పోలీస్ గెటప్‌లో... కొత్త సినిమా | Ram Charan Apt For Thani Oruvan Remake Says Jayam Ravi | Sakshi
Sakshi News home page

పోలీస్ గెటప్‌లో... కొత్త సినిమా

Published Thu, Feb 18 2016 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

పోలీస్ గెటప్‌లో... కొత్త సినిమా

పోలీస్ గెటప్‌లో... కొత్త సినిమా

ఇటీవల అందరి దృష్టినీ ఆకర్షించిన తమిళ చిత్రం ‘తని ఒరువన్’. ‘జయం’ రవి హీరోగా అతని సోదరుడు రాజా దర్శకత్వం

 ఇటీవల అందరి దృష్టినీ ఆకర్షించిన తమిళ చిత్రం ‘తని ఒరువన్’. ‘జయం’ రవి హీరోగా అతని సోదరుడు రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పెట్టిన పెట్టుబడికి ఐదింతలు వసూలు చేసింది. ఈ కథ తెలుగులో రామ్‌చరణ్‌కైతే బాగుంటుందని మన నిర్మాతలు అనుకున్నారు. చరణ్ కూడా ఈ సినిమా చేయడానికి ఇష్టపడ్డారు. సురేందర్ రెడ్డిని దర్శకునిగా ఎంపిక చేశారు. తెలుగుకి తగ్గట్టు కథల్లో కొన్ని మార్చులూ, చేర్పులు చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.
 
 ఈ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్. ‘మగధీర’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు ఏడేళ్లకు మళ్లీ గీతా ఆర్ట్స్‌లో చరణ్ చేస్తున్న చిత్రం ఇది. ఈసారి కూడా ఓ సూపర్ హిట్ ఇవ్వనున్నామనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేసింది. ఇందులో రామ్‌చరణ్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. రకుల్ ప్రీత్‌సింగ్‌ను నాయిక. తమిళంలో చేసిన విలన్ పాత్రను తెలుగులో కూడా అరవింద్ స్వామే చేయనున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై. ప్రవీణ్‌కుమార్, సహ నిర్మాత: ఎన్.వి. ప్రసాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement