Surender Reddy
-
స్టైలిష్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ మామ
-
రామ్ చరణ్ తో మళ్లీ జతకట్టనున్న సమంత.?
-
YSRCP నేత తెర్నేకల్ సురేందర్ రెడ్డి కూతురి వివాహ రిసెప్షన్లో YS జగన్
-
పోలీసుల అదుపులో ముగ్గురు తహసీల్దార్లు!
నల్లగొండ క్రైం/నిడమనూరు: అసైన్డ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారనే అభియోగంతో నల్లగొండ జిల్లాలో ము గ్గురు తహసీల్దార్లు, ఒక వీఆర్వోను టాస్‌్కఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిడమనూరు మండలం తుమ్మడం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములను మార్తివారిగూడేనికి చెందిన మార్తి సురేందర్‌రెడ్డి, అతని కుటుంబసభ్యులు అక్రమ మార్గాల్లో పట్టా చేయించుకున్నారని, అదే గ్రామానికి చెందిన మార్తి వెంకట్‌రెడ్డి 2022లో విజిలెన్స్ అధికారులు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని సురేందర్‌రెడ్డితోపాటు ఆయన భార్య, తల్లిపేరుతో పట్టా చేశారని, అంతేగాక వీఆర్వో వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే వ్యక్తి కూడా తన పేరుతోపాటు భార్య, తండ్రి పేరుతో ఏడు ఎకరాలు పట్టా చేయించుకున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ ఫిర్యాదుపై అప్పుడే రంగంలోకి దిగిన పోలీసులు, అధికార పార్టీ నేతల హస్తం ఉండడంతో విచారణ ముందుకు సాగించలేకపోయారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమంగా పట్టా చేసుకున్న వారిలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఒక తహసీల్దార్ ఫైల్ పె ట్టగా, మరొక తహసీల్దార్ ప్రభుత్వానికి, అసైన్డ్ కమిటీకి ఫా ర్వర్డ్ చేయగా, ఇంకో తహసీల్దార్ పట్టా జారీ చేసినట్టు తెలిసింది. ఈ విషయంపై హైకోర్టులో కేసు వేయగా, కోర్టు ఆదేశాలను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కేసు వేసిన వ్యక్తు లు మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు ధిక్కరణ కింద అధికారులు, పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో పోలీసులు బుధవారం ఆయా రెవెన్యూ అధికారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. -
అఖిల్ ఫ్యాన్స్‌కు మరో షాక్.. ఓటీటీ రిలీజ్లో బిగ్ ట్విస్ట్!
అక్కినేని అఖిల్ ఇటీవలే నటించిన చిత్రం ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటించింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్‌గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్‌కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. అయితే ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటూ ఇటీవలే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఓటీటీలో అఖిల్ 'ఏజెంట్' మూవీ వాయిదా.. స్ట్రీమింగ్ అప్పుడే) అయితే ఈ విషయంలో ఈ మూవీకి మరో షాక్ తగిలింది. అయితే వైజాగ్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీశ్,) ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. నిర్మాత అనిల్ సుంకర తనని మోసం చేశారని పేర్కొంటూ సతీశ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 29న ఏజెంట్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా కోర్టు స్టే విధించింది. దీంతో ఎంతో ఆశగా ఎదురుచూసిన అఖిల్ ఫ్యాన్స్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఏజెంట్ మూవీ ఇప్పుడైన వస్తోందని ఆశించిన అభిమానులు నిరాశకు గురవుతున్నారు. (ఇది చదవండి: పెళ్లికి ముందు ఆ నిర్మాత ప్రేమలో స్నేహ.. నటుడి సంచలన వ్యాఖ్యలు) -
'ఏజెంట్' డిజాస్టర్.. సురేందర్ రెడ్డి పరిస్థితి కూడా అంతేనా!
టాలీవుడ్ దర్శకుల్లో వివి వినాయక్‌ది ప్రత్యేక శైలి. 2002లో వచ్చిన ఆది సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాకే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డ్ కూడా అందుకున్నారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్, లక్ష్మీ, సాంబ, బన్నీ, బద్రినాథ్, అదుర్స్, అఖిల్, ఖైదీ నంబర్150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2018లో వచ్చిన ఇంటలిజెంట్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. తాజాగా హిందీ ఛత్రఫతి రీమేక్ డిజాస్టర్ కావడంతో వినాయక్ పనైపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: బ్రహ్మనందం కుమారుడు రాజ గౌతమ్.. నెల సంపాదన ఎంతో తెలుసా?) అయితే సరిగ్గా అదే కోవలోకి మరో డైరెక్టర్ చేరిపోయాడు. అఖిల్ ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న సురేందర్ రెడ్డి ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. అతనొక్కడే చిత్రం ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సురేందర్..కిక్, రేసుగుర్రం, ధృవ లాంటి హిట్ చిత్రాలు అందించారు. ఊసరవెల్లి, అతిథి, కిక్-2, సైరా లాంటి ఫ్లాప్‌లు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి నెక్ట్స్ మూవీపై ఎవరితో అనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. స్టార్ హీరోలతో చిత్రాలు నిర్మించిన సురేందర్ రెడ్డికి ఇప్పుడు యంగ్ హీరోలే మిగిలారు. తాజాగా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే సురేందర్ రెడ్డి సినిమాకు ఫైనాన్స్ చేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి వచ్చిందని సినీవర్గాల టాక్. ఏదేమైనా టాలీవుడ్లో సురేందర్ రెడ్డి మరో వి.వి. వినాయక్ అవుతాడా అనే విషయంపై చర్చ నడుస్తోంది. (ఇది చదవండి: అసలు ఈ డిజాస్టర్ ఏంటి?.. ఆ సాంగ్‌పై షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్స్!) -
డైలమాలో ఏజెంట్ డైరెక్టర్...సురేందర్ రెడ్డి
-
ఇప్పటికే డైరెక్టర్ ని వెనకేసుకొస్తున్న ఏజెంట్ ప్రొడ్యూసర్
-
Agent Movie Review: 'ఏజెంట్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: ఏజెంట్ నటీనటులు: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మురళీ శర్మ, మమ్ముట్టి, సంపత్ రాజ్, డినో మోరియా, విక్రమ్ జీత్ తదితరులు నిర్మాణసంస్థలు: ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్ నిర్మాత: రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, దీపారెడ్డి కథ: వక్కంతం వంశీ దర్శకత్వం: సురేందర్ రెడ్డి సంగీతం: హిప్హాప్ తమిజా ఆది సినిమాటోగ్రఫీ: రసూల్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేదీ: ఏప్రిల్ 28, 2023 అసలు కథేంటంటే: అక్కినేని అఖిల్(రామకృష్ణ) అలియాస్ రిక్కీ.. రా ఏజెంట్ కావాలనేది అతని కల. ఆ కలను నిజం చేసుకునేందుకు మూడుసార్లు పరీక్ష రాసి పాసైనా ఇంటర్వ్యూలో మాత్రం రిజెక్ట్ అవుతూ ఉంటాడు. మమ్ముట్టి(మహదేవ్) రా(RAW) ఛీఫ్. ఇండియాను టార్గెట్ చేసిన డినో మోరియా(ది గాడ్)ను అంతం చేయాలన్నదే మహదేవ్ ఆశయం. అందుకోసం ఓ మిషన్‌ను ఏర్పాటు చేస్తాడు. అఖిల్ తన కల నేరవేర్చుకునేందుకు మహదేవ్‌ను కలుస్తాడు. కానీ అఖిల్‌ను చేర్చుకునేందుకు మమ్ముట్టి నిరాకరిస్తాడు. అదే క్రమంలో హీరోయిన్ సాక్షి వైద్య(విద్య)తో అఖిల్‌కు పరిచయం ఏర్పడుతుంది. పైలట్‌గా పనిచేస్తున్న సాక్షి వేధింపులకు గురవుతుంది. ఈ క్రమంలో అమెరికా వెళ్లాలనుకుంటున్న ఆమెకు అఖిల్ అండగా నిలుస్తాడు. అదే సమయంలో మహదేవ్ నుంచి అఖిల్‌కు ఓ ఆఫర్ వస్తుంది. కానీ ఊహించని పరిణామాలతో అఖిల్.. వైద్యను మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. అసలు ఆ తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి? ఇంతకు మమ్ముట్టి(మహాదేవ్).. అఖిల్‌కు ఎలాంటి ఆఫర్ ఇచ్చాడు? ఆ తర్వాత ఏం జరిగింది? రా ఏజెంట్ కావాలనుకున్న అఖిల్ కల నేరవేరిందా? మమ్ముట్టి తన ఆశయం కోసం ఏం చేశాడు? అతని మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే అసలు కథ. కథ ఎలా సాగిందంటే.. స్పై యాక్షన్ థ్రిల్లర్ అనగానే అందరికీ గుర్తొచ్చేంది యాక్షన్ సీన్స్, హై వోల్టేజ్ ఫైట్స్. ఊహించని స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్. అయితే ఈ తరహా యాక్షన్ చిత్రాలు ఆడియన్స్‌కి కొత్త కాదు. గతంలో వచ్చిన స్పై యాక్షన్ ఫిల్మ్స్ మాదిరే ఇందులో కూడా గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపించారు. అదిరిపోయే స్టంట్స్ ఉన్నాయి. కానీ కథకు తగినట్లుగా యాక్షన్ సీన్స్ తీర్చిదిద్దడంలో సురేందర్ రెడ్డి విఫలమైనట్లు తెలుస్తోంది. స్పై మూవీ అనగానే అందరూ ఊహించినట్లుగానే టెర్రరిస్టులను అడ్డుకునే రా ఇంటలిజెన్స్ ఆధారంగా తెరకెక్కించారు. సినిమా ప్రారంభంలో వచ్చే సీన్స్ బట్టి కథేంటో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. అఖిల్‌ను ఈ సినిమాలో కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. అది బాగానే వర్కవుట్ అయింది. కథ బాగానే ఉన్నా.. దానిని తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఫస్ట్ హాఫ్‌లో మమ్ముట్టి - అఖిల్ మధ్య సన్నివేశాలు, హీరోయిన్‌తో అఖిల్‌కు పరిచయం.. ఆ తర్వాత ఆమెను వదిలేయడం.. కొన్ని ట్విస్టులతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ వచ్చేసరికి అఖిల్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో అఖిల్ యాక్షన్, బాడీ కాస్తా హైలెట్ అని చెప్పొచ్చు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అభిమానుల స్థాయిని అందుకోలేదనే చెప్పాలి. విలన్ (ది గాడ్)ను అంతం చేసేందుకు మహదేవ్ రూపొందించిన మిషన్ సమాచారం అతనికి ముందే తెలియడం కాస్త లాజిక్ లెస్‌గానే అనిపిస్తుంది. అతని కోసం ఎవరిని పంపినా ముందే తెలిసిపోవడం.. అదే క్రమంలో అఖిల్- విలన్ డైరెక్ట్‌గా తలపడే యాక్షన్స్ సీన్స్ లేకపోవడం పెద్ద మైనస్. మధ్యలో కొన్ని సన్నివేశాలు సంబంధం లేకుండా బోరు కొట్టిస్తాయి కూడా! స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోలేదు. ఫుల్ స్పై యాక్షన్ మూవీకి ప్రధాన బలం బీజీఎం. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్. సాంగ్స్ పర్వాలేదనిపించినా.. కొన్ని చోట్ల యాక్షన్స్ సీన్స్ ఓవర్‌గా అనిపిస్తాయి. కథ చివర్లో వచ్చే క్లైమాక్స్ సీన్ ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తిని పెంచింది. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ పర్వాలేదనిపించినా.. లాజిక్ లెస్ సీన్స్ వల్ల ఆడియన్స్‌కు అక్కడక్కడా బోరు కొట్టడం ఖాయం. ఎవరెలా చేశారంటే... స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు తగినట్లుగానే అఖిల్ తన బాడీ, స్టైల్‌తో అదరగొట్టాడు. యాక్షన్ సీన్లలో అఖిల్ ఫుల్ ఎనర్జీటిక్గా చేశాడు. ఈ చిత్రంలో అఖిల్ డిఫెరెంట్ లుక్‌లో కనిపించాడు. గతంలో రొమాంటిక్ అఖిల్‌గా కనిపిస్తే ఈ చిత్రంలో ఫుల్ యాక్షన్ హీరోను తలపించాడు. సాక్షి వైద్య తెలుగులో తన డిఫరెంట్ యాసతో అదరగొట్టింది. పైలట్ పాత్రలో ఒదిగిపోయింది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ లేనప్పటికీ.. కెమిస్ట్రీ బాగానే కుదిరింది. మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రా చీఫ్‌గా తన పాత్రకు న్యాయం చేశారు. విలన్‌గా డినో మోరియా లుక్ అదిరిపోయింది. విలన్ పాత్రలో కరెక్ట్‌గా ఒదిగిపోయాడు. అఖిల్ ఫాదర్‌గా మురళీ శర్మ, పొలిటికల్ లీడర్‌గా సంపత్ రాజ్ తమ పాత్రల పరిధిమేర రాణించారు. సాంకేతికత విషయానికొస్తే రసూల్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. హిప్హాప్ సంగీతం అంతగా మెప్పించలేదు. నవీన్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
భారం అంతా అఖిల్ పైనే...సీన్ లోకి అతను ఎందుకు రావట్లేదు?
-
Agent Movie: సముద్ర తీరాన ఏజెంట్ మూవీ స్పెషల్ ఇంటర్వ్యూ (ఫొటోలు)
-
హీరోయిన్ సాక్షి మాటలకూ అఖిల్,సురేందర్ రెడ్డి ఎలా నవ్వుతున్నారో చూడండి..
-
హీరోయిన్ సాక్షిని చాలా సార్లు తిట్టాను ఇంకా కొట్టడం ఏంటి..!
-
మెంటల్ గా, ఫిసికల్ గా నా లైఫ్ ని మొత్తం మార్చేసింది...
-
అఖిల్ ‘ఏజెంట్’ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఏజెంట్ నన్ను పూర్తిగా మార్చేసింది: అఖిల్
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఏజెంట్’. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా, మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి 2 పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ కంప్లీట్ డిఫరెంట్ మేకోవర్ లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో అఖిల్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఏజెంట్ మూవీ ట్రైలర్‌ను ఈనెల 18న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రెస్ మీట్లో అఖిల్ మాట్లాడుతూ.. 'ఇది రెండేళ్ల జర్నీలో ఏజెంట్ నన్ను పూర్తిగా మార్చేసింది. ఈ జర్నీలో సగటు మనిషిగా నేను అలసిపోయా. అయితే సినిమాకు ఏం కావాలో అది చేశానన్న ఆనందం ఉంది. ఈ సినిమాతో మానసికంగా దృఢంగా మారిపోయా. ఒక నటుడిగా సరికొత్త ఫేజ్‌లోకి వచ్చాను. సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మమ్ముటి సర్‌తో నటించడం నా అదృష్టం. ఆయన విలువ చాలా గొప్పది. నాలో స్ఫూర్తి నింపారు. చాలా విషయాలు నేర్చుకున్నా. నాకు యాక్షన్ జోనర్ అంటే ఇష్టం. అందుకే కథ చెప్పగానే కమిట్ అయిపోయా' అని అన్నారు. కాగా.. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, పోస్టర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచేశాయి. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. Let's begin the #AGENT ACTION HEAT to beat the summer wave!!#AgentTrailer out on APRIL 18th Stay Excited for the Massive Launch..#AGENTonApril28th@AkhilAkkineni8 @mammukka #DinoMorea @sakshivaidya99 @AnilSunkara1 @AKentsOfficial @LahariMusic @shreyasgroup pic.twitter.com/wpsJirNUFK — SurenderReddy (@DirSurender) April 15, 2023 -
మనసును హైజాక్ చేసి...
‘మళ్లీ మళ్లీ నువ్వే ఎదురెదురొస్తే దట్స్ ఏ సైన్ అని మనసంటుందే.. నా లేటెస్ట్ మిషనువు నువ్వే.. సాధించాలనిపిస్తుందే...’ అంటూ సాగుతుంది ‘ఏజెంట్’ చిత్రంలోని పాట. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పైయాక్షన్ ఫిల్మ్ ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్. ఈ సినిమా నుంచి ‘మళ్లీ మళ్లీ నువ్వే... మనసే హైజాక్ చేసి కొల్లగొట్టావు’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఆదిత్యా అయ్యంగార్ సాహిత్యం అందించిన ఈ పాటను ఈ చిత్ర సంగీతదర్శకుడు హిప్హప్ తమిళ పాడారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్‌రెడ్డి 2 సినిమాస్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర, దీపారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. -
ఫారిన్లో ఫైట్
ఫారిన్లో యాక్షన్ ప్లాన్ చేశారు ‘ఏజెంట్’. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంటోంది. ఇందులో భాగంగా ఓ ఫారిన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట యూనిట్. ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం వచ్చే వారంలో చిత్ర బృందం విదేశాలకు వెళ్లనుందట. ఈ షెడ్యూల్‌తో ‘ఏజెంట్’ షూటింగ్ దాదాపు పూర్తవుతుందట. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. కాగా ఏప్రిల్ 28న ‘ఏజెంట్’ రిలీజ్ కానుంది. మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి, కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: హిప్ హాప్ తమిజా. -
ఏజెంట్ షూటింగ్లో గాయపడ్డ దర్శకుడు.. వీల్‌చైర్‌లో సెట్స్‌కి..
ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి షూటింగ్లో గాయపడ్డాడు. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్ మూవీ షూటింగ్లో డైరెక్టర్‌కు గాయాలయ్యాయి. యాక్షన్ సీన్ చిత్రీకరించే సమయంలో ఎడమకాలికి గాయం కావడంతో ఆస్పత్రికి వెళ్లిన ఆయన చికిత్స చేయించుకున్న వెంటనే తిరిగి సెట్లో అడుగుపెట్టాడు. గాయంతో బాధపడుతూనే ఏజెంట్‌లోని కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు. వీల్‌చైర్‌లో కాలికి కట్టుతో ఉన్న ఆయన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: వాల్తేరు వీరయ్య ట్రైలర్ చూశారా? ఫ్యాన్స్‌కు పూనకాలే -
అఖిల్ 'ఏజెంట్' టీజర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
అఖిల్‌ను 'వైల్డ్ సాలే' అన్న హీరోయిన్..
Akhil Agent Teaser Released: అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్ట్ 12న విడుదల కానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్‌గా తరెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను స్టార్ యాక్టర్స్ శివకార్తికేయన్, కిచ్చా సుదీప్ విడుదల చేశారు. ఈ టీజర్లో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీ, సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అఖిల్‌కు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఇచ్చే ఎలివేషన్ బాగుంది. అలాగే యాక్షన్ సీన్స్, 'వైల్డ్ సాలే' అని హీరోయిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ టీజర్.. అఖిల్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉందని చెప్పవచ్చు. కాగా 'ఏజెంట్' చిత్రాన్ని హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ 'బోర్న్' ఆధారంగా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్‌పై ఆగ్రహం ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. -
వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షునిగా సురేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా వీరన్నగారి సురేందర్ రెడ్డి, కార్యదర్శిగా శాలివా హన పండరినాథ్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం చెన్నైలో సాగుతున్న వీహెచ్‌పీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల సంస్థాగత అంశాలకు సంబంధించి మార్పులు, చేర్పులు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నట్టు వీహెచ్‌పీ తెలంగాణ అధికార ప్రతినిధి (ప్రచార సహ ప్రముఖ్) పగుడాకుల బాలస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. వీరు మూడేళ్ల పా టు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన రామరాజు తెలంగాణ ప్రాంత సలహా సభ్యునిగా, అఖిల భార త మఠ్ మందిర్ బాధ్యతలు నిర్వహిస్తారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బండారి రమేష్ ఇకపై బెంగళూరు క్షేత్ర సేవా ప్రముఖ్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని బాలస్వామి తెలియజేశారు. -
కులుమనాలీలో అఖిల్ ఏజెంట్ షూటింగ్
అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులు మనాలీలో జరుగుతోంది. ‘‘స్టైలిష్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కులు మనాలీలో విజయ్ మాస్టర్ నేతృత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: రసూల్ ఎల్లోర్. Grappling to STRIKE HARD 👊🏾#AGENT Shoot progressing at a brisk pace in Manali with fierce action sequences💥💥#AgentLoading@AkhilAkkineni8 @mammukka @DirSurender @hiphoptamizha @AnilSunkara1 @AKentsOfficial @S2C_offl#AGENTonAugust12 pic.twitter.com/f1daRar0O0 — SurenderReddy (@DirSurender) May 25, 2022 చదవండి: విషాదం.. టీవీ నటి, టిక్ టాక్ స్టార్ మృతి కిచ్చా సుదీప్, జాక్వెలిన్‌ల 'రారా రక్కమ్మా..' సాంగ్ విన్నారా? -
కోట్ల అక్రమ ఆస్తులు.. శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి దుబ్బుడు సురేందర్ రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు సురేందర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. కాగా సురేందర్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సురేందర్ రెడ్డికి సంబంధించిన నివాసంలో సోదాలు నిర్వహించారు. సురేందర్ రెడ్డి నివాసంలో భారీగా ఆస్తులు, నగలను అధికారులు గుర్తించారు. ఇంట్లో 60 తులాల బంగారం, బ్యాంక్ లాకర్స్‌లో 129.2 తులాల బంగారం, నాలుగు ఓపెన్ ప్లాట్స్, 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 2,31,63,600 అక్రమ ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సురేందర్ రెడ్డి అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. చదవండి: బ్యాంక్‌కు షాకిచ్చిన క్యాషియర్.. ఐపీఎల్ బెట్టింగ్‌లో.. -
వైజాగ్‌లో ఏజెంట్
ప్రత్యర్థుల ప్లాన్‌ను తిప్పి కొట్టడానికి వ్యూహం పన్నారు ఏజెంట్. మరి.. ఈ వ్యూహంలో ప్రత్యర్థులు చిక్కుకుని ఎలా అల్లాడిపోయారు? అనేది థియేటర్స్‌లో చూడాల్సిందే. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఏజెంట్’. సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మమ్ముట్టి ఓ కీలక పాత్రధారి. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం అఖిల్ వైజాగ్ వెళ్లారు. అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారని, ఈ బ్లాక్ ఇంట్రవెల్లో వస్తుందని టాక్. ‘ఏజెంట్’ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
కరోనా బారినపడ్డ డైరెక్టర్ సురేందర్ రెడ్డి
Surendar Reddy Tested Positive for Corona virus: ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. షూటింగ్ కోసం హంగేరి వెళ్లి వచ్చిన ఆయన ఇటీవలె కరోనా బారిన పడ్డారు. సురేందర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబానికి కూడా కోవిడ్ పాజిటివ్ అని నిర్థారణ అయినట్లు సమచారం. ప్రస్తుతం వారంతా క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా తెరకెక్కుతునున్న సంగతి తెలిసిందే. అఖిల్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవలె హంగేరిలో కొన్ని ముఖ్యమైన యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సినిమాపై మాంచి హైప్‌ను క్రియేట్ చేసింది. సురేందర్ రెడ్డి కోలుకున్న అనంతరం తిరిగి షూటింగ్ ప్రారంభం కానుంది. చదవండి: సీక్రెట్‌గా వీడియో రికార్డ్.. ఫోన్ లాక్కున్న స్టార్ హీరో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ -
దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
-
ఫ్యాన్స్‌కు మరో బిగ్ సర్ప్రైజ్ అందించిన పవన్ కల్యాణ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే(సెప్టెంబర్ 2) సందర్భంగా ఆయన మూవీలకు సంబంధించి వరుస అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్ ఇస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఇప్పటికే ఆయన హీరోగా నటిస్తున్న ‘భీమ్లానాయక్’నుంచి టైటిల్ సాంగ్, ‘హరిహర వీరమల్లు’నుంచి కొత్త లుక్, రిలీజ్ డేట్ ప్రకటించి సర్ప్రైజ్ చేసిన పవన్.. తాజాగా తన 29వ ప్రాజెక్ట్‌కి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌కి మరింత ఆనందాన్ని అందించాడు. పవన్ కల్యాణ్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనిలో పవన్ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. Presenting to you all our proud association with @PawanKalyan Gaaru for the prestigious #ProductionNo9 💥 @SRTmovies @itsRamTalluri @DirSurender @VamsiVakkantham#HBDJanaSenaniPawanKalyan pic.twitter.com/c1Hgm7tr8n — SRT Entertainments (@SRTmovies) September 2, 2021 -
ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరైనదే!
‘‘సినిమా టిక్కెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే.. ఈ నిర్ణయం వల్ల ప్రేక్షకులకు, చిన్న సినిమాలకు, చిన్న నిర్మాతలకు ఎంతో మేలు కలుగుతుంది’’ అని ‘తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్’ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి ఓ ప్రకటనలో అన్నారు. టిక్కెట్ల ధర పెంచితే ప్రధానంగా హీరోలకే లాభం. టిక్కెట్ రేటు పెరిగేకొద్దీ హీరోల రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. మరికొందరు లాభాల్లో వాటాలు అడుగుతారు. బెనిఫిట్ షోలు, సినిమా విడుదల రోజు ఎక్కువగా సినిమాకు క్యూ కట్టేది మధ్యతరగతి ప్రజలే. టిక్కెట్ రేటు ఎక్కువగా ఉండటంతో చిన్న సినిమాలకే నష్టం. చిన్న సినిమాలకు ఫేస్ వ్యాల్యూ ఉండదు కనుక రూ.150, రూ. 200 టిక్కెట్ కొనుక్కుని చూసేందుకు ముందుకు రారు. పెద్ద సినిమా టిక్కెట్ ధర 100 రూపాయలున్నా నష్టమేమీ లేదు. పెద్ద హీరోల రెమ్యునరేషన్ తగ్గితే నిర్మాతలు బాగుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకోగలిగితే చిన్న, పెద్ద సినిమాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు. -
స్టయిలిష్ యాక్షన్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండగ తర్వాత ప్రారంభం కానుందని సమాచారం. అనిల్ సుంకర నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ స్టయిలిష్ చిత్రం కోసం ప్రస్తుతం అఖిల్ సిద్ధం అవుతున్నారని తెలిసింది. సంక్రాంతి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. విదేశాల్లోనూ ఈ సినిమాను చిత్రీకరించనున్నారు. ఇందులో హీరోయిన్గా ఎవరు నటిస్తారో ఇంకా ప్రకటించలేదు. అఖిల్ తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రీకరణ తుది దశలో ఉంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్దే కథానాయిక. -
పవన్ అభిమానులకు గుడ్‌న్యూస్..
