Top Stories
ప్రధాన వార్తలు

పాత ప్రాజెక్టులకే కొత్త పూత..!
సాక్షి, అమరావతి: కొత్త ప్రాజెక్టులను ఆకర్షించలేక గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులను తాము సాధించినట్లు చెప్పుకోవడానికి కూటమి సర్కారు విఫలయత్నం చేస్తోంది. పాత ఒప్పందాలు, ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి విస్తరణ చేపట్టిన వాటిని కొత్త ప్రాజెక్టులుగా పేర్కొంటూ గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన 6వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. వివిధ రంగాలకు చెందిన మొత్తం రూ.33,720 కోట్ల విలువైన 19 ప్రాజెక్టుల ద్వారా 34,621 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నట్లు పేర్కొంది. అయితే, ఈ ప్రాజెక్టుల్లో అత్యధికం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వచి్చనవే కావడం గమనార్హం. ఆ వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. » జపాన్‌కు చెందిన ఏటీసీ టైర్స్ (యకహోమా) రూ.3,079 కోట్ల పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి ఈ ప్రతిపాదనకు 2020 నవంబరులో అప్పటి సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోద ముద్ర పడింది. 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభమవగా 2022 ఆగస్టులో వైఎస్ జగన్ ఈ పరిశ్రమను ప్రారంభించారు. తొలి దశలో రూ.1,750 కోట్లు పెట్టిన ఏటీసీ టైర్స్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. అప్పుడే రెండో దశను కూడా ప్రకటించింది. కానీ, ఈ విస్తరణ ప్రతిపాదనను కూటమి సర్కారు నిస్సిగ్గుగా ఇప్పుడు తన ఖాతాలో వేసుకుంది. » పీఎల్ఐ కింద డైకిన్ సంస్థ శ్రీ సిటీలో దక్షిణాదిలోనే అతిపెద్ద ఎయిర్ కండిషన్ తయారీ యూనిట్ నిర్మాణాన్ని 2022లో మొదలుపెట్టింది. 2023 నవంబరులో ఉత్పత్తి కూడా ప్రారంభించింది. రూ.1,000 కోట్లతో 75 ఎకరాల్లో యూనిట్ ఏర్పాటు చేసిన డైకిన్ విస్తరణ కోసం 2024లో మరో 33 ఎకరాలను కొనుగోలు చేసింది. దీన్ని కూడా కూటమి సర్కారు తన ఖాతాలో వేసుకుంది.»డీఆర్డీవోతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) రక్షణ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. 2022 నవంబరులో రక్షణ శాఖ అప్పటి కార్యదర్శి గిరిధర్ నాటి సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఈ ప్రతిపాదన చేశారు. అదే రోజు మచిలీపట్నంలో జరిగిన బీఈఎల్ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇదేదో కొత్తగా వచ్చినట్లు ఇప్పుడు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.» దక్కన్ ఫైన్ కెమికల్స్‌కు తూర్పుగోదావరి జిల్లా కేశవరం వద్ద ఎప్పటినుంచో ప్రత్యేక రసాయనాల తయారీ యూనిట్ ఉంది. ఏలూరు జిల్లా వట్టిగుడిపాడులో మోహన్ స్పిన్‌టెక్ 2007లో అప్పటి సీఎం వైఎస్సార్ హయాంలోనే యూనిట్ నెలకొల్పింది. రామభద్ర ఇండస్ట్రీస్ 2006లో తణుకు కేంద్రంగా ఏర్పాటైంది. ఈ కంపెనీల విస్తరణ ప్రాజెక్టులకు తాజాగా ఎస్ఐపీబీ ఓకే చెప్పింది. ప్రాజెక్టుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ: చంద్రబాబు ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలి. ప్రతి ప్రాజెక్టు పురోగతి పరిశీలనకు డాష్ బోర్డ్ తీసుకురావాలి. టూరిజంలో హోటళ్లు, రూముల కొరత ఉంది. కొత్తగా 50 వేల రూమ్‌లు అందుబాటులోకి తీసుకురావాలి. కారవాన్స్‌కు సంబంధించిన పాలసీని కూడా సిద్ధం చేసి అమల్లోకి తేవడం ద్వారా పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. రద్దీగా ఉండే 21 దేవాలయాల్లో వసతి సౌకర్యం పెంచాలి. టెంట్లు (గుడారాలు) ఏర్పాటు ప్రారంభించాలి. వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టకుండా చిన్నచిన్న ప్లాంట్ల ద్వారా సర్క్యులర్ ఎకానమీగా మార్చాలి’ అని సూచించారు.

ఆపరేషన్ సిందూర్‌కి ముందు ట్రంప్,పాక్‌ల మధ్య చీకటి ఒప్పందం?
వాష్టింగన్: పహల్గాంలో ఉగ్రదాడి, ఆ దాడిపై భారత చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్ ప్రభుత్వంతో జరిపిన ఓ చీకటి ఒప్పందం బట్టబయలైంది. ఆ చీకటి ఒప్పందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు సైతం సంబంధం ఉండడం మరింత అనుమానాలకు తెరతీసింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల వయసున్న (అప్పటికి ఏర్పాటు చేసి నెలరోజులే) క్రిప్టో కౌన్సిల్‌తో కుదుర్చుకున్న ఈ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్ కలిపి 60శాతం వాటా ఉంది. గత నెలలో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ఒప్పందం చేసుకున్నారని తెలిపే లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైతం ఉంది.ఆఘమేఘాల మీదఈ ఒప్పందం తర్వాత వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తమ సలహాదారుగా బైనాన్స్ వ్యవస్థాపకుడు ఛాంగ్‌పెంగ్ జావోను పాక్ ప్రభుత్వం నియమించింది. ఘన స్వాగతం పలికిన ఆసిమ్ మునీర్ ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్‌కు వచ్చిన ఓ ప్రతినిధి బృందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా ఆ అమెరికన్ బృందానికి నాయకత్వం వహించింది మరెవరో కాదు ట్రంప్ అత్యంత సన్నిహితుడు,వ్యాపార భాగస్వామి స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్. జాకరీ విట్కాఫ్ ప్రస్తుతంప్రస్తుత మిడిల్ ఈస్ట్‌కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. జాకరీ విట్కాఫ్ బృందం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో రహస్య సమావేశం సైతం నిర్వహించింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్‌కాయిన్ అభివృద్ధి, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పై పైలట్ ప్రాజెక్టులకు అనుమతి లభించనుంది. దీని ద్వారా పాకిస్తాన్లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణతో పాటు బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెట్టుబడులు, పెన్షన్ వంటి సేవల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. పాక్-ట్రంప్ చీకటి ఒప్పందంపై అనుమానంపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందంపై ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందానికి వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసింది. అయితే, ఈ ఒప్పందంపై అటు ట్రంప్ కుటుంబం, ఇటు వైట్ హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

పునఃప్రారంభానికి ముందు ఐపీఎల్ 2025 పరిస్థితి ఇది..!
భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్ 2025 రేపటి నుండి (మే 17) పునఃప్రారంభం కానుంది. ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా తమతమ ఫ్రాంచైజీల క్యాంప్‌ల్లో చేరుతున్నారు. తదుపరి లెగ్‌కు కొందరు విదేశీ ఆటగాళ్ల లభ్యత సమస్య మినహా లీగ్ ముందులా రంజుగా సాగేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. పునఃప్రారంభం రోజున జరిగే మ్యాచ్‌లో కేకేఆర్, ఆర్సీబీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బెంగళూరులో జరుగనుంది.టాప్‌లో గుజరాత్ఈ సీజన్లో అంచనాలకు మించి రాణిస్తున్న గుజరాత్ లీగ్ వాయిదా పడే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ సీజన్ 11 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 8 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి 16 పాయింట్లు సాధించింది. గుజరాత్ ఇంకా 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒకటి గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారవుతుంది.ప్లే ఆఫ్స్ రేసులో మొత్తం ఐదు జట్లులీగ్ వాయిదా పడే సమయానికి ఐదు జట్లు ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఇంకా ఏ జట్టుకు ప్లే ఆఫ్స్ బెర్త్ అధికారికంగా ఖరారు కాలేదు. ప్లే ఆఫ్స్ రేసులో గుజరాత్ (16), ఆర్సీబీ (16) ముందు వరుసలో ఉండగా.. పంజాబ్ (15), ముంబై ఇండియన్స్ (14), ఢిల్లీ (13) పోటాపోటీ పడుతున్నాయి.కేకేఆర్, లక్నో కూడా రేసులోనే..!లీగ్ వాయిదా పడే సమయానికి కేకేఆర్ (11), లక్నోకు (10) ప్లే ఆఫ్స్ అవకాశాలు లేనప్పటికీ.. టెక్నికల్‌గా ఆ జట్లకు ఇంకా ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ రెండు జట్లు తదుపరి ఆడాల్సిన అన్ని మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉండటంతో పాటు.. ఈ జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉన్నాయి.ఈ మూడు టీమ్‌లు ఔట్లీగ్ వాయిదా పడే సమయానికి సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. తదుపరి ఆడబోయే మ్యాచ్‌ల ఫలితాలతో ఈ జట్లకు ఒరిగేదేమీ లేనప్పటికీ.. ఈ జట్లు ఇతర జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.ఆరెంజ్ క్యాప్ హెల్డర్‌గా సూర్యకుమార్లీగ్ వాయిదా పడే సమయానికి ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ వద్ద ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) ఉంది. స్కై ఈ సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడి 63.75 సగటున 170.57 స్ట్రయిక్‌రేట్‌తో 510 పరుగులు చేశాడు.నూర్ అహ్మద్, ప్రసిద్ద్ కృష్ణ వద్ద పర్పుల్ క్యాప్లీగ్ వాయిదా పడకముందు ప్రసిద్ద్ కృష్ణ (గుజరాత్), నూర్ అహ్మద్ (సీఎస్కే) వద్ద పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) ఉంది. వీరిద్దరు తలో 20 వికెట్లు తీశారు.పునఃప్రారంభానికి ముందు ఐపీఎల్ 2025 పరిస్థితి ఇది57 మ్యాచ్‌ల పాటు సజావుగా సాగిన ఐపీఎల్ 2025.. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా 58వ మ్యాచ్ మధ్యలో బ్రేక్ పడింది. పునఃప్రారంభానికి ముందు ఐపీఎల్ 2025 పరిస్థితి ఇలా ఉంది.పాయింట్ల పట్టిక..అత్యధిక పరుగులు..అత్యధిక వికెట్లు..

'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ (Balakrishna) పేరు సరసన కొద్దిరోజుల క్రితమే 'పద్మ భూషణ్' చేరిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. భారత రత్న, పద్మ విభూషణ్ తర్వాత ఈ అవార్డ్ ప్రాముఖ్యతలో దేశంలోనే మూడవ స్థానం ఉంది. ఏరంగంలోనైనా సరే ఉన్నత స్థాయి విశిష్ట సేవకు గుర్తుగా ఈ అవార్డుతో కేంద్రప్రభుత్వం గుర్తిస్తుంది. దేశంలో మూడో అత్యున్నత అవార్డును అందుకున్న బాలయ్య తాజాగా ఒక లిక్కర్ (మద్యం) కంపెనీకి సంబంధించిన యాడ్‌లో నటించడం సోషల్‌మీడియాలో విమర్శలకు దారితీసింది.తాను మద్యం తీసుకుంటానని పలు వేదికల మీద బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. తన ఫేవరెట్ బ్రాండ్ ఏంటనేది కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయాన్ని ఆయన చాలాసార్లు ప్రకటించారు కూడా.. పలుమార్లు సినిమా వేడుకల సమయంలో తన కుర్చీ పక్కనే మద్యం మిక్స్ చేసిన బాటిల్ కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఓటీటీలో బాలకృష్ణ చేసిన ఒక టాక్ షోకు కూడా తనకు ఇష్టమైన బ్రాండ్ కంపెనీనే స్పాన్సర్ చేసింది. అలా బాలయ్యకు ఆ బ్రాండ్‌తో చాలా అనుబంధం ఉంది. అంతవరకు ఫర్వాలేదు, దానిని ఎవరూ తప్పబట్టాల్సిన పనిలేదని చెప్పవచ్చు. కానీ, ప్రస్తుతం అదే బ్రాండ్‌కు ఆయన ప్రచార కర్తగా ఒక యాడ్‌ను షూట్ చేసి సంతోషంగా మద్యం తాగేయండి అంటూ వీడియో విడుదల చేశారు.ఒక సినీ నటుడిగా బాలకృష్ణ ఇలాంటి యాడ్ చేయడాన్ని ఎవరూ తప్పబట్టరు.. ఎందుకంటే చాలామంది సినీ సెలబ్రిటీలు చేశారు. కానీ, ఇప్పుడు వారందరితో బాలయ్యను పోల్చలేం కదా.. ఎందుకంటే ఆయనొక ఎమ్మెల్యే ఆపై అన్నింటికి మించి దేశంలోనే మూడో అత్యున్నత అవార్డు 'పద్మ భూషణ్'ను రీసెంట్‌గానే అందుకున్నారు. పేరు పక్కన అంతటి గౌరవం దక్కిన తర్వాత కనీసం కొంత అయినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆశిస్తారు. కావాల్సినంత డబ్బు, పేరు ఉన్నాయి కదా.. మరీ ఇలాంటి హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేయడం ఎందుకంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయంలో బాలకృష్ణపై విమర్శలు వస్తున్నాయి. పద్మభూషణ్ అవార్డు అందుకొని నెల కూడా కాలేదు ఇంతలోనే ఒక లిక్కర్ కంపెనీ కోసం యాడ్ చేయడం ఏంటి అంటూ తప్పబడుతున్నారు. బాలయ్య కాస్త అవార్డుకైనా విలువ ఇవ్వవయ్యా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.Balayya Mansion House Drinking Water Teaser 🔥#NandamuriBalakrishna pic.twitter.com/wJwqoRRH16— NBK Cult (@iam_NBKCult) May 15, 2025

