింగ్ కేసు నమోదైంది. ఇతడి భార్యతో పాటు మరో ఐదుగురి కలిసే తనని మోసం చేశారని 26 ఏళ్ల డ్యాన్సర్.. ముంబైలోని మీరారోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)ఫిర్యాదు ప్రకారం.. డ్యాన్సర్ టీమ్ 2018-24 మధ్యలో టీవీ షోలో విజేతగా నిలిచింది. వీళ్ల గెలుచుకున్న రూ.11.96 కోట్ల ప్రైజ్‌మనీని రెమో డిసౌజా తదితరులు తదమే అన్నట్లు బిల్డప్ ఇచ్చి మరీ లాక్కున్నారు. రెమో డిసౌజాతో పాటు అతడి భార్య లీజెల్ డిసౌజా, ఓం ప్రకాశ్ శంకర్ చౌహాన్, రోహిత్ జాదవన్, ఫ్రేమ్ ప్రొడక్షన్ కంపెనీ, వినోద్ రౌత్, రమేశ్ గుప్తా ఉన్నారు.వీళ్లపై డ్యాన్సర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు.. రెమో డిసౌజాతో పాటు మరో ఆరు మందిపై 465 (ఫోర్జరీ), 420 (మోసం) సహా ఇతర సెక్షన్ల కింద కేసు మోదు చేశారు. ఇకపోతే రెమో డిసౌజా కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. పలు డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించాడు. ఫ్లయింగ్ జాట్, ఏబీసీడీ ఫ్రాంచైజీ, సల్మాన్ ఖాన్ 'రేస్ 3' సినిమాలతో దర్శకుడిగానూ అలరించాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'హ్యాపీ' త్వరలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఏదేమైనా స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యిండి ఇలా చీటింగ్ చేయడం ఏంటని విమర్శలు వస్తున్నాయి.(ఇదీ చదవండి: ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్ ఖాన్) -
ఐసీఐసీఐ బ్యాంకులో ఫ్రాడ్.. రెండోరోజు విచారిస్తున్న సీఐడీ
సాక్షి,పల్నాడుజిల్లా: చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో జరిగిన అక్రమాలపై సీఐడీ అధికారులు రెండోరోజు శుక్రవారం(అక్టోబర్11)విచారణ చేపట్టారు.ఇవాళ మరికొంత మంది ఖాతాదారుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఖాతాదారులు చెప్పిన అంశాల ఆధారంగా బ్యాంకు శాఖల్లో సీఐడీ రికార్డులను పరిశీలిస్తోంది.ఫిక్స్డ్ డిపాజిట్లు,బంగారు ఆభరణాలపై రుణాలు,ఇతర దేశాల నుంచి వచ్చిన నగదు తదితర అంశాలపై విచారిస్తున్నారు.బ్యాంకు శాఖల్లో అక్రమాలకు ఇప్పటి వరకు 72 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ప్రతిరోజు కొంతమంది ఖాతాదారులను పిలిచి సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.కాగా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసినట్లు అక్రమాలు వెలుగు చూడడంతో బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది.ఇదీ చదవండి: రూ.229 కోట్ల మోసం.. ఇద్దరి అరెస్టు -
హైదరాబాద్‌లో భారీ మోసం.. రూ. 700 కోట్లతో బోర్డు తిప్పేసిన కంపెనీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ మోసం వెలుగుచూసింది. రూ.700 కోట్ల రూపాయలు కాజేసిన ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ.. DKZ టెక్నాలజీస్ సంస్థ ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించింది. అయితే లాభాలు పక్కన పెడితే అసలుకే టోపి పెట్టింది. మొత్తం 700 కోట్ల రూపాయలు దండుకొని చేతులెత్తేసింది.మూడు రాష్ట్రాల్లో 55 వేల మందికి పైగా బాధితులు ఉండగా.. హైదారాబాద్ వ్యాప్తంగా 18 వేల మంది బాధితులు ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. దీంతో మీడియాకు తమ గోడు వెల్లబుచ్చేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు వందలాది బాధితులు చేరుకుంటున్నారు.కాగా తమ కంపెనీపై నమ్మకం కలిగించేందుకు సంస్థ తొలుత ఇన్వెస్టర్లకు లాభాలు చూపించింది. ఇన్వెస్ట్ చేసిన కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్ల అకౌంట్లో డబ్బులు జమ చేశారు కేటుగాళ్లు.సోషల్ మీడియా ఇన్ల్ఫ్యూయెన్సర్లతో కూడా ప్రమోషన్లు చేయించారు. లాభాలు వస్తుండటంతో.. అప్పు చేసి, గోల్డ్ అమ్మి మరీ బాధితులు పెట్టుబడులు పెట్టారు. చివరికి 700 కోట్ల రూపాయల వరకు దండుకుని మోసగాళ్లు పరారయ్యారు. అయితే బాధితుల్లో ఒకే వర్గానికి చెందిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు. -
మార్గదర్శి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీం కోర్టులో మార్గదర్శికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగానూ నిజాలు నిగ్గు తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తూ తీర్పు ఇచ్చింది. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. ‘‘డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీసు ఇచ్చి.. ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా? అనేది తెలుసుకోవాలి. ఇందుగానూ హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలి. .. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టే అనుమతి ఇచ్చాం. మేము మెరిట్స్‌లోకి వెళ్ళడం లేదు. మేము తెలంగాణ హై కోర్టుకు రిఫర్ చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి. ఆర్ బీఐ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి.తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఆర్బీఐ, అలాగే.. ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి.ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం. తెలంగాణ హైకోర్టు లో వాదనలు వినిపించండి’’ అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు ద్వారా స్పష్టం చేసింది. ఏపీ వాదనలు: కేసు నడుస్తుండగా రూ,2,300 కోట్లు అదనపు డిపాజిట్లు సేకరించారు ఏపీ తరఫున వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలి మార్గదర్శి వాదనలు: 2.7 లక్షల డిపాజిటర్లు ఉన్నారు అందరికీ డబ్బు తిరిగి చెల్లించాము సుప్రీం కోర్టులో ఉండవల్లి.. ‘‘రామోజీ రావు అంటే అందరికీ భయం.. రామోజీ రావుకు నేనంటే భయం’’. ‘ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉంది’ : రామోజీ తరఫు న్యాయవాదులు ‘‘అయితే ఎంటీ... ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేం’’: సుప్రీం కోర్టు తీర్పు తర్వాత సాక్షి టీవీతో ఉండవల్లి మాట్లాడుతూ.. తన 17 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘సుప్రీం కోర్టు తీర్పుతో మా వాదన నిజమే అని రుజువైంది. దేశంలో న్యాయం బతికే ఉందని తేటతెల్లమైంది. మార్గదర్శి డిపాజిట్లు సేకరించడమే నేరం. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటే చెల్లదు. 45Sకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడమే చట్టవిరుద్ధం. చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణకు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. మా తరఫున సుప్రీంకోర్టు మార్గదర్శిని అనేక ప్రశ్నలు అడిగింది. ఈ కేసు గురించి నేను మాట్లాడకుండా చేయాలన్న రామోజీరావు ప్రయత్నం విఫలమయ్యింది. ఆఖరికి.. నాపై గ్యాగ్ ఆర్డర్ తేవాలని ప్రయత్నం చేశారు. కానీ, నా పోరాటం వృథా కాలేదు’’ అని ఉండవల్లి పేర్కొన్నారు. నేపథ్యం ఇదే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి, దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్నది రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఉన్న ప్రధాన అభియోగం. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ 2006లో మార్గదర్శి రూ.2,300 కోట్ల డిపాజిట్లను సేకరించిదని ఉండవల్లి అప్పట్లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చర్యలకు సిద్ధమైన అప్పటి ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ క్రమంలో 2008లో ప్రభుత్వం తరఫున కంప్లైంట్ దాఖలు అవ్వగా.. దాన్ని కొట్టివేయాలంటూ పదేళ్ల తరువాత మార్గదర్శి సంస్థ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 31 మార్గదర్శిపై క్రిమినల్ కేసును కొట్టి వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో చట్టాన్ని తప్పుదోవ పట్టించి మార్గదర్శిపై క్రిమినల్ కేసు కొట్టివేశారని, ఆ తీర్పును సమీక్షించాలని 2019లో ఉండవల్లి సుప్రీం కోర్టులో ఆశ్రయించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను భాగస్వామ్యం చేయాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు కూడా. అప్పటి నుంచి ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. గత విచారణే కీలకం మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని గత విచారణలో(ఫిబ్రవరి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. సెక్షన్ 45-Sకి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని, మార్గదర్శి కూడా ఇలాగే డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు.. కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంకోవైపు.. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా.. లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా.. లేదా? అన్నదే ముఖ్యమని అరుణ్ కుమార్ వాదించారు. -
రూ.వేలల్లో ఇచ్చి రూ.కోట్లల్లో కొట్టేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: ‘పిగ్ బుచ్చరింగ్’... తరహాకు చెందిన ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్ ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిపోయాయని నగర సంయుక్త పోలీసు కమిషనర్ (నేరాలు) ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ స్కామ్స్‌లో మోసపోతున్న వారిలో చార్టెడ్ అకౌంటెంట్లు, ఏళ్లుగా ట్రేడింగ్ చేస్తున్న నిపుణులతో పాటు విద్యాధికులు ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో ప్రతి రోజూ కనిష్టంగా నాలుగు కేసులు నమోదు అవుతున్నట్లు తెలిపారు. ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ జరుగుతున్న విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అదే పంథా ఇక్కడ అమలు... మాంసం వ్యాపారులు పంది బక్కపలుచగా ఉన్నప్పుడు దాన్ని వధించరు. కొన్నాళ్లపాటు దానిని మేపడం ద్వారా బలిష్టంగా చేసి ఆపై మాంసంగా మారుస్తారు. పిగ్ బుచ్చరింగ్గా పిలిచే ఈ విధానాన్నే ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్ చేసే నేరగాళ్లు అనుసరిస్తున్నారు. ట్రేడింగ్ పేరుతో వివిధ రకాలైన సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్రకటనలు గుప్పిస్తున్న నేరగాళ్లు పలువురిని ఆకర్షిస్తున్నారు. ఇలా తమ వల్లోపడిన వారికి పూర్తి నమ్మకం కలగడం కోసం కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేయిస్తున్నారు. వీటి ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ తదితర గ్రూపుల్లో వారికి సభ్యులుగా చేస్తున్నారు. ఆపై ప్రత్యేక లింకుల ద్వారా తమ యాప్స్ టార్గెట్ చేసిన వారి ఫోన్లలో డౌన్లోడ్ చేయిస్తున్నారు. దీని డ్యాష్‌బోర్డ్‌లో సదరు వ్యక్తి ఎంత పెట్టుబడి పెట్టారు? ఎంత లాభం వచి్చంది? మొత్తం ఎంతకు పెరిగింది? తదితరాలు కనిపిస్తూ ఉంటాయి. తొలినాళ్లల్లో వాళ్లు పెట్టిన పెట్టుబడికి రూ.వేలల్లో లాభాలు ఇచ్చి పూర్తిగా నమ్మిస్తారు. ఆపై పెట్టుబడి మొత్తాన్ని రూ.లక్షలు, రూ.కోట్లకు పెంచేలా చేస్తారు. ఆ గ్రూపుల నిండా ‘లాభాలే’... ఈ ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్‌కు సంబంధించిన యాప్‌ల్లో కొన్ని ప్రముఖ సంస్థల పేర్లతో, వాటి లోగోలతో ఉంటుండటంతో బాధితులు తేలిగ్గా మోసపోతున్నారు. వీరు సభ్యులుగా ఉండే గ్రూపులకు ప్రీమియం, వీఐపీ లాంటి పేర్లు పెడతారు. వీటిలో అత్యధికులు సైబర్ నేరగాళ్ల అనుచరులే సభ్యులుగా ఉంటారు. వారు ప్రతి రోజూ తనకు ఇంత మొత్తం లాభం వచి్చంది, అంత మొత్తం లాభం వచి్చంది అంటూ కామెంట్స్ పోస్టు చేస్తారు. దీంతో పాటు తమ యాప్స్‌కు సంబంధించి డ్యాష్‌బోర్డులు, నగదు తమ ఖాతాల్లో మళ్లినట్లు చూపించే కలి్పత సందేశాలను ఈ గ్రూపుల్లో పొందుపరుస్తారు. ఇవి చూసిన బాధితులు పూర్తిగా నమ్మేస్తారు. అప్పటి నుంచి సైబర్ నేరగాళ్లు వీళ్లు పెట్టే పెట్టుబడులను తమ సొంత ఖాతాల్లో డిపాజిట్ చేయిస్తారు. ప్రతి దశలోనూ భారీ లాభాలు వచ్చాయంటూ సందేశాలు పంపడంతో పాటు యాప్‌ల డ్యాష్ బోర్డుల్లోనూ ఆ మొత్తాన్ని చూపిస్తుంటారు. కొన్ని రోజుల తర్వాత వాటిలోని విత్‌డ్రా ఆప్షన్ డిజేబుల్ చేసేసి బాధితులు తమ నగదు వెనక్కు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తారు. అప్పటికే వీరి నుంచి భారీ మొత్తం పెట్టుబడిగా తీసేసుకుని ఉంటారు. దీంతో ఈ మొత్తం అది నష్టపోతామనే ఉద్దేశంతో బాధితులు నేరగాళ్లు చెప్పినట్లు చేయడానికి సిద్ధమవుతారు. అసలు కథ మొదలెట్టి వీలైనంత... దీనిని క్యాష్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు డ్యాష్‌బోర్డులో కనిపిస్తున్న వర్చువల్ ఖాతాల్లో నగదు డ్రా చేసుకోవాలంటే నిరీ్ణత మొత్తం పెట్టుబడి పెట్టాలని మరికొంత డిపాజిట్ చేయించుకుంటారు. చివరకు ఆదాయపు పన్ను, జీఎస్టీ తదతర చెల్లింపుల పేరుతో మిగిలిన మొత్తం కాజేసి... ఆ యాప్, గ్రూపులు పని చేయకుండా చేస్తారు. ఇలా భారీ మొత్తాలు స్వాహా చేస్తున్న ఈ యాప్స్ వెనుక చైనీయులే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ తరహా కేసుల్లో బాధితుల నుంచి కాజేసిన మొత్తం క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో దేశం దాటిపోతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ మోసాల నేపథ్యంలో కేవలం సెబీ అనుమతి ఉన్న సంస్థలు, యాప్‌ల ద్వారానే ట్రేడింగ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. డీమ్యాట్ ఖాతాల ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలని, బ్రోకర్ల సహా ఎవరి వ్యక్తిగత ఖాతాల్లోని నగదు బదిలీ చేయవద్దని స్పష్టం చేస్తున్నారు. అపరిచిత గ్రూపుల్లోని పోస్టులు నమ్మడం, లింకుల ద్వారా వచ్చే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం కూడదని ఆయన పేర్కొన్నారు. -
బిగ్‌బాస్‌కి ఎంపిక చేయిస్తామని మోసం
హైదరాబాద్: తనను బిగ్ బాస్–7లోకి పంపిస్తామంటూ డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ అమ్మినేని స్వప్న అనే యాంకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్నా చౌదరి అలియాస్ స్వప్న యాంకర్‌గా, ఈవెంట్ ఆర్గనైజర్‌గా టాలీవుడ్లో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లోకి కంటెస్టెంట్‌గా పంపిస్తానని మా టీవీలో ప్రొడక్షన్ ఇన్చార్జిగా పనిచేస్తున్న సత్య బిగ్‌బాస్ ఇన్చార్జి తమిలి రాజును పరిచయం చేశారు. బిగ్ బాస్ లోకి వెళ్లడానికి అందులో ఉపయోగించే దుస్తులు ప్రచారం కోసం ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని తమిలి రాజు ఆమెకు సూచించారు. ఈ మేరకు గత ఏడాది జూన్ నుంచి దాదాపు రెండున్నర లక్షలు ఆమె అతనికి చెల్లించింది. ఒకవేళ అవకాశం రాకుంటే డబ్బులు తిరిగి ఇస్తానంటూ తమిలి రాజు ఆమెను నమ్మించాడు. ఇందుకు సంబంధించి తమిలి రాజు ఆమెకు ఒక అగ్రిమెంట్ కూడా రాసిచ్చాడు. చివరి క్షణం వరకు పంపిస్తానని చెప్పి నన్ను మోసం చేస్తూ వచ్చాడు. డబ్బుల గురించి ప్రశ్నించగా తాను ఇవ్వనని తేల్చి చెప్పడంతో కొద్దిరోజుల క్రిందట స్వప్న వీడియో రూపొందించి సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసింది. ఇదే సంఘటనపై శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా పోలీసులు సెక్షన్ 406, 420 కింద రాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Anchor Swapna Chowdary: బిగ్ బాస్ కోసం రూ. 2.50 లక్షలు ఇస్తే మోసం చేశారు -
సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్మాల్.. రూ. 4 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్ ఎస్బీఐ బ్యాంకులో నిధుల గోల్మాల్ జరిగింది. రూ. 4.75 కోట్ల నిధులు స్వాహా అయినట్లు తేలింది. దీంతో బ్యాంక్ మేనేజర్ కార్తీక్ రాయ్‌పై కేసు నమోదైంది. అయితే ఓ సాఫ్ట్వేర్ యువతి అకౌంట్లోనే సుమారు రూ. 48 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల నుంచి యువతి డబ్బులు అడుగుతున్నా మేనేజర్ పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖాతాదారుల నగదు మాయం పట్ల బ్యాంక్ మేనేజర్ హస్తంపై పోలీసుల విచారణ జరుపుతున్నారు. చదవండి: TS: కొత్త పాలసీ? ఉచిత విద్యుత్‌పై కీలక ఆదేశాలు -
ఉపన్యాసం వద్దు.. ట్రంప్‌పై న్యాయమూర్తి ఆగ్రహం
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను న్యాయమూర్తి మందలించారు.కోర్టులో రాజకీయ ప్రసంగాలు ఇవ్వరాదని చివాట్లు పెట్టారు. విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలని చెప్పారు. బ్యాంకులు, బీమా కంపెనీల నుంచి ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందడానికి ట్రంప్ తన రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువను ఎక్కువ చూపించారనే ఆరోపణల కేసులో విచారణ జరిగింది. "ఇది రాజకీయ ర్యాలీ కాదు. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ప్రసంగాలు వద్దు.' అని ట్రంప్‌ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్థర్ ఎంగ్రోరోన్ హెచ్చరించారు. ట్రంప్‌ను ఎక్కువ మాట్లాడకుండా నియంత్రించాలని పిటిషనర్ తరుపు లాయర్‌పై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కోర్టు హాల్లో ట్రంప్ అన్నారు. కోర్టుల్లో కాలయాపన చేస్తూ తన సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. విచారణ అసంబద్ధంగా జరుగుతోందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో ట్రంప్ బ్రాండ్ విలువను కలపకుండానే ప్రకటించినట్లు పేర్కొన్నారు. కేవలం తన బ్రాండ్‌తోనే ఈ సారి ఎన్నికల్లో విజయం సాధిస్తానని అన్నారు. ట్రంప్ ప్రసంగంతో విసిగిన న్యాయమూర్తి మందలించారు. 2024 ఎన్నికల నేపథ్యంలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి తరుపున ట్రంప్ పోటీలో ఉన్నారు. ఇదీ చదవండి: 17 సార్లు పొడిచి భార్యపై కిరాతకం.. అమెరికాలో కేరళవాసికి జీవిత ఖైదు -
మనీలాండరింగ్ కేసులో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్..
చండీగఢ్: పంజాబ్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. మలేర్కోట్లా జిల్లాలోని అమర్‌గఢ్‌లో సోమవారం ఉదయం ఓ బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా.. అక్కడకు వచ్చిన ఈడీ అధికారులు ఆయనను అదుపులోకీ తీసుకున్నారు. గతేడాది నమోదైన రూ. 40 కోట్ల బ్యాంక్ మోసం కేసులో ఈడీ ఈ చర్యకు పాల్పడింది. ఈ కేసులో పంజాబ్ శాసనసభ్యుడికి ఈడీ ఇప్పటి వరకు మూడు సార్లు నోటీసులు జారీ చేసింది. అయితే వీటిని జశ్వంత్ సింగ్ పట్టించుకోకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ సాయంత్రం ఎమ్మెల్యేను మొహాలీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అసలేం జరిగిందంటే.. పంజాబ్ లూదియానాలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ గతేడాది తారా కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీతోపాటు జశ్వంత్ సింగ్, మరికొందరిపై సీబీఐకి ఫిర్యాదు చేసింది. వీరంతా తమ బ్యాంకును రూ.41కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ గతేడాది సెప్టెంబరులో.. జశ్వంత్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలుచోట్ల సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో లెక్కల్లో తేలని రూ.16.57లక్షల నగదు, విదేశీ కరెన్సీ, బ్యాంకు, ఆస్తి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల ఆధారంగా ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. ఎమ్మెల్యే అరెస్టును తీవ్రంగా ఖండించిన ఆప్.. తమను దెబ్బతీయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని విమర్శలు గుప్పించింది. జశ్వందర్ సింగ్ ఆప్‌లో చేరే ముందు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇది తమ పరువు తీసేందుకు బీజేపీ పన్నిన పన్నాగమని ఆప్ అధికార ప్రతినిధి మల్విందర్ కాంగ్ ఆరోపించారు. బహిరంగ సభలో నుంచి ఎమ్మెల్యేను తీసుకెళ్లిన విధానం చూస్తుంటే ఆప్‌ను కించపరిచేందుకు బీజేపీ బలమైన వ్యూహాలను అనుసరిస్తుందనే విషయం అర్థమవుతుందని మండిపడ్డారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సహా పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు చేపట్టాయి. మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని నుంచి రూ. 508 కోట్లు లంచంగా తీసుకున్న ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను కూడా ఈడీ విచారిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. నవంబర్ 2న తమ ఎదుట హాజరు కావాలని కోరగా.. ఇందుకు ఢిల్లీ సీఎం నిరాకరించారు. ఇక ఇటీవల డ్రగ్స్ సంబంధిత మనీలాండరింగ్ విచారణలో భాగంగా మరో ఆప్ ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్‌కు చెందిన పలు చోట్ల ఈడీ సోదాలు జరిపింది. చదవండి: బిల్లుల ఆమోదంలో జాప్యం.. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు -
'వీఓఏ' కదా అని అందరూ నమ్మారు.. తిరిగి చూస్తే షాక్!
సాక్షి, మహబూబాబాద్: మండలకేంద్రంలో ఐకేపీ వీఓఏగా పనిచేస్తున్న ఓ మహిళ రూ.మూడు కోట్ల మేర అప్పులు చేసి ఉడాయించినట్టు ప్రచారం జరుగుతోంది. పలువురు మహిళలతో ఏర్పడిన పరిచయం వల్ల డబ్బులను అప్పుగా ఇచ్చి, పుచ్చుకోవడాన్ని నమ్మకంగా చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అప్పులిచ్చే వారికి నమ్మకం కలిగించిన సదరు వీఓఏ ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద నుంచి రూ.లక్షల్లో అప్పులు తీసుకున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు గ్రామసమాఖ్యల ద్వారా ఐకేపీ గ్రూపులకు ఇచ్చిన సీ్త్రనిధి డబ్బులను సైతం ఓ వీఓ దగ్గర నుంచి రికవరీ పేరుతో తీసుకున్నట్టు సమాచారం. నాలుగు రోజులుగా డబ్బులు తీసుకున్న వీఓఏ జాడలేకపోవడంతో అనుమానం వచ్చి మహిళలు విచారించగా ఉడాయించినట్టు గుర్తించారు. దీంతో అప్పులు ఇచ్చిన మహిళలు తమ నగదు ఎలా తిరిగి వస్తాయోననే ఆందోళనలో ఉన్నారు. ఇవి కూడా చదవండి: 'క్రెడిట్ కార్డు' కోసం.. ఫోన్‌కు మెసేజ్ వచ్చిందా.. జర జాగ్రత్త! లేదంటే.. -
రూ. 1,600 కోట్ల మోసం కేసు.. అశోకా యూనివర్సిటీ కో-ఫౌండర్స్ అరెస్ట్
పారాబొలిక్ డ్రగ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తా రూ.1600 కోట్ల బ్యాంక్ మోసానికి పాల్పడ్డారని ఈడీ వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ అశోకా యూనివర్సిటీ వ్యవస్థాపకులని తమ విచారణలో తేలినట్టు తెలిపింది. దీనిపై అశోకా యూనివర్సిటీ స్పందిస్తూ ఈ కేసుకు, యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. మనీలాండరింగ్ కేసులో హర్యానాకు చెందిన అశోకా యూనివర్సిటీ సహా వ్యవస్థాపకులు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తాలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. వీరితోపాటు చార్టెట్ అకౌంటెంట్ ఎస్కే బన్సాల్‌ను సైతం అదుపులోకి తీసుకుంది. ఈ ముగ్గురిని ఈడీ చంఢీగడ్ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు అయిదు రోజుల కస్టడీకి అనుమతినినచ్చింది. కాగా పారాబోలిక్ డ్రగ్స్ కంపెనీ డైరెక్టర్లు ప్రణవ్ గుప్తా, వినీత్ గుప్తాపై రూ. 1,627 కోట్ల బ్యాంకు మోసానికి సంబంధించి మనీలాండరింగ్ కేసు నమోదైంది. వీరిద్దరిపై, సదరు ఫార్మా కంపెనీపై సీబీఐ 2021లో కేసు నమోదు చేసింది. దీంతో 2022లో వారు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పారాబోలిక్ కంపెనీలకు చెందిన మొత్తం 17 చోట్ల ఈడీ సోదాలు జరిపింది. ఢిల్లీ, ముంబై, ఛండీగఢ్, పంచకుల, అంబాల తదితర ప్రాంతాల్లోని ఈ సోదాలు జరిగాయి. దీనిపై అశోకా యూనివర్సిటీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈడీ విచారిస్తున్న పారాబోలిక్ డ్రగ్స్ కంపెనీకి అశోకా యూనివర్సిటీక ప్రస్తుతం ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. తమ యూనివర్సిటికి 200కుపైగా ఫౌండర్లు, డోనర్స్ ఉన్నారని, వారిలో వినీత్, ప్రణవ్ గుప్తా ఒకరని తెలిపారు. చదవండి: అవును.. పార్లమెంట్ లాగిన్ ఐడీ ఇచ్చా: ఎంపీ మహువా మొయిత్రా -
ED Attachment: మూడు ఆండ్రాయిడ్ యాప్‌లు..రూ.150 కోట్ల మోసం!
అధిక రాబడి వస్తుందని ప్రజల్లో ఆశ చూపించి మోసానికి పాల్పడుతున్న మొబైల్ యాప్ నిర్వాహకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. యాప్ నిర్వాహకులైన వైభవ్ దీపక్ షా, సాగర్ డైమండ్స్, ఆర్‌హెచ్‌సీ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన రూ.59.44 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పవర్ బ్యాంక్ యాప్ మోసం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ), 2002 నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఉత్తరాఖండ్, దిల్లీ పోలీసులు(స్పెషల్ సెల్), కర్ణాటక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఆస్తులను అటాచ్ చేసినట్లు అధికారులు చెప్పారు. భారత ప్రజలను మోసం చేసేందుకు చైనాకు చెందిన కొందరు చార్టర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల సహాయంతో దేశంలో షెల్ కంపెనీలను సృష్టించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. తమ పెట్టుబడులపై భారీ మొత్తంలో సంపాదించవచ్చని ప్రజల్లో ఆశ చూపించి మోసం చేస్తున్నట్లు పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్‌లోని పవర్ బ్యాంక్ యాప్, టెస్లా పవర్ బ్యాంక్ యాప్, ఈజీప్లాన్ అనే మూడు అప్లికేషన్ల ద్వారా ప్రజలను మోసగిస్తున్నట్లు అధికారులు గుర్తించామన్నారు. ఈ యాప్‌ల ద్వారా ప్రజల నుంచి రూ.150 కోట్ల మేర మోసం చేసినందుకు దిల్లీ పోలీస్ సైబర్ సెల్ జూన్ 2021లో అనేక మందిని అరెస్టు చేసింది. ఈ యాప్‌లు కస్టమర్ల నుంచి చెల్లింపులను సురక్షితం చేసిన తర్వాత వినియోగదారు ఖాతాలను బ్లాక్ చేసేవని ఈడీ తెలిపింది. ఇలా కూడగట్టిన డబ్బును నిందితులు, ఈ కేసుతో సంబంధం ఉన్న సంస్థలు బోగస్ దిగుమతుల సాకుతో విదేశాలకు భారీగా నిధులు మళ్లించారని వెల్లడైంది. అయితే రూ.10.34 కోట్ల విలువైన ఆస్తులను ఏజెన్సీ రికవరీ చేసింది. రూ.14.81 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
'సాక్షి' ప్రచురిత కథనానికి.. రిమ్స్ అక్రమార్కులపై స్పందించిన కలెక్టర్!
ఆదిలాబాద్: రిమ్స్‌లో అవినీతి, అక్రమార్కులపై కలెక్టర్ రాహుల్‌రాజ్ సీరియస్ అ య్యారు. డైరెక్టర్ జైసింగ్ రా థోడ్‌ను మంగళవారం సాయంత్రం పిలిపించి తాజా ఘటనలపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈనెల 18న ‘సాక్షి’లో ‘అవుట్సోర్సింగ్ మోసాలు.. ’శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించారు. నిరుద్యోగి నుంచి డబ్బులు వసూలు చేసిన సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయమై డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ, విచారణ కమిటీ ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
నటి మహాలక్ష్మి భర్త రవీందర్ అరెస్ట్
కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. గత ఏడాది నటి మహాలక్ష్మి శంకర్‌ను ఆయన పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా నిర్మాత రవీందర్ చిక్కుల్లో పడ్డాడు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) వారు రవీందర్‌ను అరెస్ట్ చేశారు. ఒక వ్యాపారవేత్తను ఆయన మోసం చేసినందుకు గాను అరెస్ట్ అయ్యాడు. ఈ వార్త కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. ది హిందూ ప్రకారం, ఘన వ్యర్థాల నుంచి ఒక ప్రాజెక్ట్ (విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా) పెట్టుబడి పెట్టి గణనీయమైన లాభాలను పొందవచ్చని ఆయన నమ్మపలికాడు. అందుకు కావాల్సిన నకిలీ పత్రాలను సిద్ధం చేసి చెన్నైకి చెందిన బాలాజీ అనే వ్యక్తిని ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిని చేశాడు. అందుకు గాను అతని నుంచి రూ. 15.83 కోట్లు తీసుకున్నాడని సమాచారం. వారిద్దరి మధ్య ఈ ఒప్పందం సెప్టెంబర్ 17, 2020న జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. కానీ రవీందర్ మొదట చెప్పిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యాడు. (ఇదీ చదవండి; సీరియల్స్‌లో జగతినే.. అక్కడ మాత్రం తన ఫోటోలు వైరల్) దీంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రశ్నంచగా రవీందర్ నుంచి సరైన సమాధానం లభించలేదని తెలుస్తోంది. దీంతో రవీందర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలాజీ భావించారు. రవీందర్ చేసిన మోసపూరిత కార్యకలాపాలతో పాటు ఆర్థిక అవకతవకలను వివరిస్తూ చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో బాలాజీ అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. దీంతో రవీందర్‌ను అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు. లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన పలు సినిమాలు నిర్మించి కోలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత బుల్లితెర నటి మహాలక్ష్మితో అతని వివాహం జరిగింది. దీంతో మీడియా, అభిమానుల దృష్టిని వారు ఆకర్షించారు. రవీందర్ చంద్రశేఖరన్ ఇప్పటికే పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నాడు. గతంలో విజయ్ అనే తన స్నేహితుడి నుంచి రూ. 15 లక్షలు తీసుకుని, ఒక సినిమా నిర్మాణంలో భాగం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే కేసు కూడా రవీందర్‌పై ఉంది. (ఇదీ చదవండి: మొదటిరోజు 'జవాన్' కలెక్షన్స్.. ఆల్ రికార్డ్స్ క్లోజ్) -
జైలులో లొంగిపోతా: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీచేయడానికి సన్నాహాల్లో చేసుకుంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కేసుల భయం, అరెస్టు భయం వెంటాడుతోంది. 2020లో జార్జియా రాష్ట్ర ఎన్నికల ఫలితాలను మార్చేయడానికి ప్రయతి్నంచిన కేసులో ట్రంప్ గురువారం ఫుల్టన్ కౌంటీ జైలులో లొంగిపోనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. అరెస్టు కావడానికి జార్జియాలోని అట్లాంటాకు వెళ్తున్నానని తెలియజేశారు. అక్కడ జిల్లా అటార్నీ ఫానీ విల్లీస్ తనను అరెస్టు చేస్తారని పేర్కొన్నారు. తన అరెస్టు ప్రక్రియను అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలోని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ సమన్వయం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయతి్నంచిన కేసులో ట్రంప్‌తోపాటు మరో 18 మంది ఆగస్టు 25లోగా లొంగిపోవాలని గతంలో జడ్జి ఆదేశించారు. అయితే ట్రంప్‌తో పాటు మరో 18 మంది కూడా సరెండర్ కావడానికి సిద్ధమైనట్లు సమాచారం. -
రామోజీ, శైలజకు మరోసారి నోటీసులు
సాక్షి, కృష్ణా: మార్గదర్శి అవకతవకల కేసులో ఆ సంస్థల అధినేత, ఎండీలకు మరోసారి ఏపీ సీఐడీ(Crime Investigation Department) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని చెరుకూరి రామోజీరావుకి నోటీసుల్లో స్పష్టం చేసింది. అలాగే.. ఎండీ శైలజా కిరణ్‌కు ఈ నెల 17వ తేదీన హాజరు కావాలని ఆదేశించింది. విచారణ నిమిత్తం వీరిద్దరినీ సీఐడీ విజయవాడ రీజనల్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో సీఐడీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. గతంలో నోటీసులు ఇచ్చినా వీళ్లు హాజరు కాలేదు. దీంతో మరోసారి విచారణ కోసం 41(ఏ) కింద నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి కుంభకోణం కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా ఆయన కోడలు చెరుకూరి శైలజా కిరణ్‌లను చేర్చింది ఏపీ సీఐడీ. ఇదీ చదవండి: ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది ఈనాడులో నోటికి వచ్చినవన్ని రాస్తారు -
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. కేసు నమోదు చేసిన పోలీసులు!
ప్రముఖ కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే నటి మహాలక్ష్మి శంకర్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. పెళ్లి విషయంలో చాలా మంది ట్రోల్స్ చేశారు కూడా. మహాలక్ష్మి డబ్బు కోసమే నిర్మాతను రెండో పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. దీనిపై స్వయంగా మహాలక్ష్మి క్లారిటీ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. అయితే ట్రోల్స్‌ను ఈ జంట పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా మరోసారి రవీందర్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. నిర్మాత రవీందర్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. (ఇది చదవండి: ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమా ఇదే! బాహుబలి, దంగల్ కాదు!) రవీందర్ చంద్రశేఖరన్ తమిళంలో చాలా సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం రవీందర్ ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో చెన్నైలో రవీందర్‌పై కేసు నమోదైంది. దాదాపు రూ.15 లక్షలు తీసుకుని స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసుల సమాచారం ప్రకారం.. అమెరికాలో ఉంటున్న విజయ్ అనే వ్యక్తి రవీందర్‌తో కలిసి సినిమా నిర్మాణంలో భాగమయ్యాడు. ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెడుతుందని విజయ్‌కి రవీందర్ హామీ ఇచ్చారు. దీంతో విజయ్ తన వాటాగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా రవీందర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆన్లైన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రవీందర్ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో విచారణకు హాజరయ్యారు. (ఇది చదవండి: హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. అప్పుడే గేమ్ మొదలెట్టారా?) -
Social Media Scams: ఫేక్ యాడ్స్‌తో జాగ్రత్త.. సైబర్ వలలో చిక్కుకోవద్దు
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రకరకాల ప్రకటనలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్, గూగుల్ ప్లాట్‌ఫారమ్స్‌లో ఇవి అధికంగా కనిపిస్తుంటాయి. వీటిలో ఏవి నిజమైనవి, ఏవి నకిలీవి అని తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. నిజమని నమ్మి మోసపోయే బాధితుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ప్రకటనల పేరుతో జరిగే ఈ ఆర్థిక మోసాల బారిన పడకుండా ఉండాలంటే మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఫేస్బుక్ ద్వారా.. మోసగాళ్లు నకిలీ అకౌంట్స్‌ను ఓపెన్ చేస్తారు. వీటిని ఫేక్ లైక్స్, షేర్స్, ఫాలోవర్స్, పోస్ట్‌లను రూపొందించడానికి ఉపయోగిస్తారు. ఈ నకిలీ అకౌంట్స్ ద్వారా వచ్చే యాడ్స్‌కు ఎటువంటి వాస్తవిక ఆధారాలు ఉండవు. ఫేస్బుక్ ప్రకటనలపై క్లిక్ లను రూపొందించడానికి ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు. దీని ద్వారా కృత్రిమంగా క్లిక్ త్రూ రేట్లను పెంచి, ప్రకటనదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని పెంచుతారు. అలాగే, యాడ్ నెట్‌వర్క్‌ను మోసగించడానికి చట్టబద్ధమైన వెబ్సైట్లు లేదా యాప్స్‌ను అనుకరిస్తారు. దీంతో మోసపూరిత వెబ్సైట్లలో ఈ యాడ్స్ కనిపిస్తుంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో.. ♦ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఫేక్ ఫాలోవర్లను కొనుగోలు చేయడం ద్వారా మోసానికి పాల్పడవచ్చు. లేదా వారి ప్రజాదరణను పెంచుకోవడానికి ఒక ఒప్పందం చేసుకోవచ్చు. అయితే, దీని ద్వారా ప్రకటనదారులు ఆశించిన ప్రయోజనాన్ని పొందలేరు. ♦మోసగాళ్లు ఫేక్ గ్రూప్‌లను క్రియేట్ చేస్తారు. ఒకరి పోస్ట్‌లను లైక్, షేర్, రివ్యూ చేయడానికి ఒప్పుకుంటారు. దీని ద్వారా వినియోగదారులు నమ్మకాన్ని పొందేందుకు ఒక భ్రమను సృష్టిస్తారు. తమ యాడ్స్‌ను ప్రచారం చేసే విధంగా మలుచుకుంటారు. ♦ ఫేక్ గ్రూప్స్ మాదిరిగానే పాడ్ నెట్‌వర్క్‌లను ఏర్పాటుచేస్తారు. దీని ద్వారా సభ్యులు ఒకరి పోస్ట్‌లపై మరొకరు కృత్రిమమైన ఎంగేజ్‌మెంట్‌ను పెంచుకుంటారు. ఎక్కుమంది వ్యూవర్స్‌ను చేరుకోవడానికి ఇదో తరహా ఎత్తుగడ. ట్విటర్ ► ఫేక్ ఫాలోవర్లు, రీ ట్వీట్లు, లైక్స్ క్రియేట్ చేయడానికి మోసగాళ్లు ఆటోమేటెడ్ బాట్లను అమలు చేస్తారు. వారు హ్యాష్‌ట్యాగ్స్ లేదా టాపిక్స్‌ను విస్తరించడానికి బాట్స్‌ను ఉపయోగిస్తారు. ఇది ట్రెండింగ్ భ్రమను సృష్టిస్తుంది. ► మోసగాళ్లు కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లు లేదా టాపిక్స్‌తో జనాదరణ పొందేలా, ట్రెండింగ్‌లో ఉండేలా కృత్రిమ ప్రచారం చేస్తారు. ఎక్కువ మందిని చేరుకోవచ్చనే ఆశతో ప్రకటనదారులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. ► హ్యాష్‌ట్యాగ్స్, రీ ట్వీట్స్ చేయడానికి, విస్తరించడానికి ఫేక్ అకౌంట్స్‌ను క్రియేట్ చేస్తారు. దీని ద్వారా కంటెంట్, విజిబిలిటీతో వ్యూవర్స్‌ను రీచ్ అవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ప్రచార మోసానికి మార్గాలు ♦ మోసగాళ్లు క్లిక్‌బైట్ మెసేజ్‌లను ఎస్సెమ్మెస్, వాట్సాప్, ఇ–మెయిల్ లేదా సోషల్ మీడియా యా ద్వారా పంపుతారు. ♦ సోషల్ మీడియా ΄ఫ్లాట్ఫారమ్లలో, గూగుల్ ప్రకటనలలో ఫేక్ యాడ్స్ సృష్టిస్తారు. ముఖ్యంగా కొత్త ఐ ఫోన్ మోడల్ వంటి ట్రెండింగ్‌లో ఉన్న విషయాలను ప్రచారం చేస్తారు. ♦ ప్రకటనలకు ఆకర్షితుడై మోసగాడిని సంప్రదించినప్పుడు అతను బుకింగ్ లేదా అడ్వాన్స్ చెల్లించమని అడుగుతాడు. ♦ కోరుకున్న వస్తువు డిస్కౌంట్ రేట్లో లభిస్తుందనే ఆశతో మోసగాడు చెప్పిన మొత్తాన్ని బాధితుడు ఆన్లైన్ ద్వారా చెల్లిస్తాడు. ఆ తర్వాత డెలివరీ, జీఎస్టీ, ఎక్స్‌ప్రెస్ డెలివరీ ఛార్జీలు మొదలైనవాటికి అదనపు మొత్తాన్ని చెల్లించమని బాధితుడిని కోరతాడు. ♦ మోసగాడు చెప్పింది నిజమని బాధితుడు నమ్మి డెలివరీ ట్రాకింగ్ వివరాలను పంపుతాడు. లేదంటే, అడిగినంత మొత్తాన్ని చెల్లిస్తాడు. ♦ బాధితుడు డబ్బును ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మోసగాడు కాల్స్‌ను, ఇతర కమ్యూనికేషన్ మార్గాలను బ్లాక్ చేస్తాడు. మోసాన్ని అధిగమించడానికి .. ► మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రముఖ వ్యాపార ప్రకటనల నెట్‌వర్క్‌లు, పబ్లిషర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఏవైనా అడ్వర్టైజింగ్, పార్టనర్షిప్లలోకి ప్రవేశించే ముందు క్షుణ్ణంగా పరిశీలించి, తగిన శ్రద్ధ తీసుకోవాలి. ► ప్రకటనల మోసాన్ని గుర్తించి, నిరోధించడంలో సహాయపడే ధ్రువీకరణ సాధనాలు, టెక్నాలజీని ఉపయోగించాలి. ఇవి, అనుమానాస్పద యాడ్స్ లోని లొసుగులను కనిపెట్టగలవు. క్లిక్ ఫ్రాడ్, ఇంప్రెషన్ ఫ్రాడ్ వంటి వివిధ రకాల మోసాలకు వ్యతిరేకంగా ఇవి రక్షణను అందిస్తాయి. ► ఏవైనా అనుమానాస్పద యాడ్స్‌ను గుర్తించడానికి ఇతర యూజర్ల క్రమాన్ని కూడా పర్యవేక్షించాలి. అంటే, అసహజంగా అనిపించే లైక్స్, షేర్స్ వేగంగా పెరగడం వంటివి ఉన్నాయేమో చెక్ చేయాలి. ► మోసాన్ని గుర్తించే లెర్నింగ్ టెక్నిక్స్‌ను ఉపయోగిస్తే ఇవి మోసపూరిత తేడాలను గుర్తించగలవు. ► మీ యాడ్స్... సంబంధిత ఫ్లాట్ఫారమ్లలో కనిపించేలా చూసుకోవడానికి స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలి. అనుమానాస్పదమైన, క్వాలిటీ లేని వెబ్‌సైట్స్, మోసపూరిత కార్యకలాపాలకు గురయ్యే యాప్‌లలో ప్రకటనలను ఉంచడం మానుకోవాలి. ► ఈ తరహా తాజా మోసాలను మీ టీమ్ అంటే.. బంధుమిత్రుల సమూహాలకు అవగాహన కల్పించాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేందుకు ఇండస్ట్రీ కాన్ఫరెన్స్‌లు, వెబినార్లు, వర్క్‌షాప్స్‌కు హాజరవ్వాలి. ► ప్రకటనల ప్రచారాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలి. డేటాలో ఏవైనా తేడాలు ఉన్నాయేమో సరిచూసుకోవాలి. మీరు మోసపూరిత కార్యకలాపాలను అనుమానించినట్లయితే, వాటిని సంబంధిత యాడ్ ఫ్లాట్‌ఫారమ్స్ లేదా నెట్‌వర్క్‌లకు తెలియజేయాలి. మోసపూరిత ప్రకటనల విధానాలను పంచుకోవడం ద్వారా మిగతావారిని అలెర్ట్ చేయవచ్చు. ► ప్రకటనల మోసాన్ని ఎదుర్కోవడానికి నిజాయితీని ప్రోత్సహించే ఇండస్ట్రీ అసోసియేషన్స్‌తో కనెక్ట్ అయి ఉండటం శ్రేయస్కరం. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
23 మార్గదర్శి చిట్ గ్రూపులు రద్దు
సాక్షి, అమరావతి: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలో తవ్వినకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. తాజాగా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్లు, ఆడిటర్లు పలు బ్రాంచిల్లో నిర్వహించిన తనిఖీల్లో.. మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు చందాదారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు తేలింది. దీంతో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఆ కంపెనీకి చెందిన 23 చిట్ గ్రూపులను స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ రద్దుచేసింది. అనంతపురం బ్రాంచిలో రెండు, అరండల్‌పేటలో 1, నరసరావుపేటలో 3, రాజమహేంద్రవరంలో 2, తణుకులో 1, విశాఖ డాబా గార్డెన్స్, కూర్మన్నపాలేల్లో ఒక్కొక్కటి, విశాఖ ఎన్ఏడీ బ్రాంచిలో రెండు, విశాఖ సీతంపేట బ్రాంచిలో 10 చిట్ గ్రూపులు రద్దయ్యాయి. ఈ చిట్ గ్రూపులు రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నాయి. తాజా అక్రమాలివే గ్రూపు ప్రారంభించినప్పుడు అన్ని టికెట్లు నిండకపోయినా నిండినట్లు చిట్ రిజిస్ట్రార్‌కి తప్పుడు డిక్లరేషన్లు సమర్పించినట్లు తాజా తనిఖీల్లో నిర్ధారణ అయింది. సాధారణంగా చిట్ గ్రూపు ప్రారంభమైనప్పుడు అన్ని టికెట్లు నిండవు. కొన్ని ఖాళీలు క్రమంగా తర్వాత నెలల్లో భర్తీ అవుతాయి. కానీ ఈ విషయాన్ని దాచిపెట్టి అన్ని టికెట్లు భర్తీ అయినట్లు కంపెనీ ఫోర్మెన్లు డిక్లరేషన్లు ఇచ్చారు. అలాగే చిట్ గ్రూపులు ప్రారంభమైనప్పుడు ఖాళీగా ఉన్న టికెట్లను కంపెనీ తనపేరు మీదే ఉంచుకుంటుంది. అలా తన పేరున ఉన్న టికెట్లకు సంబంధించిన చందాలను కట్టాల్సి ఉన్నా.. కమిషన్పోగా కట్టాల్సిన సొమ్మును కట్టకుండా కంపెనీ చందాదారులను మోసం చేసింది. అలా డబ్బు కట్టకపోవడం వల్ల మిగతా గ్రూపుల్లో చిట్లు పాడుకున్న వారికి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించడంలో తీవ్రజాప్యం జరుగుతున్నట్లు గుర్తించారు. పాట పాడుకున్న చందాదారులకు ఆ సొమ్ము ఇవ్వకుండా రశీదుల పేరుతో ఆ సొమ్మును డిపాజిట్లుగా ఉంచారు. అన్ని నెలలు చిట్ చందా కట్టినవారినే పాటకు అనుమతించాలి. కానీ మార్గదర్శిలో కొన్ని నెలలు కట్టి మధ్యలో కట్టకుండా ఉన్న వారిని కూడా పాటకు అనుమతించి, వారు పాడుకున్న తర్వాత వచ్చిన డబ్బును తమకు చెల్లించాల్సిన దానిగా కట్టించుకున్నారు. కొన్ని గ్రూపుల్లో వేలం పాట నిర్వహించకుండానే ప్రతినెలా చందాలు కట్టించుకున్నారు. ఇవన్నీ చిట్‌ఫండ్ చట్టానికి విరు ద్ధమే. ఈ ఉల్లంఘనలున్న చిట్ గ్రూపులను రద్దు చేశారు. దీంతో రద్దయిన 23 చిట్ గ్రూపులు సంబంధిత జిల్లాల చిట్ రిజిస్ట్రార్ల నియంత్రణలోకి వస్తా యి. వాటితో కంపెనీకి సంబంధం ఉండదు. ఆ గ్రూపులను చిట్ రిజిస్ట్రార్లే నిర్వహిస్తారు. చందాదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే రామోజీరావు సహా పలువురిపై కేసు నమోదు ఇప్పటికే మార్గదర్శిలో భారీగా అక్రమాలు బయటపడిన విషయం తెలిసిందే. క్వాలిఫైడ్ ఆడిటర్ తని ఖీలు చేసి ఇచ్చిన నివేదికలో మార్గదర్శి యాజమా న్యం రూ.459.98 కోట్లను మ్యూచువల్ ఫండ్స్, ప్ర భుత్వ సెక్యూరిటీలు, ఈక్విటీలకు మళ్లించినట్లు నిర్ధారణ అయింది. చందాదారులు కట్టిన చిట్ల సొ మ్మును తన సొంత ప్రయోజనాల కోసం మళ్లించడం, నిబంధనలకు విరుద్ధంగా ఆ సొమ్మును వేర్వేరుచోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా చందాదారులను మోసం చేసినట్లు స్పష్టమైంది. మార్గదర్శి బ్రాంచిల్లో తనిఖీల సమయంలో కంపెనీ మేనేజర్లు రిజి స్ట్రేషన్ల శాఖకు సహకరించకుండా ఇబ్బందులు పెట్టారు. అధికారులకు సరైన సమాచారం ఇవ్వకుండా తప్పుదారి పట్టించేలా వ్యవహరించారు. సమాచా రం, వివరాలన్నీ హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆఫీ సులోనే ఉన్నాయంటూ తనిఖీ బృందాలకు సహక రించలేదు. దీంతో అధికారులు కార్పొరేట్ ఆఫీసులో తనిఖీలు నిర్వహించి సమాచారం సేకరించారు. బ్యాలెన్స్షీట్లు, వెబ్సైట్లో వివరాలను బట్టి మరి కొంత సమాచారం సేకరించారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాత మార్గదర్శికి చెందిన విశాఖ, కాకి నాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం బ్రాంచిలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు చేశారు. వాటి ఆధారంగా మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజ సహా పలువురు బ్రాంచి మేనేజర్లపై సీఐడీ కేసులు నమోదు చేసి అక్రమాలపై మరింత లోతుగా విచారిస్తోంది. జరిగిన ఆడిట్లో మరిన్ని మోసాలు బయటపడడంతో 23 చిట్ గ్రూపులను రిజిస్ట్రేషన్ల శాఖ రద్దు చేసింది. చదవండి: Margadarsi: 1982 చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు -
పేదలనూ పిండుకున్న ‘పసుపు రాబందులు’
విజయవాడ చిట్టినగర్‌కు చెందిన నొక్కొజు మల్లేశ్వరరావు కార్పెంటర్. అతనికి జవహార్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) పథకంలో ఇల్లు ఇప్పిస్తానని విజయవాడ 47వ డివిజన్ టీడీపీ నాయకుడు మాకిన విజయ్‌కుమార్ నమ్మబలికాడు. ఐదేళ్ల క్రితం మల్లేశ్వరరావు నుంచి రూ.1.60 లక్షలు వసూలు చేశాడు. ఇప్పటికీ ఇల్లు ఇప్పించలేదు. విజయ్‌కుమార్ చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. విజయవాడ చిట్టినగర్‌లో బండిపై పూసలు అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే తమ్మన మాధవికి ఇల్లు ఇప్పిస్తానని విజయ్‌కుమార్ రూ. 3.20 లక్షలు వసూలు చేశాడు. ఇల్లు ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో విసిగి వేసారిన బాధితురాలు మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల పేరిట జరిగిన భారీ మోసంలో చిన్న ఉదాహరణలు. ఇలా మోసపోయిన వారు నగరంలో 2 వేల మంది ఉన్నట్లు అంచానా. 2014 నుంచి 2019 వరకు జరిగిన ఈ దందా బాధితుల ఫిద్యాదులతో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 70 కోట్లు పేదల నుంచి వసూలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో టీడీపీ నాయకులు మోసం చేశారని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదుల్లో బాధితులు పేర్కొన్నారు.రోడ్లు, కాలువలు విస్తరణలో ఇళ్లు కొల్పోయిన పేదలకు జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో నివాసం కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించాయి. చదవండి: పవన్ ఒక చెప్పు చూపిస్తే.. నేను రెండు చెప్పులు చూపిస్తా: పేర్ని నాని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ పథకం పనులు 2014 వరకు నిర్విరామంగా కొనసాగాయి. విజయవాడ నగరంలో ఇళు కోల్పోయిన పేదల కోసం నగరంలోని జక్కంపూడి, ఆర్‌ఆర్‌పేట, సింగ్‌నగర్, కబేలా ప్రాంతాల్లో వంద ఎకరాల్లో 28,152 జీ ఫ్లస్ త్రి గృహాల నిర్మాణం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారం చేపట్టిన టీడీపీ ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేసింది. అయితే అప్పటివరకు నిర్మించిన ఇళ్లను కేటాయించేందుకు నిర్ణయించింది. దీంతో విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఈ ఇళ్లను యధేచ్ఛగా అమ్మేశారు. ఆ నియోజకవర్గాలకు అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న టీడీపీ నాయకులు జలీల్‌ఖాన్, బొండా ఉమామహేశ్వరరావు కనుసన్నల్లోనే ఈ బాగోతం జరిగినట్లు తెలుస్తోంది. ఉచితంగా ఇవ్వాల్సిన ఈ ఇళ్లను డివిజన్లలో టీడీపీ నాయకులు ఒక్కొక్కరూ 200 గృహాలు అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. దీంతో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు ఒక్కో ఇంటికి రూ. 1.50 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేసి వారు రూ. కోట్లు దండుకున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలు జక్కంపూడి, సింగ్‌నగర్, ఆర్‌ఆర్‌పేట, కబేలా ప్రాంతాల్లో జేఎన్ఎన్ఆర్యుఎం ఇళ్ల కేటాయింపు 2018లోనే పూర్తయింది. అయినా, టీడీపీ నాయకులు నకిలీ డాక్యుమెంట్లు, మునిసిపల్, బ్యాంకు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు. ఇళ్లు లేకపోయినా ఉన్నట్లు ప్రచారం చేసి పేదల నుంచి వసూళ్లు చేశారు. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లోని 41 డివిజన్లలో ఈ తరహా బాధితులు 2 వేల మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరి నుంచి రూ. 60 నుంచి రూ.70 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. చాలా మంది బాధితులు ముందుగా కొత్తపేట (టుటౌన్) పోలీసులను ఆశ్రయిస్తున్నాయి. అక్కడా విజయ్‌కుమార్ మాటే చెల్లుబాటు కావడంతో పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు మాకిన విజయ్‌కుమార్ బాధితులు 35 మంది ఇప్పటివరకు పోలీసులను ఆశ్రయించారు. ఇతనితోపాటు 41వ డివిజన్లోని నాగోతు రామారావు, 57వ డివిజన్లోని ఎడిబోతు రమణ, 58వ డివిజన్లోని సోమేశ్వరరావు, రామారావు, 60వ డివిజన్లోని భువట ఉమా, శ్రీరాములు, 63వ డివిజన్లోని పైడి శ్రీను పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. -
విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కిడ్నీ రాకెట్ వ్యవహారం కలకలం సృష్టించింది. కిడ్నీ రాకెట్‌పై విశాఖ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. తిరుమల ఆసుపత్రి రిజిస్ట్రేషన్, అనుమతులపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కిడ్నీ మార్పిడి యూనిట్ లేకుండా పరీక్షలు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక, ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే డాక్టర్ పరమేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. పెందుర్తిలో తిరుమల ఆసుపత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ దందా కొనసాగుతోంది. ఈ కేసులో బాధితుడి నుంచి కిడ్నీకి రూ.8.5లక్షలకు ఒప్పందం చేసుకోగా రూ.2.5లక్షలు చెల్లించారు. విషయం బయటకు రావడంతో ఆసుపత్రి మూసివేసి యాజమాన్యం పరారైంది. మధ్యవర్తులు శ్రీను, కామారాజు, ఎలినా కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు. కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
Hyderabad: రూ.4 కోట్ల మోసగాడు.. 28 ఏళ్లకు చిక్కాడు
సాక్షి, హైదరాబాద్: ఓ ఆర్థిక మోసం కేసులో 28 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడిని తెలంగాణ సీఐడీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ పోలీస్ స్టేషన్లో 1995 నమోదైన కేసులో నిందితుడిగా వీఎస్ క్షీర్‌సాగర్‌ను అరెస్టు చేసినట్టు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ తెలిపారు. బుధవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా, కొత్తూరు మండలం నందిగోన్ గ్రామ పరిధిలో 1995లో వానిసింగ్ కంపెనీ పేరిట ఓ స్టీల్ కంపెనీని స్థాపించారు. స్థానికులకు కంపెనీలో షేర్లపేరిట మొత్తం రూ.4.3 కోట్లు సదరు కంపెనీ నిర్వాహకులు వసూలు చేశారు. ఈ మొత్తంలో రూ.4 కోట్లను 1995లో ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌లో దాదర్ బ్రాంచ్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న వీఎస్ క్షీర్సాగర్ కొట్టేశాడు. కంపెనీ దివాళా తీయడంతో ఎంతోమంది అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంటును ఎట్టకేలకు అమలు చేస్తూ నిందితుడిని ఇండోర్ పట్టణంలో అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టులో కీలకంగా పనిచేసిన సీఐ డీ ఇన్స్పెక్టర్ ఎస్ వెంకటేశ్, ఎస్సై పి నాగార్జున, హెడ్ కానిస్టేబుల్ ఎం.గోపాల్‌లను సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ అభినందించారు. -
బామ్మా జర భద్రం.. ఆ లింక్స్‌పై క్లిక్ చేస్తే అంతే! ఈ టోల్ ఫ్రీ నంబర్ మీకోసమే!
