న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను న్యాయమూర్తి మందలించారు.కోర్టులో రాజకీయ ప్రసంగాలు ఇవ్వరాదని చివాట్లు పెట్టారు. విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలని చెప్పారు. బ్యాంకులు, బీమా కంపెనీల నుంచి ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందడానికి ట్రంప్ తన రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువను ఎక్కువ చూపించారనే ఆరోపణల కేసులో విచారణ జరిగింది.
"ఇది రాజకీయ ర్యాలీ కాదు. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ప్రసంగాలు వద్దు.' అని ట్రంప్‌ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్థర్ ఎంగ్రోరోన్ హెచ్చరించారు. ట్రంప్‌ను ఎక్కువ మాట్లాడకుండా నియంత్రించాలని పిటిషనర్ తరుపు లాయర్‌పై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కోర్టు హాల్‌లో ట్రంప్ అన్నారు. కోర్టుల్లో కాలయాపన చేస్తూ తన సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. విచారణ అసంబద్ధంగా జరుగుతోందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో ట్రంప్ బ్రాండ్ విలువను కలపకుండానే ప్రకటించినట్లు పేర్కొన్నారు. కేవలం తన బ్రాండ్‌తోనే ఈ సారి ఎన్నికల్లో విజయం సాధిస్తానని అన్నారు. ట్రంప్ ప్రసంగంతో విసిగిన న్యాయమూర్తి మందలించారు. 2024 ఎన్నికల నేపథ్యంలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి తరుపున ట్రంప్ పోటీలో ఉన్నారు.
ఇదీ చదవండి: 17 సార్లు పొడిచి భార్యపై కిరాతకం.. అమెరికాలో కేరళవాసికి జీవిత ఖైదు
Comments
Please login to add a commentAdd a comment