ఆపరేషన్ సరే.. పహల్గాం నిందితులు చనిపోయారా?: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌తో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. భారత దాడుల్లో మరణించింది ఎవరు?. పహల్గాంలో దాడి చేసిన వారు మృతుల్లో ఒక్కరైనా ఉన్నారా?. సరిహద్దులో ఎందుకు భద్రత లేదు?. పహల్గాం ఘటన జరిగిన తర్వాత వారు ఎలా తప్పించుకున్నారు? అని ప్రశ్నలు సంధించారు.కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోతూర్ మంజునాథ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ భారత్‌కు ఎలాంటి ప్రయోజనం అందించలేదు. ఈ ఆపరేషన్‌లో ఏమీ చేయలేదు. కేవలం గొప్పగా చూపించుకోవడానికే ఇదంతా చెబుతున్నారు. ఓ నాలుగు విమానాలు సరిహద్దులు దాటి వెళ్లి.. మళ్లీ తిరిగి వచ్చాయి. అంతే తప్ప ఇంకేమీ జరగలేదు. భారత దాడుల్లో మరణించిన వారు ఎవరు?. పహల్గాంలో దాడి చేసిన వారు మృతుల్లో ఎవరైనా ఉన్నారా?. అధికారులు ఒకటి చెబితే.. టీవీలు మరొకటి చెబుతున్నాయి. మరొకరు ఇంకేదో అంటున్నారు. మనం ఎవరిని నమ్ముతాము? అధికారిక ప్రకటన ఎక్కడ?’ అని ప్రశ్నించారు.అలాగే, భారత్ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎవరు నిర్ధారించారు?. మన సరిహద్దును దాటిన ఆ ఉగ్రవాదులు ఎవరు? వారి గుర్తింపు ఏంటి? సరిహద్దులో ఎందుకు భద్రత లేదు? వారు ఎలా తప్పించుకున్నారు? ఉగ్రవాద మూలాలు, శాఖలను గుర్తించి వాటిని నిర్మూలించాలి. పహల్గాం ఘటన పూర్తిగా నిఘా వైఫల్యమే. పహల్గాం దాడి బాధితుల కుటుంబాలకు న్యాయం చేయడంలో కేంద్రం విఫలమైంది. పహల్గాం బాధితులకు కేంద్రం పరిహారం ఇచ్చిందా?. కర్ణాటక, పాకిస్తాన్, చైనా లేదా బంగ్లాదేశ్‌లో ఎక్కడైనా పౌరులపై జరిగే దాడులను మేము వ్యతిరేకిస్తాం’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్ సిందూర్’లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పారు. పాక్ దాడులు చేస్తే తిరిగి దాడులు చేస్తామని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. భారత్.. నూర్ఖాన్, రఫీకీ, షోర్కోట్, మురిద్, సుక్కోర్, సియాల్కోట్, పసురూర్, చునియన్, సర్గోదా, భోలారీ, జకోబాబాద్‌లో దాడులు చేసింది. దాడికి ముందు.. తర్వాత ఇక్కడినుంచి సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో నష్టం తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జకోబాబాద్‌లోని షాబాజ్ బేస్ చాలావరకు ధ్వంసమై కనిపిస్తోంది. ఇక భారత పదాతి దళం జరిపిన దాడిలో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనిక స్థావరాలు, ఉగ్ర బంకర్లు నాశనమయ్యాయి.

పాక్ ప్రధాని సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: భారత్ శక్తి, సామర్థ్యం తెలుసుకున్న పాకిస్తాన్.. చివరకు దిగి వచ్చింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎట్టకేలకు కీలక ప్రకటన చేశారు. భారత్‌తో చర్చలకు పాక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు శాంతి కోసం భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని షరీఫ్ వెల్లడించారు.పాక్‌లోని పంజాబ్ ప్రావిన్సులో కామ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ షరీఫ్ సందర్శించారు. అనంతరం, షరీఫ్ పాక్ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ శాంతి కోసం సిద్ధంగా ఉంది. అందుకు భారత్‌తో చర్యలకు సిద్ధం. భారత్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే, కశ్మీర్ అంశం కూడా చర్చల్లో చేర్చాలనేది తమ షరతు అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ పదేపదే స్పష్టం చేస్తున్నా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.పాక్ ప్రధాని ప్రకటన చేసిన సమయంలో షెహబాజ్‌తో పాటు ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, వైమానిక దళ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ వైరం వద్దని వారంతా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక.. భారత్, పాకిస్తాన్ యుద్ధం తర్వాత.. పాక్ ప్రధాని షరీఫ్ రక్షణ కేంద్రాన్ని సందర్శించడం ఇది రెండోసారి.Peace and Pakistan, Biggest Joke of the decade 😆“Pakistan's prime minister, Shehbaz Sharif, said on Thursday he was ready to engage in peace talks with India. Prime Minister Shehbaz Sharif extended an offer of talks to India, saying Pakistan is ready to engage "for peace". pic.twitter.com/NHvt1DNqsB— Vaibhav Rathi 🇮🇳 (@Vaibhavrathi05) May 16, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు పాకిస్తాన్ అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కీలక ప్రకటన చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్తాన్ ఎలా ఖాళీ చేయాలనే అంశంపైనైతే ఆ దేశంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌తో కేవలం ద్వైపాక్షిక సంబంధాలే ఉంటాయని, అనేక ఏళ్లుగా దానిపై ఏకాభిప్రాయంతో ఉన్నామని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి ముష్కరులపై చర్యలు చేపట్టాల్సిందేనని ఐరాస భద్రతామండలి కూడా నొక్కిచెప్పిందని, ఆపరేషన్ సిందూర్ ద్వారా ఈ నెల 7న అదే చేశామని పేర్కొన్నారు. ఆపరేషన్‌ను ప్రారంభించడానికి ముందే పాక్‌కు సందేశం పంపించాం. ఉగ్రస్థావరాలపైనే దాడులు చేస్తామని, సైనిక స్థావరాల జోలికి వెళ్లబోమని చెప్పాం. దానిని వారు పెడచెవినపెట్టారు. మనం వారికి ఎంత నష్టం కలిగించామో, వారు ఎంత స్వల్పంగా మనకు నష్టపరిచారో అందరికీ తెలుసు. శాటిలైట్ చిత్రాలే దీనికి సాక్ష్యం. అందుకే నాలుగు రోజుల్లో వారు వైఖరి మార్చుకున్నారు. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారు అని తెలిపారు. This video explains the extent of damage caused by @IAF_MCC in Pakistan. Pak PM took a dusty road to reach the PAF base. You know why? Watch this. 👇pic.twitter.com/XYQLEWWB0P— Pramod Kumar Singh (@SinghPramod2784) May 15, 2025

దుమారం.. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌పై మాజీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: ఉత్తర ప్రదేశ్ సమాజ్‌వాది పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ (Ram Gopal Yadav) వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్‌పై (Vyomika Singh)వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.ఇటీవల, కల్నల్ సోఫియా ఖురేషీ (Sofia Khureshi)పై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా (Vijay Shah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని రామ్ గోపాల్ యాదవ్ తాజాగా, ప్రస్తావిస్తూ.. ‘వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ రాజ్‌పుత్ కాబట్టే ఆమెను వదిలేసి.. ముస్లిం మతానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ గురించి విజయ్ షా మాట్లాడారని అన్నారు. 🚨SP’s Ramgopal Yadav hurls CASTEIST slur at Wing Commander Vyomika Singh - calls her “CHAM*R” 😳~ No outrage. No suo moto by courts. No feminist noise.Because the abuser isn’t from BJP, and the victim isn’t convenient for the ecosystem👏🏼 pic.twitter.com/BXegkYPAg5— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) May 15, 2025ఉత్తరప్రదేశ్ మోరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మంత్రి విజయ్ షా కల్నల్ ఖురేషీపైచేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ‘ఓ మంత్రి కల్నల్ ఖురేషీని ఉద్దేశిస్తూ చేసిన మతతత్వ వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. కానీ అతనికి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతిల గురించి తెలియదు. లేదంటే వాళ్లని టార్గెట్ చేసేవారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వ్యోమికా సింగ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి కులాల ప్రస్తావనకు తెచ్చారు. అదే సమయంలో ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉగ్రవాదుల పీచమణిచిన సాయుధ దళాల సేవల కంటే బీజేపీ స్వీయ ప్రశంసలకు ప్రాధాన్యత ఇస్తుందని రామ్ గోపాల్ యాదవ్ ఆరోపించారు. మనస్తత్వం చెడుగా ఉన్నప్పుడు, సైన్యం సాధించిన విజయాల గురించి మాట్లాడటానికి బదులుగా, వారు తమ సొంత విజయాలను హైలైట్ చేస్తారంటూ అభిప్రాయ పడ్డారు. सेना की वर्दी 'जातिवादी चश्मे' से नहीं देखी जाती है। भारतीय सेना का प्रत्येक सैनिक 'राष्ट्रधर्म' निभाता है, न कि किसी जाति या मजहब का प्रतिनिधि होता है।समाजवादी पार्टी के राष्ट्रीय महासचिव द्वारा एक वीरांगना बेटी को जाति की परिधि में बांधना न केवल उनकी पार्टी की संकुचित सोच का…— Yogi Adityanath (@myogiadityanath) May 15, 2025 సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహంరామ్ గోపాల్ యాదవ్ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల యూనిఫామ్‌ను కుల దృక్పథంతో చూడరని, సైనికులు ఏ కులానికి లేదా మతానికి ప్రతినిధులు కాదని అన్నారు. దేశ వీర వనితను గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి రామ్ గోపాల్ యాదవ్ ఆలోచనలకు నిదర్శనం మాత్రమే కాదు, సైనికుల వీరత్వాన్ని, దేశ గౌరవాన్ని అవమానించడమేనని ట్వీట్ చేశారు.