విచారంగా కూర్చొని ఉన్న వర్ధనమ్మను చూసి ఏమైందని అడిగింది మనవరాలు హారిక. ‘బ్యాంకు ఖాతా నుండి డబ్బులు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. నేను ఆ డబ్బులు డ్రా చేయలేదు. నా దగ్గర డబ్బులు ఉన్నట్టు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. బ్యాంకులో అయితే భద్రంగా ఉంటాయనుకున్నా. ఇప్పుడెలా..’ అంది మనవరాలితో దిగులుగా వర్ధనమ్మ. ‘ఎవరైనా నీకు ఇంతకుముందు ఫోన్ చేశారా..’ అడిగింది హారిక. ‘బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. అత్యవసరం అని చెబితే, వాళ్లు పంపిన లింక్ ఫామ్‌లో వివరాలు ఇచ్చాను. అంత కన్నా ఏమీ చేయలేదు’ అంది వర్ధనమ్మ. బామ్మ సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోయిందని అర్ధమై, వెటనే తగిన చర్యలు తీసుకుంది హారిక. ఆ తర్వాత బామ్మకు సైబర్ మోసగాళ్ల గురించి వివరించింది. ఇంట్లో వయసు పైబడిన వారుంటే సైబర్ మోసాగాళ్ల బారిన పడకుండా ఈ విషయాలు తప్పక తెలియజేయాల్సిన అవసరం వారి పిల్లలకు ఉంది. సాధారణంగా జరిగే మోసాల్లో ప్రధానమైంది ఫిషింగ్ సైబర్ నేరగాళ్లు మీ డిజిటల్ సమాచార మొత్తాన్ని పొందడానికి ఆన్లైన్ సేవ లేదా బ్యాంక్ ఏజెంట్ల వంటి విశ్వసనీయ పరిచయాలను పెంచుకుంటారు. కొన్ని ఉదాహరణలు.. సహాయం కోసం రిక్వెస్ట్ అడుగుతారు. మీరు బహుమతిని గెలుచుకున్నారని చూపుతారు. పెన్షన్ ఫండ్ విడుదలకు కెవైసి అవసరం అంటారు. గతంలో తక్కువ ఆదాయపు పన్ను చెల్లించారు, ఇప్పుడు రెట్టింపు ఛార్జ్ పడింది అంటారు. గుర్తింపు చోరీ సైబర్ దాడి చేసే వ్యక్తులు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, చిరునామా, డెబిట్/ క్రెడిట్ కార్డ్ వివరాలు, యుపిఐ, పిన్ నంబర్ మొదలైన వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక లాభాలను పొందడానికి ఈ సమాచారం సేకరిస్తారు. దాడుల్లో రకాలు వీటిలో తరచుగా సీనియర్ డేటింగ్, ప్రిస్క్రిప్షన్ మాత్రలు, యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు, పెట్టుబడి లేదా ఛారిటీ స్కామ్‌లు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుండి నకిలీ ఆర్థిక సహాయ అభ్యర్థనలకు సంబంధించిన మోసాలు ఉంటాయి. చాలా మంది సీనియర్లు ఇలాంటి మోసాలకు లోనవడానికి పెద్ద కారణం ఒంటరితనం, జ్ఞానం లేకపోవడమే. భద్రతా చిట్కాలు ►తెలియని వారి నుంచి వచ్చే ఇ–మెయిల్‌లలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. మీకు తెలిసిన వ్యక్తుల నుండి వచ్చినవి అయినప్పటికీ, వింత లేదా ఊహించని సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇ–మెయిల్లు, వాట్సప్ సందేశాలు లేదా ఎసెమ్మెస్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లు అన్నీ హానికరమైన ఫైల్స్‌ను కలిగి ఉండే చిన్న లింక్‌లతో ►పంపినవారు మీకు తెలిసినవారే అని దృఢపరుచుకునేవరకు ఏ లింక్‌లను ఓపెన్ చేయవద్దు. స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల నుండి ఆ మెసేజ్ వచ్చినట్లు కనిపిస్తే, వారు మీకు ఏదైనా పంపినట్లు నిర్ధారించుకోవడానికి తిరిగి వారినే సంప్రదించండి. ►అనుమానిత ఫోన్ కాల్స్, రోబోకాల్స్‌ను రిసీవ్ చేసుకోకండి. కాలర్ తాను ‘‘టెక్ సపోర్ట్‘ నుండి మాట్లాడుతున్నట్టు మీతో చెప్పవచ్చు. మీ కంప్యూటర్‌కు వైరస్ సోకిందని, రిపేర్ ఉందని మీకు తప్పుగా చెప్పవచ్చు. మీరు టాక్స్ డిఫాల్టర్ లేదా పెన్షన్ ప్రాసె సింగ్ లేదా కెవైసీ కోసం అడుగుతున్న బ్యాంక్ అధికారి అని కూడా చెప్పవచ్చు. పెన్షన్ ఫండ్ మొదలైన వాటి ప్రాసెసింగ్ అని చెప్పవచ్చు. ►మీ ఫోన్ లేదా కంప్యూటర్లోని పాప్అప్ విండోలకు ప్రతిస్పందించవద్దు లేదా దానిపై క్లిక్ చేయవద్దు. మీ కంప్యూటర్ లేదా ఫోన్లో ‘అత్యవసర‘ పాప్అప్ విండో కనిపిస్తుంది. మీ డిజిటల్ పరికరానికి రిపేర్ అవసరమని లేదా ఒక ఫోన్‌ను ఆఫర్లో ‘మరొక ఫోన్‌ను పొందండి’ అంటూ మీలో ఆశను కలిగిస్తాయి. మీ కంప్యూటర్ సిస్టమ్‌కి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయమని అడగవచ్చు. ►అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం లేదా తెలియని వాటిని డౌన్లోడ్ చేసే సమయంలో సురక్షిత బ్రౌజింగ్ పద్ధతులను అనుసరించండి. మీకు తెలిసిన సీనియర్స్‌కి విశ్వసనీయ వెబ్సైట్లను మాత్రమే సందర్శించమని, వారు సురక్షితమైన సైట్లో ఉన్నారని నిర్ధారించుకోవడానికి httpr://(ప్యాడ్ లాక్ సింబల్) కోసం చూడాలని సలహా ఇవ్వండి. ►రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్లు భద్రతా లోపాలను పరిష్కరించగలవు. వారి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వంటి పరికరాలు, సాఫ్ట్వేర్లను క్రమం తప్పకుండా అప్డేట్ చేయమని సీనియర్లను ప్రోత్సహించండి. ►యాప్స్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి మాత్రమే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ►ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను (ప్రత్యేక అక్షరాలు, పెద్ద అక్షరాలు, సంఖ్యాపరమైనవి) ఉపయోగించమని వృద్ధులను ప్రోత్సహించండి. వారి పుట్టిన తేదీ లేదా చిరునామా వంటి సులభంగా ఊహించదగిన సమాచారాన్ని ఉపయోగించవద్దు. ►తెలియని వ్యక్తులతో మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లతో రిమోట్ స్క్రీన్ షేరింగ్ చేయకండి. ►అన్ని ఇ–మెయిల్స్, సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాల కోసం రెండు కారకాల ప్రమాణీకరణను ఉపయోగించండి. మోసపోతే ఏం చేయాలంటే.. ఈ టోల్ ఫ్రీ నంబర్ 1930కి వెంటనే (ఒక గంటలోపు) ఫోన్ చేయండి. దీని ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ 1930 సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్, భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది. దీనికి బదులుగా మీరు మీ స్థానిక సైబర్ క్రైమ్ పోలీసు అధికారుల వద్ద జరిగిన మోసం చెప్పి కంప్లయింట్ ఇవ్వచ్చు. లేదా httpr://www.cybercrime. gov.in లో ఫిర్యాదును నమోదు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ నుండి దూరంగా ఉండాలంటే.. ►మీ స్మార్ట్‌ఫోన్‌లో నోటిఫికేషన్లను నిలిపి వేయండి. ►మీ పడకగది, భోజనాల గదిని స్మార్ట్‌ఫోన్ రహిత జోన్‌గా మార్చండి. ►మీ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్ నుండి సోషల్ మీడియాను యాక్సెస్ చేయండి. ►ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించడం కోసం ఆండ్రాయిడ్‌లో డిజిటల్ వెల్బీయింగ్ యాప్, ఐఓఎస్‌లో స్క్రీన్ టైమ్ యాప్‌ని ఉపయోగించండి. ►ప్రజలు తమ స్క్రీన్ వినియోగ సమయం పెరుగుతోందని భావిస్తే గ్రే స్కేల్ మోడ్ ఫీచర్‌ని ఉపయోగించండి -
హైదరాబాద్ యువతితో నైజీరియన్ స్నేహం.. గిఫ్ట్‌ల పేరుతో రూ. 1.22 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్ పేరుతో మోసానికి పాల్పడ్డ నైజీరియన్ జంటను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 పాస్‌బుక్‌లు, 8 చెక్కు బుక్‌లు, 9 డెబిట్ కార్డులు, 12 మొబైల్ ఫోన్లు, 4 సిమ్‌కార్డులు, ల్యాప్‌టాప్, మూడు ఐడీకార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అరెస్టు చేసినట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్‌పేర్కొన్నారు. వివరాలు నైజీరియాకు చెందిన బకయోకో లస్సినా, షోమా పుర్కయస్తా ప్రేమికులు. బకయోకో లస్సినా డాక్టర్ లియనార్డో మ్యాట్టియో అనే పేరుతో ఫేస్బుక్ అకౌంట్‌ను తెరచి కొందరికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపాడు. నగరానికి చెందిన ఓ యువతి అతడి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగా కొంతకాలం ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. తనను లండన్‌లో డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఇతగాడు యువతి కోసం సిటీకి వస్తున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఢిల్లీ కస్టమ్స్‌లో మీ కోసం వస్తున్న డాక్టర్ లియనార్డో మ్యాట్టియోను అరెస్టు చేశామని, అతడి వద్ద వజ్రాలు, విలువైన బహుమతులు, డబ్బును స్వాధీనం చేసుకున్నామంటూ సదరు యువతికి కస్టమ్స్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్న షోమా పుర్కయస్తా ఫోన్ చేసి చెప్పింది. ఆమెను భయపెట్టి పలు దఫాలుగా రూ.1.22 కోట్లు పలు బ్యాంకు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అయినా పదే పదే డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఢిల్లీ వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. ఇదే తరహాలో వీరు పలువురిని మోసం చేసినట్లు గజరావు భూపాల్ తెలిపారు. -
వేషం మార్చి.. పేరు మార్చి.. జనాన్ని ఏమార్చి! రూ.10 కోట్ల వరకూ..
సాక్షి, పుట్టపర్తి: మహా మాయగాడి బండారం బయట పడింది. ఊరికో పేరు మార్చుకుంటూ చెలామణి అవుతూ అమాయకులను మోసం చేస్తోంది.. ఒక్కడే అని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన బెస్త చిన్న ఓబులేసు అధిక వడ్డీ ఆశ చూపి ఇప్పటికే పలు చోట్ల జనాలను నిలువునా మోసం చేసిన ఘటనలు వెలుగు చూశాయి. ఒక్కో చోట ఒక్కో పేరుతో చెలామణి అవుతుండటంతో ప్రజలు పసిగట్టలేకపోయారు. రోజుల వ్యవధిలోనే రూ.లక్షకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికి కొన్ని రోజుల పాటు ఠంఛన్‌గా సొమ్ము చెల్లించేవాడు. ఆ తర్వాత ఉడాయిస్తాడు. ఇప్పటికే నంద్యాల జిల్లా అవుకు, అనంతపురం జిల్లా కణేకల్లు, ఆత్మకూరు పోలీస్ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపించారు. ఆ తర్వాత బెయిల్‌పై వచ్చి ఊరు మార్చి.. కొత్త పేరుతో దందా కొనసాగిస్తున్నాడు. గత రెండేళ్లలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సుమారు రూ.10 కోట్ల వరకు మోసానికి పాల్పడ్డట్టు తేలింది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మనోహర్‌రెడ్డి పేరుతో రూ.1.7 కోట్లతో పరారయినట్లు బాధితులు ఈ నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ భాస్కర్‌రెడ్డిగా.. ఇక్కడ మనోహర్రెడ్డిగా.. గతేడాది మేలో నంద్యాల జిల్లా అవుకులో భాస్కర్‌రెడ్డిగా పరిచయమయ్యాడు. అక్కడే ఓ షాపు అద్దెకు తీసుకుని వంటనూనె, చక్కెర, సిగరెట్ల వ్యాపారం చేస్తానని నమ్మబలికాడు. స్టాక్ కోసం పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు కావాలని, రూ.లక్ష తనకిస్తే రోజుకు రూ.5 వేల చొప్పున వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. దీంతో అధిక వడ్డీకి ఆశపడి చాలామంది అతనికి డబ్బులిచ్చారు. అక్కడ సుమారు రూ.3 కోట్ల వరకూ వసూలు చేసుకుని పరారయ్యాడు. అవుకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు గాలించి గాలివీడులో పట్టుకుని జైలుకు పంపారు. అవుకు కేసు నుంచి బయటికొచ్చాక శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లికి మకాం మార్చాడు. అక్కడ షేర్ మార్కెట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మబలికాడు. అధిక వడ్డీ ఇస్తానని కొన్ని రోజుల పాటు నమ్మించాడు. రూ.లక్షకు రోజుకు రూ.వెయ్యి ఇస్తానని చెప్పాడు. సుమారు రూ.1.7 కోట్లు వసూలయ్యాక పరార్ అవడంతో బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. అంతకుముందు అనంతపురం జిల్లా కణేకల్లు.. ఆత్మకూరులో కూడా అధిక వడ్డీ ఆశ చూపి కొందరితో డబ్బులు వసూలు చేసి పరారైనట్టు పోలీసులకు ఫిర్యాదులందాయి. మొదట్లో జులపాలు.. ఆ తర్వాత గుండు రైల్వే కమ్మీలు చోరీ చేసిన కేసులో కూడా బెస్త చిన్న ఓబులేసే నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు గాలించి అరెస్టు చేసి జైలుకు పంపినా.. ఆ తర్వాత అనంతపురంలోని నాయక్ అనే ఓ లాయర్‌ను అడ్డు పెట్టుకుని సులువుగా బయటికొచ్చేస్తున్నాడు. చిన్న ఓబులేసు పేర్లు మార్చుకున్నట్లే వేషం కూడా మార్చేస్తాడు. మొదట్లో జులపాల జుట్టుతో ఖద్దర్ చొక్కా వేసి.. చేతికి ఉంగరాలు, మెడలో బంగారు చైన్లు వేసుకుని దర్జాగా తిరుగుతాడు. డబ్బులున్న వారితో టచ్‌లోకి వెళ్లి అధిక వడ్డీ ఆశ చూపి లూఠీ చేసి పరారవుతాడు. ఆ తర్వాత విహార యాత్రలకు వెళ్లి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడు. పోలీసులకు పట్టుబడే సమయానికి గుండుతో ఉంటాడు. నిత్యం డ్రెస్ కోడ్, బాడీ లాంగ్వేజ్ మార్చి విందు, వినోదాల్లో మునిగితేలుతుండాడు. విహార యాత్రల్లో ఉండగానే లాయర్లతో టచ్‌లోకి వెళ్లి.. కేసులకు సంబంధించి లాబీయింగ్ చేస్తాడని సమాచారం. -
Chanda Kochhar: చందా కొచ్చర్‌కు భారీ ఊరట
ముంబై: వీడియోకాన్ ఫ్రాడ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చార్‌కు భారీ ఊరట లభించింది. చందాతో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను సైతం రిలీజ్ చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ చట్టానికి లోబడి జరగలేదని చందా కొచ్చర్ తరపు న్యాయవాదులు వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. వీడియోకాన్ సంస్థకు అక్రమరీతిలో రుణాలు మంజూరీ చేసిన కేసులో చందా కొచ్చార్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చందా కొచ్చారోతో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చార్‌ను డిసెంబర్ 23వ తేదీన సీబీఐ అరెస్టు చేసింది. వీడియోకాన్ గ్రూపు సంస్థకు 2012లో సుమారు రూ. 3,250 కోట్ల మొత్తాన్ని అక్రమరీతిలో లోన్ ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి.కుటుంబ లబ్ధి కోసం కొచ్చార్ ఫ్యామిలీ చీటింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీడియోకాన్ రుణాన్ని ఎన్పీఏగా భావించి, దాన్ని బ్యాంక్ ఫ్రాడ్‌గా ప్రకటించారు. బాంబే హైకోర్టులో జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పీకే చావన్‌లతో కూడిన ధర్మాసనం తాజా తీర్పును ఇచ్చింది. క్రిమినల్ కోడ్‌లోని 41ఏ సెక్షన్‌ను ఉల్లంఘించి ఆ ఇద్దరి అరెస్టు చేసినట్లు కోర్టు తెలిపింది. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఇద్దరినీ.. లక్ష రూపాయాల బెయిల్ బాండ్‌పై విడిచిపెట్టనున్నారు. కొచ్చర్ల పేరుతో పాటు వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ దూత్ పేరును సైతం సీబీఐ ఇందులో చేర్చింది. క్విడ్ ప్రోకోలో భాగంగా ఇదంతా జరిగిందని అభియోగాలు నమోదు చేసింది. -
విజయవాడలో ఉద్యోగాల వల
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలుచేసిన వైనం బయటకొచ్చింది. 30 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసగించిన సంస్థ యజమాని దండుబోయిన సిద్ధార్థ్‌వర్మను, సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు, పోలీసుల సమాచారం మేరకు.. సిద్ధార్థ్‌వర్మ విజయవాడ బందరు రోడ్డులో డైల్ ఇన్స్టిట్యూషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోను, విదేశాల్లోను ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగులకు వల వేశారు. అమెరికా, ఇంగ్లండ్, దుబాయ్, మలేషియా దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, దేశంలో బీఎస్ఎన్ఎల్, జాతీయ రహదారులు, ఎలక్షన్ కమిషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి కేంద్రప్రభుత్వ సంస్థల్లోను, పేరొందిన ప్రైవేటు కంపెనీల్లోను ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికారు. కార్యాలయంలో యువతులను నియమించి వారి మాటలతో బురిడీ కొట్టించి ఒక్కో నిరుద్యోగి వద్ద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారు. రసీదులు కూడా ఇచ్చారు. నెలలు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో వారికి డబ్బు వాపసు చేస్తూ చెక్కులిచ్చారు. ఆ చెక్కులు చెల్లకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మోసపోయినవారు ఒక్కొక్కరుగా విజయవాడ చేరుకుంటున్నారు. ఇప్పటికే కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కర్నూలు, గుంటూరు, వైఎస్సార్, ప్రకాశంజిల్లాల నుంచి వచ్చిన 30 మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ సూర్యారావుపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. నిర్వాహకుడు సిద్ధార్థ్‌వర్మను, కార్యాలయంలో పనిచేసే పలువురు మహిళా ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండేళ్లుగా దందా కాల్ సెంటర్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ కోర్సులను నేర్పుతామని రెండేళ్ల కిందట ఈ ఇన్స్టిట్యూషన్ను సిద్ధార్థ్‌వర్మ ఏర్పాటు చేశారు. ఈ ఇన్స్టిట్యూట్కు వైష్ణవి అనే మహిళ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరు ఎక్కువగా సంస్థ కార్యాలయంలో కనిపించేవారు కాదని, అక్కడి ఉద్యోగినులే వివరాలు చెప్పి డబ్బు వసూలు చేసేవారని బాధితులు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణల్లో దాదాపు వెయ్యిమంది నిరుద్యోగులు వీరి మాటలు నమ్మి మోసపోయారని పేర్కొన్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు గుప్పించి తమను ఆకర్షించారని పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన బాధితుడు మణికంఠ వాపోయారు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో డబ్బు చెల్లించి నెలల తరబడి ఇన్స్టిట్యూట్ చుట్టూ తిరిగానని చెప్పారు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన వద్ద డబ్బు వసూలు చేశారని విజయవాడకు చెందిన ప్రవీణ్ తెలిపారు. ఉద్యోగం రాలేదని డబ్బులు అడిగితే కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులచే ఎదురుదాడి చేయిస్తున్నారని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పారు. బాధితులకు న్యాయం చేస్తాం.. ఉద్యోగాల పేరుతో మోసపోయామని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డైల్ ఇన్స్టిట్యూషన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి సంస్థ యజమానిని, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటాం. ఉద్యోగాల పేరుతో మోసం చేసే సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి సంస్థల యజమానుల మాయమాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు. – టి.కె.రాణా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ -
డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్!
సాక్షి, హైదరాబాద్: ఆయన పేరు డాక్టర్ దేవేందర్ (పేరు మార్చాం). హైదరాబాద్ సమీపంలోని ఒక ఏరియా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుడు. ఆయనకు నగరంలో ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా మేనేజ్ చేస్తున్నారు. కా నీ, ఆయన రోజూ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నట్లుగా హాజరుంటుంది. బయోమెట్రిక్ హాజరున్నా తన మాయాజాలాన్ని ఉపయోగించారు. ఫేస్ రికగ్నేషన్ సందర్భంగా తన ముఖాన్ని కాకుండా ఫొటోను బయోమెట్రిక్ మెషీన్లో ఫీడ్ చేయించాడు. అతను వెళ్లకున్నా అక్కడి సిబ్బంది అతని ఫొటోను బయోమెట్రిక్ మెషీన్లో హాజరు కోసం ఉపయోగిస్తున్నారు. మరో డాక్టర్ శ్రవణ్ కుమార్ (పేరు మార్చాం). నిజామాబాద్ జిల్లాలోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అతను వారానికి ఒకరోజు ఆసుపత్రికి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్తాడు. కానీ, అతను రోజూ వచ్చినట్లుగా హాజరుంటుంది. అతను వేలిముద్ర హాజరును దిద్దుబాటు చేశాడు. తన వేలి ముద్ర బదులుగా అక్కడ రోజూ వచ్చే ఇతర సిబ్బంది వేలిముద్రను ఫీడ్ చేశాడు. దీంతో అతను వెళ్లకుండానే హాజరుపడుతుంది. ఆమె పేరు డాక్టర్ రవళి(పేరు మార్చాం). రాష్ట్రంలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తారు. ప్రతీ డాక్టర్ తాను పనిచేసినట్లుగా రోజూ ఫొటో తీసి అప్లోడ్ చేయాలని ఆ జిల్లాలో నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆమె మాత్రం ఒక రోజు వచ్చి తన వ్రస్తాలను ఐదారుసార్లు మార్చి ఇతర వస్త్రాలను ధరించడం, హెయిర్ స్టైల్‌ను కూడా మార్చి రోగులను చూసినట్లు ఫొటోలు దిగుతారు. వారంలో మిగిలిన రోజులు రాకుండానే ఆ ఫొటోలను అప్లోడ్ చేస్తారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో వైద్యుల బండారం బట్టబయలు రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 48 ఏరియా ఆసుపత్రులు, 108 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 33 జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. వాటిల్లో ఎండీ, ఇతర సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వైద్యం చేస్తుంటారు. ఆర్థో, కార్డియాక్, గైనిక్, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గ్యాస్ట్రో వంటి ప్రత్యేక వైద్యం అందుబాటులో ఉంటుంది. కొందరు స్పెషలిస్ట్ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులకు హాజరుకాకుండా హైదరాబాద్‌లోనూ, తాము పనిచేసే సమీప పెద్ద నగరాల్లోనూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లినప్పుడు అనేకచోట్ల డాక్టర్లు విధులకు రాకపోవడాన్ని గుర్తించారు. ఈ మేరకు 50 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరారు. హాజరైనట్లుగా తప్పుడు పద్ధతులు కొన్ని ఆసుపత్రుల్లో ఫేస్ రికగ్నేషన్ మెషీన్, కొన్నిచోట్ల వేలిముద్రల మెషీన్లను వైద్యవిధాన పరిషత్ ఏర్పాటు చేసింది. అయితే ఫేస్ రికగ్నేషన్ మెషీన్లో కొందరు డాక్టర్లు ముఖం కాకుండా ఫొటోలను ఫీడ్ చేశారు. ఆ ఫొటోను ఆ ఆసుపత్రిలో పనిచేసే వైద్యసిబ్బందికి ఇచ్చి, రోజూ ఫొటోను ఫేస్ రికగ్నేషన్ మెషీన్ ముందు పెట్టి హాజరు వేయిస్తుంటారు. కొందరు డాక్టర్లయితే వారాల తరబడి కూడా ఆసుపత్రుల ముఖం చూడటంలేదని తేలింది. కానీ, హాజరైనట్లుగా మెషీన్లో నమోదవుతుంది. కొన్నిచోట్ల తమకు బదులుగా అక్కడి సిబ్బంది వేలిముద్రలను మెషీన్లలో ఫీడ్ చేయించారు. సిబ్బంది వేలిముద్రల సహాయంతో హాజరైనట్లుగా నమోదు చేయించుకుంటున్నారు. కొందరు డాక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల కుటుంబసభ్యులకు వైద్యం చేస్తూ మెప్పు పొందుతున్నారు. ఇటువంటి వారిని ఏమీ అనలేని పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక జిల్లాలో ఒక మహిళా ఎంబీబీఎస్ డాక్టర్ వారానికి ఒకసారి వచ్చి తన వ్రస్తాలను మార్చి మార్చి ఇతర వ్రస్తాలను ధరించి ఫొటోలు దిగి బయోమెట్రిక్ అటెండెన్స్‌లో ఫీడ్ చేసిన విషయం వెలుగు చూసింది. ఈ డాక్టర్‌పై చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నించగా కొందరు మంత్రుల ఆఫీసుల నుంచి ఫోన్లు చేసి అడ్డుకున్నట్లు తెలిసింది. మరోవైపు కొన్ని సంఘాలు కూడా ఇటువంటి డాక్టర్లకు వంతపాడుతున్నాయని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Sankalp Siddhi Case: ఐదుగురి అరెస్ట్.. ఏపీ, తెలంగాణలో రూ.170 కోట్లు సేకరణ
సాక్షి, విజయవాడ ప్రతినిధి: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘సంకల్ప సిద్ధి’ కేసులో ఐదుగురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సంస్థకు చెందిన ఐదు బ్యాం కు ఖాతాలను, 14 ప్రాంతాల్లోని ఆస్తులను, విలు వైన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఈ కేసు వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా సోమవారం వెల్లడించారు. ‘సంకల్ప సిద్ధి ఈ–కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను గుత్తా వేణుగోపాల్, అతని సోదరుడు గుత్తా కిషో ర్ ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్ ఇంపోర్ట్ అం డ్ ఎక్స్పోర్ట్ పేరుతో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుం చి అనుమతి తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆన్లైన్ వెబ్ పోర్టల్, యాప్‌ను రూపొందిం చారు. ఈ కంపెనీలో కొందరు డైరెక్టర్లను చేర్చుకుని చట్టవిరుద్ధంగా మనీ సర్క్యులేషన్ స్కీం, మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు తెరతీశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు ఒక కో–ఆర్డినేటర్‌ను నియమించుకుని ఐదు ఆకర్షణీయమైన పథకాలతో ప్రజల నుంచి రూ.170 కోట్ల వరకు వసూలు చేశారు. ఈ మొత్తంలో కొంత నగదును డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించారు. గత 15 రోజులుగా విత్‌డ్రాలు నిలిచిపోవడంతో ఐదుగురు ఫిర్యాదు చేశారు. ఐదు ప్రత్యేక బృందాలతో విచా రణ నిర్వహించాం. ఆర్బీఐ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపె నీస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ మోసానికి పాల్పడ్డారని గుర్తించాం.’ అని సీపీ వెల్లడించారు. అరెస్టయినవారు వీరే... ‘ప్రాథమిక విచారణ అనంతరం కంపెనీ సీఎండీలు గుత్తా వేణుగోపాలకృష్ణ (విజయవాడ), గుత్తా కిషోర్ (బళ్లారి, కర్ణాటక), డైరెక్టర్లు గంజాల లక్ష్మి, మావూరి వెంకటనాగలక్ష్మి (విజయవాడ), సయ్యద్ జాకీర్‌హుస్సేన్ (గుంటూరు)ను అరెస్ట్ చేశాం. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. అరెస్ట్ చేసినవారిపై విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. వారి నుంచి రెండు కార్లు, రెండు సెల్ఫోన్లు, 728 గ్రాముల బంగారం, 10.5 కేజీల వెండి, రూ.51 లక్షల నగదు, నాలుగు కంప్యూటర్లు, ఒక ల్యాప్‌టాప్, రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. ఎంత వసూలు చేశారు, ఎంత మేరకు మోసానికి పాల్పడ్డారనేది పూర్తిస్థాయి దర్యాప్తులో తేలుతుంది. ఆ సంస్థ ఆస్తులు, సీజ్ చేసిన బ్యాంకు ఖాతాల్లోని నగదు వివరాలను రాష్ట్ర హోం శాఖకు, న్యాయస్థానానికి తెలియజేస్తాం. న్యాయస్థానం ఆదేశాల మేరకు మోసపోయిన డిపాజిట్‌దారులకు నగదు చెల్లిస్తాం. ఈ మోసంతో గానీ, సంస్థ నిర్వాహకులతో గానీ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఐదో తరగతి మాత్రమే చదివిన గుత్తా వేణుగోపాలకృష్ణ 1998లో క్వాంటమ్ మనీ సర్క్యులేషన్ స్కీంలో చేరాడు. ఆ తర్వాత మరికొన్ని సంస్థలలో చేరి మనీ సర్క్యులేషన్, మల్టీలెవల్ మార్కెటింగ్‌పై అవగాహన పెంచుకుని హైదరాబాద్‌లో సొంతగా ప్లాంట్ ఎన్రిచ్ ఎంటర్‌ప్రైజస్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత విజయవాడ వచ్చి సంకల్ప సిద్ధి ఈ–కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించాడు.’ అని సీపీ రాణా వివరించారు. -
HYD: కంచే చేను మేసింది.. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో పదిమందికి జైలుశిక్ష
సాక్షి, హైదరాబాద్: కంచే చేను మేసింది. ఎవరూ గమనించలేదనుకుంది. కానీ, ఎట్టకేలకు పాపం పండింది. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన ఓ బ్యాంక్ మేనేజర్‌తో పాటు పదిమంది దోషులకు న్యాయస్థానం కఠిన కారాగార శిక్షలు విధించింది. తొమ్మిదేళ్ల కిందటి నాటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫ్రాడ్ కేసులో బుధవారం ఎట్టకేలకు శిక్షలు ఖరారు చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మోసం కేసులో పదిమందికి జైలు శిక్షలు ఖరారు అయ్యాయి. మొత్తం పది మంది దోషుల్లో ఐదుగురికి ఏడేళ్ల శిక్ష, నలుగురికి మూడేళ్ల శిక్ష, మిగిలిన ఒకరికి ఏడాదిశిక్ష ఖరారు చేసింది. శిక్షతో పాటు దోషులకు జరిమానా సైతం విధించింది. ఇక ఈ కేసులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నష్టానికి కారణమైన ఆరు కంపెనీలకు జరిమానా సైతం విధించింది. ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కై దాదాపు అయిదు కోట్ల రూపాయలు(రూ.4.57 కోట్లు) నకిలీ ఖాతాలకు మళ్లించిన స్కామ్ ఇది. ఈ కేసులో సికింద్రాబాద్ బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సీనియర్ మేనేజర్ శరత్ బాబు జెల్లీతో పాటు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుహాస్ కళ్యాణ్ రామ్‌దాసి కూడా దోషులుగా నిర్దారణ అయ్యారు. మొత్తం పది మంది దోషులతో పాటు ఆరు కంపెనీలకు సైతం జరిమానా విధించింది సీబీఐ కోర్టు. శరత్, సుహాస్‌లు ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై 2013 మార్చిలో.. సీబీఐ కేసు నమోదు చేసింది. 2012 -13 మధ్యకాలంలో.. దాదాపు రూ.5 కోట్లకు వర్కింగ్ క్యాపిటల్ లిమిట్లను మంజూరు చేయడం ద్వారా ఆ నిధులను మంజూరైన వాటి కోసం కాకుండా నకిలీ.. కల్పిత పత్రాలపై మళ్లించినట్లు తేలింది. తద్వారా బ్యాంక్‌కు నష్టం వాటిల్లింది. ఈ కేసులో 2014 ఆగష్టులో నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. విచారణలో నిందితులను దోషులుగా నిర్ధారించి ఇప్పుడు శిక్షలు ఖరారు చేసింది సీబీఐ కోర్టు. ఇదీ చదవండి: ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ.100 కోట్ల నల్లధనం -
రూ.75 లక్షల లాటరీ తగిలింది.. చిన్న ప్రక్రియ అంతే! రూ.34 లక్షలు స్వాహా!
గూడూరు: ‘మీకు రూ.75లక్షలు లాటరీ తగిలింది. చిన్న ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ అకౌంట్‌కు డబ్బులు బదిలీ చేస్తాం...’ అంటూ అజ్ఞాత వ్యక్తి ఫోన్ ద్వారా నమ్మబలికి గూడూరుకు చెందిన ఓ వ్యక్తి నుంచి విడతల వారీగా రూ.34లక్షలు స్వాహా చేశాడు. పది నెలల నుంచి గుట్టుగా సాగుతున్న ఈ మోసం గురించి బాధితుడు మంగళవారం పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది జనవరిలో అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘మీకు రూ.75లక్షలు లాటరీ తగిలింది. ఆ మొత్తాన్ని మీ అకౌంట్లో జమ చేసేందుకు కొన్ని ఫార్మాల్టీస్ పూర్తి చేయాల్సి ఉంది’ అని ఫోన్ చేసిన వ్యక్తి నమ్మబలికాడు. దీంతో అతను అడిగిన పత్రాలను బాధితుడు ఆన్లైన్లో పంపించాడు. ఆ తర్వాత ‘మీకు మేము అందజేసే డబ్బులకు ఇన్కమ్ ట్యాక్స్ రూ.5.75లక్షలు ముందుగా కట్టాలి. అప్పుడే ఆ మొత్తాన్ని మీ అకౌంట్‌కు బదిలీ చేయగలం...’ అని చెప్పాడు. దీంతో అంత మొత్తం తన వద్ద లేదని బాధితుడు చెప్పగా, కాస్త సమయం ఇస్తున్నామని, ఎలాగైనా డబ్బులు చెల్లించి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అజ్ఞాత వ్యక్తి నమ్మబలికాడు. ఎట్టకేలకు బాధితుడు రూ.5.75లక్షలను అజ్ఞాత వ్యక్తి చెప్పిన బ్యాంక్ అకౌంట్లో జమ చేశాడు. మళ్లీ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఆదాయపన్ను చెల్లించామని, జీఎస్టీ కోసం కొంత మొత్తం పంపాలని చెప్పగా, అకౌంట్లో బాధితుడు డబ్బులు వేశాడు. ఇలా పలుమార్లు డబ్బులు జమ చేశాడు. చివరిగా ఇటీవల అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ‘ఇక ప్రాసెస్ మొత్తం పూర్తయింది. రూ.4.5లక్షలు చెల్లిస్తే రూ.75లక్షలు మీ అకౌంట్లో జమ అవుతుంది’ అని చెప్పాడు. దీంతో అంత డబ్బు తన వద్ద లేవని బాధితుడు చెప్పగా, రూ.50వేలు పంపాలని, మిగిలినవి తామే జమ చేస్తామని నమ్మబలికాడు. బాధితుడు మళ్లీ రూ.50వేలు అకౌంట్లో వేశాడు. ఈ విధంగా వివిధ పేర్లు చెప్పి విడతల వారీగా రూ.34లక్షలు అజ్ఞాత వ్యక్తి తన అకౌంట్లలో జమ చేయించుకున్నాడు. అయినా బాధితుడికి లాటరీ డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గూడూరు వన్‌టౌన్ ఎస్ఐ హజరత్‌బాబు తెలిపారు. గతంలోనూ మహిళకు టోకరా... అదే విధంగా గతంలోనూ గూడూరు రూరల్ పరిధిలోని కంభంపాటి లక్ష్మీదేవి అనే మహిళకు లాటరీ వచ్చిందని గుర్తుతెలియని వ్యక్తులు నమ్మబలికి ఆమె నుంచి రూ.5.9లక్షలు స్వాహా చేశారు. ఈ మేరకు జనవరిలో గూడూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. -
బాధితులే నిందితులుగా..!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక మంది నుంచి రూ.903 కోట్లు వసూలు చేసి దేశం దాటించేసిన ఘరానా స్కామ్ దర్యాప్తులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కీలకాంశాలు గుర్తించారు. గేమింగ్, ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ల వెనుక చైనీయులు ఉన్నట్లు తేల్చారు. ఒకదాంట్లో బాధితులుగా మారిన వారిని సంప్రదిస్తూ మరో స్కామ్‌లో తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. వారితో అవసరమైన బ్యాంకు ఖాతాలు తెరిపిస్తూ నిందితులుగా మారుస్తున్నారని అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ వ్యవహారాలకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్‌తో కలసి మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ విన్‌తో సహా ప్రత్యేక ప్రో గ్రామింగ్తో కూడిన గేమ్‌లను అనేక యాప్‌లను చైనీయులు తయారు చేస్తున్నారు. ఆన్లైన్లో వీటిలోకి ప్రవేశిస్తున్న యువతకు ప్రోగ్రామింగ్ కారణంగా తొలినాళ్లల్లో లాభాలు వస్తాయి. నమ్మకం పెరగడంతో వాళ్లు పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతారు. ఆపై అదృశ్యమైపోయే ఆ యాప్‌లు బాధితుడిని నిలువుగా ముంచేస్తాయి. తొలుత గేమింగ్ యాప్‌ల్లో నష్టపోయిన వారి చిట్టా ఫిలిప్పీన్స్‌లోని అలెన్‌కు చేరుతోంది. ఇతనికి.. రూ.903 కోట్ల ఫ్రాడ్‌లో ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన చైనీయుడు చుచున్ యోతో సంబంధాలున్నా యి. బాధితుల చిట్టా అందుకున్న అలెన్.. దాన్ని చుచున్‌కు పంపిస్తాడు. తమకు అవసరమైన బ్యాంక్ ఖాతాలు తెరిచి అందిస్తే నెలకు రూ.60 వేల వరకు జీతం, కమీషన్లు ఇస్తామని బాధితులకు చుచున్ ఎరవేస్తాడు. దీంతో అనేక మంది తమ పేర్లతోపాటు కుటుంబీకులు, బంధువుల పేర్ల తో ఖాతాలు తెరిచారు. వాటి నెట్ బ్యాంకింగ్ వివరాలు, లింకై ఉన్న ఫోన్ నంబర్ సిమ్ కార్డు ముంబైలో ఉన్న చుచున్‌కు చేరతాయి. అతను వాటిని అలెన్‌కు పంపిస్తున్నాడు. అక్కడ నుంచి అసలుకథ మొదలవుతుంది. ఖాతాదారుల నుంచి యాప్‌ల ద్వారా సంప్రదించే అలెన్ ఆ ఖాతాల్లో డబ్బు జమ చేయిస్తాడు. ఆ మొత్తం తమ ఖాతాల్లోకి మారుస్తూ.. సహకరించినవారికి జీతం, కమీషన్ ఇస్తున్నాడు. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. హైదరాబాద్‌కు చెందిన నాగప్రసాద్ గేమింగ్ యాప్‌లో రూ.20 లక్షలు నష్టపోయాడు. అదే యాప్ ద్వారా అలెన్ వల్లో పడి ముంబైలో ఉన్న చున్ ద్వారా తన బ్యాంక్ ఖాతా వివరాలు పంపాడు. ఇతడి మాదిరిగానే రామ్ అనే బాధి తు డు తన బావమరిది అనిల్ బ్యాంకు ఖాతా వివరాలు, సాగర్ తన స్నేహితుడైన శ్రీనివాస్ భార్య బ్యాంకు ఖాతా వివరాలు పంపారు. యాప్‌ల ద్వారా వచ్చే డబ్బు ఈ ఖాతాల్లో పడేలా చేసే అలెన్.. రూ.కోట్లు స్వాహా చేసేవాడు. చున్ విచారణ, అతడి ఫోన్ విశ్లేషణతో ఈ వివరాలు గుర్తించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రామ్, శ్రీనివాస్, సాగర్, నాగప్రసాద్‌ను అరెస్టు చేశారు. చుక్తోపాటు అప్పట్లో నగరా నికి చెందిన బ్యాంక్ ఖాతాదారులు సయ్యద్ సుల్తాన్, మిర్జా నదీమ్ బేగ్, పర్వేజ్ పట్టుబడిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో ఉంటున్న ఇమ్రాన్ ద్వారా వీరు ఈ ఉచ్చులో చిక్కుకున్నట్లు తేలడంతో పోలీసులు అతడిపై లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. తర్వాత ఇమ్రాన్ దుబాయ్ నుంచి వస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌కు చిక్కాడు. ఈ క్రమంలో సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తనతో వీఓఐపీ కాల్స్ ద్వారానే సంప్రదించాలంటూ నాగప్రసాద్‌తో అలెన్ చెప్పాడని, దీని కోసం ఓ యంత్రాన్ని పంపాడని, దాన్నీ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
ఆ సొమ్మంతా ఎవరికి వెళ్లింది?
సాక్షి, హైదరాబాద్: కాంబోడియా కేంద్రంగా చైనీయులు సాగించిన ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్’కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మొత్తం పది మంది నిందితులు ఉండగా.. ఒకరికి ఢిల్లీలోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చైనా, తైవాన్ జాతీయులు సహా మిగతా తొమ్మిది మందిని గురువారం కోర్టులో హాజరుపర్చి, జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో కీలక నిందితులుగా ఉన్న సన్నీ, సాహిల్‌లు హవాలా మార్గంలో దుబాయ్‌కు రూ.903 కోట్లు పంపినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో సన్నీ ద్వారా వెళ్లిన డబ్బు వరుణ్ అరోరా, భూపేష్ అరోరాలకు చేరినట్టు తేల్చారు. సన్నీని ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. ఇక సాహిల్ హవాలా మార్గంలో పంపిన రూ.400 కోట్లు దుబాయ్‌లో ఎవరికి చేరాయన్నది ఆరా తీస్తున్నారు. కాగా.. ఈ కేసు విషయంగా హైదరాబాద్ ఈడీ అధికారులు గురువారం సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఎఫ్ఐఆర్, ఇతర వివరాలను తీసుకున్నారు. ఐబీ అధికారులు కూడా ఫోన్ చేసి పలు వివరాలను తెలుసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కమీషన్ల కోసం నిబంధనలను పాతర వేసి.. భారతీయ కరెన్సీని తీసుకుని విదేశీ కరెన్సీని ఇచ్చే ‘ఆథరైజ్డ్ మనీ చేంజింగ్ (ఏఎంసీ)’సంస్థలకు రిజర్వు బ్యాంకు లైసెన్సులు ఇస్తుంది. ఈ మనీ చేంజింగ్ కోసం కొన్ని నిబంధనలు పెట్టింది. విదేశాలకు వెళ్లే వారికి వీసా, పాస్‌పోర్ట్ వంటివి పరిశీలించి నగదును విదేశీ కరెన్సీలోకి మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఢిల్లీలో రంజన్ మనీ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్, కేడీఎస్ ఫారెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థలను ఏర్పాటు చేసిన నవ్‌నీత్ కౌశిక్ ఈ నిబంధనలను పక్కనపెట్టేశాడు. కేవలం ఇద్దరు క్లయింట్లతో ఒప్పందం కుదుర్చుకుని రూ.903 కోట్లను డాలర్లుగా మార్చి ఇచ్చాడు. ఇందుకోసం రూ.1.8 కోట్లు కమీషన్‌గా తీసుకున్నాడు. అయితే ఇంత భారీగా మనీ చేంజింగ్ జరుగుతున్నా.. రిజర్వు బ్యాంకు, ఈడీ వంటివి పసిగట్టలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
5జీకి మారాలనుకుంటున్నారా? ఆ లింక్‌ను క్లిక్ చేశారంటే అంతే..
హలో మీరు 5జీకి మారాలనుకుంటున్నారా?, లింక్‌ను క్లిక్ చేయండి అంటారు. లేదా మీ 5జీ నంబర్‌ను బ్యాంకు ఖాతాకి లింక్ చేయాలి, ఓటీపీ చెప్పండి ప్లీజ్ అని అడిగితే అది మోసగాళ్ల పనేనని తెలుసుకోండి. 5జీ పేరుతో అప్పుడే సైబర్ నేరగాళ్లు సొమ్ము కాజేసే ప్రయత్నాలు ప్రారంభించారు. దేశంలో 5 జీ మొబైల్ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో సైబర్ కేటుగాళ్లు అప్పుడే రంగంలోకి దిగారు. మీ నెట్‌వర్క్‌ను అప్డేట్ చేసుకోండి అని వంచనకు పాల్పడే అవకాశం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఇప్పటికే బెంగళూరు తో పాటు దేశవ్యాప్తంగా ఎంపికచేసిన కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా 5 జీ నెట్వర్క్ సేవలు ప్రారంభం కావడం తెలిసిందే. ప్రజలు 4 జీ నుంచి 5జీ కి అప్డేట్ కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని జిల్లాల్లో సైబర్ మోసాల పట్ల జాగృతం చేస్తున్నారు. జిల్లాకేంద్రాల్లో కరపత్రాలు ముద్రించి సార్వజనిక స్థలాల్లో పంచుతున్నారు. లింక్ ఓపెన్ చేయరాదు మొబైల్ 5 జీ నెట్‌వర్క్‌కు, బ్యాంక్ అకౌంట్ కు ఎలాంటి సంబంధం ఉండదు. సైబర్ వంచకులు బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నంబరును 5 జీ నెట్వర్క్ కు అప్డేట్ చేస్తామంటారు. నమ్మి వారు చెప్పినట్లు చేస్తే చిక్కుల్లో పడతారని పోలీసులు హెచ్చరించారు. లింక్ పంపించి క్లిక్ చేయమంటే స్పందించరాదు. చదవండి: పులితో ఆటలా? అని అనకండి.. ముద్దులాటలు కూడా..! వైరల్ వీడియో నమ్మితే అంతే సైబర్ వంచకులు ఎయిర్టెల్, జియోతో పాటు ఇతర మొబైల్ నెట్వర్క్ కంపెనీల కాల్‌సెంటర్ల పేరుతో ఫోన్ చేస్తారు. సిమ్‌కార్డును 5 జీ కి అప్డేట్ చేస్తామని, ఓటీపీ ని చెప్పాలని నమ్మిస్తారు. ఓటీపీ చెప్పారో.. బ్యాంకు ఖాతాలో నగదు మాయం చేస్తారు. ఇటువంటి కాల్స్‌ను అస్సలు నమ్మరాదని పోలీసులు తెలిపారు. ఇటీవల వస్తున్న మొబైల్ స్మార్ట్ ఫోన్లు 5 జీ నెట్వర్క్ కు సపోర్ట్ చేస్తాయి. కానీ పాత మొబైల్స్ 4జీ నెట్‌వర్క్‌కు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో సైబర్ వంచకులు, 4 జీ మొబైల్స్‌ను 5జీ కి అప్డేట్ చేస్తామని కాల్స్ చేయడం మొదలైంది. వాట్సాప్ మెసేజ్, లింక్‌లు పంపుతారు. వాస్తవంగా 4జి మొబైల్స్‌ని 5జీ కి అప్డేట్ చేయడం సాధ్యం కాదు. -
కొంపముంచుతున్న ఇన్సూరెన్స్ మోసాలు.. చెక్ పెట్టండిలా
గత ఆర్థిక సంవత్సరపు (2021–22) ఎకనమిక్ సర్వే ప్రకారం దేశీయంగా జీవిత బీమా పాలసీల విస్తృతి 2.82 శాతం (2019లో) నుంచి 2020లో 3.20 శాతానికి పెరిగింది. గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి వల్ల తలెత్తిన అనిశ్చితి భయాల కారణంగా ఆర్థిక భద్రత కోసం జీవిత బీమా ప్రాధాన్యాన్ని గుర్తించడం పెరిగింది. అయితే, డిజిటలీకరణ నేపథ్యంలో బీమా సంబంధ మోసాల సంఖ్య కూడా పెరుగుతోంది. డేటా అంతా ఆన్లైన్లో దొరుకుతుండటంతో అమాయక కస్టమర్లను స్కామర్లు సులభంగా మోసం చేయడానికి ఆస్కారం ఉంటోంది. వీటిని అరికట్టేందుకు పరిశ్రమ తన వంతు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ రకాల మోసాలు, వాటిని ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేదే ఈ కథనం. ఫోన్ మోసాలు: కస్టమర్లను తప్పుదోవ పట్టించి వారిని మోసగించేందుకు స్కామర్లు ఎక్కువగా ఉపయోగించే విధానం ఇది. మోసగాళ్లు తమను తాము ఇన్సూరెన్స్ ఏజంట్లుగా పరిచయం చేసుకుని, వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకుని, తప్పుడు జీవిత బీమా ప్లాన్లను అంటగడుతూ ఉంటారు. ఈ–మెయిల్ మోసాలు: ప్రీమియంలు కట్టకపోవడం వల్ల పాలసీ ల్యాప్స్ అయిపోయిందంటూ కస్టమరుకు ఈమెయిల్స్ వస్తుంటాయి. మెయిల్లో ఇచ్చిన లింకును క్లిక్ చేసి, పేమెంట్ చేయడం ద్వారా పాలసీని పునరుద్ధరించుకోవాలని సూచిస్తాయి. నకిలీ వెబ్సైట్లు: కొందరు మరో అడుగు ముందుకేసి ఏకంగా నకిలీ వెబ్సైట్లను సృష్టించి కస్టమర్లను బురిడీ కొట్టిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి వెబ్సైట్లు ఎలాంటి పేపర్ వర్క్, డాక్యుమెంటేషన్, కేవైసీ, హెల్త్ చెక్ లాంటివి ఏమీ అవసరం లేకుండానే పాలసీ ఇచ్చేస్తామని చెబుతుంటాయి. మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో సైన్ అప్ చేస్తే చాలని ఊరిస్తాయి. తద్వారా మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను తస్కరిస్తాయి. లబ్ధిదారులకు చెల్లింపులు: ఈ రకం స్కాముల్లో .. ఎవరో దూరపు చుట్టం పాలసీకి సంబంధించి లబ్ధిదారు మీరేనంటూ ఎస్ఎంఎస్లు వస్తుంటాయి. ఆ మొత్తాన్ని పొందేందుకు నామమాత్రంగా ముందు కొంత డౌన్‌పేమెంట్ లేదా ప్రాసెసింగ్ ఫీజు కింద కొంత డబ్బు కట్టాలని వాటిలో ఉంటుంది. కట్టారో అంతే సంగతులు. ఓటీపీమోసాలు: ఇలాంటి కేసుల్లో.. మోసగాళ్లు తమను తాము ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులుగా పరిచయం చేసుకుని, మీ ఫోన్‌కి వచ్చిన ఓటీపీని చెప్పాలని అడుగుతారు. అలాగే, నకిలీ యాప్‌లు, మాల్వేర్ లింకులను పంపి వాటిని డౌన్లోడ్ చేసుకోవాలంటూ సూచించవచ్చు. అనధికారిక వ్యక్తులు పాలసీలను విక్రయించడం: కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు సిసలైనవిగా అనిపించినప్పటికీ వాటికి ఐఆర్డీఏఐ అనుమతులు ఉండకపోవచ్చు. అలాంటి సంస్థలు అక్రమమైనవి. వాటి నుంచి పాలసీలు తీసుకుంటే మోసపోతారు. తప్పుడు పాలసీలు అంటగట్టడం: మొత్తం ఖర్చుల గురించి మీకు పూర్తిగా వివరించకుండా బీమా పాలసీని అంటగట్టడం ఈ కోవకి వస్తుంది. అంతే గాకుండా పాలసీలో ఆఫర్ చేస్తున్న దానికి మించి మీకు మరిన్ని ప్రయోజనాలు వచ్చేలా చేస్తామంటూ తప్పుడు హామీలు కూడా ఇవ్వొచ్చు. ఇలా చేయండి .. కస్టమర్లు ఇలాంటి మోసాల బారిన పడకుండా బీమా కంపెనీలు తమ వంతు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.అయినప్పటికీ కస్టమర్లు కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, సురక్షితంగా ఉండవచ్చు. అవేమిటంటే.. ► పుట్టినతేదీ, బ్యాంకు ఖాతా, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఫోన్లో చెప్పొద్దు. ► గుర్తు తెలియని వారి దగ్గర్నుంచి వచ్చే ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్‌లో పేమెంట్ లింకులపై క్లిక్ చేయొద్దు. ►మరీ అతిశయమైన ఆఫర్లు ఇచ్చే నకిలి వెబ్సైట్లు, ఇన్సూరెన్స్ పాలసీలకు దూరంగా ఉండాలి. బీమా కంపెనీ వెబ్సైట్లో మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలు సమర్పించే ముందు అది సురక్షితమై న, సిసలైన పోర్టలేనా అని ధృవీకరించుకోవాలి. ►మీ క్లెయిమ్‌ను సెటిల్ చేసేందుకు లేదా లబ్ధిదారులకు చెల్లింపులు జరిపేందుకు బీమా కంపెనీలు ఎటువంటి డౌన్‌పేమెంట్ లేదా ప్రాసెసింగ్ ఫీజులను కోరవు అని గుర్తుంచుకోండి. ►మీ ఫోన్‌కి వచ్చే ఓటీపీలను థర్డ్ పార్టీలు లేదా గుర్తు తెలియని వారికి చెప్పకండి. ►సంతకాలు లేదా చెల్లింపులు చేసే ముందు పాలసీ పత్రాలను క్షుణ్నంగా చదువుకోండి. ►బీమా ఏజెంట్లు అసలైన వారేనా కాదా అనేది ధృవీకరించుకునేందుకు వారి ఐడీ ప్రూఫ్‌లను పరిశీలించండి. ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నా కూడా ఏదైనా జరిగితే సత్వరం ఐఆర్డీఏఐ దృష్టికి కూడా తీసుకు వెళ్లడం శ్రేయస్కరం. అనిల్ పి.ఎం., హెడ్ (లీగల్ అండ్ కాంప్లయెన్స్ విభాగం), బజాజ్ అలయంజ్ లైఫ్ -
తక్కువ ధరకే ఐఫోన్ వస్తుందని.. ఫోన్‌పే ద్వారా రూ. లక్ష పంపాడు.. తీరా చూస్తే
సాక్షి, నిజామాబాద్: ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ అమ్ముతానని చెప్పిన మాటల వలలో పడి ఓ యువకుడు మోసపోయిన ఘటన ధర్పల్లిలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన చింతనాల్ల ప్రసాద్ ఈనెల 10న ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ ఫ్లాట్ ఫాంలో రషీ ద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ అమ్ముతానని చెప్పడంతో బాధితుడు నమ్మి ఫోన్ పే ద్వారా రూ. లక్ష పంపించారు. చివరికి ఫోన్ డెలివరీ అయిన తర్వాత నకిలీ ఫోన్‌గా గుర్తించిన బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. సందర్భంగా ఎస్సై మాట్లాడు తూ బాధితుడు ఫిర్యాదు మేరకు సైబర్ హెల్ప్ లైన్ నంబర్ ద్వారా అమౌంట్ ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సైబర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపడతామని వెల్లడించారు. -
ఐవోబీ మాజీ ఉద్యోగులకు ఐదేళ్ల జైలు
సాక్షి, హైదరాబాద్: తప్పుడు ఆదాయ పన్ను(ఐటీ) ధ్రువపత్రాలతో గృహ రుణాలు మంజూరు చేశారన్న కేసులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) హైదరాబాద్ మాజీ చీఫ్ మేనేజర్ సౌమన్ చక్రవర్తి, మాజీ సీనియర్ మేనేజర్ శంకరన్ పద్మనాభన్‌కు సీబీఐ కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు టి.సత్య వెంకట దివాకర్, జూలూరి లక్ష్మయ్యలకు ఐదేళ్ల జైలు, రూ.75,000 జరిమానా, సయ్యద్ ముస్తక్ అహ్మద్, బొర్ర చంద్రపాల్, తోట రవీందర్, ఎం.గోపాల్‌రావు, బసవన్న రవీంద్రలకు మూడేళ్లు జైలు, రూ.75,000 జరిమానా విధించింది. తప్పుడు పత్రాలు సృష్టించి గృహ రుణాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో 2005లో బ్యాంక్ అధికారులిద్దరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. నకిలీ సేల్ డీడ్లను, గడువు ముగిసిన ఎల్ఐసీ పాలసీలతో రుణాలు మంజూరు చేసినట్లు విచారణలో తేలింది. 2007, నవంబర్‌లో సీబీఐ కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసింది. ఇలా అక్టోబర్ 2003 నుంచి జనవర్ 2004 వరకు ఈ రుణాలు మంజూరు చేసి.. బ్యాంక్‌కు రూ.2.21 కోట్ల నష్టం కలిగించినట్లు తేలడంతో సీబీఐ కోర్టు నిందితులకు శిక్షలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
అభిమానులకు యూట్యూబ్ స్టార్ కుచ్చుటోపీ.. రూ. 437 కోట్లు ముంచేసి
తన డ్యాన్స్ వీడియోలతో అభిమానుల్లో క్రేజ్ తెచ్చుకుంది. యూట్యూబ్‌లో లక్షలాది మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. చివరికి వీదేశీ మారకపు వ్యాపారం పేరుతోవేలాది మంది అభిమానులను నట్టేట ముంచింది. తమ పెట్టుబడులపై భారీ రాబడి ఇప్పిస్తానని మాటిచ్చి సుమారు 55 మిలియన్ డాలర్లకు(భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 437కోట్లు) కుచ్చుటోపీ పెట్టింది. వివారల్లోకి వెళితే.. (Photo Credits: Nutty Instagram) థాయ్‌లాండ్‌కు చెందిన నత్తమోన్ ఖోంగోచక్ అనే యుయవతి తన డ్యాన్స్ వీడియోలు యూట్యూబ్‌లో పోస్టు చేయడం ద్వారా లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. ముద్దుగా నట్టి అని పిలుచుకునే ఈ బ్యూటీకి ప్రస్తుతం 8,44,000 ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్ స్టార్‌గా ఎదిగింది. అంతేగాక తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో ఔత్సాహిక ఫారెక్స్ వ్యాపారుల కోసం ప్రైవేట్ కోర్సులకు ప్రచారం కూడా చేపట్టింది. దీని ద్వారా ఆమె పొందిన లాభాలను సైతం పోస్టు చేసింది. (Photo Credits: Nutty Instagram) View this post on Instagram A post shared by 🎬𝗬𝗼𝘂𝘁𝘂𝗯𝗲: Nutty’s Diary (842k) (@nutty.suchataa) అయితే విదేశీ మారకంలో పెట్టుబడి పెడితే 35 శాతం అధికంగా లాభాలు వస్తానని అభిమానులను, ఫాలోవర్లను నమ్మించింది. నట్టి మాటలను నమ్మిన ఆమె ఫాలోవర్స్ దాదాపు 6వేల మంది డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. అయితే ఉన్నట్టుండి నట్టి తన చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో.. మే నెలలో పెట్టుబడిదారులకు తాను 1 బిలియన్ భాట్ (27.5 మిలియన్ డాలర్లు) బకాయిపడ్డానని చెప్పింది. చదవండి: పెళ్లి కోసం నడి రోడ్డులో వధూవరుల ఛేజింగ్.. వీడియో వైరల్ (Photo Credits: Nutty Instagram) అంతేగాక బ్రోకర్‌గా వ్యవహరించిన వ్యక్తి గత మార్చి నుంచి తన ట్రేడింగ్‌ను ఖాతాను, నిధులను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. ఫాలోవర్స్‌ను మోసం చేయడం తన ఉద్ధేశ్యం కాదని త్వరలోనే వారి పెట్టుబడులు తిరిగి చెల్లించేందకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. అయితే అధిక మొత్తంలో లాభాలు ఇప్పిస్తానని మాటిచ్చి.. నట్టి మోసం చేసిందని బాధితులు థాయ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు 102 మంది 30 మిలియన్ భాట్లు(6 కోట్ల 50 వేలు) కోల్పోయినట్లు ఫిర్యాదు చేయగా.. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని పోలీసులు తెలిపారు. (Photo Credits: Nutty Instagram) View this post on Instagram A post shared by 🎬𝗬𝗼𝘂𝘁𝘂𝗯𝗲: Nutty’s Diary (842k) (@nutty.suchataa) మరోవైపు నట్టిని అరెస్ట్ చేసేందుకు థాయిలాండ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో గత వారం వారంట్ జారీ చేసింది. అయితే జూన్ నుంచి నట్టి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోవడంతో ఆమె దేశం విడిచి పారిపోయినట్లు భావిస్తున్నారు. కానీ ఇమ్మిగ్రేషన్ రికార్డుల ద్వారా ఆమె థాయ్‌లాండ్ విడిచి వెళ్లలేదని తెలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. -
Hyderabad: సాక్ష్యాలు లేక క్లోజవుతున్న కేసులు.. 2021లో ఎన్నో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నేరం జరిగింది... ఫిర్యాదు అందింది... కేసు నమోదైంది... అయితే నిందితుడిని పట్టుకోవడానికి అవసరమైన సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నగరంలో అనేక కేసులు మూతపడుతున్నాయి. ఇలా ఒకటి, రెండు కాదు ఏకంగా 23.66 శాతం కేసులు 2021లో క్లోజ్ అయ్యాయి. నగర కమిషనరేట్ పరిధిలో గత ఏడాది మొత్తమ్మీద 20,142 కేసులు నమోదు కాగా... వీటిలో 4,766 ఈ కారణంగానే మూతపడ్డాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ కారణాన్నే పోలీసు పరిభాషలో ‘ట్రూ బట్ ఇన్సఫీయంట్ ఎవిడెన్స్/అన్ ట్రేస్డ్/నో క్లూ’ అంటారు. ‘ఇలా మూతపడిన కేసులన్నీ గతేడాదికే సంబంధించినవి కాకపోవచ్చు. అంతకు ముందు సంవత్సరాల్లో రిజిస్టరైనవి కూడా ఉండి ఉంటాయి’ అని నగరానికి చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. రెండు చట్టాల కింద కేసులు.. ► సాధారణంగా పోలీసులు రెండు రకాలైన చట్టాల కింద కేసులు నమోదు చేస్తుంటారు. మొదటిని ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) అయితే... రెండోది ఎస్ఎల్ఎల్గా పిలిచే స్థానిక చట్టాలు. 2021కి సంబంధించి సిటీలో ఐపీసీ కేసులు 17,951, ఎస్ఎల్ఎల్ కేసులు 2191 నమోదయ్యాయి. వీటిలో 4034, 723 కేసులు ఇలా క్లోజ్ అయినవే. ► మహిళలపై జరిగే నేరాలకు ఇతర కేసుల కంటే ప్రాధాన్యం ఉంటుంది. అయితే ఈ కేటగిరీకి చెందిన కేసులూ ఆధారాలు లేక క్లోజ్ అయిపోతున్నాయి. క్రైమ్ ఎగనెస్ట్ ఉమెన్‌కి సంబంధించి గతేడాది మొత్తం 2755 కేసులు నమోదు కాగా వీటిలో 598 ఇలానే మూతపడ్డాయి. చిన్నారులపై జరిగిన నేరాలు కేసులు 621 రిజిస్టర్ కాగా... 89 ఇలా క్లోజ్ అయ్యాయి. వృద్ధులపై జరిగిన నేరాల సంఖ్య 314గా, మూతపడినవి 101గా ఉన్నాయి. ► షెడ్యూల్డ్ కులాలపై జరిగిన నేరాలకు సంబధించి 104 కేసులు నమోదు కాగా వీటిలో 34 ఆధారాలు లేక క్లోజ్ అయ్యాయి. షెడ్యూల్ తెగలకు సంబంధించి 28 నమోదు కాగా, 8 ఇలానే మూతపడ్డాయి. ఆర్థిక నేరాల కేసులు 4860 కాగా 1479 ఆధారాలు లభించక మూతపడ్డాయి. సైబర్ నేరాల విషయానికి వస్తే నమోదైన కేసులు 3303, ఇలా మూతపడినవి 1873గా ఉన్నాయి. నగరంలోనే ఎక్కువ.. ► ప్రభుత్వ అధికారుల విధులు అడ్డుకుని, దాడికి పాల్పడిన ఉదంతాలు 2021లో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య హైదరాబాద్ 20గా ఉండగా... ముంబై 10, ఢిల్లీ 8, బెంగళూరు 7 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ప్రవర్తించడం వంటి ఉదంతాలకు సంబంధించిన కేసుల విషయంలోనూ సిటీ మొదటి స్థానంలో ఉంది. ఈ కేటగిరీకి చెందిన కేసులు నగరంలో 28 రిజిస్టర్ కాగా... ఢిల్లీ 17, కోల్‌కతా 13, బెంగళూరు 10, ముంబై 5 నమోదయ్యాయి. ► వివిధ రకాలైన మోసాలతో కూడిన ఫ్రాడ్స్ కేటగిరీ కేసుల నమోదులోనూ హైదరాబాద్ కమిషనరేట్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఈ కేటగిరీలకు చెందిన 2771 కేసులు నమోదయ్యాయి. ఇతర మెట్రో నగరాలైన జైపూర్, ఢిల్లీ, జైపూర్, ముంబై, బెంగళూరుల్లో వీటి సంఖ్య 1488, 1414, 970, 362గా ఉంది. (క్లిక్: హైదరాబాద్‌లో మరో నేతపై పీడీ యాక్ట్) -
నిందితుడిని అరెస్టు చేయబోతుండగా... పోలీసులపై దాడి యూనిఫాం చింపి....
గురుగ్రామ్: ఒక వ్యక్తిని ఫ్రాడ్ కేసు విషయమై పోలీసులు అరెస్టు చేసి పోలీస్టేషన్‌కి తరలిస్తున్నారు. ఇంతలో ఆ నిందితుడు ఇద్దరు చెల్లెళ్లు, తల్లి, సోదరుడు పోలీసులపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ ఘటన గుర్గావ్లో చోటు చేసుకుంది. దీంతో ఆ ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సదరు నిందితుడి సోదరుడు తప్పించుకున్నాడని చెప్పారు. ఈ మేరకు సబ్ ఇన్స్పెక్టర్ కరంబీర్ తమ స్టేషన్లో ఒక ఫ్రాడ్ కేసు నమోదైందని తెలిపారు. తాము ఆ కేసు విషయమై గత కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఈ కేసుకి సంబంధించి అనుమానితుడు కరణ్ సమదర్శ అనే వ్యక్తిని విచారించినట్లు చెప్పారు. అతను ఉత్తరప్రదేశ్‌లో తండా గ్రామంలో తన కుటుంబంతో కలసి ఉంటున్నాడని పేర్కొన్నారు. ఐతే అతను పోలీసుల విచారణలో నిందితుడిగా తేలడంతో అతన్ని అరెస్టు చేస్తున్నట్లు అతని కుటుంబానికి తెలియజేసి, పోలీస్టేషన్‌కి తరలిస్తున్నారు. ఇంతలో అతడి తల్లి ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడు పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి పోలీసుల పై దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ సతేందర్ యూనిఫాం చిరిగిపోయింది. దీంతో స్టేషన్ లోపల ఉన్న మిగతా పోలీసులు సదరు నిందితుడి తల్లి, చెల్లెళ్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కానీ అతని సోదరుడు వరుణ్ తప్పించుకున్నాడని, తొందరలోనే అతన్ని కూడా పట్టుకుంటామని చెప్పారు. (చదవండి: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త ) -
అవినీతి కేసులో దోషిగా మలేసియా మాజీ ప్రధాని.. 12 ఏళ్ల జైలు శిక్ష
పుత్రజయ(మలేసియా): అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌ను దోషిగా తేలుస్తూ ఆ దేశ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. దీంతో మాజీ ప్రధానుల్లో చెరసాలకు వెళ్తున్న తొలి వ్యక్తిగా నజీబ్ అప్రతిష్ట మూటగట్టుకోనున్నారు. దోషిగా నిర్ధారణ కావడంతో ఆయనకు హైకోర్టు గతంలోనే 12 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ‘ఆయన చేసిన అధికార దుర్వినియోగం, నమ్మకద్రోహం, మనీ లాండరింగ్ నేరాలకు తగిన శిక్షే ఇది’ అని హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల ఫెడరల్(సుప్రీం) కోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. వెంటనే ఆయన తన జైలుజీవితం మొదలుపెట్టాలని ఆజ్ఞాపించింది. మలేసియా అభివృద్ధికి ఉద్దేశించిన 1 మలేసియా డెవలప్మెంట్ బెహ్రాత్(1ఎండీబీ) నుంచి ఏకంగా 450 కోట్ల అమెరికన్ డాలర్లను నజీబ్ దోచుకున్నారని, 1ఎండీజీ విదేశీ విభాగమైన ఎస్ఆర్సీ ఇంటర్నేషనల్ నుంచి 94 లక్షల డాలర్లు అక్రమంగా పొందారని దర్యాప్తులో తేలింది. దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి మైమన్‌ను ఈ కేసు విచారణ ప్యానెల్ నుంచి తప్పించాలంటూ నజీబ్ అంతకుముందు చేసిన అభ్యర్థననూ కోర్టు తిరస్కరించింది. ఇదీ చదవండి: మరణ శిక్ష రద్దు చేసేందుకు సమ్మతించిన ప్రభుత్వం! -
పొలిటికల్‌గా ఓకే కానీ.. సబ్జెక్టులోనే వీక్.. అడ్డంగా బుక్కైన బీజేపీ నేత
సాక్షి, చెన్నై : తన బదులు మరొకరితో పరీక్ష రాయించేందుకు ప్రయత్నించిన తిరువారూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాస్కర్ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఆయనతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. తిరువారూర్ సమీపంలోని గ్రామ కొండాన్ తిరువికా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఓపెన్ వర్సిటీ పరీక్షలు జరుగుతున్నాయి. శనివారం జరిగిన పొలిటికల్ సైన్స్ రెండో సంవత్సరం పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థిపై ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి హాల్ టికెట్ క్షుణ్ణంగా పరిశీలించారు. అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్లి విచారించారు. వ్యవహారం తొలుత రహస్యంగానే సాగినా, పోలీసులు రంగంలోకి పోలీసులు దిగి పరీక్షకు హాజరైన వ్యక్తి తిరువారూర్ సభాపతి మొదలియార్ వీధికి చెందిన దినకరన్(39)గా గుర్తించారు. ప్లస్ టూ పూర్తి చేసి, ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై దృష్టి పెట్టిన దినకరన్ అప్పుడప్పుడు రోడ్డు సైడ్ బిర్యానీ కొట్టు నడిపేవాడని తేలింది. పూర్తి వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు స్టేషన్‌కు తరలించి తమదైన స్టైల్లో విచారించారు. బీజేపీ విద్యార్థిసంఘం నేత రమేష్ తనను పరీక్ష రాయమని పంపించాడని, ఎవరి బదులు పరీక్ష రాస్తున్నానో తెలియదని తెలిపాడు. అర్ధరాత్రి పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తిరువారూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాస్కర్ రాయాల్సిన పరీక్షకు దినకరన్‌ను పంపినట్లు తెలిపాడు. వెంటనే భాస్కర్‌ను కూడా పోలీసులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో పట్టు లేకపోవడంతో తన బదులు మరొకరిని పరీక్షకు పంపించినట్టు అంగీకరించాడు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి, ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: బీజేపీకి బిగ్ షాక్.. -
Hyderabad: యువతి ఫోన్‌కు స్పందించి రహస్యంగా కలిసేందుకు వెళ్లడంతో..
సాక్షి, హైదరాబాద్: మగువ ఫోన్‌కు స్పందించి రహస్యంగా కలువడానికి వెళ్లిన ఓ బాధితుడు మోసపోయిన సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని మహిళ పాత పాల్వంచ, కొత్తగూడెం–భద్రాద్రి జిల్లాకు చెందిన ఏ2 పల్లపు రోజ, అలియాస్ మానస(24), జనప్రియ వెస్ట్‌సిటీ, మియాపూర్‌కు చెందిన ఎడ్ల శ్రీపాల్‌రెడ్డికి ఫోన్ చేసింది. ఫోన్‌కు స్పందించి ఆమెను కలువడానికి జూన్ 27న పోచారం మున్సిపాలిటీ శివాలయం దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో అక్కడే కాపుకాసిన హమాలి కాలనీ పాల్వంచ, కొత్తగూడెంకు చెందిన ఏ1 కందుల వంశీ అలియాస్ కుమార్(35), ఏ3 శ్రీరాంపురం, భీమవరం, పశ్చిమగోదావరికి చెందిన సాగి వర్మ (26), ఏ4 పోచారం శివాలయంలో సమీపంలో నివసించే సీతానగర్, పాల్వంచ, పశ్చిమ గోదావరికి చెందిన పల్లపు దేవి(25) అతడిని నిర్బంధించారు. అతడిని బెదిరించి హెచ్డీఎఫ్ డెబిట్ కార్డు ద్వారా రూ.లక్ష, ఏటీఎం ద్వారా పలు దఫాలుగా రూ.2,02,254లు లాక్కున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పీఎస్‌లో కేసు నమోదైంది. జూన్ 30న రాత్రి కుషాయిగూడలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించగా పై కేసులో నిందితులని తేలింది. వారి దగ్గరి నుంచి రూ.1,60,254లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించామన్నారు. కాగ ఏ1, ఏ2లు ఒక జంటగా, ఏ3, ఏ4లు భార్యభర్తలు. తక్కువ సమయంలో కేసు చేధించిన సీఐ చంద్రబాబు, డీఐ జంగయ్య, క్రైం ఎస్సై సుధాకర్ సహచర బృందాన్ని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ అభినందించారు. చదవండి: హైదరాబాద్‌లో భారీగా తగ్గిన క్యాబ్‌లు, ఆటోలు! -
రూ. 300 కోట్ల మోసానికి పాల్పడ్డ భారత సంతతి వ్యక్తి అరెస్ట్
$45 Million Investment Fraud: నీల్ చంద్రన్ అనే భారత సంతతి అమెరికన్ దాదాపు రూ. 300 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డాడని అమెరికా న్యాయస్థానం పేర్కొంది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపింది. చంద్రన్ తన కంపెనీలలోని పెట్టుబడుదారులకు అధిక ఆదాయం వస్తుందంటూ తప్పుడూ ఆధారాలను చూపి సుమారు 10 వేలమందిని మోసం చేశాడని పేర్కొంది. నేరారోపణ ప్రకారం..."తన కంపెనీలలోని ఒకటి లేదా రెండు కంపెనీలను 'ViRSE' అనే బ్యానర్‌తో నిర్వహిచడమేక కాకుండా ఎక్కువ ఆదాయం వస్తున్నట్లుగా చూపించే సాంకేతిక కంపెనీలను చంద్రన్ కలిగి ఉన్నాడు. పైగా ఈ కంపెనీలు సంపన్న కొనుగొలుదారుల కన్సార్టియం ద్వారా కొనగోలు చేయబడుతోందంటూ తప్పుడు సాక్ష్యాలు చూపాడు. వాస్తవానికి అతని కంపెనీలో సంపన్న కొనుగోలుదారులు ఉంటేనే పెట్టుబడుదారలకు ఆదాయం వస్తుంది. కానీ చంద్రన్ కంపెనీలో అలాంటి సంపన్న కొనుగోలుదారులు ఎవరు లేరు. చంద్రన్ పై మూడు ఫ్రాడ్ కేసులు, అక్రమంగా పొందిన ఆస్తిలో లావాదేవీలు జరిపినందుకుగానూ అదనంగా మరో రెండు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ చంద్రన్ పై మోపబడిన ఈ అబియోగాలు రూజువైతే మూడు ఫ్రాడ్ కేసుల్లో ఒక్కొక్క ఫ్రాడ్ కేసుకి 20 ఏళ్లు చొప్పున జైలు శిక్ష , అలాగా అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించిన రెండు కేసుల్లో ఒక్కొక్క కేసుకి 10 ఏళ్లు చొప్పున శిక్ష పడుతుందని అమెరికా న్యాయస్థానం పేర్కొంది. అంతేకాదు చంద్రన్ వద్ద ఉన్న 39 టెస్లా వాహనాలతో సహా 100 వేర్వేరు ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, రియల్ ఎస్టేట్ తదితర ఆస్తులు మోసాలు ద్వారా సంపాదించిన ఆస్తులుగా జప్తు చేయబడతాయని స్పష్టం చేసింది. (చదవండి: పాక్‌లో ఇంటర్నెట్ బంద్ హెచ్చరికలు! కారణం ఏంటంటే..) -
Hyderabad: రెస్టారెంట్లో పెట్టుబడులంటూ రూ.13 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసి క్యూబా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌ను చూపిస్తూ అందులో పెట్టుబడుల పేరుతో అనేక మంది నుంచి రూ. 13 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసిన కేసులో తల్లీకుమారులను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. క్యూబా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిర్వహించే నాగెల్లి రూపస్ ఆయన భార్య నాగెల్లి సుకన్య, కుమారుడు జసింత్ జీటీఎఫ్‌ఎల్ మినిస్ట్రీస్ పేరుతో చర్చిల్ని నిర్వహిస్తున్నారు. అక్కడకు వచ్చిన వారిని నమ్మించిన ఈ త్రయం వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో భారీగా వసూలు చేశారు. 2017–18ల్లో దాదాపు 30 మంది నుంచి రూ.13 కోట్ల వరకు తీసుకున్నారు. తమ డబ్బు ఇవ్వమని అడిగిన వారిని బెదిరించడం వారిపైనే కేసులు పెట్టడం చేస్తున్నారు. వీరికి రూ.కోటి వరకు ఇచ్చి మోసపోయిన కేవీ ప్రసాద్ అనే బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన ఏసీపీ సందీప్‌కుమార్ బుధవారం సుకన్య, జసింత్‌లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న రూపస్ కోసం గాలిస్తున్నారు. వీళ్లు విదేశాల్లోని వారి నుంచి డబ్బు తీసుకున్నారని, తెనాలీలోనూ వీరిపై కేసులు ఉన్నాయని ప్రసాద్ తెలిపారు. చదవండి: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. టెన్షన్.. అటెన్షన్! -
సైబర్ క్రిమినల్... ట్రిపుల్ యాక్షన్!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. నగరానికి చెందిన ఓ మహిళను మోసం చేయడానికి ఉత్తరాదికి చెందిన ఓ సైబర్ క్రిమినల్ ట్రిపుల్ యాక్షన్ చేశాడు. బాధితురాలి నుంచి ఇప్పటికే రూ.3 లక్షలు కాజేసిన అతగాడు మరో రూ.13 లక్షల కోసం బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె సోమవారం సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళ మానసిక నిపుణురాలు. వివాహిత అయినప్పటికీ కొన్నాళ్ల క్రితం అనివార్య కారణాలతో భర్తకు దూరంగా ఉంటోంది. ఈమెకు ఫేస్బుక్ ద్వారా సుమిత్ సిరోహి అనే వ్యక్తితో పరిచయమైంది. ఈ పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసింది రాజస్థాన్‌కు చెందిన సైబర్ నేరగాడిగా తెలుస్తోంది. నగర మహిళ, సుమిత్ కొన్నాళ్లు ఫేస్బుక్ ద్వారా చాటింగ్ చేసుకున్నారు. ఆపై ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని వాట్సాప్‌లోనూ సంప్రదింపులు జరిపారు. తాను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఎస్సైగా సుమిత్ పరిచయం చేసుకున్నాడు. ఒకటి–రెండుసార్లు బాధితురాలితో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడాడు. ఆ సందర్భాల్లో యూనిఫాంలో ఉండి, వెనుక పోలీసులు కనిపించే చేసి ఈమెను పూర్తిగా నమ్మించాడు. అలా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి పదోన్నతి వచ్చాక చేసుకుందామని ఎర వేశాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఫేస్బుక్ ద్వారానే బాధితురాలికి రవి కపూర్ అనే వ్యక్తితో పరిచయమైంది. ఈ పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసి, బాధితురాలిని పరిచయం చేసుకున్నదీ సుమిత్‌గా చెప్పుకున్న సైబర్ నేరగాడే. ఈమెతో చాటింగ్ చేసిన ఇతగాడు ముంబైలో నివసించే తాను ఓ బాలీవుడ్ ప్రముఖుడినని చెప్పాడు. దీంతో సుమిత్‌కు పదోన్నతి కల్పించాలని ఆమె రవిని కోరింది. అందుకు అంగీకరించిన అతడు సుమిత్‌ను తనకు పరిచయం చేయమని చెప్పాడు. దీంతో ఇతడి నెంబర్ సుమిత్‌కు ఇచ్చిన మహిళ ఆయనతో మాట్లాడమని చెప్పింది. ఆ తర్వాత ఈమెకు కాల్ చేసిన రవి పదోన్నతి ఇప్పించడానికి రూ.20 లక్షలు ఖర్చవుతాయని చెప్పాడు. ఇతడు మాత్రం వీడియో కాల్స్ చేయలేదు. ఇదే విషయం సుమిత్‌కు చెప్పిన బాధితురాలు వీలైనంత ఏర్పాటు చేయమంది. అయితే తన వద్ద కేవలం రూ.13 లక్షలు ఉన్నాయని, ఆ మొత్తం నీకు పంపిస్తానని చెప్పాడు. మిగిలింది కలిపి రవికి పంపాలని, మనం తర్వాత చూసుకుందామని నమ్మించాడు. ఏ దశలోనూ రవి పేరుతోనూ మాట్లాడుతున్నది తానే అని ఈమెకు తెలియనీయలేదు. వివిధ దఫాల్లో రూ.13 లక్షల్ని గూగుల్ పే ద్వారా నగర మహిళకు పంపిన సుమిత్ దానికి మరికొంత జోడించి రవికి పంపాలన్నాడు. ఇది నమ్మిన బాధితురాలు తన బంగారం కుదువపెట్టి రూ.3 లక్షలు జోడించింది. ఈ రూ.16 లక్షల్ని రవి అనే వ్యక్తి చెప్పిన ఖాతాకు పంపింది. ఇలా రెండు పాత్రల్ని పోషించిన సైబర్ నేరగాడు డబ్బు చేతికి అందాక మూడో అవతారం ఎత్తాడు. రవి కపూర్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగిగా బాధితురాలికి పరిచయమయ్యాడు. పదోన్నతికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని కొన్ని రోజులు చెప్పాడు. ఆపై హఠాత్తుగా ఫోన్ చేసి రవి కపూర్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడన్నాడు. ఆపై అతడి ఫోన్ పని చేయలేదు. ఈ విషయాన్ని బాధితురాలు సుమిత్‌కు చెప్పింది. ఇలాంటి సందర్భం కోసమే ఇంత కథ నడిపిన సైబర్ నేరగాడు అప్పుడు అసలు ఘట్టం మొదలెట్టాడు. తనకు రవి ఎవరో తెలియదని, నీవే పరిచయం చేశావంటూ ఆరోపించాడు. రూ.13 లక్షలు సైతం నేను నీకే పంపానని, ఆ మొత్తం నువ్వే తిరిగి ఇవ్వాలని బెదిరించాడు. అలా చేయకుంటే ఇంటికి వచ్చి గొడవ చేయడంతో పాటు కేసు పెడతానంటూ భయపెట్టాడు. దీంతో బాధితురాలు సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ మూడు పాత్రలు పోషించింది ఒకే సైబర్ నేరగాడని, అతడి ముఠా సభ్యలు సహకరించారని తేల్చారు. వీరిని పట్టుకోవడానికి సాంకేతికంగా ముందుకు వెళ్తున్నారు. (చదవండి: చుక్కలు చూపించింది! పెళ్లి చేసుకున్న నెలకే గెంటేసి....) -
కుమార్తె కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. రూ.లక్ష అడ్వాన్స్ తీసుకుని
సాక్షి, హైదరాబాద్: గూగుల్‌లో కాల్ సెంటర్ల నెంబర్లే కాదు... వివిధ సంస్థలూ బోగస్‌వి ఉంటున్నాయి. తన కుమార్తె కోసం డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదించాలని భావించిన అత్తాపూర్ వాసి ఇలాంటి సంస్థ వల్లోపడి రూ.లక్ష నష్టపోయారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు నిమిత్తం సైబరాబాద్‌కు బదిలీ చేయాలని నిర్ణయించారు. అత్తాపూర్‌కు చెందిన బాధితుడు (62) ఓఅపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. తన కుమార్తెకు వివాహం చేయాలనే ఉద్దేశంతో వివిధ మాట్రిమోనియల్ సైట్స్‌లో రిజిస్టర్ చేశారు. దీంతో ఆయనకు అనేక ప్రొఫైల్స్ నుంచి ఇబ్బడిముబ్బడిగా ప్రతిపాదనలు వచ్చాయి. వీరిలో ఒకరిని ఎంపిక చేసుకున్న ఆయన ముందుగా అతడి పూర్వాపరాలు పరిశీలించాలని భావించారు. దీనికోసం ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని ఎంపిక చేసుకోవడానికి గూగుల్‌లో సెర్చ్ చేశారు. అందులో కనిపించిన నెంబర్ ద్వారా ఓ సంస్థను సంప్రదించారు. తమది ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఏజెన్సీ అని చెప్పిన అవతలి వ్యక్తులు తమకు దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఉందని నమ్మబలికారు. వెరిఫికేషన్ కోసం అబ్బాయి వివరాలతో పాటు రూ.లక్ష అడ్డాన్స్‌గా చెల్లించాలని కోరారు. కుమార్తె భవిష్యత్తు కోసం ఆ మాత్రం ఖర్చు చేసినా పర్వాలేదని భావించిన బాధితుడు ఆ మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించాడు. ఆ తర్వాత సదరు ఫోన్ నెంబర్ పని చేయకపోవడంతో కొన్ని రోజులు ఎదురు చూసి మరోసారి ప్రయత్నించి మోసపోయానని గుర్తించారు. శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుడు నివసించే అత్తాపూర్‌లోని అపార్ట్మెంట్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. అయితే ఆయన వయస్సు తదితరాలను పరిగణలోకి తీసుకున్న ఏసీపీ ప్రసాద్ కేసు నమోదు చేయించారు. దీన్ని దర్యాప్తు నిమిత్తం సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాకు బదిలీ చేయాలని శనివారం నిర్ణయించారు. అధికారులు ఆ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఖతర్నాక్ కి‘లేడీ’.. ఖమ్మంలో ఘరానా మోసం
సాక్షి, ఖమ్మం: వదినగారు, అన్నయ్యగారు.. మేము అర్జెంట్‌గా చుట్టాల ఇంటికి వెళ్తున్నాం.. అసలే దొంగల భయం ఉంది.. ఈ సూట్‌కేస్‌ను మీ ఇంట్లో పెట్టండి అంటూ ఆ మహిళ మొదట మాటలు కలుపుతుంది. ఆ తర్వాత ఈ సూట్‌కేస్‌ను మీ మీద నమ్మకంతో అప్పగిస్తున్నా.. ఎందుకంటే దీనిలో రూ.10లక్షల బంగారం, రూ.3కోట్లు విలువ చేసే ఇంటి పత్రాలు, 60 ఎకరాల భూమి తాలుకా కాగితాలు ఉన్నాయంటూ అవతలవారు నోరు వెళ్లబెట్టేలా నమ్మబలికిస్తుంది. మరో మూడు రోజుల తర్వాత వచ్చి తన సూట్‌కేస్ తీసుకుని థ్యాంక్స్ చెబుతూ.. ఎంతో శ్రీమంతురాలిలా కనిపిస్తుంది. మరో రెండు రోజుల తర్వాత సూట్‌కేస్ పెట్టిన వారికి ఫోన్ చేసి వదిన గారు అర్జెంట్‌గా రూ. 5లక్షలు కావాలి.. మాకు వచ్చే డబ్బులు ఇంకా రాలేదు.. వడ్డీ ఎంతయినా పర్వాలేదు అంటుంది. అప్పటికే ఆమె హుందాతనాన్ని చూసిన వాళ్లు వెనుకాడకుండా అడిగిన డబ్బులు అప్పుగా ఇస్తున్నారు. అంతేఇక తర్వాత ఇచ్చిన అప్పుకోసం ఫోన్ చేస్తే రేపు, మాపు అంటూ వాయిదాలు వేస్తూ.. ఎక్కడకు పారిపోతాం మా ఇల్లు ఇక్కడే కదా.. అంటూ దబాయించడం మొదలుపెడతారు. ఇదే తరహాలో జరిగిన ఒక సంఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. నగరంలోని టూటౌన్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళ తాను రూ.5, 10 లక్షల చిట్టీలు వేస్తున్నానని చెప్పి రూ.లక్ష వసూలు చేసింది. తీరా ఇస్తానన్న గడువు వచ్చేసరికి బాధితులు తాము ఇచ్చిన అప్పు కోసం ఫోన్లు చేస్తుండడంతో పోరు పడలేక ఆ మహిళ తన తన ఇంటికి తాళం వేసి ఫోన్ స్విచ్ఆఫ్ పెట్టుకుంది. సుమారు రూ. 5కోట్ల మేరకు ఆమె బాధితులకు కుచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. బాధితులంతా ఆమె భర్తను కలిసి తమ డబ్బుల గురించి అడుగ్గా.. తనకు సంబంధం లేదని ఆమెనే అడగండి అంటూ చెప్పడంతో.. మీకు తెలియకుండా ఇన్ని రూ.కోట్లు ఎలా తీసుకుంది అంటూ వాగ్వాదానికి సైతం దిగారు. అయినా తనకు సంబంధం లేదని చెప్పడంతో వారు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం సివిల్ కోర్టులో తెల్చుకోండని పోలీసులు చెప్పారు. తమ డబ్బు ఎగ్గొట్టేందుకు పలువురు రాజకీయ నాయకుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు సీపీ విష్ణు ఎస్ వారియర్‌ను కలిసి తమ గోడు వినిపించగా.. ఆయన విచారణ చేయాలని టూటౌన్ పోలీసులను ఆదేశించారు. కాగా, బాధితుల్లో ఓ పోలీస్ అధికారి కూడా ఉండడం గమనార్హం. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని కానిస్టేబుల్ దంపతులు కొంతమంది ఉద్యోగులను మోసం చేసిన తీరు మరవకముందే మరో సంఘటన జరగడంతో దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ఈ మాయలేడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
మ్యాట్రిమోనితో వల.. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. మరో పెళ్లికి
సాక్షి, హైదరాబాద్: మ్యాట్రిమోని ద్వారా ప్రకటనలు ఇస్తూ మహిళలను పరిచయం చేసుకుని ఒకరికి తెలియకుండా మరొక్కరిని ఏకంగా మూడు పెళ్లిల్లు చేసుకుని మరో మహిళను మోసం చేసిన అప్పలరాజు అలియాస్ విజయ్ బాగోతం తాజాగా బయటపడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... దమ్మాయిగూడలోని అయోధ్యనగర్ కాలనీలో నివాసముంటున్న అప్పలరాజు అలి యాస్ విజయ్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి సంతానం కలగలేదు. మ్యాట్రిమోని, పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ మహిళలను మోసం చేస్తు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. తనను పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలిసి సదరు మహిళ అప్పలరాజును నిలదీసింది. చెప్పాపెట్టకుండా ఇల్లు ఖాళీ చేస్తున్న విషయం బాధితురాలు తెలసుకుని మహిళా సంఘాల నాయకులతో అప్పలరాజు ఇంటి ఎదుట శుక్రవారం నిరసనకు దిగింది. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా ఇప్పటి వరకు ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
ఓరి భగవంతుడా! కళ్ల ముందే రూ.80 లక్షలు.. కానీ, తీద్దామంటే..!
సాక్షి, హైదరాబాద్: స్నేహితుల మాట విని క్రిప్టో కరెన్సీలో డబ్బు ఇన్వెస్ట్ చేసిన వ్యాపారస్తుడు లక్షల రూపాయిలు మోసపోయాడు. కంటికి లక్షలు కనిపించినా తీసేందుకు ఒక్క రూపాయి రాకపోవడంతో బాధితుడు సోమవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీ నగర్‌కాలనీకి చెందిన మహేష్ వృతిరీత్యా వ్యాపారస్తుడు. తన స్నేహితులు కొందరు ప్రాన్‌డాట్ ఏసీ డాట్ వెబ్సైట్లో క్రిప్టో కరెన్సీ చేస్తే లాభాలు వస్తాయని సూచించారు. చదవండి👉 ‘మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్.. అమ్మా, నాన్నా క్షమించండి..’ దీంతో వారిచ్చిన టెలిగ్రామ్ లింకులో జాయిన్ అయ్యి చాట్ చేశాడు. తొలుత రూ.30వేలు పెట్టగా రూ.50వేలు వచ్చాయి. ఆశతో పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.80 లక్షలు పెట్టాడు. రూ.80 లక్షలకు కోటికి పైగా లాభం కంటికి కనిపిస్తుందే కానీ తీసేందుకు ఒక్క రూపాయి రావడం లేదు. ఫేక్ అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. చదవండి👉 వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి -
కాంట్రాక్టర్ చీరవాటం.. ఇంద్రకీలాద్రిపై మరో అవినీతి బాగోతం వెలుగులోకి..