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ఈ హీరో నుంచి సినిమా అంటేనే అభిమానులు ఎగిరి గంతేస్తారు. అజ్ఞాతవాసి సినిమా తరువాత పవన్ సినిమాలు చేయడం ఆపేసి.. రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. ఎన్నికల తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులున్నాయంటూ సినిమాల్లోకి రావడంతో పవన్ రీ ఎంట్రీ సిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ దొరికినన్ని సినిమాలను ఓకే చెప్పేస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ రీమేక్ వకీల్ సాబ్తో పవన కల్యాణ్ ప్రేక్షకుల మందు రాబోతున్న విషయం తెలిసిందే. (ఆర్జీవీ ట్వీట్: పవన్‌ను ఓదార్చిన బాబు) ఈ చిత్రం షూటింగ్ పనులు జరుగుతుండగా లాక్‌డౌన్‌తో బ్రేక్ పడింది. లాక్డౌన్ లేకపోయుంటే మే 15నే విడుదల కావాల్సింది. ఇదిలా ఉండగా క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో పవన్‌కి జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించనుంది. తాజాగా పవన్ మరో సినిమా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. (పెళ్లి కొడుకు నితిన్‌కు అద్భుతమైన బహుమతి!) పవన్ తన నెక్ట్స్ ప్రాజెక్టును దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చేయనున్నారని సమాచారం. ఈ సినిమాను ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన పవర్ స్టార్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు కంటే ముందు సెప్టెంబర్ 1న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. ‘సైరా నర్సింహరెడ్డి’తో హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దనున్నారో వేచి చూడాలి. #PSPK29 : Pawan Kalyan 😎 - Surender reddy - SRT Entertainments . Ofcl Announcement On #Sep01 .#PSPKBdayCDPTrendOnAug15@PawanKalyan • #VakeelSaab pic.twitter.com/fjsubOReSG — KingKalyan FC (@KingKalyanFC) August 12, 2020 -
కాంబినేషన్ కుదిరిందా?
అఖిల్ హీరోగా నటించనున్న ఐదో సినిమా దాదాపు ఖరారయింది. ప్రస్తుతం అతను నటిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. పరిస్థితులు మామూలు స్థితికి రాగానే మొదట విడుదలయ్యే సినిమాల వరుసలో ఈ సినిమా కూడా ఉంటుంది. ఇక అఖిల్ నటించబోయే తర్వాతి సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకుడని సమాచారం. ఇటీవల ఓ కథను నాగార్జునకు, అఖిల్‌కు సురేందర్ రెడ్డి వినిపించారట. కథ, అఖిల్ క్యారెక్టర్ బాగుండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. రవితేజ హీరోగా తాను గతంలో తెరకెక్కించిన ‘కిక్’ సినిమా తరహాలో ఎనర్జిటిక్ ఎంటర్టైనర్గా సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. అఖిల్ క్యారెక్టర్ చాలా జోష్‌గా ఉంటుందని తెలిసింది. -
‘రేసుగుర్రం’ రిపీట్ కానుందా?
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘రేసుగుర్రం’. అన్ని వర్గాల ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసిన ఈ చిత్రం అప్పట్లో రికార్డుల సునామీ సృష్టించింది. అయితే టాలీవుడ్ సర్కిళ్లలో తెగ చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందట. ‘రేసుగుర్రం’ చిత్రానికి కథను అందించిన వక్కంతం వంశీతో కలిసి బన్ని కోసం ఓ కథను స్దిదం చేస్తున్నారట సురేందర్ రెడ్డి. ‘రేసుగుర్రం’కు మించిన పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో వంశీ-సురేందర్ ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం. ఇక ప్రస్తుతం పుష్ఫ చిత్రంతో బిజీగా ఉన్న బన్ని ఆ తర్వాత వేణు శ్రీరామ్ ‘ఐకాన్’కు కమిట్ అయిన విషయం తెలిసిందే. సుకుమార్ ‘పుష్ప’ తర్వాత ఐకాన్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌తో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని సురేందర్ రెడ్డి భారీగా ప్లాన్ చేస్తున్నారట. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి మరో చిత్రాన్ని ఇప్పటివరకు ఫైనలైజ్ చేయలేదు. పలువురు హీరోలతో కథాచర్చలు జరిపినప్పటికీ కుదరలేదని టాలీవుడ్ టాక్. ఇక వీరిద్దరి కలయికలో మరో చిత్రం రావాలని బన్ని అభిమానులు ఎప్పట్నుంచో కోరుకుంటున్న విషయం తెలిసిందే. రేసుగుర్రం కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందా? లేదా అని తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి. చదవండి: హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు యూట్యూబ్ ట్రెండింగ్‌లో ‘నో పెళ్లి’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_951255110.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మాజీమంత్రి సురేందర్‌రెడ్డి మృతి
ఘట్కేసర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, కొమురెడ్డి సురేందర్‌రెడ్డి ఆదివారం మరణించారు. ఆయన టీడీపీ నుంచి 1985లో ఎమ్మెల్యేగా, 1989లో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో అటవీశాఖ, పశు సంవర్థక శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, 2001లో టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్‌తో కలిసి పని చేశారు. గ్రామం, నియోజకవర్గంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామం కొర్రెముల్లో సర్పంచ్ ఓరుగంటి వెంకటేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
సైరాకు భారీగా కలెక్షన్స్.. 3రోజుల్లోనే వందకోట్లు!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’... రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ నేపథ్యంతో అత్యంత్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడం.. రివ్యూలు కూడా పాజిటివ్‌గా ఉండటంతో ‘సైరా’ భారీ వసూళ్లు రాబడుతోంది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న (బుధవారం) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన మార్కెట్ అయిన ఏపీ, తెలంగాణలో ఈ సినిమా సత్తా చాటుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే సైరా రూ. 32 కోట్లు రాబట్టింది. పాజిటివ్ టాక్ ఉండటంతో తొలి మూడు రోజుల్లో సైరాకు భారీగా వసూళ్లు దక్కినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ. 14.62 కోట్లు రాబట్టింది. ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. నైజాంలో మూడురోజుల కలెక్షన్ వివరాలు (తొలిరోజు రూ. 8.10 కోట్లు, రెండోరోజు రూ. 3.98 కోట్లు, మూడో రోజు రూ. 2.54 కోట్లు) ట్విటర్లో వెల్లడించారు. ఇక ఓవర్సీస్ మార్కెట్లోనూ సైరా సత్తా చాటుతోంది. మూడు రోజుల్లో అమెరికాలో ఈ సినిమా రూ. 1.5 మిలియన్ డాలర్లు (రూ. 10.62 కోట్లు) రాబట్టిందని రమేశ్ బాలా మరో ట్వీట్లో వెల్లడించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ‘సైరా’ సినిమా విడుదలైన ప్రతీ చోట హిట్ టాక్‌తో భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రానికి సామాన్య అభిమానులే కాకుండా సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. చిరంజీవి నటనకు, సినిమాను తెరకెక్కించిన విధానానికి ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ‘సైరా’థియేటర్లలోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ సినిమాపై సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
‘సైరా నరసింహారెడ్డి’ థ్యాంక్యూ మీట్
-
‘సైరా’ మూవీ రివ్యూ
టైటిల్: సైరా జానర్: పీరియాడిక్ మూవీ నటీనటులు: చిరంజీవి, అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా తదితరులు సంగీతం : అమిత్ త్రివేది నిర్మాత: రామ్ చరణ్ దర్శకత్వం: సురేందర్ రెడ్డి రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి. రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సైరా అందర్నీ మెప్పించిందా లేదా అన్నది చూద్దాం. కథ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ కొత్తది కాదని అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల కథలను వెండితెరపై చూశాం. అయితే మొట్టమొదటి యోధుడు.. రేనాటి వీరుడైన నరసింహా రెడ్డి గురించి ఇంతవరకు ప్రపంచానికి అంతగా తెలీదు. ఇదే ఈ సినిమాకు కొత్త పాయింట్. ఈ పాయింటే మనల్ని సినిమా చూసేలా చేస్తుంది. 61 మంది పాలేగాళ్ల ను ఏకం చేసి బ్రిటీష్ సామ్రాజ్యానికి ఎదురు వెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు నరసింహా రెడ్డి. ఈ కథలో సిద్దమ్మ, లక్ష్మీ పాత్ర ఏంటి? స్వాతంత్ర్య సమరం కోసం అందరినీ నరసింహారెడ్డి ఏకతాటి పైకి ఎలా తెచ్చాడు? ఆ క్రమంలో అతనికి ఎదురైన సంఘటనలు ఏంటి? అన్నదే మిగతా కథ. నటీనటులు సైరాలో మెగాస్టార్ చిరంజీవి కన్నా ఉయ్యాలవాడ నరసింహారెడ్డే కనిపించాడు. ఇమేజ్ జోలికి పోకుండా పాత్రలో ఉన్నగంభీరం ఎక్కడా మిస్ కాకుండా చిరంజీవీ అద్భుతంగా నటించారు. యాక్షన్ సీన్స్‌లో అయితే మెగాస్టార్ అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. సినిమా అంతా భారీ తారాగణంతో, ప్రతీ సీన్ నిండుగా ఉన్నా.. కళ్లన్నీ నరసింహారెడ్డి మీదే ఉండేలా నటించారు. సినిమా అంతా తన భుజాలమీదే మోశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్లో వచ్చే సీన్స్‌లో చిరు యాక్షన్ అదుర్స్ అనిపిస్తుంది. వావ్ అనిపించే పోరాట సన్నివేశాలను కూడా అవలీలగా చేసేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌తో ఈ సినిమా రూపురేఖలే మారిపోయాయి. ప్రతీ ఒక్కరూ తలెత్తుకునేలా చేసే సన్నివేశమది. మరణం కాదు ఇది జననం.. అంటూ చిరు పలికే సంభాషణలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. చిరంజీవి తరువాత అంతగా పండిన పాత్ర అంటే అవుకు రాజు కిచ్చా సుదీప్‌దే. విభిన్న కోణాలను చూపిస్తూ.. అవసరమున్న చోట ప్రేక్షకులను సర్ప్రైజ్కు గురి చేస్తారు. గురువు పాత్రలో గోసాయి వెంకన్నగా అమితాబ్ గౌరవ పాత్రలో నటించారు. కనిపించింది కొన్ని సీన్స్‌లోనైనా.. తెరపై అద్భుతంగా పడించారు. వీరా రెడ్డిగా జగపతి బాబు చక్కగా నటించాడు. క్లైమాక్స్‌లో జగపతి బాబు కంటతడి పెట్టిస్తాడు. విజయ్ సేతుపతి పాత్ర నిడివి తక్కువే అయినా రాజా పాండిగా నమ్మిన బంటు పాత్రలో ఒదిగిపోయాడు. సిద్దమ్మ పాత్రలో నయనతార.. కనిపించింది ఐదారు సీన్లే అయినా.. తన ముద్ర కనిపిస్తుంది. ఇక లక్ష్మీ పాత్రలో నటించిన తమన్నా అందర్నీ ఆకట్టుకుంటుంది. తన పాత్ర ముగింపు సినిమాను మలుపు తిప్పుతుంది. ఇక రవికిషన్, బ్రహ్మాజి, అనుష్క, ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ అందరికీ తెలిసిన కథనే ప్రేక్షకలక నచ్చే, మెచ్చే విధంగా తీయడంలోనే దర్శకుడి ప్రతిభ కనబడుతుంది. అందులోనూ చరిత్ర పుటల్లో అంతగా లేని నరసింహా రెడ్డి కథను, నేటి తరానికి దగ్గరయ్యేలా తీశాడు సురేందర్ రెడ్డి. నరసింహా రెడ్డి గురించి చెప్పడానికి, బ్రిటీష్ వాళ్ళ ఆగడాలు, అప్పటి జనాల స్థితిగతులు చెప్పడానికే ఫస్ట్ హాఫ్‌ను ఎక్కువగా వాడుకున్నాడు దర్శకుడు. ప్రతీ షాట్లో క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేలా చిత్రీకరించాడు. ప్రతీ సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేసాడు. ఈ కథ చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. మొదటి సీన్ నుంచి చివరి వరకు తాను రాసుకున్న కథనం ఆకట్టుకుంటుంది. ద్వేషం కోసం కాదు దేశం కోసం నిలబడు లాంటి ఎన్నో అద్భుతమైన, అర్థవంతమైన మాటలను సాయి మాధవ్ బుర్రా రాశాడు. సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. అమిత్ త్రివేది అందించిన పాటలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. ఉన్నవి రెండు పాటలే అయినా.. వాటిని తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు ముగ్దులు కావాల్సిందే. సైరా క్యారెక్టర్ అంతగా ఎలివేట్ అయిందంటే.. ప్రతీ సీన్‌తో ప్రేక్షకులు ఎమోషన్‌గా కనెక్ట్ అయ్యారంటే జూలియస్ ప్యాకియమ్ అందించిన నేపథ్య సంగీతమే అందుకు కారణం. రత్నవేలు పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. తన తండ్రి కోరిక నేరవేర్చేందుకు రామ్ చరణ్ పడిన కష్టం, చేసిన ఖర్చు తెరపై కనపిస్తుంది. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకునే ఈ సైరాను.. విజువల్ వండర్‌గా తెరకెక్కించిన తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. నిర్మాణంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ఖర్చు పెట్టాడు. దానికి తగ్గ ఫలితం వెండితెరపై కనబడుతుంది. ఎడిటింగ్, క్యాస్టూమ్, ఆర్ట్ ఇలా అన్ని విభాగాలు సినిమాను విజయవంతం చేయడంలో సహాయపడ్డాయి. బండ కళ్యాణ్, సాక్షి వెబ్‌డెస్క్. -
ఓవర్సీస్ టాక్.. ‘సైరా’ అదిరిపోయింది
రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రంపై అంచనాలు ఆకాశాన్నoటాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. . మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సైరా ఎట్టకేలకు వచ్చేసింది. మరి సైరా టాక్ ఎలా ఉంది? ట్విటర్ ట్రెండింగ్ ఏంటి? అన్నది చూద్దాం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ తెరపై చూడటానికి కొత్తది కాదని అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల కథలను వెండితెరపై చూశాం. అయితే మొట్టమొదటి యోధుడు.. రేనాటి వీరుడైన నరసింహా రెడ్డి గురించి ఇంతవరకు ప్రపంచానికి అంతగా తెలీదు. ఇదే ఈ సినిమాకు కొత్త పాయింట్. ఈ పాయింటే మనల్ని సినిమా చూసేలా చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. ఎందుకు చెప్పుకున్నారో సైరా చూస్తే అర్థం అవుతుందని సినిమా చూసిన వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభం అవుతూ బ్రిటీష్ వారి ప్రవేశం, వారి ఆగడాల గురించి చెప్తాడు. ఇక నరసింహ రెడ్డి కథలోకి తీసుకెళ్లేందుకు తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో చిన్న సర్ప్రైజ్ చేశాడు దర్శకుడు. సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వెళ్తాడు. చిరు ఎంట్రీ మాత్రం మెగా అభిమానులను కట్టిపడేస్తుంది అంటున్నారు. ఇక జాతర సాంగ్ తెరపై చూడటానికి రెండు కళ్ళు చాలవు అనేంత అద్భుతంగా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ కొట్టించేలా ఉన్నాయని.. అయితే మధ్యలో వచ్చే ఫైట్స్ కన్నులపండవగా ఉంటాయని అంటున్నారు. నయనతార, తమన్నా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని ప్రశంసిస్తున్నారు. ఇక విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ లకు మంచి పాత్రలు లభించాయని అంటున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ ను నిలబెట్టింది ఇంటర్వెల్ సీన్ అని ముక్తకంఠంతో చెప్తున్నారు. ఈ సీన్స్ తో ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్తున్నారు. ఇక సెకండ్ హాఫ్ ఊపందుకుంటూ వెళ్తుందని.. మొదట్లో నరసింహా రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న అవుక రాజు సుదీప్.. తిరిగి చేతులు కలపడానికి వస్తాడు. బ్రిటీష్ వారిని పూర్తి స్థాయిలో ఎదుర్కోవడానికి సైన్యాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు నరసింహా రెడ్డి. ఈ క్రమంలో వచ్చే సైరా సాంగ్ తెరపై ఇంతకుముందెన్నడు చూడని విధంగా ఉంటుందని అంటున్నారు. ఈ పాటను విజువల్ వండర్ గా తెరకెక్కించారని అంటున్నారు. ఇక నరసింహా రెడ్డిని వెన్నుపోటు పొడిచేది ఎవరు, బ్రిటీష్ వారికి చిక్కిన తమన్నా కథ ఏం అవుతుంది, ఇలాంటి ట్విస్టులెన్నో సెకండాఫ్‌ను మరింత ఆసక్తికరంగా మలుస్తాయి. ఇక చివరి నలభై నిమిషాలు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని అంటున్నారు. క్లైమాక్స్ అదిరిపోయిందని.. ప్రతి ఒక్కరి గుండెను కదిలిస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మెగాస్టార్ తన ఎనర్జీ ని చూపించారని, నరసింహా రెడ్డి మాత్రమే కనిపించారని అంటున్నారు. ఈ వయసులో కూడా అంత ఎనర్జీతో గుర్రపు స్వారీలు, యుద్ధ సన్నివేశాలు చేయడంలో హైలెట్ అని ట్రెండ్ అవుతోంది. తన నటనతో మరోసారి విజృంభించాడని అభిమానులు సంబర పడుతున్నారు. ఇక గురువుగా నటించిన అమితాబ్ కనిపించేది కొన్ని సీన్స్‌లోనే అయినా.. ఎంతో ప్రభావం చూపించారని అంటున్నారు. ఇలాంటి సినిమాను నిర్మించిన రామ్ చరణ్‌ను అభినందిస్తున్నారు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనపడిందని అంటున్నారు. సాంకేతికంగా ఈ సినిమా ఇంకో స్థాయికి వెళ్లిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సురేందర్‌రెడ్డి తనదైన శైలిలో రాసుకున్న స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ, తన దర్శకత్వ ప్రతిభతో ఈ సినిమా స్థాయిని పెంచేశాడని, ప్రతీ సన్నివేశాన్ని ఎంతో అందంగా మలిచాడని అంటున్నారు. అమిత్ త్రివేది అందించిన సంగీతం అదిరిపోయిందని, సినిమా విజయం సాధించడంలో అదేంతో దోహదపడిందని అంటున్నారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన జూలియస్.. ప్రతీ సన్నివేశాన్ని గుండెకు హత్తుకునేలా చేశాడని అంటున్నారు. రత్నవేలు మరోసారి తన పనితనాన్ని చూపించడాని అంటున్నారు. ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్, కాస్ట్యూమ్ ఇలా అన్ని విభాగాలు ఈ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లాయని అంటున్నారు. ఓ కొడుకు తన తండ్రి కలను నెరవేర్చడానికి ఎంతో ఖర్చు పెట్టాడని.. దానికి మించి ఔట్ పుట్ ను తీసుకొచ్చి.. తన తండ్రి సినీ జీవితంలో గుర్తుండిపోయే చిత్రాన్ని నిర్మించాడని అంటున్నారు. చదవండి.. సైరా ఫుల్ రివ్యూ (4/5) -
సైరా నాకో పుస్తకం
‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా రియలిస్టిక్‌గా ఉండాలి. గ్రాండియర్‌గా ఉండాలనుకున్నాను. ఈ రెండు విషయాలను బ్యాలెన్స్ చేయడం నాకు చాలా టఫ్ అనిపించింది. కథను జెన్యూన్‌గా చెప్పాం. పరుచూరి బ్రదర్స్ ఈ కథ చెప్పగానే శక్తివంతమైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవిగారే కనిపించారు. చిరంజీవిగారితో ఇలాంటి సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. నా హార్డ్‌వర్క్ కూడా కొంత హెల్ప్ చేసిందని నమ్ముతున్నాను’’ అని దర్శకుడు సురేందర్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. రామ్‌చరణ్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నేడు విడుదలవుతోంది.ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సురేందర్‌రెడ్డి చెప్పిన విశేషాలు. ►ధృవ’ సినిమా తర్వాత ‘నాన్నగారితో సినిమా చేస్తావా?’ అని రామ్ చరణ్ అన్నాడు. స్టైలిష్, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారి గురించి మాట్లాడుకున్నాం. చిరంజీవిగారు నరసింహారెడ్డి జీవితంతో సినిమా చేద్దాం అనగానే నేను ఓకే చెప్పలేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి నాకు పెద్దగా తెలియకపోవడమే ఇందుకు కారణం. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ వద్దకు వెళ్లి నరసింహారెడ్డి ఎంత పెద్ద వీరుడో తెలుసుకున్నాను. ఇంత పెద్ద సినిమా చేయాలంటే మానసికంగా ధృడంగా ఉండాలనుకున్నా. ఆ తర్వాత నరసింహారెడ్డిగారి గురించి అందుబాటులో ఉన్న పుస్తకాలు, గెజిట్స్, బుర్రకథల గురించి పరిశోధన చేశాను. వాటిలో నరసింహారెడ్డిగారి గురించి ఉన్న పాయింట్స్ నన్ను టచ్ చేశాయి. వాటి ద్వారా నేను తయారు చేసిన కథను పరుచూరి వెంకటేశ్వరరావుగారి దగ్గరకు తీసుకువెళ్లాను. బాగుందన్నారు. ఆ తర్వాత చిరంజీవిగారి వద్దకు వెళ్లాను. నెలలోనే వచ్చారేంటీ? అని చిరంజీవిగారు షాక్ అయ్యారు. నేను వెళ్తున్న దారి సరైందో కాదో అని తెలుసుకోవడానికి ఓ రెండు గంటలు చిరంజీవిగారికి కథ చెప్పాను. ఆయన నన్ను ఆత్మీయంగా హత్తుకున్నారు. అలా ‘సైరా’ ప్రయాణం మొదలైంది. ► ఎప్పుడైనా ఓ కథ పుట్టాలంటే ఓ ప్రేరణ కలగాలి. కథలో విషయం మొదలు నుంచి చివరి వరకు స్పష్టంగా ఉండేందుకు ఆ ప్రేరణ ఉపయోగపడుతుంది. పరుచూరి బ్రదర్స్ కథ రాశారు. అది ఒక వీరుడి కథ. అది వారి దృష్టి కోణంలో ఉంది. బ్రిటీషర్లు నరసింహారెడ్డిని ఓ దొంగలా ఎలా చిత్రీకరించాలనుకున్నారనే విషయం కాకుండా.. ప్రాణత్యాగం చేసిన అలాంటి వీరుణ్ణి మనం ఎలా చూడాలి? అనే కోణంలో నా స్క్రిప్ట్‌ను రాసుకున్నాను. ఆ దృష్టి కోణంలో ‘సైరా’ ఉంటుంది. ►చిరంజీవిగారి అనుభవం మాకు ఉపయోగపడింది. కొన్ని చర్చల్లో మనతో కన్విన్స్ కానప్పుడు నలుగురు రైటర్స్‌ను పెట్టి అభిప్రాయ సేకరణ చేస్తారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అందుకే ఆయన మెగాస్టార్. ‘సైరా’ రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. చరణ్ కోసం సినిమాలో ఓ క్యారెక్టర్‌ను అనుకున్నాం. కానీ సినిమా నిడివి పెరుగుతుందని ఆ క్యారెక్టర్‌ను అసలు షూటే చేయలేదు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. అందుకే బయోపిక్ కాదు అంటున్నాం. ►సీన్ దర్శకుడికి నచ్చిందా? లేదా? షాట్ కరెక్ట్‌గా వస్తుందా? లేదా అని పరిశీలించుకుంటూ అమితాబ్ బచ్చన్, చిరంజీవిగార్లు దర్శకులు చెప్పింది చేసుకుంటూ వెళ్తుంటారు. అందుకే వారు మెగాస్టార్స్. బడ్జెట్ గురించి ఎప్పుడూ టెన్షన్ పడలేదు. ఒక వీరుడి కథ చెబుతున్నాం. ఇంతమంది స్టార్స్ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలనుకున్నాను. మా సినిమాలోని స్టార్స్ అందరూ గొప్పవారు కాబట్టే చేయగలిగాను. ఇందులో నా గొప్పతనం లేదు. సినిమా విలువ వారికి తెలుసు. ►విజన్ ఆఫ్ ది హిస్టరీలో డైరెక్టర్‌గా నా విజన్ ఉంటుంది ఈ సినిమా. ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్, యాక్షన్ ఇలాంటి అంశాలు ఏ కథలో అయినా ఉంటాయి. కానీ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ అంటే ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకువెళ్లాలి. దాన్ని సవాల్‌గా స్వీకరించాను. రాజీవన్‌గారు, రత్నవేలుగారు బాగా వర్క్ చేశారు. సాయిమాధవ్ బుర్రాగారు మంచి డైలాగ్స్ రాశారు. ►ఈ ప్రాజెక్ట్‌లో నేను మూడేళ్లుగా ఉన్నాను. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత రెండు ఎపిసోడ్లు పూర్తి చేయడానికి దాదాపు 125 రోజులు పట్టింది. మిగతాదంతా వంద రోజుల్లో పూర్తి చేశాం. ఈ సినిమా నాకు ఒక పుస్తకం. నేనే కాదు ఈ సినిమా కోసం అందరూ రెండున్నరేళ్లు కష్టపడ్డారు. ►యుద్ధ సన్నివేశాల కోసం మాకు దాదాపు రెండొందల గుర్రాలు కావాలి. బ్రిటీషర్ల గెటప్‌లో ఉండే ఆర్టిస్టులు కావాలి. వారందరూ ఇక్కడికి వచ్చే కంటే మేమే జార్జియా వెళ్లొచ్చనుకున్నాం. టెక్నీకాలిటీ కోసమే అక్కడికి వెళ్లాం. నాకు తెలిసి ఈ సినిమా కారణంగా ఎవరి మనోభావాలు దెబ్బ తినవు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారి వారసులు మంచోళ్లు. వారిని ఎవరో తప్పుదోవ పట్టించారని అనుకుంటున్నాను. నిజానికి ఈ సినిమా చేసినందుకు చిరంజీవిగారి ఫొటోను వారు ఇంట్లో పెట్టుకోవాలి. ►జార్జియాలో షూటింగ్ కోసం నేను అక్కడ అరవైఐదు రోజులు ఉన్నాను. నలభై రోజుల ముందే అక్కడికి యూనిట్ వచ్చారు. ఒక సిటీ నుంచి అరవై కిలోమీటర్లు వెళ్లి షూటింగ్ చేయాలి. అక్కడ కూడా ఒక ఎడారిలా ఉంటుంది. మనకు వర్షం వస్తే షూటింగ్ ఆగిపోతుంది. కానీ గాలి వల్ల మాకు షూటింగ్ ఆగిపోయింది అక్కడ. అలాంటి లొకేషన్ అది. అక్కడ మేం దాదాపు 40 రోజులు షూటింగ్ చేశాం. అక్కడ చుట్టుపక్కల ఏమీ లేదు. ఇంతమందికి ఇబ్బంది అవుతుందని ఓ సిటీనే నిర్మించారు చరణ్. అంటే 200 గుర్రాలూ 60 రోజులు ఉండాలి. వాటికోసం ఒక షెడ్‌ను ఏర్పాటు చేశారు. జూనియర్ ఆర్టిస్టుల నుంచి పెద్దవారికి వరకు ఒక క్యాబిన్‌ను ఏర్పాటు చేశారు. అందరూ అందులో ఉండాలి. భోజనం చేయడానికి ఒక షెడ్‌ను సిద్ధం చేయించారు. మళ్లీ గాలి రాకుండా కవరేజ్ ఉంటుంది. ఇదంతా చాలా బడ్జెట్‌తో కూడుకున్నది. ఇక్కడి నుంచి 250 మంది సభ్యులు వెళ్లాం. ఇంత మంది విదేశాలు వెళ్లి సినిమా చేయడం హిందీలో కూడా లేదు. అందరి బాగోగులు చూశారు. అదీ రామ్‌చరణ్ అంటే. -