మేపలేక ‘తెల్ల ఏనుగు’.. ట్రంప్ ముఖాన డంప్!
ప్రపంచంలో సొంతంగా అతి పెద్ద ప్రైవేట్ జెట్స్ శ్రేణి కలిగిన యజమానుల్లో ఖతార్ రాజకుటుంబం ఒకటి. తమకు ఆర్థిక భారంగా పరిణమించిన కొన్ని భారీ విమానాలను అది తాపీగా వదిలించుకుంటోంది. ప్రయోజనం లేని, నిర్వహణ భారం మితిమీరిన ‘తెల్ల ఏనుగు’ లాంటి తమ ‘బోయింగ్ 747 జంబో’ను అచ్చం రాజకుటుంబం లాగే పోషించగల డొనాల్డ్ ట్రంప్ లాంటి సరైన వ్యక్తిని ఖతార్ రాజకుటుంబం ఎట్టకేలకు పట్టుకోగలిగింది!. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి లబ్ధి పొందడానికే ఖతార్ అత్యంత విలాసవంతమైన విమానాన్ని ఆయనకు బహుమతిగా ఇస్తోందని ఊహాగానాలు వినిపించినా ఈ వ్యవహారం వెనక అసలు కారణం.. ఖతార్ రాజవంశీయులకు ఆ విమానంతో అవసరం తీరిపోవడం!. నిజానికి వారు 2020లోనే ఆ విమానాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ, కొనుగోలుదారు దొరక్క విక్రయంలో విఫలమయ్యారు. తమకు అవసరం లేని ఆ ‘చెత్త’ విమానాన్ని ఇప్పుడు ట్రంప్ ముఖాన ‘డంప్’ చేస్తున్నారు కనుక వారికి నిర్వహణ ఖర్చులు, స్టోరేజి వ్యయం బాగానే తగ్గుతాయని వైమానికరంగ నిపుణులు అంటున్నారు. ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్టు.. అలా అటు ఖతార్ రాజకుటుంబానికి ఖర్చూ తగ్గింది, ఇటు ట్రంప్ కూడా ఫ్రీ గిఫ్టుతో ఉబ్పితబ్బిబ్బవుతున్నారు. మొత్తానికి ఖతార్ ఒక బోయింగ్ 747 జంబో పీడను ఇలా వదిలించుకుంది.ఇంకా ఇలాంటివే మరో రెండు విమానాలు దాని దగ్గరున్నాయి. పరిమాణంలో పెద్దవైన, సుందరంగా అలంకరించిన, వాడకపోయినా నిరంతరం సరైన స్థితిలో (కండిషన్లో) ఉంచాల్సిన, ఇంధనం విపరీతంగా తాగే, పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు ఉద్దేశించిన ఇలాంటి విమానాలకు డిమాండ్ పడిపోయిందని తాజా ఉదంతం చాటుతోంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఈ విమానాలను కొనేవారు లేరు. అందుకే రాజకుటుంబాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు దశాబ్ద కాలంగా ఈ ‘తెల్ల ఏనుగు’లను వదిలించుకునే పనిలో ఉన్నాయి.Qatar gifted this Boeing 747 Jumbo Jet to the US defence department during the visit of Presidnet Donald Trump. pic.twitter.com/d5ad0k2Q0M— Aftab Chaudhry (@AftabCh81) May 15, 2025ఇతర ఆధునిక దేశాల మాదిరిగానే ఖతార్ కూడా ప్రస్తుతం నాజూకైన, బహుళ ప్రయోజనకర, ఆర్థిక అంశాలు కలిసొచ్చే, అధికారిక ప్రయాణాలకు అనువుగా ఉండే విమానాల వైపు మొగ్గు చూపుతోందని దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఏవియేషన్ కన్సల్టింగ్ సంస్థ ‘బీఏఏ & పార్టనర్స్’ మేనేజింగ్ డైరెక్టర్ లైనస్ బాయర్ ‘ఫోర్బ్స్’కు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడికి బోయింగ్ 747-8 విమానాన్ని ఖతార్ అప్పగించడాన్ని ఓ ‘సృజనాత్మక పరిష్కార వ్యూహం’గా, ‘ఆకాశంలో పోటాపోటీ బలప్రదర్శన అనే గతించిన నమూనాకు వీడ్కోలు’గా బాయర్ అభివర్ణించారు.అంతా ‘ఆయిల్ అండ్ గ్యాస్’ మహిమ!సౌదీ అరేబియా పక్కనే పర్షియన్ సింధుశాఖలో సుమారుగా అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్ర భూభాగం సైజులో ఉంటుంది ఖతార్ ద్వీపకల్పం. చమురు, సహజ వాయువు నిక్షేపాలు తెచ్చిపెట్టిన సంపద ఈ దేశాన్ని తలసరి జీడీపీ పరంగా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలబెట్టింది. అటు ఖతార్ పాలకులనూ ఆగర్భ శ్రీమంతులను చేసింది. అలా ఖతార్ ఎమిర్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని కుటుంబం సిరి సంపదలతో అలరారుతోంది. దీంతో దాదాపు డజను ఎయిర్ బస్, బోయింగ్ విమానాల శ్రేణిని థాని కుటుంబం సమకూర్చుకుంది. కొద్దిమంది వ్యక్తులు విలాసవంతమైన ప్రయాణాలు చేయడానికి వీలుగా ఆ విమానాలకు మార్పులు చేయించారు.ఇవి కాకుండా రాజ కుటుంబానికి చిన్నపాటి బంబార్డియర్, డసాల్ట్ బిజినెస్ జెట్స్ ఎలాగూ ఉన్నాయి. ట్రంప్ కు బహూకరించిన 747 విమానం తోకపై ‘ఏ7-హెచ్బీజే’ (A7-HBJ) అని ఉంటుంది. 2007 నుంచి 2013 వరకు ఖతార్ ప్రధానమంత్రిగా వ్యవహరించిన హమద్ బిన్ జసిమ్ బిన్ జబర్ అల్ థాని పేరులోని తొలి మూడు పదాల ప్రధమ అక్షరాలను ‘హెచ్బీజే’ (HBJ) స్ఫురింపజేస్తుంది.ప్రస్తుతం ఖతార్ ‘రాజ’ విమానాల శ్రేణిలో ఉన్న మూడు 747-8 విమానాల్లో ఈ విమానం ఒకటి. ‘ఖతార్ అమీరీ ఫ్లైట్’ సంస్థ దీని నిర్వహణను చూస్తోంది. 13 ఏళ్ల కిందట 2012లో కొనుగోలు చేసినప్పుడు ఈ విమానం ఖరీదు 367 మిలియన్ డాలర్లు. అంటే రూ.3,130 కోట్లు. కొన్న తర్వాత మూడేళ్లపాటు వందల కోట్లు కుమ్మరించి విమానం లోపలి స్వరూపాన్ని (ఇంటీరియర్) సుందరంగా తీర్చిదిద్దారు. సాధారణ బోయింగ్ 747-8 విమానంలో 467 మంది ప్రయాణించవచ్చు. కానీ ‘ఎగిరే ప్యాలెస్’గా అభివర్ణిస్తున్న ‘హెచ్బీజే’లో 89 మంది మాత్రమే ప్రయాణించేలా మార్పులు చేసి హంగులు అద్దారు. రెండు పడక గదులు, వినోద గది, సమావేశ గదులు అందులో ఉన్నాయి.ఎగిరితే గంటకు రూ.20 లక్షల ఖర్చు!బోయింగ్ తయారుచేసే 747 సిరీస్ విమానాలు 1970 నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. వైమానిక దూర ప్రయాణాలను అవి ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చాయి. అయితే పెరుగుతున్న ఇంధనం ధర ఆకాశవీధిలో ఈ నాలుగు భారీ ఇంజిన్ల విమానం ప్రయాణాన్ని వ్యయభరితంగా మార్చింది. ‘కార్పొరేట్ జెట్ ఇన్వెస్టర్’ అంచనా ప్రకారం 747-8 వీఐపీ వెర్షన్ విమానాన్ని ఆపరేట్ చేయడానికి గంటకు 23 వేల డాలర్లు (రూ.20 లక్షలు) ఖర్చవుతుంది. వ్యయభారం తట్టుకోలేక గత దశాబ్ద కాలంగా పలు విమానయాన సంస్థలు బోయింగ్ 747, నాలుగు ఇంజిన్ల ఎయిర్ బస్ ఏ340 విమానాలను సేవల నుంచి తప్పిస్తున్నాయి. వీటి బదులుగా రెండు ఇంజిన్లు గల వెడల్పాటి బోయింగ్ 787, ఎయిర్ బస్ ఏ350 విమానాలపై ఆధారపడుతున్నాయి. నాలుగు ఇంజిన్ల 747 సిరీస్ విమానాలు ఇంధనాన్ని విపరీతంగా తాగుతాయి!.ఈ ‘ఎగిరే భవనాలు’ను ఒక్క ఖతారే కాదు.. సౌదీ అరేబియా, బ్రూనై, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ కూడా క్రమంగా వదిలించుకుంటున్నాయి. తక్కువ ఇంధన సామర్థ్యం అటుంచి పెద్ద విమానాలతో భద్రతాపరమైన సమస్యలున్నాయని, వాటిని పెద్ద లక్ష్యాలుగా ఎంచుకునే ప్రమాదం ఉందని ఏరోడైనమిక్ అడ్వైజరీ మేనేజింగ్ డైరెక్టర్ రిచర్డ్ అబౌలాఫియా చెప్పారు. పెద్ద విమానాలు దిగాలంటే పొడవైన రన్ వేలు కావాలని, దాంతో ఆ విమానాల వినియోగం పరిమితమేనని వివరించారు. సన్నటి విమానాలకైతే చాలా ఎయిర్ పోర్టులు, సంప్రదాయ బిజినెస్ జెట్స్ అయితే మరిన్ని విమానాశ్రాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. 2020లో మార్కెట్లో అమ్మకానికి పెట్టడానికి ముందు ఐదేళ్లలో ఖతారీ విమానం ప్రయాణించింది మొత్తం కలిపి 1,059 గంటలే.ఇక ఖతార్ దగ్గరున్న మిగతా రెండు వీఐపీ 747-8 విమానాల్లో ఒకదాన్ని పూర్తిగా క్రియాశీల సేవల తప్పించారని లైనస్ బాయర్ తెలిపారు. 2018లో ఖతార్ ఇలాంటి 747-8 విమానాన్నే తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కు కూడా ఇచ్చింది. మరో పాత 747-ఎస్పీ విమానాన్ని ఓ అసెట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించగా దాన్ని ఆ సంస్థ స్టోరేజికి తరలించింది. ఇలాంటి ఉదాహరణలు బోలెడు. సౌదీ యువరాజు సుల్తాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సాద్ 2011లో మరణించాడు. అతడి మరణానికి ముందు ఓ విలాసవంతమైన 747-8 విమానాన్ని అతడి కోసం సేవల్లోకి తీసుకున్నారు. కేవలం 42 గంటలే ప్రయాణించిన ఆ విమానాన్ని చివరికి 2022లో తుక్కు కింద ముక్కలు చేశారు. ప్రస్తుతం సౌదీలో రాజకుటుంబ ఉపయోగంలో ఉన్న 747 విమానాల శ్రేణిని ఒకే ఒక విమానానికి కుదించారు. సౌదీ యువరాజు మఃహమ్మద్ బిన్ సాల్మన్ ప్రస్తుతం బోయింగ్ 737, 787-8 వంటి చిన్న విమానాలు వినియోగిస్తున్నారు.అయితే లోపల ఖాళీ ప్రదేశం అధికం కనుక బోయింగ్ 747-8లకు సరకు రవాణా (కార్గో) రంగంలో మంచి డిమాండ్ ఉంది. 2023లో కర్మాగారం నుంచి బయటికొచ్చిన చివరి 747-8తో కలిపి బోయింగ్ ఇప్పటివరకు మొత్తం 155 విమానాలను విక్రయించగా వాటిలో రెండొంతులు సరకు రవాణాలోనే నిమగ్నమయ్యాయి. కేవలం కొద్దిమంది దూర ప్రయాణాల కోసమని స్వరూపం పరంగా, యాంత్రికంగా, కస్టమ్ ఇంటీరియర్స్ పరంగా మార్పులు చేసిన ఖతారీ 747-8 విమానాలను కార్గో విమానాల రూపంలోకి తేవడం కష్టమని బాయర్ అభిప్రాయం వెలిబుచ్చారు. ఇక బహుమతిగా ట్రంప్ స్వీకరిస్తున్న ఖతార్ విమానాన్ని పరికిస్తే... భద్రతపరమైన నిబంధనలను సడలిస్తే తప్ప... ఆ విమానాన్ని విడదీసి పునర్నిర్మించడానికి కనీసం ఐదేళ్లు పడుతుందని రిచర్డ్ అబౌలాఫియా అంచనా. అంటే అప్పటికి అధ్యక్షుడిగా ట్రంప్ రెండో విడత పుణ్యకాలం... ఆ విమానంలో తిరగాలనే ఆయన బులపాటం తీరకుండానే ముగిసిపోతుంది! - జమ్ముల శ్రీకాంత్ Source: Forbes

బోనస్ మరీ ఇంత తక్కువా!.. టెక్ దిగ్గజం ఎందుకిలా చేస్తోంది
భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'ఇన్ఫోసిస్' బోనస్ విషయంలో ఉద్యోగులకు షాకిచ్చింది. క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితుల కారణంగా.. 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో అర్హులైన ఉద్యోగులకు 65 శాతం మాత్రమే బోనస్ చెల్లించనున్నట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత త్రైమాసికం (మూడో త్రైమాసికం)లో 80 శాతం బోనస్ అందించిన కంపెనీ.. రెండో త్రైమాసికంలో 90 శాతం బోనస్ చెల్లింది.2025 ఆర్ధిక సంవత్సరం రెండు, మూడు త్రైమాసికాలలో కంపెనీ ఉద్యోగులకు చెల్లించిన బోనస్.. నాల్గవ త్రైమాసికంలో చెల్లించనున్న బోనస్‌తో పోలిస్తే క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. పర్ఫామెన్స్ బోనస్ మే 2025 సైకిల్లో ప్రాసెస్ అవుతుందని తెలుస్తోంది.ఇక ఇన్ఫోసిస్ ఆఖరి త్రైమాసిక ఫలితాల విషయానికి వస్తే.. కంపెనీ లాభాలో అంతకు ముంది ఏడాది నాల్గవ త్రైమాసికం ఫలితాలతో పోలిస్తే 12 శాతం తగ్గి రూ. 7033 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం కంపెనీ నాల్గవ త్రైమాసిక ఫలితాల్లో సంస్థ లాభం రూ. 7696 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 40,925 కోట్లకు చేరింది. అంత క్రితం క్యూ4లో రూ. 37,923 కోట్ల టర్నోవర్ సాధించింది.ఇదీ చదవండి: వారానికి 90 గంటల పని!.. ఆయనతో పనిచేయడం నా అదృష్టంనియామకాలుటెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని కంపెనీ సిఎఫ్ఓ జయేష్ సంఘ్రాజ్కా స్పష్టం చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 6,388 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 323,578కి చేరుకుంది.