సాక్షి, అమరావతి బ్యూరో: ఇంద్రకీలాద్రిపై అవకతవకలకు అడ్డూ అదుపూ ఉండడం లేదు. రోజుకో అవినీతి వ్యవహారం వెలుగులోకి వస్తున్నా.. దేవస్థానం యంత్రాంగంలో మార్పు కనిపించడం లేదు. ఇప్పటికే దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి వివిధ సరుకుల సరఫరా కాంట్రాక్టులో అక్రమాలు బహిర్గతమయ్యాయి. టెండరు షెడ్యూలులో పేర్కొన్న విధంగా నాణ్యమైన సరుకులకు బదులు నాసిరకం పంపిణీ చేస్తుండడం తెలిసిందే. అలాగే కొబ్బరికాయలు కొట్టే స్థలం వద్ద కాయలు కొట్టినందుకు కొంతమంది కాంట్రాక్టరుకు చెందిన సిబ్బంది భక్తుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్న వైనం కూడా విదితమే. తాజాగా అమ్మ వారికి భక్తులు మొక్కుబడులుగా సమర్పించిన చీరల విక్రయంలోనూ బహిరంగంగా అవినీతికి పాల్పడుతున్నారు. ఇదీ సంగతి.. అమ్మవారికి భక్తులు సమర్పించే చీరలను విక్రయించే కాంట్రాక్టును ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. దేవస్థాన ప్రాంగణంలోనూ, ఘాట్ రోడ్డులో ప్రసాదాలు విక్రయించే కేంద్రాల వద్ద చీరల విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ‘శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల వస్త్ర ప్రసాద విక్రయ కేంద్రం’ పేరిట ఉన్న ఈ కౌంటర్లలో చీరలను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కౌంటర్లలో కొన్ని చీరలకు మాత్రమే ధరను తెలిపే స్టిక్కర్లను అంటిస్తున్నారు. మిగతా చాలా చీరలను ఆ కౌంటర్లో ఉన్న సిబ్బందే ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. చీరల కొనుగోలుకు వచ్చిన భక్తులను ఎంత ఖరీదువి కావాలని వీరు అడుగుతున్నారు. దాన్ని బట్టి కొన్నింటిని చూపిస్తున్నారు. వాటిపై ఎలాంటి ధర లేకుండానే విక్రయిస్తున్నారు. ఇలా పలు చీరలకు వస్త్ర దుకాణాల్లో ధరల కంటే ఎక్కువ ధర చెప్పి.. కాస్త తగ్గించి ఇస్తున్నారు. ఉదాహరణకు షాపులో రూ.600–700కు మించని (ధర స్టిక్కరు లేని) చీర రూ.వెయ్యి చెప్పి వందో, యాభయ్యో తగ్గిస్తున్నారు. రశీదు కూడా లేకుండా.. వాస్తవానికి భక్తులు అమ్మవారికి చీరలు సమర్పించేటప్పుడు దాని ఖరీదు ఎంతో అడిగి తెలుసుకుని రశీదు ఇస్తారు. వీటిని ఆ ధరపై 20–25 శాతం తక్కువ ధర నిర్ణయించి అమ్మకానికి పెడతారు. ఇలా విక్రయించే చీరలకు విధిగా బిల్లు ఇవ్వాలి. ఇందుకోసం ఈ కౌంటర్లలో ఒక బిల్లింగ్ మిషన్‌ను కూడా అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ విక్రయించే చీరలకు బిల్లు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.ఇంద్రకీలాద్రిపై అమ్మవారి చీరల విక్రయ కౌంటర్ భక్తుల సెంటిమెంటే ఆయుధం భక్తులు అమ్మ వారి చీర కొనుక్కోవడం అంటే ఎంతో సెంటిమెంటుగా భావిస్తారు. దీంతో చాలామంది చీరలపై ధర లేకపోయినా, బిల్లు ఇవ్వకపోయినా అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ఖరీదు చేసే చీరలను ఎక్కువ ధరకు అమ్మడం, వాటికి బిల్లు ఇవ్వకపోవడం ద్వారా సదరు కాంట్రాక్టరు భక్తుల నుంచి భారీ ఎత్తున దోపిడీ చేస్తున్నారు. కళ్లెదుటే ఇంతటి మోసం జరుగుతున్నా దేవస్థానం అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కాంట్రాక్టరు దోపిడీకి అడ్డుకట్ట వేయడం లేదు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం.. నిబంధనల ప్రకారం అమ్మవారి వస్త్ర ప్రసాదం చీరలపై విధిగా ధర ఉండాలి. విక్రయించిన చీరలకు కచ్చితంగా బిల్లు ఇవ్వాలి. అలా విక్రయించడం తప్పు. వస్త్ర ప్రసాద విక్రయ కౌంటర్లలో అక్రమాలకు తావు లేకుండా చూస్తాం. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటాం. – భ్రమరాంబ, ఈవో, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం -
చిట్టీల పేరుతో టీడీపీ నాయకుడి మోసం
పొదలకూరు: చిట్టీల పేరుతో ఓ టీడీపీ నాయకుడు వందలాది మంది బాధితులకు రూ.కోట్లు కుచ్చుటోపీ పెట్టాడు. ఎస్పీ విజయారావు గత సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పొదలకూరుకు చెందిన రత్నం అనే బాధితుడు అరుణాచలంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. బాధితుల కథనం మేరకు.. పొదలకూరు మజరా గ్రామం చిట్టేపల్లి గ్రామానికి చెందిన అరుణాచలం టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. అతడు పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ వ్యాపారిగా ఈ ప్రాంతంలో అందిరికీ సుపరిచితుడు. చాలాకాలంగా నమ్మకంగా బంధువులు, స్నేహితులు, మండలంలోని ప్రముఖుల వద్ద సుమారు రూ.15 కోట్ల వరకు చిట్టీలు కట్టించాడు. ఆరునెలలుగా పాటలు సక్రమంగా పెట్టకపోగా పాడిన వారికి సకాలంలో డబ్బులు చెల్లించలేదు. అప్పటి నుంచి బాధితులు ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతున్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడు. నెలరోజులుగా బాధితు ల నుంచి ఒత్తిడి పెరగడంతో పరారైయినట్లుగా చెబుతున్నారు. విలాసవంతంగా జీవిస్తున్న ఇతడు గతేడాది ఓ సినిమా నిర్మించేందుకు సైతం బాధితుల నగదును వినియో గించినట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఐ విచారణ కాగా రత్నం ఫిర్యాదును ఎస్పీ పొదలకూరు సీఐ సంగమేశ్వరరావుకు పంపారు. రూ.6 లక్షల చిట్ వేశాడని ఆయనకు రూ.5 లక్షలు అరుణాచలం చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా సీఐ గురువారం వెల్లడించారు. -
సాఫ్ట్వేర్ కంపెనీల్లో మంచి హోదా.. ఉద్యోగాలు పెట్టిస్తానంటూ.
సాక్షి, ఉప్పల్: తాను ఒక పేరొందిన సాఫ్ట్వేర్ కంపెనీల్లో మంచి హోదాలో ఉన్నానంటూ మాదాపూర్, బెంగళూర్‌లో ఉద్యోగాలు పెట్టిస్తానంటూ అమాయక నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు దండుకున్న మహిళను ఉప్పల్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీఐ గోవిందర్రెడ్డి వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన చంద్రగుంట లలిత పరమేశ్వరి (26), ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ రామంతాపూర్ శ్రీనివాసపురంలో ఉంటుంది. ఈమెతో పాటు తిరుపతిలో నివాసముండే ప్రసాద్, కూకట్‌పల్లికి చెందిన రామ్, బెంగళూరుకు చెందిన మనోజ్ శర్మలు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రామంతాపూర్ తదితర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆరుగురి నుంచి ఆన్లైన్ ద్వారా దాదాపుగా రూ. 24 లక్షల వరకు వసూలు చేశారు. రేపు మాపంటూ నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి పంపారు. తీరా అక్కడికెళ్లగా అసలు విషయం బయటపడింది. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఈ నెల 29న ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అసలు సూత్రధారి అయిన లలిత పరమేశ్వరిని బుధవారం రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ‘ఒంటరిగా ఉన్నాను ఇంటికిరా’.. అంటూ పిలిచి మహిళ నిలువుదోపిడి -
యువతి నుంచి ఫోన్.. కొరియర్ ఓపెన్ చేస్తే స్వీట్ బాక్స్.. అసలేం జరిగింది?
సాక్షి, మెదక్:(దుబ్బాక): సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం, పోలీసులు చెబుతున్నా అమాయక ప్రజలు మోసపోతూనే ఉన్నారు. అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్‌కు స్పందించి ఓ వ్యక్తి మోసపోయిన ఘటన తొగుట మండలంలోని వెంకట్రావుపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తుప్పటి కనకయ్యకు రెండు రోజుల క్రితం ఓ అపరిచిత యువతి ఫోన్ చేసింది. మీ సెల్ నంబర్‌కు ఆఫర్ వచ్చిందని, రూ.1600లు చెల్లిస్తే రూ.7500 విలువచేసే స్మార్ట్‌ఫోన్ ఇస్తామని చెప్పింది. కొరియర్ ద్వారా మీ ఇంటికి ఫోన్ వచ్చాకే డబ్బులు చెల్లించమంటూ నమ్మకం కలిగించడంతో కనకయ్య ఇంటి అడ్రస్ తెలిపాడు. గురువారం మధ్యాహ్నం పోస్ట్ రావడంతో డబ్బులు చెల్లించి పార్సిల్‌ను తీసుకున్నాడు. ఓపెన్ చేసి చూడగా స్మార్ట్ ఫోన్ బదులు స్వీట్ బాక్స్, హనుమాన్ చాలీసా, యంత్రం ఉండడంతో ఖంగు తిన్నాడు. మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. చదవండి: ఆదిలాబాద్: మారుమూల గ్రామ సర్పంచ్‌కి ఢిల్లీ నుంచి ఆహ్వానం -
పనిచేస్తున్న సంస్థకే కన్నం.. భార్య, బావమరిది పేర్లతో పే రోల్స్.. రూ.2 కోట్లు స్వాహా
సాక్షి, హిమాయత్‌నగర్: పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. లేని ఉద్యోగులు ఉన్నట్లు చూపి సంస్థకు సంబంధించిన డబ్బును జీతాల రూపంలో కుటుంబ సభ్యుల అకౌంట్లో జమ చేసుకున్నాడు. ఏడాదిన్నర పాటు కోట్ల రూపాయిలు కొట్టేసి ఇటీవల ఉద్యోగం మానేయడంతో.. తోటి ఉద్యోగి ఈ విషయాన్ని యజమాన్యానికి తెలిపాడు. దీంతో విషయం బయటపడి సిటీ సైబర్‌క్రైం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..హబ్సిగూడలోని ఓ ‘యాప్ అప్లికేషన్’ కంపెనీలో నగరానికి చెందిన యువకుడు అకౌంట్స్‌లో పనిచేస్తున్నాడు. సంస్థలో ఉద్యోగం చేయకపోయినప్పటికీ చేస్తున్నట్లుగా తన భార్య, బావమరిది, మరో కుటుంబసభ్యుడు, తోటి ఉద్యోగుల పేర్లతో నకిలీ పే రోల్స్ తయారు చేశాడు. వాటిపై ఏడాదిన్నరగా వారు జీతం తీసుకుంటున్నట్లు రూ.లక్షా 60వేలు కాజేశాడు. మరలా జీఎస్టీ పేరుతో సంస్థ నుంచి రూ.46 లక్షలు స్వాహా చేశాడు. మొత్తంగా ఏడాదిన్నరలో రూ.2 కోట్ల 6 లక్షలు కొట్టేసి ఉద్యోగం మానేశాడు. ఆయన ఉద్యోగం మానేసిన తర్వాత ఈ విషయాన్ని ఓ ఉద్యోగి యజమాన్యానికి లీక్ చేశాడు. వారు అకౌంట్స్ సరి చూసుకొని, కంపెనీలో చేయకపోయినా చేస్తున్నట్లు పే రోల్స్ క్రియేట్ చేసి డబ్బు కొట్టేశాడని కంపెనీ డైరెక్టర్ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. చదవండి: గ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్, వంట నూనెలు, చికెన్, పచ్చిమిర్చి.. తగ్గేదేలే! ఇన్సూరెన్స్ పేరుతో రూ. 3.5 కోట్లకు టోకరా హిమాయత్‌నగర్: ఇన్సూరెన్స్ పేరుతో మోసగించిన ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మోతీనగర్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రామరాజును ఇన్సూరెన్స్ చేసుకోవాలంటూ ముగ్గురు స్నేహితులు వెంటపడ్డారు. పదే పదే కాల్స్ చేస్తుండటంతో రామరాజు విడతల వారీగా వీరికి రూ.3 కోట్ల 50 లక్షలు చెల్లించి ఇస్సూరెన్స్ తీసుకున్నాడు. డబ్బు కట్టిన తర్వాత వచ్చే పత్రాలను రామరాజు అమెరికాలో ఉన్న తన కుమారుడికి పంపాడు. ఆ కంపెనీకి చెందిన అధికార వెబ్సైట్లో తండ్రి రామరాజు వివరాలు ఏవీ లేవు. దీంతో అనుమానం వచ్చి తన తండ్రి రామరాజుకు చెప్పాడు. దీనిపై ఇన్సూరెన్స్ డబ్బు తీసుకున్న కరీంనగర్‌కు చెందిన మనోజ్, వనపర్తికి చెందిన మహేష్‌గౌడ్, ఏపీలోని కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన సుబ్రహ్మణ్యంను నిలదీశాడు. వారి నుంచి సమాధానం రాకపోవడంతో ఇటీవల సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి ఈ ముగ్గురినీ శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. -
తక్కువ రేట్లకే బ్రాండెడ్ వస్తువులు.. డబ్బు కట్టాక రివ్యూలు చూస్తే!
Hyderabad Fraud Shopping Website: బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్ పేజీలో కళ్ల జోడు యాడ్ వచ్చింది. దానిపై ప్రముఖ కంపెనీ పేరు ఉండటంతో పాటు క్లియరెన్స్ సేల్ అని కనిపించడంతో ఆయన ముందుకు వెళ్లారు. మార్కెట్లో కనీసం రూ.10 వేలు ఖరీదు చేసే చలువ కళ్లజోడు కేవలం రూ.2 వేలకే అంటూ అందులో ఉంది. ఆ మొత్తం ఫోన్ పే ద్వారా చెల్లించిన ఆయన కొన్ని రోజులకు మోసపోయినట్లు గుర్తించారు. ఇటీవల కాలంలో అనేకమంది ఇలాంటి ఆన్లైన్ ప్రకటనల బారినపడి మోసపోతున్నారు. నష్టపోయేది చిన్న మొత్తాలు కావడంతో పోలీసుల వరకు వెళ్లకుండా మిన్నకుండిపోతున్నారు. ఇదే మోసగాళ్లకు కలిసి వచ్చే అంశంగా మారిపోయింది. నగరంలో ప్రతి రోజూ వందలాది మంది ఈ యాడ్స్ బారినపడుతున్నారని తెలుస్తోంది. క్లియరెన్స్ సేల్ పేరుతో... ఫేస్బుక్ సహా వివిధ సోషల్‌మీడియా సైట్ల ద్వారా నకిలీ కంపెనీలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. కళ్లజోళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, ఉడెన్ ఫర్నిచర్.. ఇలా అనేక ఉత్పత్తులకు సంబంధించి ఈ ప్రకటనలు కనిపిస్తున్నాయి. అత్యంత ఆకర్షణీయంగా ఉంటున్న ఆ ప్రకటనల్లో ఉత్పత్తుల ఫోటోలు అదే స్థాయిలో ఉంటున్నాయి. బహిరంగ మార్కెట్లో దొరికే వాటి కంటే ఆకట్టుకునేలా, అతి తక్కువ రేటుతో కనిపిస్తున్నాయి. ప్రతి దాంట్లోనూ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ సేల్స్, క్లియరెన్స్ సేల్ అంటూ మోసగాళ్లు పొందుపరుస్తున్నారు. వీటిని చూసిన ఎవరైనా తక్కువ ధరకు ఎందుకు విక్రయిస్తున్నారని అనుమానించట్లేదు. ‘పైన’ ఒకటి.. ‘అడ్రస్’ మరోటి.. ► ఈ ప్రకటనలు సైతం చూసే వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉంటున్నాయి. సదరు వెబ్ పేజీ తెరిచిన వెంటనే పైన ప్రముఖ కంపెనీల పేర్లు దర్శనమిస్తున్నాయి. మోసగాళ్లు ఎక్కువగా ఈ–కామర్స్ రంగంలో పేరెన్నికగన్న కంపెనీల పేర్లు, లోగోలు వాడుతున్నారు. ► ఆయా సైట్లలో షాపింగ్ చేయడానికి పొందు పరచాల్సిన ఫోన్ నంబర్, చిరునామా తదితరాలకు సంబంధించిన అంశాలన్నీ ఈ పేజీలోనూ ఉంటున్నాయి. ఆ పేజీలకు సంబంధించిన అడ్రస్ బార్లో మాత్రం ఆయా కంపెనీ అడ్రస్‌లు ఉండట్లేదు. ► సాధారణంగా ప్రముఖ కంపెనీల నుంచి ఆన్లైన్లో ఖరీదు చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. కొన్ని ప్రాంతాలు, ఉత్పత్తులకు మినహాయిస్తే మిగిలిన వాటికి ఇది కచ్చితంగా కనిపిస్తుంటుంది. ► బోగస్ వెబ్సైట్లలో మాత్రం ఈ అవకాశం ఉండదు. ఖరీదు చేసే వాళ్లు కచ్చితంగా అప్పటికప్పుడే గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐలు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు చెల్లించిన తర్వాతే ఆర్డర్ ఖరారు అవుతోంది. చదవండి: ఆ శాఖలోనే అత్యధిక ఖాళీలు..హైదరాబాద్‌లోనే 25 వేల మందికిపైగా అభ్యర్థులు ‘మార్కెటింగ్ ఇంటెలిజెన్స్’ ఏమైనట్లు? ► బాధితులు నష్టపోయేది తక్కువ మొత్తాలే కావడంతో కనీసం 5 శాతం మందీ పోలీసు వరకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. డబ్బు తిరిగి రాదు సరికదా ఠాణా చుట్టూ తిరగాల్సి వస్తుందని వారు భావిస్తుండటమే దీనికి కారణం. సైబర్ స్పేస్‌లో జరిగే ఈ తరహా మోసాలను ముందుగానే కనిపెట్టాల్సిన అవసరం ఉంది ► నానాటికీ పెరిగిపోతున్న సైబర్ నేరాలు, కేసుల దర్యాప్తులో తలమునకలై ఉంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పుడు ఈ విషయాలు పట్టించుకోవట్లేదు. ఫలితంగా మోసగాళ్లు అనునిత్యం అందినకాడికి దండుకుంటున్నారు. ► ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్‌లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1930 ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు. డబ్బు కట్టాక రివ్యూలు చూస్తే... ► డబ్బు చెల్లించిన వినియోగదారులకు కన్ఫర్మేషన్ ఈ–మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లు రావట్లేదు. మరోసారి ఆ పేజ్‌లోకి వెళ్లి తనిఖీ చేయాలని ప్రయత్నిస్తే గతంలో లావాదేవీలు చేసిన పేరుతో కనిపించట్లేదు. ► కొన్నిసార్లు యూపీఐ విధానంలో డబ్బు చెల్లించిన తర్వాత ఆయా సైట్లలోనే ఏదో సాంకేతిక పొరపాటు జరిగింది. మళ్లీ ప్రయత్నించండి’ అంటూ వస్తోంది. ► అప్పటికే చెల్లించిన డబ్బు మాత్రం వినియోగదారులకు తిరిగి రావట్లేదు. అతికష్టమ్మీద షాపింగ్ చేసిన పేజ్‌ను గుర్తించి, పరిశీలిస్తే మాత్రం రివ్యూల ద్వారా అసలు విషయం తెలుస్తోంది. వాటిలో వందల మంది తాము మోసపోయాంటూ రాస్తున్నారు. -
10 మిలియన్ డాలర్ల మోసం కేసులో ఆపిల్ మాజీ ఉద్యోగి అరెస్టు!
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ మాజీ ఉద్యోగి వివిధ పథకాల పేరుతో 10 మిలియన్ డాలర్లకు పైగా మోసం చేసినట్లు యుఎస్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లోని ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన ఫైలింగ్ ఆధారంగా భారత సంతతికి చెందిన ధీరేంద్ర ప్రసాదును ఐదు క్రిమినల్ కేసుల ఆధారంగా అరెస్టు చేశారు. దిగ్గజ కంపెనీని మోసగించడానికి ఆపిల్ గ్లోబల్ సర్వీస్ సప్లై చైన్‌లో ఒక కొనుగోలుదారుగా పేర్కొంటూ కంపెనీలో స్థానం సంపాదించారు. ఆ తర్వాత ఆపిల్ కొనుగోలుదారుగా ప్రసాద్ విక్రేతలతో చర్చలు జరిపి ఆర్డర్స్ పెట్టినట్లు ప్రాసిక్యూటర్లు హైలైట్ చేశారు. అయితే, కంపెనీ కొనుగోలు వ్యవస్థలో అతను నమోదు చేసిన ఇన్వాయిస్ మొత్తాల ఆధారంగా ఆపిల్ చెల్లించింది. ప్రసాద్ ముడుపులు తీసుకొని తప్పుడు రిపేర్ ఆర్డర్లను ఉపయోగించి విడిభాగాలను దొంగిలించాడు. అదే సమయంలో ఆపిల్ కంపెనీ ఎప్పుడూ అందించని వస్తువులు & సేవలకు చెల్లించమని కోరాడు. ప్రాసీక్యూటర్ల ప్రకారం, ఇంకా ప్రసాద్ కూడా పన్నులను ఎగవేశారు. అతను వివిధ పథకాల పేరుతో వచ్చిన 10 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని మనీ లాండరింగ్ చేశాడు. సమర్పించిన కోర్టు పత్రాల ఆధారంగా, ఒక దశాబ్దం తర్వాత 2018 డిసెంబరులో ప్రసాదును ఆపిల్ తొలగించింది. ఆపిల్ వ్యాపారంలో పాల్గొన్న ఇద్దరు విక్రేతల యజమానులు అలాగే టెక్ కంపెనీని మోసం చేయడంలో పాల్గొన్న ఇద్దరు విక్రేతల యజమానులు డిసెంబర్'లో ఈ ఆరోపణలను అంగీకరించారు. ప్రసాద్ ప్రస్తుతం మోసానికి పాల్పడటం, మనీ లాండరింగ్ కు పాల్పడటం, పన్ను ఎగవేతతో పాటు అమెరికాను మోసం చేయడం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. అతను మార్చి 24న విచారణకు హాజరు కావాల్సి ఉంది. ప్రాసిక్యూటర్ల డిమాండ్ల ప్రకారం.. అతను మిలియన్ల డాలర్ల విలువైన ఆస్తులను కూడా కోల్పోతాడని భావిస్తున్నారు. (చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..! ప్రపంచంలోనే మొదటి కంపెనీగా..!) -
షరపోవా, షుమాకర్‌లపై చీటింగ్, క్రిమినల్ కేసులు.. ఏం జరిగింది?
రష్యన్ టెన్నిస్ దిగ్గజం మరియా షరపోవాతో పాటు ఫార్ములావన్ మాజీ చాంపియన్ మైకెల్ షుమాకర్‌లపై గుర్గావ్ పోలీస్ స్టేషన్లో చీటింగ్, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని చత్తార్పూర్ మినీఫామ్కు చెందిన షఫాలీ అగర్వాల్ అనే మహిళ ఫిర్యాదు మేరకు గుర్గావ్ పోలీసులు షరపోవా, షుమాకర్ సహా 11 మంది వ్యాపారులపై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. షఫాలీ అగర్వాల్ మాట్లాడుతూ.. రియల్టెక్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ తమని మోసం చేసిందని తెలిపారు. సెక్టార్ 73లోని షరపోవా ప్రాజెక్ట్ పేరిట షుమాకర్ టవర్స అపార్టమెంట్లో ఒక ఫ్లాట్ కోసం కంపెనీ ప్రతినిధులు సుమారు రూ.80 లక్షలు తీసుకున్నారని పేర్కొన్నారు. 2016లో ఫ్లాట్‌ను అందిస్తామని నమ్మించి ఇంతవరకు మాకు అందించలేదని తెలిపారు. ఈ విషయమై కంపెనీ ప్రతినిధులను ఎన్నిసార్లు సంప్రదించినా న్యాయం జరగలేదని.. జాతీయ వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని వివరించారు. ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించగా.. వారిపై క్రిమినల్, చీటింగ్ కేసులు నమోదు చేయమని కోర్టు వెల్లడించిందని పేర్కొన్నారు. కాగా 2016లో సదరు కంపెనీకి షరపోవా, షుమాకర్‌లు అంబాసిడర్‌గా వ్యవహరించడంతో పాటు భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పలుమార్లు కంపెనీ ప్రతినిధులతో కలిసి షరపోవా, షుమాకర్‌లు డిన్నర్ పార్టీల్లో పాల్గొన్నట్లు తేలింది. ఫార్ములావన్‌లో మెర్సిడెస్కు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించిన మైకెల్ షుమాకర్ ఏడుసార్లు ఫార్ములావన్ చాంపియన్‌గా నిలిచాడు. ప్రస్తుత చాంపియన్ లుయీస్ హామిల్టన్ కూడా ఏడుసార్లు ఫార్ములావన్ చాంపియన్‌షిప్‌ను గెలిచాడు. ఇక షుమాకర్ రికార్డులు పరిశీలిస్తే.. 2012లో రిటైర్ అయ్యేవరకు 91 విజయాలు, 155 ఫోడియమ్స్, 1566 కెరీర్ పాయింట్లు, 68 పోల్ పోజిషన్స్, 77 ఫాస్టెస్ట్ లాప్స్ అందుకున్నాడు. ఇక మహిళల టెన్నిస్ విభాగంలో తనకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరచుకుంది. 2001లో అంతర్జాతీయ టెన్నిస్‌లో అరంగేట్రం చేసిన షరపోవా.. టెన్నిస్‌లో అందాల రాణిగా నిలిచింది. 2001-2020 మధ్య ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడంతో పాటు 18 ఏళ్ల వయసులోనే నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. 2005లో 21 వారాలపాటు షరపోవా మహిళల టెన్నిస్ నెంబర్‌వన్ క్రీడాకారిణిగా నిలిచింది. ఇక కెరీర్ గ్రాండ్‌స్లామ్(యూఎస్ ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్) అందుకున్న క్రీడాకారిణిగా షరపోవా చరిత్ర సృష్టించింది. చదవండి: PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్ AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు -
క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.కోటి ఖాళీ
హిమాయత్‌నగర్: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే రూ.కోట్లు సంపాదించవచ్చునని ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఐదుగురి వ్యక్తుల నుంచి సుమారు రూ.కోటికి పైగా కొట్టేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కవాడిగూడకు చెందిన శ్రీనివాస్‌ను ఇటీవల ఓ వ్యక్తి టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేశాడు. సదరు గ్రూప్‌లో నిత్యం క్రిప్టో కరెన్సీపైనే చర్చ జరుగుతుండేది. కొద్దిరోజుల తర్వాత శ్రీనివాస్‌తో మాటలు కలిపిన సైబర్ నేరగాడు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించాడు. ‘కేకాయిన్’ అనే యాప్‌ను శ్రీనివాస్ మొబైల్లో డౌన్లోడ్ చేయించి పెట్టుబడి పెట్టించాడు. పలు దఫాలుగా రూ.73లక్షలు పెట్టుబడి పెట్టాడు. రూ.73లక్షలకు గాను అతడి సైట్లో ఇతని పేరుపై రూ.4కోట్లు ఉన్నట్లు చూపిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని మార్చుకునేందుకు, డ్రా చేసుకునేందుకు అవకాశం లేకపోవడంతో శ్రీనివాస్ అతడిని నిలదీశాడు. మరింత పెట్టుబడి పెడితే ఒకేసారి రూ.కోట్లు తీసుకోవచ్చని చెప్పాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు గురువారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంబర్‌పేటకు చెందిన రాజు ఇతని స్నేహితులు మరో ముగ్గురు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. రాజుకు తెలిసిన వ్యక్తి సహకారంతో రూ.28లక్షలు పెట్టుబడి పెట్టారు. లాభాలు చూపించకపోగా ఇచ్చిన సొమ్మును వెనక్కి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. (చదవండి: పెళ్లి పేరుతో వంచన...పరారైన ప్రియుడు) -
అల్లరిపిల్ల: ఫేస్బుక్ ఐడీతో పురుషులకు వల.. నగ్నంగా కాల్స్
చిత్తూరు అర్బన్: పురుషుల బలహీనతలను ఆసరాగా చేసుకున్న ఓ యువతి ‘అల్లరిపిల్ల’ అవతారం ఎత్తింది. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపడం.. ఆ తర్వాత స్నేహితులు అయ్యాక.. నగ్నంగా వీడియోకాల్స్ చేసి మాట్లాడుకోవడం, కొందరికి నిఘా యాప్స్ పంపి మొబైల్ స్క్రీన్ షేరింగ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా రూ.లక్షలు కొల్లగొట్టింది. ఈ బాగోతంలో కమీషన్ కోసం తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు వేయించుకుంటున్న ఎనిమిది మంది మధ్యవర్తులను చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ యుగంధర్ మంగళవారం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఫేస్బుక్లో అల్లరిపిల్ల అనే ఐడీ నుంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చేవి. వీటిని అంగీకరించిన కొద్దిరోజుల్లోనే ఓ అజ్ఞాత యువతి మెసెంజర్ ద్వారా వాయిస్‌కాల్స్ చేసి, మత్తెక్కించే మాటలతో అవతలి వాళ్లను తన బుట్టలో వేసుకునేది. అనంతరం వీడియో కాల్స్ ద్వారా నగ్నంగా మాట్లాడుకోవడం, నేరుగా కలవడానికి నమ్మకం వచ్చాక ప్రమాదకరమైన స్పై (నిఘా) యాప్స్ లింకులను పురుషుల మొబైళ్లకు పంపేది. ఆ లింకులను ఇన్స్టాల్ చేసుకున్న తరువాత అవతలి వ్యక్తి మొబైల్లో ఏం చేసినా అల్లరిపిల్ల తన సెల్‌ఫోన్ నుంచే చూసేది. వివరాలను వెల్లడిస్తున్న చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, వెనుక అరెస్టయిన నిందితులు మరికొందరికి క్రెడిట్‌కార్డులు ఇప్పిస్తామంటూ నిఘా యాప్స్ పంపేది. ఆపై ఫోన్‌పే, గూగుల్‌పే, నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును మాయం చేసేది. ఈ డబ్బులను నేరుగా తన బ్యాంకు ఖాతాకు కాకుండా కొందరు వ్యక్తులను మధ్యవర్తులుగా నియమించుకుని వారి ఖాతాల్లోకి మళ్లించేది. ఇలా ఓ పది బ్యాంకు ఖాతాల నుంచి అల్లరిపిల్ల ఖాతాలోకి నగదు వెళ్తుంది. చిత్తూరు నగరానికి చెందిన సీకే మౌనిక్ అనే వ్యక్తి సైతం అల్లరిపిల్ల మాయలోపడి ఆమె పంపిన నిఘా యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అంతే.. రూ.3.64 లక్షలు బ్యాంకు నుంచి మాయమయ్యాయి. ఈనెల 3న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. మాయమైన నగదు ఏయే ఖాతాల్లో జమయ్యిందో తెలుసుకుని విశాఖ జిల్లాకు చెందిన ఎ. సాంబశివరావు (32), బి.ఆనంద్మెహతా (35), జి. శ్రీను (21), సి. కుమార్రాజు (21), ఎల్.రెడ్డి మహేష్ (24), జి. శివకుమార్ (21), వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సి. సుధీర్‌కుమార్ అలియాస్ సుకు (30), వరంగల్‌కు చెందిన టి.శ్రావణ్‌కుమార్ (31) అనే మధ్యవర్తులను పోలీసులు అరెస్టుచేశారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపించిన ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్‌లను డీఎస్పీ అభినందించారు. ఈ ఎనిమిది మందికి కూడా ఆ అల్లరిపిల్ల ఎవరో తెలియకపోవడం కొసమెరుపు. వీరందరితో నెట్‌కాల్స్ ద్వారా మాట్లాడి కమీషన్ ఇచ్చి నగదు లావాదేవీలు జరపడానికి ఏజెంట్లుగా నియమించుకుంది. బాధితుడి ఫిర్యాదు, అరెస్టు అయిన నిందితుల వాంగ్మూలం ఆధారంగా అల్లరిపిల్లను ఓ యువతిగా గుర్తించిన పోలీసులు ఆమెను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. -
సోనాక్షిపై నాన్ బెయిలబుల్ వారెంట్, స్పందించిన హీరోయిన్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైందని, తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై సోనాక్షి స్పందించిన సోనాక్షి వాటిని ఖండించింది. తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు వచ్చిన కథానాల్లో ఎమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రకటన ఇచ్చింది. ‘నాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. నాపై కావాలనే అబ్ధపు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చదవండి: రాధేశ్యామ్ షూటింగ్లో ప్రభాస్‌తో గొడవ, క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే దీనిపై నా స్టెంట్మెంట్ కూడా తీసుకోలేదు. ఇది పూర్తిగా కల్పితం. ఒక వ్యక్తి నన్ను వేధించేందుకు కుట్ర చేస్తున్నాడు. కాబట్టి అన్ని మీడియా హౌజ్‌లు, జర్నలిస్టులకు నా వినతి ఏమిటంటే. ఈ కల్పిత వార్తను ప్రసారం చేయవద్దు. ఒకరి వ్యక్తిగత అజెండాకు వేదిక కల్పించవద్దు. సదరు వ్యక్తి ప్రచారం కోసం, నా నుంచి డబ్బును రాబట్టేందుకు.. ఎన్నో ఏళ్లుగా నేను సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠలపై దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ అంశం మురాదాబాద్ కోర్టు పరిధిలో ఉంది. దీనిపై అలహాబాద్ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. చదవండి: కండోమ్ టెస్టర్‌గా రకుల్, ఆమె తల్లిదండ్రులు ఏమన్నారంటే.. కోర్టు ధిక్కారం కింద సదరు వ్యక్తిపై నా న్యాయ బృందం చర్యలు తీసుకుంటుంది. కోర్టు తీర్పు ఇచ్చే వరకు ఈ అంశంపై నా వివరణ ఇదే’ అంటూ సోనాక్షి తెలిపింది. కాగా ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం యూపీకి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఇందుకు గాను ముందుగానే రూ. 37లక్షలు చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న సోనాక్షి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందిగా ఈవెంట్ నిర్వాహకుడు అడగడంతో సోనాక్షి మేనేజర్ నిరాకరించినట్లు అతడు ఆరోపించాడు. దీంతో సోనాక్షిపై కేసు నమోదైంది. -
చిక్కుల్లో సోనాక్షి సిన్హా.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా వివాదంలో చిక్కుకుంది. చీటింగ్ కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం యూపీకి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఇందుకు గాను ముందుగానే రూ. 37లక్షలు చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న దబాంగ్ నటి ఆ కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేదు. దీంతో చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అడిగినా అందుకు సోనాక్షి మేనేజర్ తిరస్కరించాడు. ఈ విషయంపై సోనాక్షిని స్వయంగా సంప్రదించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆమెపై చీటింగ్ కేసు దాఖలు చేశాడు. కేసు విచారణ నిమిత్తం సోనాక్షి మొరాబాద్‌కు రావాల్సి ఉండగా ఆమె హాజరు కాలేదు. దీంతో స్థానిక కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
14 మందిని పెళ్లాడిన ఘనుడు.. 7 రాష్ట్రాలకు అల్లుడు.. చివరికి!
Man Married 14 Woman: పెళ్లంటే ఇద్ద్దరు కలిసి జీవితాంతం కలిసుండేందుకు వేసే తొలి అడుగు. అయితే ఇటీవల పెళ్లంటే మూణాళ్ల ముచ్చటగా సాగుతోంది..వివాహేతర సంబంధాలూ ఎక్కువైపోతున్నాయి.. కానీ ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి నిత్య పెళ్లి కొడుకు అనే పదాన్ని నిత్యం రుజువు చేస్తూనే ఉన్నాడు. ఒకరు, ఇద్దరు కాదు. ఒకరికి తెలియకుండా ఇంకొకరిని ఇలా ఏకంగా 14 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎంతకాలమని ఇతర భార్యలకు తెలియకుండా ఈ విషయాన్ని దాచగలడు.. చివరికి ఆరోజే రానే వచ్చింది. తనను పెళ్లి పేరుతో మోసం చేసి డబ్బులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అసలు ఆ నిత్య పెళ్లి కొడుకు ఎవరూ? ఇదంతా ఎక్కడ, ఎలా జరిగిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఒడిశాలోని కేంద్రపర జిల్లాకు చెందిన బిధు ప్రకాష్ స్వైన్(54) అనే వ్యక్తి తనను తాను డాక్టర్‌గా చెప్పుకుంటూ వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలను పెళ్లి పేరుతో మోసం చేశాడు. ఇతను ఒడిశాలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువగా నివసిస్తుంటాడు. పంజాబ్, ఢిల్లీ, అస్సాం, జార్ఖండ్, ఒడిశాలకు చెందిన మహిళను తన వలలోకి దింపి రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు. మధ్య వయసున్న మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలే ఇతని టార్గెట్. కేంద్ర వైద్యారోగ్య శాఖలో ఉద్యోగినని చెబుతూ మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా మహిళలకు ఎర వేస్తుంటాడు. అంతేగాక బాగా చదువుకొని ఉన్నావారు, ప్రవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వారిని మాత్రమే సంప్రదిస్తాడు. ఇలా వారిని వంచించి పెళ్లి చేసుకుంటాడు. ఇదంతా వారి డబ్బు మీద ఉన్న ఆశతో ఇంతటి పనికి ఒడిగడుతుంటాడు. పెళ్లయిన తర్వాత కొద్దిరోజులు వారి వద్దే ఉండి తరువాత ఏదైనా పని నిమిత్తం భువనేశ్వర్‌కు వెళతాననే నెపంతో మహిళలను తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లేవాడు. అయితే జులై 2021లో ఢిల్లీకి చెందిన ఓ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యూఢిల్లీలోని ఆర్యసమాజ్ ఆలయంలో స్వైన్ తనను పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు భువనేశ్వర్‌లోని ఖండగిరి ప్రాంతంలోని ఓ ఇంట్లో అతన్ని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలోనూ నిందితుడు షాకింగ్ నిజాలు వెల్లడించాడు. తను వివిధ మ్యాట్రిమోనియల్ సైట్లు మరియు సోషల్ మీడియాలో పరిచయమైన మరో 13 మంది మహిళలను మోసగించినట్లు తేలింది. చదవండి: ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో.. వీడు మామూలోడు కాదండోయ్.. నిందితుని నుంచి 11 ఏటీఎం కార్డులు, 4 ఆధార్ కార్డులు, స్కూల్ సర్టిఫికెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామనీ, ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామనీ నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు స్వైన్ గతంలో హైదరాబాద్‌లోనూ అరెస్టయ్యాడు. అతను సెంట్రల్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా నటిస్తూ దేశమంత అనేక మంది వ్యక్తుల నుండి రూ.2 కోట్ల మేరకు వసూలు చేశాడు. కేరళలోని ఎర్నాకులంలో ఓకేసులోనూ అరెస్టయ్యాడు. చదవండి: హోటల్లో ప్రేయసితో భర్త.. భార్య చేసిన పనికి పరార్ స్వైన్ బాధితుల్లో సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది, సీనియర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నారు.2018లో పంజాబ్‌కు చెందిన సీఏపీఎఫ్ అధికారిని పెళ్లి చేసుకుని దాదాపు రూ.10 లక్షల మేర మోసం చేశాడు. అనంతరం గురుద్వారాకు చెందిన మహిళను పెళ్లి చేసుకొని ఆసుపత్రి మంజూరు చేస్తానని చెప్పి రూ.11 లక్షలను మోసం చేశాడు. అయితే స్వైన్ ఐదుగురు పిల్లలకు తండ్రి కాగా అతను 1982లో మొదటి సారి వివాహం చేసుకున్నాడు. అప్పటితో మొదలైన ఆయన పెళ్లి బాగోతలు 20 ఏళ్ల వరకు కొనసాగాయి. ఈ ఇరవై ఏళ్ల కాలంలో ఎంతో మంది మహిళలతో స్నేహం చేసి వారిని దొంగ వివాహం చేసుకున్నాడు. చదవండి: వివాహేతర సంబంధం: భార్య తల నరికిన భర్త.. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చి.. -
మరణించిన టీచర్ పేరుతో రూ.33 లక్షలు డ్రా... కొడుక్కి విషయం తెలియడంతో..
సాక్షి, హైదాబాద్: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి మరణానంతరం ఆమె పేరుతో నకిలీ గిఫ్ట్ డీడ్ సృష్టించిన ఇద్దరు వ్యక్తులు ఆమెతో పాటు ఆమె భర్త బ్యాంకు ఖాతాల్లోని రూ.33.5 లక్షలు కాజేశారు. దీనిపై ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.తదుపరి దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి (సీసీఎస్) బదిలీ చేయడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. యాకత్‌పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్తర్ హుస్సేన్ ఆరోగ్య శాఖ పరిధిలోని స్టేట్ హెల్త్ ట్రాన్స్‌ఫోర్ట్ ఆర్గనైజేషన్‌లో సర్వీస్ ఇంజినీర్‌గా పని చేశారు. 2003లో రిటైర్ అయిన ఆయన 2015 అక్టోబర్‌లో చనిపోయారు. అక్తర్ భార్య నూర్జహాన్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 2020 జూన్ 2న ఆమె కన్నుమూశారు. గజ్వేల్ జిల్లా నుంచి వచ్చి ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్న అన్నదమ్ములు మహ్మద్ సమియుద్దీన్, ఫసియుద్దీన్‌లు నూర్జహాన్ పేరుతో నకిలీ గిఫ్ట్ డీడ్ రూపొందించారు. వీటిని రెండు బ్యాంకుల్లో సమర్పించి నూర్జహాన్ ఖాతాలకు సంబంధించిన ఏటీఎం కార్డులు పొందారు. ఓ బ్యాంకుల్లో ఉన్న నూర్జహాన్ ఖాతా నుంచి రూ.3.5 లక్షలు, మరో బ్యాంకులో ఉన్న అక్తర్ ఖాతా నుంచి రూ.30 లక్షలు దఫదఫాలుగా డ్రా చేసుకుని స్వాహా చేశారు. విషయం తెలుసుకున్న నూర్జహాన్ కుమారుడు జకీర్ హుస్సేన్ మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తన తల్లి ఏ సందర్భంలోనూ ఎవరికీ హిబా ఇవ్వలేదని, ఆ పేరుతో నిందితులు తప్పుడు పత్రాలు సృష్టించారని జకీర్ ఆరోపించారు. ఈ మేరకు నమోదైన కేసును మలక్‌పేట పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ చేశారు. దీంతో దీన్ని రీ–రిజిస్టర్ చేసుకున్న సీసీఎస్ ఏసీపీ ఎం.శ్రీనివాస్ రావు దర్యాప్తు ప్రారంభించారు. -
ఎక్కువరోజులు ఉండలేను.. హైదరాబాద్ వచ్చేస్తా.. సీన్ కట్ చేస్తే..
సాక్షి, హైదరాబాద్: ఇన్‌స్ట్రాగామ్‌లోని యాడ్స్ డిగ్రీ చదువుతున్న ఆమెను ఆకర్షించింది. రూ.100 పెడితే రూ.200 వస్తాయన్న ప్రచారంతో ముందు కొద్దిగా డబ్బులు కట్టింది. మొదటగా వారు కొద్ది కొద్దిగా లాభాలు ఇచ్చి బుట్టలో పడేశారు. దీంతో ఆమె ఇంట్లోని తండ్రికి చెప్తే..ఆయన కూడా ప్రోత్సహించాడు. ఇంకేముంది కట్ చేస్తే తాము ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు లాభాలు ఇవ్వట్లేదని..చేసిన డబ్బు ఇవ్వట్లేదంటూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు మల్లేపల్లికి చెందిన తండ్రీ, కూతుర్లు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ యువతి ఇటీవల ఓ యాప్‌లో ఇన్వెస్ట్ చేసింది. పలు దఫాలుగా రూ.12లక్షలు కట్టింది. వాటికి లాభాలు ఇవ్వకపోగా ఆ డబ్బును కూడా బ్లాక్ చేశారు. దీంతో సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధు తెలిపారు. చదవండి: గొంతుకు చున్నీ బిగించి.. రెండో వివాహం పేరుతో రూ.10 లక్షలు స్వాహా.. ఓ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో నగరానికి చెందిన మహిళకు లండన్‌లో ఉంటానంటూ ఓ వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఎక్కువ రోజులు ఉండలేనని రెండు రోజుల్లో హైదరాబాద్ వచ్చేస్తా..ఢిల్లీ మీదుగా వచ్చేప్పుడు మనం కలసి బతికేందుకు పెద్ద ఎత్తున డబ్బు కూడా తెస్తున్నా అన్నాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఢిల్లీ కస్టమ్స్ కాల్స్ చేసి ఆ మహిళ నుంచి రూ.10లక్షలు వసూలు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మధు చెప్పారు. చదవండి:ఇమ్రాన్‌ఖాన్‌ను ఆధారాలు కోరవచ్చు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎస్బీఐ కేవైసీ అప్డేట్ అంటూ రూ.6లక్షల 40వేలు మాయం.. ఎస్బీఐ కైవైసీ అప్డేట్ చేసుకోమంటూ తార్నాకు చెందిన ఓ వృద్ధుడికి సైబర్ నేరగాళ్లు వల వేశారు. బ్యాంకు వివరాలను సేకరించి ఆయన ఖాతా నుంచి రూ.6లక్షల 40వేలు కాజేశారు. -
మహేష్ బ్యాంక్ కేసులో కీలక నిందితుడు
-
రూ.579 కోట్ల కాంట్రాక్టులంటూ..రూ.3 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు మరో లిమిటెడ్ సంస్థకు చెందిన పనులు ఇప్పిస్తామంటూ నగరానికి చెందిన వ్యక్తిని మోసం చేసిన ముఠాపై హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.579 కోట్ల పనులు సబ్–కాంట్రాక్ట్‌కు ఇస్తామంటూ రూ.3 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన సివిల్ ఇంజినీర్ కె.జగదీశ్వర్ దాదాపు పదహారేళ్లుగా సాయిడక్స్ ఇంజినీర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థ నిర్వహిస్తున్నారు. శివప్రసాద్ అనే దళారి ద్వారా ఈయనకు గతేడాది సెప్టెంబర్ 21న డీఎన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ డి.నరేష్ చౌదరి కలిశారు. ఆ సందర్భంలో మహానంది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన రూ.539 కోట్ల కాంట్రాక్టుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపించారు. ఆ కాంట్రాక్టు తనకే వచ్చిందంటూ నమ్మబలికాడు. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన రూ.40 కోట్ల కాంట్రాక్టునూ సబ్–కాంట్రాక్టుకు ఇస్తానంటూ చెప్పాడు. బేరసారాల తర్వాత జగదీశ్వర్, నరేష్‌లు ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత నరేష్ నుంచి జగదీశ్వర్‌కు ఆ రెంటితో సంబంధం లేని పనులకు సంబంధించిన వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. అదేమని ప్రశ్నిస్తే జీఎస్టీ ఇబ్బందుల నేపథ్యంలో అలా ఇవ్వాల్సి వచ్చిందంటూ చెప్పాడు. చదవండి: యువ దంపతుల ఆత్మహత్య .. అదే కారణమా..? గరిష్టంగా వారం రోజుల్లో అసలు పనులు ప్రారంభిద్దామంటూ అందుకు అవసరమైన ఖర్చుల నిమిత్తం కావాలంటూ రూ.1.4 కోట్లు తీసుకున్నాడు. ఈ నగదు తీసుకునే సమయంలో నరేష్‌తో పాటు అతడి భార్య లావణ్య, బంధువు రాకేష్‌లతో పాటు చైతన్య అనే వ్యక్తి కూడా వచ్చారు. ఆపై సరుకు సరఫరా పేరుతో ఉమా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కంపెనీ, ఏకదంత రిటైలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు రూ.50 లక్షలు, రూ.1.1 కోట్లు చొప్పున నగదు, పర్చేజ్ ఆర్డర్లు ఇప్పించాడు. ఈ చెల్లింపుల తర్వాత జగదీశ్వర్‌కు ఎలాంటి సరుకు సరఫరా కాలేదు. కొన్నాళ్లు ఎదురు చూసిన ఈయన తన సబ్–కాంట్రాక్టులు, నగదు విషయంపై నరేష్‌ను సంప్రదించారు. అయితే అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గుర్తించారు. దీంతో ఆరా తీయగా... నరేష్ నేతృత్వంలోని ముఠా అనేక మందిని ఇదే పంథాలో మోసం చేసిందని, దాదాపు ప్రతి సందర్భంలోనూ నకిలీ లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు చూపించినట్లు తేలింది. దీంతో ఆయన సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో నరేష్, లావణ్య, రాకేష్, స్వాతి, చైతన్య, శివప్రసాద్లతో పాటు ఉమా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కంపెనీ, ఏకదంత రిటైలర్స్ ప్రైవేట్ లిమిటెడ్లపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
పేమెంట్ అయినట్టు మెసేజ్ వస్తుంది.. చెక్ చేసుకోకుండానే ఓకే చెప్తే అంతే!
‘ఇటీవల వనస్థలిపురంలో ఓ మొబైల్ షాప్‌లోకి ఇద్దరు యువకులు వచ్చారు. ఒకట్రెండు ఉత్పత్తులను కొనుగోలు చేయగా.. రూ.2,800 బిల్లు అయింది. స్పూఫింగ్ పేటీఎం యాప్ నుంచి షాప్ వివరాలను నమోదు చేయగానే యజమానికి బిల్లు చెల్లించినట్లు సందేశం వచ్చింది. దీంతో యజమాని తన ఖాతాలో చెక్ చేసుకోకుండానే ఓకే అనడంతో ఆ ఇద్దరు కస్టమర్లు అక్కణ్నుంచి వెళ్లిపోయారు. తాపీగా బ్యాంక్ ఖాతాలో చూసుకుంటే బిల్లు జమ కాలేదు. మెసేజ్ వచ్చింది కదా నగదు క్రెడిట్ కాకపోవటమేంటని బ్యాంకులో ఆరా తీస్తే.. అది నకిలీ మెసేజ్ అని తేల్చేశారు. దీంతో యజమాని పోలీసులను ఆశ్రయించాడు.. ఇలా ఒకరిద్దరు కాదు నగరంలో రోజుకు పదుల సంఖ్యలోనే రిటైల్ యజమానులకు స్పూఫింగ్ పేమెంట్ యాప్‌లతో టోపీ పెడుతున్నారు కొందరు వినియోగదారులు’ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి నగదు లభ్యత తగ్గడంతో చాలా మంది డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గుచూపుతున్నారు. కరోనా మహమ్మారితో ఈ వినియోగం మరింత పెరిగింది. చిన్న కిరాణా షాపులు, కూరగాయల బండ్ల మీదా పీటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ అప్లికేషన్లు కనిపిస్తున్నాయి. యాప్ పేమెంట్ వినియోగం విరివిగా అందుబాటులోకి రావటంతో మోసగాళ్లు వీటినీ అవకాశంగా మలుచుకుంటున్నారు. కస్టమర్ కేర్ నంబర్లు, వెబ్సైట్లు, ఈ– మెయిల్ ఐడీలతో పాటూ ఈ– వ్యాలెట్లు కూడా స్పూఫింగ్ చేస్తున్నారు. చదవండి: కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్ ఎలా చేస్తారంటే.. ►స్పూఫింగ్ యాప్‌లను మొబైల్ అప్లికేషన్ ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. షాపింగ్ చేశాక కొనుగోలుదారుల మొబైల్లోని స్పూఫింగ్ ఈ– వ్యాలెట్‌లో షాప్ పేరు, ఫోన్ నంబర్, అమౌంట్ వంటి వివరాలను నమోదు చేసి ఎంటర్ చేస్తారు. దీంతో షాప్ యజమాని ఫోన్ నంబర్‌కు పేమెంట్ పూర్తయినట్లు నకిలీ నోటిఫికేషన్ వెళుతుంది. వాస్తవానికి యజమాని బ్యాంక్ ఖాతాలో మాత్రం నగదు జమ కాదు. ► బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేసి డబ్బు జమ అయిందో లేదో యజమాని చూసుకునే సమయం ఉండదు. ఎందుకంటే వేరే కస్టమర్లు ఉండటంతో బిజీగా ఉండిపోతారు. తీరా ఖాళీ సమయంలో అకౌంట్లో చూసుకుంటే ఆ నోటిఫికేషన్ తాలుకు పేమెంట్ జమై ఉండదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకుంటాడు. ఒకవేళ షాప్ యజమాని చూసుకున్నా.. డేటా, సాంకేతిక సమస్య వల్ల ఖాతాలో అప్డేట్ కావడంలో ఆలస్యం అవుతుందని ఈ కేటుగాళ్లు యజమానిని ఒప్పిస్తున్నారు. చదవండి: దేశమంతటా మన పథకాలే సౌండ్ బాక్స్‌తో పరిష్కారం.. నకిలీ లావాదేవీలకు సౌండ్ బాక్స్‌తో చెక్ పెట్టొచ్చని పేటీఎం నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా పేటీఎంకు 2.3 కోట్ల మంది వర్తకులు పార్ట్నర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. పేమెంట్ జరిగిందా లేదా అని తక్షణమే తెలుసుకునేందుకు సౌండ్ బాక్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్, వాలెట్, డెటిట్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లు ఏ మాధ్యమం ద్వారా అయినా సరే పేమెంట్ చేయగానే, ఖాతాలో నగదు జమ కాగానే లావాదేవీల వివరాలు సౌండ్ బాక్స్‌లో వాయిస్ రూపేణా వినిపిస్తాయి. దుకాణా యజమానులు ప్రతి లావాదేవీ వివరాలు ప్రతిరోజూ లేదా వారానికోసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ పూర్తయ్యాక బ్యాంక్ ఖాతాలో అమౌంట్ జమయ్యేందుకు ఎంత సమయం పట్టిందనే వివరాలనూ తెలుసుకోవచ్చు. -
కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్‌బీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. మదుపరుల అనుమతి లేకుండా వారి షేర్లను బదలాయించడంతోపాటు సెబీ నిబంధనలు ఉల్లంఘించి తీసుకున్న బ్యాంకు రుణాలను వ్యక్తిగత, షెల్ కంపెనీలకు మళ్లించిన నేరంలో ఆయనను సోమవారం ఉదయం బెంగళూర్‌లో పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. కార్వీలో జరిగిన కుంభకోణంపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పార్థసారథితోపాటు ఇతర డైరెక్టర్లపై ఇప్పటికే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే తరహా కేసులో బెంగళూర్ పోలీసులు కూడా పార్థసారథిని పీటీ వారెంట్‌పై తీసుకెళ్లి విచారించారు. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో కార్వీకి చెందిన 14 కార్యాలయాలు, ఎండీ, ఇతర కీలక వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేసింది. కార్వీ షేర్లు కొన్న మదుపరుల పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా వారికి తెలియకుండా షేర్లను తన వ్యక్తిగత ఖాతాలోకి బదలాయించుకొని వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.3 వేల కోట్లు రుణంగా పార్థసారథి పొందినట్టు ఈడీ గుర్తించింది. ఐసీఐసీఐ, ఇండస్ బ్యాంకుల ద్వారా పొందిన రూ.1,100 కోట్ల రుణంను తన ఖాతాలతోపాటు షెల్ కంపెనీలైనా కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మరో 7 కంపెనీలోకి మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ గుర్తించింది. డీమ్యాట్ అకౌంట్లు బ్లాక్ లిస్ట్‌లో ఉన్నా పార్థసారథి సెబీ నిబంధనలు ఉల్లంఘించి ఇలా తనఖా పెట్టి షేర్ల ద్వారా రుణాలను షెల్ కంపెనీల్లోకి మళ్లించినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. రూ.700 కోట్ల షేర్లు ఫ్రీజ్ గతేడాది సెప్టెంబర్‌లో ఈడీ రూ.700 కోట్ల విలువైన కార్వీ స్టాక్ బ్రోకింగ్ షేర్లను ఫ్రీజ్ చేసింది. కస్టమర్లకు తెలియకుండా బదలాయించుకున్న షేర్లకు సంబంధించిన రూ.1,906 కోట్లను కార్వీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ నుంచి కార్వీ రియాల్టీ, కార్వీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోకి బదలాయించినట్టు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్టు తెలిసింది. మిగిలిన రూ.1,800 కోట్ల లావాదేవీలపై విచారణను ముమ్మరం చేసింది. డబ్బును ఎక్కడికి మళ్లించారు, దేనికి వాడారో తేల్చేందుకు పార్థసారథిని మరింత లోతుగా విచారించనుంది. ఇందుకు కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను షెల్ కంపెనీకు మళ్లించిన ఆధారాలను ఆటోమేటెడ్ డిలీట్ సాఫ్ట్‌వేర్‌తో పార్థసారథి ధ్వంసం చేసినట్టు ఈడీ అనుమానిస్తోంది. వీటిని వెలుగులోకి తేవాల్సి ఉందని ఈడీ భావిస్తోంది. -
చీటింగ్ కేసులో తిరుమల ఏఎస్పీ.. నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపి...