‘సైరా’ వర్కింగ్ స్టిల్స్
-
‘సైరా’ ఫస్ట్ రివ్యూ: రోమాలు నిక్కబొడిచేలా చిరు నటన
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అయితే సినిమా థియేటర్లలో విడుదల కాకముందే తొలి టాక్ వచ్చేసింది. యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూను ట్విటర్లో తనదైన రీతిలో పోస్ట్ చేశాడు. ‘సైరా’మామూలుగా లేదంటూ అతడు పేర్కొనడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సంధు తన రివ్యూలో ఏం పేర్కొన్నాడంటే.. రోమాలు నిక్క పొడిచాయి ‘సైరా’ చూస్తున్నంత సేపు మీ రోమాలు నిక్కపోడుచుకోవడం ఖాయం. సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ గుండెలను హత్తుకునేలా ఉన్నాయి. నిజజీవిత కథ ఆధారంగా ‘సైరా’ తెరకెక్కించడంతో సినిమాలో మనం లీనమవుతాం. తరువాత ఏంటి అని ఆత్రుతగా ఎదురు చూస్తాం. మనకు తెలిసిన, తెలియని స్వాతంత్ర్య పోరాటంలో జరిగిన ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి విజయవంతం అయ్యారు. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో దుమ్ములేపారు. చిరంజీవి నటనకు హ్యాట్సాఫ్.. చిరంజీవి హీరోగా నటించిన 150 చిత్రాలు ఒక ఎత్తు అయితే ‘సైరా’మరొక ఎత్తు. తొలిసారి చారిత్రక సినిమాలో నటించి చిరంజీవి.. సరికొత్త చరిత్రను లిఖించనున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి నటన అద్భుతం.. జాతీయ ఆవార్డే చిరంజీవి కోసం వేచి చూసేలా నటించారు. ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం ఖాయం. చిరంజీవి లుక్స్ కూడా కొత్తగా.. సినిమాకు యాప్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇక అచ్చం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డినే తెరపై చూసినట్టు అనిపించేలా చిరంజీవి నటించారు. మెగాస్టార్ నటనకు ప్రతీ ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. అంతేకాకుండా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయం. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు’అంటూ సంధు ట్వీట్ చేశారు. ప్రస్తుతం సంధు చేసిన ట్వీట్ తెగ వైరల్‌గా మారుతుంది. ఇప్పటికే ‘సైరా’కు సంబంధించిన ట్రైలర్, పాటలు హిట్టవ్వడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా సంధు రివ్యూతో ఈ చిత్రంపై అంచనాలు మరో రేంజ్‌కు వెళ్లాయి. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం హిట్టవ్వాలని ప్రతీ ఒక్క సినిమా అభిమాని కోరుకోవడం విశేషం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి.. సైరా ఫుల్ రివ్యూ (4/5) -
‘సైరా’కు ఆత్మ అదే : సురేందర్ రెడ్డి
మెగాస్టార్ చిరంజీవి తొలి స్వతంత్ర్య సమరయోధుడి పాత్రలో నటిస్తున్న సైరాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు రంగం సిద్దం చేశారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రమోషన్ కార్యక్రమాల జోరును పెంచింది చిత్రబృందం. సినిమాకు సంగీతం, నేపథ్య సంగీతం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. సన్నివేశాల్లోని భావాలను మరింత పెంచేందుకు బ్యాగ్రౌండ్ స్కోర్ దోహదపడుతుంది. దాదాపు 250 కోట్లతో తెరకెక్కిన సైరాలో బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, అదే సైరాకు ఆత్మ అని, దీంతో సైరా మరో లెవల్‌కు వెళ్తుందని దర్శకుడు సురేందర్ రెడ్డి తెలిపాడు. తాజాగా ఈ మూవీ డీటీఎస్ మిక్సింగ్ పూర్తయిందని పేర్కొన్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, నయనతార, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2న ఈ మూవీ విడుదల కానుంది. -
‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన రామ్‌చరణ్
సాక్షి, హైదరాబాద్ : సైరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతంగా ప్రసారం చేసినందుకు గాను చిత్ర నిర్మాత మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సాక్షి మీడియాకి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ‘ సాక్షి’ అద్భుత కవరేజీ ఇచ్చిందని ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం సైరా. తొలి స్వతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.తాజాగా ఈ మూవీ సెన్సార్‌కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో బిగ్ బీ అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ చిత్రం తెలుగు, తమిళ, మళయాల, కన్నడ హిందీ భాషల్లో అక్టోబర్ 2న విడుదల కానుంది. -
సెన్సార్ పూర్తి చేసుకున్న సైరా
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం సైరా. తొలి స్వతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రాజమౌళి, వివి వినాయక్, కొరటాల శివ లాంటి ఎంతో మంది ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సక్సెస్ చేశారు. ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్‌కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. బిగ్ బీ అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మించారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మళయాల, కన్నడ హిందీ భాషల్లో అక్టోబర్ 2న విడుదల కానుంది. Certified U/A! Censor done with no cuts... MEGA RELEASE worldwide on October 2nd. Are you ready to see high octane action unleash on screen? @DirSurender #RamCharan #MegastarChiranjeevi #SyeRaa #SyeRaaOnOct2nd #SyeRaaNarasimhaReddy pic.twitter.com/H2ndK3kQbz — Konidela Pro Company (@KonidelaPro) September 23, 2019 -
‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’
నరసింహారెడ్డిగారి కుటుంబ సభ్యులను కలిశాను. ఒక వ్యక్తి జీవితం వందేళ్ల తర్వాత చరిత్ర అవుతుంది. సుప్రీం కోర్టు ఎప్పుడో తీర్పు ఇచ్చింది. వందేళ్ల తర్వాత ఒక వ్యక్తి జీవితంపై ఎవరైనా సినిమా తీయవచ్చు. ఏ ప్రాబ్లమ్ లేకుండా గౌరవంతో తీయవచ్చు. లేటెస్ట్గా చెప్పాలంటే... మంగళ్‌పాండే అనే ఒక గ్రేట్ లీడర్ మన ఇండియాలో ఉన్నారు. ఆయన గురించి ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు వందేళ్లు కాదు... 65 ఏళ్లకు సినిమా తీయొచ్చన్నారు. ఒక కుటుంబానికి లేదా కొందరు వ్యక్తులకు నరసింహారెడ్డిగారిని లిమిట్ చేయడం అనేది నాకు అర్థం కావడం లేదు. ఆయన దేశం కోసం పని చేశారు. ఉయ్యాలవాడ కోసం ఉన్నారు. రేపు నేను ఏదైనా చేయాలి అనుకుంటే ఊరి కోసం చేస్తాను. ఆ జనాల కోసం చేస్తాను. ఒక కుటుంబానికి లేదా ఓ నలుగురు వ్యక్తులకు నేను చేయను. అలా చేసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారి స్థాయిని తగ్గించలేను. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్ వంటి స్టార్లు నటించడానికి సగం చిరంజీవిగారి బలం అయితే.... వీరందరూ వచ్చి ఆయనతో కొంత సమయమైనా స్క్రీన్‌పై కనిపించాలి అనేది ఒక ఉద్దేశం అయితే ... మహానుభావులు నరసింహారెడ్డిగారి బలమే చిరంజీవిగారిని, వీరందర్నీ సినిమా చేసేలా చేసింది. – రామ్‌చరణ్ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి టైటిల్ రోల్లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో అక్టోబరు 2న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్, సురేందర్ రెడ్డిలతో పాటు ప్రసాద్ ల్యాబ్స్ అధినేత∙రమేశ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘పదేళ్ల క్రితం నాన్నగారు ఓకే చేసిన సబ్జెక్ట్ ఇది. సరైన సమయంలో సరైన బడ్జెట్.. టెక్నీషియన్స్ ఇలా అన్నీ సహకరించినప్పుడే సినిమా తీయాలనుకున్నాం. దర్శకుడు సురేందర్ రెడ్డిగారు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్‌గారు అందరూ చిరంజీవిగారి పాత్ర ఎలా ఉండాలి? ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడాలి? అని చర్చించుకుని డిజైన్ చేయించారు. వాటిని నాన్నగారు ఫాలో అయ్యారు. నాన్నగారికి ఈ వయసులో ఆ గెటప్ కుదరడం అదృష్టం. బాబాయ్ (పవన్ కల్యాణ్) వాయిస్ ట్రైలర్లోనే కాదు.. సినిమాలో కూడా ఉంటుంది. సురేందర్ రెడ్డిగారి దర్శకత్వంలో ‘ధృవ’ సినిమాలో హీరోగా నటించిన తర్వాత ‘ఇంటెన్స్ ఫిల్మ్స్’ని కూడా బాగా తీయగలరని అర్థమైంది. ‘సైరా’కి ఆయనే మంచి ఆప్షన్ అనిపించింది. నిర్మాతగా ఉండటం చాలా టఫ్ అనిపించింది. నాన్నగారు, పరుచూరిగారు మొదలుపెట్టిన ఒక థాట్ తెరపైకి రావాలి అంటే అందరూ చాలా రెస్పెక్ట్‌గా తీయాలి. డబ్బులంటే, దర్శకులు ఉంటే సరిపోదు. ప్యాషన్, క్రమశిక్షణతో తీయాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. చాలా గౌరవంతో ఈ సినిమా తీశాం. రికార్డ్స్ గురించి ఆలోచించి ఖర్చు పెట్టలేదు. రికార్డులు కాదు.. మాకు తిరిగి డబ్బులు వస్తాయా? రావా? అని కూడా ఆలోచించకుండా ప్యాషనేట్‌గా చేశా’’ అన్నారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వస్తుందని ఊహించలేదు. వచ్చాక ఈ సినిమా చేయడానికి పదిహేను రోజులు టైమ్ అడిగాను. చిరంజీవిగారు హీరోగా చేస్తున్న ఇంత భారీ స్కేల్ మూవీ నేను చేయగలనా? అనే విషయం గురించి ఆలోచించుకోవడానికి అంత టైమ్ అడిగాను. నాకప్పుడు ఎదురుగా కనిపించింది చిరంజీవిగారు ఒక్కరే. ఆయన లైఫ్ కనిపించింది. ఆయన ఎంత కష్టపడ్డారు. ఎంత ఎత్తుకు ఎదిగారు అన్నది కనపడింది. అలా ఆయన స్ఫూర్తితో చరణ్‌గారు నా వెనకాల ఉన్నారన్న ధైర్యంతో ముందుకు వెళ్లడం జరిగింది. మాకు దొరికిన ఆధారాలను బట్టి ఈ సినిమా చేశాం. సినిమా స్టార్ట్ చేసే ముందు నరసింహారెడ్డిగారి గురించి నాకు తక్కువ తెలుసు. ఆరు నెలలు పరిశోధించి, ఆయన గురించి తెలుసుకున్నాను. పుస్తకాలు చదివాను. నేనూ పోచ బ్రహ్మానందరెడ్డిగారు అని ఇప్పుడు నంద్యాల ఎంపీ... ‘రేనాటి సూర్యచంద్రలు’ అనే ట్రస్ట్‌కు ఆయన అధ్యక్షులు. ఆయన ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆయన ఒక బుక్ ఇచ్చారు. నరసింహారెడ్డిగారి పేరు మీద ప్రభుత్వం విడుదల చేసిన స్టాంప్‌ను ఇవ్వడం జరిగింది. నా మిత్రుడు ప్రభాకర్ రెడ్డి ద్వారా చెన్నై నుంచి నరసింహారెడ్డిగారికి సంబంధించిన గెజిట్స్ని తీసుకుని వచ్చి రీసెర్చ్ చేయడం జరిగింది. ఈ సినిమా ముగింపు చరిత్రలో భాగమే. నరసింహారెడ్డి గారు ఏదైతే తన జీవితాన్ని త్యాగం చేశారో అదే విక్టరీ. ఆయన తన మరణంతో బ్రిటిషు వాళ్లపై యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. ఇది విషాదాంత ముగింపు కాదు. ఈ సినిమాకు అదే విజయం. ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్ అదే. ఇది నేను రికార్డ్స్ కోసం చేసిన సినిమానో, ‘బాహుబలి’లాంటి సినిమా చేయాలనో చేయలేదు. చరణ్‌గారు నాతో ‘‘మా నాన్నకి నేను ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి. ఆయన 150 సినిమాలు చేశారు. ఆ సినిమాలన్నింటిలో ఈ సినిమా నంబర్ వన్‌గా ఉండాలి. నాన్న పేరు ఈ సినిమా ద్వారా హిస్టరీలో ఉండాలి’ అన్నారు. ఆ ఫీలింగ్‌తోనే ఈ సినిమా స్టార్ట్ చేశారు. మంచి సంకల్పంతో ఈ సినిమా చేశాం’’ అన్నారు. -
‘వీలు దొరక్కపోతే వీడియోకాల్ అయినా చేస్తా..’
సింహాలతో సెల్ఫీ దిగాడు రత్నవేలు! ఒక సింహం ‘నరసింహారెడ్డి’. ఇంకో సింహం సురేందర్‌రెడ్డి. మూడో సింహం కూడా కనిపిస్తుంది. ఆ సింహం.. రత్నవేలే! సినిమాటోగ్రాఫర్. సరేందర్రెడ్డి ‘సైరా’ స్క్రిప్టును.. నరసింహారెడ్డి మెగా గెటప్పును.. రత్నవేలు కెమెరాలోంచి చూడాల్సిందే. మనం చూస్తాం సరే..రెండు వందల ఏళ్ల నాటి కథని ఆయన మైండ్ ఏ లెన్స్‌లతో చూసింది! చదవండి. రత్నవేలుతో సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ‘సైరా’లో ఎలా భాగమయ్యారు? ‘రంగస్థలం’ సినిమా చేస్తున్నప్పుడు ‘సైరా’ సినిమా చేస్తారా? అని రామ్‌చరణ్ అడిగారు. అది వాళ్ల నాన్నగారి డ్రీమ్ ప్రాజెక్ట్. దాని గురించి పది పన్నెండేళ్లుగా చర్చల్లో ఉంది. మీరైతే చాలా ఫాస్ట్‌గా, చాలా క్వాలిటీతో చేస్తారు. మీరు జాయిన్ అయితే బావుంటుంది’ అన్నారు రామ్ చరణ్. నిజానికి ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమా కమిట్ అవ్వాలన్నది నా ఫిలాసఫీ. అప్పటికి ‘రంగస్థలం’ ఇంకా పూర్తి కాలేదు. దాంతో ‘ప్రిపరేషన్ కోసం కనీసం రెండు నెలలు సమయం కావాలి’ అని చిరంజీవిగారితో అన్నాను. ఒకవైపు ‘రంగస్థలం’ చేస్తూనే సాయంత్రం ప్యాకప్ చెప్పాక ‘సైరా’ ని ఎలా షూట్ చేయాలా? అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఇందులో కొన్ని వందల మంది మనుషులు, గుర్రాలు, పెద్ద పెద్ద యుద్ధాలు ఉంటాయి. అన్నీ అనుకున్న టైమ్‌కి జరగాలి. అలా జరగాలంటే టెక్నికల్‌గా చాలా బలంగా ఉండాలి. ఇద్దరు యాక్టర్స్‌ని ఫ్రేమ్‌లో పెట్టి షూట్ చేయడం ఈజీ. కానీ ‘సైరా’లో ఎక్కువగా వందల మంది కనిపిస్తారు. అందుకని హోమ్‌వర్క్ చేశాను. ఈ సినిమాలో చాలెంజింగ్ పార్ట్? సినిమా మొత్తం సవాలే. 1840 లలో వాతావరణం ఎలా ఉండేదో మనకు పెద్ద అవగాహన ఉండదు. ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్లగలగాలి. లేకపోతే అంతా వృథా అవుతుంది. ఎలాంటి కెమెరాలు, లెన్స్‌లు వాడారు? గుర్రాలతో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడం చాలా టఫ్. గుర్రాలు 60–70 కి.మీ. వేగంతో పరిగెడతాయి. ఆ సన్నివేశాలను కెమెరాతో బంధించాలంటే అంత వేగంగా కెమెరా పరిగెత్తాలి. సరిగ్గా రాకపోతే మళ్లీ ఆ సన్నివేశం తీయాలంటే రెండు గంటలు శ్రమించాలి. ఒకే టేక్‌లో సీన్‌ని పూర్తిచేయాలి. అందుకే మూవీ ప్రో ఎక్సెల్ మౌంట్ కెమెరా వాడాం. ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీరించాలనుకున్న వారం ముందే ఆ టెక్నాలజీ హాలీవుడ్లో వచ్చింది. ఇంకా హాలీవుడ్లో కూడా సినిమాల్లో అంతగా వాడలేదు. ఇంకా బ్లాక్ కామ్ని ఏటీవి (ఏటీవీ అంటే ఓ వాహనం లాంటిది. వేగంగా సాగే యుద్ధ సన్నివేశాలు తీసేటప్పుడు ఈ వాహనంలో కెమెరాని తీసుకెళతారు. కుదుపులకు కెమెరా షేక్ కాదు)కి ఏర్పాటు చేశాం. కొన్ని ఫైట్ సీన్లు అలా షూట్ చేశాం. అలాగే ‘స్పైడర్ క్యామ్’ వాడాను. ‘స్పైడర్‌మేన్’ సినిమాలకు అది వాడతారు. క్రికెట్ మ్యాచుల్లో కూడా గమనించే ఉంటారు. తాడుకి కట్టిన కెమెరా గ్రౌండ్లో కిందకీ పైకీ తిరుగుతుంటుంది. అది మోషన్ కంట్రోల్ కెమెరా. యుద్ధ సన్నివేశాల్లో రెండుగుర్రాలు తలపడతాయి. అప్పుడు ఈ కెమెరాలు వాటి దగ్గర ఉంటే పరికరాలు ధ్వంసమయ్యే అవకాశం ఎక్కువ. టాప్ యాంగిల్లో నుంచి చూపించడానికి స్పైడర్ క్యామ్ ఉపయోగపడుతుంది. నాలుగు భారీ క్రేన్లను లొకేషన్ చుట్టూ ఏర్పాటు చేశాం. జార్జియాలో షూట్ చేసిన సీన్స్‌కి ఇది ఉపయోగించాం. రష్యా నుంచి ఈ పరికరాన్ని తెప్పించాం. మీరు వాడే వారం ముందే ఆ ‘కెమెరా’ హాలీవుడ్‌కి వచ్చిందన్నారు. మరి.. దాన్ని ఎలా ఉపయోగించాలో ఎలా తెలుసుకున్నారు? ఏదైనా టెక్నాలజీ మార్కెట్లోకి వస్తుంది అని తెలిసినప్పటి నుంచి దాని గురించి స్టడీ చేయడం మొదలుపెడతాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి నాకు ఆ అలవాటు ఉంది. ‘1 నేనొక్కడినే’ చిత్రీకరించే సమయంలో 90 శాతం తెలుగు సినిమాలు ఫిల్మ్లోనే చిత్రీకరిస్తున్నారు. కానీ మేం ఆ సినిమాను డిజిటల్లో షూట్ చేశాం. డిజిటల్లో ఎలా కనిపిస్తామో? అని చాలా మంది సందేహంలో పడ్డారు. మహేశ్‌బాబు చేస్తున్నారు అనేసరికి అందరికీ నమ్మకం వచ్చేసింది. మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది? ‘సైరా’కు చాలా మంది హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేశారు. యాక్షన్‌ని గ్రెగ్ పొవెల్, లీ వైటేకర్ చేశారు. లీ, నేను రజనీకాంత్‌గారి ‘లింగా’ సినిమాకు పని చేశాం. నేను ఉదయం 7 గంటలకు చిత్రీకరణ మొదలుపెట్టాలంటే అందరూ ఉదయం 4 గంటల నుంచే పనుల్లో దిగాలి. అందుకే నేను ‘సన్ సీకర్’ అనే యాప్ వాడతాను. రేపు ఉదయం 6.45కి సూర్యోదయం అవుతుంది. ఆ సమయానికి అందరూ రెడీగా ఉండాలని ముందే చెబుతాను. అలా ప్లాన్ చేసుకునేవాళ్లం. చిత్రదర్శకుడు సురేందర్‌రెడ్డితో మీకిది మొదటి సినిమా ... ఆయనతో మీ సింక్ ఎలా కుదిరింది? ఈ స్క్రిప్ట్ చాలా బావుంది. నేను ఓ సినిమా ఒప్పుకునేటప్పుడు ఫొటోగ్రఫీకి స్కోప్ ఉందా? లేదా అని మాత్రమే చూడను. సుకుమార్‌తో నేను చేసిన ‘రంగస్థలం’ సినిమా తీసుకుంటే మనకు పెద్ద స్కోప్ లేదు కదా? అని వేరే కెమెరామేన్లు అంగీకరించకపోవచ్చు. కానీ లోతుగా వెళ్తే మనకు స్కోప్ దొరుకుతుందని చేశాను. సురేందర్ రెడ్డి మొదటిసారి కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. మా ఇద్దరికీ మంచి సింక్ కుదిరింది. బెస్ట్ టెక్నీషియన్స్ ఉన్నప్పుడు నాకు ఈ సన్నివేశం ఇలానే ఉండాలి అన్నట్టుండదు. ఎవరి స్పేస్ వాళ్లకు ఇచ్చి వాళ్లనుంచి బెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతీ సీన్‌కి ఒకటికి రెండుసార్లు మాట్లాడుకుని ఏదైతే బావుంటుందో దాన్నే చేశాం. మొత్తం 250 రోజులు చిత్రీకరించాం. సినిమా రిలీజ్ దగ్గర పడుతోంది. ఇప్పుడు చెబుతున్నా.. ‘సైరా’ చిరంజీవిగారి కెరీర్లో గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఇందులో రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వెళ్లే సత్తా ఈ సినిమాకు ఉంది టెక్నికల్‌గా, పర్ఫార్మెన్స్ పరంగా అన్నీ సరిగ్గా కుదిరాయి. సాధారణంగా ఎక్కువ చేసి చెప్పడం నాకు నచ్చదు. కానీ ఈ సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. టీజర్ రిలీజ్ అయినప్పుడు ముంబై, చెన్నై నుంచి చాలా ఫోన్లు వచ్చాయి. ఇలాంటి సినిమాను ఒక ఏడాదిలో ఎలా పూర్తి చేశారు? అని అడిగారు. నైట్ ఎఫెక్ట్‌లో ఓ భారీ యుద్ధం ఉందని విన్నాం.. అవును. అది చాలా చాలెంజింగ్ వార్. సాధారణంగా యుద్ధాలు పగలే జరుగుతుంటాయి. బ్రిటీష్ వాళ్లు నరసింహా రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో నియమాలను అతిక్రమించి రాత్రి అటాక్ చేస్తారు. అది చాలా పెద్ద ఫైట్. ఇప్పటి వరకూ రాత్రులు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించిన సినిమాలు తక్కువ. దాన్ని చాలెంజింగ్‌గా తీసుకుని చేశాం. దాదాపు నెల రోజులు నైట్ షూట్ చేశాం పగలు తీసి రాత్రి ఎఫెక్ట్ ఇచ్చే స్కోప్ ఉంది కదా? చేయొచ్చు. అయితే అది హారర్ సినిమాలకు బాగానే ఉంటుంది. ఇది నిజంగా అనిపించాలి. అప్పట్లో కరెంట్ ఉండేది కాదు కదా. రాత్రి పూట కాగడాలు పెట్టుకునేవారు. అది నిజంగా అనిపించాలి. ఈ నైట్ వార్కి గ్రెగ్ పొవెల్ ఫైట్ మాస్టర్. ఓ లొకేషన్ మొత్తం లైటింగ్ చేయాలంటే చాలా లైట్లు పెడతాం. అలా కాకుండా మూన్‌లైట్‌ని సృష్టించాలనుకున్నాను. దానికోసం ఓ సెపరేట్ లైటింగ్ సృష్టించాం. 200 అడుగుల క్రేనులు మూడు ఏర్పాటు చేశాం. లైట్ చుట్టూ సాఫ్ట్బాక్స్ పెట్టి వేలాడదీశాం. దాంతో మూన్లైట్ ఎఫెక్ట్ వచ్చింది. కిందంతా కాగడా వెలుతురులోనే షూట్ చేశాం. చిరంజీవిగారిలాంటి పెద్ద స్టార్ హీరోకు కేవలం కాగడా లైట్స్‌తో షూట్ చేయడం పెద్ద రిస్క్. కలర్ సరిగ్గా ఉండదు, నీడలు వస్తాయి అని ఆలోచిస్తారు. అయితే విజువల్‌గా చాలా అద్భుతంగా వచ్చింది. 