మన శక్తిని నమ్ముకుందాం నటాషా న్యో న్యో జీ.. మిస్ యుగాండా!
కుతూహలం, జిజ్ఞాస, ప్రతిభ, సామాజిక బాధ్యత, లాస్ బట్ నాట్ లీస్ట్ అందం.. అన్నిటికీ పర్యాయ పదం! నటాషా పరిచయం ఆమె మాటల్లోనే...నేను పుట్టి,పెరిగింది యుగాండాలో! అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ గ్రాడ్యుయేషన్ కోసం యూకే వెళ్లి, చదువు పూర్తవగానే తిరిగి నా దేశానికి వచ్చేశాను. వృత్తిరీత్యా అకౌంటెంట్ని, ఆంట్రప్రెన్యూర్‌ని కూడా. కంపాలాలో నాకో బ్యూటీ స్టోర్ ఉంది. స్కిన్ కేర్, మేకప్, యాక్సెసరీస్ లాంటివంటే నాకు చాలా ఆసక్తి. అదే నన్ను ఈ పాజెంట్ వైపు లాక్కొచ్చిందని చెప్పొచ్చు. మా దగ్గర కూడా అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య వివక్ష చాలా! కానీ అదృష్టవశాత్తు మా ఇంట్లో లేదు. మమ్మల్నందరినీ సమానంగా పెంచారు.బ్యూటీ విత్ పర్పస్మా తమ్ముడికి ఆటిజం. యుగాండాలో స్పెషల్ నీడ్స్ పిల్లలకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాళ్లనెలా పెంచాలో కూడా తెలియదు. తమ్ముడి కోసం అమ్మ ట్రైన్ అయింది. అమ్మ నడిపే స్కూల్లోనే స్పెషల్ నీడ్ చిల్డ్రన్ కోసం కూడా ఓ సెక్షన్ పెట్టింది. పిల్లల పేరెంట్స్‌కి అవేర్నెస్ కల్పిస్తోంది. అందులో నేనూ పాలు పంచుకుంటున్నాను. స్పెషల్ నీడ్ పిల్లల కోసం హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయ్యేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నా బ్యూటీ విత్ పర్పస్ అదే! అలాగే టాలెంట్ రౌండ్లో నేను పియానో ప్లే చేయబోతున్నాను. స్పోర్ట్స్ రౌండ్లో స్విమ్మింగ్. స్విమింగ్ ఈజ్ మై ఫేవరిట్ స్పోర్ట్.మర్యాద, మాట తీరు..రిచ్ కల్చర్, ట్రెడిషన్ వంటి విషయాల్లో మా దేశానికి, ఇండియాకు చాలా పోలిక ఉంది. ఇక్కడి రైస్, స్పైసీ ఫుడ్ నాకు చాలా నచ్చాయి. కొత్త వాతావరణంలో.. కొత్త మనుషుల మధ్య ఉన్నామన్న ఫీలింగే లేదు. అందరికీ అందరం ఎప్పటి నుంచో పరిచయం అన్నట్టుగానే ఉంది. కొత్త కొత్త భాషల్లో రోజూ కనీసం ఒక వర్డ్ అయినా నేర్చుకుంటున్నాను. అలాగే మా భాషనూ నా తోటి కంటెస్టెంట్స్‌కి నేర్పేందుకు ట్రై చేస్తున్నాను. ఐకమత్యం అసాధ్యాలను సుసాధ్యం చేయగలదని అర్థమైంది. వేగంగా వెళ్లాలంటే ఒంటరిగా ప్రయాణించాలి. కానీ సుదీర్ఘ దూరాలకు వెళ్లాలంటే మాత్రం కచ్చితంగా గుంపుగా ప్రయాణించాలి’’ అంటూ చెపాపు నటాషా. అందుకే కనెక్ట్ అయ్యాను.. నాకు ఇక్కడి చీరలు చాలా నచ్చాయి. కొనుక్కెళ్లాలనుకుంటున్నాను. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు బిగ్ ఫ్యాన్‌ని. ఆమె నటించిన బర్ఫీ సినిమా చాలాసార్లు చూశాను. అందులో ఆమె ఆటిజం అమ్మాయిగా అద్భుతంగా నటించింది. మా తమ్ముడికీ ఆటిజం కదా! అందుకే కనెక్ట్ అయ్యాను. విమెన్ ఎంపవర్మెంట్ విషయానికి వస్తే.. ప్రతి అమ్మాయి తన శక్తిని నమ్ముకోవాలి. ఎవరైనా వెనక్కి లాగితే రెట్టింపు ఉత్సాహంతో అడుగులు వేయాలి. మన సంకల్పం గట్టిగా ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరు! – నటాషా న్యో న్యో జీ – యుగాండా– సరస్వతి రమ
మెక్సికన్ 'మే'నూ..! ఫుడ్ లవర్స్‌కు పసందు..
జపాన్‌లో అదరగొట్టిన మేడ్ ఇన్ ఇండియా కారు
మిస్ వరల్డ్ మధురమైన పాట
ఆపరేషన్ సిందూర్‌కి ముందు ట్రంప్,పాక్‌ల మధ్య చీకటి ఒప్పందం?
మేపలేక ‘తెల్ల ఏనుగు’.. ట్రంప్ ముఖాన డంప్!
పునఃప్రారంభానికి ముందు ఐపీఎల్ 2025 పరిస్థితి ఇది..!
ఆపరేషన్ సరే.. పహల్గాం నిందితులు చనిపోయారా?: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
డేటింగ్లో సమంత.. స్పందించిన మేనేజర్
బోనస్ మరీ ఇంత తక్కువా!.. టెక్ దిగ్గజం ఎందుకిలా చేస్తోంది
ఐపీఎల్ 2025 పునఃప్రారంభం.. ఎవరు తిరిగొస్తున్నారు.. ఎవరు రావడం లేదు..?
‘త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు.. రేవంత్ స్థానంలో కేసీఆర్’
భారత్‌కు పాకిస్తాన్ లేఖ
గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్
పసిడి ఢమాల్.. రూ.వేలల్లో తగ్గిన బంగారం
ఇదే రీతిలో ‘సూపర్ సిక్స్ హామీలను’ అడిగే ప్రజలకు ‘ట్యాక్స్’ అని చెప్పి నోరెత్తకుండా చేద్దాం సార్!
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన..
మన వేలితో మన కన్నే..!
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం
ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. భూలాభాలు
అలాగే ‘మన టెర్రరిస్టులు’ కూడా 100 మంది పోయారని చెప్పండి!
మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్
వాళ్లు ఇస్తానన్న విమానం ఇదేనట సార్!
మా సైనికులు చనిపోయారు.. మరణాలపై పాక్ ప్రకటన
యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ గ్లోబ్ ముందు నిలబడి యుద్ధాన్ని నేనే ఆపా అని పెద్దగా అరుస్తున్నారు డాక్టర్!
ఏమిరా మాతోనే పెట్టుకుంటావా...
బాలకృష్ణ కాలు తొక్కా.. ప్యాకప్ చెప్పి.. నన్ను వద్దన్నారు: హీరోయిన్
అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
మెక్సికన్ 'మే'నూ..! ఫుడ్ లవర్స్‌కు పసందు..
జపాన్‌లో అదరగొట్టిన మేడ్ ఇన్ ఇండియా కారు
మిస్ వరల్డ్ మధురమైన పాట
ఆపరేషన్ సిందూర్‌కి ముందు ట్రంప్,పాక్‌ల మధ్య చీకటి ఒప్పందం?
మేపలేక ‘తెల్ల ఏనుగు’.. ట్రంప్ ముఖాన డంప్!
పునఃప్రారంభానికి ముందు ఐపీఎల్ 2025 పరిస్థితి ఇది..!
ఆపరేషన్ సరే.. పహల్గాం నిందితులు చనిపోయారా?: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
డేటింగ్లో సమంత.. స్పందించిన మేనేజర్
బోనస్ మరీ ఇంత తక్కువా!.. టెక్ దిగ్గజం ఎందుకిలా చేస్తోంది
ఐపీఎల్ 2025 పునఃప్రారంభం.. ఎవరు తిరిగొస్తున్నారు.. ఎవరు రావడం లేదు..?
‘త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు.. రేవంత్ స్థానంలో కేసీఆర్’
భారత్‌కు పాకిస్తాన్ లేఖ
గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్
పసిడి ఢమాల్.. రూ.వేలల్లో తగ్గిన బంగారం
ఇదే రీతిలో ‘సూపర్ సిక్స్ హామీలను’ అడిగే ప్రజలకు ‘ట్యాక్స్’ అని చెప్పి నోరెత్తకుండా చేద్దాం సార్!
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన..
మన వేలితో మన కన్నే..!
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం
ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం.. భూలాభాలు
అలాగే ‘మన టెర్రరిస్టులు’ కూడా 100 మంది పోయారని చెప్పండి!
మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్
వాళ్లు ఇస్తానన్న విమానం ఇదేనట సార్!
మా సైనికులు చనిపోయారు.. మరణాలపై పాక్ ప్రకటన
యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ గ్లోబ్ ముందు నిలబడి యుద్ధాన్ని నేనే ఆపా అని పెద్దగా అరుస్తున్నారు డాక్టర్!
ఏమిరా మాతోనే పెట్టుకుంటావా...
బాలకృష్ణ కాలు తొక్కా.. ప్యాకప్ చెప్పి.. నన్ను వద్దన్నారు: హీరోయిన్
పాకిస్తాన్‌కు చుక్కలే.. రష్యాకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి
సినిమా