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుమల అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా (ఏఎస్పీ) పని చేస్తున్న ఎం.ముని రామయ్యపై హైదరాబాద్ సెంట్రల్ క్రై మ్ స్టేషన్లో (సీసీఎస్) చీటింగ్ కేసు నమోదైంది. ఓ డమ్మీ డీఎస్పీని రంగంలోకి దింపి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ వై.వెంకట్‌రెడ్డి నేరానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ముని రామయ్యకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. మరోపక్క ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు ఏపీ అధికారులకు సమగ్ర నివేదిక సమర్పించారు. భారీ మొత్తం వస్తుందని ఆశ చూపి... మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన చుండూరు సునీల్‌కుమార్ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఈయన స్నేహితుడైన కోడటి జయప్రతాప్ 2018 డిసెంబర్లో ఓ ప్రతిపాదన తీసుకువచ్చారు. చిత్తూరు జిల్లా ఓ వ్యక్తికి రూ.5 కోట్లు ఇస్తే ఆయన వివిధ పెట్టుబడులు పెట్టి, పక్షం రోజుల్లో రూ.18 కోట్ల తిరిగి ఇస్తాడని చెప్పాడు. ఈ మాటల్ని సునీల్‌కుమార్ పట్టించుకోలేదు. దీంతో 2019 అక్టోబర్ 28న ముని రామయ్యను తీసుకుని జయ ప్రతాప్ హైదరాబాద్ వచ్చారు. హిమాయత్‌నగర్‌లోని సునీల్ కుమార్ కార్యాలయానికి వెళ్లి ఆయన్ను కలిశారు. అప్పట్లో ముని రామయ్య సీఐడీ విభాగంలో తిరుపతి డీఎస్పీగా పని చేస్తున్నారు. సునీల్ కుమార్‌తో పెట్టుబడుల విషయం చెప్పిన ముని రామయ్య కచ్చితంగా లాభం వస్తుందని, రూ.1.2 కోట్లు ఇస్తే పక్షం రోజుల్లో రూ.3 కోట్లు ఇస్తామంటూ నమ్మబలికాడు. అవతలి వ్యక్తి ఇవ్వకుంటే పరిస్థితి ఏంటని సునీల్ కుమార్ ప్రశ్నించారు. చదవండి: ఎఫ్ఐఆర్లను ఆన్లైన్లో ఉంచని పోలీసులు.. ‘సుప్రీం’నే ధిక్కరిస్తారా! నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపి... దీంతో ముని రామయ్య ఓ నకిలీ డీఎస్పీని రంగంలోకి దింపాడు. కేవీ రాజు అనే వ్యక్తిని తీసువచ్చి టాస్క్‌ఫోర్స్ డీఎస్పీగా పరిచయం చేశాడు. గతంలో తామిద్దరం కలిసి అనేక ఎన్కౌంటర్లు చేశామంటూ నమ్మబలికాడు. అవతలి వ్యక్తి నగదు ఇవ్వకపోతే అతడిని కనిపెట్టి, డబ్బు వసూలు చేయడం రాజుకు పెద్ద పనేంకాదంటూ చెప్పాడు. దీనికితోడు ముని రామయ్య రూ.1.2 కోట్లకు తాను గ్యారెంటీగా ఉంటానంటూ రూ.3 కోట్లకు ఆర్టీజీఎస్ ఫామ్ రూపొందించి తన ఫోన్ ద్వారా సునీల్‌కుమార్‌కు పంపాడు. దీంతో పాటు ఆర్కే క్లీన్ రూమ్స్ ప్రై వేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో రూ.3 కోట్లకు రాసిన చెక్కులు ఇచ్చాడు. దీంతో రూ.1.2 కోట్లు ఇవ్వడానికి సునీల్ కుమార్ అంగీకరించారు. దీంతో 2019 నవంబర్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తిని రూ.1.2 కోట్లు ఇచ్చి పంపేలా ముని రామయ్య చేశారు. ఈ సందర్భంలోనే జయప్రతాప్ ఖమ్మంలో ఉన్న ఓ భూమికి సంబంధించిన పత్రాలు ఇచ్చారు. ఆరా తీయగా అసలు విషయం తెలిసి... ఇది జరిగిన తర్వాత దాదాపు రెండేళ్లకు పైగా ఎదురు చూసినా సునీల్‌కుమార్‌కు డబ్బు తిరిగి రాలేదు. దీంతో సునీల్‌కుమార్ ముని రామయ్యపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తన కుమార్తె పేరుతో ఉన్న ఓ స్థలం పత్రాలు ఇచ్చిన ఆయన దానిపై రూ.2 కోట్లు రుణం తీసుకోవాలని చెప్పారు. అయితే వాటిని పరిశీలించిన బ్యాంకులు రుణం ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పటి నుంచి ముని రామయ్య అందుబాటులోకి రాకపోవడంతో సునీల్‌కుమార్ అనుమానించారు. ఆరా తీయగా కేవీ రాజు అనే పేరుతో డీఎస్పీ లేరని తేలింది. చదవండి: Chain Snatcher: ఉమేష్ ఖతిక్‌ను ఇచ్చేదేలే దీంతో ఆయన తాను మోసపోయానని గుర్తించి సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో జయప్రతాప్, మునిరామయ్య, కేవీ రాజు తదితరులపై కేసు నమోదు చేసిన ఏసీపీ వై.వెంకట్‌రెడ్డి దర్యాప్తు చేసి నేరం జరిగినట్లు నిర్థారించారు. ఓపక్క ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా ముని రామయ్య రెండుసార్లు సునీల్‌కుమార్‌ను కలిశారు. అప్పటి వరకు తానో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని చెప్పుకున్న ఆయన హఠాత్తుగా కాళ్ల బేరానికి వచ్చారు. సదరు కేసులో తనను సాక్షిగా చేర్చాలంటూ ప్రాధేయపడ్డాయి. అయితే డబ్బు విషయం మాత్రం తేల్చలేదు. -
యూకేలో ఉద్యోగమంటూ.. మాయ మాటలతో బుట్టలో వేసుకొని
సాక్షి, హిమాయత్‌నగర్: యూకేలో ఉద్యగమంటూ నమ్మించారు.. డాక్యుమెంట్లకు డబ్బులన్నారు. అలా ఆశ పెట్టి నగర వాసి నుంచి ఉన్నవన్నీ ఊడ్చేశారు సైబర్ నేరగాళ్లు. నగర వాసి ఉద్యోగం కోసం తన రెజ్యూమ్ని ఆన్లైన్ పెట్టాడు. రెజ్యూమ్ చూసిన సైబర్ నేరగాడు నగర వాసితో మాటలు కలిపాడు. యూకేలో అయితే మంచి హోదా, ప్యాకేజీతో మీ చదువుకు తగిన ఉద్యోగం వస్తుందన్నాడు. అతను చెప్పిన మాయ మాటలకు బుట్టలో పడ్డాడు. డాక్యుమెంట్స్ కోసమని, వీసా కోసమని డబ్బులు కావాలన్నాడు. ఆ తర్వాత తాము చెన్నై ఆర్బీఐ నుంచి మాట్లాడుతున్నామని మరికొన్ని డాక్యుమెంట్స్ అవసమరమన్నారు. ఇలా డాక్యుమెంట్స్ పేరు చెప్పి నగర వాసికి ఆశ చూపి పలు దఫాలుగా రూ.11లక్షల 14వేలు కాజేశారు. మరో వ్యక్తి ఆర్బీఎల్ బ్యాంక్ కస్టమర్ కేర్ కోసం ప్రయత్నించగా..తాము సాయ పడతామని చెప్పారు. మొబైల్లో ఎనీడెస్క్ యాప్ ఇన్స్టాల్ చేయించి నగర వాసి అకౌంట్లో నుంచి రూ.2లక్షల 56వేలు స్వాహా చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. చదవండి: సాయితో సోనీ వివాహేతర సంబంధం.. చంపుతానని భర్త బెదిరించడంతో.. -
తెలంగాణలో మరో భారీ నిధుల గోల్మాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో నిధుల గోల్‌మాల్‌కు భారీ కుట్ర జరిగింది. ఫిక్సిడ్ డిపా జిట్లు కాజేసేందుకు జరిగిన ప్రయత్నం విఫలమైంది. తెలుగు అకాడమీలో జరిగి న నిధుల గోల్మాల్ వెనుక ఉన్న సూత్రధారే పాత్రే ఇక్కడా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. తెలుగు అకాడమీలో కోట్ల రూపాయలకు పైగా నిధులను పక్కదారి పట్టించగా, తా జాగా గిడ్డంగుల సంస్థకు చెందిన రూ. 3.98 కోట్లు కాజేసేందుకు కుట్ర పన్నారు. అయితే ఇదే సమయంలో గిడ్డంగుల సంస్థ ఫిక్సిడ్ డిపాజిట్ చేసి సంవత్సరం కావడంతో విత్ డ్రా కో సం అధికారులు బ్యాంకును సంప్రదించగా, అధికారులు ఇచ్చిన రశీదులు నకిలీవని తేలింది. దీంతో గిడ్డంగుల సంస్థ డిపాజిట్లను కాజేసేందుకు కుట్ర జరిగినట్లు బహిర్గతమైంది. బ్యాంకుల్లో డిపాజిట్లు... రాష్ట్ర గిడ్డంగుల సంస్థ తమకు వచ్చే ఆదాయా న్ని ఖర్చులకు పోను మిగతా మొత్తాన్ని పలు బ్యాంకుల్లో సంస్థ తరఫున ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తుంది. ఇందులో భాగంగానే హైదరా బాద్ కార్వాన్ ఏరియాలోని యూనియన్ బ్యాంక్‌లో గతేడాది జనవరి 6న రూ. 1.90 కోట్లు, 7న మరో 1.90 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. ఈ నెల 6, 7 తేదీలకు ఏడాది కావడంతో డిపాజిట్లను విత్ డ్రా చేసుకునేందుకు సంస్థ అధికారులు బ్యాంకును సంప్రదించి, రశీదులు చూపించగా అవి నకిలీవని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆన్లైన్ వివరాలను బ్యాంకు అధికారులకు చూపించారు. పరిశీలించిన బ్యాంకు నకిలీ రశీదు స్థానంలో మరో రశీదును అందించి, అనంతరం నిధులను సంస్థ ఖాతాలో వడ్డీతో కలిపి జమచేశారు. అదే బ్యాంకులో అకాడమీ గోల్మాల్ తెలుగు అకాడమీ నిధుల వ్యవహరం, గిడ్డంగుల సంస్థ వ్యవహారం రెండూ కార్వాన్ ఏరియాలోని యూనియన్ బ్యాంకులోనే జరగడంతో నిధుల గోల్‌మాల్‌లో గత అధికారి పాత్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిడ్డంగుల సంస్థ బ్యాంకులో నగదును డిపాజిట్ చేసిన సమయంలో తెలుగు అకాడమీ నిధులను కాజేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు అధికారే ఉండడం కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది. ఇందుకు సంబంధించి ఈ కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. -
గేమ్ పేరుతో రూ.1,100 కోట్లు నొక్కేసిన చైనా కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: గేమ్ ఆఫ్ చాన్స్‌గా పరిగణించే ‘కలర్ ప్రెడిక్షన్’ను ఆన్లైన్లో నిర్వహించిన చైనా కంపెనీలు ఇక్కడివారి నుంచి కాజేసిన మొత్తంలో రూ.1,100 కోట్లు హాంకాంగ్‌కు తరలించేశాయి. ఢిల్లీలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, వాటి పేర్లతో ముంబైలో బ్యాంకు ఖాతాలను తెరిచిన కేటుగాళ్లు నకిలీ ఎయిర్ వే బిల్లుల సహకారంతో ఈ పని పూర్తి చేశారు. 2020లో ఈ కలర్ ప్రిడెక్షన్ గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసులు నమోదు చేసి చైనీయులు సహా ఉత్తరాదికి చెందిన పలువురిని అరెస్టు చేశారు. ఈ కేసుల ఆధారంగా ముందుకు వెళ్లిన ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసింది. దీంతో నకిలీ ఎయిర్ వే బిల్లుల విషయం బయటపడింది. మోసానికి సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే అధికారం ఈడీకి లేకపోవడంతో హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈడీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ బి.రవీందర్‌రెడ్డి లోతుగా దర్యాప్తు చేయడంతో రూ.1,100 కోట్లు దేశం దాటినట్లు తేలింది. ఈ–కామర్స్ కంపెనీల పేరుతో... భారత్‌లో కలర్ ప్రెడిక్షన్ (రంగు సెలక్షన్ ప్రక్రియతో కూడిన జూదం) దందా నడపాలని నిర్ణయించుకున్న చైనీయులు ఢిల్లీ, ముంబైకి చెందిన కొందరితో కలిసి పథకం ప్రకారం వ్యవహరించారు. లింక్‌యున్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, డోకీపే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్పాట్‌పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థల్ని ఏర్పాటు చేశారు. ఈ–కామర్స్ వ్యాపారం పేరుతో వెబ్‌సైట్స్‌ను రిజిస్టర్ చేశారు. వీటి ముసుగులోనే ఆన్లైన్ గేమ్ కలర్ ప్రిడెక్షన్‌ను నిర్వహించారు. ఆ 3 సంస్థల పేరుతోనే పేమెంట్ గేట్వేస్ అయిన కాష్ ఫ్రీ, పేటీఎం, రేజర్ పే, ఫోన్ పే, గూగుల్ పేలతో ఒప్పందాలు చేసుకున్నారు. సోషల్‌మీడియా ద్వారా సర్క్యులేట్ అయిన ఈ గేమ్ హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా యువతను నిండా ముంచింది. పేమెంట్ గేట్‌వేల నుంచి.. ఈ గేమ్ ఆడేవాళ్లు ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఈ పేమెంట్ గేట్‌వేల ద్వారానే చేపట్టారు. వీటి ద్వారా గేమ్ ఆడినవాళ్ల నుంచి దోచుకున్న సొమ్మును లింక్‌యున్, డోకీపే, స్పాట్‌పే ఖాతాల్లోకి మళ్లించారు. ఈ సంస్థల నుంచి సొమ్ము మళ్లించడానికి ఢిల్లీలో గ్రేట్ ట్రాన్స్ ఇంటర్నేషనల్, ఏషియా పసిఫిక్ కార్గో కంపెనీ, రేడియంట్ స్పార్క్ టెక్నాలజీస్, ఆర్చీవర్స్ బిజ్ ఇంటర్నేషనల్, కనెక్టింగ్ వరల్డ్ వైడ్, జెనెక్స్ షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. వీటికి ముంబైలో బ్రాంచ్‌లు ఉన్నట్లు పత్రాలు సృష్టించి వెస్ట్ ముంబై జోగీశ్వరి ప్రాంతంలోని ఎస్బీఐ, ముంబైలోని నారీమన్ పాయింట్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ రహేజా సెంటర్లో 6 ఖాతాలు తెరిచి సొమ్ము తరలించారు. ఈ ప్రకియంతా నకిలీ పత్రాలతోనే నడిపారు. -
థెరానోస్ మాజీ సీఈవో హోమ్స్ దోషిగా నిర్ధారణ
శాన్‌జోస్ (అమెరికా): వివాదాస్పద స్టార్టప్ సంస్థ థెరానోస్ మాజీ సీఈవో ఎలిజబెత్ హోమ్స్‌ను (37) మోసం, కుట్ర కేసులకు సంబంధించిన కేసుల్లో దోషిగా అమెరికా కోర్టు నిర్ధారించింది. కొన్ని రక్తపు చుక్కల పరీక్షతో వ్యాధులను గుర్తించే వైద్యపరికరాన్ని కనుగొన్నామంటూ పలువురు ఇన్వెస్టర్లను నమ్మించి, మోసం చేశారని ఆమెపై మొత్తం 11 అభియోగాలు నమోదయ్యాయి. వీటిల్లో నాలుగు ఆరోపణల్లో ఆమెను దోషిగా కోర్టు నిర్ధారించింది. మరో నాలుగు అభియోగాలను కొట్టివేసింది. మిగతా మూడు ఆరోపణలపై జ్యూరీ ఇంకా తేల్చాల్సి ఉంది. దోషిగా నిర్ధారణ అయిన కేసుల్లో శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. ఒక్కో కేసులో ఆమెకు 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని లీగల్ నిపుణులు భావిస్తున్నారు. ఆమెతో పాటు మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న థెరానోస్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రమేష్ బల్వానీపై విచారణ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఆ కేసు విచారణ పూర్తయ్యే దాకా హోమ్స్ శిక్ష ఖరారు విషయంలో న్యాయమూర్తి వేచి చూసే యోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. సంచలన స్టార్టప్‌లకు ఈ ఉదంతం ఒక గుణపాఠంగా ఉండగలదని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. వివరాల్లోకి వెడితే, హోమ్స్ తన 19వ యేట 2003లో థెరానోస్‌ను నెలకొల్పారు. కొద్ది చుక్కల రక్తంతో చౌకగా బ్లడ్ టెస్ట్ నిర్వహించుకునే సెల్ఫ్ సర్వీస్ మెషీన్లను రూపొందించినట్లు కొన్నాళ్లకు ప్రకటించారు. దీంతో సంస్థలో పలువురు బడా ఇన్వెస్టర్లు, ప్రముఖులు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలో హోమ్స్ బిలియనీర్ అయిపోయారు. థెరానోస్ టెక్నాలజీ, ఉత్పత్తులు లోపభూయిష్టమైనవంటూ 2015లో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత 2018లో ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. -
గిఫ్ట్ ఫ్రాడ్ కేసులో నైజీరియన్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్ కస్టమ్స్ అధికారిగా ఫోన్ చేసి అందినకాడిక దండుకుంటున్న నైజీరియన్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీసీ కేవీఎం ప్రసాద్ తెలిపిన మేరకు.. ఈస్ట్ మారెడ్‌పల్లికి చెందిన ఓ మహిళకు యూకేకు చెందిన డాక్టర్ హెర్మన్ లియోన్ అనే పేరుతో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగా ఆమెకు హెర్మన్ వాట్సాప్ నంబర్‌ను ఇచ్చాడు. తక్కువ సమయంలో వీళ్లిద్దరు మంచి స్నేహితులయ్యారు. యూకే నుంచి 40 వేల పౌండ్ల విలువైన పార్సిల్‌ను బహుమతిగా పంపిస్తున్నానని హెర్మన్ తెలిపాడు. పార్సిల్ కోసం మనీ లాండరింగ్ చార్జీలు, ఆదాయ పన్ను, బీమా వంటి రకరకాల చార్జీలు చెల్లించాలని తెలపగా.. వేర్వేరు ఖాతాలకు రూ.38.57 లక్షలు సమర్పించుకుంది. ఎంతకీ పార్సిల్ ఇంటికి రాకపోవటంతో నిరాశ చెందిన సదరు మహిళ.. తాను మోసపోయానని తెలుసుకొని గతేడాది మే 27న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారలను సేకరించి ఢిల్లీలోని జనక్‌పురిలో నివాసం ఉంటున్న నైజీరియన్ ఒనేకా సొలమన్ విజ్డమ్ అలియాస్ సైమన్ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 7 సెల్ఫోన్లు, రెండు బ్యాంక్ ఖాతా పుస్తకాలు, ఒక డెబిట్ కార్డ్ స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: ఆ నేరానికి గానూ... ఒక వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష!!) -
నవీన మోసాలపై అప్రమత్తం
సాక్షి, అమరావతి: నకిలీ చిట్ ఫండ్ కంపెనీల మోసాలు, ఆన్లైన్ లెండింగ్ ప్లాట్ ఫారం మోసాల పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాలని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ సూచించారు. బుధవారం సచివాలయంలో జరిగిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 23వ రాష్ట్రస్థాయి కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశానికి రావత్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో రోజు రోజుకూ ఆన్లైన్, నకిలీ చిట్ ఫండ్ కంపెనీలు, డిజిటల్ లెండింగ్ కంపెనీల మోసాలు అధికమవుతున్నాయని అన్నారు. అలాంటి మోసాలను నియంత్రించేందుకు సంబంధిత రెగ్యులేటరీ ఏజెన్సీలు సకాలంలో కేసులు నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీనిపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఈ విధమైన మోసాలపై వారికి పెద్దఎత్తున అవగాహన పెంపొందించాలని సూచించారు. అనేక రకాల కొత్త యాప్‌లు పుట్టుకొచ్చి ఆర్థికపరమైన మోసాలకు పాల్పడుతున్నాయని చెప్పారు. బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ పేరిట పెద్దఎత్తున ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు మోసపోకుండా జాగ్రత్త తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈవి ధమైన మోసాలను నియంత్రించేందుకు వివిధ కేంద్ర, రాష్ట్ర రెగ్యులేటరీ అథారిటీలు పూర్తి సమన్వయంతో పనిచేయాల్సి ఉందన్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల రీజనల్ డైరెక్టర్ కె.నిఖిల మాట్లాడుతూ..వివిధ ఆర్థిక పరమైన మోసాలు, డిజిటల్ లెండింగ్ ప్లాట్ ఫారమ్ మోసాలు, నకిలీ కంపెనీల మోసాలపై చర్చించి నియంత్రించేందుకు రాష్ట్ర స్థాయిలో ఉన్న అత్యున్నత బాడీ ఎస్ఎల్సీసీ ఉందని పేర్కొన్నారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఈ బాడీ క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. వచ్చే త్రైమాసిక సమావేశాన్ని ఫిబ్రవరి ఆఖరి వారంలో నిర్వహించేలా చూడాలని సూచించారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ వై.జయకుమార్ అజెండా అంశాలను వివరాలను సమావేశంలో చర్చకు పెట్టారు. వివిధ చిట్ ఫండ్ కంపెనీలు అగ్రిగోల్డ్, అక్షయ గోల్డు, హీరా గ్రూప్ తదితర మోసాలకు సంబంధించి తీసుకున్న చర్యలను సమీక్షించారు. అలాగే మార్కెట్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి వివిధ లోన్ యాప్‌ల ద్వారా వేధింపుల ఫిర్యాదులు, ముద్రా అగ్రికల్చర్–స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీ, వర్థన్ బ్యాంకు స్కాం తదితర సంస్థలపై మోసాలు ఇప్పటి వరకు నమోదైన కేసుల ప్రగతి తదితర అంశాలను సమీక్షించారు. అదే విధంగా బానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ (బడ్స్)చట్టం 2019పై చర్చించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, న్యాయశాఖ కార్యదర్శి సునీత, రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్స్ బాబు ఏ, సీఐడీ డిఐజీ సునీల్ కుమార్‌నాయక్ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
పరిచయాలే పావుగా వాడుకున్నారు..!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్ల స్కాంలో మరో ఇద్దరు నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యవర్తిగా వ్యవహరించిన యోహాన్ రాజు, స్కామ్ సొమ్ము డిపాజిట్ చేయించుకున్న ఆయన భార్య ప్రమీలరాణిని విజయవాడ నుంచి పీటీ వారెంట్‌పై తీసుకువచ్చారు. దీంతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 13కు చేరింది. మరోవైపు సూత్రధారి సాయితోసహా ఆరుగురు నిందితులను సీసీఎస్ పోలీసులు తదు పరి విచా రణ కోసం శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా..: విజయవాడలోని చిట్టినగర్‌లో ఉన్న ప్రైజర్‌పేట పెద్దిరాజులవారి వీధికి చెందిన పూసలపాటి యోహాన్ రాజుకు మం దుల దుకాణం ఉంది. స్నేహితులు, పరిచయస్తుల్లో అనేక మందికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తుం టాడు. ఇలా ఇతడికి అనేక బ్యాంకులకు చెందిన మేనేజర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పట్లో విజయవాడలోని ఆంధ్రా బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేసిన మస్తాన్ వలీతోనూ రాజుకు పరిచయ మైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్ విలీనంతో నగరానికి బదిలీపై వచ్చిన మస్తాన్ వలీ సంతోష్‌నగర్ బ్రాంచ్‌కు మేనేజర్‌గా పని చేస్తూ కార్వాన్ బ్రాంచ్ బాధ్యతలూ నిర్వర్తించాడు. ఈ స్కాం సూత్రధారి సాయికుమార్‌కు వెంకట రమణ ప్రధాన అనుచరుడిగా పని చేశాడు. కొన్నాళ్ల క్రితం రమణ తన స్నేహితుడి శుభకార్యం కోసం విశాఖ వెళ్లాడు. అక్కడే పరిచయస్తుల ద్వారా యోహాన్ రాజు ఇతడికి పరిచయమయ్యాడు. విజయవాడలో ఉండే రాజు బ్యాంకు రుణాలు ఇప్పిస్తుంటాడని, చాలా మంది బ్యాంకు మేనేజర్లు తెలుసని కామన్ ఫ్రెండ్ చెప్పాడు. మేనేజర్ల అవసరం రావడంతో.. తెలుగు అకాడమీ ఎఫ్డీలపై కన్నేసిన సందర్భంలో సాయికి బ్యాంకు మేనేజర్ల అవసరం వచ్చింది. అప్పుడే విశాఖకు చెందిన సాంబశివరావు ద్వారా కెనరా బ్యాంక్ మేనేజర్ సాధనను, రమణ ద్వారా మస్తాన్ వలీని రంగంలోకి దింపాలని నిర్ణయించాడు. సాయి చెప్పడంతో అప్పట్లో యోహాన్ రాజును కలిసిన రమణ తన పథకం వివరించి మస్తాన్ వలీని కలపాల్సిందిగా కోరాడు. దీంతో మస్తాన్‌తో ఫోన్లో మాట్లాడిన యోహాన్.. రమణ వచ్చి కలుస్తాడని చెప్పాడు. ఆపై సంతోష్‌నగర్ వెళ్లి మస్తాన్ వలీని కలిసిన రమణ.. తమ కుట్రలో భాగంగా చేశాడు. సాయిని కూడా తీసుకువెళ్లి వలీకి పరిచయం చేశాక కుంభకోణం కథ నడిపారు. అకాడమీ ఎఫ్‌డీల నుంచి కొల్లగొట్టిన సొమ్ములో యోహాన్‌కు రూ.50 లక్షలు ఇచ్చారు. ఇందులో రూ.16 లక్షలు ప్రమీలారాణి ఖాతాలో జమ చేశాడు. ఏపీలో రూ.14.6 కోట్ల మేర జరిగిన ఆయిల్ ఫెడ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ల స్కాంలోనూ సాయి, యోహాన్‌ల పాత్ర ఉంది. ఆ కేసుల్లో యోహాన్ రాజు, ప్రమీలను విజయవాడ సీసీఎస్ పోలీసులు అక్టోబర్ 21న అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సిటీ సీసీఎస్ పోలీసులు యోహాన్, ప్రమీలను పీటీ వారెంట్ల హైదరాబాద్ తీసుకొచ్చి జైలుకు పంపారు. -
3 అంతస్తుల భవనంలో 200 కంపెనీలు!
సాక్షి, హైదరాబాద్: ఒక్కసారి పెట్టుబడి పెట్టండి.. ప్రతి రోజూ లాభం పొందండి.. అంటూ ప్రచారం చేసి, వర్చువల్ యాప్స్ ద్వారా సాగుతున్న ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వ్యవహారంలో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కీలకాంశాన్ని గుర్తించారు. వీటిని నిర్వహిస్తున్న షెల్ కంపెనీలు తమ ఉనికి బయటపడకుండా నకిలీ చిరునామాలతో జాగ్రత్త పడుతున్నట్లు తేల్చారు. ఇటీవల ఓ కంపెనీ వ్యవహారంపై ఆరా తీయగా.. బెంగళూరులోని ఓ మూడంతస్తుల భవనం చిరునామాతో 200 షెల్ కంపెనీలు నమోదై ఉన్నట్లు తేలింది. నగర యువకుడికి గాలం ఈ యాప్స్ నిర్వాహకులు నగరానికి చెందిన ఓ బాధితుడిని టార్గెట్ చేశారు. అతడికి ఫోన్ చేసిన ఆగంతకులు తాము నిర్వహించే స్కీముల్లో పెట్టుబడి పెడితే కేవలం కొన్ని రోజుల్లోనే మీ మొత్తం రెట్టింపు అవుతుందని నమ్మించారు. నగర యువకుడు అంగీకరించడంతో స్కీముకు సంబంధించిన ఓ లింకును వాట్సాప్ ద్వారా పంపారు. బాధితుడు లింక్‌ను తెరవగా అదో వెబ్‌సైట్‌కు దారితీసింది. అందులో ఉన్న వివిధ స్కీముల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకున్న ఆ యువకుడు ఆన్లైన్ ద్వారా తొలుత రూ.వేయి పెట్టుబడి పెట్టాడు. ఆ మొత్తం అతడి వర్చువల్ ఖాతాలో ఉన్నట్లు వెబ్సైట్లో కనిపించింది. ప్రతి రోజూ లాభం చేరుతూ పోయి కొన్ని రోజుల్లోనే రూ.2 వేలు అతడి ఖాతాలో ఉన్నట్లు కనిపించింది. ఈ మొత్తాన్ని తన ఖాతాలోకి మార్చుకున్న యువకుడు డ్రా కూడా చేసుకోగలిగాడు. చదవండి: భార్యతో గొడవ.. కోపంతో కొడుకుని బయటకు తీసుకెళ్లి.. దీంతో ఈ ఇన్వెస్టిమెంట్ స్కీమ్ నిజమేనని పూర్తిగా నమ్మేశాడు. తన వద్ద ఉన్న డబ్బుతో పాటు స్నేహితుల నుంచి అప్పుగా తీసుకుని వారం రోజుల్లో రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టాడు. ప్రతి సందర్భంలోనూ రెట్టింపు మొత్తం తన వర్చువల్ ఖాతాలోకి వచ్చినట్లు కనిపించింది. అవి డ్రా చేసుకోవాలంటే మరికొంత పెట్టుబడి పెట్టాలంటూ చూపించింది. ఇలా భారీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఆ వెబ్సైట్ కనిపించకుండా పోయింది. తన ఫోన్‌కు వచ్చిన లింకుల ద్వారా వెబ్‌సైట్‌ను తెరవడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సీఏ సహకారం కేసును దర్యాప్తు చేసిన అధికారులు బాధితుడి నుంచి నగదు వెళ్లిన ఖాతా బెంగళూరుకు చెందిన ఓ కంపెనీదిగా తేల్చారు. దాని చిరునామాను గుర్తించిన పోలీసులు అక్కడకు వెళ్లి ఆరా తీయగా.. అది ఓ వైద్యుడికి చెందినదిగా తేలింది. మూడు అంతస్తులు ఉన్న ఆ భవనంలో అన్నీ నివాసాలే ఉండడంతో మరింత లోతుగా ఆరా తీశారు. అదే చిరునామాతో మొత్తం 200 షెల్ కంపెనీలు రిజిస్టరై ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీనిపై భవన యజమాని అయిన వైద్యుడిని ప్రశ్నించారు. ఆ కంపెనీల సంగతి తనకు తెలియదని చెప్పిన ఆయన రెండేళ్ల క్రితం ఓ మహిళా చార్టెట్ అకౌంటెంట్ ఆ భవనంలోని ఓ పోర్షన్లో అద్దెకు ఉండి వెళ్లినట్లు వెల్లడించారు. దీని ఆధారంగా ముందకు వెళ్లిన పోలీసులు సైబర్ నేరగాళ్లకు సహకరించిన ఆమె ఆ చిరునామాతో కంపెనీలు, వాటి ఆధారంగా బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు తేల్చారు. ప్రస్తుతం నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
హోటల్లో రహస్యంగా పెళ్లి.. కారులో బలవంతంగా ఎక్కించుకుని..
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు.. మంచి పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనియల్ సైట్లపై ఆధారపడుతుంటారు. ఈ మధ్య కాలంలో ఇది ఒక బిజినెస్‌గా మారింది. అయితే, కొందరు కేటుగాళ్లు సైట్లలో నకిలీ ఫ్రోఫైళ్లను సృష్టించి ఎదుటివారిని మోసం చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలు తరచుగా మనం వార్తల్లో చూస్తున్నాం. తాజాగా, ఇలాంటి కోవకు చెందిన ఉదంతం కర్ణాటకలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బెల్గాంకు కుంపాత్‌గిరి ప్రాంతానికి చెందిన ప్రశాంత్ భౌరో పాటిల్(31) అనే వ్యక్తి.. మ్యాట్రిమోనియల్ వేదికగా ఒక యువతిని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత.. ఆమెతో రోజు చాట్ చేసేవాడు. ఆ నిందితుడు తాను.. ఒక ఆర్మీ ఆఫీసర్ అని చెప్పుకున్నాడు. నిందితుడి మాయమాటలు నమ్మిన సదరు యువతి.. అతని మాయలో పడిపోయింది. ఆ తర్వాత.. వీరు గత నవంబరు 18న బెంగళూరులోని ఒక ఆలయంలో కలిశారు. అప్పుడు ప్రశాంత్ పాటిల్ ఆర్మీ దుస్తుల్లో వచ్చాడు. వీరిద్దరు స్థానికంగా ఉన్న ఒక లాడ్జీలో పెళ్లి చేసుకున్నారు. కాగా, వివాహం గురించి ఎవరికి చెప్పనని యువకుడు.. వాగ్దానం చేశాడు. ఈ క్రమంలో ఆ యువతిని కారులో ఎక్కించుకుని.. బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత.. కొన్ని రోజులకు యువతి ఫోన్‌ను బ్లాక్‌లో పెట్టేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన ప్రశాంత్ పాటిల్ ఆన్సర్ చేయలేదు. దీంతో యువతి తాను.. మోసపోయినట్లు గ్రహించి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ప్రశాంత్ పాటిల్‌పై 2018 నుంచి పూనా, లాతూర్, అహ్మద్ నగర్లలో పలు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నిందితుడు.. మ్యాట్రిమోనియల్ వేదికగా చాలా మంది యువతులను మోసం చేశాడని అధికారులు తెలిపారు. నిందితుడిపై పలుసెక్షన్ల కింద కేసులను నమోదుచేసిన పోలీసులు స్థానిక కోర్టులో హజరుపర్చారు. -
HYD: కళ్యాణిగా మారిన దాసు.. రూ. 50 కోట్ల ఆస్తి.. మాయమాటలు చెప్పి!
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఫేస్బుక్ ద్వారా పరిచయమై, పెళ్లి పేరుతో ఎర వేసి ఏడాది కాలంలో రూ.కోటి వరకు స్వాహా చేసిన కిలాడి జంటను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. భార్యా భర్తలు కలిసే ఈ నేరం చేసినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. గుంటూరు జిల్లా సత్తుపల్లికి చెందిన వై.దాసు నూజివీడులోని టీటీటీఐ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. కొండాపూర్‌లోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఆన్లైన్ రమ్మీకి అలవాటుపడిన ఇతగాడు సక్రమంగా విధులకు హాజరుకాకపోవడంతో ఉద్యోగం కోల్పోయాడు. ఆపై పూర్తిగా రమ్మీకి బానిసగా మారిపోయాడు. 2017 నవంబర్‌లో ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తున్న జ్యోతిని వివాహం చేసుకున్నాడు. చదవండి: చిక్కడపల్లి సీఐ, ఎస్ఐపై సస్పెన్షన్ వేటు ఆపై సత్తుపల్లికి మకాం మార్చి కొంత భూమి లీజుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. అయినప్పటికీ ఆన్లైన్ రమ్మీ మాత్రం మానలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో ఈ తరహా జూదాన్ని నిషేధించడంతో క్రికెట్ బెట్టింగ్స్ వైపు మళ్లాడు. వివిధ యాప్‌ల ద్వారా నిత్యం పందాలు కాసేవాడు. ఇతడు బీటెక్ చదువుతున్నప్పుడు కళ్యాణిశ్రీ పేరుతో తాను యువతిగా పేర్కొంటూ ఓ నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచాడు. దీని ద్వారా అనేక మంది యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి మోసం చేసేవాడు. ఇలా గతేడాది మేలో బొల్లారం ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పరిచయమయ్యాడు. తొలత ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా ఇరువురూ చాటింగ్ చేసుకున్నారు. ఆపై ఇరువురూ ఫోన్ నెంబర్లు మార్చుకున్న నేపథ్యంలో చాటింగ్ వాట్సాప్‌లోకి మారింది. కళ్యాణిశ్రీగానే చాటింగ్ చేసిన దాసు బాధితుడికి అనేక మాయమాటలు చెప్పి పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చాడు. చదవండి: అసలే చలికాలం.. రాత్రి గజగజ వణకడమే.. మరి వారి సంగతేంటి? అదును చూసుకుని అసలు కథ మొదలుపెట్టాడు. తమకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు చాలా ఉన్నాయంటూ చెప్పాడు. వాటి విలువ దాదాపు రూ.50 కోట్ల వరకు ఉంటుందని నమ్మించాడు. అనివార్య కారణాల నేపథ్యంలో అవన్నీ తన పేరుతో లేవని చెప్పి..మ్యూటేషన్ ద్వారా ఆస్తులు తన పేరు మీదకు తెచ్చుకోవాలంటే దాదాపు రూ.కోటి ఖర్చవుతుందని, ఆ మొత్తం ఇచ్చి సహకరించాలని చెప్పాడు. మనకు వివాహమయ్యే లోపు ఈ పని పూర్తి చేయాలన్నాడు. దీంతో బాధితుడు 2020 జూన్ నుంచి ఈ నెల వరకు మొత్తం రూ.కోటికి పైగా కళ్యాణిశ్రీగా చాటింగ్ చేసిన దాసు సూచించిన మూడు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశాడు. వీటిలో ఒకటి జ్యోతి పేరుతో ఉంది. అప్పుడప్పుడు బాధితుడికి కాల్స్ చేసిన దాస్ తన భార్య జ్యోతినే కళ్యాణిశ్రీగా మార్చి మాట్లాడించేవాడు. ఎట్టకేలకు మోసపోయానని గుర్తించి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దీన్ని దర్యాప్తు చేశారు. మంగళవారం భార్యాభర్తలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు బాధితుడి నుంచి కాజేసిన సొమ్ముతో జల్సాలు చేయడంతో పాటు కొంత ఆన్లైన్ బెట్టింగ్స్‌కు వెచ్చించారు. రూ.4 లక్షలు వెచ్చించి సత్తుపల్లిలో భూమి కొన్నారు. జ్యోతి ఈ సొమ్ము వెచ్చించి 12 తులాల బంగారం ఖరీదు చేసిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. -
చిన్న అక్షర దోషం.. రాజకీయ నాయకుడి భార్యకు జైలు శిక్ష
అంకారా: మన వల్ల ఎలాంటి తప్పు జరగకపోయినా సరే శిక్ష అనుభవించాల్సి వస్తే చాలా బాధగా ఉంటుంది. అలాంటిది వేరేవారి నిర్లక్ష్యం కారణంగా.. చిన్న అక్షర దోషం ఫలితంగా కోర్టు ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తే.. అది కూడా ఓ రాజకీయ నాయకుడి భార్యకు ఈ పరిస్థితి తలెత్తితే.. పీకల దాకా కోపం వస్తుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు టర్కీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి భార్య. ఆమె తప్పు ఏం లేకపోయినా.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆమెకు ఏకంగా రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఆ వివరాలు.. (చదవండి: సోఫాతో ఆమెను చంపేద్దామనుకున్నావా ఏంటి?) టర్కీకి చెందిన టీచర్, రాజకీయ నాయకుడి భార్య బసక్ డెమిర్టాస్ అనే మహిళ 2015లో తీవ్రమైన అస్వస్థతకు గురయ్యింది. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉంది. అనారోగ్యం ఫలితంగా డెమిర్టాస్‌కు గర్భస్రావం అయ్యింది. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బంది ఆమెను ఐదు రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే డెమిర్టాస్ ఆస్పత్రిలో చేరింది 2015, డిసెంబర్ 11న కాగా.. ఆస్పత్రి సిబ్బంది డిసెంబర్ 14 అని రిపోర్టులో తప్పుగా టైప్ చేశారు. ఇది గమనించని డెమిర్టాస్.. వైద్యులు సూచించిన మేరకు ఐదు రోజులు సెలవు తీసుకుంది. ఇక పెయిడ్ లీవ్ అప్లై చేస్తూ.. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టును అందులో సబ్మిట్ చేసింది. అయితే దానిలో డెమిర్టాస్ డిసెంబర్ 14న ఆస్పత్రిలో చేర్చినట్లు ఉంది. ఈ క్రమంలో ఆమె తప్పుడు రిపోర్టులు సబ్మిట్ చేసి.. మోసం చేసిందనే ఆరోపణలపై డెమిర్టాస్ మీద పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోర్టు 2018లో డెమిర్టాస్‌కు, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్‌కి రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను) ఈ సందర్భంగా డెమిర్టాస్ న్యాయవాదులు మాట్లాడుతూ.. ‘‘ఆసుపత్రి రికార్డు పుస్తకంలో డెమిర్టాస్ డిసెంబర్ 11న ఆస్పత్రిలో చేరినట్లు ఉంది. అక్షర దోషం వల్లే ఈ తప్పు జరిగిందని కోర్టుకు తెలిపాము. ఈ క్రమంలో కోర్టు ఆస్పత్రి రికార్డు బుక్‌ను సాక్ష్యంగా చూడకుండానే శిక్ష విధించింది. ఇది కేవలం రాజకీయ కుట్రే’’ అని పేర్కొన్నారు. ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ‘‘ఒక సైంటిఫిక్ ఫైల్‌కు సంబంధించి చిన్న క్లరికల్ తప్పిదం వల్ల కోర్టు డెమిర్టాస్, డాక్టర్‌కి కలిపి ఐదు సంవత్సరాల శిక్ష విధించింది. ఇది చిన్న తప్పిదం కాదు. భయంకరమైన రాజకీయ కుట్ర’’ అని టర్కీపార్లమెంట్ రిపోర్టర్ నాచో సాంచెజ్ అమోర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: మహిళను తోసేసిన ఎమ్మెల్యే.. గర్భస్రావం -
ఇంటర్ చదివి.. 20 ఫేక్ కంపెనీల సృష్టి!
సాక్షి, విశాఖపట్నం: కేవలం ఇంటర్ వరకే చదివిన ఆ యువకుడు చిన్న చిన్న వ్యాపార సంస్థల్లో పనిచేస్తూ.. జీఎస్టీ లొసుగుల్ని పసిగట్టాడు. అంతే, గుంటూరు, హైదరాబాద్ మొదలైన నగరాల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఫేక్ కంపెనీలను సృష్టించి.. పన్ను మోసాలకు పాల్పడేందుకు ఎత్తుగడవేశాడు. నిరంతర తనిఖీల్లో భాగంగా విశాఖపట్నంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు ఆ యువకుడి మోసాన్ని బట్టబయలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన 34 ఏళ్ల యువకుడు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో 20 నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి బిల్లులు సృష్టించాడు. ఈ సంస్థల నుంచి దేశంలోని వివిధ నగరాల్లోని కంపెనీలకు సరకు లావాదేవీలు జరిపినట్టు రూ.265 కోట్ల మేర నకిలీ ఇన్వాయిస్లను రూపొందించాడు. వీటిని ఉపయోగించుకుని రూ.31 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ.. పన్నుల చెల్లింపును ఎగవేసేలా వ్యూహాన్ని అమలుపరిచాడు. ఈ భారీ నకిలీ ఇన్వాయిస్లని పరిశీలించిన డీజీజీఐ, సెంట్రల్ జీఎస్టీ వర్గాలు.. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు 20 నకిలీ సంస్థల రాకెట్ గుట్టు రట్టయ్యింది. వెంటనే రంగంలోకి దిగి.. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విశాఖపట్నం జోనల్ యూనిట్ జాయింట్ డైరెక్టర్ భాస్కరరావు చెప్పారు. గతేడాది నవంబర్ నుంచి ఈ తరహా మోసాలపై దేశవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విశాఖపట్నం జోనల్ యూనిట్ పరిధిలో దాదాపు 180 నకిలీ కంపెనీల గుట్టు రట్టు చేసి రూ.60 కోట్లు రికవరీ చేయడంతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు భాస్కరరావు చెప్పారు. -
నిధుల మాయం వెనుక మాఫియా!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారంలో సంచలనం కలిగించే విషయాలను విద్యాశాఖ గుర్తించింది. దీని వెనుక ఓ మాఫియానే ఉందని తెలుసుకుంది. ఉన్నతాధికారులను సైతం ఈ మాఫియా రిమోట్ కంట్రోల్‌తో నడిపించినట్టు భావిస్తోంది. మంచి వ్యక్తిగత రికార్డు ఉన్న వాళ్లు సైతం అక్రమానికి అండగా నిలవడం విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆశ్చర్యపరుస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు అకాడమీ నిధులు రూ. 65 కోట్లు గోల్మాల్ అవ్వడం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఒకపక్క పోలీసు విచారణ జరుగుతుండగానే, విద్యాశాఖ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉమర్ జలీల్, అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కాలేజీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరితో విచారణ కమిటీని వేసింది. గోల్మాల్ను అన్ని కోణాల్లో పరిశీలించిన ఈ కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో కొన్ని కొత్త అంశాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మాఫియా గుప్పిట్లో అధికారుల గుట్టు! విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం... నిధుల గోల్మాల్ వ్యవహారంలో ఇప్పటివరకు తెరమీద కన్పించిన పాత్రలే కాకుండా, మరికొంత మంది కూడా ఉన్నారు. రాష్ట్ర లీడ్ బ్యాంక్ ఎస్బీఐలో చేయాల్సిన డిపాజిట్లను అనేక బ్యాంకులకు దారి మళ్లించేందుకు ఈ మాఫియానే ముందుగా ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం. తెలుగు అకాడమీ, విద్యాశాఖకు చెందిన కొంతమంది ఉద్దేశపూర్వకంగా దీనికి చేయూతనిచ్చినట్లు తెలుస్తోంది. మరికొంత మందిని వారి వ్యక్తిగత బలహీనతలను ఆధారంగా చేసుకుని ట్రాప్ చేసినట్టు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన మహిళా బ్యాంకు అధికారి గురించి అనేక కోణాల్లో విచారణ జరిపారు. ఆమె డబ్బుకు లొంగిందా? ట్రాప్‌లో చిక్కుకుందా? అనే అనుమానాలున్నాయని ఆ అధికారి వ్యాఖ్యానించారు. ఆమె ఆర్థిక లావాదేవీలు క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప ఓ నిర్థారణకు రాలేమని చెప్పారు. అయితే గోల్మాల్ వ్యవహారం మొత్తం తెలిసినా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటం వెనుక బలమైన కారణాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల లావాదేవీలు, వ్యక్తిగత సమాచారం మొత్తం మాఫియా గుప్పిట్లో ఉండటం, వాళ్ళ చేత బ్లాక్ మెయిల్‌కు గురి కావడమూ కొట్టిపారేయలేమని అధికారులు అంటున్నారు. డబ్బులు వెనక్కి రావాల్సిందే కుంభకోణంలో మాయమైన ప్రతి పైసా తెలుగు అకాడమీ ఖాతాలోకి రప్పించి తీరుతామని విద్యాశాఖ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ దిశగా ఇప్పటికే ఆర్బీఐ ఉన్నతాధికారులతో పలు దఫాలు చర్చలు జరిగాయి. ‘అకాడమీ సొమ్ము దొంగలెత్తుకుపోలేదు... వివిధ బ్యాంకుల్లోకే వెళ్ళింది. కాబట్టి పూర్తి బాధ్యత ఆర్బీఐదే’అని అధికారులు అంటున్నారు. బ్యాంకు వర్గాలు కూడా ఈ వాదనతో ఏకీభవిస్తున్నాయని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో దీనిపై కొంత స్పష్టత వచ్చినట్టు తెలిసింది. ఆర్బీఐకి పూర్తిస్థాయి నివేదిక అందించి, అనుమతి తీసుకున్న తర్వాత అకాడమీ నిధులు తిరిగి ఖాతాలోకి రప్పించే వీలుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సీనియర్లతో ప్రత్యేక కమిటీ తెలుగు అకాడమీ నిధులు గోల్మాల్ నేపథ్యంలో ఆర్థిక పరమైన విభిన్న కోణాలు తెరమీదకొస్తున్నాయి. వీటిని దర్యాప్తు బృందాలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు నిగ్గు తేల్చడం కష్టమని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇద్దరు సీనియర్ ఆడిటర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని విద్యాశాఖకు చెందిన త్రిసభ్య కమిటీ భావిస్తోంది. డిజిటల్ లావాదేవీలతో పాటు నిందితులు వాడిన సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సాంకేతిక బృందం పరిశీలిస్తుంది. దీనిద్వారా అనేక లింకులు బయటకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నియమ నిబంధనలు పూర్తిగా మార్పు అకాడమీ నియమ నిబంధనలు కట్టుదిట్టం చేయాలని, పూర్తిగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులు ఇతర బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా మార్గదర్శకాలు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే వివిధ బ్యాంకుల్లో ఉన్న అకాడమీకి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను ముందస్తు ఉపసంహరణ (ఫోర్ క్లోజర్) చేయాలని తీర్మానించారు. వడ్డీతో ప్రమేయం లేకుండా ఈ మొత్తాలను ఎస్బీఐలోనే సేవింగ్ బ్యాంకు ఖాతాలో వేయాలని విద్యాశాఖ కమిటీ సిఫార్సు చేసింది. -
ఇత్తడిని పుత్తడిగా మార్చి.. హాల్‌మార్క్ గుర్తుతో కోట్లు దండుకున్నాడు
సాక్షి, అమీర్‌పేట: ఇత్తడిని పుత్తడిగా నమ్మించి బంగారు నగల దుకాణాల్లో తాకట్టుపెట్టి ఓ వ్యక్తి రూ.కోట్లు దండుకున్నాడు. అతడి చేతిలో మోసపోయిన నగల వ్యాపారులు తెలంగాణ, ఏపీ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రహమత్‌నగర్‌కు చెందిన వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి ఇత్తడితో నగలు తయారు చేయించేవాడు. అనంతరం వాటికి బంగారు కోటింగ్ వేయించి, హాల్‌మార్క్ గుర్తుతో సహా నగర షాపులకు తీసుకువెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేవాడు. ఇదే తరహాలో బోరబండ, రహమత్‌నగర్ ప్రాంతాల్లోని పలు షాపుల్లో నకిలీ నగలను తాకట్టు పెట్టి రూ.కోట్లు దండుకున్నాడు. ఏళ్లు గడుస్తున్నా నగలను విడిపించుకోకపోవడంతో అనుమానం వచ్చిన వ్యాపారులు వాటిని పరిశీలించగా నకిలీవని తేలింది. శుక్రవారం నకిలీ నగలతో బోరబండలోని ఓ నగల షాపునకు వెళ్లిన వెంకట్‌రెడ్డి వ్యాపారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడి చేతిలో మోసపోయిన 18 మంది వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: ఆర్ఎంపీ క్లినిక్‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం -
కొంత ఖర్చవుతుంది.. ముందుగా వెయ్యి ఇవ్వండి.. తరువాత!