25 నుంచి 30 రోజులు కోకాపేట్లో షూట్ చేశాం. ఇంకో విషయం ఏంటంటే అది వానాకాలం. కెమెరా పెట్టి మొత్తం రెడీ చేసుకున్నాక వర్షం పడేది. దానికి తగ్గట్టుగా లైటింగ్ చేశాం. ‘నువ్వు హాలీవుడ్లో ఉండాల్సివాడివి’ అని గ్రెగ్ పొవెల్ అభినందించారు. కేవలం కాగడా వెలుతురుతోనే షూట్ చేయడం అంటే చిరంజీవిగారు అంగీకరించారా? ఎవ్వరికైనా నమ్మకం కలగడం కష్టం. అయితే ఒక్కసారి నమ్మితే ఎవరూ ఆలోచించరు. ఆయన నా ‘రోబో, రంగస్థలం’ సినిమాలు చూశారు. నా ఆలోచనను నమ్మారు. కొన్నిసార్లు ఉన్న రూల్స్‌ని బద్దలు కొడితేనే కొత్త విషయాలు తెలుస్తాయి. కెమెరా ఐఎస్ఓ 800 ఉంటుంది. మేం 2500 ఐఎస్ఓ పెట్టి షూట్ చేశాం. ఈ సినిమాలో ప్రతీ సీన్ ఏదో విధంగా ఇబ్బంది పెట్టడమో చాలెంజ్‌లు విసరడమో చేసింది. ఆ సమస్యకు తగ్గ పరిష్కారం ఆలోచించి చిత్రీకరించుకుంటూ వచ్చాం. ∙‘రోబో’, ‘సైరా’.. ఏది కష్టం అనిపించింది? ‘రోబో’ అప్పుడు అదో ప్రయోగం. ఆ స్థాయిలో వచ్చిన సినిమాలు లేవు. అది క్రియేటివ్‌గా, టెక్నికల్‌గా కష్టంతో కూడుకున్న సినిమా. ‘సైరా’ క్రియేటివ్‌గా, టెక్నికల్‌గా, శారీరకంగా కూడా ఎక్కువ కష్టపడిన సినిమా. ఆ సమయానికి అది పెద్దది. ఇప్పుడు ఇది పెద్దది. మామూలుగా పెద్ద సినిమా అంటే లుక్స్ బయటకు రావడం సహజం. ‘సైరా’ లొకేషన్ నుంచి ఒక్క ఫొటో కూడా లీక్ కాలేదు. ఎలాంటి కేర్ తీసుకు న్నారు? లొకేషన్లో సెల్‌ఫోన్ అనుమతించలేదు. ఒక బాక్స్ ఏర్పాటు చేశాం. మొబైల్ ఫోన్‌ని అందులో డిపాజిట్ చేసి లోపలకి రావాలి. మెయిన్ టెక్నీషియన్స్‌కి మాత్రమే ఫోన్లు అనుమతించారు. ఏకాగ్రత దెబ్బ తింటుందని లొకేషన్లో ఫోన్ వైపు చూడను. లంచ్ సమయంలో ఓసారి, సాయంత్రం ప్యాకప్ తర్వాత మళ్లీ ఓసారి ఫోన్ చూస్తాను. సినిమా గురించి మాట్లాడేప్పుడు హీరో, దర్శకుడు గురించే తప్ప కెమెరా విభాగం గురించి మాట్లాడే వాళ్లు చాలా తక్కువ. అదేమైనా బాధగా ఉంటుందా? అది గతంలో. ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద ప్లస్. కెమెరామేన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ‘రోబో’ సమయంలో ‘యానిమట్రానిక్స్’ అంటే ఎక్కువగా తెలియదు. నేను దాని గురించి చదివి తెలుసుకున్నాను. అయితే మీరన్నట్లు కేవలం, యాక్టర్స్, డైరెక్టర్స్‌ని మాత్రమే అభినందిస్తారు. అప్పుడు టెక్నీషియన్స్‌కి బాధ ఉండటం సహజం. ‘రంగస్థలం’ కోసం రాజమండ్రిలోని మారుమూల ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నాం. అక్కడో కుండలు తయారు చేసే ఆయన నన్ను చూసిన వెంటనే ‘రత్నవేలు గార్రా’ అన్నాడు. సుకుమార్, వాళ్ల తమ్ముడు అందరూ ‘చూశావా.. నిన్ను ఎలా గుర్తుపడుతున్నారో’ అన్నారు. ఫలానా సినిమాకి ఫలానా కెమెరామేన్ అని పేరు తెలియడం కామన్. కానీ మనిషి తెలియడం అంటే.. అది కూడా అంత మారుమూల ప్రాంతంలో అంటే.. అది పెద్ద అచీవ్‌మెంట్‌లా అనిపించింది. ‘కెమెరామేన్‌గా మాకు రత్నవేలే కావాలి’ అని అడిగే హీరోలు ఉన్నారా? ఉన్నారు. నేను అందరితో కలసిపోయే టైప్ కూడా కాదు. పూర్తి శ్రద్ధతో పని చేస్తాను. రిలీజ్‌కి ముందు కూడా కలర్ కరెక్షన్, డీఐ చేస్తూనే ఉంటాం. ఓవర్సీస్ ప్రింట్స్ టైమ్‌కి వెళ్లాయా? లేదా అని చెక్ చేస్తూనే ఉంటాను. ‘సినిమాను జాగ్రత్తగా చేస్తున్నాడు. మనల్ని బాగా చూపిస్తాడు’ అనే నమ్మకం నా హీరోలకు కలుగుతుంది. అందుకే నేను కావాలని అడుగుతుంటారు. అందరూ మీతో చేయాలనుకున్నా అన్నీ చేయడానికి కుదరదు. ‘నో’ చెప్పడం నేర్చుకున్నారా? కొన్ని సార్లు బాధపడతారు. ఓ సినిమా 70 శాతం అయినప్పుడు వేరే సినిమా చేయమని అడుగుతారు. కుదరదు కదా. జనవరి నుంచి డేట్స్ కావాలంటారు. చేస్తున్న సినిమా మార్చి వరకూ జరగొచ్చు. ఎవరూ ఊహించలేం. అందుకే ఒక సినిమా తర్వాత ఒకటి చేస్తుంటాను. ‘రోబో’ తర్వాత నాకు 13 సినిమా ఆఫర్స్ వచ్చాయి. హిందీలో పెద్ద సినిమాకి కూడా అడిగారు. నేను, సుకుమార్ మంచి ఫ్రెండ్స్. తన కోసం ‘1 నేనొక్కడినే’ చేశాను. ఆ సినిమా కోసం నాది 7 నెలల కాంట్రాక్టే. కానీ సినిమా మీద ప్రేమ, సుక్కు మీద ప్రేమ, మహేశ్ అంటే ప్రేమతో రెండేళ్లయినా ఆ సినిమా చేస్తూనే ఉన్నాం. 7 నెలలే కదా అని వేరే సినిమాకి వెళ్లిపోతే అది కరెక్ట్ కూడా కాదు. కెమెరామేన్ అంటే సగం దర్శకుడి కిందే లెక్క. భవిష్యత్తులో దర్శకుడు అవుతారా? 7–8 ఏళ్ల క్రితమే డైరెక్షన్ కోసం అన్నీ సెట్ చేసుకున్నా. సరిగ్గా అప్పుడు రజనీ సార్ ‘రోబో’ కోసం పిలిచారు. సరే.. ‘రంగస్థలం’ తర్వాత చేయాలి అనుకున్నా. చరణ్‌తో ఈ ఆలోచన చెప్పగానే ‘కెమెరామేన్‌గా టాప్‌లో ఉన్నారు. ఇది కంటిన్యూ చేయండి. తర్వాత డైరెక్షన్ చేయొచ్చు’ అన్నారు. అయితే త్వరలోనే నా డైరెక్షన్లో సినిమా మొదలుపెడతా. మొత్తం కథ పూర్తయింది. మీ సినిమాకు మీరే సినిమాటోగ్రఫీ చేస్తారా? మనమే రెండూ చేస్తే ఏకాగ్రత పెట్టలేం అని కెమెరామేన్ నుంచి దర్శకుడిగా మారినవాళ్లు చేయరు. నా స్క్రిప్ట్‌లో మూడ్ ఏంటో నాకు తెలుసు. మళ్లీ ఇంకో అతనికి చెప్పి అదంతా టైమ్ వేస్ట్. సో.. నేనే చేసుకుంటానేమో. మీ అసిస్టెంట్స్ కెమెరామేన్లు అయ్యారా? ఇప్పటివరకూ 11మంది కెమెరామేన్లు అయ్యారు. ఉదాహరణకు తెలుగులో యువరాజ్, తమిళంలో దినేష్, ప్రేమ్‌కుమార్. ఫైనల్లీ మీ డ్రీమ్? హాలీవుడ్లో ఓ సినిమా చేయాలన్నది నా డ్రీమ్. ఐదేళ్ల క్రితం ఓ ఆఫర్, మూడేళ్ళ క్రితం కూడా ఓ సినిమా వచ్చింది. ఒక్క సినిమా చేసి వచ్చేయాలి. నేను హిందీ సినిమా కూడా చేయలేదు. తెలుగు, తమిళంలో చేయడానికి ఇష్టపడతాను. ఇప్పుడు బాలీవుడ్డే సౌత్ సినిమాల్లోకి వస్తుంది కదా. నెలల తరబడి ఫిల్మ్ సెట్లో ఉంటారు. ఫ్యామిలీని మిస్ అవుతుంటారు కదా? ఈ విషయంలో నా భార్యదే క్రెడిట్ అంతా. తన సహకారం లేకుండా ఇన్నేసి రోజులు ఇంటికి దూరంగా సినిమాలు చేయడానికి కుదిరేది కాదు. కొంచెం ఖాళీ దొరికిందంటే చెన్నై వెళ్లిపోతాను. వీలు దొరక్కపోతే వీడియోకాల్ అయినా చేసి భార్య, పిల్లలు, అమ్మతో మాట్లాడతాను. కానీ దగ్గరున్న ఫీల్ వేరు కదా. అందుకే సమ్మర్ హాలీడేస్‌లో ఫ్యామిలీ అందరం కలసి వెకేషన్‌కు వెళ్లిపోతాం. మీకెంత మంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. అబ్బాయికి 17 ఏళ్లు. ప్లస్ టులోకి వచ్చాడు. అమ్మాయికి పదేళ్లు. చాలా అల్లరి చేస్తుంటుంది. మా వాళ్లు చాలా హ్యాపీ. వాళ్ల క్లాస్మేట్స్, టీచర్స్ నా గురించి మాట్లాడినా నాతో చెప్పి ఆనందపడుతుంటారు. వాళ్ల ఆనందం చూసి నాకు భలే సంతోషమేస్తుంది. మా అమ్మ కూడా చాలా గర్వపడుతున్నారు. ‘రంగస్థలం’ సినిమాకు ఈ మధ్యన వచ్చిన అవార్డులు చూసి ఆమె చాలా సంతోషపడ్డారు. మొన్న ‘సాక్షి’ అవార్డు కూడా అందుకున్నాను. 60 ఏళ్లు పైబడిన చిరంజీవిగారు రిస్కీ ఫైట్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. యుద్ధ సన్నివేశాలను ఆయన సౌకర్యం కోసం ప్లాన్ చేశారా? నిజానికి చాలా మంది హీరోలకు గుర్రం నడపడం రాదు. కానీ ఆయన ఈ వయసులో కూడా జోష్‌గా గుర్రం నడిపారు. తాడు కట్టి స్టంట్స్ చేయించడం ఎందుకు? అని ఆలోచించాం. ఆల్రెడీ యాక్షన్ సినిమాలు చేస్తూ చాలా ఏళ్లుగా శరీరం హూనం చేసుకొని ఉన్నారు. అందుకని కష్టపెట్టాలనుకోలేదు. ఆయన మాత్రం ఉత్సాహంగా తాడు కట్టండి నేను చేస్తాను అని ఫైట్ మాస్టర్స్‌తో అన్నప్పుడు ఆశ్చర్యపోయాను. వెంట వెంటనే రెండు దేశభక్తి సినిమాలు చేయడం ఎలా అనిపిస్తోంది? ‘సైరా’, ‘భారతీయుడు 2’.. రెండూ దేనికదే ప్రత్యేకమైనవి. కంటిన్యూస్‌గా దేశభక్తి సినిమాలు చేయడం బాగానే ఉన్నా.. అర్జెంటుగా ఓ మోడ్రన్ సినిమా చేయాలనిపిస్తోంది (నవ్వుతూ). – డి.జి. భవాని -
‘సైరా’దర్శకుడు మెచ్చిన ‘మథనం’
శ్రీనివాస్ సాయి, భావన రావు జంటగా అజయ్ సాయి మనికందన్ దర్శకత్వంలో కాశీ ప్రొడక్షన్స్ పతాకంపై దివ్యా ప్రసాద్, అశోక్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం మథనం. యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అందరినీ తెగ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ‘సైరా’ దర్శకుడు సురేందర్‌రెడ్డి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్లో లవ్ ఎలిమెంట్స్ ఉండటం చూస్తుంటే ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. టీజర్ విడుదల చేసిన అనంతరం సందర్బంగా దర్శకుడు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నిర్మాత అశోక్ దాదాపు 15 ఏళ్లుగా తెలుసు. ఇద్దరం మంచి స్నేహితులం. నాతోపాటు కథా చర్చల్లో కూడా పాల్గొనేవాడు. తనకి సినిమాపై మంచి పట్టుంది. సినిమాల్లో ఏదైనా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. తర్వాత మధ్యలో వదిలేసి అమెరికా వెళ్ళి బాగా సంపాదించారు. ఏడేళ్ల తర్వాత సడెన్‌గా వచ్చి సినిమా చేస్తున్నా అని చెప్పారు. ఆయన గట్స్ ని మెచ్చుకోవాలి. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది. సినిమాకిదే ప్లస్ అవుతుంది. పెద్ద విజయం సాధించాలని, అశోక్ పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నా. అలాగే నాతో కూడా సినిమా చేయాలని కోరుకుంటున్నా. దర్శకుడు అజయ్ నా సినిమాలకి కొరియోగ్రఫీగా చేశారు. సినిమా చూశా. చాలా బాగుంది. భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు కావాలి. హీరోహీరోయిన్లు బాగా నటించారు. టెక్నీషియన్ల వర్క్ బాగుంది. సినిమాని అందరు ఆదరించాలని కోరుకుంటున్నా’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మరో నిర్మాత దివ్యా ప్రసాద్, సుభాష్, సత్య శ్రీ, హన్సిక్, కోటగిరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘రాజన్నే స్వయంగా స్క్రీన్ మీద ఉన్నారు’
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. రాజన్న పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జీవించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. పాజిటివ్ రివ్యూలతో, మంచి టాక్‌తో అందరి మన్నలను అందుకున్న ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమా వీక్షించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ యాత్ర చూశాను. ఇదొక ఎమోషనల్ జర్నీ. చాలా సందర్భాల్లో ఎమోషనల్ అయ్యాను. రాజన్నే స్వయంగా తెరపైకి వచ్చాడేమో అనేంతలా.. మమ్ముట్టి గారు అద్భుతంగా నటించారు. చిత్రానికి పనిచేసిన నటీనటులు, చిత్రయూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. సురేందర్ రెడ్డి ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. Watched Yatra! It was such a sincere emotional journey. Felt emotional on many occasions.Aided by a honest and brilliant performance by @mammukka gaaru, I felt rajanna himself was on the screen. Congratulations to the entire cast n crew for wonderful and respectful job...🙏🏻🙏🏻 pic.twitter.com/ypz3rChIEj — SurenderReddy (@DirSurender) February 11, 2019 -
అభిమానులకు మెగాస్టార్ బర్త్‌డే కానుక
-
సైరాలో నా రోల్ అదే
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. బ్రిటిష్ వారిని గడగడలాడించిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత గాథ ఆధారంగా సైరాను సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ ఈ ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి సైరాలో భాగం కానున్నాడు. తాజాగా విజయ్ నటించిన జుంగా విడుదల కాగా, చిత్ర ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సైరా గురించి విజయ్ ప్రస్తావించాడు. ‘బ్రిటీష్ వారిపై పోరాటానికి నరసింహారెడ్డి తమిళులు - తెలుగువారిని కలిపి ఒకేతాటిపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే నా పాత్ర సినిమాలోకి ఎంటరవుతుంది. తమిళ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిగా - తమిళ-తెలుగు భాషల్ని కలగలిపి మాట్లాడే క్యారెక్టర్‌ను పోషించా’ అని చెప్పాడు. ఇదే తన తొలి తెలుగు స్ట్రయిట్ సినిమా అని.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నానని విజయ్ చెప్పాడు. విజయ్ చెప్పిన అంశాలను పరిశీలిస్తే ఓబయ్య పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలతో మక్కల్ సెల్వన్ విజయ్ ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అందులో ఒకటి హిజ్రా పాత్రలో నటిస్తున్న ‘సూపర్ డీలక్స్’ కాగా.. మరొకటి పొలిటికల్ థ్రిల్లర్ ‘మామనిధన్’, వీటితోపాటు మణి రత్నం మల్టీస్టారర్ ’చెక్కా చివంత వానమ్’లో కూడా నటిస్తున్నాడు. -
రూమర్స్‌కు చెక్ : ‘సైరా’ సెట్లో బిగ్ బి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రంలో పరభాషా నటులు కూడా చాలా మంది కనిపించనున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడంటూ చిత్రయూనిట్ ప్రకటించారు. అయితే కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ నుంచి అమితాబ్ తప్పుకున్నాడన్న వార్తలు వినిపించాయి. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్‌తో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో బిగ్ బి కూడా తప్పకున్నారన్న వార్తలు మరింతగా వినిపించాయి. అయితే ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ సైరా షూటింగ్లో బిగ్ బి పాల్గొంటున్నారు. ఈ మేరకు అమితాబ్‌తో కలిసి దిగిన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో అమితాబ్ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో కనింపించనున్నారు. చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుధీప్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘సైరా’ అనిపించిన బుడ్డోడు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే నరసింహారెడ్డి లుక్ ఎలా ఉండబోతుందో ఓ హింట్ ఇచ్చారు చిత్ రయూనిట్. తాజాగా ఓ చిన్నారి నరసింహారెడ్డి లుక్ లో దిగిన స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధృవ సినిమా దగ్గర నుంచి మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా మారిన దర్శకుడు సురేందర్ రెడ్డి తనయుడే ఈ చిన్నారి నరసింహారెడ్డి. సైరా సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సురేందర్ రెడ్డి తన కొడుకుని ఇలా యోధుడిగా చూసుకొని మురిసిపోతున్నాడట. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న సైరా నరసింహారెడ్డి యూనిట్ ఫిబ్రవరిలో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. -
సైరా దర్శకుడి చేతుల మీదుగా..!
నంది క్రియేషన్స్ బ్యానర్ పై కె.ఎం.డి. రఫీ మరియు రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా, కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా ‘బంగారి బాలరాజు’ చిత్రం తో పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర గ్లిట్టర్ ను ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి విడుదల చేసారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... బంగారి బాలరాజు టీజర్ చూసాను. చాలా బాగుంది. కొత్తగా వస్తున్న ఈ చిత్ర ప్రొడ్యూసర్స్ రఫి గారికి, రాఘవేంద్రరెడ్డి గారికి డైరెక్టర్ కోటేంద్రకి, హీరో రాఘవ్ కు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అంటూ చిత్రయూనిట్‌కి అల్ ద బెస్ట్ చెప్పారు. చిత్ర నిర్మాతలు కె.ఎం.డి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ... సురేందర్ రెడ్డి గారి లాంటి ప్రముఖ దర్శకులు చేతుల మీదుగా మా సినిమా టీజర్ రిలీజ్ అవడం మాకు ఆనందంగా ఉంది. ఆయన సైరా మూవీ లో బిజీ గా ఉన్నా మాకు టైమ్ కేటాయించి టీజర్ ని విడుదల చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు’ తెలిపారు. డైరెక్టర్ కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ... మా బంగారి బాలరాజు మూవీ గ్లిట్టర్ ని పెద్ద మనసుతో విడుదల చేసిన సురేందర్ రెడ్డి గారికి మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాలాంటి కొత్త దర్శకులకు సురేందర్ రెడ్డి గారు ఆదర్శంగా ఉంటూ ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్ర థియేటరికల్ ట్రైలర్ ని ఫిబ్రవరి 14 న, సినిమాని మార్చి లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము’ అని తెలిపారు. -
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సైరా
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగునాట తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈనెల 6న ప్రారంభమైన మొదటి షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నగరంలోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీ సమీపంలోని అటవీ ప్రాంతంలో వేసిన ప్రత్యేక సెట్లో కీలక పోరాట సన్నివేశాలను తెరకెక్కించారు. ఇందుకోసం సినిమా టెక్నీషియన్లు సైతం దాదాపు 20రోజులపాటు తీవ్రంగా కష్టపడ్డారట. చిత్ర నిర్మాత రామ్ చరణ్ దగ్గరుండి నిర్మాణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 20 రోజులు కష్టపడి తొలి షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తిచేశారు. ఈచిత్రంలో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ కిచ్చలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి ఈచిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అత్యంత నమ్మకమైన అనుయాయుల్లో ఒకడైన ఓబయ్య పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇక చిరు సరసన నయనతార హీరోయిన్గా నటించనుంది. -
క్లాస్ విలన్!
ఉత్తమ విలన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ధృవ’ అనే సినిమా తెరకెక్కింది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్’కు రీమేక్ అది. అందులో విలన్ పాత్రను ఎవరితో నటింపజేయాలా అని టీమ్ చాన్నాళ్లు ఆలోచించింది. ‘తని ఒరువన్’లో చేసిన అరవింద్ స్వామి తప్ప ఇంకొకరు ఆ పాత్ర చేయలేరని రామ్ చరణ్ సహా అందరికీ అర్థమైపోయింది. మళ్లీ ఆయన్నే తీసుకొచ్చి తెలుగులోనూ విలన్‌గా చేయించారు. అదీ ఆ పాత్రలో అరవింద్ స్వామి చూపించిన మార్క్! అరవింద్ స్వామి పేరు చెప్పగానే, ‘ఎంత అందంగా ఉంటాడూ?’ అన్న మాటే నోట్లో నుంచి వచ్చేస్తుంది. హీరోగా ఆయన చేసిన సినిమాలు కూడా ఆ అందాన్ని మరింత పెంచినవే! అలాంటి అందగాడు విలన్‌గా చేస్తున్నాడంటే? ‘అబ్బే! అంతగా కుదరరేమో?’ అనుకున్నారు. కానీ జరిగిందేంటీ? ‘తని ఒరువన్’ విడుదలవగానే ఆయన తప్ప ఎవ్వరూ ఆ పాత్ర చేయలేరని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారంతా. రీమేక్ ‘ధృవ’లోనూ అరవింద్ స్వామిని తప్ప మరొకరిని ఊహించలేమనుకునే ఆయన్నే పట్టుకొచ్చారు. ‘ధృవ’లో అరవింద్ స్వామి ఒక స్టైలిష్ విలన్. కార్పొరేట్ నేరగాడు. ప్రపంచానికి మంచి బిజినెస్‌మేన్‌లా కనిపిస్తూ ఉండే ఒక కరుడుగట్టిన నేరస్థుడు. తనకు కావాల్సిన పని కోసం ఎంతదూరమైనా వెళతాడు. ఎవ్వరినైనా పైకి పంపించేస్తూంటాడు. ఇలాంటి విలన్లంతా మన సినిమాల్లో చూడడానికి భయపెట్టేలా ఉంటారు. ఇక్కడ మాత్రం ఈ విలన్ చాలా అందంగా ఉంటాడు. హీరోకు ఏమాత్రం తీసిపోడు. ప్లాన్ గీసాడంటే హీరోనే భయపడిపోతూంటాడు. ‘ఫస్ట్ టైమ్ సిద్ధార్థ్ అభిమన్యు అనే ఫార్ములాను వీడు కనిపెట్టాడు’ అని చెప్పినా, ‘ఎప్పుడూ మంచి మాత్రమే చెయ్యడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు’ అని చెప్పినా అంతా క్లాస్‌గా, స్టైల్‌గా ఉండేలా చూసుకుంటాడు సిద్ధార్థ్. అంటే మన అరవింద్ స్వామి. ఈ స్టైలే ఆయనకు హీరోగా ఎంత పాపులారిటీ తెచ్చిందో ఇప్పుడు విలన్‌గా అంతకు రెట్టింపు పాపులారిటీ తెచ్చింది. ‘తని ఒరువన్’, ‘ధృవ’ తర్వాత ఇప్పుడు అరవింద్ స్వామి బిజీ విలన్. ‘మా సినిమాలోనూ ఇంత అందమైన క్లాస్ విలన్ ఉండాల’ని కోరుకుంటున్నారు ఇప్పటి డైరెక్టర్లు. మొత్తమ్మీద విలన్‌కు ఒక స్టైల్ తేవడంలో అరవింద్ స్వామి ఒక హీరో అయిపోయాడు. -
చిరంజీవి 'ఉయ్యాలవాడ..' ప్రారంభం
-
వానవిల్లు సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్
ప్రతీక్ ప్రేమ్ కరణ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా 'వానవిల్లు'. శ్రావ్య, శ్రీ సయ్యిని హీరోయిన్లు. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై లంకా కరుణాకర్ దాస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలోని డ్యూయెట్ సాంగ్‌ని ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత లంకా కరుణాకర్ దాస్ మాట్లాడుతూ - 'టైటిల్‌కి తగ్గట్టు ఓ అందమైన వెరైటీ ప్రేమకథ ఇది. అందులో వర్షం ఏం చేసింది? అనేది ఆసక్తికరం. కేరళ, మలేసియాలలో కొంత టాకీ, సాంగ్స్ షూట్ చేశాం. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు మా సినిమాలోని పాటను విడుదల చేయడంతోపాటు.. టేకింగ్ చాలా రిచ్‌గా ఉందంటూ మెచ్చుకోవడం మాకు సంతోషాన్నిచ్చింది. త్వరలోనే ఆడియో విడుదల చేసి.. అనంతరం సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తాం' అన్నారు. -
రంగంలోకి రైటర్
చిరంజీవి 151వ సినిమా పనులు మొదలయ్యాయి. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తారు. కొత్త విషయం ఏంటంటే.. డీఎస్ కన్నన్ అనే రైటర్ రంగంలోకి దిగారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కి ఛాన్స్ దక్కడం కన్నన్‌కి సవాల్‌లాంటిదే. ఇంకా ఎంతమంది రైటర్స్ ఈ ప్రాజెక్ట్‌కి పని చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఇంతకీ ఈ కన్నన్ ఎవరంటే.. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అజయ్ హీరోగా రూపొందిన ‘సారాయి వీర్రాజు’ ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆగస్ట్‌లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇందులో చిరు సరసన ఐశ్వర్యా రాయ్ కథానాయికగా నటిస్తారని టాక్. -
చిరూతో ఐష్!