బాక్సాఫీస్ సెంటిమెంట్ వెలుగు... జీవనజ్యోతి
సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం... మండు వేసవి. దాదాపు 113 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతతో బెజవాడ అక్షరాలా ‘బ్లేజ్‌వాడ’గా ఠారెత్తిస్తోంది. వడగాడ్పులు, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఆ పరిస్థితుల్లో వాణిశ్రీ ప్రధానపాత్రలో, శోభన్‌బాబు హీరోగా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ‘జీవనజ్యోతి’ చిత్రం రిలీజైంది. ఆ సెంటిమెంటల్ కుటుంబ కథ ఆ మండుటెండల్లోనే బాక్సాఫీస్ మలయమారుతమైంది. దేశంలో ఇందిరాగాంధీ సర్కార్ ఎమర్జెన్సీ విధించడానికి 40 రోజుల ముందు విడుదలై అటు ప్రకృతి, ఇటు సమాజంలోని ఆటుపోట్లకు అతీతంగా అఖండ విజయం అందుకుంది. సిల్వర్‌జూబ్లీ సూపర్‌హిట్‌గానే కాక, ఆ ఏడాది అత్యధిక వసూళ్ళు సాధించిన అరుదైన చిత్రంగా చరిత్రకెక్కింది. నిర్మాత డి.వి.ఎస్. రాజు సహా చిత్ర యూనిట్ అందరికీ చిరస్మరణీయ చిత్రంగా మిగిలిపోయింది. ‘జీవనజ్యోతి’ విడుదలై నేటితో 50 ఏళ్ళు. ఆ చిత్ర విశేషాలు... ఎన్టీఆర్ కంపెనీలోకి... శోభన్బాబుడి.వి.ఎస్. ప్రొడక్షన్స్, నిర్మాత డి.వి.ఎస్. రాజు పేరు చెప్పగానే ఆయన ఎన్టీఆర్‌తో నిర్మించిన ‘మంగమ్మ శపథం’ (1965) లాంటి పలు హిట్ చిత్రాలు గుర్తుకొస్తాయి. ఆ సినిమాతో మొదలుపెట్టి వరుసగా పదేళ్ళ పాటు ఎన్టీఆర్తోనే సినిమాలు నిర్మిస్తూ వచ్చిన నిర్మాత ఆయన. అలాంటి డి.వి.ఎస్. రాజు తొలిసారిగా వేరే హీరోతో తీసిన సినిమా – ‘జీవనజ్యోతి’. నిజానికి, పంపిణీ సంస్థ ‘విజయా’ పిక్చర్స్ అధినేత పూర్ణచంద్రరావు చెప్పడంతో, దర్శకుడు విశ్వనాథ్ వద్దకు వెళ్ళి ఈ కథ విన్నారు రాజు. ఈ కథను కూడా ఆయన ఎన్టీఆర్తోనే తీద్దామనుకున్నారట. కానీ, ఫస్టాఫ్‌లో హీరో కాలేజీ విద్యార్థిగా కనిపించడం లాంటివి ఉన్నాయని తటపటాయించారు. చివరకు ఎన్టీఆరే ‘మనం మరో కథతో సినిమా చేద్దాం. శోభన్‌బాబు లాంటి నవ తరం హీరోతో ఈ కథ తెరకెక్కించమన్నార’ట. అలా రెగ్యులర్‌గా ఎన్టీఆర్‌తో సినిమాలు చేసే కంపెనీలోకి హీరోగా శోభన్‌బాబు వచ్చి చేరారు. అలా వచ్చింది – ‘జీవనజ్యోతి’. ఆ సూపర్‌హిట్ తర్వాత ఆ అందాల నటుడు ఆ బ్యానర్లోనే ‘జీవితనౌక’ (1977), ‘కాలాంతకులు’ (1978), ‘దోషి – నిర్దోషి’ (1990) చేశారు. ఇక, ‘జీవనజ్యోతి’ కన్నా ముందు నుంచే విశ్వనాథ్‌తో ‘చిన్ననాటి స్నేహితులు’ (1971) లాంటి చిత్రాలు నిర్మించిన డి.వి.ఎస్. రాజు అటు తర్వాత కూడా ఆ సృజనశీలికి పెద్దపీట వేశారు. 1980ల దాకా ఆయన నిర్దేశకత్వంలో పలు చిత్రాలు తీస్తూ వచ్చారు.అయిదేళ్ళలో 4 ‘బంగారాల’ క్రేజీ కాంబినేషన్కొన్ని కాంబినేషన్లు కుదిరిన వేళావిశేషం అంతే. విశ్వనాథ్ – శోభన్‌బాబుల కాంబినేషన్ ‘జీవనజ్యోతి’ ముందు నుంచీ సూపర్‌డూపర్ సక్సెసే. కాసులతో పాటు కావలసినంత పేరూ తెచ్చింది. 1971 నుంచి 1973 దాకా వరుసగా మూడేళ్ళూ వారిద్దరి కలయిక (‘చెల్లెలి కాపురం’, ‘కాలం మారింది’, ‘శారద’) కమర్షియల్ హిట్. ఆ చిత్రాలన్నీ ఉత్తమ చిత్రాలుగా రాష్ట్ర ప్రభుత్వ బంగారు నందులు సాధించినవే. ఒక్క ఏడాది గ్యాప్ తర్వాత 1975లో మళ్ళీ వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జీవనజ్యోతి’ కూడా బాక్సాఫీస్ వద్దే కాక అవార్డుల్లోనూ బంగారమే పండించింది. అదీ అప్పట్లో విశ్వనాథ్ – శోభన్‌బాబుల క్రేజీ కాంబినేషన్ ఘనత. మరో విశేషం ఏమిటంటే, మధ్యలో 1974లో వాళ్ళిద్దరి కలయికలో సినిమా రాలేదు కానీ, ఆ ఏడాది కూడా విశ్వనాథ్ దర్శకత్వంలోని ‘ఓ సీత కథ’ (1974) బంగారు నందిని కాకున్నా, ద్వితీయ ఉత్తమ చిత్రంగా వెండి నందిని గెలిచింది. ఆ 1974లో బంగారు నంది తెలుగు విప్లవవీరుడి జీవితకథా చిత్రమైన కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ను వరించింది.తెరపై ప్రతిభామూర్తుల త్రివేణీ సంగమం నిజానికి, ‘జీవనజ్యోతి’ సమయానికి శోభన్‌బాబు హీరోగా వరుస విజయాలతో తారాపథానికి ఎదిగారు. ప్రతిభాశాలి అయిన దర్శకుడు కె. విశ్వనాథ్ ఏమో మూడేళ్ళు వరుసగా ఉత్తమ చిత్రాలు అందించి, వాటికి రాష్ట్ర ప్రభుత్వ బంగారు నందులు సాధించి, మంచి ఊపు మీదున్నారు. పైగా, ఆ మూడు చిత్రాల్లోనూ హీరో శోభన్‌బాబే. హీరోయిన్ వాణిశ్రీ అప్పటికే సమకాలికులు అందరినీ దాటుకుంటూ ఆల్రెడీ అగ్రతారగా ఎదిగారు. ఆంధ్రుల అభిమాన నటీమణిగా మార్కెట్లో వెలిగారు. టాప్ హీరోలు ఎన్టీఆర్ (‘కోడలు దిద్దిన కాపురం’, ‘దేశోద్ధారకులు’, ‘మాయా మశ్ఛీంద్ర’), ఏయన్నార్ (‘దసరా బుల్లోడు’, ‘ప్రేమ్‌నగర్’) సరసన తీరిక లేనంత బిజీగా ఉన్నారు. అలాంటి సమయంలో ఈ సెంటిమెంటల్ కుటుంబ కథ ఆమెకు వచ్చింది. అందులోనూ మానసికంగా దెబ్బతిన్న ముసలి తల్లి పాత్ర, ఆ కన్నతల్లి కోసం చిన్నారి కొడుకును త్యాగం చేసే కూతురి పాత్ర... రెండూ పోషించాల్సిన డ్యుయల్ రోల్ ఆఫర్. అంతకు ముందే కన్నడంలో సంచలనం రేపిన ‘శరపంజర’ (1971) చిత్రానికి తెలుగు రీమేక్‌గా హీరో కృష్ణంరాజు తీసిన ‘కృష్ణవేణి’ (1974)లో మానసిక స్వస్థత కోల్పోయిన ఇల్లాలిగా నటించి పేరు తెచ్చుకున్నారు ‘కళాభినేత్రి’ వాణిశ్రీ. ఆ వెంటనే ఈ ‘జీవనజ్యోతి’లోని రెండు పాత్రలనూ మరో సవాలుగా తీసుకున్నారు. అలా అరుదైన దర్శకుడు, నాయికా నాయకుల కలయికలో నవరసాలూ రంగరించి, సప్తవర్ణాలతో ‘ఈస్ట్‌మన్ కలర్’లో తయారైంది – ‘జీవనజ్యోతి’.గోదావరి పొంగు లాంటి కోనసీమ పిల్ల లక్ష్మి (వాణిశ్రీ)ని చూసీచూడగానే ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు గుంటూరు పిల్లగాడు వాసు (శోభన్‌బాబు). అతనికీ, ఆ ఉమ్మడి కుటుంబానికీ జ్యోతిగా మెలుగుతున్న ఆమెకు అనుకోని ఓ విషాద ఘటనతో మతి చలిస్తుంది. ఆ విషాదాన్ని ఆమె మనసు నుంచి దూరం చేసి, ఆమెను ఎవరు, ఎలా మామూలు మనిషిని చేశారు? ఆ కుటుంబంలో మళ్ళీ ‘జీవనజ్యోతి’ ఎలా వెలిగిందన్నది ఈ సెంటిమెంట్ సినిమా. సినిమా ఫస్టాఫ్‌లో అల్లరిపిల్లగా కనిపించి, సెకండాఫ్‌లో పోగొట్టుకున్న తన బాబు కోసం ఆరాటపడే మతి భ్రమించిన మాతృమూర్తిగా కన్నీళ్ళుపెట్టించే లక్ష్మి పాత్రపోషణలోని రెండు విభిన్న ఛాయలను వాణిశ్రీ అద్భుతంగా అభినయించారు. అదే సమయంలో వయసు మళ్ళిన కన్నతల్లి కోసం తన ‘బాబు’ను త్యాగం చేసే కూతురు శోభ పాత్రనూ అంతే పరిణతితో పోషించారు. ‘సిన్ని ఓ సిన్నీ...’ అని పాటలు పాడే కోడెకారు కుర్రవాడి నుంచి మానసికంగా దెబ్బతిన్న భార్యను కాపాడుకోవడానికి తపించే భర్త వరకు జీవితంలోని వివిధ దశల్ని ప్రతిఫలించే వాసు పాత్రలో ఆ పరిణామాన్ని శోభన్‌బాబు తెరపై బాగా చూపారు. ముఖ్యంగా, చిన్నారి ‘బాబు’గా బేబీ వరలక్ష్మి కూడా రెండు పాత్రల్లో ఆ రోజుల్లో ప్రేక్షకుల మనసు చూరగొంది. రథం కింద బాబు పడిపోయే అత్యంత కీలకమైన దృశ్యం గగుర్పాటు కలిగించి, కన్నీరు తెప్పించింది. సినిమా కథను మలుపు తిప్పే ఆ సన్నివేశ చిత్రీకరణలో దర్శకుడి ప్రతిభ, జి.కె. రాము ఛాయాగ్రహణ నైపుణ్యం తెరపై సినిమా కాదు... నిజజీవిత ఘట్టం చూస్తున్నామన్నంత అనుభూతిని కలిగించాయి. డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ సంస్థలో కలర్లో తీసిన తొలి సినిమా కూడా ఇదే. అందుకు తగ్గట్టే, నిర్మాత రాజు తాను పుట్టిపెరిగిన కోనసీమ ప్రాంత అందాలనూ, ఆహ్లాదం పంచే అరటి – కొబ్బరి తోటలనూ, గోదావరి నదీ తీర సౌందర్యాన్నీ పాటల్లో, సన్నివేశాల్లో చూపేలా గన్నవరం ఆక్విడెక్ట్ వద్ద, అమలాపురం దగ్గరలోని కోడూరుపాడు, అల్లవరం, వెన్నుమూరు లంక గ్రామాల్లో చిత్ర నిర్మాణం సాగించారు. ఆయన మేనమామ గారి ఊరైన కోడూరుపాడులోనే క్లిష్టమైన రథోత్సవం సీన్ చిత్రీకరణ సాగింది.అభిప్రాయ భేదాలున్నా... అదే అభిమానంసినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకుల్ని కథలో లీనమైపోయేలా తీసిన ప్రతిభ దర్శకుడిది. ప్రముఖ రచయిత ఆరుద్ర జీవిత భాగస్వామి – స్వయంగా ప్రఖ్యాత రచయిత్రి అయిన శ్రీమతి కె. రామలక్ష్మి ఈ చిత్రానికి మూలకథ సమకూర్చారు. దానికి విశ్వనాథ్ స్క్రీన్‌ప్లేతో సానపెట్టారు. (రామలక్ష్మి నవల ‘ఆడది’ ఈ చిత్రానికి మూలమని కొందరు రాస్తుంటారు. కానీ, 1967– ’68 ప్రాంతంలో ధారావాహికగా రాసిన ఆ చిన్న నవలకూ, ఈ సినిమాకూ పోలికే లేదు). అయితే, ఈ చిత్ర సందర్భంగా రామలక్ష్మి, విశ్వనాథ్‌ల మధ్య సృజనాత్మక అభిప్రాయభేదాలు వచ్చాయి. ఆ తరువాత వారిద్దరూ ఎప్పుడూ కలసి పనిచేయలేదు. కానీ, చివరి వరకు పరస్పర గౌరవాభిమానాలు మాత్రం ఎప్పటిలానే కొనసాగడం నేటి తరానికి ఓ గొప్ప జీవనపాఠం.‘జీవనజ్యోతి’లో కె. విశ్వనాథ్ ఎప్పటిలానే విలక్షణమైన క్యారెక్టర్లు, వాటికంటూ ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్లతో పాటు తనదైన మార్కుతో కథలో అంతర్భాగంగానే రాజబాబు, రమాప్రభ జంటతో హాస్యం చిలికించారు. ఆయన చిరకాల మిత్రుడు, సహాధ్యాయి అయిన సముద్రాల జూనియర్ సంభాషణల్లో తన పట్టును మరోసారి ఈ చిత్రంలో చూపారు. అఫ్కోర్స్... ఆ రచనలో విశ్వనాథ్ గారి అదృశ్యహస్తమూ ఉందనేది బహిరంగ రహస్యం. సాక్షాత్తూ చిత్ర నిర్మాత డి.వి.ఎస్. రాజు సైతం బాహాటంగా చెప్పిన సత్యం.ఇంటింటా మోగిన ఆ పాటలు‘ఇంత మంచి చిత్రం ఇటీవల రాలేదనీ, ఇది సినిమా కాదు... జీవితమనీ’ ఈ సినిమాకు జనం నీరాజనాలు పట్టారు. ఆ రోజుల్లో ‘ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు... సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు...’ (గానం – పి. సుశీల) పాట మోగని ఇల్లు లేదు. పాడని తల్లి లేదు. ‘ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో...’ (గానం – బి. వసంత, పి. సుశీల) అంటూ సినిమాలో కీలకమైన పిల్లాడి పాత్ర మీద వచ్చే పాట అప్పట్లో ఆబాలగోపాలానికీ ఆల్‌టైమ్ ఫేవరెట్. డ్యూయెట్లలో ‘సిన్ని ఓ సిన్నీ... ఓ సన్నజాజుల సిన్నీ...’ పాట అన్ని దిక్కుల ప్రేక్షకుల్నీ ఊపేసింది. కొత్తగా పెళ్ళయిన జంట మీద వచ్చే ‘ఎందుకంటే ఏమి చెప్పను... ఏమిటంటే ఎలా చెప్పను...’ గీతం యువ ప్రేక్షకుల్ని స్వానుభవాల ఊహలలో తేలియాడించింది. వెరసి, ‘పూతరేకుల తీయదనం... పాలమీగడ కమ్మదనం’ నిండిన సినారె సాహిత్యం, కె.వి. మహదేవన్ సంగీతం, విశ్వనాథ్ మార్కు సంగీత – సాహిత్యాభిరుచి త్రివేణీ సంగమమై, పాటల పల్లకీలో ఈ మ్యూజికల్ హిట్ చిత్రాన్ని ఊరూరా బాక్సాఫీస్ వద్ద ఊరేగించాయి.దర్శకేంద్రుణ్ణి వెనక్కి నెట్టిన కళాతపస్వి!సరిగ్గా ఆ ఏడాదే, అదీ శోభన్‌బాబు హీరోగానే ‘బాబు’ చిత్రంతో కె. రాఘవేంద్రరావు దర్శకుడయ్యారు. ‘జీవనజ్యోతి’కి సరిగ్గా 14 రోజుల ముందు 1975 మే 2న ఆ సినిమా రిలీజైంది. భారీ తారాగణం, ఖరీదైన సెట్లతో సహా అన్ని రకాల హంగులు, ‘ఒక జంట కలిసిన తరుణాన జేగంట మ్రోగెను గుడిలోన...’ లాంటి పాపులర్ పాటలతో ఆ చిత్రం రిలీజైంది. కొత్త దర్శకుడైనా, ఖరీదైన టేకింగ్‌తో సినిమా ఫరవాలేదని అనిపించుకుంటున్న తరుణంలో సరిగ్గా 2 వారాలకు శోభన్‌బాబే నటించిన కె.విశ్వనాథ్ ‘జీవనజ్యోతి’ అనుకోని పోటీగా అవతరించింది. మనసుకు పట్టే పాటలు, మహిళల్ని కట్టిపడేసే సెంటిమెంట్‌తో ‘జీవనజ్యోతి’ సమకాలపు సినిమాలన్నిటినీ చిత్తు చేసి, బాక్సాఫీస్ విన్నరైంది. ఇంకా చెప్పాలంటే, ఆ ఏడాది తెలుగులో వచ్చిన చిత్రాలన్నిటిలోకీ అత్యధిక వసూళ్ళు ఆ సినిమావే!‘‘అప్పట్లో విశ్వనాథ్ గారి ‘జీవనజ్యోతి’ హోరులో నా తొలిచిత్రం ‘బాబు’ అడ్రస్ గల్లంతైంది’’ అని రాఘవేంద్రరావే స్వయంగా అంగీకరించారు. కలెక్షన్ల రీత్యా ‘బాబు’ యావరేజ్ సినిమాగా నిలిచినా, మితిమీరిన చిత్ర నిర్మాణ వ్యయం కారణంగా ట్రేడ్ లెక్కలో ఆ సినిమా ఫెయిల్యూర్‌గా మిగిలింది. తర్వాతి కాలంలో అదే రాఘవేంద్రరావు వసూళ్ళవర్షం కురిపించే కమర్షియల్, మాస్ చిత్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అదే కె. విశ్వనాథ్ అభిరుచి గల కళాత్మక చిత్రాలతోనూ కాసులు కురిపించిన సినీ తపస్విగా సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. అదీ విశేషం.సిల్వర్ జూబ్లీ సూపర్‌హిట్ ‘జ్యోతి’! ఆ రోజుల్లో ‘జీవనజ్యోతి’ మొత్తం 32 కేంద్రాల్లో రిలీజై, అశేష ప్రేక్షకాదరణతో ఏకంగా 31 సెంటర్లలో 50 రోజులు ఆడింది. అదే ఊపులో 12 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. నిజానికి, మరిన్ని కేంద్రాల్లో నూరు రోజుల పండుగ చేసుకోవాల్సి ఉన్నా, దిగువ కేంద్రాలకు త్వరగా కొత్త సినిమా పంపడం కోసం పంపిణీదారులైన విజయా పిక్చర్స్ వారి పద్ధతైన 50 – 50 శాతం షేర్ వసూళ్ళ షరతు అవరోధమైంది. అలా కొన్ని సెంటర్లలో 80, 90 రోజులు పూర్తయ్యాక కూడా శతదినోత్సవ ఘనత రాకుండానే ‘జీవనజ్యోతి’ని థియేటర్ నుంచి తప్పించిన తార్కాణాలున్నాయి. ఏమైనా, హైదరాబాద్‌లో మాత్రం ఈ చిత్రం షిఫ్టులతో 25 వారాలు నడిచింది. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో విజయలక్ష్మీ టాకీస్‌లో ఆ ఏడాది నవంబర్ 6న అలా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. ‘జీవనజ్యోతి’ తర్వాత ఏడు నెలలకు 1975లోనే డిసెంబర్లో వచ్చిన శోభన్‌బాబు ‘సోగ్గాడు’ సైతం పెద్ద హిట్. అది కూడా 32 కేంద్రాల్లోనే రిలీజై, 31 కేంద్రాల్లో 50 రోజులు జరుపుకోవడం విశేషం. అయితే, ఆ చిత్రం 19 సెంటర్లలో వంద రోజులాడినా, రజతోత్సవ ఘనత దక్కలేదు. చాలామందికి తెలియనిదేమిటంటే, శోభన్ కెరీర్లో అతి పెద్ద కమర్షియల్ హిట్ అని అందరూ అనుకొనే ‘సోగ్గాడు’ కన్నా ‘జీవనజ్యోతి’దే వసూళ్ళలో పైచేయి. ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. టికెట్ రేట్లు ఎక్కువుండే ఏసీ, డీలక్స్ థియేటర్లలో ‘సోగ్గాడు’ రిలీజైన కాకినాడ, నెల్లూరు టౌన్లను మినహాయిస్తే, మిగతా అన్ని కేంద్రాల్లోనూ ఎక్కువ వసూళ్ళు వచ్చింది – ‘జీవనజ్యోతి’కే! ‘జీవనజ్యోతి’ వసూళ్ళ రేంజ్ అదీ!ఈ చిత్రం హిట్ రేంజ్‌కు మచ్చుకు ఓ ఉదాహరణ – కీలకమైన గుంటూరు కేంద్రం బాక్సాఫీస్ కథ. చలనచిత్ర చరిత్రలో... గుంటూరు టౌన్లో రూ. 4 లక్షల పైచిలుకు వసూలు చేసిన మొట్టమొదటి సినిమా – ఈ ‘జీవనజ్యోతే’. ఆ తర్వాత మళ్ళీ రెండేళ్ళకు ఎన్టీఆర్ ‘దాన వీర శూర కర్ణ’ (1977) అంతటి వసూళ్ళతో, ఆ ఘనత సాధించిన రెండో సినిమా అయింది. విశేషం ఏమిటంటే, మిగతా హీరోలంతా గుంటూరులో ఆ మైలురాయి వసూళ్ళకు చేరుకోవడానికి దాదాపు అయిదారేళ్ళ సమయం పట్టింది. కృష్ణకు ‘ఊరుకి మొనగాడు’ (1981), కృష్ణంరాజుకి ‘సీతారాములు’ (1980), ఏయన్నార్‌కి ‘ప్రేమాభిషేకం’ (1981) వచ్చేవరకు గుంటూరులో ఆ 4 లక్షల మైలురాయి లేదన్నది బాక్సాఫీస్ విశ్లేషకుల మాట. సాక్షాత్తూ శోభన్‌బాబు సైతం ‘జీవనజ్యోతి’ తర్వాత ఏడేళ్ళకు ‘దేవత’ (1982 సెప్టెంబర్ 10 రిలీజ్) వచ్చేవరకు మరోసారి ఆ రూ. 4 లక్షల ఘనత గుంటూరులో సాధించలేదు. అయితే, ఆ నడిమధ్య కాలంలో ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు మాత్రం రూ. 4 లక్షల‡మైలురాయిని దాటి, వసూలు చేశాయి. అదీ ‘జీవనజ్యోతి’ హిట్ రేంజ్! శోభన్‌బాబు కెరీర్లో టాప్ ఇయర్!స్వీయ నిబంధనలకు తగ్గట్టు నటించి, ఇంకా క్రేజ్, ఇమేజ్ ఉన్నా సరే సొంత ఆలోచనలకు తగ్గట్టే నటన విరమించిన అందాల నటుడు, ‘నటభూషణ’ శోభన్‌బాబుది చిరస్మరణీయమైన సినీ జీవితం. అంతటి కెరీర్లోనూ ఆయనకు శిఖరాయమాన సంవత్సరమంటే – ‘జీవనజ్యోతి’ రిలీజైన 1975యే! టాప్ హీరో ఎన్టీఆర్ గణనీయమైన సంఖ్యలో సినిమాలు చేస్తున్నా, హిట్లూ – కలెక్షన్లూ వస్తూనే ఉన్నా, జనం ఆగి అబ్బురపడేటంత భారీ బాక్సాఫీస్ హిట్లు రాని ఏడాది అది. మరో అగ్రహీరో ఏయన్నార్ అంతకు ముందే అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకొని వచ్చారు. సినిమాలకు విరామమిచ్చి, పూర్తిగా విశ్రాంతి తీసుకోవడంతో, ఆ ఏడాది ఆయనకు రిలీజులే లేవు. శోభన్‌కు సాటివాడైన హీరో కృష్ణ చకచకా సినిమాలు చేస్తున్నప్పటికీ, క్రిందటేడు ‘అల్లూరి సీతారామరాజు’ (1974) తెచ్చిన ఇమేజ్ దెబ్బతో, ‘పాడిపంటలు’ (1976) వరకు సినిమాలన్నీ వరుసగా ఫ్లాపవుతున్న విచిత్రమైన సంవత్సరం అది.అలాంటి చిత్రమైన సందర్భంలో శోభన్‌బాబు పట్టిందల్లా బంగారమైంది. ఆ 1975లో శోభన్ సినిమాలు మొత్తం 8 రిలీజయ్యాయి. అందులో 5 (‘దేవుడు చేసిన పెళ్ళి’, ‘జీవనజ్యోతి’, ‘బలిపీఠం’, ‘జేబుదొంగ’, ‘సోగ్గాడు’) హిట్లు . రెండే (‘గుణవంతుడు’, ‘అందరూ మంచివారే’) ఫ్లాపులు. ఒకటి మాత్రం (‘బాబు’) యావరేజ్. అయిదు హిట్లలోనూ ‘జీవనజ్యోతి’ ఒకటే 25 వారాలు ఆడి, సిల్వర్‌జూబ్లీ చేసుకుంది. ఏయన్నార్‌కి పర్మినెంట్ నిర్మాతైన డి. రామానాయుడు తీసిన ‘సోగ్గాడు’ సైతం రజతోత్సవానికి ఒక వారం ముందే థియేటర్ల నుంచి వైదొలగింది. అలా ఒకే ఏడాది అధికశాతం కమర్షియల్ సక్సెస్‌లతో శోభన్‌బాబు క్రేజు పెరిగిపోయింది. పరిశ్రమలో ఆయన రేంజే మారిపోయింది.హిందీలోనూ హిట్టయిన మదర్ సెంటిమెంట్! బాక్సాఫీస్ రికార్డులే కాదు... విమర్శకుల రివార్డులు, ప్రభుత్వ – ప్రైవేటు అవార్డుల్లోనూ ‘జీవనజ్యోతి’కి అగ్రతాంబూలం దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే నంది అవార్డుల్లో ఆ ఏడాదికి బంగారు నంది అందుకున్న ఉత్తమ చిత్రం అదే! (అప్పటికింకా వ్యక్తిగత విభాగాల్లో ప్రత్యేకంగా నంది అవార్డులు ఇవ్వడమనే ఆనవాయితీ లేదు. ఉత్తమ చిత్రం అవార్డు కింద నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్లను అందరినీ గౌరవించేవారు. అలా ‘జీవనజ్యోతి’ ప్రధాన బృందం అంతటికీ గౌరవం దక్కింది). ఇక, పాపులర్ అవార్డులైన ‘ఫిల్మ్‌ఫేర్’లోనూ దక్షిణాదిన ఈ సినిమాదే హవా. ఉత్తమ తెలుగు సినిమా, ఉత్తమ దర్శకుడు (కె. విశ్వనాథ్), ఉత్తమ నటుడు (శోభన్‌బాబు), ఉత్తమ నటి (వాణిశ్రీ)... ఇలా అవార్డుల పంట పండింది. ఇదే సినిమా దశాబ్ద కాలం తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలోనే హిందీలో జితేంద్ర, జయప్రదలతో ‘సన్జోగ్’ (1985)గా రీమేకైంది. అక్కడా ఈ కథ హిట్. కథానాయికగా జయప్రదకు మంచి పేరు తెచ్చింది. ఉత్తమ నటిగా ఆమె ‘ఫిల్మ్‌ఫేర్’కు నామినేటైంది. చిత్రమేమంటే, ఈ తెలుగు సూపర్‌హిట్ సినిమా 21 ఏళ్ళ తర్వాత కన్నడంలోనూ వచ్చింది. విష్ణువర్ధన్, ఆమనితో ‘బాళిన జ్యోతి’ (1996)గా క్రాంతికుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ‘లేడీస్ స్పెషల్ షో’ ట్రెండ్!విశేషమేమిటంటే, అదే ఏడాది ప్రపంచ మహిళా సంవత్సరం. ఈ సెంటిమెంట్ సినిమాకు స్త్రీలు పోటెత్తడంతో, కొన్ని తరగతుల టికెట్లు, కొన్ని షోలు ఆడవారికే ప్రత్యేకంగా కేటాయించేవారు. మూకీలు పోయి టాకీలొచ్చాక, తెలుగు సినిమా ఆధునికతను సంతరించుకున్నాక ఈ ‘లేడీస్ స్పెషల్ షో’ ట్రెండ్‌కూ ఈ ‘జీవనజ్యోతే’ నాంది!ప్రాంతాలు, భాషల తేడా లేకుండా ‘జీవనజ్యోతి’లోని సార్వత్రికమైన తల్లి సెంటిమెంట్ అన్నిచోట్లా పండింది. ఆ సింపుల్ సెంటిమెంట్ కథ... విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ, వాణిశ్రీ అభినయ వైదుష్యం, అందాల శోభన్‌బాబు క్రేజీ ఇమేజ్, పదే పదే పాడుకోవాలనిపించే పాటలతో ఇవాళ తెరపై చూసినా తాజాగా అనిపించడం చెప్పుకోదగ్గ గొప్పదనం.– రెంటాల జయదేవ

పోటాపోటీగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్
భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే (అసలు పేరు ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే) బయోపిక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ చేసేందుకు ఇటు రాజమౌళి అటు ఆమిర్ ఖాన్ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. దీంతో ముందుగా ఎవరు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది.త్రీ ఇడియట్స్ కాంబినేషన్... భారతీయ తొలి ఫీచర్ ఫిల్మ్ దర్శక–నిర్మాతగా ‘రాజా హరిశ్చంద్ర’తో చరిత్రలో నిలిచిన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో టైటిల్ రోల్‌ని ఆమిర్ ఖాన్ పోషించనున్నారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ హీరాణీ దర్శకత్వం వహించనున్నారు. ‘త్రీ ఇడియట్స్’ (2009), ‘పీకే’ (2014) వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత హీరో ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ హీరాణీ ‘దాదాసాహెబ్ ఫాల్కే’ బయోపిక్ సినిమా కోసం వర్క్ చేయనుండటం విశేషం. రాజ్‌కుమార్ హీరాణీ, అభిజిత్ జోషీ, హిందూకుష్ భరద్వాజ్, ఆవిష్కర్ భరద్వాజ్‌లు ఈ బయోపిక్కు నాలుగేళ్లుగా స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారని సమాచారం. ఈ బయోపిక్ చిత్రీకరణ అక్టోబరులో ఆరంభం అవుతుందట. ఇక ఈ చిత్రానికి దాదాసాహెబ్ మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుసాల్కర్ తన వంతు సహకారం అందించనున్నారని బాలీవుడ్ టాక్.మేడ్ ఇన్ ఇండియా... ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ ‘మేడ్ ఇన్ ఇండియా’కు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా 2023 సెప్టెంబరులో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మించనున్నట్లు, నితిన్ కక్కడ్ (హిందీ చిత్రం ‘నోట్‌బుక్’ ఫేమ్) ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.ఆ తర్వాత ఈ సినిమా గురించిన అప్డేట్ ఏదీ బయటకు రాలేదు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని, ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయని సమాచారం. ఈ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్కు మేకర్స్ ఎన్టీఆర్‌ను సంప్రదించగా, ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారనే వార్తలు తాజాగా పెద్ద ఎత్తున తెరపైకి వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన 24 గంటల్లోపే దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్‌ను ఆమిర్ ఖాన్ చేస్తున్నట్లుగా గురువారం అధికారిక ప్రకటన వచ్చింది.