సంతోష్‌నగర్‌కు చెందిన నాగరాజు ఇటీవల మీ సేవ కేంద్రం ద్వారా వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అది తెలిసిన ఇద్దరు దళారులు నాగరాజును సంప్రదించి..‘వయసు సడలించడంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్కారు స్క్రూట్నీని కఠినంగా ఉంటుంది. అర్హత సాధించడం కష్టం. మీసేవలో సమర్పించిన దరఖాస్తు కాపీ మాకిస్తే తహసీల్ ఆఫీస్‌లో పైరవీ చేసి ముందుగానే మార్గం సుగమం చేస్తాం. ఇందుకు కొంత ఖర్చవుతుంది. ముందుగా రూ.వెయ్యి ఇవ్వండి. మంజూరైనంక రెండు నెలల పింఛన్ ఇవ్వాలి’ అని మౌఖిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా నగరంలో దళారులు పింఛన్ అర్హులను బుట్టలో వేసుకుని దండుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఆసరా కొత్త పింఛన్ల దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. కొందరు చోటా నేతలు, గల్లీ లీడర్లు, నిరుద్యోగులు దళారులుగా అవతారమెత్తి దరఖాస్తుదారుల అమాయకత్వం, అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. మీ–సేవ కేంద్రాల ద్వారా వృద్ధాప్య పించన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను తెలుసుకొని గాలం వేస్తున్నారు. కొందరు దరఖాస్తుదారులను స్వయంగా కలుస్తుండగా, మరి కొందరు ఫోన్ల ద్వారా సంప్రదించి ‘అన్నీ మేమే చూసుకుంటాం’ అని భరోసా ఇస్తున్నారు. కొంత నగదు లంచంగా ఇవ్వాలని చెబుతున్నారు. కేవలం దరఖాస్తు మాత్రమే చేస్తే సరిపోదని, పోటీ చాలా ఉందని చెబుతున్నారు. దరఖాస్తుదారులు సైతం పింఛను మంజూరు కాదేమోనన్న భయంతో దళారుల మాటల్ని నమ్మి వారు అడిగినంత ముట్టచెబుతున్నారని తెలుస్తోంది. దండిగా దరఖాస్తులు ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్ల వయసును 60 ఏళ్ల నుంచి సడలించడంతో మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దండిగా దరఖాస్తులు నమోదయ్యాయి. 57 ఏళ్లు దాటిన వారు పోటీపడి మరి దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటి వరకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోని పండుటాకులు సైతం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తుల నమోదు ఉచితం కావడంతో నిరుపేదలు (బీపీఎల్) తోపాటు మద్య, సంపన్న(ఏపీఎల్) వర్గాలు సైతం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్–రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల్లో కలిపి సుమారు రెండు లక్షలకు పైగా దరఖాస్తులు నమోదైనట్లు ఆన్లైన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా ఆసరా పింఛన్లకు ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించలేదు. తహాసీల్ ఆఫీసుల్లో దరఖాస్తు సమరి్పస్తే విచారణ జరిపి మంజూరు చేసేవారు. తాజాగా వయసు సడలించడంతో ఆన్లైన్ ద్వారా స్వీకరించగా కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. స్పష్టత ఏదీ? ఆసరా దరఖాస్తులపై స్పష్టత లేకుండా పోయింది. దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు, చిరునామా గుర్తింపు, ఓటరు ఐడీ, బ్యాంక్ పాస్ బుక్ వివరాల నమోదుతోపాటు వాటి ప్రతులను సమర్పించాలన్నారు. కానీ ఎక్కడ సమర్పించాలో పేర్కొనలేదు. దీంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. తహసీల్ ఆఫీస్‌కు వెళ్తే అక్కడ తీసుకోవడం లేదు. మీ సేవ కేంద్రాల్లోనూ జిరాక్స్ ప్రతులు తీసుకోవడం లేదు. ఈ అంశం కూడా దళారులకు కలిసి వస్తోంది. ఆ ప్రతులను దళారులు తీసుకొని దరఖాస్తుదారుల్లో ఆశలు నింపుతున్నారు. పింఛన్ల మంజూరుపై క్షేత్ర స్థాయి విచారణ కఠినంగా ఉంటుందని భయపెడుతూ దండుకుంటున్నారని విమర్శలు విన్పిస్తున్నాయి. -
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్.. విచారణ వేగవంతం చేసిన సీసీఎస్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో నిధులు గోల్మాల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సీసీఎస్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీనిపై ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసులకు మూడు ఫిర్యాదులు అందాయి. సుమారు 63 కోట్ల రూపాయలు గోల్ మాల్ అయినట్లు అకాడమీ అధికారులు సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు మూడు ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: తెలుగు అకాడమీలో నిధుల గోల్మాల్) ఇప్పటికే పోలీసులు పలు బ్యాంక్ అధికారులను సీసీఎస్‌కు తరలించి విచారిస్తున్నారు. వీరిలో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, అగ్రాసేన్ బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు వీరిని విచారిస్తున్నారు. చదవండి: టీడీపీ పాలనలో ‘అకాడమీ’కి అస్థిత్వమే లేదు -
తెలుగు అకాడమీలో నిధుల గోల్మాల్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో నిధులు గోల్మాల్ అయ్యాయి. కార్వన్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ పత్రాలు సృష్టించిన కేటుగాళ్లు 43 కోట్లు కాజేశారు. వివారాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యలపాలు నిర్వహిస్తుంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు తెలుగు అకాడమీలో ఉన్న రూ. 213 కోట్లలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాటా 125 కోట్లు ఇవ్వడానికి అకాడమీ సిద్ధం అయ్యింది. భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతోపాటు యూబీఐ కార్వాన్, సంతోష్‌నగర్ ఖాఖల్లో రూ. 43 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని తేలింది. వీటిని గడువు తీరకముందే తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. అయితే 43 కోట్ల రూపాయలు విత్‌డ్రా చేసేందకు ప్రయత్నించగా ఆసలు బ్యాంక్‌లో డబ్బులు లేవని తేలింది. సెప్టెంబరు 22న డబ్బులు కోసం తెలుగు అకాడమీ అధికారులు బ్యాంక్‌కు వెళ్లగా.. తర్వలో ఇస్తామని అధికారులు చెప్పారు. మళ్ళీ అడగ్గా ఆసలు నిధులు లేవని బ్యాంక్ మేనేజర్ మస్తాన్ అలీ పేర్కొన్నారు. దీంతో అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం లావాదేవిలో బ్యాంక్ మేనేజర్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 43 కోట్లలో 23 కోట్లు వేరే బ్యాంక్‌కు బదిలీ అయినట్టు తెలుస్తోంది. చదవండి: ఆ వయసులోపు వారిలో పెరుగుతున్న గుండెపోటు.. -
నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసు: కదులుతున్నడొంక..
నల్గొండ: నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా, మరో ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఇన్ చార్జ్ బిల్ కలెక్టర్ పృథ్వీరాజ్, పీహెచ్ వర్కర్ కొండయ్య, రిటైర్డ్ పీహెచ్ వర్కర్ వెంకులును అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. అరెస్టు అయిన వారిలో పీహెచ్ వెంకులు ఇప్పటికే రిటైర్ అయినట్లు తెలుస్తోంది. అరెస్టు అయిన వారిలో రషీదులుపై మనీ వాల్యూయేషన్ పుస్తకాలను ఆడిట్ అధికారుల కంటపడకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా, 2015లో బయటకొచ్చిన ఈ ఉదంతంలో రూ. 5.04 కోట్ల అవినీతికి సంబంధించి ఇప్పటి వరకు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొంత మంది అధికారులు ఇప్పటికే సెలవుల్లో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు తమ సెల్‌ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకుని తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: Nalgonda: మున్సిపాలిటీలో నిధులు స్వాహా.. ముగ్గురు అరెస్ట్ -
నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసు: మరో ముగ్గురు అరెస్టు
నల్లగొండ: నల్గొండ మున్సిపాలిటీ అవినీతి కేసు: మరో ముగ్గురు అరెస్టు జిల్లాలోని మున్సిపాలిటీలో నిధులు స్వాహా చేసిన ఉదంతంలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కాగా,ఈ ఘటనలో తాజాగా మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 2015లో వెలుగు చూసిన 5.04 కోట్ల అవినీతి బయటపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా, బిల్ కలెక్టర్ బిక్షం, ఎన్ఆరఎం, భానుకుమార్ రెడ్డి, కార్యాలయ సబార్డినేటర్ ముంత మల్లేషాన్ని అరెస్టు చేశారు. విడతల వారిగా అరెస్టులు చేయడంతో తప్పించకునేందుకు బెయిల్ కోసం మిగతా ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత మంది అధికారులు తమ ఫోన్లను స్విచ్‌ఆఫ్‌చేసుకుని సెలవుల్లో వెళ్లిపోయారు. మొత్తం 29 మంది ఉద్యోగులపై కేసు నమోదుకాగా వారిలో ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం 26 మందిపై విచారణ కొసాగుతోంది. వీరిలో ఆరుగురు అరెస్టు కాగా, ఇంకా 20 మంది అరెస్టు కావాల్సి ఉంది. కాగా, మరికొంత మంది ఉన్నతాధికారుల పలుకుబడి ఉపయోగించుకుని అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: Nalgonda: మున్సిపాలిటీలో నిధులు స్వాహా.. ముగ్గురు అరెస్ట్ -
Nalgonda: మున్సిపాలిటీలో నిధులు స్వాహా.. ముగ్గురు అరెస్ట్
సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీలో నిధులు స్వాహా చేసిన ఉదంతంలో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఆరేళ్ల క్రితం నకిలీ బిల్లు పుస్తకాలను ముద్రించి అక్రమాలకు పాల్పడిన ఉద్యోగుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ-2 రేఖల అరుణకారి, ఏ-12 సత్యనారాయణ, ఏ-16 ఈశ్వరయ్యలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 2010-2014 మధ్యలో నల్లా బిల్లు, ఇంటి నిర్మాణ అనుమతులు, ఆస్తి పన్నును మున్సిపాలిటీ ఖాతాలో జమచేయని ఉద్యోగులు, మొత్తం రూ. 5.04 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. మొత్తం 29 మంది ఉద్యోగులు, 18 మంది పర్యవేక్షణా అధికారులపై 2015లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మిగతా ఉద్యోగుల అరెస్ట్‌కు రంగం సిద్ధం అయింది. అవినీతి ఉద్యోగుల్లో మొదలైన టెన్షన్ మొదలైంది. మిగతా ఉద్యోగులు సెలవు పెట్టి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఇప్పటికే నలుగురి మృతి చెందారు. మిగతావారిని నేడో, రేపో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Karimnagar: అత్తగారింట్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య -
అనంతపురం ఎబిడ్ సంస్థ చీటింగ్ కేసులో పురోగతి
-
ఈబిడ్ చీటింగ్ కేసులో పురోగతి: కీలక నిందితుడు అరెస్ట్
అనంతపురం క్రైం: ‘ఈబిడ్’ కేసులో కీలక నిందితుడు సునీల్ చౌదరిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అతన్ని అనంతపురం కోర్టులో హాజరుపర్చనున్నారు. రూ.లక్షకు రూ.30 వేల వడ్డీ ఇస్తామని ఆశ చూపి ఈబిడ్ సంస్థ నిర్వాహకులు జిల్లాలో రూ.వందల కోట్లు వసూలు చేశారు. వారి చేతిలో 800 మందికిపైగా మోసపోయారు. బాధితులు ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పటి ఎస్పీ సత్యయేసు బాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టారు. ధర్మవరం మండలానికి చెందిన సునీల్ చౌదరి, మహేంద్ర చౌదరిని కీలక నిందితులుగా గుర్తించారు. వీరితో పాటు మహేంద్ర చౌదరి భార్య జాస్తి మాధవి, బావమరిది సుధాకర్ నాయుడు, అనుచరులు పుల్లానాయుడు తదితరులు ఈ స్కాంలో పాలు పంచుకున్నట్లు తేల్చారు. కాగా.. సునీల్‌చౌదరి ఐదు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. చివరకు సీఐడీ పోలీసులు అతన్ని నాగపూర్‌లో అరెస్టు చేసి కోర్టుకు తీసుకొస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులోని కొందరు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం విదితమే. ఇవీ చదవండి: దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో.. ప్రముఖ న్యూస్ చానల్ విలేకరినంటూ.. -
లక్ష రూపాయలు పెడితే పది లక్షలు వస్తాయా?!
రమేష్, కీర్తన (పేర్లు మార్చడమైనది) ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. పెళ్లై ఐదేళ్లు అవుతోంది. ఇద్దరివీ ఐదెంకల్లో జీతం. కరోనా కారణంగా ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. ఈ మధ్యే కీర్తన ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరో కంపెనీలో ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఎక్కువ సమయం ఆన్లైన్లో గడుపుతోంది. ఓ రోజు కీర్తన తన ఆన్లైన్ అకౌంట్‌ను రమేష్‌కు చూపించింది. అందులోని ఓ ప్రకటన వివరాలు చూసిన రమేష్‌కు కూడా ఆసక్తిగా అనిపించి, తన అకౌంట్ నుంచి ఫాలో లింక్‌ను క్లిక్ చేశాడు. ఆన్లైన్ ద్వారా అలా పరిచయం అయిన విపుల్ (పేరుమార్చడమైనది)తో రమేష్, కీర్తనలు రోజూ మెసేజ్‌ల ద్వారా అతని టెక్నాలజీ సంస్థకు సంబంధించిన వివరాలను పంచుకునేవారు. గుజరాత్లో ఉన్న తన సొంత టెక్నాలజీ కంపెనీ వివరాలు, క్రిఫ్టో కరెన్సీ గురించిన అనుభవమూ, తను చేసే డిజిటల్ కరెన్సీ లావాదేవీలను రమేష్, కీర్తనలతో పంచుకునేవాడు విపుల్. చదవండి: అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను: సవితారెడ్డి రెట్టింపులుగా ఆదాయం?! పది వేల రూపాయలు పెట్టుబడితో లక్ష రూపాయల లాభం ఎలా వస్తుందో తెలిపే వివరాలు రమేష్, కీర్తనలు బాగా ఆకట్టుకున్నాయి. అప్పటికే బిట్‌కాయిన్, క్రిఫ్టో కరెన్సీగా పేరొందిన డిజిటల్ కరెన్సీ గురించి రమేష్, కీర్తనలకు కొద్దిగా తెలుసు. విపుల్‌తో చర్చలు జరిపిన తర్వాత అతను చెప్పిన యాప్స్‌లో కొద్ది మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు రమేష్, కీర్తనలు. రెండు, మూడు రోజుల్లోనే తమ పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చాయి. ఈ లావాదేవీలు ఇలాగే కొనసాగితే త్వరలోనే కోటీశ్వరులు అయిపోతామన్నది ఇద్దరి ఆలోచన. అంతేకాదు, తాము ఇక ఉద్యోగాలు కూడా చేయాల్సిన అవసరం లేదనుకున్నారు. ఆ ఆలోచనతో విపుల్ సూచనలతో ఆర్థిక లావాదేవీలు జరుపుతూ వచ్చారు. పదిహేను రోజుల్లో దాదాపు రూ.12 లక్షల రూపాయలు విపుల్ చెప్పినవిధంగా పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ఆ తర్వాత రోజు విపుల్ ఫోన్ స్పందించకపోవడంతో ఆందోళన చెందారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. విపుల్ ఆన్లైన్ అకౌంట్ కూడా కనిపించలేదు. గుజరాత్లో ఉన్నట్టుగా చెప్పిన విపుల్ టెక్నాలజీ సంస్థ గురించి వాకబు చేస్తే, అలాంటిదేమీ లేదని తేలింది. ఆన్లైన్లో సెర్చ్ చేస్తే క్రిఫ్టో కరెన్సీ పేరుతో తమలాగే మోసపోయిన వారు వందల సంఖ్యలో ఢిల్లీ, ముంబయ్, పుణె నగరాలలో ఉన్నారని తెలిసింది. చదవండి: సైబర్ కేసుల ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారో తెలుసా! జాగ్రత్తలే మోసానికి అడ్డుకట్ట క్రిఫ్టో కరెన్సీ అనేది వర్చువల్ కరెన్సీ ఇందులో మోసం ఉండదు. కానీ,కరెన్సీ పేరు మీద మోసం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. మోసపుచ్చాలనుకునేవారు రకరకాల లింక్స్, మన మెయిల్ ఐడీ, ఇతరత్రా మెసేజ్‌ల ద్వారా పంపిస్తారు. ప్రైవేట్ అప్లికేషన్స్ ఎప్పుడూ డౌన్లోడ్ చేసుకోకూడదు. ఆ లింక్స్‌పై క్లిక్ చేయకూడదు. డిజిటల్ కరెన్సీ పేరుతో మోసాలు జరగడం ఈ నాలుగైదు నెలల నుంచి ఎక్కువగా ఉంటోంది. చదువుకున్నవాళ్లే ఈ తరహా కరెన్సీ పట్ల ఆసక్తి చూపుతారు. క్రిఫ్టో కరెన్సీలో చాలా రకాలు ఉన్నాయి. వేటిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాటి గురించి పూర్తి అవగాహన పెంచుకొని, తమ ఆర్థిక లావాదేవీలు జరుపుకోవడం శ్రేయస్కరం. – యు. మదన్ కుమార్‌గౌడ్, సైబర్ క్రైమ్, హైదరాబాద్ వర్చువల్ కరెన్సీగా క్రిఫ్టో కరెన్సీ డిజిటల్లో చలామణిలో ఉంది. దీనికి భారత ప్రభుత్వం లేదా రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా మద్దతు ఇవ్వవు. ఇవి క్రిఫ్టోగ్రఫీ ద్వారా భద్రపరచబడిన డిజిటల్ ఆస్తులు. వీటిని డిజిటల్ మాధ్యమంగానే ఉపయోగిస్తారు. వారం రోజుల తేడాతోనే వీటిలోని పెట్టుబడులు రెట్టింపులుగా ఉంటుంది. ఉదాహరణకు.. కిందటి వారం ఒక బిట్‌కాయిన్ ధర 26 లక్షల రూపాయల పైన ఉంటే, అది ఈ వారం 36 లక్షల రూపాయల పైన ధర ఉంది. అందుకే, వీటిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు జరుపుతుంటారు. ఈ కరెన్సీ పేరుతో నకిలీ కంపెనీలు, నకిలీ వాలెట్లు, నకిలీ ట్రేడింగ్‌లతో మోసగాళ్లు ముందుకు వస్తున్నారు. ప్రారంభ ధరను తక్కువగా చూపించి, లాభాలు వచ్చినట్టుగా చూపుతారు. వినియోగదారుల బలహీనతను అడ్డుగా పెట్టుకొని, మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తారు. ఎంతవరకు అంటే కొందరు ఆస్తులు అమ్ముకొని, మరికొందరు అప్పులు చేసి క్రిఫ్టో కరెన్సీ పేరుతో నకిలీ యాప్‌లలో పెట్టుబడి పెట్టి మోసపోయినవారున్నారు. కాబట్టి, జాగ్రత్త తప్పనిసరి. – అనీల్ రాచమల్ల, ఎండ్ నౌ ఫౌండేషన్సైబర్ క్రైమ్ నిపుణులు -
ప్యాకెట్లలో బండరాళ్లు, పెంకులు
సైదాపూర్ (హుస్నాబాద్): తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించాలనే ఆలోచనతో పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశారు ఓ నలుగురు యువకులు. వీరి వ్యవహారంపై పైస్థాయి ఉద్యోగికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నలుగురు చేసిన మోసం బయటపడింది. ఈ కేసు వివరాలను హుజురాబాద్ ఏఎస్పీ వెంకటరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రం, వెన్కెపల్లి గ్రామానికి చెందిన నీర్ల కల్యాణ్(24), అనగోని వికాస్(23), కనుకుంట్ల అనిల్(26), తూటి వినయ్ (22) హుజూరాబాద్‌లోని లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫ్లిప్‌కార్ట్ కొరియర్ బోయ్స్‌గా 3 నెలల నుంచి పని చేస్తున్నారు. వీరు తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదించాలనుకున్నారు. దీని కోసం ఆన్లైన్లో మోసం చేయడం ఎలా అని యూట్యూబ్‌లో వెదికారు. ఆ తర్వాత ఆన్లైన్లో విలువైన వస్తువుల్ని వీరి స్నేహితుల ఫోన్నంబర్ల నుంచి బుక్ చేసుకున్నారు. ఆ వస్తువులు హుజూరాబాద్ ఫ్లిప్‌కార్టు హబ్‌కు రాగానే డెలివరీ ఇచ్చేందుకు వారిపేరున అసైన్ చేసుకుని సైదాపూర్‌కు తీసుకొచ్చారు. పార్శిల్ ఓపెన్ చేసి ఆ వస్తువులు తీసేసుకుని, రిటర్న్‌ల పేరిట ఆ కవర్లో బండరాళ్లు, పెం కులు నింపి వెనక్కి పంపించేశారు. కాజేసిన వస్తువుల్ని అమ్ముకుని ఆ సొమ్ముతో జల్సాలు చేశారు. అనుమానంతో కదిలిన డొంక వీరి వ్యవహారంపై టీంలీడర్ నవీన్‌కు అనుమానం వచ్చి సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో వీరి మోసం బయటపడింది. ఆదివారం నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని ఒప్పుకోవడంతో వారినుంచి రూ.9లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. -
‘ఫ్రీడం 251’ మోహిత్ గోయల్ మళ్లీ అరెస్ట్
నాలుగేళ్ల క్రితం డెడ్ చీప్‌గా స్మార్ట్‌ఫోన్ అందిస్తానంటూ ప్రకటన చేసిన మోహిత్ గోయల్ గుర్తున్నాడా? దేశం మొత్తం కుదిపేసిన ‘ఫ్రీడం 251 ఫోన్’ స్కాం ప్రధాన నిందితుడైన ఈ మోహిత్‌ను ఇప్పుడు పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని 41 లక్షలకు ముంచడంతో పాటు చంపేందుకు ప్రయత్నించిన నేరారోపణలపై గ్రేటర్ నోయిడా పోలీసులు మోహిత్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గోయల్‌తో పాటు మరో ఐదుగురిపైనా 41 లక్షల రూపాయలకు సంబంధించిన లావాదేవీల మోసంపై ఇందిరాపురం చెందిన వికాస్ మిట్టల్ అనే వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం గ్రేటర్ నోయిడాలోని గోయోల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రై ఫ్రూట్స్ అమ్మకాలకు సంబంధించిన వ్యహారంలో మోసం చేయడమే కాకుండా.. డబ్బుల గురించి నిలదీస్తే చంపేస్తానని వికాస్‌ను చెదిరించాడు గోయల్. అంతేకాదు కారుతో ఢీ కొట్టి చంపేందుకు ప్రయత్నించాడని వికాస్ ఆరోపిస్తున్నాడు. దీంతో వికాస్ ఫిర్యాదు మేరకు మోహిత్ గోయల్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మోసం, దోపిడీ, చంపేస్తానని బెదిరించడం, గాయపర్చడం.. ఇలా పలు నేరాలకుగానూ ఐపీసీ సెక్షన్లతో మోహిత్‌పై కేసు నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే 2017లో రింగింగ్ బెల్ అనే కంపెనీ ద్వారా ఫ్రీడం 251 స్మార్ట్ఫోన్ల అమ్మకం ప్రకటన ద్వారా సంచలనానికి తెరలేపిన మోహిత్.. భారీ స్కామ్‌తో వార్తల్లోకి ఎక్కి అరెస్టైన విషయం తెలిసిందే. ఆపై దుబాయ్ డ్రై ఫఫ్రూట్స్ అండ్ స్పైసిస్ పేరుతో ఓ ఆఫీస్ తెరిచి.. సుమారు 200 కోట్ల స్కాంకు పాల్పడ్డాడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ డ్రై ఫ్రూట్స్ వ్యవహారంలో పలు రాష్ట్రాల నుంచి అతనిపై 35 కేసులు నమోదు అయ్యాయి. చదవండి: సిండికేట్ బ్యాంక్‌లో మోసం కేసులో సీబీఐ చార్జ్‌షీట్ -
‘అసలు’కు ముందే ‘కొసరు’ దొరికింది!
సాక్షి, హైదరాబాద్: ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్‌లో నగర యువతి నుంచి రూ.2.5 లక్షలు గుంజిన కేసులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు వర్చువల్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆమె డబ్బులు అసలు ఏ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లాయో తెలుసుకోవడానికి సమయం పట్టే నేపథ్యంలో ఈ విధానాన్ని అనుసరించారు. ఫలితంగా సదరు యాప్‌కు అనుసంధానించి ఉన్న మరో రెండు బ్యాంకు ఖాతాలు దొరికాయి. వీటి ఆధారంగానే గత వారం శ్రీనివాసరావు, విజయ్‌కృష్ణ పట్టుబడ్డారు. వాట్సాప్ లింకుల ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో భారీ స్కామ్‌లకు తెరలేపిన మాల్008 యాప్ వెనుకా చైనీయులే ఉన్నారు. వీరు అనేక మందికి ఎర వేసి డమ్మీ కంపెనీలు రిజస్టర్ చేయించి, వాటి ఆధారంగా కరెంట్ ఖాతాలు తెరిపించారు. క్యూఆర్ కోడ్స్ రూపంలో వసూలు ► ఈ యాప్‌లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైన వారి నుంచి డబ్బును క్యూఆర్ కోడ్స్ రూపంలో సేకరిస్తున్నారు. యాప్‌లోకి ప్రవేశించి ఇన్వెస్ట్ అనే అంశాన్ని ఎంచుకుంటే ఆ ఇన్వెస్టర్‌కు ఓ క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్కాన్ చేయడం ద్వారా ఇన్వెస్ట్ చేయిస్తున్నారు. ► దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో డమ్మీ కంపెనీలు, కరెంట్ ఖాతాలు సిద్ధం చేసుకున్న చైనీయులు ఒక కస్టమర్ నుంచి డబ్బు గుంజేందుకు ఒక్కోసారి ఒక్కో బ్యాంకు ఖాతాను వాడుతున్నారు. ఈ కేసులో ఫిర్యాదు చేసిన బాధితురాలి నుంచి డబ్బు దాదాపు 10 ఖాతాల్లోకి వెళ్లింది. ►ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు తొలుత ఆయా బ్యాంకులపై దృష్టి పెట్టారు. వాటికి లేఖ రాయడం ద్వారా డబ్బు వెళ్లిన కరెంట్ ఖాతాల వివరాలు సంగ్రహించాలని భావించారు. ►అయితే ఇది కొంత కాలయాపనతో కూడిన వ్యవహారం కావడంతో ఈలోపు మరికొందరు మోసపోవచ్చని భావించారు. దీంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తొలిసారిగా వర్చువల్ డెకాయ్ ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. ఐడీ ఆధారంగా ఖాతాల వివరాలు.. ►సైబర్ క్రైమ్ ఠాణాలో పని చేసే ఓ కానిస్టేబుల్ బాధిత మహిళ నుంచి మాల్008కు సంబంధించిన లింకు షేర్ చేసుకున్నారు. అందులో తానే స్వయంగా రెండు దఫాల్లో రూ.600 చొప్పున ఇన్వెస్ట్ చేశారు. ►ఆ సమయంలో వచి్చన క్యూఆర్ కోడ్స్‌లో సదరు బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఓ ఐడీ ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌నకు సంబంధించిన దీనిని సంగ్రహించిన అధికారులు దాని అధికారులను సంప్రదించి లింకై ఉన్న ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. ►ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్, విజయ్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్ని ంచగా రూ.15 వేల ప్రతిఫలానికి తమ ఖాతాలు చైనీయులకు ఇచి్చనట్లు అంగీకరించడంతో ఈ కేసులో నిందితులుగా మారి అరెస్టు అయ్యారు. ►బాధిత యువతి డబ్బు వెళ్లిన బ్యాంకు ఖాతాల వివరాలు అందించాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆయా విభాగాలకు లేఖలు రాశారు. ఆవి అందిన తర్వాత వాటిని తెరిచిన వారినీ అరెస్టు చేయాలని నిర్ణయించారు. -
చిన్న ముంబైలో పెద్ద మోసం..
చీరాల: జిల్లాలో చిన ముంబైగా పేరుగాంచిన చీరాలలో భారీ బంగారం మోసం వెలుగు చూసింది. మోసగాళ్లు కొందరు బంగారం వ్యాపారులకు బంగారం బిస్కెట్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని నిలువునా మోసం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారంలో మోసగాళ్ల ముఠాలోని సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలతో విషయం బయటపడింది. సుమారు రూ.35 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఒక్కో బిస్కెట్ బరువు 100 గ్రాములు. అలాంటివి 700 బంగారం బిస్కెట్ల క్రయవిక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. డబ్బులు ఇచ్చిన కొందరికి బంగారం బిస్కెట్లు ఇవ్వకపోవడంతో విషయం బయటకు పొక్కింది. అందరి ‘బంధువు’గా వ్యవహరించే ఓ వ్యక్తి ప్రస్తుతానికి పరిస్థితిని చక్కదిద్దినట్లు సమాచారం. అంతేకాకుండా ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా సెటిల్మెంట్కు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో పాటు స్వయంగా ఎస్పీ మలికా గర్గ్‌కు ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గోప్యంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇదీ..జరిగింది గతంలో చీరాల రూరల్ ప్రాంతాల్లో ర్యాప్‌లు (దొంగ బంగారం విక్రయం) జరిగాయి. తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి తీరా డబ్బులు తీసుకుని వారిపైనే దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. ఇటీవల చౌకగా బంగారం దొరుకుతుందని కొందరు ఏజెంట్లు బంగారం వ్యాపారులకు ఆశ కల్పించారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు బంగారం బిస్కెట్లు ఇస్తామని వారిని బురిడీ కొట్టించారు. ఎటువంటి బిల్లులు లేకున్నా వ్యాపారులు కూడా బిస్కెట్ల కోసం డబ్బులు కట్టి ఇప్పుడు నిలువునా మోసపోయారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో కస్టమ్స్ ఆఫీసర్‌గా చెప్పుకున్న వ్యక్తి, ఏజెంట్లు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. -
థ్రిల్లర్ సినిమాను తలపించే ట్విస్టులు.. బకరా అయిన డాక్టర్
సాక్షి, హైదరాబాద్: పశువుల వ్యాక్సిన్ల తయారీకి వినియోగించే ఆగ్రో మెటాజైమ్ ఆయిల్‌ను భారత్‌లోనే ఖరీదు చేసి, తమకు ఎగుమతి చేస్తే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఎన్నారై వైద్యుడికి టోకరా వేశారు. వివిధ దఫాల్లో మొత్తం రూ.11.94 కోట్లు (16,11,025 డాలర్లు) కాజేశారు. గురువారం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంతో ముడిపడి ఉన్న సైబర్ నేరం నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు చెప్తున్నారు. ఇది నైజీరియన్ల పనిగా అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అమీర్‌పేట ప్రాంతానికి చెందిన వైద్యుడు ఎ.చంద్రశేఖర్ రావు (82) అమెరికా పౌరసత్వం ఉండగా... అక్కడ సుదీర్ఘకాలం వైద్యుడిగా పని చేసి వచ్చారు. ఈయనకు ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్‌లో ఉంటున్న డాక్టర్ బెంజిమన్ అని చెప్పుకున్న వ్యక్తి నుంచి ఈ–మెయిల్ వచ్చింది. తాను పని చేస్తున్న సంస్థ పశువులకు వేసే వ్యాక్సిన్లు తయారు చేస్తుందని నమ్మబలికాడు. దీనికోసం తాము నిత్యం భారత్ నుంచి ఆగ్రో మెటాజైమ్ ఆయిల్‌ను ఖరీదు చేస్తామని చెప్పాడు. ఈ ఆయిల్‌పై చంద్రశేఖర్‌కు పరిజ్ఞానం ఉండటంతో నమ్మారు. ఇప్పటి వరకు తమకు ఆయిల్ సరఫరా చేసిన వారితో అనివార్య కారణాల నేపథ్యంలో ఒప్పందం రద్దయిందని పేర్కొన్నాడు. ఆయిల్‌ను మీరే లీటర్ 14,625 డాలర్లకు (రూ.10.84 లక్షలు) ఖరీదు చేసి తమకు సరఫరా చేస్తే 22 వేల డాలర్లకు (రూ.16.31 లక్షలు) కొంటామంటూ ఎర వేశాడు. మహిళ నుంచి ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓపక్క ఈ సంప్రదింపులు జరుగుండగానే డాక్టర్ గీత నారాయణగా చెప్పుకున్న మహిళ నుంచి ఫేస్బుక్ రిక్వెస్ట్ వచ్చింది. అలా పరిచయమైన ఈమె వైద్యుడిని తెలివిగా ముగ్గులోకి దింపి సదరు ఆయిల్‌ను రాయ్‌గఢ్‌కు చెందిన మిల్లులో తయారు చేస్తారంటూ నమ్మించింది. అక్కడ పని చేసే లక్ష్మీ అనే మహిళతో తనకు పరిచయం ఉందంటూ చెప్పి ఆ పేరుతో సంప్రదింపులు జరిపింది. ఈ కథ ఇలా నడుస్తుండగా... మరోసారి టచ్‌లోకి వచ్చిన బెంజిమన్ శాంపిల్‌గా ఒక లీటర్ ఖరీదు చేసి పంపాలని, ఆ కంపెనీ ఖాతాలో డబ్బు జమ చేస్తే వాళ్లే తమకు ఆయిల్ పంపేస్తారంటూ చెప్పాడు. నగదు మాత్రం మీరే పేర్కొన్న ఖాతాలో వేస్తామంటూ పూర్తిగా నమ్మించాడు. చంద్రశేఖర్ ఒక లీటర్ ఆయిల్ కోసం లక్ష్మీని సంప్రదించారు. దాని నిమిత్తం 14,625 డాలర్లు పంపించారు. ఈలోపు మళ్లీ సీన్లోకి వచ్చిన బెంజిమన్... లీటర్‌తో తమకు ఉపయోగం లేదని, కనీసం 350 పంపిస్తే ఒక బ్యాచ్ వ్యాక్సీన్లు తయారవుతాయని చెప్పాడు. చంద్రశేఖర్ దానికి సంబంధించిన మొత్తం లక్ష్మీ పేర్కొన్న ఖాతాలకు పంపిన తర్వాత మరో కథ మొదలైంది. విమానాశ్రయంలో పట్టుకున్నారంటూ.. ఆ ఆయిల్‌ను లండన్ విమానాశ్రయంలో పట్టుకున్నారంటూ బెంజిమన్ చెప్పాడు. రిలీజ్ చేయడానికి కస్టమ్స్ డ్యూటీ, వ్యాట్ కట్టాలని చెప్పి మరికొంత మొత్తం కాజేశాడు. ఇలా ఈ ఏడాది మార్చ్ నుంచి మే వరకు వివిధ విడతల్లో మొత్తం 16,11,025 డాలర్లు వివిధ బ్యాంకు ఖాతాల్లో వేయించుకున్నారు. మరో 2 వేల డాలర్లు పంపాలంటూ నేరగాళ్ల కోరడంతో చంద్రశేఖర్ అనుమానించారు. ఈ క్రమంలో ఈ ఏడాది మేలో ఓ అపరిచిత వ్యక్తి నుంచి చంద్రశేఖర్‌కు మరో ఈ–మెయిల్ వచ్చింది. అందులో ఆయిల్ పేరుతో జరుగుతోంది పెద్ద మోసమంటూ అతడు పేర్కొన్నాడు. దీంతో అనుమానం వచ్చిన ఆయన లండన్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులను సంప్రదించగా మొత్తం ఓ స్కామ్‌గా తేలింది. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో చంద్రశేఖర్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయటకు రాలేదు. చివరకు గురువారం తన సమీప బంధువు మురళీమోహన్ ద్వారా సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. అమెరికా, దుబయ్ బ్యాంకులకు నగదు బదిలీ ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో చంద్రశేఖర్‌కు అమెరికాలోని వెల్స్ మార్గో బ్యాంకులో ఉన్న ఖాతా నుంచి అమెరికా, దుబయ్ల్లో ఉన్న మొరిల్లా బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్రాంచ్‌లకు చెందిన తొమ్మిది ఖాతాల్లోకి ఈ నగదు వెళ్లినట్లు గుర్తించారు. కొన్నేళ్ల క్రితం ఇలానే ఓ వైద్యుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.2.5 కోట్లు కాజేశారు. ఇప్పటి వరకు ఇదే పెద్ద కేసుగా రికార్డుల్లో ఉంది. -
నకిలీ పోలీస్ కమిషనర్ గాథ.. ఎంత చెప్పినా తక్కువేనయా!
సాక్షి, చెన్నై: ఆయనో నకిలీ పోలీస్ కమిషనర్. ఐడీ కార్డు, సైరన్‌తో కూడిన పోలీస్ వాహనం, యూనిఫాం అన్నీ నకిలీవే. అసలు పోలీసులతో సమానంగా చలామణి అవడమే కాకుండా అడ్డగోలుగా సంపాదించాడు. చివరకు వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల కథనం.. చెన్నైకి చెందిన విజయన్ (42)కు లారీ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇంటిపట్టునే ఉండిపోయాడు. దీంతో అతని భార్య ఏ పనీచేయకుండా ఉంటే ఎలా అని నిలదీస్తూ ఉండడంతో గెటప్ మార్చాడు. గ్రూప్–1 పాసై, డీఎస్పీ అయ్యానని, ఇటీవలే పోలీస్ కమిషనర్‌గా ఉద్యోగోన్నతి పొందినట్లు నమ్మబలికాడు. ఆ తర్వాత స్నేహితురాలి సహకారంతో జీప్ కొనుగోలు చేసి సైరన్‌తో కూడిన పోలీస్ వాహనంగా మార్చాడు. కేసుల విచారణకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి పలు ప్రాంతాలకు వెళ్లేవాడు. పోలీస్ అధికారి అవతారమెత్తాక పలువురి వద్ద డబ్బులు గుంజాడు. చివరకు పోలీస్ కమిషనర్ గెటప్‌లో వెళ్తుండగా దిండుగల్లు జిల్లా లక్ష్మీపురం టోల్గేట్ వద్ద అతని బండారం బట్టబయలైంది. వాహనాల తనిఖీలో ఇతను పోలీసులకు పట్టుబడ్డాడు. అతని నుంచి వాహనం, నకిలీ ఐడీ కార్డు, యూనిఫాం, తుపాకీ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో దిగిన ఫొటోలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సన్నిహితంగా ముచ్చట్లాడుతున్న ఫొటో సైతం ఉండడం గమనార్హం! అయితే తాను ఒక ప్రైవేట్ న్యూస్ చానల్లో విలేకరిగా పనిచేసేటపుడు వారితో ఫొటోలకు దిగినట్లు నిందితుడు విచారణలో పేర్కొన్నాడు. మరోవైపు– ఈ కేసు విచారణ సమయంలో పలువురు ఫోన్ ద్వారా ఒత్తిళ్లకు గురిచేసినట్లు పోలీసులు చెప్పడం గమనించతగ్గ అంశం. ప్రముఖుల పేర్లను, ఫొటోలను విజయన్ వాడుకున్నాడా? ఇతడిని అడ్డుపెట్టుకుని ప్రముఖులు సొమ్ము చేసుకున్నారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబును సైతం విచారించనున్నట్లు సమాచారం. -
కేవైసీ మోసాలు: కన్ఫ్యూజ్ కాకండి.. ఇలా చేయండి
KYC Frauds Alert: ఓవైపు బ్యాంకులు.. మరోవైపు టెలికామ్ ఆపరేటర్లు ‘కేవైసీ అప్డేట్’ పేరిట కస్టమర్లను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఓసారి ‘అప్డేట్ తప్పనిసరి’ అంటున్నాయి. మరోసారి ‘మోసాలు జరుగుతున్నాయి..జాగ్రత్త!’ అంటూ హెచ్చరిస్తున్నాయి. దీంతో గందరగోళంలో పడిపోయి కస్టమర్ ఆ కన్ఫ్యూజింగ్ స్టేజ్‌లోనే మోసగాళ్ల బారినపడుతున్నారు. కాబట్టి, అయోమయానికి గురికాకుండా.. జాగ్రత్తగా కన్ఫర్మ్ చేసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. సాక్షి, వెబ్‌డెస్క్: నో యువర్ కస్టమర్(కేవైసీ) స్కామ్ ద్వారా వ్యక్తిగత డేటాను స్కామర్లు తస్కరించే అవకాశం ఉంటుందని తన 27 కోట్ల మంది సబ్స్క్రయిబర్లను హెచ్చరించింది వొడాఫోన్ ఐడియా(Vi). ఇక వీఐ కంటే ముందు ఎయిర్టెల్ కూడా ఇలాంటి ఓ హెచ్చరికే జారీ చేసింది. మరోవైపు ఎస్బీఐ లాంటి బడా బ్యాంకులు కూడా అదే తోవలో పయనిస్తూ కేవైసీ మోసాలపై కస్టమర్లను హెచ్చరిస్తున్నాయి. కేవైసీ అప్డేట్ పేరుతో వ్యక్తిగత వివరాలను, సంబంధిత డాక్యుమెంట్ల సమాచారాన్ని సేకరించి.. కొన్నేళ్లుగా పక్కా మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. ఈ మధ్య అలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో అప్రమత్తంగా ఉండడం కస్టమర్లకు అవసరం కూడా. హలో, కస్టమర్ సర్వీస్ నుంచి.. కేవైసీ మోసాల కోసం హై ఫ్రొఫైల్ టెక్నికల్నేం మోసగాళ్లు ఉపయోగించడం లేదు. సింపుల్‌గా.. టెలికామ్ ఆపరేటర్ల కంపెనీలు, బ్యాంకుల పేరిట మెసేజ్‌లు పంపుతున్నారు. కస్టమర్ సర్వీస్, ఆథరైజేషన్ వింగ్ నుంచి ప్రతినిధులమంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. తక్షణమే కేవైసీ అప్డేట్ చేసుకోవాలని.. లేకుంటే బ్యాంక్ సేవలు నిలిపివేస్తామని, సిమ్ బ్లాక్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. పైగా పరిష్కారం ఇదేనంటూ కొన్ని మెసేజ్‌లు, లింకులు పంపుతున్నారు. లేదంటే ఫలానా టోల్‌ఫ్రీ(ఫ్రాడ్) నెంబర్‌కి ఫోన్ చేయమని.. వాళ్లిచ్చే సూచనలు ఫాలో అవ్వమని అదీ కుదరదంటే ఫలానా మెసేజ్‌లకు రిప్లైలు ఇవ్వమని యూజర్లను, సబ్స్క్రయిబర్లను కోరుతున్నారు. పని తేలికగా అయిపోతుంది కదా అని వివరాలు ఇచ్చేస్తున్నారు చాలామంది. ఇక చదువుకున్న వాళ్లను, కొద్దిగా విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లను బోల్తా కొట్టించడానికి ‘యాప్’ ఇన్స్టాల్ చేసుకుని.. అందులో వివరాలు నింపమని అడుగుతున్నారు. ఓవరాల్‌గా.. కేవైసీ వెరిఫికేషన్ పేరుతో కీలక సమాచారం లాగేసి కస్టమర్లను కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. లైట్ తీస్కోవద్దు KYC మోసాల తరుణంలో టెలికామ్ కంపెనీలు, బ్యాంకులు కస్టమర్లను అప్రమత్తం చేస్తూ వస్తున్నాయి. తమ తరపున అలాంటి సందేశాలు, కాల్స్ రావని.. ఒకవేళ వచ్చినా అప్రమత్తం చేస్తాయే తప్పా వ్యక్తిగత వివరాలను అడగవనే విషయాన్ని గుర్తించాలని కస్టమర్లకు సూచిస్తున్నాయి. అంతేకాదు థర్డ్ పార్టీ యాప్(సంబంధం లేని యాప్‌లు) ఇన్స్టాల్ ఎట్టిపరిస్థితుల్లో చేసుకోకూడదని హెచ్చరిస్తున్నాయి కూడా. అయితే కేవైసీ అప్డేట్ తప్పనిసరిగా మారిన ఈ రోజుల్లో ఏది సిసలో.. ఏది నకిలీనో గ్రహించలేక కస్టమర్లు నష్టపోతున్నారు. అవగాహన లేకపోవడమో లేదంటే నిర్లక్క్ష్య ధోరణి వల్లనో ఇలాంటి ఆన్లైన్ మోసాలను లైట్‌గా తీసుకునే కస్టమర్లే ఎక్కువగా ఉంటున్నారు మన దేశంలో. ఇది సాకుగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. (ఆన్లైన్ మోసాల బారినపడుతున్న దేశాల్లో టాప్ ప్లేస్ మనదే). ఫిర్యాదులు చేయడం, సంబంధిత విభాగాలను సంప్రదించడం వల్లే ఇలాంటి మోసాలకు అడ్డుకట్టపడేదని గుర్తించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇలా డీల్ చేయండి ఈ-మెయిల్ ఐడీ, కాంటాక్ట్ నెంబర్స్, అడ్రస్, ఆధార్ డిటెయిల్స్, ఫొటో.. ఏది పంపినా, ఏ వివరాలు చెప్పిన కేవైసీ మోసాల బారిన పడే అవకాశం కచ్ఛితంగా ఉంది. ఇది ఎవరినీ భయపెట్టే ప్రయత్నం కాదు.. జరుగుతున్నది చెప్పడమే అంటున్నారు. ఈ మధ్య కొన్ని బ్యాంకింగ్ సర్వీసులు, టెలికామ్ సంబంధిత వ్యవహారాలు ఫోన్లు, యాప్‌లలోనే నడుస్తున్నాయి. వాట్సాప్, మెయిల్స్ ద్వారా డాక్యుమెంటేషన్ నిమిషాల్లో నడిచిపోతోంది. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకుల లోన్లు, హెల్త్ ఇన్సూరెన్ల విషయంలో ఇది ఎక్కువగా నడుస్తోంది. కాబట్టి, అవతల ఉంది నిజమైన ఎంప్లాయేనా అని నిర్ధారించుకున్నాకే ముందుకెళ్లాలి. ఇక టెలికామ్ కంపెనీల నుంచి వచ్చే మెసేజ్‌లు పర్టిక్యులర్‌గా ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు.. వోడాఫోన్ ఐడియా నుంచి వచ్చే మెసేజ్‌లు ViCARE అని ఉంటాయి. ఇందులోనూ స్పెల్లింగ్ మిస్టేక్‌తో మోసాలకు పాల్పడే ఛాన్స్ ఉంది కాబట్టి.. మెసేజ్‌ను నిశితంగా పరిశీలించాలి. అంతేతప్ప కంగారుపడిపోయి వివరాలను అవతలి వాళ్లకు రివీల్ చేయకూడదు. మరోవైపు బ్యాంకింగ్ విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. కేవైసీ అప్డేట్ సందేశాలు, కాల్స్ వస్తే.. స్వయంగా బ్యాంక్‌కు వెళ్లి కనుక్కోవాలి. అవసరమైతేనే డాక్యుమెంట్లు సమర్పించాలి. అంతేతప్ప కాల్స్, మెసేజ్‌లకు బదులివ్వకూడదు. సిమ్ కేవైసీ వ్యవహారాల్లోనూ సంబంధిత స్టోర్లకు వెళ్లి కనుక్కోవాలి. ఇంట్లో చదువుకోని వాళ్లకు ఇలాంటి కాల్స్ వస్తే ఎలా స్పందించాలో తెలియజెప్పాలి. కస్టమర్ సెంటర్‌కు కాల్ చేయడమో లేదంటే బ్యాంకుకు వెళ్లి కనుక్కోవడమో చేయాలని చెప్పాలి. అంతేతప్ప భయపడి వివరాలు చెప్పకూడదని వివరించాలి. బ్యాంకింగ్ అయినా.. సెల్యూలార్ అయినా అధికారిక టోల్‌ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి ధృవీకరించుకోవడమో లేదంటే స్వయంగా వెళ్లి కనుక్కోవడమో చేయాలి. వీలైతే ఫిర్యాదులు చేయాలి. నిర్లక్క్ష్యం వహిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వీఐపీ నెంబర్ స్కామ్ ఈ-కేవైసీ మోసాలు మాత్రమే కాదు.. ఈమధ్య వీఐపీ నెంబర్ స్కామ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. భారీ డిస్కౌంట్‌తో వీఐపీ నెంబర్లు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు కొందరు. అయితే టోకెన్ కోసం ప్రీ పేమెంట్ చేయాలని కోరుతున్నారు. డిజిటల్ పే అయినా ఫర్వాలేదని బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. అయితే సిమ్ జారీల విషయంలో ‘థర్డ్ పార్టీ’లను ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దని హెచ్చరిస్తోంది సెల్యూలార్ ఆపరేటర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా(సీవోఏఐ). -
ట్యూషన్లో పరిచయం, ఇన్స్ట్రాలో ఫ్రెండ్ రిక్వెస్ట్.. ఆపై!