జస్ట్ రెండంటే రెండే. గత పదిహేనేళ్లలో కథానాయికగా ఐశ్వర్యా రాయ్ బచ్చన్ చేసిన సౌత్ సినిమాలు. ఆ రెండూ కూడా తమిళ సినిమాలే. ఓ సినిమా ‘రోబో’లో రజనీకాంత్ హీరో. దానికి శంకర్ దర్శకుడు. మరో సినిమా ‘రావణ్’ (తెలుగులో ‘విలన్’)కు మణిరత్నం దర్శకుడు. సౌత్ సినిమాల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తున్న ఐశ్వర్యను చిరంజీవికి జోడీగా తీసుకోవాలను కుంటున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా రూపొంద నున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరు సరసన ఐశ్వర్య జంటగా నటించడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. అప్పుడెప్పుడో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నాగార్జున ‘రావోయి చందమామ’లో ఐశ్వర ఓ ఐటమ్ సాంగ్ చేశారు. ఆ తర్వాత స్ట్రయిట్ తెలుగు సిన్మా చేయలేదు. ఇప్పుడీ సినిమాకు సైన్ చేస్తే హీరోయిన్గా ఆమె చేసే ఫస్ట్ స్ట్రయిట్ తెలుగు మూవీ అవుతుంది. -
కేపీసీ@365
‘ఖైదీ నంబర్ 150’ తర్వాత చిరంజీవి నటించబోయే చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడనే సంగతి అందరికీ తెలిసిందే. ఆదివారం అతణ్ణి కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ (కేపీసీ) లోకి సాదరంగా ఆహ్వానించారు. ‘ఖైదీ నంబర్ 150’ను కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై చిరు తనయుడు, హీరో రామ్‌చరణ్ నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తండ్రి 151వ చిత్రాన్ని కూడా ఈ సంస్థపైనే నిర్మించనున్నారు. ఆదివారంతో కొణిదెల ప్రొడక్షన్స్ ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో చిన్న సెలబ్రేషన్స్ జరిగాయి. రామ్‌చరణ్ మాట్లాడుతూ – ‘‘కేపీసీ ఫ్యామిలీలోకి సురేందర్‌రెడ్డిగారిని ఆహ్వానిస్తున్నాను. ఆగస్టులో నాన్నగారి కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది. అలాగే, ఈ సందర్భంగా ‘ఖైదీ నంబర్ 150’ వంటి చిత్రాన్ని అందించిన దర్శకులు వీవీ వినాయక్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. -
నిర్లక్ష్యపు ఏజెన్సీలను తొలగిస్తాం
‘భగీరథ’ పనుల పురోగతిపై సమీక్షలో ఈఎన్సీ సురేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వర్క్ ఏజెన్సీలను తొలగిస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి హెచ్చరించారు. భగీరథ పనుల పురోగతిపై అధికారులు, వర్క్ ఏజెన్సీల ప్రతినిధులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ డిసెంబర్‌లోగా మంచి నీళ్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ క్రమంలో పనులను వేగంగా చేయని వర్క్ ఏజెన్సీలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాత్రిళ్లు కూడా పైప్‌లైన్ పనులు జరిగేలా చూడాలని అన్ని జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ఆదేశించారు. సూర్యాపేట డివిజన్లో భగీరథ పనులు మందకొడిగా సాగుతున్నాయని, అక్కడ పనులు చేస్తున్న వర్క్ ఏజెన్సీ తీరు మార్చుకోకుంటే చర్యలు చేపడతామని హెచ్చరించారు. పాత మెదక్ జిల్లాలో వ్యవసాయ పనుల కారణంగా ఆగిన పైప్‌లైన్ పనులను వెంటనే మొదలుపెట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణాలకు ఆటంకాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, మెటీరియల్, కూలీల కొరత లేకుండా చూడాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో జరిగే సమీక్షకు సరైన సమాచారంతో రాని అధికారులపైనా శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు సురేశ్ కుమార్, కృపాకర్ రెడ్డి, కన్సల్టెంట్లు నర్సింగరావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెగా 151పై మరో అప్డేట్..!
ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ సినిమా మరింత భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. మరోసారి రామ్ చరణ్ నిర్మాణంలోనే సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఇప్పటికే మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఓకె చేశాడన్న ప్రచారం జరుగుతుంది. యూనిట్ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్ రిజిస్టర్ చేయించడంతో మెగా 151 సినిమా ఇదే అన్న టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా ధృవ లాంటి క్లాస్ హిట్ ను అందించిన సురేందర్ రెడ్డి మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పటికే మెగా 151 పనుల్లో బిజీ అయిన సూరి, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభించాడన్న టాక్ వినిపిస్తోంది. సంగీత దర్శకుడు తమన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి దిగిన సెల్ఫీని ట్వీట్ చేసిన తమన్, 'నా కిక్.. నా రేసుగుర్రం.. మరి ఇప్పుడు..???' అంటూ కామెంట్ చేశాడు. దీంతో అభిమానులు తమన్, మెగా మూవీపై హింట్ ఇచ్చాడని సంబరపడిపోతున్నారు. With my very own sensation my kick my racegurram and now .??? ♥️♥️♥️♥️♥️♥️ pic.twitter.com/qkasUZesTD — thaman S (@MusicThaman) 8 April 2017 -
చిరు.. నరసింహారెడ్డి లుక్..!
ఖైదీ నంబర్ 150తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు 151వ సినిమాకు రెడీ అవుతున్నాడు. హిస్టారికల్ జానర్లో తెరకెక్కుతున్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమాను తన 151వ చిత్రంగా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ కథపై చాలా రోజులుగా కసరత్తులు చేస్తున్న మెగా టీం ఫైనల్‌గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించేందుకు డిసైడ్ అయ్యింది. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. మెగా 151 మూవీ ఇదే అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే ఫైనల్ వర్షన్ కథ కూడా రెడీ చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం చిరంజీవి లుక్ మీద కసరత్తులు చేస్తున్నాడు. తొలి స్వతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా, చిరు ఎలా కనిపించాలో స్కెచ్‌లు గీయిస్తున్నారు. అలా గీయించిన స్కెచ్లలో ఒకటి బయటికి వచ్చింది. నిజంగానే ఇది యూనిట్ సభ్యులు గీయించిందా.. లేక ఎవరైనా ఫ్యాన్స్ రెడీ చేశారో తెలియదుగాని.. ఈ లుక్‌లో చిరు మాత్రం సూపర్బ్‌గా ఉన్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
మెగాస్టార్ 151 ప్రీ లుక్ ఇదేనా..?
తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి దశాబ్దకాలం తరువాత కూడా తన కలెక్షన్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. రీ ఎంట్రీలో 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సత్తా చాటిన మెగాస్టార్.. 151వ సినిమాను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నాడు. చాలా రోజులుగా చర్చల్లో ఉన్న చారిత్రక కథాంశం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఖైదీ నంబర్ 150 సక్సెస్ తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో చాలా రోజులు ఆలోచన చేసిన చిరు.. ఫైనల్‌గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికే ఫిక్స్ అయ్యారట. ఇటీవలే దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన ఫైనల్ వర్షన్ కథ విన్న మోగాస్టార్ చిరంజీవి ప్రీ ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లోగా మెగాస్టార్ కొత్త సినిమా పోస్టర్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ హల్చల్ చేస్తోంది. యుఎన్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అనే టైటిల్ లోగోపాటు ఆంగ్లేయులతో కొంతమంది వీరులు పోరాడుతున్న దృశ్యం, గొడ్డలితో పవర్ ఫుల్‌గా ఉంది, ఈ ప్రీ లుక్. అయితే ఈ పోస్టర్‌ను అఫీషియల్ యూనిట్ సభ్యులు రిలీజ్ చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా సర్క్యూలేట్ అవుతోంది. -
మెగాస్టార్ రిస్క్ చేస్తున్నాడా..?
రీ ఎంట్రీలో బిగ్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రెండు మూడు కథలను ఫైనల్ చేసిన మెగాస్టార్, ఏ సినిమాను పట్టాలెక్కించేది ప్రకటించలేదు. అయితే ఈ సినిమాను కూడా రామ్ చరణే నిర్మిస్తాడని ప్రకటించేశారు. తాజాగా ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చిరు ఎప్పటి నుంచో అనుకుంటున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను నెక్ట్స్ సినిమాగా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమాను కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నాడట. స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డి, చారిత్రక కథను ఎలా తెరకెక్కిస్తాడో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు సంబంధించి కథా కథనాలను రెడీ చేశారు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ కథ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే మెగా టీం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
మార్చి 28న టెన్త్ సోషల్ పేపరు–1 పరీక్ష
సాక్షి, హైదరాబాద్: వచ్చే మార్చి 28న పదో తరగతి సోషల్ స్టడీస్ పేపరు–1 పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం మార్చి 14 నుంచి 30 వరకు నిర్వహించేందుకు టైం టేబుల్ జారీ చేసినట్లు గురువారం పేర్కొన్నారు. అందులో మార్చి 29న సోషల్ స్టడీస్ పేపరు–1 పరీక్ష నిర్వహించేలా ఉందని, అయితే 29న ఉగాది పండుగ ఉన్నందున, ఆ పరీక్షను ఒకరోజు ముందుగా, 28న నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. 30న సోషల్ స్టడీస్ పేపర్–2 పరీక్ష ఉంటుందని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. -
తత్కాల్లో టెన్త్ ఫీజు చెల్లింపునకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పటికీ పరీక్ష ఫీజు చెల్లించని వారికి మరో అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. వారు తత్కాల్ కింద ఫీజు చెల్లించొచ్చని ఆయన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు రూ.1,000 తత్కాల్ ఫీజుతో పాటు పరీక్ష ఫీజును జనవరి 7లోగా చెల్లించొచ్చని సూచించారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు ఆ ఫీజులను 9లోగా బ్యాంకుల్లో జమ చేయాలని సూచించారు. మార్చిలో వార్షిక పరీక్షలకు హాజరయ్యే వారే మే/జూన్ లో జరిగే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులని వివరించారు. మరోవైపు ఒకసారి ఫెయిలైన రెగ్యులర్ విద్యార్థులు (2016 మార్చి, జూన్ లో పరీక్షలు రాసి ఫెయిల్ అయిన వారు) 2017 మార్చిలో జరిగే పరీక్షలకు హాజరయ్యేలా చివరి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని తెలిపారు. -
మెగా బ్యానర్లో అక్కినేని హీరో
తండ్రికి తగ్గ వారసుడని ప్రూవ్ చేసుకున్న యంగ్ హీరో రామ్ చరణ్ ఇప్పుడు నిర్మాతగానూ నిరూపించుకునే పనిలో ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150 సినిమాతో నిర్మాతగా మారుతున్న రామ్ చరణ్, భవిష్యత్తులో మరిన్ని సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. కేవలం మెగా హీరోలతోనే కాదు, ఇతర హీరోలతోనూ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే మరో యువ హీరోతో భారీ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు చెర్రీ. అఖిల్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అక్కినేని నటవారసుడు అఖిల్. ప్రస్తుతం తన రెండో సినిమాను విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు అఖిల్. ఈ సినిమాను రామ్ చరణ్ కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. -
అఖిల్ మూడో సినిమాకు స్టైలిష్ డైరెక్టర్..?
అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నట వారసుడు రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన రెండో సినిమాను ప్రారంభించబోతున్నాడు అఖిల్. ఈ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న అఖిల్ అదే సమయంలో తరువాత చేయబోయే సినిమా విషయంలో కూడా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇటీవల ధృవ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు అఖిల్. స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డితో సినిమా చేసే అఖిల్ కెరీర్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు అక్కినేని టీం. అందుకే రెండో సినిమా సెట్స్ మీదకు వెళ్లకు ముందే మూడో సినిమా కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలోనే అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
చిరుతో సురేందర్ రెడ్డి సినిమా ఏమైంది..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ధృవ. తమిళ సినిమా తనీ ఒరువన్కు రీమేక్ తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేలా తెరకెక్కించటంలో విజయం సాధించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అందుకే సూరి వర్కింగ్ స్టైల్, టేకింగ్ నచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తారన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ధృవ కలెక్షన్లకు కూడా ప్లస్ అయ్యింది. ఆశించినట్టుగా ధృవ మంచి టాక్ సొంతం చేసుకుంది. కానీ మెగాస్టార్ తో సురేందర్ రెడ్డి సినిమా మాత్రం వాయిదా పడింది. ధృవ తరువాత అంతా కొత్త వారితో ఓ సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు సురేందర్ రెడ్డి. మెగాస్టార్ తో సినిమా ఉంటుందని కాని ఏది ఎప్పుడు అన్నది ఇప్పుడే చెప్పలేమన్నాడు. నిజంగానే చిరుతో సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందా..? లేక ధృవ ప్రమోషన్ కోసం ఇలాంటి టాక్ సృష్టించారా.. అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. -
'ఆ పాత్ర కోసం ఎవరినీ అడగలేదు'
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ధృవ. తమిళ సూపర్ హిట్ తనీ ఒరువన్కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. థ్రిల్లింగ్ మైండ్ గేమ్‌తో సాగే ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర కూడా హీరోకు సమానంగా ఉంటుంది. తమిళ నాట ఈ పాత్రలో నటించిన అరవింద్ స్వామికి మంచి గుర్తింపు వచ్చింది. అందుకే తెలుగు వర్షన్ లోనూ ఆయన్నే విలన్‌గా తీసుకున్నారు. అయితే ధృవ సినిమా ప్రారంభానికి ముందు విలన్ పాత్రకు టాలీవుడ్ ప్రముఖులను సంప్రదించారన్న టాక్ వినిపించింది. ముఖ్యంగా సీనియర్ హీరో నాగార్జున ఈ విలన్ పాత్రకు అంగీకరించాడన్న వార్త అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో జగపతిబాబు లాంటి సీనియర్ హీరోల పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా ఈ రూమర్స్ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. తనీ ఒరువన్ సినిమాను రీమేక్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడే విలన్ పాత్రకు అరవింద్ స్వామినే తీసుకోవాలని ఫిక్స్ అయినట్టుగా తెలిపాడు. మరే నటుణ్ని సంప్రదించలేదన్న డైరెక్టర్, ఈ పాత్ర కేవలం ఆయన కోసం పుట్టింది. ఆయన తప్ప ఇంకెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరన్నాడు. తొలి రోజే 10 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ధృవ ఓవర్సీస్లో హాఫ్ మిలియన్ మార్క్‌ను దాటి వన్ మిలియన్ క్లబ్లో స్థానం కోసం పరుగులు తీస్తోంది. -
రామ్‌చరణ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు
బ్రూస్లీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ధృవ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా దర్శకుడు సురేందర్ రెడ్డి స్టైలిష్ ఎంటర్టైనర్గా ధృవ సినిమాను రూపొందిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని భావించినా.. చరణ్, చిరంజీవి 150వ సినిమా నిర్మాణ పనుల్లో బిజీగా ఉండటం, మధ్యలో విలన్గానటిస్తున్న అరవింద్ స్వామి ఆరోగ్యం బాలేకపోవటంతో ఆలస్యమైంది. దీంతో రెండు నెలలు ఆలస్యంగా సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్రయూనిట్ ఫైనల్‌గా సినిమా రిలీజ్ డేట్‌పై ఓ అభిప్రాయానికి వచ్చారన్న టాక్ వినిపిస్తోంది. అన్నికార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 2న ధృవ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై భారీగా నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్ కూడా డిఫరెంట్ మేకోవర్‌లో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. -
సురేందర్ రెడ్డితో జాగ్వర్..?
జాగ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో నిఖిల్ గౌడ. తొలి సినిమాతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించటంతో నిఖిల్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఆ అంచనాలను అందుకోవటం జాగ్వర్ విఫలమైంది. అయితే తొలి సినిమా రిజల్ట్ తో సంబందం లేకుండా నిఖిల్ రెండో సినిమాను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. జాగ్వర్ ఆడియో రిలీజ్ లో చెప్పినట్టుగా ఓ తెలుగు దర్శకుడితో నిఖిల్ రెండో సినిమా ఉండబోతుందన్న వార్త ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ధృవ సినిమాను తెరకెక్కిస్తున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిఖిల్ తన రెండో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. స్టైలిష్ ఎంటర్టైనర్ లు రూపొందించటంతో స్పెషలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి నిఖిల్ కు సక్సెస్ ఇస్తాడేమో చూడాలి. -
సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నిఖిల్‌గౌడ రెండో చిత్రం?
సాక్షి,బెంగళూరు: తన మొదటి చిత్రమైన జాగ్వార్ చిత్రంతో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి ఘనవిజయాన్ని అందుకున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి కుమారుడు నిఖిల్‌గౌడ రెండవ చిత్రానికి సిద్ధమవుతున్నారని సమాచారం. తండ్రి జన్మదినం సందర్భంగా డిసెంబర్16న తన మొదటి చిత్రం జాగ్వార్‌ను మొదలుపెట్టిన నిఖిల్‌గౌడ అదే రోజునే తన రెండవ చిత్రాన్ని కూడా మొదలుపెట్టనున్నారని వినికిడి. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ హైవోల్టేజ్ చిత్రానికి కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం తదితర హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ ప్రముఖ యువ దర్శకుడు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కాగా చిత్రంపై నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై నిఖిల్‌గౌడ, ఆయన తండ్రి హెచ్.డీ.కుమారస్వామిల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
చెర్రీ.. సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..?
బ్రూస్లీ లాంటి డిజాస్టర్ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ధృవ. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ స్టార్ కాస్ట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంత భారీగా తెరకెక్కుతున్న ధృవను ఓ సెంటిమెంట్ భయపెడుతుంది. ఇప్పటికే ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 7న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు రెండు సార్లు దసరా బరిలో దిగిన చెర్రీ ఒక్క సారి కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించలేదు. దసరా కానుకగా వచ్చిన గోవిందుడు అందరివాడేలేతో పర్వాలేదనిపించిన చెర్రీ, 2015లో బ్రూస్లీ సినిమాతో నిరాశపరిచాడు. దీంతో ధృవ సినిమా రిజల్ట్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మరి ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన చెర్రీ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి. -
పండక్కి రావడం పక్కా!
వీలయితే సంక్రాంతి.. లేదంటే దసరా.. పండగ సీజన్లో వెండితెరపై సందడి చేయడం రామ్‌చరణ్ అలవాటు. ఇప్పటివరకూ ఈ మెగాపవర్ స్టార్ నటించిన చిత్రాల్లో ‘నాయక్’, ‘ఎవడు’ సంక్రాంతికి, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘బ్రూస్లీ’ చిత్రాలు దసరాకి విడుదలయ్యాయి. ఈ దసరాకి కూడా రామ్‌చరణ్ రావడం పక్కా. రామ్ చరణ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ధ్రువ’. అక్టోబర్ 7న విడుదల కానుందీ సినిమా. దసరాకి వారం రోజుల ముందే రామ్‌చరణ్ రానున్నారు. ఇదిలా ఉంటే.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ చిత్రం ఫస్ట్ లుక్, పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న టీజర్‌ను విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘రోజా’ ఫేమ్ అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా, రామ్‌చరణ్ స్నేహితుడిగా నవదీప్ నటిస్తున్న ఈ సినిమా తమిళంలో విజయవంతమైన ‘తని ఒరువన్’కి తెలుగు రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ ఆది. -
చరణ్ సినిమాకు హ్యాండిచ్చిన సినిమాటోగ్రాఫర్
మెగా అభిమానులకు షాక్‌ల మీద షాకులిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. బ్రూస్ లీ సినిమాతో ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన చెర్రీ, ఇంతవరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్‌కు వెళ్లలేదు. అఫీషియల్‌గా సినిమా స్టార్ట్ చేసినా.. ఇతర పాత్రలపై సీన్స్ తీస్తున్నారే గానీ చరణ్ మాత్రం షూటింగ్లో పాల్గొనటం లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం కావటంతో ఈనెల 6 నుంచి షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ను రీమేక్ చేస్తున్నాడు చరణ్. ధృవ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాప్ టెక్నీషయన్స్తో కలిసి పనిచేస్తున్నాడు. అందుకే బంజరంగీ భాయ్‌జాన్ లాంటి భారీ బ్లాక్‌బస్టర్‌కు పనిచేసిన సినిమాటోగ్రఫర్ అసీమ్ మిశ్రా ధృవ టీంతో కలిశాడు. ఇప్పటికే పూర్తయిన తొలి రెండు షెడ్యూళ్లకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేసిన మిశ్రా. చరణ్ పాల్గొనబోయే మూడో షెడ్యూల్ నుంచి మాత్రం పనిచేయటం లేదు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ నుంచి పిలుపు రావటంతో మిశ్రా, ధృవ సినిమాను మధ్యలోనే వదిలేసి ముంబై వెళ్లిపోయాడట. దీంతో పిఎస్ విందాతో మిగతా సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు ధృవ యూనిట్. చరణ్ షూటింగ్‌కు రాకుండా మరింత ఆలస్యం చేస్తే యూనిట్లో మరింత మంది హ్యాండిచ్చే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
మళ్లీ సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నాడు
హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్, తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది నాన్నకు ప్రేమతో సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన సుకుమార్ మంచి విజయాన్ని సాధించాడు. అదే జోరులో వచ్చే సంక్రాంతి బరిలో కూడా సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా కోసం కథ కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడు సుక్కు. నాన్నకు ప్రేమతో సినిమా తరువాత ఇంత వరకు సినిమా మొదలు పెట్టని సుకుమార్, రామ్ చరణ్ హీరోగా ఓ పర్ఫెక్ట్ లవ్ స్టోరీ చేస్తానంటూ ప్రకటించాడు. తన గత సినిమాల మాదిరిగా ఎలాంటి సైన్స్ పాఠాలు లేకుండా రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. చెర్రీ కూడా ఆరెంజ్ సినిమా తరువాత లవ్ స్టోరీలో నటించలేదు. అందుకే సుకుమార్ డైరెక్షన్లో రొమాంటిక్ ఎంటర్టైనర్కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ తనీఒరువన్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా పూర్తయిన తరువాత సుకుమార్ డైరెక్షన్లో సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో సత్తా చాటిన సుకుమార్ వచ్చే ఏడాది కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి. -
పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు హాజరు
రావుకుప్పం/యాదమరి(చిత్తూరు జిల్లా): పుట్టెడు దుఃఖంలోనూ పదోతరగతి పరీక్షకు హాజరై తండ్రుల ఆశయాలను నెరవేర్చారు చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు. యాదమరి మండలం వరదరాజలుపల్లెకు చెందిన సురేంద్రరెడ్డి ఆదివారం సాయంత్రం మరణించాడు. అతని కుమార్తె చేతన సోమవారం పుట్టెడు దుఃఖంతో పరీక్షకు హాజరై తండ్రి ఆశయాలను నెరవేర్చింది. అలాగే రావుకుప్పం వుండలం పల్లికుప్పం గ్రామానికి చెందిన సోమశేఖర్ కుమారుడు కార్తీక్ పదోతరగతి చదువుతున్నాడు. కార్తీక్ తండ్రి సోమవారం హఠాత్తుగా మరణించాడు. కానీ ఈ విషయాన్ని విద్యార్థికి తెలియనీయకుండా అధికారులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు జాగ్రత్త పడ్డారు. పరీక్ష రాసిన తర్వాత విషయం తెలుసుకున్న కార్తీక్ బోరున విలపించాడు. -
పోలీస్ గెటప్‌లో... కొత్త సినిమా
ఇటీవల అందరి దృష్టినీ ఆకర్షించిన తమిళ చిత్రం ‘తని ఒరువన్’. ‘జయం’ రవి హీరోగా అతని సోదరుడు రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పెట్టిన పెట్టుబడికి ఐదింతలు వసూలు చేసింది. ఈ కథ తెలుగులో రామ్చరణ్కైతే బాగుంటుందని మన నిర్మాతలు అనుకున్నారు. చరణ్ కూడా ఈ సినిమా చేయడానికి ఇష్టపడ్డారు. సురేందర్ రెడ్డిని దర్శకునిగా ఎంపిక చేశారు. తెలుగుకి తగ్గట్టు కథల్లో కొన్ని మార్చులూ, చేర్పులు చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్. ‘మగధీర’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు ఏడేళ్లకు మళ్లీ గీతా ఆర్ట్స్‌లో చరణ్ చేస్తున్న చిత్రం ఇది. ఈసారి కూడా ఓ సూపర్ హిట్ ఇవ్వనున్నామనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేసింది. ఇందులో రామ్‌చరణ్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. రకుల్ ప్రీత్‌సింగ్‌ను నాయిక. తమిళంలో చేసిన విలన్ పాత్రను తెలుగులో కూడా అరవింద్ స్వామే చేయనున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై. ప్రవీణ్‌కుమార్, సహ నిర్మాత: ఎన్.వి. ప్రసాద్. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో గురువారం ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు కొమ్మేపల్లి గ్రామానికి చెందిన రైతు గజ్జెల సురేంద్రరెడ్డి (40)కి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. నాలుగు ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం కోసం కలికిరి ఆంధ్రా బ్యాంకులో రూ.40 వేలు రుణం తీసుకున్నాడు. వ్యసాయ బోర్లు వేసేందుకు, కుమార్తెలకు పెళ్లి చేయడానికి బయటి వ్యక్తుల నుంచి రూ.5 లక్షలకు పైగా అప్పు చేశాడు. పొలంలో మూడు బోర్లు వేయించాడు. నీరు పడకపోవడంతో నష్టపోయాడు. దానికి తోడు రుణమాఫీ కూడా కాలేదు. బయటి వ్యక్తుల వద్ద తీసుకున్న అప్పునకు వడ్డీలు పెరిగిపోయాయి. వడ్డీ, అసలు కలిపి సుమారు రూ.6లక్షల అప్పు మిగిలింది. రుణదాతల ఒత్తిడి పెరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల వర్షాలు కురవడంతో చెరువుల్లోకి నీరుచేరింది. వరి సాగుచేసేందుకు పొలాన్ని సిద్ధం చేశాడు. కూలీలు, ఎరువులకు డబ్బు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. గురువారం తెల్లవారుజామున పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
'రక్షక్’గా రామ్‌చరణ్..?
-
'రక్షక్'గా రామ్‌చరణ్...?