థాయ్‌లాండ్‌లో మంచు లక్ష్మీ చిల్.. శారీలో బిగ్‌బాస్ బ్యూటీ విష్ణు ప్రియ హోయలు!
థాయ్‌లాండ్‌లో చిల్ అవుతోన్న మంచు లక్ష్మి..బాలీవుడ్ భామ దిశా పటానీ అలాంటి పోజులు..పెళ్లి తర్వాత లండన్‌లో ఎంజాయ్ చేస్తోన్న అభినయ..శారీలో బిగ్‌బాస్ బ్యూటీ విష్ణు ప్రియ హోయలు..థాయ్‌లాండ్‌లో కావ్య థాపర్ వేకేషన్.. View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

'ప్రేమించడం.. ప్రేమించబడటం.. రెండూ కర్మలే'.. ఆసక్తిగా టీజర్
దేవన్, ధన్య బాలకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం 'కృష్ణలీల'. ఈ చిత్రాన్ని హీరో దేవన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'ప్రేమించడం.. ప్రేమించబడటం.. రెండూ కర్మలే.'.. ప్రేమ అనే ధర్మం దేవతలైనా.. రాక్షసులైనా.. యోగి అయినా..భోగి అయినా ఎవరైనా అనుభవించాల్సిందే' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది.టీజర్లో 'ఈ ప్రేమను అనైతికంగా అనుభవించాలనుకున్నా.. దూరం పెట్టాలనుకున్నా.. అది నీకు సరైన పాఠం నేర్పుతుంది' అనే డైలాగ్ వింటే ప్రేమ అనే కోణంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వినోద్ కుమార్ , పృధ్వీ, రవి కాలే , తులసి, సరయు , ఆనంద్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

టి20ల్లో షఫాలీ పునరాగమనం
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో 5 టి20లు, 3 వన్డేల్లో పాల్గొనే భారత మహిళల జట్టును గురువారం సెలక్టర్లు ప్రకటించారు. టి20ల కోసం 15 మందిని, వన్డేలకు 16 మందిని ఎంపిక చేయగా... రెండు టీమ్‌లకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌కు ముందు మన జట్టు ఆడనున్న ఆఖరి వన్డే సిరీస్ ఇదే కానుంది. దూకుడైన ఆటతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ ఓపెనర్ షఫాలీ వర్మ భారత జట్టులో పునరాగమనం చేసింది. గత ఏడాది అక్టోబరు తర్వాత ఆమె స్థానం కోల్పోయింది. ఉమెన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫు 9 మ్యాచ్‌లలో 304 పరుగులు చేసి షఫాలీ సత్తా చాటింది. అయితే షఫాలీని టి20లకు మాత్రమే ఎంపిక చేసిన సెలక్టర్లు వన్డే జట్టులో స్థానం కల్పించలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియా కూడా తిరిగి జట్టులోకి వచ్చింది. గత ఏడాది నవంబరులో మణికట్టు గాయంతో ఆమె ఆటకు దూరమైంది. యస్తికకు వన్డే, టి20 రెండు టీమ్‌లలో చోటు లభించింది. ఇటీవల శ్రీలంకతో ముక్కోణపు టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన స్నేహ్ రాణా కూడా టి20ల్లో మళ్లీ చోటు దక్కించుకుంది. ఇదే టోర్నీలో ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి తొలిసారి టి20 టీమ్‌లోకి ఎంపికైంది. హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి కూడా టి20 జట్టులోకి పునరాగమనం చేసింది. భారత టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే. భారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తిక భాటియా, తేజల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.భారత్, ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్ తొలి టి20: జూన్ 28 నాటింగ్‌హామ్ రెండో టి20: జూలై 1 బ్రిస్టల్ మూడో టి20: జూలై 4 ఓవల్ నాలుగో టి20: జూలై 9 మాంచెస్టర్ ఐదో టి20: జూలై 12 బర్మింగ్‌హామ్ తొలి వన్డే: జూలై 16 సౌతాంప్టన్ రెండో వన్డే: జూలై 19 లార్డ్స్ మూడో వన్డే: జూలై 22 చెస్టర్ లీ స్ట్రీట్

మయాంక్ యాదవ్‌కు మళ్లీ గాయం.. లక్నో జట్టులోకి కివీ స్పీడ్ స్టార్
టీమిండియా స్పీడ్ స్టార్, లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ మరోసారి గాయపడ్డాడు. మయాంక్ యాదవ్ వెన్ను గాయం కారణంగా ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంచైజీ గురువారం ధ్రువీకరిచింది. కాగా మయాంక్ ఈ ఏడాది సీజన్ మధ్యలో గాయం నుంచి కోలుకుని లక్నో జట్టులో చేరాడు.ఈ క్రమంలో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిన యాదవ్‌కు తన వెన్నుగాయం తిరగబెట్టింది. దీంతో అతడు మళ్లీ బెంగళూరులోని ఏన్సీఎకు వెళ్లనున్నాడు. తరుచూ గాయాల బారిన పడతుండడంతో అతడి కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. ఇక మయాంక్ యాదవ్ స్ధానాన్ని న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ విలియం ఓరూర్క్తో లక్నో భర్తీ చేసింది. కివీ పేసర్‌ను రూ. 3 కోట్ల రిజర్వ్ ధరకు సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఓ రూర్క్ న్యూజిలాండ్ జట్టులో ప్రస్తుతం కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. భారతగడ్డపై న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంలో రూర్క్ది కీలక పాత్ర. ఈ క్రమంలోనే అతడితో లక్నో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా గాయపడిన లాకీ ఫెర్గూసన్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించింది. మరో న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ కైల్ జామీసన్ పంజాబ్ తమ జట్టులోకి తీసుకుంది. జామీసన్ గతంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. కాగా భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఆర్ధరంతరంగా ఆగిపోయిన ఈ ఏడాది ఐపీఎల్ సీజన్.. తిరిగి మే 17 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. విధ్వంసకర ఓపెనర్ రీ ఎంట్రీ

శుబ్‌మన్ గిల్, పంత్ కాదు.. అతడి టెస్టు కెప్టెన్ చేయండి: అశ్విన్
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారత తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరన్న చర్చ మొదలైంది. టెస్టు కెప్టెన్సీ రేసులో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ముందుంజలో ఉన్నాడు. కెప్టెన్‌గా గిల్ ఎంపిక దాదాపు ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీమిండియా తదుపరి కెప్టెన్ గిల్ అన్న ఊహాగానాలపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కొంతమంది మాజీలు సంతృప్తి వ్యక్తం చేస్తూంటే.. మరి కొంత మంది సీనియర్ ఆటగాడిని కెప్టెన్‌గా చేయాలని బీసీసీఐని సూచిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను భారత కెప్టెన్‌గా ఎంపిక చేయాలని అశ్విన్ సూచించాడు.."ప్రస్తుత భారత జట్టులో రవీంద్ర జడేజా అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు. అతడిని కూడా కెప్టెన్సీ ఎంపికగా పరిగణించాలి. మీరు కొత్త ఆటగాడికి శిక్షణ ఇచ్చి తర్వాత కెప్టెన్‌గా చేయాలని భావిస్తుంటే.. సారథిగా మీకు జడేజా బెస్ట్ ఛాయిస్. జడేజా రెండేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించవచ్చు. జడ్డూకు డిప్యూటీగా మీరు ఎవరినైతే కెప్టెన్‌గా చేయాలనకుంటున్నారో వారిని నియమించండి. అప్పుడు అతడు మరింత రాటుదేలుతాడు. భారత జట్టుకు కెప్టెన్ కావడం ప్రతి ఆటగాడి కల. జడేజాకు అవకాశమిస్తే అతడు కచ్చితంగా స్వీకరిస్తాడని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.అదేవిధంగా శుబ్‌మన్ గిల్‌పై కూడా అశూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. గిల్ అక్కడ జట్టును గెలిపిస్తే.. కెప్టెన్‌గా పరిపక్వత సాధించినట్లు అవుతోంది. అయితే టెస్టుల్లో కెప్టెన్సీ అంత సలువు కాదు. ఒక కెప్టెన్‌గా ఫస్ట్-క్లాస్ క్రికెట్లో కూడా ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అశ్విన్ అన్నాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. విధ్వంసకర ఓపెనర్ రీ ఎంట్రీ

ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన..
భారత మహిళల క్రికెట్ జట్టు ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. ఈ రెండు సిరీస్‌లలో భారత కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన వ్యహరించనున్నారు. అదేవిధంగా ఇంగ్లండ్ టూర్‌కు స్టార్ ప్లేయర్లు శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్ గాయాల కారణంగా దూరమయ్యారు. శ్రేయాంక చేతి వేలి గాయంతో బాధపడుతుండగా.. రేణుకా మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటుంది. దీంతో వీరిద్దరూ శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లోనూ భారత్ జట్టులో భాగం కాలేదు. మరోవైపు వన్డే జట్టు నుంచి కష్వీ గౌతమ్‌ను సెలక్టర్లు తప్పించారు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో గౌతమ్ ఆడే అవకాశం వచ్చినప్పటికి, పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఆమెను సెలక్టర్లు పక్కన పెట్టారు.షెఫాలీ రీ ఎంట్రీ..ఇక భారత టీ20 జట్టులోకి స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ రీ ఎంట్రీ ఇచ్చింది. డబ్ల్యూపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున షెఫాలీ అద్బుతంగా రాణించడంతో సెలక్టర్లు తిరిగి పిలుపు నిచ్చారు. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్ సీజన్లో షెఫాలీ 152.76 స్ట్రైక్ రేటుతో 304 పరుగులు చేసింది.ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా సైతం టీ20 జట్టులోకి పునరాగమనం చేసింది. అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాకు చెందిన శ్రీచరణి వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకుంది. ఇటీవలే శ్రీలంక పర్యటనతో అరంగేట్రం చేసిన శ్రీచరణి.. తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇక భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది.భారత టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా , హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, శుచి రణ్ఉపాధ్యాయ, కె అరుణ్‌జో ఉపాధ్యాయ్, కె అరుణ్‌జో ఉపాధ్యాయ్ ఉపాధ్యాయ్ సత్ఘరేభారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా , తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, కె అరుణ్ధా రెడ్డి, షుచి అమాన్‌ప్రీత్‌కౌర్ గౌడ్, సయాలీ సత్ఘరేచదవండి: IND vs ENG: టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్ క్రికెట్ మాస్టర్ ప్లాన్
బిజినెస్

ప్యాసింజర్ వాహన అమ్మకాలు 4% అప్
న్యూఢిల్లీ: దేశంలో ప్రయాణికుల వాహనాల టోకు అమ్మకాలు ఏప్రిల్‌లో 4% పెరిగి 3,48,847 యూనిట్లకు చేరుకున్నాయని భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్) వెల్లడించింది. 2024 ఏప్రిల్‌లో విక్రయాలు 3,35,629 వాహనాలతో పోలిస్తే ఇవి 4% అధికంగా ఉన్నాయి. ద్వి చక్రవాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 17% క్షీణించి 17,51,393 నుంచి 14,58,784 యూనిట్లకు తగ్గాయి. ఇందులో మోటార్ సైకిల్ సరఫరా 23% తగ్గి 8,71,666 యూనిట్లకు దిగివచ్చాయి. స్కూటర్ అమ్మకాలు 5,81,277 నుంచి 5,48,370 యూనిట్లకు; మోపెడ్ విక్రయాలు 41,924 నుంచి 38,748 యూనిట్లకు తగ్గాయి. త్రిచక్రవాహన విక్రయాలు సైతం స్వల్పంగా 0.75% తగ్గి 49,441 యూనిట్లకు దిగివచ్చాయి. ‘‘ ప్యాసింజర్ వాహన విభాగం ఏప్రిల్ 2025లో ఇప్పటివరకు అత్యధికంగా 3.49 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది ఏప్రిల్ 2024తో పోలిస్తే 3.9 శాతం ఎక్కువ. అధిక బేస్ ప్రభావం అమ్మకాలపై పడటంతో ద్విచక్రవాహన విభాగం రెండంకెల క్షీణతను చవిచూసింది. రానున్న నెలల్లో తిరిగి పుంజుకునే వీలుంది’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు.

భారత్‌లో ఇంధన డిమాండ్ జోరు
న్యూఢిల్లీ: ప్రధాన దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇంధనానికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. 2025, 2026లో చైనాకు రెండింతల వేగంతో వృద్ధి చెందనుంది. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం దేశీయంగా 2024లో రోజుకు 5.55 మిలియన్ బ్యారెళ్లుగా (ఎంబీపీడీ) ఉన్న డిమాండ్ 2025లో 3.39 శాతం వృద్ధితో 5.74 ఎంబీపీడీకి చేరనుంది. అలాగే 206లో 4.28 శాతం పెరిగి 5.99 ఎంబీపీడీకి ఎగియనుంది. అదే సమయంలో చైనాలో ఆయిల్‌కు డిమాండ్ ఈ ఏడాది, వచ్చే ఏడాది వరుసగా 1.5 శాతం, 1.25 శాతం మేర పెరగనుంది. వినియోగదారులు ఖర్చు పెడుతుండటం, పెట్టుబడుల ప్రవాహం, కీలక రంగాలకు ప్రభుత్వ మద్దతు తదితర అంశాలతో భారత్ పటిష్టమైన ఆర్థిక వృద్ధిని సాధించే ధోరణి కొనసాగుతుందని ఒపెక్ పేర్కొంది. అమెరికా ఇటీవల ప్రకటించిన టారిఫ్‌లతో భారత జీడీపీపై ప్రభావం చూపినప్పటికీ, ద్రవ్య..ఆర్థిక విధానాలపరమైన ఉద్దీపన చర్యలతో దాన్ని కొంత మేర అధిగమించవచ్చని వివరించింది. సమీప భవిష్యత్తులో భారత్‌లో ఆయిల్‌కి డిమాండ్ స్థిరంగా ఉంటుందనే సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. దీనికి డీజిల్ ప్రధాన చోదకంగా నిలుస్తుందని ఒపెక్ వివరించింది. భారత్ సింహభాగం క్రూడాయిల్ కోసం (85 శాతం) దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటోంది. మార్చి డేటా ప్రకారం రష్యా నుంచి దిగుమతులు ఫిబ్రవరిలో నమోదైన 31 శాతంతో పోలిస్తే అత్యధిక స్థాయి 36 శాతానికి పెరిగాయి. 17 శాతం వాటాతో ఇరాక్ రెండో స్థానంలో, 11 శాతంతో సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉన్నాయి. మరిన్ని విశేషాలు.. → రహదారుల విస్తరణ భారీ స్థాయిలో జరుగుతున్నందున తారుకు కూడా డిమాండ్ పెరుగుతోంది. రవాణా ఇంధనాలు, తయారీ రంగం పుంజుకుంటుందనే బలమైన అంచనాలు, పెట్రోకెమికల్ రంగం ఫీడ్‌స్టాక్ అవసరాలు పెరగడం వంటి అంశాలు ఆయిల్ డిమాండ్‌కి కారణంగా నిలవనున్నాయి. → 2026లో వాణిజ్య సంబంధ చర్చల దన్నుతో టారిఫ్‌లు గణనీయంగా తగ్గొచ్చు. దీనితో వాటి ప్రతికూల ప్రభావం పరిమిత స్థాయిలోనే ఉండొచ్చు. → తయారీ, సేవల రంగాలు పటిష్టంగా ఉండటం, కీలక రంగాలకు ప్రస్తుత ప్రభుత్వం మద్దతునిస్తుండటం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం లాంటి అంశాల వల్ల భారత ఎకానమీ వృద్ధి బాటలో ముందుకెళ్లనుంది. → అంతర్జాతీయంగా చమురు డిమాండ్ కాస్త నెమ్మదించినా వరుసగా రెండేళ్లలో 1.3 ఎంబీపీడీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. → చమురుకు డిమాండ్‌లో అమెరికా అగ్రస్థానంలోనే కొనసాగనుంది. 2025లో 20.5 ఎంబీపీడీతో అమెరికా మొదటి స్థానంలో, 16.90 ఎంబీపీడీతో చైనా రెండో స్థానంలో ఉండనుంది. భారత్ మూడో స్థానంలో ఉంటుంది.