సాక్షి,నాగోలు: యువతిని వేధిస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సఫిల్‌గూడకు చెందిన ముముడి సాయిమాధవ్(19) విద్యార్థి. బాధితురాలు ట్యూషన్లో పరిచయం కావడంతో ఇన్‌స్ట్రాగామ్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆ తర్వాత ఆమె అంగీకిరించింది. కొంత కాలం ఆమెతో మామూలుగా చాట్ చేసేవాడు. అతని విచిత్ర ప్రవర్తన కారణంగా కొంత కాలం తర్వాత అతడిని బ్లాక్ చేసింది. దీంతో నిందిడుతు ఆమెపై పగ పెంచుకున్నాడు. బాధితురాలి మొబైల్ నంబర్‌ను పోర్న్ వెబ్సైట్లో పెట్టి కాల్‌గర్ల్‌గా అప్లోడ్ చేశాడు. వెంటనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పెట్టుబడి పెడితే డబుల్ రిటర్న్స్ అంటూ మోసం సాక్షి,నాగోలు: ఆన్లైన్ పెట్టుబడులు పెడితే ఎక్కవ డబ్బులు వస్తాయని నిమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్‌భగవత్ వివరాలు వెల్లడించారు. నేపాల్, ఖాట్మండుకు చెందిన తారా బహదూర్ (33) న్యూఢిల్లీ వచ్చి పాండవ్‌నగర్, లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. న్యూఢిల్లీలో నివాసం ఉంటూ ట్రావెల్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. తరువాత తన స్నేహితుల ద్వారా సైబర్ మోసాల గురించి తెలుసుకున్నాడు. నిందితుడు తారా బహదూర్, వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ సీపీ మహేష్‌భగవత్ ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫాంలో ఖాతాలు సృష్టించి ఇన్వెస్టిమెంట్, డబుల్ రిటరŠన్స్ అంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. యూరోషియాకు చెందిన వ్యక్తిగా ఆన్లైన్లో నమ్మించేవాడు. తక్కవ పెట్టుబడిపై వారు చెప్పినట్లుగా రూ.వెయ్యి, రూ.500 తిరిగి డబుల్ రిటరŠన్స్ ఇచ్చి పలువురిని నమ్మించాడు. ఎక్కువ పెట్టుబడి పెట్టినా డబుల్ రిటర్న్స్ అంటూ నమ్మించి డబ్బులు కాజేశాడు. కొత్త మంది ఏజెంట్ల సాయంతో సిమ్‌కార్డులు తీసుకుని తరుచు సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. ఆధార్, పాన్‌కార్డులు, రెండు సిమ్‌కార్డులు, కోటక్ మహీంద్ర బ్యాంక్‌లో ఉన్న రూ. 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్, సీఐ వెంకటేష్ పాల్గొన్నారు. -
మాయగాడు.. టెక్కీ దంపతులనే బురిడి కొట్టించాడు
సాక్షి, హైదరాబాద్: క్రిప్టోకరెన్సీగా పిలిచే బిట్ కాయిన్స్ దందాను వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో చేయవచ్చంటూ నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లయిన భార్యాభర్తల నుంచి రూ.60 లక్షలు కాజేసిన కేసులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సూత్రధారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అమీర్‌పేటకు చెందిన వంశీమోహన్ దంపతులు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. కరోనా కారణంగా వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. బిట్‌కాయిన్స్‌లో పెట్టుబడి పెట్టి ఇంట్లో కూర్చొనే భారీగా లాభాలు గడించవచ్చనే ప్రకటనకు వీళ్లు ఆకర్షితులయ్యారు. రూ.50 లక్షల ఇన్వెస్ట్‌తో.. ‘జిప్‌బిట్’ యాప్ ద్వారా కాయిన్ల క్రయవిక్రయాలు చేపట్టారు. దీని ద్వారానే వీరికి పరిచయమైన ఓ వ్యక్తి ఆ దందాలో లాభాలు కురిపిస్తానంటూ ఎర వేశాడు. తొలుత రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ప్రపంచ మార్కెట్లో బిట్ కాయిన్ విలువ పెరుగుతున్నా.. వీరి కాయిన్స్ వివరాలు తెలియట్లేదు. దీంతో ఆ వ్యక్తిని మరోసారి సంప్రదించారు. మీ కాయిన్లు భద్రమని, ప్రస్తుత పరిస్థితుల్లో రూ.50 లక్షలకు పైగా వెచ్చించి కాయిన్స్ ఖరీదు చేస్తేనే అధిక లాభాలని నమ్మబలికాడు. దీంతో ఆ మొత్తం అతడు చెప్పినట్లే బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇందులో కొంత జిప్‌బిట్ యాప్ ద్వారా, మిగిలింది ముంబై, పూణే నగరాలకు చెందిన పలు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. ఆన్లైన్లో చూసుకోండి.. లాభాలు రాకపోవడంతో సదరు వ్యక్తితో చాటింగ్ చేశారు. లాభం ఖచ్చితంగా ఉందని, ఆన్లైన్లో కాయిన్ ధర చూసుకోవాలని సూచించాడు. ఆ తర్వాత అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించి ఈ నెల రెండో వారంలో సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ డి.ప్రశాంత్ దర్యాప్తు చేపట్టారు. ఈమె పంపిన డబ్బులో రూ.30 లక్షలు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఉన్న ఇస్కాన్ సిటీవాసి తమ్ము అనిల్‌కుమార్‌కు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. 10 నుంచి 20 శాతం కమీషన్ వృత్తిరీత్యా ఏసీ టెక్నీషియన్ అయిన అనిల్‌కు ఇంటర్నెట్లో ద్వారానే జిప్‌బిట్ యాప్ కోసం పనిచేస్తున్న వ్యక్తితో పరిచయమైంది. అతడితో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేశారు. తాము సూచించిన లావాదేవీలకు సహకరిస్తూ వెళ్లడమే పనని, అలా చేస్తే 10 నుంచి 20 శాతం కమీషన్ ఇస్తామంటూ ఆ వ్యక్తులు ఇతడిని రంగంలోకి దింపారు. మిగిలిన మొత్తాన్ని బినాన్స్ యాప్ ద్వారా బిట్ కాయిన్స్ రూపంలో మార్చి తమకు పంపాలని వాళ్లు స్పష్టం చేశారు. దీనికి అంగీకరించిన అతడు వంశీమోహన్ దంపతులకు చెందిన రూ.30 లక్షలు, రాచకొండ పరిధికి చెందిన మరో మహిళ నుంచి రూ.6.5 లక్షలు తన ఖాతాల్లో వేయించుకున్నాడు. ఈ మొత్తంలో తన కమీషన్ మినహాయించుకుని మిగిలింది బిట్ కాయిన్స్‌గా మార్చేశాడు. వాటిని సూత్రధారులకు అందించాడు. రాచకొండ పోలీసులు అనిల్ వ్యవహారాన్ని గుర్తించి తమ కేసులో ఇటీవల అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సిటీ సైబర్ క్రైమ్ అధికారులు పీటీ వారెంట్‌పై శుక్రవారం అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
AP: ఖతార్ నుంచి ఇద్దరు మహిళలకు విముక్తి
సాక్షి, కడప: ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) చొరవతో ఇద్దరు మహిళలు ఖతార్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ వివరాలను ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ బీహెచ్ ఇలియాస్ సోమవారం మీడియాకు తెలియజేశారు. వైఎస్సార్ జిల్లా కడపలోని అక్కాయపల్లెకు చెందిన కాకిరేని గంగాదేవి, తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలానికి చెందిన గంగాభవానీ గృహ కార్మికులుగా గతేడాది ఖతార్‌కు వెళ్లారు. అక్కడ స్పాన్సర్(సేఠ్) వీరిని వేధింపులకు గురిచేశాడు. దీంతో వారిద్దరూ.. తమను భారత్‌కు పంపించాలని అతన్ని వేడుకున్నారు. అయినా కనికరించని అతను.. వీరిద్దరిపై దొంగతనం కేసు పెట్టి జైలుపాలు చేశాడు. ఈ విషయం ఏపీఎన్ఆర్టీఎస్ కో–ఆర్డినేటర్ మనీష్ దృష్టికి వచ్చింది. ఆయన వెంటనే ఖతార్ జ్యుడిషియల్‌ను సంప్రదించారు. గంగాదేవి, గంగాభవానీపై అన్యాయంగా దొంగతనం కేసు బనాయించారని, వారిని భారత్‌కు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఖతార్ జ్యుడిషియల్ దీనిని విచారించి.. వారిని నిర్దోషులుగా ప్రకటించింది. భారత్‌కు పంపించాలని ఆదేశించింది. ఏపీఎన్ఆర్టీఎస్ సభ్యులు మనీష్, రజనీమూర్తి భారత రాయబార అధికారులతో మాట్లాడి తాత్కాలిక పాస్‌పోర్టు, టికెట్ ఇప్పించి వారిని ఈ నెల 25న స్వదేశానికి రప్పించారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వారు స్వస్థలాలకు వెళ్లేందుకు ఖాతార్ తెలుగు కళా సమితి జనరల్ సెక్రటరీ దుర్గాభవాని ఆర్థిక సాయం చేశారు. బాధిత మహిళలు గంగాదేవి, గంగాభవానీ మాట్లాడుతూ.. ఖతార్‌లో ఇబ్బందులు పడుతున్న తమను గుర్తించి.. ఆదుకున్న ఏపీఎన్ఆర్టీఎస్కు కృతజ్ఞతలు తెలిపారు. -
బనశంకరీదేవి అమ్మవారిని దర్శించుకున్న నటుడు
బనశంకరి: సినీ నిర్మాత ఉమాపతి సతీసమేతంగా బుధవారం బనశంకరీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. నటుడు దర్శన్ పేరుతో తప్పుడు పత్రాల కేసులో తప్పు ఒప్పులను బనశంకరీదేవి చూసుకుంటుందని ఉమాపతి అన్నారు. ఈ కేసుకు సంబంధించి దర్శన్, ఉమాపతి బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ కేసులో ఆరోపి అరుణాకుమారి.. ఉమాపతిపై ఆరోపణలు చేయడం తెలిసిందే. -
వీళ్లు మహా కి‘లేడీ’లు.. 950 మందిని బుట్టలో వేసుకున్నారు
సాక్షి, సనత్‌నగర్: డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ మహిళను సనత్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమెతో పాటు ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపించిన మరో మహిళను ఇప్పటికే జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సైట్– 3లో నివాసం ఉండే మహిళా సంత సొసైటీకి చెందిన సోషల్ వర్కర్ సుప్రియ, అల్లాకే బందే ఫౌండేషన్ అధ్యక్షురాలు అయేషా తబస్సుంలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని రూ.లక్షలు వసూలు చేశారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కార్డులు, పింఛన్లు, రేషన్ కార్డులు ఇప్పిస్తామని కూడా అందినకాడికి దండుకున్నారు. వీరి వలలో పడి డబ్బులు కట్టినవారిలో సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్లాపూర్‌నకు చెందిన పలువురు మహిళలు ఉన్నారు. మూడు నెలలైనా ఇళ్ల విషయం తేలకపోవడంతో సుప్రియపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఆమె పలుమార్లు మీటింగ్ ఏర్పాటు చేసి తన భర్త రాఘవను ప్రభుత్వ అధికారిగా పరిచయం చేసి నమ్మించింది. ఇంకొన్నిసార్లు ఇళ్లు వచ్చేశాయంటూ తాళం చెవులు, విద్యుత్ మీటర్ నంబర్లను చూపించి నమ్మించి వారి నుంచి మరిన్ని డబ్బులు వసూలు చేస్తుండేది. ఇదే రకం వ్యవహరంలోనే అయేషా తబస్సును ఇటీవల జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న బాధితులు.. సుప్రియ కూడా తమను మోసం చేసిందని గ్రహించి సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. వీరి వలలో చిక్కుకుని డబ్బులు చెల్లించిన నలుగురు బాధిత మహిళలు ముందుకువచ్చారు. మొత్తం 950 మంది వరకు బాధితులు ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఏ1 గా అయేషా తబస్సుం, ఏ2 గా సుప్రియలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'దర్శన్ వల్ల నా కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా ఉంది!'
యశవంతపుర(కర్ణాటక): నటుడు దర్శన్ పేరుతో నకిలీ పత్రాలను రూపొందించి రూ. 25 కోట్ల లోన్ తీసుకునే కుట్ర మలుపు తిరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ అరుణాకుమారి బెంగళూరులో మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. లోను విషయంలో నిర్మాత ఉమాపతి తనను వాడుకొని వదిలేశారని ఆరోపించారు. తాను ఎవరో తెలియదని ఆయన చెప్పడం నిజం కాదన్నారు. మార్చి 30 నుంచి అతనితో పరిచయం ఉందని ఆమె చెప్పారు. 'లోన్ విషయమై ఉమాపతిని కలిసిన మాట నిజం. అయితే లోన్ రాలేదు. దర్శన్ ఫాంహౌస్‌కు కూడా వెళ్లాను. దర్శన్–ఉమాపతి నడుమ ఏం జరిగిందో నాకు తెలియదు. వీరి ద్వారా నాకు ఇబ్బందులు వచ్చేలా ఉన్నాయి. నా కుటుంబం ఆత్మహత్య చేసుకొనే స్థితికి వచ్చింది. దయచేసి నన్ను బతకనివ్వండి' అని పేర్కొన్నారు. తాను వాట్సప్‌లో హార్ట్ సింబల్‌ను ఉమాపతికి పంపడంపై చర్చ అవసరం లేదన్నారు. తన అన్నదమ్ముళ్లకు కూడా ఇలాంటి సింబల్‌ను పంపినట్లు తెలిపారు. ఆమె తెలుసు: ఉమాపతి నటుడు దర్శన్ తనపై ఆడియోను రిలీజ్ చేయటంపై నిర్మాత ఉమాపతి బెంగళూరులో తన ఇంట్లో స్పందించారు. నేను ఎప్పుడూ దర్శన్ గురించి అనుచితంగా మాట్లాడలేదన్నారు. 'అరుణాకుమారి ఏప్రిల్ నుంచి తెలుసు. మే మూడో వారంలో దర్శన్ లోన్ విషయమై ఆమె, నేను మాట్లాడుకున్నాం. నేను దర్శన్‌ను దూరం చేసుకోను' అని చెప్పారు. -
ప్రేమ నాటకం.. పెళ్లిళ్ల బూటకం.. నమ్మారో ఇక అంతే!
సాక్షి, హైదరాబాద్: ఫేస్బుక్ ద్వారా అనేక మందిని పరిచయం చేసుకుని, పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి,, ఉద్యోగం పేరుతో డబ్బు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న భార్యభర్తల్ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా... చిత్రంగా నిందితురాలే మరో బాధితుడిని వెంట బెట్టుకుని వచ్చి రెండే కేసు రిజిస్టర్‌కు కారణమైంది. ఈ కేసులో భర్తను అరెస్టు చేసిన అధికారులు, మూడు నెలల చిన్నారి ఉన్న నేపథ్యంలో భార్యకు సీఆర్పీసీ 41–ఏ నోటీసులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి ప్రాంతానికి చెందిన పున్నం నవీన్‌కుమార్ గత ఏడాది శిరీష అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కోస్గిలో కాపురం పెట్టినా తరచుగా హైదరాబాద్‌కు వచ్చి హోటళ్లలో బస చేసే వాళ్లు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ఇద్దరూ కలిసి సైబర్ నేరాలు చేయాలని పథకం వేశారు. ఇందులో భాగంగా శిరీష ఫేస్బుక్లో స్వప్నరెడ్డి పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసింది. దీని నుంచి అనేక మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ప్రధానంగా తమ స్టేటస్‌ను సింగిల్ అంటూ సూచించే అవివాహిత యువకుల్నే ఎంచుకుంది. వీటికి స్పందించిన ఫ్రెండ్స్‌గా మారిన వారితో శిరీష, ఆమె మాదిరిగా నవీన్ చాటింగ్ చేసేవాళ్లు. ఫేస్బుక్ చాటింగ్ తర్వాత తమ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని వాట్సాప్‌కు మారేవాళ్లు. కొన్ని రోజుల తర్వాత ప్రేమ, పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చే వారు. కొన్నిసార్లు బాధితులు ఫోన్లు చేస్తే శిరీష మాట్లాడుతూ వారికి నమ్మకం కలిగించేది. పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం కావాలంటూ చెప్పే ఈమె తనకు పరిచయస్తుల ద్వారా మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికేది. ఆపై రంగంలోకి దిగే నవీన్ రకరకాల పేర్లు చెప్పి డబ్బు గుంజేవాడు. నగరానికి చెందిన ఓ యువకుడికి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం పేరుతో రూ.8 లక్షలు తీసుకుని మోసం చేశారు. అతడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం నవీన్‌కుమార్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న శిరీష ఇటీవల రూ.2 లక్షలు ఇచ్చిన మరో వ్యక్తిని వెంట పెట్టుకుని సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చింది. అతడితో రాజీ పడుతున్నామని, భర్తను విడిచిపెట్టాలని కోరింది. అయితే ఈ బాధితుడు జరిగిన విషయం తెలుసుకుని మరో ఫిర్యాదు అందించడంతో ఇంకో కేసు నమోదైంది. ఇలా వచ్చిన డబ్బుతో భార్యభర్తలు గోవా తదితర ప్రాంతాల్లో జల్సాలు చేసినట్లు తేలింది. నవీన్‌ను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు మూడు నెలల చిన్నారి ఉన్న శిరీషకు నోటీసులు జారీ చేసి పంపారు. ఈ పంథాలో వీళ్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని మోసం చేశారనే ప్రాథమిక ఆధారాలు ఉండటంతో ఆ కోణంలో ఆరా తీస్తూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
నన్ను మోసం చేశారు.. సల్మాన్ ఖాన్‌పై చీటింగ్ కేసు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌పై చండీగఢ్‌లో చీటింగ్ కేసు నమోదైంది. సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రితో పాటు ఆయనకు చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్‌కు చెందిన ఏడుగురిపై అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఫిరాదుపై జూలై 13లోపు వివరణ ఇవ్వాలని సమన్లు కూడా జారీ చేశారు. ఈ ఆరోపణలలో ఏదైనా నేర కోణం దాగుంటే తప్పక చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేతన్ బన్సాల్ తెలిపారు. అరుణ్ గుప్తా ఆ ఫిర్యాదులో.. ఇద్దరు బీయింగ్ హ్యూమన్ ఉద్యోగులు నన్ను ఆ సంస్థ ఫ్రాంచైజీని తెరవమని అడిగారు. ఇందుకు పెట్టుబడి ఖర్చు రూ.2 కోట్లు అవుతుందని చెప్పగా అందుకు అంగీకరించి అంత మోత్తాన్ని ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. కాగా షోరూమ్ తెరిచిన సంవత్సరం గడుస్తున్న, తనకు సదరు సంస్థ నుంచి ఏవీ రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదట్లో ఈ విషయమై ఆ సంస్థ ఉద్యోగులు సల్మాన్ ఖాన్‌తో సమావేశం అయ్యేలా చూస్తామని చెప్పారు. ఈ క్రమంలో అతను సల్మాన్‌ను కలుసుకోగా, షోరూమ్ ప్రారంభించేందుకు కూడా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపాడు. కానీ ఆ తర్వాత సల్మాన్ రాలేదని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ మేరకు సల్మాన్, ఆయన సోదరి అల్విరా, సంస్థ సీఈఓ ప్రకాశ్ కాపరే సహా మరో ఏడుగురిపై కేసు నమోదైంది. షోరూమ్ ప్రారంభించి 1.5 సంవత్సరాలు గడిచినప్పటికీ నాకు ఎటువంటి సమాధానం వాళ్ల నుంచి రాలేదని వాపోయాడు. Chandigarh police summon Bollywood actor Salman Khan, his sister Alvira Khan and 7 others associated with Being Human in an alleged case of fraud. "They have been given till July 13 to reply. If there's anything criminal, action will be taken," Chandigarh SP Ketan Bansal. pic.twitter.com/Ye2dI97aN5 — ANI (@ANI) July 8, 2021 -
చనిపోయిన భర్త అకౌంట్ నుంచి రూ.34 లక్షలు మాయం
సాక్షి,హిమాయత్‌నగర్: ఇటీవల కోవిడ్‌తో చనిపోయిన తన భర్త అకౌంట్ నుంచి డబ్బులు మాయమైనట్లు మెహదీపట్నంకు చెందిన నజియా సోమవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చనిపోయిన సమయంలో భర్త ఫోన్, వాలెట్ కనిపించలేదని, అదే సమయంలో హాస్పిటల్‌కు ఖర్చు బెట్టిన డబ్బులను లెక్క చూసేందుకు బ్యాంకు స్టేట్మెంట్ నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూస్తుండగా.. భర్త అకౌంట్లో నుంచి రూ.34లక్షల నగదు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు స్పష్టమైంది. దీంతో తనకు న్యాయం చేయాలంటూ నజియా పోలీసులను ఆశ్రయించింది. లాటరీ పేరుతో రూ.2లక్షలు.. మీకు ఖరీదైన కారు బహుమతిగా వచ్చిందంటూ వట్టపల్లికి చెందిన అజారుద్దీన్‌కు స్నాప్‌డీల్ నుంచి ఫోన్ వచ్చింది. ఇందుకు గాను మీరు రూ.2లక్షలు చెల్లించాలని పేర్కొన్నాడు. దీంతో ఖరీదైన కారు ఉచితంగా వస్తున్నప్పుడు రూ.2లక్షలు పెద్ద విషయం కాదంటూ అతడు చెప్పిన బ్యాంకు ఖాతా లకు బదిలీ చేశాడు. రోజులు గడుస్తున్నా కారు ఇవ్వకపోగా.. ఫోన్లో స్పందన లేకపోవడంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఫ్రెండే కదా అని రూ.2లక్షలు పంపాడు.. యూఎస్‌లో ఉంటున్న రమేష్ అనే స్నేహితుడి నుంచి బంజారాహిల్స్‌కు చెందిన సురేష్‌బాబుకు మెసేజ్ వచ్చింది. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నాను ఈ మెసేజ్‌లో ఉన్న బ్యాంకు అకౌంట్‌కు రూ.2లక్షలు పంపమన్నాడు. స్నేహితుడే కదా అని ఏ మాత్రం క్రాస్‌చెక్ చేసుకోకుండా అడిగిన రూ.2లక్షలను సురేష్‌బాబు ఆ బ్యాంకు ఖాతాలకు పంపడం జరిగింది. ఆ తర్వాత రమేష్‌న ఫోన్లో అడగ్గా.. నేనేమీ నిన్ను అడగలేదని, నువ్వు ఎవరికి పంపావో నాకు తెలీదనే సమాధానం ఇచ్చాడు. దీంతో మోసపోయానని గ్రహించి సురేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్‌బియ్యం స్వాధీనం
సాక్షి, చెన్నై(తమిళనాడు): చెన్నై, కాంచీపురం జిల్లాలో వేర్వేరు చోట్ల అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల రేషన్ బియాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై ఎగ్మూర్ రైల్వేస్టేషన్లో రేషన్‌బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టి.. ఐదవ ప్లాట్‌ఫాంలో ఉంచిన 10 బస్తాల రేషన్‌బియాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని ఒడిశాకు తరలించేందుకు య త్నించిన పులియాంతోపు ప్రాంతానికి చెందిన బాలాజీ గూండా చట్టం కింద అరెస్టు చేశారు. కాంచీపురంలో.. స్థానిక అరక్కోణం రోడ్డులో పోలీసులు మంగళ వారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈసమయంలో కాంచీపురానికి చెందిన సుదర్శన్ (35) బైక్‌లో రేషన్‌బియ్యం తీసుకెళుతున్నట్లు గుర్తించారు. అతడిచ్చిన సమాచారంతో ఇదేవ్యాపారం చేస్తున్న అతడి స్నేహితులు పార్తీబన్ (47), రాజేష్ (38ను కూడా అరెస్టు చేశారు. వీరు ఇతర రాష్ట్రాలకు తరలించడానికి రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని దాచి ఉంచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరులో.. 3.5 టన్నులు సీజ్ తిరువళ్లూరు: గుమ్మిడిపూండీ నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న 3.5 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌కు ఉపయోగించిన మినీలారీనీ సీజ్ చేసిన పోలీసులు, ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రహస్య సమాచారం మేరకు.. పుడ్‌సెల్ ఇన్పెక్టర్ మురుగన్ ఆధ్వర్యంలో ఎలావూర్ వద్ద పోలీసులు మంగళ వారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న మినీలారీని తనీఖీ చేశారు. అందులోని మూడున్నర టన్నుల రేషన్ బియాన్ని సీజ్ చేశారు. అనంతరం స్మగ్లింగ్‌కు ఉపయోగించిన మినీ లారీని సీజ్ చేశారు. నిందితులు తమిళనాడుకు చెందిన వీరమణి(29), కుమార్(31)గా గుర్తించారు. చదవండి: వాట్సప్ చూస్తోందని చెల్లిని చంపిన అన్న -
మణప్పురం సంస్థకు రూ.30 లక్షలు టోకరా
సాక్షి, హైదరాబాద్: మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన డోర్‌స్టెప్ లోన్ పథకాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఓ వాల్యూవర్, మరో ఎగ్జిక్యూటివ్‌ల నుంచి వివరాలను కేటుగాళ్లు సేకరించి.. లేని బంగారంపై రూ.30 లక్షల రుణం మంజూరు చేసేసుకున్నారు. ఎట్టకేలకు విషయం గుర్తించిన సంస్థ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో స్థానికుల ప్రమేయాన్ని అనుమానిస్తూ ఆ కోణంలోనూ ఆరా తీస్తున్నారు. లోన్ స్కీమ్ కథాకమామిషూ ఇదీ.. వినియోగదారులను ఆకర్షించడానికి వ్యాపార సంస్థల మాదిరిగా ఫైనాన్స్ సంస్థలూ రకరకాల స్కీముల్ని పరిచయం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మణప్పురం ఫైనాన్స్ సంస్థ డోర్ స్టెప్ లోన్ స్కీమ్ ప్రారంభించింది. బంగారంపై రుణం కావాల్సిన వ్యక్తి ఆన్లైన్ లేదా ఫోన్ కాల్ ద్వారా అప్లై చేసుకుంటారు. ఈ చిరునామాకు వెళ్లే వాల్యూవర్ బంగారం సరిచూసి తన యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా మణప్పురం పోర్టల్‌లోకి లాగిన్ అయి ఆ వివరాలు పొందుపరుస్తాడు. మరుసటి రోజు కస్టమర్ ఇంటికి వచ్చే ఎగ్జిక్యూటివ్ మంజూరైన రుణాన్ని వారి ఖాతాలోకి బదిలీ చేసి, బంగారం తీసుకుని వెళ్తాడు. ఈ విధానాన్ని అధ్యయనం చేసిన సైబర్ నేరగాళ్లు కొత్త పథకం వేశారు. హెడ్డాఫీస్ పేరుతో ఫోన్లు చేసి.. సైబర్ నేరగాళ్లు హిమాయత్‌నగర్ ప్రాంతానికి సంబంధించిన వాల్యూవర్, ఎగ్జిక్యూటివ్‌ల వివరాలు, ఫోన్ నంబర్లు తెలుసుకున్నారు. ఈ నెల 15న వాల్యూవర్కు కాల్ చేసిన కేటుగాళ్లు మణప్పురం హెడ్డాఫీస్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పారు. సాంకేతిక కారణాలతో మీ వర్క్ పోర్టల్‌లోకి అప్డేట్ కావట్లేదంటూ చెప్పి యూజర్ నేమ్, పాస్వర్డ్ తీసుకున్నారు. మంగళవారం ఎగ్జిక్యూటివ్‌కు సైతం ఇదే మాదిరిగా ఫోన్ చేసి ఆయన నుంచీ వివరాలు సంగ్రహించారు. వీటి ఆధారంగా బుధవారం హిమాయత్‌నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి మాదిరిగా లోన్ కోసం అప్లై చేశారు. అదే రోజు వాల్యూవర్, ఎగ్జిక్యూటివ్‌లు తమ పని పూర్తి చేసినట్లు చూపిస్తూ.. 1,210 గ్రాముల బంగారం ఉన్నట్లు రూ.30 లక్షల రుణం ఓ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసేశారు. ఒడిశా బ్యాంకు నుంచి డ్రా.. మణప్పురం సంస్థ ఎప్పటికప్పుడు ముందు రోజు లావాదేవీలను పరిశీలిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే గురువారం మణప్పురం హెడ్డాఫీస్ బుధవారం నాటి లావాదేవీలను పరిశీలించింది. దీంతో తమ వద్ద ఉండాల్సిన బంగారంలో 1,210 గ్రాములు తక్కువ వచి్చంది. దీంతో ఆ లోన్‌కు సంబంధించి లాగిన్ అయిన వాల్యూవర్, ఎగ్జిక్యూటివ్‌లను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో నిర్వాహకులు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో మణప్పురం ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు వెళ్లిన డబ్బు చివరకు ఒడిశాలోని బ్యాంకుకు చేరిందని తేల్చారు. అక్కడి బ్యాంకు నుంచి బుధవారమే నిందితులు డబ్బు డ్రా చేసినట్లు వెల్లడైంది. -
రూ. 9 వేల కోట్ల రికవరీ..ఇలా రాబట్టారు!
న్యూఢిల్లీ: రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకి యునైటెడ్ బ్రూవరీస్ (యూబీఎల్)లో ఉన్న షేర్లలో కొంత భాగాన్ని బ్యాంకుల తరఫున రుణాల రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) బుధవారం విక్రయించింది. వీటి విలువ సుమారు రూ. 5,824 కోట్లు. దీనితో భారీగా రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా కేసుల్లో బ్యాంకులు ఇప్పటిదాకా సుమారు రూ. 9,041 కోట్లు దాకా రికవర్ చేసుకున్నట్లయింది. వారు ముగ్గురూ ఎగవేసిన మొత్తంలో (దాదాపు రూ. 22,000 కోట్లు) ఇది సుమారు 40 శాతం. ఈ కేసుల్లో వారి ఆస్తులను జప్తు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 25న మాల్యా షేర్లు మరిన్ని.. ‘మాల్యా, చోక్సీ, మోదీల వల్ల బ్యాంకులకు సుమారు రూ. 22,585 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ కేసులకు సంబంధించి అటాచ్ చేసిన ఆస్తుల విలువ.. బ్యాంకులకు వాటిల్లిన నష్టంలో దాదాపు 80 శాతం (రూ. 18,170 కోట్లు) ఉంటుంది‘ అని ఈడీ పేర్కొంది. మాల్యా కేసుల విచారణ సందర్భంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు (పీఎంఎల్ఏ) ఆదేశాల మేరకు తాము జప్తు చేసిన సుమారు రూ. 6,624 కోట్ల విలువ చేసే యూబీఎల్ షేర్లను ఎస్బీఐ కన్సార్షియంకు ఈడీ బదలాయించింది. ఇందులో నుంచి రూ. 5,824 కోట్ల విలువ చేసే షేర్లను బ్యాంకుల తరఫున బుధవారం డీఆర్టీ విక్రయించింది. జూన్ 25న మరో రూ. 800 కోట్ల షేర్లను విక్రయించే అవకాశం ఉందని ఈడీ తెలిపింది. ఇక పరారైనవారు, ఆర్థిక నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి ఆస్తులను జప్తు చేసుకుని, బాకీలన్నీ రాబడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. మరోవైపు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటనపై స్పందిస్తూ, ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ.. బ్యాంకులకు రావాల్సిన బాకీలకన్నా ఎక్కువే ఉంటుందని చోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఇలా రాబట్టారు.. ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకును (పీఎన్బీ) రూ. 13,000 కోట్లు మేర మోసగించారని వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ, బ్యాంకుల కన్సార్షియంకు సుమారు రూ. 9,000 కోట్లు ఎగవేశారని మాల్యా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి.. మాల్యాకి చెందిన షేర్లను గతంలో కూడా విక్రయించిన బ్యాంకులు సుమారు రూ. 1,357 కోట్లు రాబట్టుకోగలిగాయి. నీరవ్ మోదీ కేసులో రూ. 1,060 కోట్ల విలువ చేసే అసెట్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మాల్యాకు చెందిన మరిన్ని షేర్లను విక్రయించడంతో బ్యాంకులు మొత్తం ఈ మూడు కేసులకు సంబంధించి రూ. 9,000 కోట్ల పైగా రాబట్టుకోగలిగినట్లయింది. ఈ ముగ్గురు బోగస్ సంస్థలను ఉపయోగించి, బ్యాంకుల నుంచి తీసుకున్న నిధులను మళ్లించారని తమ విచారణతో స్పష్టంగా రుజువు చేయగలిగినట్లు ఈడీ తెలిపింది. వీరిని స్వదేశం రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొంది. -
కొత్తరకం మోసం: ఆధార్‌కు రూ.200.. పాన్‌కు రూ.500
పెదగంట్యాడ(గాజువాక): ఆధార్ కార్డు ఉందా.. ఆ నంబరు చెప్పండి.. ఇక్కడ వేలి ముద్ర వేయండి.. ఇదిగో తీసుకోండి రూ.200.. పాన్ కార్డు ఉందా అయితే దీనికి ఇవిగో రూ.500 అంటూ కొంతమంది వ్యక్తులు కొత్తరకం మోసానికి తెరతీశారు.. అంతేకాకుండా పేదలను లక్ష్యంగా చేసుకుని వారికి డబ్బు ఎరచూపి.. వారి పేరుతో సిమ్ కార్డులు విక్రయానికి పథకం పన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారి అక్రమాలకు అడ్డుకట్ట వేసి అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి హార్బర్ ఏసీపీ శ్రీరాముల శిరీష తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని రాంబిల్లి మండలానికి చెందిన కొవిరి జగన్నాథం, జానకి రామిరెడ్డి, బండియ్య, కొవిరి నాని అనే నలుగురు వ్యక్తులు శనివారం మండలంలోని వికాస్‌నగర్ సెంటర్, బీసీ రోడ్డుకు ఆనుకొని ఉన్న కమ్మలపాకల్లో ఉంటున్న వారిని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామంటూ పేదలను నమ్మబలికారు. ఆధార్ కార్డు, పాన్‌కార్డు ఉన్న వారి వివరాలు సేకరించి, వారితో వేలిముద్ర వేయించి వారికి డబ్బులు ఇవ్వడం మండలంలో సంచలనమైంది. కొవిరి నాని అనే వ్యక్తి కొత్తపట్నంలో సెల్ షాప్ నడుపుతున్నాడు. అతను ఓ ప్రయివేటు కంపెనీ సిమ్‌కార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కొత్తరకం మోసానికి తెరలేపాడు. ఇందుకు మరో ముగ్గురితో కలిసి పేదలకు డబ్బులు ఇప్పించి.. వారి ఆధార్, పాన్ కార్డుల ద్వారా సిమ్‌కార్డులను ఎక్కువధరకు అమ్ముకునేలా పథకం రచించాడు. ఆ సిమ్‌లను ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుకునే వారికి అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడు. ఆధార్ వివరాలు సేకరించి డబ్బులు ఇస్తున్నారని తెలియడంతో కొంతమంది వ్యక్తులు అది మోసం అని గ్రహించి వెంటనే 100కు సమాచారం ఇచ్చారు. వెంటనే న్యూపోర్టు పోలీసులు వారు ఉన్న స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన వెంటనే నలుగురిలో ముగ్గురు పరారయ్యారు. కొవిరి జగన్నాథంను శనివారం అదుపులోకి తీసుకున్నారు. జానకి రామిరెడ్డిని ఆదివారం అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకు ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. న్యూపోర్టు సీఐ ఎస్.రాము కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బంజారాహిల్స్: మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. భర్త కొట్టడంతో.. -
జేపీ గ్రూప్ ఇసుక రీచ్‌ల ఫోర్జరీ కేసులో వ్యక్తి అరెస్ట్
-
ఇసుక రీచ్‌ల ఫోర్జరీ కేసు: వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, విజయవాడ: జేపీ గ్రూప్ ఇసుక రీచ్‌ల ఫోర్జరీ కేసులో తీగలాగే కొద్దీ అక్రమాల డొంక కదులుతోంది. నిందితుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలో ఎమ్మెల్సీలు ఇప్పిస్తానంటూ రూ.కోటి వసూలు చేసినట్లు సమాచారం. ఇరిగేషన్లో ఉద్యోగం ఇప్పిస్తానని స్టీల్‌ప్లాంట్ ఉద్యోగికి రూ.25 లక్షలు టోకరా వేసినట్లు తెలిసింది. విశాఖలో ఉడా భూములు లీజుకు ఇప్పిస్తానని రూ.40 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ధవళేశ్వరం వద్ద ఇసుక ట్రెడ్జింగ్ కాంట్రాక్ట్ పేరిట రూ.25 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. నిందితుడిని పోలీసులు కస్టడీ కోరనున్నారు. చదవండి: ‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను’ మాయమాటలతో బాలికను లొంగదీసుకుని.. -
ఇసుక రీచ్‌ల సబ్ లీజుల దందాలో మోసగాడి అరెస్ట్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను సబ్ లీజుకు ఇప్పిస్తానంటూ పలువురిని మోసగించి కోట్ల రూపాయలను దండుకున్న నిందితుడు రామకృష్ణ చంద్రశేఖర్‌ని విజయవాడ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ల్యాప్‌టాప్, ఫోర్జరీకి ఉపయోగించిన స్టాంప్ లు, రూ.40 వేల నగదు, సెల్‌ఫోన్, ఫోర్జరీ డాక్యుమెంట్స్, మూడు బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.1.95 లక్షల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ కేసు వివరాలను డీసీపీ–2 విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలను ప్రభుత్వం న్యూఢిల్లీకి చెందిన జేపీ గ్రూప్‌కు అప్పగించిన సంగతి తెలి సిందే. అయితే ఆ సంస్థ నుంచి తాము సబ్ కాం ట్రాక్ట్ పొందినట్లు కొందరు వ్యక్తులు తప్పుడు కాంట్రాక్ట్ కాపీలను చూపుతూ కృష్ణా జిల్లాలోని వివిధ రీచ్‌ల వద్ద హల్చల్ చేస్తున్నట్లు జేపీ గ్రూప్ కు తెలిసింది. దీనిపై ఆరా తీసేందుకు జేపీ గ్రూప్ ఫైనాన్స్ మేనేజర్ విశ్వనాథన్ సతీష్ రంగంలోకి దిగారు. విజయవాడ రూరల్ గొల్లపూడి మైలు రాయి సెంటర్ సమీపంలోని పంట కాలువ రోడ్లో ఒక ఇంట్లో ఉంటున్న కొప్పురావూరి ప్రవీణ్‌కుమార్, మల్లంపాటి శ్రీనివాసరావు, ముక్కొల్లు నాగమల్లేశ్వరరావును కలిశారు. తాము హైదరాబాద్‌కు చెందిన సుధాకర ఇన్ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులమని విశ్వనాథన్ సతీష్‌తో ముగ్గురు పరిచయం చేసుకున్నారు. ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు జేపీ గ్రూప్ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న ట్లు రెండు జిరాక్స్ కాపీలను ఆయనకు చూపించారు. వాటిని పరిశీలించిన విశ్వనాథన్ సతీష్ అవి నకిలీ పత్రాలుగా గుర్తించి ఈ నెల 3న విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు 420, 465, 467, 471 రెడ్ విత్ 120(బి) ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఈ క్రమంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు డీసీపీ–2 విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో పశ్చిమ మండల ఏసీపీ కె.హనుమంతరావు, భవానీపురం ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ డీకేఎన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభమైంది. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు చేపట్టి తూర్పుగోదావరి జిల్లా కరప మండలం నడకుదురుకు చెందిన కనుకుర్తి రామకృష్ణ చంద్రశేఖర్ (29)ని అరెస్ట్ చేశారు. నిందితుడు 2016 నుంచి 18 వరకు హైదరాబాద్‌లో ఒక ఫార్మాసూ్యటికల్ కంపెనీలో పనిచేశాడు. ఆ సమయంలో కంపెనీకి రావాల్సిన సొమ్మును తెలం గాణ ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి స్వాహా చేశాడు. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లాడు. రామకృష్ణ చంద్రశేఖర్ మరికొన్ని మోసాలు.. హైదరాబాద్‌కు చెందిన కె.సురేంద్రనాథ్, వెలంపల్లి రఘు నరసింహరాజు ఇసుక రీచ్‌ల కాంట్రాక్టులు తీసుకోవాలని భావించి తమ మిత్రుడు తిరుమలరెడ్డిని సంప్రదించారు. తిరుమలరెడ్డి తన స్నేహితుడు లోకాభిరాముడుకు విషయం చెప్పారు. దీంతో లోకాభిరాముడు.. రామకృష్ణ చంద్రశేఖర్ ఈ పనిచేయించగలడని తెలిపారు. ఈ పరిస్థితిని సావకాశంగా తీసుకున్న చంద్రశేఖర్ వారందర్నీ బురిడీ కొట్టిం చాడు. సురేంద్రనాథ్, నరసింహరాజుల నుంచి రూ.5.40 కోట్లు వసూలు చేశాడు. తెలంగాణలో ఈఎస్ఐ ఆస్పత్రులకు మందుల సరఫరా కాంట్రా క్టు ఇప్పిస్తానని చెప్పి ఫార్మా కంపెనీలను నమ్మించి రూ.12 లక్షలు కొల్లగొట్టాడు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి లోకాభిరాముడి కుమారుడికి భారత్‌మాల ప్రాజెక్టులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.10 లక్షలు దండుకున్నాడు. లోకాభిరాముడికి ప్రభుత్వ భూములను లీజుకు ఇప్పిస్తానని చెప్పి రూ.45 లక్షలు వసూలు చేశాడు. -
గాంధీ మునిమనుమరాలికి ఏడేళ్ళ జైలుశిక్ష
డర్బన్: జాతిపిత మహాత్మగాంధీ మునిమనుమరాలు 56 ఏళ్ల ఆశిష్ లతా రాంగోబిన్ ఫోర్జరీ కేసులో అరెస్టయ్యారు. విచారణ జరిపిన డర్బన్ కోర్టు సోమవారం లతా రాంగోబిన్‌ను దోషిగా పేర్కొంటూ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఆమె 2015లో ఎస్ఆర్ మహారాజ్ అనే వ్యక్తి నుంచి ఆర్6.2 మిలియన్ డాలర్లు అడ్వాన్స్ గా తీసుకుని ఇండియా నుంచి వచ్చే అనధీకృత వస్తువులకు కస్టమ్స్ డ్యూటీస్ క్లియర్ చేస్తానని మాటిచ్చారు. దానికి బదులుగా లాభాల్లో వాటా ఇస్తానని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. అయితే లతా రాంగోబిన్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్, ఇన్వాయిస్లు ఫ్రాడ్ ఉందని.. సంతకాలు కూడా ఫోర్జరీ చేశారని తేలింది. అంతేగాక ప్రతీ డాక్యుమెంట్లోనూ భారత్ నుంచి మూడు కంటైనర్ల లినెన్ వస్తుందని చెప్పి ఆమె మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2015లోనే లతా గోబిన్‌కు వ్యతిరేకంగా ట్రయల్ ప్రారంభమైంది. కంపెనీని మోసం చేశారన్న అభియోగాలతో నేషనల్ ప్రోసిక్యూటింగ్ అథారిటీ ఆశిష్ లతాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి ఈ కేసు విచారణ జరుగుతూ వస్తుంది. తాజాగా మరోసారి కోర్టులో విచారణకు రాగా.. ఈ కేసులో లతా రాంగోబిన్ దోషిగా తేలడంతో సోమవారం డర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. చదవండి: గూగుల్‌కు భారీ జరిమానా -
Loan App: నకిలీ లెటర్‌తో రూ.కోటి కొట్టేశాడు..!
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ మైక్రోఫైనాన్సింగ్ వ్యవహారాలకు పాల్పడిన లోన్ యాప్స్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఓ పక్క ఈ కేసుల దర్యాప్తు పూర్తి చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేశారు. మరోపక్క కొత్త ఎత్తు వేసిన ఓ సైబర్ నేరగాడు పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాను డీ–ఫ్రీజ్ చేయించాడు. అందులో ఉన్న రూ.1.18 కోట్లు ఓ వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేశాడు. దీనిపై సోమవారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో అక్రమ వ్యవహారాలకు పాల్పడ్డ 32 కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలను గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు రూ.400 కోట్లకుపైగా ఫ్రీజ్ చేశారు. ఈ ఖాతాల్లో కోల్‌కతాలోని ఐల్‌పోరే ప్రాంతంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులోది కూడా ఉంది. ఈ ఖాతాను పోలీసులు గత ఏడాది డిసెంబర్లో స్తంభింపచేశారు. అయితే ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించి.. తాను ఎస్ఐగా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రాసినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. వీటిని ఆ మేనేజర్‌కు అందించి ఖాతాను డీ–ఫ్రీజ్ చేయించాడు. ఆపై గత నెల 13నరూ.1,18,70,779 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆనంద్ జన్ను పేరుతో ఉన్న ఖాతాలోకి బదిలీ చేసి స్వాహా చేశాడు. గత నెల 20 మరికొంత మొత్తం ట్రాన్స్ఫర్ చేయించడానికి ప్రయత్నించాడు. దీనిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.దీంతో బ్యాంకు రీజనల్ మేనేజర్‌కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: భార్యాభర్తల తరహాలో జీవితం.. మూడుసార్లు అబార్షన్: నటి చాందిని -
సాక్షి ఎఫెక్ట్: మాయలేడి అరెస్టు
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగాలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం.. పెళ్లి సంబంధాల పేరిట పలువురిని మోసగించి రూ.80 లక్షలకు పైగా సొమ్మును కాజేసి మూడు నెలలుగా పరారీలో ఉన్న మాయలేడి కొప్పుల రమాదేవిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. మాయలేడి మాయలపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో పోలీసు కమిషనర్ ఆమె ఆచూకీని కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లో రమాదేవి తలదాచుకున్నారన్న సమాచారం మేరకు ఆమె కదలికలపై పెనమలూరు పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి నగరానికి చేరుకున్న నిందితురాలు బుధవారం ఉదయం కోర్టులో లొంగిపోవాలని నిర్ణయించుకుని, ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంది. అయితే సూర్యారావుపేటలోని ఓ ప్రాంతంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లి, కుమారుడు, కుమార్తె కలిసి.. గతంలో తనతో కలిసి రియల్ఎస్టేట్ వ్యాపారం చేసిన కానూరుకు చెందిన ఒక మహిళ కుమారుడు, కుమార్తెకు హైకోర్టు, నీటిపారుదల శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.19.90 లక్షలు కాజేసింది. ఈ ఘటనలో రమాదేవికి ఆమె కుమారుడు నాని, కుమార్తె దివ్యశ్రీలు సహకారం అందించారు. అనంతరం ముగ్గురు కలిసి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీని ఇచ్చారు. తర్వాత విచారణలో ఆ ఆర్డరు కాపీలు నకిలీవని తేలడంతో బాధితురాలు తాను మోసపోయినట్లు గ్రహించి ఈ ఏడాది ఫిబ్రవరి 2న పెనమలూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రమాదేవితోపాటు ఆమె కుమార్తె దివ్యశ్రీ, కుమారుడు నానిలపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వారు పరారీలో ఉన్నారు. బుధవారం నాటకీయంగా పోలీసులు అరెస్టు చేసినా.. ఆమె కుమారుడు, కుమార్తె పరారీలోనే ఉన్నారు. నిందితురాలిని గురువారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పెనమలూరు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. చదవండి: ‘మాయలేడి’ మామూలుది కాదు.. లక్షల కాజేసి.. మున్నా నేర చరిత్ర.. కేరాఫ్ విజయవాడ -
పోలీసుల అదుపులో కిలాడీ లేడీ..
సాక్షి, విజయవాడ: అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి అనేక రకాలుగా మోసగించి రూ. లక్షలు కాజేసిన కిలాడీ లేడి రమాదేవి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలు వసూలు చేసి రమాదేవి పరారైంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిఘా పెట్టారు. చీటింగ్‌కు సహకరించిన రమాదేవి కొడుకు, కూతురిని పోలీసులు విచారిస్తున్నారు. రమాదేవిపై పెనమలూరు, సత్యనారాయణపురం పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. చదవండి: ‘మాయలేడి’ మామూలుది కాదు.. లక్షల కాజేసి.. -
‘మాయలేడి’ మామూలుది కాదు.. లక్షల కాజేసి..