'బ్రూస్ లీ' ఫెయిల్యూర్‌తో కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న రామ్ చరణ్ తిరిగి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే తమిళ సూపర్ హిట్ సినిమా 'తనీ ఒరువన్'ను రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటిచిన మెగా వారసుడు. త్వరలోనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. కథ కూడా ఫైనల్ చేసిన చెర్రీ ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ఇతర విషయాల మీద దృష్టి పెట్టాడు. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. శృతిహాసన్ హీరోయిన్గా నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాకు కీలకమైన విలన్ పాత్రకు చాలా మంది పేర్లు పరిశీలించినా ఫైనల్ గా ఒరిజినల్ వర్షన్లో నటించిన అరవింద్ స్వామితోనే ఆ పాత్ర చేయించాలని నిర్ణయించుకున్నారట. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు 'రక్షక్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇంత వరకు ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. -
విలన్‌గా యమ క్రేజ్
మణిరత్నం ‘రోజా’, ఆ తరువాత ‘బొంబాయి’ హీరోగా అందరికీ దగ్గరైన అరవింద్ స్వామి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి బిజీ. ఆయన విలన్‌గా, ‘జయం’ రవి హీరోగా నటించిన లేటేస్ట్ తమిళ హిట్ ‘తని ఒరువన్’ తాజాగా రామ్‌చరణ్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. తెలుగులోనూ అరవిందే విలన్ పాత్రధారి. ఇలా ఉండగా, తమిళంలో ఇప్పుడు అరవింద్‌స్వామి, ‘జయం’ రవి కాంబినేషన్‌కు భలే క్రేజ్ ఉంది. ‘రోమియో-జూలియట్’ తమిళ చిత్ర దర్శకుడు లక్ష్మణన్ దర్శకత్వంలో కొత్త చిత్రంలో మళ్ళీ వీళ్ళిద్దరూ నటిస్తున్నారు. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో ఈ ఇద్దరూ మళ్ళీ విలన్, హీరోలుగా చేస్తున్నారట! -
చరణ్ కోసం అంకుల్స్ వెయిటింగ్
బ్రూస్ లీ సినిమా ఫెయిల్యూర్‌తో ఇప్పుడు అందరి దృష్టి రామ్ చరణ్ నెక్ట్స్ సినిమా మీదే పడింది. ముఖ్యంగా భవిష్యత్ మెగాస్టార్ అన్న పేరున్న చరణ్ మగధీర తరువాత ఇంతవరకు ఒక్క భారీ విజయాన్ని కూడా నమోదు చేయలేదు. దీంతో చరణ్‌కు భారీ బ్రేక్ ఇచ్చేందుకు ఆయన అంకుల్స్ రెడీ అవుతున్నారట. బ్రూస్ లీ తరువాత చరణ్ తమిళ సినిమా తనీ ఒరువన్ రీమేక్‌లో నటిస్తాడంటూ భారీ ప్రచారమే జరుగుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించాల్సి ఉన్నా.. చివరి నిముషంలో అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్‌ను టేకోవర్ చేశాడు. నిర్మాతగా ఎంతో అనుభవంతో పాటు సినిమాను మార్కెట్ చేయటంలో కూడా మంచి టాలెంట్ ఉన్న అరవింద్.. చరణ్‌కు ఓ భారీ కమర్షియల్ హిట్ ఇవ్వాలని భావిస్తున్నాడట. అదే సమయంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా చరణ్‌తో సినిమా నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు. ఇటీవలే చరణ్‌తో నిర్మించబోయే సినిమాకు కథ కోసం వెతుకుతున్నాం అంటూ ప్రకటించిన పవన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం విదేశాల్లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్న చరణ్, తిరిగి వచ్చాక ఎవరి నిర్మాణంలో సినిమాను పట్టాలెక్కిస్తాడో చూడాలి. -
'ఖాకీ' కథపై మనసుపడ్డ చెర్రీ
చెన్నై: టాలీవుడ్ మెగా వారసుడు, యంగ్ హీరో రామ్‌చరణ్ మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీకి రెడీ అవుతున్నాడు. తుఫాన్ చిత్రంలో పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ యంగ్ హీరో మరోసారి 'ఖాకీ' కథపై మనసుపడ్డాడట. ఇంకా పేరు ఖరారు చేయని 'తాని ఒరువన్' రీమేక్ మూవీలో చెర్రీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా లీడ్ రోల్ నటించనున్నాడట. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. ' బ్రూస్ లీ' చిత్రాన్ని నిర్మిస్తున్న డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కనుంది. నిర్మాత దానయ్య ఈ విషయాన్ని 'ఐఎఎన్ఎస్'కు వివరించారు. మిగతా నటీనటులను ఇంకా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. కాగ ఓ సిన్సియర్ పోలీసు అధికారి, అవినీతి, అక్రమాలకు పాల్పడే బడా పారిశ్రామికవేత్త మధ్య నడిచే కథాంశంతో తమిళంలో విడుదలైన మూవీ 'తాని ఒరువన్`. తమిళంలో జయం రవి పోలీసు అధికారిగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుమారు 70 కోట్ల బిజినెస్ ను సాధించింది. నయన తార హీరోయిన్ నటించిన ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్‌గా నటించారు. తెలుగులో ఈ పాత్ర కోసం ప్రముఖ నటుడు నాగార్జునను సంప్రదించినట్లు సమాచారం. -
ఫ్లాప్ దర్శకులకు చరణ్ చేయూత
టాలీవుడ్ ఇండస్ట్రీ సక్సెస్ వెంటే పరిగెడుతుంది అన్న మాట నిజమే.. అయితే అందరి విషయంలో ఈ మాట నిజం కాదు. కరెక్ట్‌గా కథ చెప్పగలిగితే ఫ్లాప్ దర్శకులతో కూడా పని చేయడానికి రెడీ అవుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అంతేకాదు అలా ఫ్లాప్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా సాదిస్తున్నాడు. తన కెరీర్ స్టార్టింగ్ నుంచే ఈ ఫార్ములా ఫాలో అవుతున్న చెర్రీ మంచి రిజల్టే సాదిస్తున్నాడు. ముఖ్యంగా ఒక ఫ్లాప్ తీసిన దర్శకుడు నెక్ట్స్ సినిమాను ఎలాగైన సక్సెస్ చేయాలన్న కసితో చేస్తాడు కనుక చరణ్ కెరీర్లో ఈ ఫార్ములు ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్‌నే ఇచ్చింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన బద్రినాద్ సినిమాతో తన కెరీర్లో బిగెస్ట్ ఫ్లాప్‌ను ఫేస్ చేశాడు వినాయక్.. ఈ ఎఫెక్ట్‌తో వినాయక్ కెరీర్లో లాంగ్ గ్యాప్ తప్పలేదు. అయితే కష్టాల్లో ఉన్న సమయంలో వినాయక్‌కి సినిమా ఇచ్చి ఆదుకున్నాడు చెర్రీ.. బద్రినాథ్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత చరణ్ హీరోగా నాయక్ సినిమా చేశాడు. అప్పటికే చరణ్‌కు ఉన్న భారీ మాస్ ఇమేజ్‌తో నాయక్ మంచి విజయం సాధించింది. 40 కోట్లకు పైగా వసూళు చేసి చరణ్‌తో పాటు వినాయక్ కెరీర్లో కూడా బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. చాలా ఏళ్లుగా హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న కృష్ణవంశీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి రామ్ చరణ్‌నే నమ్ముకున్నాడు. పైసా, మొగుడు లాంటి వరుస డిజాస్టర్లతో కెరీర్ కష్టాల్లో పడ్డ సమయంలో బిగ్ స్టార్‌తో సినిమా చేస్తే తప్ప కెరీర్ గాడిలో పడదని, యంగ్ హీరోలను పక్కన పెట్టేశాడు. రామ్ చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడేలే సినిమాను తెరకెక్కించిన కృష్ణవంశీ మంచి సక్సెస్ సాదించాడు. కృష్ణవంశీ మార్క్ ఫ్యామిలీ డ్రామతో పాటు, చెర్రీ మార్క్ కమర్షియల్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్న ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవటంతో పాటు వసూళ్ల పరంగా కూడా సత్తా చాటింది. శ్రీనువైట్ చేసిన అన్ని సినిమాల్లోకి బిగెస్ట్ ఫ్లాప్ ఆగడు.. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఒక్కసారిగా శ్రీనువైట్ల కెరీర్‌ను డైలామాలో పడేసింది. ఈసినిమా రిజల్ట్ తో ఇక శ్రీనువైట్లకు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తుందా అని భావించారు అంతా. ఇలాంటి సమయంలో కూడా శ్రీనువైట్లతో సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఆగడు సినిమా కన్నా ముందే ఇచ్చిన కమిట్ మెంట్ కావటంతో ఆ సినిమా రిజల్ట్ తో సంబందం లేకుండా బ్రూస్లీ సినిమాకు అంగీకరించాడు. తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతాడన్న టాక్ వినిపిస్తుంది. త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు చెర్రీ. కిక్ 2 సినిమాతో భారీ డిజాస్టర్ ను ఫేస్ చేసిన సురేందర్ రెడ్డి చరణ్ తో సినిమా చేస్తున్నాడన్న వార్త బలంగా వినిపిస్తుంది. తనీ ఒరువన్ రీమేక్ గా తెరకెక్కనున్న కొత్త సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు చరణ్. -
'కిక్ 2' ఎఫెక్ట్
రేసుగుర్రం లాంటి భారీ హిట్ తరువాత మంచి ఫాంలో కనిపించిన సురేందర్ రెడ్డి నెక్ట్స్ సినిమాతోనే నిరాశపరిచాడు. భారీ అంచనాలతో కిక్ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కించిన కిక్ 2 సురేందర్ రెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. రేసుగుర్రం తరువాత చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు ఓకె చేసుకున్నా, ఇప్పుడా ప్రాజెక్ట్స్ అన్ని డైలామాలో పడ్డాయి. ముఖ్యంగా కిక్ 2 షూటింగ్ సమయంలోనే రామ్‌చరణ్‌కు కథ వినిపించిన సూరి నెక్ట్స్ ఆ సినిమానే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావించాడు. సురేందర్ రెడ్డి చెప్పిన కథ నచ్చిన చరణ్ కూడా శ్రీనువైట్లతో చేస్తున్న బ్రూస్లీ సినిమా తరువాత అదే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే కిక్ 2 రిజల్ట్ సీన్ రివర్స్ చేసేసింది. సురేందర్ రెడ్డితో చేసే ప్రాజెక్ట్ విషయంలో చెర్రీ పునరాలోచనలో ఉన్నాడట. బ్రూస్లీ సినిమా పూర్తి కావస్తుండటంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో సీరియస్‌గా ఆలోచిస్తున్న చరణ్ ముందు రెండు ఆఫ్షన్స్ ఉన్నాయి. సురేందర్ రెడ్డి సినిమాతో పాటు తమిళ్లో సూపర్ హిట్ అయిన తనీ ఒరువన్ రీమేక్. అయితే సూరి సినిమాతో రిస్క్ చేయటం కన్నా తనీఒరువన్ రీమేక్ చేయటమే బెటర్ అని భావిస్తున్నాడు చరణ్. -
ఆ రెండు చిత్రాలకు సీక్వెల్స్ చేయాలని ఉంది!
‘‘రామ్‌చరణ్ తో సినిమా చేయడానికి కథ సిద్ధం చేసుకుంటుండగా కళ్యాణ్‌రామ్‌గారు నాతో సినిమా చేద్దామనుకున్నారు. అలా ‘కిక్-2’ స్టార్ట్ అయింది’’ అని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పారు. రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించిన ‘కిక్-2’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని ఆదివారం పాత్రికేయులతో అన్నారు సురేందర్ రెడ్డి. మరికొన్ని విశేషాలను ఆయన చెబుతూ - ‘‘‘కిక్’ తండ్రి కథ, ఇది కొడుకు కధ కాబట్టి ‘కిక్-2’ అని డిసైడయ్యాం. షూటింగ్ త్వరగా పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కువ టైమ్ పట్టింది. ఈలోపు ‘బాహుబలి’ విడుదల కావడంతో, మా సినిమా విడుదలకు కొంత గ్యాప్ తీసుకున్నాం. బడ్జెట్ ఎక్కువైందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో నిజం లేదు. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. మీడియాలో ఏవేవో వార్తలు వస్తుంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోను. అయితే ద్వితీయార్ధంలో నిడివి ఎక్కువగా ఉందని కామెంట్లు వినిపించాయి. అందుకే కొన్ని సీన్స్ ట్రిమ్ చేశాం. అన్నీ కుదిరితే ‘కిక్-2’, ‘రేసుగుర్రం’ సినిమాలకు సీక్వెల్స్ తీస్తాను. రామ్‌చరణ్‌తో చేయబోయే చిత్రానికి కోన వెంకట్ కథ చెడీ చేశారు. త్వరలో ఆ కథను రామ్‌చరణ్‌కు వినిపించబోతున్నాను. ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలని ఉంది. బాండ్ తరహా చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి చిత్రాలు కూడా చేయాలని ఉంది’’ అని చెప్పారు. -
కిక్ - 2లో 20 నిమిషాల కత్తిరింపు
చెన్నై : కిక్ - 2 చిత్రంలోని కొంత భాగాన్ని తొలగించినట్లు ఆ చిత్ర దర్శకుడు సురేందర్‌రెడ్డి శనివారం చెన్నైలో వెల్లడించారు. ఈ చిత్రంలో ఇంటర్వేల్ తర్వాత 20 నిమిషాలను చిత్రాన్ని తీసివేసినట్లు తెలిపారు. రెండున్నర గంటల నిడివి గల ఈ చిత్రంలోని సెకండ్ హాఫ్ కొద్దిగా ఎక్కవైనట్లు అనిపించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన కిక్ -2 చిత్రం ఆగస్టు 21న విడుదలైన సంగతి తెలిసిందే. రవితేజ, ఇలియానా జంటగా నటించిన కిక్ 2009లో విడుదలైన బాక్సాఫీసు రికార్డులను బద్దలకొట్టిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా కిక్ - 2చిత్రాన్ని నిర్మించారు. -
జైలుకెళ్తానేమోనని..!
సంగారెడ్డి క్రైం: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయంతో ఓ వ్యక్తి న్యాయమూర్తి ఎదుటే గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా సంగారెడ్డి కోర్టులో గురువారం చోటు చేసుకుంది. వివరాలు... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరుకు చెందిన వై సురేందర్‌రెడ్డి(43) వ్యాపార రీత్యా భార్యాపిల్లలతో చందానగర్‌లో ఉంటున్నాడు. ఈ నెల 12న సురేందర్‌రెడ్డి మద్యం తాగి వాహనం నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు రామచంద్రాపురంలో పట్టుకున్నారు. ఆయనను సంగారెడ్డిలోని ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ప్రభాకర్ ఎదుట ట్రాఫిక్ పోలీసులు హాజరుపర్చారు. తనను జైలుకు పంపుతారేమోనని మానసిక ఆందోళనకు గురైన సురేందర్‌రెడ్డి న్యాయమూర్తి సమక్షంలో కోర్టులోనే కుప్పకూలాడు. -
మా అబ్బాయి నా జీవితాన్ని మార్చేశాడు
‘‘మా అబ్బాయి అయాన్ పుట్టిన తర్వాత ‘రేసు గుర్రం’ విడుదలైంది కాబట్టి, తనవల్లే ఆ చిత్రం ఘనవిజయం సాధించిందని అంటే దర్శకుడు సురేందర్‌రెడ్డి అంత ఆనందపడకపోవచ్చు. ఎందుకంటే, తన ఏడాది కష్టం, ఇతర చిత్రబృందం శ్రమ తాలూకు ఫలితమే ఈ విజయం. అఫ్కోర్స్ మా అబ్బాయి వచ్చి నా జీవితాన్ని మార్చేశాడనుకోండి. అది కాదనలేని విషయం’’ అని ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ పేర్కొన్నారు. అయాన్ పుట్టిన తర్వాత మునుపటికన్నా జీవితం ఇంకా ఆనందంగా ఉందని అల్లు అర్జున్ చెబుతూ -‘‘అయాన్ని మొదటిసారి చూసిన క్షణాలను నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో నేను పొందిన అనుభూతిని దేనితోనూ వెలకట్టలేం... దేనికీ దీటు కాదు. ఈ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే తండ్రి కావాల్సిందే’’ అన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే, గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
12న డైట్ కౌన్సెలింగ్ షెడ్యూల్?
జనవరి నుంచి తరగతులు సాక్షి, హైదరాబాద్: డైట్‌సెట్ ప్రవేశాల అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. తెలంగాణలోని డైట్ కళాశాలలకు అగ్నిమాపక శాఖ జారీ చేసే నిరభ్యంతర (ఫైర్ సేఫ్టీ ఎన్వోసీ) పత్రాలు లేకపోయినా గుర్తింపును పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో ఫైర్‌సేఫ్టీ పత్రాలు లేకపోతే కౌన్సెలింగ్ నిర్వహించలేమని డైట్ కన్వీనర్ పేర్కొన్నారు. అయితే ఆ కళాశాలల నుంచి కౌన్సెలింగ్ సమయంలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్వోసీలు స్వీకరించాలని తాజా నిర్ణయించారు. దీంతో కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యాశాఖలు తమ పరిధిలోని డైట్ కళాశాలల జాబితాలను సమర్పించడంతో.. కౌన్సెలింగ్ చేపట్టేందుకు డైట్‌సెట్ యం త్రాంగం కసరత్తు చేస్తోంది. తెలంగాణలోని 253, ఏపీలోని 413 డైట్ కళాశాలల్లో ఉమ్మడి ప్రవేశాల కోసం ఈ నెల 12వ తేదీన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఒకవేళ ఆలస్యమైతే 15 లేద 16వ తేదీన షెడ్యూల్ ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు. షెడ్యూల్ వెలువడిన అనంతరం అందులో ప్రకటించిన తేదీ నుంచి విద్యార్థుల నుంచి ఆన్లైన్లో ఆప్షన్లు స్వీకరించి, ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన 15 రోజుల్లోగా కళాశాలల్లో తరగతులను ప్రారంభిస్తారు. మొత్తంగా వచ్చే ఏడాది జనవరి మొదటివారంలో తరగతులు ప్రారంభమవుతాయని డైట్ కన్వీనర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. -
డాక్టర్ కిడ్నాప్ కేసులో మరొకరి అరెస్ట్
భీమారం : హన్మకొండలోని అదాలత్ ప్రాం తంలో జరిగిన పిల్లల డాక్టర్ సురేందర్‌రెడ్డి కిడ్నాప్ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కిడ్నాపర్లు 40 నిమిషాల్లోనే రూ.21 లక్షలు డిమాండ్ చేసి రాబట్టుకున్నారు. ఈ ఘటనలో హన్మకొండకు చెందిన ఉతకం దీపక్, గోకుల్‌నగర్‌కు చెందిన కొడారి రాజు, కాజీపేటకు చెందిన నాగెల్లి సంతోష్, వర్ధన్నపేటకు చెందిన వడ్లకొండ హరీన్ పాల్గొనగా వీరిలో దీపక్, సంతోష్‌ను ఇటీవల అరెస్ట్ చేసి, జైలుకు పంపిన విషయం తెలిసిందే. పరారీలో ఉన్న హరీన్, కొడారి రాజు కోసం గాలిస్తుండగా హరీన్ సోమవారం పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద సుమారు రూ.1.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అతడు ప్రస్తుతం ఉతకం దీపక్‌కు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని హన్మకొండ డీఎస్పీ దక్షిణామూర్తి చెప్పారు. ఈ కేసులో మరో నిం దితుడు కొడారి రాజు పరారీలో ఉన్నట్లు ఆయ న తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు వివరించారు. వ్యక్తిగత అవసరాల కోసమే డాక్టర్‌ను కిడ్నాప్ చేశారని తమ విచారణలో వెల్లడైనట్లు ఆయన వెల్లడిం చారు. విలేకరుల సమావేశంలో సీఐ దేవేందర్‌రెడ్డి, కానిస్టేబుల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
డబ్బు కోసమే కిడ్నాప్
వరంగల్ క్రైం : సంచలనం సృష్టించిన పిల్లల వైద్యుడు సురేందర్‌రెడ్డి కిడ్నాప్ వ్యవహారాన్ని వరంగల్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కేసులో నిందితులైన నలుగురిలో ఇద్దరిని కేయూసీ పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. హన్మకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు నిందితుల వివరాలు వెల్లడించారు. నిందితుల్లో హన్మకొండ వికాస్‌నగర్‌కు చెందిన ఉతకం దీపక్, గోకుల్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ కడారి రాజు, కాజీపేట ఫాతిమానగర్‌కు చెందిన నాగెళ్లి సంతోష్, వర్ధన్నపేటకు చెందిన హరీణ్ ఉన్నారు. ఉతకం దీపక్ మద్యం వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అతడు టాటా సుమో వాహనం చోరీ కేసులో నిందితుడు. రెండో నిందితుడైన రౌడీషీటర్ కడారి రాజు అంబేద్కర్‌భవన్ వద్ద ఉన్న తిరుమల బార్ వద్ద జరిగిన హత్య కేసులో నిందితుడు. కోర్టు వారుుదాలకు హాజరయ్యే క్రమంలో దీపక్‌కు తన బావమరిది ద్వారా రాజు పరిచయమయ్యూడు. ఇద్దరికీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణరుుంచుకున్నారు. ఇద్దరూ కలిసి కోర్టుకు సమీపంలో ఆస్పత్రి నిర్వహిస్తున్న డాక్టర్ సురేందర్‌రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు పథకం రచించారు. గతంలో దీపక్ తన చెల్లెలి కుమార్తె చికిత్స కోసం తరచూ డాక్టర్ సురేందర్‌రెడ్డి దగ్గరికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే అతడు సదరు వైద్యుడు హుజూరాబాద్ పట్టణంలోనూ క్లినిక్ నడుపుతున్నట్లు, ఇందుకోసం ప్రతీరోజు హన్మకొండ నుంచి హుజూరాబాద్‌కు వెళ్లి వస్తారని తెలుసుకున్నాడు. అతడు హరీణ్, సంతోష్‌కు డబ్బు ఆశజూపి డాక్టర్‌ను కిడ్నాప్ చేయడంలో సహకరించాలని కోరాడు. నలుగురు కలిసి ఆగస్టులో డాక్టర్‌కు ఫోన్ చేసి హుజూరాబాద్ ప్రాంతంలో క్లినిక్ నడుపొద్దని, తమ మా ట వినకుంటే హత్య చేస్తామని, ఇందుకోసం రూ.50 లక్షలు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామంటూ బెదిరించారు. ఆగస్టు 18, 19 తేదీల్లో డాక్టర్‌ను కిడ్నాప్ చేసేందుకు యత్నిం చగా కారు సమస్యతో ఆ ప్రయత్నం విఫలమైంది. కిడ్నాప్ చేసిందిలా.. ఆగస్టు 21న డాక్టర్ సురేందర్ రెడ్డి హుజూరాబాద్‌లోని తన క్లినిక్ నుంచి రాత్రి 9 గంటలకు హన్మకొండకు కారులో బయల్దేరాడు. అదే సమయంలో నిందితులు నలుగురు కలిసి ఇన్నోవా వాహనంలో డాక్టర్ కారును వెంబ డించారు. రాత్రి 10 గంటలకు డాక్టర్ తన కాంపౌండర్‌ను హన్మకొండ బస్టాండ్ ప్రాం తంలో దింపి తన ఇంటికి వెళుతుండగా ఇం టికి సమీపంలోనే ఆయన కారుకు వారి ఇన్నో వా కారును అడ్డుపెట్టారు. కత్తితో బెదిరించి కిడ్నాప్ చేశారు. దేవన్నపేట గ్రామశివారులోకి తీసుకెళ్లి ‘నిన్ను చంపేందుకు ఒకరితో ఒప్పం దం చేసుకున్నామని, చంపకుండా ఉండాలంటే రూ.30 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. ఆయన సెల్ నుంచి ఆయన భార్య డాక్టర్ ఉషారాణికి ఫోన్ చేసి బెదిరించారు. కొద్దిరోజుల క్రితం ప్లాట్ అమ్మగా వచ్చిన రూ. 21 లక్షలు ఉన్నాయని చెప్పడంతో నిందితుల్లో ఒకరైన ఇన్నోవా కారు డ్రైవర్ డాక్టర్ ఇంటికి వెళ్లి ఆ డబ్బులను తీసుకొచ్చాడు. డబ్బు చేజిక్కించుకున్న కిడ్నాపర్లు డాక్టర్‌ను కేయూసీ వంద ఫీట్ల రోడ్డులోని శ్యామల గార్డెన్స్ వద్ద వదిలి వెళ్లారు. రూ.21 లక్షల్లో దీపక్ రూ.14.80 లక్షలు, రాజు 4.40 లక్షలు, సంతోష్ రూ.60 వేలు, హరీన్ రూ. 1.20 లక్షల చొప్పున పంచుకున్నారు. కాగా డాక్టర్ ఫిర్యాదుతో కేసు తొలుత హుజూరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది. హన్మకొండలో కిడ్నాప్ జరిగినట్లు తెలుసుకుని సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు కేసు విచారణ బాధ్యతలను కాకతీయ యూనివర్సిటీ సర్కిల్ సీఐ దేవేందర్‌రెడ్డికి అప్పగించారు. నిందితులు దీపక్, సంతోష్ వడ్డేపల్లి సమీపంలోని ఫిల్టర్‌బెడ్ పరిసరాల్లో ఉన్నట్లు హన్మకొండ డీఎస్పీ దక్షిణమూర్తికి మంగళవారం తెలియడంతో ఆయన సీఐ దేవేందర్‌రెడ్డికి సమాచారమిచ్చారు. సీఐ సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాము డాక్టర్‌ను కిడ్నాప్ చేసినట్లు అంగీకరించారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి రూ.7.34 లక్షల నగదు, కిడ్నాప్‌నకు ఉపయోగించిన ఇ న్నోవా కారు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేయడం, నగదు స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ దక్షిణామూర్తి, సీఐ దే వేందర్‌రెడ్డి, స్పెషల్‌బ్రాంచ్ ఎస్సైలు కృష్ణకుమార్, ప్రభాకర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, కిరణ్‌కుమార్, రాకేశ్, వెంకట్, రాజ్‌కుమార్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
నాడు మర్డర్.. నేడు కిడ్నాప్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మర్డర్ కేసును మాఫీ చేసుకునేందుకు.. డబ్బులు కావాలి. లక్షల్లో డబ్బులు ముట్టజెప్పి బాధితులను రాజీ చేసుకోవాలి. లేకుంటే శిక్ష పడుతుంది. మరి అంత డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి.. ఏదో ఒకటి చేయాలి. డబ్బులున్న బడా వ్యాపారినో.. డాక్టర్నో.. పారిశ్రామికవేత్తనో కిడ్నాప్ చేయాలి. అచ్చం.. ఇదే కోణంలో తమకున్న నేర ప్రవత్తితో కత్తులు నూరిందొక రౌడీ గ్యాంగ్. ఓ కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసింది. ఓ పేషెంట్ ఆపదలో ఉన్నట్లు నాటకమాడి.. డాక్టర్‌కు ఫోన్ చేసింది. అనుకున్నట్లుగానే ఆ రహదారిపై వచ్చిన డాక్టర్ ఆ గ్యాంగ్ స్కెచ్‌లో ఇరుక్కున్నాడు. వరంగల్-కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సంచలనం రేపిన చిల్డ్రన్స్ స్పెషలిస్టు, ఎల్కతుర్తి డాక్టర్ సురేందర్‌రెడ్డి కిడ్నాప్‌లో వెలుగులోకి వచ్చిన కొత్త కోణమిది. వరంగల్ నగరానికి చెందిన రౌడీషీటర్ ఫయీమ్ గ్యాంగ్ డాక్టర్‌ను కిడ్నాప్ చేసినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇందులో ఎవరెవరున్నారు.. ఎంత మంది పాల్గొన్నారు.. డాక్టర్‌ను కిడ్నాప్ చేయటం వెనుక అసలు కారణమేమిటనే... కోణంలో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. దీంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2013, మార్చి 9న ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌లో గొట్టెముక్కుల పాపిరెడ్డి హత్య జరిగింది. ఇంటి దారి వివాదం చినికిచినికి గాలివానగా మారి ఈ హత్యకు దారి తీసింది. అదే గ్రామానికి చెందిన ఎర్రగోళ్ల శ్రీనివాస్ నడిరోడ్డుపై పాపిరెడ్డిని కత్తులతో పొడిచి చంపినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. తీర్పు వచ్చే లోగా ఈ కేసులో రాజీ చేసుకునేందుకు శ్రీనివాస్ తనవంతు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. బాధిత కుటుంబీకులకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి ఈ కేసు నుంచి బయటపడాలనుకున్నాడు. అంత డబ్బు సంపాదించేందుకు కొత్త పథకం పన్నాడు. తనకు ఉన్న పాత పరిచయాలు.. అప్పటి హత్యకు సహకరించిన రౌడీషీటర్ ఫయూమ్ గ్యాంగ్‌ను కలిశాడు. రోజూ హన్మకొండ నుంచి హుజురాబాద్‌కు వెళ్లే డాక్టర్ సురేందర్‌రెడ్డి కిడ్నాప్‌నకు పథకం పన్నాడు. తమ గ్యాంగ్‌లో ఉన్న హన్మకొండకు చెందిన కడారి రాజు, ఎల్కతుర్తి సమీపంలోని దండెపల్లికి చెందిన ఎలబోయిన రమేశ్, హన్మకొండకు చెందిన దీపక్ సాయంతో కిడ్నాప్ ఎత్తుగడను పక్కాగా అమలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సుబేదారి పోలీస్‌స్టేషన్ రికార్డుల్లో కడారి రాజు, రమేశ్ రౌడీషీటర్లుగా ఉన్నారు. గత ఏడాది వరంగల్‌లో జరిగిన బొంగు కుమార్ హత్య కేసులో ఫయూమ్తోపాటు రాజు పేరు వెలుగులోకి వచ్చింది. నాయుడు పెట్రోల్ బంక్‌పై దాడి.. విధ్వంసానికి యత్నం చేసిన ఘటనలోనూ ఈ గ్యాంగ్ సభ్యులందరి పేర్లు పోలీసు రికార్డుల్లోకెక్కాయి. దీపక్ జనగాం ప్రాంతానికి చెందినవాడని.. కొంతకాలంగా హన్మకొండలో ఉంటూ ఫయీమ్ గ్యాంగ్‌లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. డాక్టర్ కిడ్నాప్‌లో ఈ నలుగురే ఉన్నారా..? ఫయీమ్ స్వయంగా పాల్గొన్నాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురిలో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కిడ్నాపర్ల ముఠా ఎన్ని డబ్బులు వసూలు చేసింది..? డబ్బును ఏం చేసింది..? తనను బంధించిన నలుగురు కిడ్నాపర్లు ఎవరో ఒకరితో తరచూ ఫోన్లో మాట్లాడినట్లు డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తి ఎవరు..? ఈ గ్యాంగ్‌కు లీడర్ ఫయీమేనా..? లేదాఎవరైనా డాక్టర్‌కు గిట్టని ప్రత్యర్థులు ఈ గ్యాంగ్‌తో కిడ్నాప్ చేయించారా..? అనేది మిస్టరీగా మారింది. -
కాంట్రాక్ట్ కిడ్నాపేనా?