సాక్షి, అమరావతి బ్యూరో: అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి అనేక రకాలుగా మోసగించి రూ. లక్షలు కాజేసి పరారీలో ఉన్న మాయలేడి కోసం నగర పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లాలోని మైలవరం, విజయవాడ నగరంలోని పలువురు ఈ మాయలేడి బారిన పడి రూ.లక్షలు నష్టపోయిన వైనంపై మంగళవారం సాక్షి దినపత్రికలో ‘మాయలేడితో ఖాకీల మిలాఖత్!’ అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. ఈ వార్తపై తక్షణం స్పందించిన నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు సత్వర చర్యలు చేపట్టారు. చట్టపరంగా నిందితురాలికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పరారీలో ఉన్న మాయలేడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మాయలేడిపై ఉన్న కేసుల వివరాలు.. ∙విజయవాడలోని మధురానగర్‌కు చెందిన ఒక మహిళ, ఆమె కుమార్తె, కుమారుడిపై విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌లోని పలు పోలీస్స్టేషన్లతో పాటు జిల్లాలోని మైలవరం పోలీసుస్టేషన్లో పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. మైలవరం పట్టణానికి చెందిన ఓ మహిళ వద్ద నుంచి రియల్ఎస్టేట్ వ్యాపారం పేరిట రూ. 28 లక్షలు మాయమాటలు చెప్పి కాజేసింది. ఈ విషయంలో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసుస్టేషన్లో 2019లో 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో అండర్ ట్రైల్ నడుస్తోంది. ∙2017 మే నెలలో కూడా బాధితురాలిని కొట్టి, బెదిరించిన కేసులోనూ మాయలేడిని సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసూ కోర్టు అండర్ ట్రైల్లో ఉంది. పెనమలూరుకు చెందిన ఓ నిరుద్యోగికి హైకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి రూ. 24 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ ఇచ్చిన వ్యవహారంలోనూ 2020 డిసెంబరులో పెనమలూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న మాయలేడిని జనవరి 11న హైదరాబాద్‌లో మెహదీపట్నం ఫ్లై ఓవర్ సమీపంలో పెనమలూరు పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌ను విజయవాడ ఆరో అదనపు ఎంఎం కోర్టు జడ్జి రిటర్న్ చేయడంతో ఆమె స్టేషన్‌బెయిల్‌పై విడుదలైంది. తర్వాత తనతో కలిసి రియల్ఎస్టేట్ వ్యాపారం చేసిన కానూరుకు చెందిన ఒక మహిళను సైతం పైవిధంగానే మోసం చేసింది. బాధితురాలి కుమారుడు, కుమార్తెకు హైకోర్టు, నీటిపారుదుల శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి నకిలీ అపాయింట్మెంట్ ఇచ్చి రూ. 19.90 లక్షలు కాజేసింది. అనంతరం మోసపోయిన విషయం తెలుసుకున్న మహిళ ఫిర్యాదుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సస్పెక్ట్ షీట్... పదే పదే మాయమాటలతో ప్రజలను మోసగిస్తున్న మాయలేడిని పలుమార్లు నగర పోలీసులు హెచ్చరించినప్పటికీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో ఆమెపై పెనమలూరు పోలీసులు ఈ ఏడాది మార్చి 23న సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. వైట్ కాలర్ నేరాల్లో ఆరితేరిన ఒక మహిళపై ఇలాంటి షీట్ ఓపెన్ చేయడం కమిషనరేట్ పరిధిలో ఇదే ప్రప్రథమం. కాగా మాయలేడి తన భర్తపైనే పెనమలూరు పోలీసుస్టేషన్లో 498 కేసు పెట్టింది. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.. పెనమలూరు పోలీసుస్టేషన్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో మాయలేడిపై మరోమారు చీటింగ్ కేసు నమోదు చేశాం. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉంది. కోవిడ్ నేపథ్యంలోనూ ఆమెను అరెస్టు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఆమెను పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – బత్తిన శ్రీనివాసు చదవండి: పండ్ల మార్కెట్‌కు వెళ్లిన వ్యక్తి.. బావిలో శవమై..! -
కేటుగాళ్ల మాయ.. 19 లక్షలు స్వాహా
సాక్షి, ఆదిలాబాద్ : ఉద్యోగం ఇప్పిస్తామంటూ డబ్బులు కాజేసిన ఘటన నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం బాధితుడు రాజన్న, మంచిర్యాల రూరల్ సీఐ కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని సీసీసీ కార్నర్ రామ్‌నగర్‌లో నివాసం ఉంటూ గంధం రాజన్న మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్‌లో పని చేస్తున్నాడు. కరీంనగర్లో నివాసం ఉండే దూరపు బంధువులు ముద్దసాని అన్వేష్, ముద్దసాని అభిలాష్ అనే అన్నదమ్ములు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ రాజన్నను నమ్మబలికారు. అభిలాష్ ఏ పని లేకుండా తిరుగుతుండగా.. అన్వేష్ కరీంనగర్‌లోని జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అన్వేష్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో నమ్మిన రాజన్న అన్నదమ్ములు ఇద్దరికి విడతల వారీగా మొత్తం రూ. 19 లక్షల 80వేలు ముట్టజెప్పాడు. బాధితుడికి నకిలీ జాయినింగ్ లెటర్.. రాజన్న తన ఉద్యోగం విషయం అన్నదమ్ములను పలుమార్లు అడుగడంతో కేటుగాళ్లు ఏకంగా నకిలీ జాయినింగ్ లెటర్ సృష్టించారు. కరీంనగర్ జిల్లా గంగాధర ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చిందని, 17–07–2020న ఉదయం 10.30 నిమిషాలకు రిపోర్ట్ చేయాలని, గంగాధర తహసీల్దార్ కార్యాలయం స్టాంప్, తహసీల్దార్ సంతకంతో కూడిన ఒక నకిలీ పత్రాన్ని సృష్టించారు. అయితే రాజన్న అది నకిలీ పత్రమని గుర్తించి తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వమని వారిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. వారు స్పందించకపోవడంతో రాజన్న మోసపోయానని గ్రహించి సీసీసీ నస్పూర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల రూరల్ సీఐ కుమారస్వామి తెలిపారు. చదవండి: ఓఎల్ఎక్స్ మోసం.. దొంగ దొరికేశాడుగా! -
ఓఎల్ఎక్స్ మోసం.. దొంగ దొరికేశాడుగా!
సాక్షి, కుత్బుల్లాపూర్: ఓఎల్ఎక్స్ వేదికగా మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిని పేట్ బషీరాబాద్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సుచిత్ర సమీపంలోని కృష్ణమూర్తినగర్‌కు చెందిన ఇవాన్ రాజు ఫ్లూటర్ ఇనిస్టిట్యూట్ ఉద్యోగి. కాగా ఏప్రిల్ 20న ఓఎల్ఎక్స్ యాప్‌లో ఓ వ్యక్తి ప్లే స్టేషన్–5 అనే వస్తువును విక్రయానికి పెట్టగా అది చూసిన ఇవాన్‌రాజు తన ఫోన్ నంబర్‌ను షేర్ చేశాడు. వెంటనే అతడికి రంజిత్‌రెడ్డి (ఫోన్ నం. 790837947)అనే వ్యక్తి కాల్ చేశాడు. గూగుల్ పే ద్వారా అకౌంట్ నం. 6281673654కు రూ.15 వే లు పంపితే ‘ప్లే స్టేషన్–5’ను పంపుతానని చెప్పా డు. అంతేకాకుండా తన ఆధార్ కార్డు ఫొటోను సైతం షేర్ చేశాడు. దీంతో అతడిపై నమ్మకం కలిగి ఇవాన్‌రాజు రూ.15 వేలు పంపాడు. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చుల నిమిత్తం మరో రూ.6,500 పంపాలని కోరగా.. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం డెలివరీ బాయ్ నంబర్ అంటూ 830 9520268 పంపాడు. అయితే, సదరు వస్తువును ఎంతకీ డెలివరీ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు గత నెల 25న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు న మోదు చేశారు. ఫోన్ నంబర్, ఆధార్ కార్డుల ఆధా రంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోసానికి పా ల్పడిన వ్యక్తి బాగ్అంబర్పేట్ రామకృష్ణనగర్‌కు చెందిన రంజిత్‌గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశానుసారం రంజిత్‌ను సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
గత ఏడాది భారీగా పెరిగిన డిజిటల్ మోసాలు
ముంబై: భారత్‌ను కేంద్రంగా చేసుకుని డిజిటల్ లావాదేవీల ద్వారా వ్యాపార సంస్థలను మోసం చేసే ఉదంతాలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో గతేడాది ఇలాంటి సందేహాస్పద యత్నాలు 28 శాతం పెరిగినట్లు ట్రాన్స్‌యూనియన్ వెల్లడించింది. ఈ తరహా కేసులు అత్యధికంగా ముంబైలో ఉండగా.. ఢిల్లీ, చెన్నై తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ‘మోసగాళ్లు సాధారణంగా చెప్పుకోతగిన ప్రపంచ పరిణామాల నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు. కోవిడ్-19 మహమ్మారి, డిజిటల్ వినియోగం పెరగడం ఈ ఆన్లైన్ యుగంలో కీలక పరిణామంగా మారింది. మోసగాళ్లు దీన్నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేశారు‘ అని ట్రాన్స్‌యూనియన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షాలీన్ శ్రీవాస్తవ తెలిపారు. 2021 మార్చి 10 నాటికి కోవిడ్-19ని మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించి ఏడాది పూర్తయ్యింది. అంతక్రితం ఇదే వ్యవధితో పోలిస్తే డిజిటల్ మోసాల ప్రయత్నాలు 28 శాతం పెరిగాయని పేర్కొన్నారు. 40,000 పైగా అంతర్జాతీయ వెబ్సైట్లు, యాప్స్‌పై జరిగిన వందల కోట్ల లావాదేవీల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపారు. లాజిస్టిక్స్ రంగంలో మోసాల యత్నాలు అత్యధికంగా 224 శాతం మేర పెరగ్గా, టెలికం (200 శాతం), ఆర్థిక సేవలు (89 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మహమ్మారి కారణంగా ఆన్లైన్ షాపింగ్ పెరిగిన నేపథ్యంలో ఉత్పత్తుల డెలివరీని దారి మళ్లించడం ద్వారా మోసగించే ప్రయత్నాలు ఎక్కువగా జరిగాయి. బీమా, గేమింగ్, రిటైల్, పర్యాటకం వంటి విభాగాల్లో మాత్రం ఇలాంటి ఉదంతాలు కొంత తగ్గాయి. చదవండి: 65 కిలోమీటర్లకు కేవలం ఐదు రూపాయలే ఖర్చు! -
‘ట్రాక్టర్ బొమ్మ ఉన్న రూ.5 నోటు ఉందా.. అయితే లక్షాధికారి మీరే’
సాక్షి, కామారెడ్డి: మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్తకొత్త ఎత్తుగడలతో అమాయకులను నిండా ముంచేస్తున్నారు. తాజాగా పాత రూ. 5 నోటుకు లక్షలు ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తిని నిలుపుదోపిడీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి కస్తూరి నర్సింలుకు ఈనెల 1న ఓ ఫోన్‌కాల్ వచ్చింది. మీ దగ్గర ట్రాక్టర్ బొమ్మ ఉన్న పాతకాలంనాటి రూ.ఐదు నోటు ఉంటే రూ. 11.74 లక్షలు ఇస్తామని, లక్షాధికారి మీరేనని నమ్మించారు. దీనిని నమ్మిన నర్సింలు.. తన వద్ద ట్రాక్టర్ బొమ్మ ఉన్న రూ. 5 నోటు ఉందని వారితో చెప్పాడు. అకౌంట్ ఓపెన్ చేయాలని, ఎన్వోసీ అని, ఐటీ క్లియరెన్స్ అని మోసగాళ్లు పలు దఫాలుగా డబ్బులు పంపించమన్నారు. నిజమే కావచ్చని నమ్మిన నర్సింలు పది విడతల్లో రూ. 8.35 లక్షలు వారు చెప్పిన వ్యాలెట్లు, అకౌంట్లలో జమ చేశాడు. ఇంకా డబ్బులు పంపించాలని వారు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి శుక్రవారం దేవునిపల్లి పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని దేవునిపల్లి ఎస్సై రవికుమార్ తెలిపారు. వచ్చిన ఫోన్‌కాల్ పశ్చిమబెంగాల్‌కు చెందినదిగా గుర్తించామన్నారు. బంపర్ డ్రాలు, బహుమతుల పేరిట వచ్చే ఫోన్‌కాల్స్‌ను ప్రజలు నమ్మవద్దన్నారు. చదవండి: మాస్క్ పెట్టుకోలేదారా.. ఇన్స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు! టెకీ ఘనకార్యం; పెళ్లి పేరుతో ఇంటికి రప్పించుకొని.. -
నిత్య పెళ్లికొడుకు :పెళ్లి పేరుతో 9 మంది మహిళలకు వల
-
నిత్య పెళ్లికొడుకు: ఒకరిద్దరు కాదు.. ఏకంగా 9 మంది..
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 9 మంది మహిళల్ని మోసగించిన నయవంచకుడి కథ విశాఖలో వెలుగులోకి వచ్చింది. గంజాయి రవాణా చేస్తూ, మహిళలను లోబరచుకుని.. వారిని వ్యభిచారం చేయాలని బెదిరిస్తున్న మోసగాడు అరుణ్‌కుమార్ ఉదంతమిది. ఏ అండా లేని మహిళలను తోడుగా ఉంటానని కొందరిని, పెళ్లి చేసుకుంటానని చెప్పి కొందరిని లోబరచుకున్నాడు. కొందరిని పెళ్లి చేసుకున్నాడు. గంజాయి రవాణా కేసులో, మహిళల్ని మోసగించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అతడి అరాచకాలను తట్టుకోలేని బాధిత మహిళలు పోలీసుల్ని ఆశ్రయించారు. మహిళా చేతన కార్యదర్శి కె.పద్మ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతడి బండారం బట్టబయలైంది. పోలీసుల విచారణలో అరుణ్‌కుమార్ అరాచకాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు, బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ధనాల అరుణ్‌కుమార్ (33) చిన్నతనంలోనే విశాఖలో అమ్మమ్మ ఇంటికి వచ్చేశాడు. గంజాయి రవాణా చేయసాగాడు. మహిళలను ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి లోబరచుకునేవాడు. తాను పెద్ద వ్యాపారినని చెప్పి కొందరిని మోసం చేశాడు. తను చెప్పినట్లు వినకపోతే కత్తితో చంపేస్తానని బెదిరించేవాడు. ఇప్పటివరకు 9 మంది మహిళలను పెళ్లి పేరుతో మోసం చేసి.. వ్యభిచారం రొంపిలోకి దించే ప్రయత్నం చేశాడు. గతంలో అనకాపల్లికి చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేసి ఒకసారి, గంజాయి రవాణా కేసులో రెండుసార్లు జైలుకి వెళ్లాడు. గతంలో మహిళల అక్రమ రవాణా కేసులో కూడా నిందితుడు. అరుణ్‌కుమార్‌పై కేసు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై డీజీపీ గౌతం సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బందిపై ఆయన దర్యాప్తునకు ఆదేశించారు. బాధితులు వీరే.. నర్సీపట్నంలో ఇద్దరు పిల్లలున్న 40 ఏళ్ల మహిళకు గంజాయి వ్యాపారం అలవాటు చేసి భర్త నుంచి దూరం చేశాడు. వ్యాపారంలో వాటా ఇస్తానని నమ్మించి మోసం చేశాడు. చింతపల్లి సమీప గ్రామంలో 18 ఏళ్ల యువతిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. డబ్బు సంపాదించమంటూ ఒత్తిడి తెచ్చిన అతడిని దూరం పెట్టేందుకు ప్రయత్నించిన ఆమెను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. కొబ్బరితోట ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల మహిళతో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు అందింది. యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. వ్యభిచారం చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తుండడంతో ఆమె మహిళా సంఘాలను ఆశ్రయించింది. మృతిచెందిన తన స్నేహితుడి భార్యను లొంగదీసుకున్నాడు. వ్యభిచారం చేయకపోతే చంపేస్తాననడంతో ఆమె కూడా మహిళా సంఘాలకు తన కష్టాన్ని తెలిపింది. వీరే కాకుండా మరో నలుగురు మహిళలను పెళ్లి చేసుకుని, వ్యభిచారం చేయమని వేధిస్తున్నాడు. బాధిత మహిళలతో కలిసి బుధవారం విశాఖలో విలేకరులతో మాట్లాడిన మహిళా చేతన కార్యదర్శి కె.పద్మ.. నిత్య పెళ్లికొడుకు అరుణ్‌కుమార్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకాధికారితో విచారణ మార్చి 18న వాట్సాప్ ద్వారా సీపీ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు వచ్చింది. కంట్రోల్ రూమ్ నుంచి కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌కి కేసు పంపించారు. కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నెం.207/2021 నమోదు చేశారు. దిశా పోలీస్‌స్టేషన్‌లో ఫిబ్రవరి 18న అరుణ్‌కుమార్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. వ్యభిచారం, గంజాయి రవాణా కేసులో అరుణ్‌కుమార్‌ను 2020 జూలైలో అనకాపల్లి టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి, నర్సీపట్నంలో అమ్మాయిలను మోసం చేసిన కేసులో అరెస్టయి.. ఈ ఏడాది ఫిబ్రవరి 17న బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారిగా డీసీపీ–1 ఐశ్వర్య రస్తోగిని నియమించాం. – మనీష్‌కుమార్ సిన్హా, విశాఖ సీపీ -
మహిళలే టార్గెట్: పరిచయాలు పెంచుకుని..
ఏలూరు టౌన్(పశ్చిమగోదావరి): మహిళలతో పరిచయాలు పెంచుకుంటాడు... ఆయుర్వేద డాక్టర్, ఫైనాన్స్ వ్యాపారం, బిజినెస్ అంటూ మాయమాటలు చెప్పి మహిళలకు మత్తు బిళ్ళలు ఇచ్చి వారినుంచి బంగారు అభరణాలు, నగదు కాజేస్తుంటాడు. లక్షలు దోచుకోవడం, జల్సాలు చేయటం లక్ష్యంగా పెట్టుకున్నాడు చేపూరు చంద్రబాబు అలియాస్ శేఖర్ రెడ్డి అలియాస్ వంశీకృష్ణ. ఏలూరులో ఇదే తరహాలో మోసానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఏలూరులోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం ఎస్పీ కే.నారాయణ నాయక్ వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కోట మండలం శ్యాంసుందరపురానికి చెందిన చేపూరు చంద్రబాబు పలు మోసాలకు పాల్పడేవాడు. రియల్ ఎస్టేట్, బిజినెన్స్, ఫైనాన్స్, ఆయుర్వేదిక్ డాక్టర్ అని పరిచయం చేసుకుని మహిళల నగలు, నగదును కాజేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. తాను దొరికిపోకుండా ఆధార్‌కార్డులు నకిలీవి తయారు చేసుకుని వాటిని వినియోగించేవాడు. ఒక్కొక్కకరికి ఒక్కో సిమ్ వాడడం అతని ప్రత్యేకత. గత కొన్నేళ్ళుగా నెల్లూరు, తిరుపతి, నాయుడుపేట, గుంటూరు, కృష్ణాజిల్లాలోనూ అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఇంతవరకూ సుమారుగా 20కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉండటమే కాదు, శిక్షలు కూడా అనుభవించాడు. నెల్లూరు జిల్లా కోట పోలీస్‌స్టేషన్‌లో డీసీ షీట్ కూడా తెరిచారు. చోరీ సొత్తు విలువ రూ.9 లక్షలపైనే టూటౌన్ స్టేషన్ పరిధిలోని తంగెళ్ళమూడి ఎంఆర్సీ కాలనీకి చెందిన మహిళ, కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన ఒక మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏలూరు తంగెళ్ళమూడికి చెందిన మహిళను మోసం చేసిన కేసులో 60.30 గ్రాములు బంగారు ఆభరణాలు, గన్నవరానికి చెందిన మహిళ కేసులో 40.83 గ్రాములు బంగారు ఆభరణాలు, నరసరావుపేటలో నమోదైన కేసులో 74.43 గ్రాముల బంగారం, కృష్ణా జిల్లా వీరవల్లి స్టేషన్లో నమోదైన కేసులో 47.48 గ్రాముల బంగారుం స్వా«దీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 9 లక్షలకుపైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. డీఎస్పీ దిలీప్‌కిరణ్ పర్యవేక్షణలో టూటౌన్ సీఐ ఆదిప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నిందితుడు చేకూరి చంద్రబాబును అరెస్టు చేశారు. కేసును చేదించడంలో సహకరించిన పోలీస్ సిబ్బంది రాజేష్, సూర్యనారాయణలను ఎస్పీ అభినందించి బహుమతి అందించారు. దర్యాప్తులో ఎస్సైలు ఎన్ఆర్ కిషోర్‌బాబు, నాగబాబు ఉన్నారు. చదవండి: మగవాళ్లు ఆడవాళ్లుగా.. హోలీ సంబరాల్లో వింత ఆచారం రాజమహేంద్రవరంలో ‘టక్ జగదీష్’ -
అక్రమాలకు పాల్పడ్డ బ్యాంకు ఉద్యోగి రంగాచారి
-
‘ఎల్ఐసీ’ పేరుతో నయాదందా
మిర్యాలగూడ : అమాయకులను ఆసరాగా చేసుకొని సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బీమా ప్రీమియంల పేరుతో మిర్యాలగూడలో కొంతమంది ఏజెంట్లు నయాదందా కొనసాగిస్తున్నారు. ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాలతో పాటు వివరాలను చోరీ చేసి ఎల్ఐసీ పాలసీలను సృష్టించారు. తన బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము ఖాళీ అయిన తర్వాత బాధితుడు ఆరా తీస్తే అసలు నిజాలు వెలుగు చూశాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేటకు చెందిన కందుకూరి భాస్కర్‌కు స్థానిక ఎస్బీఐ బ్రాంచిలో ఖాతా ఉంది. కాగా తన ఖాతాలో నుంచి 2020 నవంబర్ 30న రూ.2,692, డిసెంబర్ 28న రూ.2,692 చొప్పున రూ.5,384 కట్ అయ్యాయి. కాగా తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు తెలుసుకుని ఏటీఎం ద్వారా మినీ స్టేట్మెంట్ తీసుకుని బ్యాంకుకు వెళ్లాడు. ఎల్ఐసీ ప్రీమియంకు ఖాతా నుంచి డబ్బు చెల్లించినట్లు బ్యాంకు అధికారులు అతడికి తెలియజేశారు. ఎల్ఐసీ ప్రీమియంలు సృష్టించిన ఏజెంట్లు.. బాధితుడికి ఎల్ఐసీ బీమా లేదు. కానీ తన బ్యాంకు ఖాతా నుంచి ఎల్ఐసీ పాలసీలకు ఎలా చెల్లింపులయ్యాయనే విషయాన్ని తెలుసుకునేందుకు స్థానిక ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లాడు. ఆయనకు అక్కడ విస్తుపోయే నిజాలు తెలిశాయి. తన పేరున పది పాలసీలు ఉన్నాయని అక్కడి అధికారులు పాలసీ నంబర్లు 649641055 నుంచి 649641064 వరకు వరుసగా ఇచ్చారు. ఎనిమిది పాలసీలకు నెలకు రూ.274, రెండు పాలసీలకు రూ.250 చొప్పున రెండు నెలల పాటు చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని చిలుకలూరిపేటకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్, స్థానిక డీఓ ద్వారా పాలసీ ప్రీమియంలు తీసుకున్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు.. తన బ్యాంకు ఖాతాలోని సొమ్ము కాజేసి ఫోర్జరీ సంతకాలతో ఎల్ఐసీ ప్రీమియంలు చెల్లించారని బాధితుడు భాస్కర్ 2021 జనవరి 5న వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అతడికి రశీదు కూడా ఇచ్చారు. తర్వాత ఈ నెల 1వ తేదీన బాధితుడి నుంచి మరోసారి ఫిర్యాదు తీసుకుని శ్రీనివాస్, సైదయ్యపై మంగళవారం నాలుగు సెక్షన్లు 420, 423, 468, 471 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
పెళ్లి పేరుతో రూ.11కోట్లకు నకిలీ ఐపీఎస్ మోసం
సాక్షి, హైదరాబాద్: తాను ఐపీఎస్ అధికారిని చెప్పి.. మా చెల్లితో పెళ్లి చేయిస్తానని చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ.11 కోట్లు వసూలు చేసిన ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి నుంచి ఆమె తీసుకున్న ఖరీదైన కార్లు, కోట్ల విలువైన ఆస్తుల వివరాలు తెలిసి పోలీసులే షాకయ్యారు. ఈ మోసాలు తన బంధువుతో కలిసి ఆమె చేసింది. ఆమెను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. శ్రుతిసిన్హా అనే యువతి ఐపీఎస్ అధికారిణిగా చలామణీ అవుతోంది. ఈ క్రమంలో వీరారెడ్డి అనే వ్యక్తిని కలిసింది. అతడి సోదరుడికి తన చెల్లిని ఇచ్చి వివాహం చేస్తానని శ్రుతిసిన్హా నమ్మించింది. ఈ క్రమంలో అతడి వద్ద నుంచి రూ.11 కోట్ల వరకు వసూలు చేసింది. ఆమె తన బంధువు విజయ్‌కుమార్ రెడ్డితో కలిసి మోసానికి పాల్పడింది. అయితే నెల రోజుల కిందట విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వ్యవహారం బయటకు పొక్కింది. వీరారెడ్డితో వసూలు చేసిన డబ్బుతో ఖరీదైన కార్లను శ్రుతి కొనుగోలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాచుపల్లి పోలీసులు శ్రుతిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిందితురాలి నుంచి 3 కార్లు, రూ.6 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె బారినపడి మోసానికి గురయిన వాళ్లు చాలా మంది ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. -
అవ్వా బాగున్నావా! నేనెవరో తెలుసా?..
పలమనేరు(చిత్తూరు జిల్లా): అవ్వా బాగున్నావా! నేనెవరో తెలుసా? నీ కొడుకు ఫ్రెండ్‌ని.. అంటూ మాటలు కలిపి నగలు, నగదును దోచుకుంటున్న సంఘటనలు ఇటీవల జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనే పలమనేరులోనూ వెలుగుచూసింది. ఎస్ఐ నాగరాజు కథనం... గంగవరం మండలం కలిమిచెట్లపెంటకు చెందిన మునిరత్నమ్మ(65) సొంతపనిపై పలమనేరుకు మంగళవారం వచ్చింది. బజారువీధిలో వెళుతుండగా ఓ అపరిచితుడు ఆమెతో మాటలు కలిపాడు. తనది చిత్తూరని, మీ కొడుకు ఫ్రెండ్‌నంటూ చెప్పాడు. అంతేకాకుండా అర్జెంట్‌గా తన తల్లి మునిరత్నమ్మ వద్ద రూ.20 వేలు తీసుకుని రావాలని తనను పంపాడంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి: కారుతో గుద్ది చంపేస్తాం) మనవరాలికి ఆరోగ్యం బాగాలేక ఆమె కొడుకు చిత్తూరుకు వెళ్లిఉండడంతో ఆమె నిజమేనని భావించింది. డబ్బులు లేవని చెప్పి, తన చెవిలోని కమ్మల్ని అక్కడే ఉన్న కుదువ దుకాణంలో రూ.25వేలకు తాకట్టు పెట్టింది. రూ.5వేలను తాను ఉంచుకుని రూ.20 వేలను అతనికిచ్చి పంపింది. సాయంత్రం ఇంటికి వచ్చిన కొడుక్కి ఈ విషయం చెప్పింది. అవాక్కైన అతడు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు దిగిన పోలీసులు గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తుల ఫొటోల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. చిత్తూరులోని మిట్టూరుకు చెందిన సెంధిల్‌కుమార్(35) పనేనని తేలింది. అతడిని బుధవారం అరెస్టు చేసి రూ.20 వేలను స్వాధీనం చేసుకున్నారు. పరిచయం లేని వ్యక్తుల మాటలు నమ్మి డబ్బులు, ఏటీఎం కార్డులు, నగలు లాంటివి ఇవ్వరాదని ఎస్ఐ నాగరాజు తెలిపారు.(చదవండి: పిల్లుల కోసం వల వేసినట్లు నటిస్తూ..) -
భారీ కుంభకోణం: రూ.4,837 కోట్లు ఎగవేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో భారీ బ్యాంకు రుణాల ఎగవేత కుంభకోణం వెలుగుచూసింది. దాదాపు రూ.4,837 కోట్లు రుణంగా పొంది, తిరిగి చెల్లించడంలో విఫలమైందనే ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఎఫ్.ఐ.ఆర్‌లో ఐవీఆర్సీఎల్ లిమిటెడ్, హైదరాబాద్, కంపెనీ ఎండీ ఇ.సుధీర్‌రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.బలరామిరెడ్డితోపాటు గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులపై నేరపూరిత కుట్ర, నిధుల అక్రమ తరలింపు అభియోగాలను పేర్కొంది. నగరంలోని సంస్థ కార్యాలయంతోపాటు నిందితుల ఇళ్లలో బుధవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకుంది. తమకు లోను కావాలంటూ ఐవీఆర్సీఎల్ పలు బ్యాంకులను ఆశ్రయించింది. దీంతో వీరికి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేతృత్వంలో ఐడీబీఐ, కెనరా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్, యూనియన్, ఎగ్జిమ్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులతో కలిపి కన్సార్షియంగా ఏర్పడ్డాయి. కంపెనీకి పలు దఫాలుగా భారీ రుణం ఇచ్చాయి. కానీ, తీసుకున్న రుణం తిరిగి చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. ఈ క్రమంలో బ్యాంకు ఫోరెన్సిక్ ఆడిట్లో కంపెనీ లావాదేవీల్లో పలు అవకతవకలు వెలుగుచూశాయి. దీంతో దాదాపు రూ.4,837 కోట్లు నష్టం వాటిల్లిందంటూ ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేస్తోంది. (చదవండి: ‘డీఎల్ఎఫ్’ భూ వ్యవహారంపై కౌంటర్ వేయండి) మహేష్ బ్యాంకు కేసులో తీర్పు రిజర్వు సాక్షి, హైదరాబాద్: ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఎన్నికకు పోలింగ్ నిర్వహించి, కౌంటింగ్ ప్రారంభించిన తర్వాత కొన్ని ఓట్లను లెక్కించకుండా నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ డైరెక్టర్ల బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఓట్లు లెక్కిం చి ఫలితాలు ప్రకటించేలా ఆదేశించాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బుధవారం వాదనలు వినిపించారు. -
గొంతు మార్చి రూ. 36 లక్షలు కొట్టేశాడు
టీ.నగర్ : ఆడగొంతుతో మాట్లాడి రూ.36 లక్షలు మోసగించిన నైజీరియా యువకుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై కీల్పాక్కంకు చెందిన జోసెఫ్ (48), రాయల్ ట్రేడింగ్ పేరిట సంస్థ నడుపుతున్నాడు. తన ఫేస్బుక్ పేజీలో వ్యాపార వివరాలను పొందుపరిచారు. దీన్ని గమనించిన లండన్‌కు చెందిన ఎలిజబెత్ అనే మహిళ మెసెంజర్ ద్వారా జోసెఫ్‌ను సంప్రదించి పరిచయం పెంచుకుంది. ముంబైలో రక్త క్యాన్సర్‌ను నయం చేసే ఫోలిక్ ఆయిల్ లభిస్తున్నట్లు దీన్ని కొని పంపితే నగదు చెల్లిస్తానని నమ్మబలికింది. రూ. 36 లక్షల ఫోలిక్ ఆయిల్ పంపితే ఇందుకు రూ.6 లక్షలు కమిషన్‌గా అందజేస్తానని తెలిపింది. సునీత అనే మహిళతో మాట్లాడి పంపాలని కోరింది. దీంతో జోసెఫ్ మెసెంజర్ ద్వారా సునీతతో మాట్లాడగా తన బ్యాంకు అకౌంట్‌కు రూ.36 లక్షలు జమ చేసినట్లయితే వెంటనే ఫోలిక్ ఆయిల్ పంపుతానని తెలిపారు. జోసెఫ్ ఆమె ఖాతాకు రూ.36 లక్షలు చెల్లించి సునీత, ఎలిజబెత్‌ల కోసం ఫోన్లో సంప్రదించగా వారు స్విఛాప్ చేసివున్నారు. దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్న జోసెఫ్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ముంబైలో మోసం జరిగినట్లు తెలిసింది. -
సినీ ఫక్కీలో హైటెక్ దోపిడీ..
సాక్షి, రేపల్లె: లోను ఇప్పిస్తానంటూ... సినీ పక్కీలో వ్యాపారిని ఓ దుండగుడు బురిడీ కొట్టించి దోపిడీ చేసిన ఘటన మంగళవారం పట్టణంలో వెలుగు చూసింది. సీఐ సాంబశివరావు కథనం ప్రకారం.. ఓ గుర్తు తెలియని వ్యక్తి నగరం మండలం సజ్జవారిపాలెం గ్రామంలోని లక్ష్మీ కిరాణా మర్చంట్స్ యజమాని బొలిశెట్టి నారాయణను సోమవారం కలిశాడు. తన పేరు సుబ్బారావు అని, తాను రేపల్లె పట్టణంలోని కెనరా బ్యాంక్‌లోని ఉద్యోగినని, మీకు ముద్రాలోన్ పథకం ద్వారా బ్యాంక్ నుంచి రూ.10 లక్షల రుణం ఇప్పిస్తాంటూ నమ్మబలికాడు. రేపల్లె కెనరా బ్యాంక్ వద్దకు సర్టిఫికెట్లు తీసుకురావాలని సూచించాడు. దీంతో నారాయణ, ఆయన భార్య లక్ష్మి ఇద్దరూ మంగళవారం సర్టిఫికెట్లు తీసుకుని కెనరా బ్యాంక్‌కు వచ్చారు. సుబ్బారావు వీరి కోసం బ్యాంక్ వద్ద వేచి ఉండి వీరు రాగానే ముందుగా బ్యాంక్‌లో అకౌంట్ ప్రారంభించి రూ.2.5 లక్షలు డిపాజిట్ చేయాలని వారి నుంచి సొమ్ము తీసుకుని బ్యాంక్ మేనేజర్ వద్దకు వెళ్లాడు. మీ వద్ద ఒక సర్టిఫికెట్ లేదు, దీని జిరాక్స్ తీసుకు రమ్మని నారాయణను బ్యాంక్ నుంచి బయటకు పంపాడు. నారాయణ జిరాక్స్ కాఫీ తీయించుకుని బ్యాంక్ వద్దకు వచ్చే సమయానికి ఆ వ్యక్తి (సుబ్బారావు) కనిపించకపోవటంతో బ్యాంక్ సిబ్బందితో సంప్రదించి తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. బ్యాంక్‌లోని సీసీ కెమెరా పుటేజ్‌లు పరిశీలించామన్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేల నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. -
బ్యాంకును మోసం చేసిన కేసులో పలువురి ఆస్తుల జప్తు
సాక్షి, అమరావతి: బ్యాంకు రుణాల మోసం కేసులో వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు నిమ్మగడ్డ రామకృష్ణ, నిమ్మగడ్డ వేణుగోపాల్, వీవీఎన్‌కే విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు చెందిన హైదరాబాద్, విజయవాడల్లోని 27 స్థిరాస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. ఈ స్థిరాస్తుల విలువ రూ.11.05 కోట్లు ఉంటుందని బుధవారం ఈడీ ట్వీట్ చేసింది. గుడివాడలోని ఆంధ్రా బ్యాంకు (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్) నుంచి వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ పేరు మీద 470 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నట్టు తప్పుడు కాగితాలు సృష్టించి రూ.19.44 కోట్ల రుణాలను తీసుకొని ఎగ్గొట్టారు. దీనిపై బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేయడంతో దీని ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ స్థిరాస్తులను జప్తు చేసింది. బ్యాంకు రుణం ద్వారా తీసుకున్న సొమ్మును సొంత ఖాతాలకు మరలించి స్థిరాస్తులు కొనుగోలు చేయడంతో పాటు సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం బ్యాంకుకు చెల్లించాల్సిన రుణం విలువ రూ.36.97 కోట్లకు చేరింది. జప్తు చేసిన ఆస్తుల మార్కెట్ విలువ రూ.34 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
‘అనంత’ ఆర్టీఏలో ప్రకంపనలు..
అనంతపురం సెంట్రల్: రవాణా శాఖలో జరిగిన నయా మోసం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ప్రభుత్వానికి లైఫ్‌ట్యాక్స్ చెల్లించకుండా వాహనాల రిజిస్ట్రేషన్లు చేసిన వ్యవహారంలో ఇన్చార్జ్ ఆర్టీఓ మహబూబ్‌బాషా, సీనియర్ అసిస్టెంట్ మాలిక్‌బాషాలపై సస్పెన్షన్ వేటు పడింది. మూడు రోజుల క్రితం ఈ అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన ఇన్నోవా కార్లు, ఓ షిఫ్ట్ కారు నిబంధనలకు విరుద్ధంగా లైఫ్ ట్యాక్స్ చెల్లించకుండానే ఇతరులపై రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ విషయం ఆలస్యంగా గమనించిన ఆర్టీఏ ఉన్నతాధికారులు మొత్తం ఐదు వాహనాలను గుర్తించారు. అనంతపురం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, కర్నూలు జిల్లా అవుకు ప్రాంతాల్లో వీటి యజమానులు ఉన్నట్లు తెలుసుకున్నారు. సదరు వాహనాలను సీజ్ చేసిన అధికారులు అక్రమ బాగోతంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే అంశంపై లోతుగా విచారణ చేపట్టారు. ఏజెంట్లు మాత్రమే కాకుండా కొందరు అధికారులకు తెలిసే ఈ తతంగం జరిగిందని ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో లైఫ్ ట్యాక్స్ చెల్లించకుండానే వాహనాలను రిజి్రస్టేషన్ చేసిన సీనియర్ అసిస్టెంట్ మాలిక్‌బాషా, ఇన్చార్జ్ ఆర్టీఓ మహబూబ్‌బాషాలను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వాహన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆర్టీఏ ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. -
12 కోట్లు వసూలు చేసిన నూతన్ నాయుడు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన దళిత యువకుడు పర్రి శ్రీకాంత్ శిరోముండనం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరాన్నజీవి దర్శకుడు నూతన్ నాయుడు బాగోతాలు ఒక్కొక్కటీ బయపడుతున్నాయి. అతనిపై ఇప్పటికే పలు కేసులు బయటపడగా.. తాజాగా మరో మోసం వెలుగుచూసింది. ఉద్యోగం పేరిట నూతన్‌నాయుడు 12 కోట్ల రూపాయలను వసూలు చేశాడని ఆరోపిస్తూ మహారాణి పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్బీఐలో రీజినల్ డైరెక్టర్ ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి 12 కోట్లు వసూలు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన విశాఖ డీసీపీ ఐశ్వర్య రస్తోగి ఫిర్యాదుపై లోతైన విచారణ జరుపుతామన్నారు. అవసరమైతే మరోసారి కస్టడీలోకి తీసుకుంటామని తెలిపారు. కాగా పి.వి.రమేశ్ పేరుతో పైరవీలు చేయడంపై కంచరపాలెం, గోపాలపట్నం, గాజువాక పోలీస్ స్టేషన్లలోనూ నూతన్‌పై కేసులు నమోదయ్యాయి. (కాల్ హిస్టరీ ఆధారంగా నూతన్ మోసాలపై దర్యాప్తు) నూతన్‌నాయుడు ఇంట్లో పనిచేసి మానివేసిన దళిత యువకుడు వర్రి శ్రీకాంత్‌ను సెల్‌ఫోన్ పోయిందనే నెపంతో ఇంటికి పిలిపించి శిరోముండనం చేయడంతో పాటు దారుణంగా హింసించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన 24 గంటల వ్యవధిలోనే నూతన్ భార్యతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. శ్రీకాంత్‌పై చేసిన అకృత్యాలను సెల్ఫీలు తీసి పైశాచిక ఆనందం పొందిన నిందితులు అక్కడితో ఆగకుండా వీడియోలు తీశారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. (విశాఖ సెంట్రల్ జైల్‌కు నూతన్ నాయుడు) -
మొక్కలు కావాలంటూ నమ్మించి దోపిడీ..
ఒంగోలు: ‘పెద్ద మొత్తంలో మొక్కలు కావాలి.. మీరు వచ్చి స్థలం చూస్తే ఎన్ని మొక్కలు అవసరమవుతాయనే విషయం మాట్లాడుకుందాం’ అంటూ పూలమొక్కలు అమ్ముకునే వ్యాపారిని నమ్మకంగా పిలిపించి ఓ బృందం దోపిడీకి పాల్పడింది. ఈ సంఘటన గత నెల 29వ తేదీ స్థానిక కేశవరాజుకుంట ఫ్లైఓవర్ వద్ద చోటుచేసుకోగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఒంగోలు తాలూకా పోలీసులు బుధవారం నిందితులను అరెస్టు చేశారు. ఒంగోలు రిక్షాబజార్‌లో నివాసం ఉంటున్న గుళ్లాపల్లి తిరుపతిని కేశవరాజుకుంట వద్దకు రప్పించిన దుండగులు.. అతని వద్ద ఉన్న వీవో మొబైల్, రూ.9 వేల నగదు, ఒక మోటారు బైకుతో అదృశ్యమయ్యారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న తాలూకా పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులు చినగంజాం మండలం రాజుబంగారుపాలేనికి చెందిన జగన్నాథం నాగరాజు, అదే మండలం మన్నంవారిపాలేనికి చెందిన చలాకీ రాము, చలాకీ కళ్యాణ్గా గుర్తించారు. త్రోవగుంట ఎనీ్టఆర్ విగ్రహం వద్ద నిందితులు ఉన్నట్లు సమాచారం అందడంతో తాలూకా సీఐ శివరామకృష్ణారెడ్డి సిబ్బందితో వెళ్లి దాడి చేసి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు మోటారు బైకులు, ఒక సెల్‌ఫోన్, రూ.5 వేల నగదు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు తోడ్పడిన ఐటీ కోర్‌టీం ఎస్సై నాయబ్‌రసూల్, కానిస్టేబుళ్లు మాలిక్, స్టేషన్ సిబ్బంది రామకృష్ణ, రవికుమార్, హనూక్‌లను సీఐ అభినందించారు. -
‘అప్పన్న బంగారం’కేసు: తెరపైకి కొత్త ముఖాలు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): సింహాద్రి అప్పన్న బంగారం విక్రయం పేరిట టోకరా చేసిన కేసులో కొత్త ముఖాలు వెలుగుచూశాయి. నెల్లూరు వాసి శ్రావణిని మోసం చేసిన ఈ వ్యవహారంలో ఇంత వరకు కోన హైమావతి, ఆమె తమ్ముళ్లే నిందితులని అంతా భావించారు. అయితే ఈ కేసులో కొత్తగా మరో ఇద్దరు తెరపైకి వచ్చారు. వీరిలో హైమావతి కుమారుడు నాగేంద్ర తేజ కాగా.. మరో వ్యక్తి నకిలీ బిల్లులు తయారు చేసిన రాంభుక్త వాసు. ముగ్గరు నిందితులను గోపాలపట్నం పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో డీసీపీ సురేష్‌బాబు ఈ కేసు వివరాలు వెల్లడించారు. (చదవండి: విశాఖలో విషాదం, కుటుంబం ఆత్మహత్య) నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన మద్దూరి శ్రావణి.. రూ1.44 కోట్లకు వేలంలో బంగారాన్ని కొనుగోలు చేశానని, కానీ ఇంతవరకు పంపలేదంటూ సింహాచలం దేవస్థానానికి ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా రూ.1.30 కోట్లు, రూ.14 లక్షలతో ఉన్న బిల్లులను కూడా జత చేసి పంపింది. దీంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. దేవస్థానం అధికారులు ఈ బిల్లులు నకిలీవని, అప్పటి ఈవో భ్రమరాంబ సంతకాన్ని ఫోర్జరీ చేశారని గుర్తించి గోపాలపట్నం పోలీస్ సేŠట్షన్లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో శ్రావణి కూడా తనకు జరిగిన మోసంపై సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గోపాలపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు మోసం చేసే విధానాన్ని బయటపెట్టారు. ఈ వ్యవహారంలో రూ.38,20,800 చేతులు మారినట్టు పోలీసులు గుర్తించారు. (చదవండి: అప్పన్న బంగారం పేరిట రూ.1.44 కోట్లకు టోకరా) ఇదీ అసలు కథ ఈ కేసులో ప్రధాన నిందితురాలు కోన హైమావతి అలియాస్ డెక్క హైమావతి సింహాచలంలో అల్లిక దారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడూ సింహాచలం క్షేత్రానికి వచ్చే సమయంలో శ్రావణికి హైమావతి పరిచయమైంది. దీంతో ఇటీవల దేవస్థానంలో బంగారం వేలం వేస్తారని, అయితే కరోనా నేపథ్యంలో ఓపెన్ ఆంక్షన్ వేయడం లేదని, తనకు తెలిసిన బంధువులు ఇక్కడ ఉద్యోగులుగా ఉన్నారని, తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని హైమావతి నమ్మబలికింది. దాని విలువ రూ.1.44 కోట్లు ఉంటుందని చెప్పింది. ఈ మేరకు బిల్లులు కావాలని శ్రావణి కోరగా.. రామభుక్త వాసు సహకారంతో దొంగ బిల్లులు సృష్టించి.. అప్పటి ఈవో భ్రమరాంబ సంతాకాన్ని ఫోర్జరీ చేసి వాట్సప్‌లో పంపారు. అది నమ్మిన శ్రావణి.. హైమావతి కుమారుడు డెక్క నాగేంద్ర తేజ అకౌంట్‌కు రూ.7.6 లక్షలు, హైమావతి బ్యాంకు ఖాతాకు రూ.30,60,800 బదిలీ చేసింది. ఈ నగదుతో హైమావతి తనకున్న రూ.15లక్షల అప్పులు తీర్చింది. ఓ డ్యూక్ బైక్ కొన్నారు. దుకాణం ఏర్పాటు కోసం అడ్వాన్స్ కింద సుమారు రూ.2 లక్షలు నగదు చెల్లించినట్టు గుర్తించామని డీసీపీ తెలిపారు. అంతే కాకుండా బంగారం, వెండి ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు కొనుగోలు చేశారన్నారు. ఈ మొత్తాన్ని సూళ్లూరుపేట పోలీసులు రికవరీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. రామభుక్త వాసు నకిలీ నగదు బిల్లులు తయారు చేసి, వాట్సప్ ద్వారా పంపించడం వంటి పనులు చేశాడు. ఫోర్జరీ చేసిన ఈవో సంతకాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నామని డీసీపీ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపించామని, తరువాత జ్యూడీషియల్ కస్టడీకి తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంలో దేవస్థానంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న హైమావతి తమ్ముళ్లు గోపా మధు, గోపా శేఖర్ల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఏసీపీ శ్రావన్‌కుమార్, సీఐ మళ్ల అప్పారావు, క్రైమ్ సీఐ వెంకునాయుడు, ఎస్ఐలు రఘురామ్, సునీత, కంచరపాలెం క్రైమ్ ఎస్ఐ సూరిబాబు, ఎంవీపీ క్రైమ్ ఎస్ఐ విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.4 కోట్లకు టోకరా
సాక్షి, కరీంనగర్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాడిని బుధవారం కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్‌లో హాల్లో కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామానికి చెందిన దోమల రమేశ్(30)ని కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హుజురాబాద్‌లోని డీసీఎంఎస్ కాంప్లెక్స్‌లో సివిల్ పంచాయతీలు పరిష్కరించే కార్యాలయం తెరిచాడు. జిల్లా సివిల్ కోర్టు విజిలెన్స్ అధికారిగా తనను వరంగల్ జిల్లా జడ్జి నియమించినట్లు ఉత్తర్వులు సృష్టించుకొని అమాయలను బురిడికొట్టించాడు. స్కూల్‌అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్లు నకిలీ అర్డర్లు సృష్టించి విద్యాశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, వివిధ న్యాయస్థానాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బు వసూలు చేస్తున్నాడు. అందరిని నమ్మించేందుకు రెండు కార్లు కొని వాటికి జ్యుడిషియల్ శాఖకు చెందిన స్టిక్కర్లు అతికించి డిస్ట్రిక్ సివిల్ కోర్టు జ్యుడిషియల్ విజిలెన్స్ ఆఫీసర్‌గా, సౌత్‌సెంట్రల్ విజిలెన్స్ ఆఫీసర్‌గా తిరుగుతున్నాడు. రూ.4 కోట్ల వసూళ్లు జల్సాలకు అలవాటుపడ్డ రమేశ్ పలువురి వద్ద నుంచి రూ.4 కోట్లు వసూలు చేశాడు. గోదావరిఖనికి చెందిన సింగరేణి కార్మికుడు కైత రాంచంద్రంను పరిచయం చేసుకొని అతడి కొడుకుకు జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌గా, రాంచంద్రం స్నేహితుడు దశరథం బంధువుకు విద్యుత్‌శాఖలో ఉద్యోగం, వారి బంధువుల్లో మరొక మహిళకు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.40 లక్షలు వసూలు చేశాడు. రాంచంద్రం వద్ద అప్పు రూపంలో మొత్తం సుమారుగా రూ.4 కోట్ల వరకు తీసుకొని మోసం చేశాడు. అతడి వద్ద అప్పు తీసుకునే క్రమంలో రామగుండంలో అతడికి డబుల్బెడ్రూం ఇళ్లు ఉన్నట్లు రామగుండం తహసీల్దార్ పేరుతో తప్పుడు ధ్రువపత్రాలు సృషించి నమ్మించాడు. గోదావరిఖనిలో స్క్రాప్ బిడ్డింగ్ తనకే వచ్చిందని, ఫైనాన్షియల్ సర్వీస్ అథారిటీ రీజనల్ కార్యాలయం ద్వారా రూ.5.34 కోట్లు వచ్చాయని, వరంగల్ జిల్లా జడ్జి తనకు జ్యుడిషియల్ ఆఫీసర్‌గా జీతం ఇస్తున్నట్లు రూ.2.75 లక్షల ఫేక్‌చెక్, జూనియర్ లెక్చరర్‌గా మంచిర్యాలలో అపాయింట్ అయినట్లు ఫేక్ అపాయింట్మెంట్, ఆర్బీఐ అకౌంట్ నుంచి రూ.5 కోట్లు వచ్చినట్లు ఫేక్ లెటర్, గోదావరిఖనిలోని ఎస్బీఐ(అప్పటి ఎస్బీహెచ్) బ్యాంకు అకౌంట్లో కోటి ఉన్నట్లు తప్పుడు పత్రం, జేపీహెచ్‌ఎస్ రామకృష్ణపూర్లో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సాలరీ సర్టిఫికెట్, ఐడీకార్డులు తయారు చేసి రూ.4కోట్లు వసూలు చేయగా రెండున్నర కోట్లు జల్సాలకే ఖర్చుచేసినట్లు , మిగతా ఒకటిన్నర కోటి పలువురి వద్ద అప్పుగా తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. మోసం చేసి రెండోపెళ్లి..విడాకులు 2011లో గోదావరిఖనికి ఎలకపల్లికి చెందిన యువతిని ప్రే మించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు తెలియకుండా 2014 మే 18న కేశవపట్నం మండలంలోని ఒక గ్రామానికి చెందిన అ మ్మాయిని రెండోవివాహం చేసుకున్నాడు. అనుమానం వచ్చి న రెండో భార్య కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా రమేశ్, అతడి కుటుంబసభ్యులను అరెస్టు చేయగా తర్వాత రెండోభార్య రమేశ్‌తో విడాకులు తీసుకుంది. పక్కా ప్రణాళికతో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ దోమల రమేశ్ ఆగడాల గురించి సమాచారమందుకున్న కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ బుధవారం ఉదయం హుజురాబాద్‌లో పట్టుకున్నట్లు సీపీ తెలిపారు. అతడిని విచారించగా మోసం చేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుత సమాచారంతో ఎల్ఎండీ, హుజురాబాద్, గోదావరిఖని వన్‌టౌన్‌లో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం నాలుగు రోజుల కస్టడీకి తీసుకోనున్నట్లు తెలిపారు. రమేశ్‌వల్ల నష్టపోతే కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు లేదా సంబంధిత పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ రష్మిపెరుమాల్, టాస్క్‌ఫోర్స్ సీఐలు ప్రకాశ్, శశిధర్‌రెడ్డి, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. -
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పేరుతో ఘరానా మోసం
సాక్షి, తిరుపతి : ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పేరుతో మహిళను నిలువునా ముంచాడు ఓ మోసగాడు. 25 లక్షల రూపాయల లాటరీ తగిలిందని చెప్పి చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన మహిళకు కుచ్చు టోపి పెట్టాడు. రేణిగుంటకు చెందిన ఓ మహిళకు 25 లక్షల రూపాయల లాటరీ తగిలిందని ఫోన్ వచ్చింది. తొలుత 35 వేల రూపాలయలు చెల్లిస్తే లాటరీ డబ్బులు అందిస్తామని నమ్మబలికారు. మోసగాళ్ల మాయ మాటలు నమ్మిన మహిళ.. 35వేలను చెల్లించింది. ఆ తర్వాత జీఎస్టీ కోసం మరో 10 వేల రూపాయలు చెల్లించాలని పదేపదే ఫోన్లు చేశారు. దీంతో మహిళకు అనుమానం కలిగి.. పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.