హుజూరాబాద్‌లో క్లినిక్ నిర్వహిస్తున్న పిల్లల వైద్యుడు సురేందర్‌రెడ్డి కిడ్నాప్.. విడుదల ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. డాక్టర్‌ను కిడ్నాప్ చేసి రూ.35 లక్షలు డిమాండ్ చేసి చివరకు రూ.16 లక్షలు తీసుకుని విడుదల చేసినట్లు ప్రచారం జోరందుకుంది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. వైద్యుడికి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తున్న ఫోన్ నంబర్ ఆధారంగా 20 మంది కాల్‌డాటా సేకరించినట్లు సమాచారం. పోలీసులు 10 మందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో పాత నేరస్తులూ ఉన్నట్లు సమాచారం. హుజూరాబాద్ : వైద్యుడి కిడ్నాప్ వ్యవహారంలో ఫోన్ కాల్‌డాటా ఆధారంగా ఎల్కతుర్తి మండలం దండెపల్లికి చెందిన ఒక ఆటోడ్రైవర్, వల్భాపూర్‌కు చెందిన ఒకరు, కేశవాపూర్‌కు చెందిన ఓ వ్యక్తితోపాటు జీల్గులకు చెందిన మరొకరిని పోలీసులు ప్రధాన నిందితులుగా అనుమానిస్తున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక మాజీ నక్సలైట్ పేరు, ఎల్కతుర్తి మండలానికి చెందిన ఒక నాయకుడి పేరును సందేహిస్తున్నట్లు సమాచారం. ఎవరి పాత్ర ఎంత అని ఇంకా స్పష్టంకాలేదు. అనుమానితుల ఫోన్నంబర్లకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పెట్టి సిమ్‌కార్డులు పొందినట్లు తెలిసింది. దీంతో గుర్తింపుకార్డులు లేకుండా సిమ్‌కార్డులు ఇస్తున్న పలువురిని సైతం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. ఒప్పందమేనా? డాక్టర్ సురేందర్‌రెడ్డి కిడ్నాప్ ఉదంతం వెనుక పాత నేరస్తుల పేర్లు వినిపిస్తుండడంతో పోలీసులు కొత్త కోణంలో విచారణ జరుపుతున్నారు. కిడ్నాప్ జరిగిన తీరు, వైద్యుడికి చేసిన హెచ్చరికలు, డబ్బులు డిమాండ్ చేసిన పద్ధతి చూస్తుంటే దీని వెనుక ప్రొఫెషనల్ కిడ్నాపర్లు ఉండచ్చనే అనుమానాలు లేకపోలేదు. సదరు వైద్యుడిపై కక్ష, కోపాలతో ఎవరైనా కిడ్నాప్‌కు వ్యూహరచన చేశారా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. వైద్యుడిని చంపినా.. చంపకున్నా డబ్బులు వస్తాయని కిడ్నాపర్లు మాట్లాడినట్లు తెలుస్తుండటంతో ఇటు వ్యూహరచన చేసిన వ్యక్తుల నుంచి వచ్చే డబ్బులతోపాటు అటు బాధిత వైద్యుడు ఇచ్చే డబ్బుల కోసం కూడా ఆశపడ్డట్లు అర్థమవుతోంది. చివరకు సగం డబ్బులతోనే వ్యూహం బెడిసికొట్టడంతో వారు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పక్కా కాంట్రాక్ట్‌తోనే ఈ కిడ్నాప్ జరిగిందనే చర్చ జరుగుతోంది. ఈ ఉదంతంపై పోలీసుల విచారణ ఒక కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. రెండురోజుల్లో సస్పెన్స్‌కు తెరదించుతామని ఖాకీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ‘సాక్షి’లో వరుసగా వస్తున్న కథనాలతో జిల్లా పోలీస్‌బాస్ సైతం ఈ విషయంపై ఆరా తీసినట్లు తెలిసింది. -
'కిక్' ఇవ్వలేదు.. కోట్లు కొల్లగొడుతున్నాడు!
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో రికార్డులను తిరగరాయడంలో సల్మాన్ ఖాన్ ఓ డిఫరెంట్ స్టైల్. ఇప్పటి వరకు బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో తన ఏడు చిత్రాలను వంద కోట్ల క్లబ్ చేర్చిన ఏకైక హీరోగా సల్లూభాయ్ ఓ రికార్డును క్రియేట్ చేశారు. ఇక తాజాగా విడుదలైన కిక్ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయినా.. కలెక్షన్లు మాత్రం కుమ్మెస్తున్నాయి. తెలుగులో విజయం సాధించిన కిక్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. హిందీలో 'కిక్' రీమేక్ పై టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలుగులో కిక్ చిత్రంలోని ఉండే మజా.. హిందీ రీమేక్ లో కనిపించలేదని సురేందర్ రెడ్డి అన్న సంగతి తెలిసిందే. అభిమానులు, ప్రేక్షకులు పెదవి విరిచినా.. కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చాయి. కిక్ చిత్రంతో తొలిసారి సల్మాన్ ఖాన్ 200 కోట్ల క్లబ్ లో చేరి అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లకు సవాల్ విసిరాడు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కిక్ చిత్రం 309 (గాస్) కోట్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 377 (గ్రాస్) కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ధూమ్3 చిత్రం 542 కోట్లు, చెన్నై ఎక్స్ ప్రెస్ 422 కోట్లు, 3 త్రీ ఇడియెట్స్ 395 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేశాయి. -
కిక్ 2 మూవీ ప్రారంభోత్సవ వేడుక
-
ఈసారి మరింత కిక్ షురూ!
రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్ అనగానే... ‘కిక్’ సినిమా గుర్తొస్తుంది. అయిదేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చేసిన హంగామా అంతాఇంతా కాదు. మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా రూపొందనుంది. మసాలా సినిమాలను ఇష్టపడే వారికి ఇది నిజంగా శుభవార్తే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం . ‘కిక్’ని మరపించే స్థాయిలో పక్కా ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు సురేందర్‌రెడ్డి. ఈ నెల 20న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించిన కథానాయిక, ఇతర వివరాలు ప్రారంభోత్సవం నాడు తెలియజేస్తామనీ, రవితేజ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్‌గా ఈ చిత్రం నిలుస్తుందనీ కల్యాణ్‌రామ్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: తమన్. -
'నా సినిమాతో పోల్చి చూడొద్దు'
చెన్నై: హిందీ సినిమా 'కిక్'ను ఒరిజినల్ చిత్రంతో పోల్చికూడదని దర్శకుడు సురేందర్ రెడ్డి అన్నారు. తాను తెలుగు తీసిన 'కిక్' సినిమా చూసి దీన్ని జడ్జ్ చేయడం తడదని చెప్పారు. ఒరిజినల్ సినిమాలోని స్ఫూర్తిని హిందీ సినిమా రూపకర్తలు అర్థం చేసుకోలేకపోయారని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. ఈనెల 25న విడుదలైన సల్మాన్ 'కిక్' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే రూ. 50 కోట్లుపైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆధారమైన తెలుగు 'కిక్' చిత్రం 2009లో విడుదలైంది. రవితేజ, ఇలియానా జంటగా నటించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మంచి విజయాన్ని సాధించి రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. -
15న డైట్‌సెట్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: డైట్‌సెట్ (డీఈఈఎస్‌ఈటీ) ప్రవేశపరీక్షను ఈ నెల 15న నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని డైట్‌సెట్ కన్వీనర్ డా.సురేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులంతా పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. -
కిక్ ఇచ్చే కాంబినేషన్
నందమూరి కల్యాణ్‌రామ్ అటు హీరోగానూ, నిర్మాతగానూ తన ప్రతిభ చాటుతున్నారు. తన తాతగారైన స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి వరుసగా చిత్రాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఆ సంస్థలో వచ్చిన చిత్రాలన్నింటిలోనూ తనే కథానాయకుడు. ఈసారి మాత్రం పంథా మార్చారు. తను కేవలం నిర్మాణానికే పరిమితమవుతూ రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ -‘‘రవితేజ-సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘కిక్’ చాలా విభిన్నంగా ఉంటుంది. ఇది కూడా అంతే విభిన్నంగా ఉంటుంది. అయితే ఇది ‘కిక్’కి సీక్వెల్ కాదు. త్వరలోనే ఈ చిత్రం టైటిల్, మిగతా వివరాలు తెలియజేస్తాం. వచ్చే నెలలో ముహూర్తం జరిపి, ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలుపెడతాం. కిక్, రేసుగుర్రం వంటి సూపర్‌హిట్ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అభినందన్. -
కొడుకు సినిమా హిట్టయితే ఆ కిక్కే వేరబ్బా!
‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు లక్కీ. నిజానికి కూడా నేను లక్కీనే. నా జీవితంలోనే లక్ ఉంది. ఎందుకంటే... అందరూ ఒకటో మెట్టు నుంచి జీవితాన్ని మొదలుపెడతారు. కానీ నేను 11వ మెట్టునుంచి ప్రయాణం మొదలు పెట్టాను’’ అని అల్లు అర్జున్ అన్నారు. ఆయన హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో... నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మించిన చిత్రం ‘రేసుగుర్రం’. ఈ చిత్రం విజయోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. బన్నీ మరిన్ని విషయాలు చెబుతూ- ‘‘సాంకేతికంగా అద్భుతం ‘రేసుగుర్రం’. ఈ సినిమాలో చివరి 15 నిమిషాలు బ్రహ్మానందానివే. ‘నీ సినిమాలో బ్రహ్మానందానికి అంత ప్రాధాన్యత ఇవ్వడమేంటి?’ అని చాలామంది అన్నారు. సినిమాను హీరో ఒక్కడే మోయకూడదు. అందరూ మోయాలి. ఓ సినిమా విజయానికి కారణాలు చాలా ఉంటాయి. ఈ సినిమా విజయం విషయంలో అన్ని కారణాలూ సురేందర్‌రెడ్డే’’ అని పేర్కొన్నారు. ఇప్పటివరకూ తాను నటించిన సినిమాల్లో పూర్తి వినోదాత్మక చిత్రం ఇదేనని శ్రుతిహాసన్ చెప్పారు. 987 సినిమాల్లో నటించిన తనకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సినిమా ‘రేసుగుర్రం’ అని బ్రహ్మానందం అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ-‘‘కొడుకు సినిమా హిట్టయితే... ఆ కిక్కే వేరబ్బా. ఈ సినిమాలోని ప్రతి పాత్రను దర్శకుడు భిన్నంగా తీర్చిదిద్దాడు. మంచి సినిమా తీయాలనే తపన గల నిర్మాత నల్లమలుపు బుజ్జి. ఇందులోని బన్నీ నటన చిరంజీవిగారిని గుర్తుచేసిందని కొందరు అంటుంటే... తండ్రిగా అమితానందం అనుభవించాను. బన్నీకి అది నిజంగా గొప్ప ప్రశంస’’ అన్నారు. ‘‘ప్రతి సినిమాకూ ఒకేలా కష్టపడతాను. కానీ... బ్లాక్ బస్టర్స్ మాత్రం నాకు అరుదుగానే వరించాయి. ఈ మధ్య నా దక్కిన గొప్ప విజయం ‘రేసుగుర్రం’. బన్నీ నాకు తమ్ముడు లాంటి వాడు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. తమన్ అద్భుతమైన బాణీలిచ్చాడు’’ అని సురేందర్‌రెడ్డి చెప్పారు. తనికెళ్ల భరణి, అలీ, జయప్రకాశ్‌రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సినిమా రివ్యూ: రేసుగుర్రం
ప్లస్ పాయింట్స్: అల్లు అర్జున్, 'కిక్' శ్యామ్, రవి కిషన్, బ్రహ్మానందం యాక్టింగ్ శృతి హాసన్ గ్లామర్ సాంగ్స్, కామెడీ మైనస్ పాయింట్స్: రొటీన్ కథ ఫైట్స్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'రేసుగుర్రం' ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. దానికి తోడుగా ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న విడుదలైన రేసుగుర్రం ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో తెలుసుకోవాలంటే ముందు కథ గురించి తెలుసుకోవాల్సిందే. లక్ష్మణ్ ఉరప్ లక్కీ, రామ్ ఇద్దరూ అన్నదమ్ములు. నీతి, నిజాయితీ ఉన్న బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ రామ్, ఎప్పుడూ జల్సాగా తిరిగే లక్కీలకు క్షణం కూడా పడదు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో గొడవ పడుతుంటారు. ఈ క్రమంలో స్పందన (శృతి హాసన్)తో లక్కీ ప్రేమలో పడతాడు. అయితే ఓ కారణంగా లక్కీ, స్పందన ప్రేమ వ్యవహారానికి బ్రేక్ వేసేందుకు రామ్ ప్లాన్ వేస్తాడు. శృతిని తనకు దక్కకుండా చేసిన రామ్‌కు తగిన గుణపాఠం చెప్పాలని అతని పోలీస్ కారును దొంగిలిస్తాడు. లక్కీ దొంగిలించిన కారులో ఉన్నది రామ్ అనుకుని రాజకీయవేత్తగా మారిన రౌడీ మద్దాలి శివారెడ్డి వర్గం ఎటాక్ చేసి చంపాలనుకుంటాడు. ఆ దాడి నుంచి లక్కీ క్షేమంగా బయటపడుతాడు. ఆ దాడి నుంచి బయటపడిన శివారెడ్డి ఏం చేశాడు? శివారెడ్డికి రామ్ మధ్య శతృత్వానికి కారణమేంటి? లక్కీ, స్పందనల ప్రేమ వ్యవహారాన్ని రామ్ ఎందుకు బ్రేక్ చేయాలనుకుంటాడు? రామ్, లక్కీల మధ్య ఉన్న మనస్పర్ధలు ఎలా తొలగిపోయాయి అనే సమస్యలకు ముంగిపే 'రేసుగుర్రం' చిత్ర కథ. పెర్ఫార్మెన్స్: అల్లు అర్జున్‌లో ఎనర్జీ లక్కీ పాత్రకు సూట్ అయింది. యాక్షన్, ఎంటర్టైన్ మెంట్, లవ్ సీన్స్‌లో నటించడం అర్జున్‌కు కొత్తేమీ కాదు. తనదైన శైలిలో లక్కీ పాత్రలో ఉండే వివిధ కోణాలకు అల్లు అర్జున్ న్యాయం చేకూర్చారు. స్పందనగా శృతి హాసన్ గత చిత్రాల్లో ఎన్నడూ లేనంతగా గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. స్పందన పాత్రలో ఓ ఢిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. దాన్ని శృతి హాసన్ బాగా పండించింది. కిక్ శ్యామ్ ప్రేయసిగా సలోని గెస్ట్ గా కనిపించింది. ఈ చిత్రంలో తనకు లభించిన సీన్లలో తెలంగాణ యాసలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కానీ అంతగా గుర్తుండిపోయే పాత్రేమీ కాదు. కిక్ శ్యామ్ పోలీస్ ఆఫీసర్‌గా, అల్లు అర్జున్ అన్నగా పర్వాలేదనిపించాడు. కిక్ తర్వాత అలాంటి తరహా పాత్రనే రిపీట్ చేశాడా అనిపించింది. మెయిన్ విలన్‌గా మద్దెల శివారెడ్డి పాత్రలో భోజ్‌పూరి నటుడు రవికిషన్ నటించాడు. రౌడీగా మారిన రాజకీయవేత్తగా రవికిషన్ వీలైనంత మేరకు మంచి నటనే అందించాడు. మరోసారి బ్రహ్మనందం కామెడీతో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఓ ప్రత్యేక పోలీస్ ఆఫీసర్ కిల్ బిల్ పాండే గా క్లైమాక్స్‌లో హంగామా చేశాడు. ప్రీ క్లైమాక్స్ ఎంటరై.. క్లైమాక్స్ వరకు చిత్ర భారాన్ని తన భుజాలపై బ్రహ్మానందం ఎత్తుకున్నాడు. చిత్రమంతా రొటీన్‌గా ఉందే అనుకునే సమయంలో మరోసారి తన ప్రతిభతో ప్రేక్షకులకు కొంత ఊరట కలిగించాడు. శ్రీనివాస్ రెడ్డి, తాగుబోతు రమేశ్ తదితర కమెడియన్లు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. స్పందన తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించాడు. కొన్ని సీన్లకు తనదైన స్టైల్లో ప్రకాశ్ రాజ్ న్యాయం చేశాడు. మిగతా పాత్రల్లో తనికెళ్ల భరణి, ముఖేశ్ రుషి నటించారు. టెక్నికల్: తమన్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కీలక సన్నివేశాలకు మంచి సపోర్ట్ ఇచ్చింది. పాటల్లో అర్జున్ పై చిత్రీకరించిన సోలో సాంగ్... బూచోడే, 'సినిమా చూపిస్త మామా' పాటలు ఆడియో పరంగానే కాకుండా తెరపై కూడా ఆకట్టుకున్నాయి. టెక్నికల్ అంశాలు చూస్తే మనోజ్ పరమహంస కెమెరా చాలా రిచ్‌గా ఉంది. శృతి హాసన్, అల్లు అర్జున్ క్యాస్టూమ్ అదిరిపోయేలా ఉన్నాయి. కొత్త లుక్ తో డిజైన్ చేసిన క్యాస్టూమ్ శృతి, అల్లు అర్జున్ కు మరింత గ్లామర్ ను పెంచాయి. డైరెక్షన్: టేకింగ్‌లో దర్శకుడు సురేందర్ రెడ్డి టాలీవుడ్లో విలక్షణమైన శైలి అని గత చిత్రాలతో నిరూపించుకున్నాడు. ఈ చిత్రం విషయానికి వస్తే కథ కన్నా అల్లు అర్జున్‌లోని స్టైలిష్ పెర్ఫార్మెన్స్, బ్రహ్మనందం కామెడీనే ఎక్కువగా నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. కిక్ సినిమాలో ఆలీ క్యారెక్టర్‌ను కొనసాగింపుగా ఈ చిత్రంలో ఇంట్రడ్యూస్ చేసినా సరైన స్పేస్ లేని కారణంగానో, ఇతర పరిమితుల కారణంగానో బెడిసి కొట్టింది. ముఖేశ్ రుషి, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ క్యారెక్టర్లను సరైన దృష్టి పెట్టకుండా వదిలేశాడనే ఓ చిన్న ఫీలింగ్ కలుగుతుంది. రొటీన్ కథ, కొత్తదనం లేని విలనిజంతో చేసిన సాహసం అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వకపోయినా.. క్లైమాక్స్‌లో బ్రహ్మానందాన్ని తీసుకొచ్చి మంచి మార్కులే కొట్టేశారు. బ్రహ్మనందం ఎపిసోడ్ నడిపించిన తీరు గ్రిప్పింగ్ గా ఉంది. ఈ చిత్రంలోని 'రేసుగుర్రం' అర్జున్ ఎనర్జీని బ్రహ్మానందానికి ఇచ్చేసి రొటీన్‌కు భిన్నంగా కొత్త ముగింపు ఇచ్చే ప్రయత్నం చేశారు. సెకంఢాఫ్ లో కథపై కొంత ఎక్సర్ సైజ్ చేసి ఉంటే మంచి ఫలితాలన్ని రాబట్టే అవకాశం ఉండేది. మార్కెట్లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ పై దృష్టి సారిస్తున్నారనే ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మాస్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అంశాలను జోడించి రేసుగుర్రాన్ని పరిగెత్తించిన సురేందర్ రెడ్డి... వినోదాన్ని ఆశించిన ప్రేక్షకుల్లో సంతృప్తి నింపి.. కొత్తదనం ఆశించిన వారిని కొంచెం నిరాశకు గురి చేశాడు. ట్యాగ్: బ్రహ్మీ బలంతో పరుగెత్తిన రేసుగుర్రం -
బన్నీతో నాకు అంత చనువుంది! - సురేందర్‌రెడ్డి
‘‘బన్నీకి ఈ టైటిల్ యాప్ట్... ఈ కథ యాప్ట్... టోటల్‌గా ఈ సినిమా యాప్ట్’’ అంటున్నారు సురేందర్‌రెడ్డి. మాస్ సినిమాని కూడా క్లాస్‌గా, స్టయిలిష్‌గా తెరకెక్కించే సురేందర్‌రెడ్డి, బన్నీని ‘రేసుగుర్రం'గా తీర్చిదిద్దారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా. కె. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అభిమానుల ఆకాంక్షలను నెరవేర్చి, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సురేందర్‌రెడ్డి చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఆయనతో జరిపిన సంభాషణ ఈ విధంగా... ‘రేసుగుర్రం' అంటున్నారు... హీరో బైక్ రేసరా? హార్స్ రైడరా? ఈ రెండూ కాదు. రేసు గుర్రం అంత వేగంగా హీరో పాత్ర ఉంటుంది. సినిమా కూడా చాలా స్పీడ్‌గా సాగుతుంది. ఇంతకీ హీరో ఏం చేస్తాడు? ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే సాధించేవరకూ నిద్రపోడు. సినిమా మొత్తంలో హీరోకి రెండు, మూడు లక్ష్యాలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి ఏం చేశాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథ బన్నీని దృష్టిలో పెట్టుకునే తయారు చేశారా? అవును. బన్నీకి వంద శాతం నప్పే కథ ఇది. టైటిల్ మాత్రం షూటింగ్ సగంలో ఉన్నప్పుడు అనుకున్నాం. బన్నీ ఎంత ఎనర్జిటిక్కో మరోసారి ఈ సినిమాలో చూస్తారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కోపం వచ్చినప్పుడు తిట్టడం, బాధ అనిపించినప్పుడు అలగడం.. ఇలా నా ఫీలింగ్ ఏదైనాసరే నేను నిర్భయంగా వ్యక్తపరచగల చనువు నాకు బన్నీ దగ్గర ఉంది. అతను అంత కంఫర్టబుల్. ‘రేసు గుర్రం’ కథ ఏంటి? భిన్న మనస్తత్వాలున్న ఇద్దరు అన్నదమ్ముల కథ. టామ్ అండ్ జెర్రీ తరహా అన్నమాట. అన్న శ్యామ్. తమ్ముడు బన్నీ. చదివే పుస్తకాల్లో ఏది ఉంటే దాన్ని అనుసరించడం అన్న స్టయిల్. కానీ, తన మనసుకి ఏది అనిపిస్తే అది చేయడం తమ్ముడి స్టయిల్. ఈ ఇద్దరూ రామ-లక్ష్మణుల్లా ఉండాలని వారి తల్లి కోరిక. కానీ, అలా ఉండరు. ఈ అన్నతమ్ముల్లిద్దరి మధ్య సాగే ట్రాక్ చాలా వినోదంగా ఉంటుంది. తమిళ ‘వేట్టయ్', హిందీ ‘రామ్‌లఖన్'లా ఈ సినిమా ఉంటుందనే టాక్ ఉంది? ఆ సినిమాలకీ ఈ సినిమాకీ అస్సలు పోలిక లేదు. నేనిప్పటివరకు చేసిన సినిమాల్లో వినోదం, యాక్షన్ ఉంటాయి. ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. ఈ వేసవికి కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి చిత్రాన్ని ఇస్తున్నాం. ఈ సినిమా కోసం 12 కేవీ లైట్ ఏదో వాడారట? మామూలుగా కీలక సన్నివేశాలకు, పాటలకు మాత్రమే ఈ లైట్ వాడుతుంటాం. కానీ, కెమేరామేన్ మనోజ్ పరమహంస సినిమా మొత్తం వాడదామన్నారు. ఖర్చుతో కూడుకున్నది కావడంతో ‘మొత్తం 105 రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు వద్దంటే వేరే లైట్ వాడదాం’ అని నిర్మాత బుజ్జిగారితో అన్నాం. కానీ, కథకు న్యాయం జరగాలి కాబట్టి, రాజీపడొద్దన్నారు. సినిమాకి ఏది కావాలన్నా సమకూర్చారు కాబట్టే, ఫలితం బ్రహ్మాండంగా ఉంది. సినిమా చూసినవాళ్లకి ఆ లైట్ ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది. ‘కిక్ 2’ చేయనున్నారట.. ఆ విశేషాలు? అది ‘కిక్'కి సీక్వెల్ కాదు. వేరే కథతో రూపొందించనున్నాం. రవితేజ హీరోగా చేస్తారు. హీరో కల్యాణ్‌రామ్ నిర్మిస్తారు. ఇంకా అంతా కొత్తవాళ్లతో ఓ సినిమాకి దర్శకత్వం వహించాలనుకుంటున్నా. దీన్ని ‘ఠాగూర్' మధు నిర్మిస్తారు. హిందీ ‘కిక్'కి అవకాశం వస్తే ఎందుకు చేయలేదు? అప్పుడు ‘ఊసరవెల్లి'తో బిజీగా ఉన్నాను. మరి.. భవిష్యత్తులో హిందీ సినిమాలు చేసే ఆలోచన ఉందా? ఉంది. ‘ఊసరవెల్లి'ని హిందీలో రీమేక్ చేయాలని ఉంది. ఆ సినిమా ఇక్కడ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడానికి కారణం? నేనిప్పటివరకు చేసిన అన్ని కథల్లోకల్లా అత్యుత్తమం ‘ఊసరవెల్లి’. ఆ సినిమా విజయం విషయంలో నా అంచనా నిజం కాలేదు. స్క్రీన్‌ప్లే ఇంకా పకడ్బందీగా ఉండాలేమో అనిపిస్తోంది. హిందీ వెర్షన్ విషయంలో ఇంకా కేర్ తీసుకుంటున్నా. ఎన్టీఆర్‌తో చేసిన రెండు (అశోక్, ఊసరవెల్లి) సినిమాలూ ప్రేక్షకాదరణ పొందకపోవడంపట్ల మీ ఫీలింగ్? అసంతృప్తిగా ఉంది. అతనితో ఓ హిట్ సినిమా చేయాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా చేస్తాను. మహేశ్‌బాబుతో మళ్లీ ఎప్పుడు సినిమా? మహేశ్‌లాంటి హీరోతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనే ఉంటుంది. అన్నీ కుదిరితే తనతో కూడా తప్పకుండా సినిమా చేస్తా. -
రేసుకు గుర్రం రెడీ!
వేగం, లక్ష్యాన్ని సాధించాలనే కసి, అత్యున్నత స్థానంలో నిలబడాలనే తపన... ఈ లక్షణాలన్నీ ఉన్న ఓ కత్తి లాంటి కుర్రాడి కథతో రూపొందిన చిత్రమే ‘రేసుగుర్రం’. టైటిల్‌కి తగ్గట్టే యమ ఫోర్స్‌గా ఉంటుందట ఇందులో అల్లు అర్జున్ నటన. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మించిన ఈ చిత్రం నటునిగా బన్నీని మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా అవుతుందని సమాచారం. బన్నీ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ యువతరాన్ని కట్టిపడేస్తుందని, హాలీవుడ్ సినిమాలను తలపించే కథ, ‘రేసుగుర్రం’లా ఉరుకులు పెట్టించే కథనం ఈ చిత్రానికి ప్రధాన బలాలని చిత్రం వర్గాలు అంటున్నాయి. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న నిర్మాతలు విడుదల చేయనున్నారు. శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘కిక్ ’ శ్యామ్, సలోని కీలక పాత్రలు పోషించారు. కోట శ్రీనివాసరావు, ప్రకాశ్‌రాజ్, రవికిషన్, సుహాసిని, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, ముఖేశ్‌రుషి, ఆశిష్ విద్యార్థి ఇందులో ఇతర పాత్ర ధారులు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, కూర్పు: గౌతంరాజు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్. -
రేసుగుర్రం మూవీ పోస్టర్స్
-
రేసుగుర్రం మూవీ స్టిల్స్
-
హిట్ కోసం 'రేసు గుర్రం'ని వదులుతున్న సురేందర్ రెడ్డి
-
‘రేసుగుర్రం’ రెడీ
ప్రత్యర్థి గుండె వేగాన్ని పెంచే డెక్కల చప్పుడు.. గాలికి, మెరుపుకు సవాలు విసిరే వేగం.. వేసే ప్రతి అడుగులో లక్ష్య సాధన.. వెరసి ‘రేసుగుర్రం’. ఈ లక్షణాలన్నీ ఓ కుర్రాడికి ఉంటే.. సమస్యే లేదు.. వాడే విజేత. అయితే... నూటికో కోటికో ఒక్కడికే ఇలాంటి గుణాలుంటాయి. ఆ ఒక్కడి కథతో తెరకెక్కుతోన్న చిత్రమే ‘రేసుగుర్రం’. అల్లు అర్జున్ శక్తిమంతంగా కనిపించబోతున్న చిత్రమిది. హాలీవుడ్ చిత్రాలను తలపించేలా సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బన్నీ కెరీర్లోనే మేలిమలుపుగా ఈ చిత్రం నిలుస్తుదని యూనిట్ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె. వెంకటేశ్వరరావు ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ వారంలోనే విడుదల చేసి, ఈ నెల 28న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘కిక్’శ్యామ్, సలోని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, సుహాసిని, రవికిషన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్‌విద్యార్థి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, కూర్పు: గౌతంరాజు. -
నితిన్ సరికొత్త ప్రేమకథ
ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాల నిర్మాత నిఖితారెడ్డి... నితిన్‌తో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి శిష్యుడు శ్రీనివాసరెడ్డి బోసాని దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి సదానంద్ గౌడ్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత రామ్మోహన్రావు క్లాప్ ఇచ్చారు. సురేందర్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిఖితారెడ్డి మాట్లాడుతూ -‘‘నితిన్‌తో ఇంతకుముందు చేసిన రెండు సినిమాలూ శ్రేష్ట్ మూవీస్‌లో చేశాం. ఈ చిత్రాన్ని శ్రావణా సినిమాస్ అనే కొత్త బేనర్లో చేస్తున్నాం. నితిన్ బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. మార్చి నెల మూడోవారం నుంచి చిత్రీకరణ మొదలుపెడతాం. ప్రస్తుతం కథానాయిక ఎంపిక పనిలో ఉన్నాం’’ అని తెలిపారు. బ్రహ్మానందం, సోనూసూద్, అజయ్ తదితరులు ముఖ్యతారలు. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్థన్, సంగీతం: సాగర్ మహతి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వెంకటరత్నం. -
జూన్‌లో ‘కిక్-2’?
2009లో బాక్సాఫీస్ వద్ద ‘కిక్’ సినిమా హంగామా అంతా ఇంతా కాదు. పాత్ర పోషణలో రవితేజ ఉత్సాహానికి, ఉత్తేజానికి ప్రతీకగా నిలిచిన సినిమా అది. ‘కిక్’ సినిమాకు సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలోనే హీరో కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం రవితేజ ‘పవర్’ షూటింగ్లో బిజీగా ఉంటే... దర్శకుడు సురేందర్‌రెడ్డి ‘రేసుగుర్రం’తో బిజీగా ఉన్నారు. మరి ‘కిక్-2’ మొదలయ్యేదెప్పుడు? అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఇదే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చూచాయగా దొరికేసింది. జూన్‌లో ‘కిక్-2’ను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారట. ఒకవైపు ‘రేసుగుర్రం’ పనిలో బిజీగా ఉంటూ, మరోవైపు ‘కిక్-2’ స్క్రిప్ట్‌ని కూడా సురేందర్‌రెడ్డి పూర్తి చేసినట్లు సమాచారం. ‘అతనొక్కడే’ చిత్రంతో సురేందర్‌రెడ్డిని దర్శకునిగా పరిచయం చేశారు కల్యాణ్‌రామ్. ఆ రుణాన్ని తీర్చుకోవడమే లక్ష్యంగా సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. నిర్మాతగా కల్యాణ్‌రామ్‌కి ఘనవిజయం అందించాలనే కసితో ఆయన ఈ చిత్రాన్ని చేయనున్నట్లు సమాచారం. -
వాయువేగంతో రేసుగుర్రం
వాయు వేగమే ఆయుధం. లక్ష్యసాధనే ధ్యేయం. మధ్యలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా... అవన్నీ డెక్కల కింద నలిగి చావాల్సిందే. సింపుల్‌గా ‘రేసుగుర్రం’ అంటే అది. కథానుగుణంగా అల్లు అర్జున్ పాత్ర చిత్రణ కూడా ఇలాగే ఉంటుంది. అందుకే.. ‘రేసుగుర్రం’ అనే టైటిల్ పెట్టారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. బన్నీలోని ఎనర్జీ లెవల్స్ ఏంటో ఈ చిత్రం చెప్పబోతోందని సమాచారం. మెగా అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని వినికిడి. హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఉండే సురేందర్‌రెడ్డి టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువనుందని యూనిట్ సభ్యుల సమాచారం. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె. వెంకటేశ్వరరావు. యువతరం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోందీ టీజర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. సోమవారం హైదరాబాద్ పరిసరాల్లోని ఓ కళాశాల ఆవరణలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. నేడు(మంగళవారం) ఆర్ఎఫ్సీలో జరిగే చిత్రీకరణతో ఒక పాట మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఫిబ్రవరి 15 నుంచి 20 వరకూ భారీ సెట్లో బన్నీ, కథానాయిక శ్రుతిహాసన్‌పై పాట చిత్రీకరిస్తారు. దీంతో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ‘కిక్’శ్యామ్, సలోని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, సుహాసిని, రవికిషన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్‌విద్యార్థి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, సంగీతం: తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతంరాజు. -
’రేస్ గుర్రం’ మూవీ టీజర్
-
బాధ్యత కలిగిన కుర్రాడు
పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... ‘రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. జడ్చర్ల పరిసరాల్లో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో బన్నీ, బ్రహ్మానందం, ప్రతినాయకుడు రవికిషన్, ఫైటర్స్‌పై ఈ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని యూనిట్ వర్గాల సమాచారం. డిసెంబర్ మూడో వారానికి ఈ చిత్రం టాకీ పార్ట్‌తో పాటు, బ్యాలెన్స్ రెండు పాటల్ని పూర్తి చేసుకోనుంది. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో బన్నీ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉండనుందని, కథా కథనాల పరంగా సురేందర్‌రెడ్డి గత చిత్రాలను మించేలా ఈ సినిమా ఉంటుందని సమాచారం. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘కిక్’శ్యామ్, సలోని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్. -
29,820 మందికి డీఎడ్ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థుల్లో 29,820 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు డైట్‌సెట్ కన్వీనర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. సీట్లు పొందిన వారి జాబితాను బుధవారం ప్రకటించినట్లు పేర్కొన్నారు. 25 ప్రభుత్వ డైట్ కాలేజీల్లో 3,100 సీట్లను, 642 ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో 26,720 సీట్లను విద్యార్థులకు కేటాయించినట్లు వివరించారు. మొత్తంగా 62,457 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 23 నుంచి 26 వరకు కాలేజీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, కాలేజీల్లో చేరిన విద్యార్థులకు 27 నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఇక రెండో కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లకు డిసెంబర్ 2 నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. -
నిలిచిన డీఎడ్ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మంగళవారం ప్రకటించాల్సిన సీట్ల కేటాయింపు జాబితా ప్రకటన నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో జాబితాను ప్రకటించలేదని డైట్‌సెట్ కన్వీనర్ సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకటి రెండు రోజుల్లో సీట్ల కేటాయింపు జాబితాను ప్రకటిస్తామన్నారు. మైనారిటీ కాలేజీలు మైనారిటీ కోటాలోనే సీట్లను భర్తీ చేసుకోవాలా? లేక కన్వీనర్ కోటాలో భర్తీ చేసేందుకు అంగీకరించాలా? అనే విషయంలో విద్యాశాఖ ఇచ్చిన గడువు సరిపోదంటూ ఒక మైనారిటీ కాలేజీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం తలెత్తినట్లు తెలిసింది. విద్యాశాఖ సూచనల ఆధారంగా జాబితాను ప్రకటిస్తామని డైట్‌సెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
మెరుపువేగంతో రేసుగుర్రం
లక్ష్య ఛేదనే ధ్యేయం. మెరుపు వేగమే నైజం. గెలుపు కోసం అలుపెరగని పరుగే ఆభరణం... రేసుగుర్రం అనగానే... అందరికీ కనిపించే క్వాలిటీలివి. ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ కూడా ఇలాగే ఉంటుందని సమాచారం. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శనివారం వరకూ ఆర్ఎఫ్సీలో జరిగింది. అక్కడ హీరో ఇంటికి సంబంధించిన కీలక సన్నివేశాలను బన్నీ, ‘కిక్’శ్యామ్, సలోని, తనికెళ్ల భరణిలపై చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఈ షెడ్యూల్ మెరుపు వేగంతో జరుగుతోంది. డిసెంబర్ తొలివారం వరకూ జరిగే ఈ షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. భిన్నమైన కథ, కథనాలతో సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఇందులో బన్నీ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, బన్నీ కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయేలా ఈ సినిమా ఉండబోతోందని యూనిట్ వర్గాల సమాచారం. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో సుహాసినీ మణిరత్నం, కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, రఘుబాబు, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, కూర్పు: గౌతమ్‌రాజు, నిర్మాణం: శ్రీలక్ష్మినరసింహా ప్రొడక్షన్స్. -
సంక్రాంతి రేసులో గుర్రం
అల్లు అర్జున్ సంక్రాంతి బరిలో దిగడానికి ‘రేసుగుర్రం’లా సిద్ధమవుతున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన చేస్తున్న ‘రేసుగుర్రం’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో శ్రుతిహాసన్ కథానాయిక. వీరిద్దరి కలయికలో ఇదే తొలి చిత్రం. బన్నీ చిత్రానికి తమన్ స్వరాలందించడం కూడా ఇదే తొలిసారి. భోజ్‌పురిలో అగ్రకథానాయకుడిగా వెలుగొందుతోన్న రవికిషన్ ఇందులో ప్రతినాయకునిగా నటిస్తుండటం విశేషం. నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు సినీ విలేజ్‌లో వేసిన విలన్ హౌస్ సెట్లో ప్రస్తుతం అల్లు అర్జున్, రవికిషన్, ముఖేష్‌రిషి తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 15న మొదలైన ఈ షెడ్యూలు చిత్రం పూర్తయ్యే వరకూ నిర్విరామంగా జరుగుతుంది. ఇప్పటికే మూడు పాటల చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన పాటలను కూడా ఈ షెడ్యూల్లోనే చిత్రీకరించనున్నారు. ఇందులో బన్నీ పాత్ర చిత్రణ చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబరులో పాటలను, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘కిక్’ శ్యామ్, సలోని ఇందులో ముఖ్యతారలు. -
తొలియత్నం: ఆ సినిమా క్రెడిట్ ‘అతనొక్కడి’దే!
అందరికీ ఒకేలా కనిపించే ప్రపంచం నీకు మాత్రమే విభిన్నంగా కనిపించినప్పుడు, నీ ఆలోచనకు మాత్రమే వేరుగా అనిపించినప్పుడు... ఈ ప్రపంచానికి నువ్వు కొత్తగా పరిచయమవుతావు. ఆ క్రమంలో నీ దృక్కోణమే నీ అస్తిత్వం అవుతుంది. అస్తిత్వానికి ఆధారభూతంగా నిలిచిన ఆలోచన... ఆలోచనలను అనుసంధించిన చైతన్యం... నిన్ను సృజన శిఖరాలపై నిలబెడుతుంది. అలా విభిన్నంగా ఆలోచిస్తూ, నిత్యనూతనంగా పురోగమిస్తూ, సినీ ప్రపంచంలో తనకంటూ సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ సురేందర్‌రెడ్డి. మొదటి సినిమా ‘అతనొక్కడే’తోనే అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకున్న డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తొలియత్నం ఈవారం... జర్మనీలో సాంగ్ తీస్తున్నప్పుడు మధ్యలో ఒక పనిమీద మిత్రుడితో కలిసి ఎయిర్ పోర్ట్‌కు వెళ్లాను. తను లోపలికి వెళితే, నేను బయటే ఉండిపోయాను. అంతలో కస్టమ్స్‌వాళ్లు వచ్చి, నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. నా దగ్గర పాస్‌పోర్ట్, ఫోన్ నంబర్స్ ఏమీ లేవు. నా భాష వాళ్లకు, వాళ్ల భాష నాకు అర్థం కాలేదు. ఆ కాస్సేపూ నాకు నరకంలా అనిపించింది. మ్యూజిక్ ఒక్కసారే జరుగుతుంది. అనుకుని, ప్లాన్ చేస్తే జరగదు. అతనొక్కడే ఒక మ్యాజిక్ అంతే. నా కెరీర్లో అల్టిమేట్ సినిమా అది. దానికి కర్త, కర్మ, క్రియ... హీరో కళ్యాణ్‌రామ్. ఏ విషయాన్నైనా కొత్తగా చూడటం, కొత్తగా ఆలోచించటం మొదటినుంచీ నాకిష్టం. అలా ఆలోచిస్తున్న క్రమంలో ఒక హీరోయిన్, ఇద్దరు హీరోల చుట్టూ కథ అనుకున్నాను. అప్పటికి నేను అసిస్టెంట్ డెరైక్టర్‌గా టి.ప్రభాకర్ దగ్గర పనిచేస్తున్నాను. వెంటనే డెరైక్టర్ అయిపోవాలన్న ఆలోచనేమీ ఉండేది కాదు. ఇంకా నేర్చుకోవాలనే తపనతో ఉండేవాణ్ని. నేను ఈ కథ అనుకున్న ఆరు నెలలకు ‘ప్రేమదేశం’ విడుదలైంది. ఆ సినిమా చూసి నేను షాకయ్యాను. నా థాట్స్‌కు దగ్గరగా ఉన్న కథ. పర్లేదు, మనం కూడా సినిమా చేయొచ్చన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తరువాత క్రాంతికుమార్ గారి దగ్గర మూడు సినిమాలకు పని చేశాను. ఆయనతో జరిపిన డిస్కషన్స వల్లే సినిమా గురించి పూర్తిగా తెలిసింది. ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. నీ దగ్గర ఏమైనా కథలుంటే చెప్పరా అనేవారు. నా ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. నా కథలు తనకు కచ్చితంగా నచ్చవని అనుకునేవాణ్ని. ఒక మంచి ప్రేమకథ చేయాలన్న ఆలోచనలతో కథ రాసుకుని ఒకరికి వినిపించాను. బాగుంది, కానీ లవ్‌స్టోరీ కాదు, యాక్షన్ సినిమా కావాలన్నారు. కొంచెం డిజప్పాయింట్ అయ్యాను. ఒకరోజు కాదల్కొట్టై అనే తమిళ్ (తెలుగులో ప్రేమలేఖలు) సినిమా చూస్తుండగా నాకో ఐడియా వచ్చింది. అందులో హీరో, హీరోయిన్ పక్కపక్కనే ఉంటారు. కానీ ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకుంటారు. పక్కపక్కనే ఉన్నా తాము ప్రేమిస్తున్నది వీళ్లనే అని ఒకరికొకరికి తెలియదు. ఈ పాయింట్ నన్ను పట్టేసింది. దీన్ని యాక్షన్ సినిమాగా మారిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. చాలా స్పీడ్‌గా కథ అల్లుకున్నాను. హీరో హీరోయిన్స్ ఒకే ఇంటి నుంచి వస్తారు. ఒకే లక్ష్యంతో ఉంటారు. కానీ, ఒకరికొకరికి పరిచయం ఉండదు. కథ మీద నాకో క్లారిటీ వచ్చాక దిల్ రాజుగారిని కలిశాను. అప్పుడాయన ‘దిల్’ షూటింగ్లో ఉన్నారు. కథ విని బాగుంది, తరువాత చేద్దామన్నారు. అప్పటికే ఆయన సుకుమార్‌కు మాటిచ్చారు. అదయితే కానీ నా సినిమా మొదలు కాదు. అప్పటికి చాలా టైమ్ పడుతుంది కాబట్టి, నేనే వెనక్కి వచ్చేశాను. ఈ కథకు ఒక యంగ్ హీరో కావాలి, ఎవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు కళ్యాణ్‌రామ్ మనసులో మెదిలాడు. అప్పటికి తన మొదటి సినిమా పూర్తయింది కానీ ఇంకా రిలీజ్ అవలేదు. కథ చెప్పగానే తనకు చాలా నచ్చింది. ఇద్దరం కలిసి చాలామంది దగ్గరికి తిరిగాం. అందరూ చేద్దాం, చూద్దామనేవారే తప్ప ప్రాజెక్ట్ ఇంచి కూడా ముందుకు కదలలేదు. ఎక్కడ మొదలైన సీన్ అక్కడే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నా గుండె ధైర్యం చెదరకుండా వెన్నుతట్టి కళ్యాణ్‌రామ్ తానే సినిమాను నిర్మించడానికి సిద్ధమయ్యారు. కళ్యాణ్‌రామ్ హీరోతో పాటు ఈ సినిమాకి నిర్మాత కూడా అవడం నిజంగా నా అదృష్టం. ఈ సినిమాని నేనే నిర్మిస్తాను అని ఆయన ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో, ఆ క్షణం నుంచీ నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లేనే ప్రాణంగా భావించాను నేను. అందులో చాలా ప్రయోగాలు చేశాను. అయితే ఫండమెంటల్స్ విషయంలో రైటర్స్‌కు, నాకు మధ్య చాలా అభిప్రాయభేదాలు వచ్చాయి. ఎవరేం చెప్పినా వినకూడదని ముందు ఫిక్సయ్యాను కాబట్టి, నా ఆలోచనలను అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నించాను. చివరకు వాళ్లు కన్విన్స్ అయ్యారు. కెమెరామెన్ రాంప్రసాద్ చాలా సీనియర్. మొదటిరోజు మొదటి షాట్ తీయగానే ఆయనేంటో నాకు అర్థమైంది. నా ఆలోచనలను అర్థం చేసుకుని చాలాసార్లు నేననుకున్నదాని కంటే బెటర్ అవుట్‌పుట్ ఇచ్చేవారాయన. ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం నేను చాలా ఇబ్బంది పడిపోయాను. పాటల కోసం ఆస్ట్రియా వెళ్లినప్పుడు, చలి మైనస్‌లలో ఉండటంతో చాలా కష్టమనిపించింది. తరువాత జర్మనీలో సాంగ్ తీస్తున్నప్పుడు మధ్యలో ఒక పనిమీద మిత్రుడితో కలిసి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాను. తను లోపలికి వెళితే, నేను బయటే ఉండిపోయాను. అంతలో కస్టమ్స్‌వాళ్లు వచ్చి, నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. నా దగ్గర పాస్‌పోర్ట్, ఫోన్ నంబర్స్ ఏమీ లేవు. నా భాష వాళ్లకు, వాళ్ల భాష నాకు అర్థం కాలేదు. ఆ కాస్సేపూ నాకు నరకంలా అనిపించింది. వాళ్లు హైదరాబాద్‌కు ఫోన్‌చేసి క్లారిఫికేషన్ తీసుకుని, రెండు గంటల పాటు ఇంటరాగేషన్ తరువాత విడిచిపెట్టారు. నేను బయటికి వచ్చే సమయానికి నా ఫ్రెండ్ తన పని పూర్తి చేసుకుని వచ్చాడు. తనకు జరిగిన విషయమంతా తెలీదు. సినిమా ట్రావెలింగ్‌లో నాకు, కళ్యాణ్‌రామ్‌కి మధ్య ఒక అందమైన బంధం ఏర్పడింది. దాంతో ఒక్క షాట్ విషయంలో కూడా రాజీపడకుండా సినిమా పూర్తిచేశాను. పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటర్ గౌతంరాజుగారు చాలా కో-ఆపరేట్ చేశారు. నా ఆలోచనలకనుగుణంగా ఆయన ఎడిటింగ్‌లో సహకరించారు. ఎందుకంటే అప్పటికి మన సినిమాల్లో అడ్వాన్స్ కటింగ్, రివర్స కటింగ్ లాంటివి లేవు. ఆ తరువాత చాలామంది ‘అతనొక్కడే’లో చేసిన కటింగ్ కావాలని తనను అడిగారని గౌతంరాజు చాలాసార్లు చెప్పారు. సినిమా ఫస్ట్ కాపీ చూశాక, మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. గౌతంరాజు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. సినిమా విడుదలయ్యాక, అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నాకు తెలిసిన చాలామంది నేను ఇలాంటి సినిమా తీస్తానని, తీయగలనని అనుకోలేదని ఫోన్ చేసి మరీ అభినందించారు. అంతకంటే గొప్ప ప్రశంస ఇంకేముంటుంది! అనుకోనంత వేగంగా దర్శకుడి ని అయ్యాను. అంతే వేగంగా సినిమాని పూర్తి చేయగలిగాను. రెస్పాన్స చూశాక ఎంతో తృప్తిగా అనిపించింది. ఇదంతా కళ్యాణ్‌రామ్ వల్లనేనని చెప్పడానికి ఏమాత్రం సంకోచించను. నేనీ రోజు ఇలా ఉన్నానంటే, కారణం కళ్యాణ్‌రామ్. అతను ప్రొడ్యూసర్ అవడం వల్లే ఈ సినిమాను అనుకున్నట్టుగా తీయగలిగాను. - కె.క్రాంతికుమార్‌రెడ్డి -
పండగచేస్కో..!
బన్నీ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్లో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మిస్తున్న ‘రేసుగుర్రం’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో... ఆ సినిమా తర్వాత బన్నీ నటించే సినిమా విషయంలో అప్పుడే ఫిలింనగర్లో చర్చలు మొదలయ్యాయి. డాన్ శీను, బలుపు చిత్రాలతో దర్శకునిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బన్నీ నటిస్తారని సమాచారం. అల్లు అర్జున్‌తో దేశముదురు, జులాయి లాంటి హిట్ చిత్రాలు నిర్మించిన డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారని వినికిడి. ‘పండగ చేస్కో’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే... ఈ సినిమాతో పాటు బన్నీ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘గబ్బర్‌సింగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ని ప్రేక్షకులకు అందించిన హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. ‘దిల్’రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలిసింది. -
సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'రేసుగుర్రం'
అల్లు అర్జున్ రేసుగుర్రంలా సిద్దమవుతున్నారు. మాస్ చిత్రాలను స్టయిలిష్‌గా తీస్తాడని పేరు తెచ్చుకున్న సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రేసుగుర్రం’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించకపోయినా, అభిమానుల్లో అదే టైటిల్ ప్రచారమవుతోంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయిక. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత నెలలో ఈ సినిమా కోసం రెండు పాటల్ని విదేశాల్లో చిత్రీకరించారు. ఇటలీలో ఒక పాటను, స్విట్జర్లాండ్‌లో మరో పాటను తీశారు. తాజా షెడ్యూల్ ఈ నెల 2 నుంచి హైదరాబాద్‌లో జరుగుతుంది. ప్రధాన తారాగణంపై ఓ భవంతిలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇప్పటివరకూ బన్నీ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఇందులో ఆయన పాత్ర చిత్రణ ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం ‘ఏం మాయ చేసావె’ లాంటి చిత్రాలకు పని చేసిన మనోజ్ పరమహంస ఈ సినిమాకు ఛాయాగ్రహణం, తమన్ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రానికి, కథ: వక్కంతం వంశీ, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నారాయణరెడ్డి.