పర్యావరణహితంగా సిమెంట్ పరిశ్రమ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్గారాలను తగ్గిస్తూ, పర్యావరణహితంగా కార్యకలాపాల నిర్వహణను మెరుగుపర్చుకునే దిశగా సిమెంటు పరిశ్రమ కృషి చేస్తోందని అంబుజా సిమెంట్స్ ఎండీ, గ్రీన్ సిమెంటెక్ 2025 చైర్మన్ అజయ్ కపూర్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఇంధనాలు, పునరుత్పాదక విద్యుత్, సాంకేతికత మొదలైన వాటిని వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. బొగ్గు స్థానంలో ఘన వ్యర్ధాలు, ప్లాస్టిక్‌లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం ప్రస్తుతం సగటున సుమారు ఆరు–ఏడు శాతం స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. సిమెంట్ తయారీ సంస్థల అసోసియేషన్‌తో (సీఎంఏ) కలిసి పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహిస్తున్న సీఐఐ గ్రీన్ సిమెంటెక్ 21వ ఎడిషన్ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు వినూత్న వ్యూహాలు, కార్యక్రమాలపై ప్రధానంగా ఫోకస్‌తో ఇది రెండు రోజుల పాటు సాగుతుంది. గత కొన్నేళ్లుగా కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గినట్లు సాగర్ సిమెంట్స్ జాయింట్ ఎండీ ఎస్. శ్రీకాంత రెడ్డి తెలిపారు. తటస్థ ఉద్గారాల స్థాయికి ప్రభుత్వం నిర్దేశించిన గడువుకు పదేళ్లు ముందుగానే లక్ష్యాన్ని సాధించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. సరి్టఫై చేసిన హరిత ఉత్పత్తులు, ప్రోత్సాహకాల కారణంగా పర్యావరణహిత భవంతుల నిర్మాణం పుంజుకుంటోందని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ జాతీయ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి తెలిపారు.

2025లో తొలిసారి 25000 పైకి నిఫ్టీ
ముంబై: పరస్పర సుంకాలు లేని వాణిజ్యాన్ని భారత్ ప్రతిపాదించిందనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో దలాల్ స్ట్రీట్ గురువారం ఒకటిన్నర శాతం ర్యాలీ చేసింది. భారత్‌తో పాటు యూఎస్ ద్రవ్యోల్బణ దిగిరావడమూ కలిసొచ్చింది. సెన్సెక్స్ 1,200 పాయింట్లు పెరిగి 82,531 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 395 పాయింట్లు బలపడి 2025లో తొలిసారి 25వేల స్థాయిపైన 25,062 వద్ద నిలిచింది. ముగింపు స్థాయి ఇరు సూచీలకు ఏడు నెలల గరిష్టం కావడం విశేషం. ఒక దశలో సెన్సెక్స్ 1,387 పాయింట్లు ఎగసి 82,718 వద్ద, నిఫ్టీ 449 పాయింట్లు దూసుకెళ్లి 25,116 ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. → దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్‌కు డిమాండ్ పెరగడంతో భారత కరెన్సీ రూపాయి ఒత్తిడికి లోనైంది. డాలర్ మారకంలో 22 పైసలు బలహీనపడి 85.54 స్థాయి వద్ద స్థిరపడింది.→ స్టాక్ మార్కెట్ వరుస లాభాలతో బుధ, గురువారాల్లో రూ.9 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.440 లక్షల కోట్లకు చేరింది.లాభాలు ఎందుకంటే → ఖతార్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం మధ్యాహ్నం... ‘‘భారత్ ఒక వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం అనేక అమెరికా ఉత్పత్తులపై ప్రాథమికంగా సున్నా టారిఫ్‌లు ఉంటాయి’’ అన్నారు. ట్రంప్ ప్రకటనతో మార్కెట్లో సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. మిడ్‌సెషన్ వరకు ఫ్లాట్‌గానే కదలాడిన సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి. → ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదిరే అవకాశం నేపథ్యంలో సరఫరా పెరుగుతుందనే అంచనాలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. భారత్‌కు దిగుమతయ్యే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 3.50% తగ్గి 63.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.→ రిటైల్ ద్రవ్యోల్బణం అరేళ్ల కనిష్టానికి చేరుకోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు మరింత బలపడ్డాయి. → వరుస మూడు నెలల అమ్మకాల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్ 15 నుంచి భారతీయ ఈక్విటీలలో దాదాపు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. గత 20 సెషన్లలో 19 సార్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్ఐఐల వరుస కొనుగోళ్లు మన సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి.
ఫ్యామిలీ

'గారాబం చేస్తే ఇలా అవుతుందా'..? థైరోకేర్ వ్యవస్థాపకుడి అద్భుతమైన పేరెంటింగ్ పాఠం
అతిగారాబం ఎన్నటికీ అనర్థమే అని మన పెద్దలు చెబుతుంటారు. పిల్లల్ని ముద్దు చేయాల్సినప్పుడూ ముద్దు చేయాలి, బాధ్యతయుతంగా ప్రవర్తించకపోతే గట్టిగా మందలించాలి కూడా. రెండూ సమతూకంలో ఉండాలి లేదంటే..ఎందుకు పనికిరానివారుగా తయారవుతారని హెచ్చరిస్తున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు. గారాబం వల్ల చిన్నారులు పాడైపోవడమే గాక అది మొత్తం కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో..తెలియజేసే అద్భుతమైన రియల్ స్టోరీని షేర్ చేసుకున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ. వేలుమణి. మంచి పేరేంటింగ్ కుటుంబానికి ఎలా శ్రీరామరక్షలా ఉంటుందో హైలెట్ చేసి మరీ చెప్పారు. మరీ కథేంటో చూద్దామా..!1980ల ప్రారంభంలో, డాక్టర్ వేలుమణి BARC(బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)లో ఉద్యోగం చేసేవారట. ఆ సంపాదనతో తన కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండేదట. దాంతో మరోవైపు ట్యూషన్లు కూగా చెప్పేవారట వేలుమణి. తన ఇంటికి సమీపంలో శివాజీ పార్క్‌లో నివసిస్తున్న ఒక ధనవంతురాలైన మార్వారీ మహిళ ద్వారా ఆయనకు ట్యూషన్ చెప్పే అవకాశం లభించింది. ఆమె తన కొడుకు నాల్గవ తరగతి చదువుతున్నాడని, అతనికి ట్యూషన్ చెప్పాల్సిందిగా వేలుమణిని కోరారట. తన కొడుకుకి చదువు రావడమే ముఖ్యం అని ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని వేలుమణికి చెప్పారామె. ఇప్పటికే నలుగురు ట్యూటర్ల మార్చామని అయినా మా అబ్బాయికి చదువు మాత్రం అబ్బలేదని కూడా వాపోయిందట. చదువు వచ్చేలా చేయాలిగానీ, మా అబ్బాయి సంతోషానికి ఆటంకం ఉండకూడదనే షరతు విధించిందట ఆ తల్లి. అయితే వేలుమణి మంచి జీతం వచ్చే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఆ అబ్బాయికి ట్యూషన్ చెప్పేందుకు అంగీకరించారట. కానీ ఆ పిల్లవాడి సంతోషంగా ఉంచేలా పాఠాలు చెప్పడం అనేది కష్టం. ఎందుకంటే..చదువు రావాలంటే ఒక్కొసారి కష్టపెట్టక తప్పదు. అయితే ఆ తల్లి షరతు మేరకు ఆ కుర్రాడికి అలరించేలా కథలు చెబుతూ పాఠాలు చెప్పే యత్నం చేసేవారు వేలుమణి. సంతోషంగా ఉండేలా చూడాలి కాబట్టి ఏవిధంగా బలవంతం చేయడానికి వీలులేదు. అందువల్ల వేలుమణి హాస్యభరితమైన కథలతో చదువుపై ఆసక్తికలిగేలా చేశారు. అది చూసి ఆ పిల్లాడి తల్లి వేలుమణి జీతాన్ని నెలకు రూ. 300 నుంచి రూ. 600లకు పెంచేసింది. బార్క్‌లో సంపాదించిన దానికంటే అధిక జీవితం, పైగా ప్రయాణపు ఛార్జీలు కూడా ఆ తల్లే చెల్లించేదట. అయితే అతడికి నేర్పించాల్సిన చదువును నేర్పించలేకపోతున్న అనే అపరాధభావం కలిగి మానేయాలనుకున్నారట వేలుమణి. కానీ ఆ కుటుంబం మరింత జీతం పెంచి తన పిల్లాడికి చదువు చెప్పాల్సిందిగా బలవంతం చేశారు. దీంతో ఆయన అలా 1983 నుంచి 1984 వరకు అతడికి ట్యూసన్ చెప్పడం కొనసాగించారు. అంతేగాదు ఆ అదనపు డబ్బుతో తన ఆరోగ్యానికి, ఆంగ్లంలో పట్టు సాధించడానికి వినియోగించుకున్నాడట. అయితే ఆ బాలుడికి శతవిధాల చదువు నేర్పించే యత్నం చేసినా..ఏం నేర్చుకోలేకపోయాడట. చివరికీ..కనీసం ఇంటర్మీడియట్ కూడా ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ఆ తర్వాత వేలుమణి కూడా ట్యూటర్‌గా కొనసాగడం మానేయడం వంటివి జరిగాయి. అలా దశాబ్దాలు గడిచాక.. అనూహ్యమైన మలుపు తిరిగింది. ఆ సంపన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అనుకోని విధంగా డాక్టర్ వేలుమణి భార్య చివరికి అదే బాలుడికి థైరోకేర్‌లో హార్డ్‌వేర్ టెక్నీషియన్‌గా ఉద్యోగం ఇచ్చింది. ఈ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ..ఆ తల్లి తన కొడుకు ఏ కష్టం తెలియకుండా పెరగాలనుకుంది..అదే చివరికి కుటుంబానికి శాపంగా మారిపోయింది. అంతేగాదు కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడూ.. కొడుకు ఆసరాగా నిలవలేని దుస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చిందామెకు. గారం తెచ్చిపెట్టే అనర్థం ఇలా ఉంటుంది. పరిస్థితులు తారుమారైనప్పుడూ..కష్టపడక తప్పదని ఆ తల్లి చెప్పలేకపోయింది, పైగా ఆ పిల్లాడు తెలుసుకోలేడు కూడా. ఇక్కడ పిల్లల్ని క్రమశిక్షణాయుతంగా పెంచడం అనేది గొప్ప పేరేంటింగ్కి సంకేతం. దాన్ని చాలా జాగురకతతో నిర్వహించాలి. అదే భవిష్యత్తులో కుటుంబ ఉన్నతికి దోహదపడుతుందని నొక్కి చెప్పారు వేలుమణి. నెట్టింట షేర్ చేసిన ఈ పోస్ట్ ..ప్రతి నెటిజన్ మనసుని దోచుకుంది. సార్ ఇది మంచి స్ఫూర్తిదాయకమైన కథ అని డాక్టర్ వేలుమణిని ప్రశంసించారు. చివరగా వేలుమణి తల్లిదండ్రుబంగా పెంచకండి, విలాసవంతంగా పెరగాలని కోరుకోవద్దని..నేటి కాలానికి అస్సలు పనికిరాదని వ్యాఖ్యానించారు.This tweet and the pics reminded me my luck in early 80s. Thanks to @howto9to5 I had a BARC job, good salary but was not enough to support my big family back home. I wanted to send more money home and wanted to earn more by doing tuitions while working in BARC. A filthy rich… https://t.co/Mi5mkR6ocT pic.twitter.com/mkAgrqVXtz— Dr. A. Velumani.PhD. (@velumania) May 6, 2025(చదవండి: Parenting Tips: చిన్నారులకు ఈ వేసవిలో సేవ చేయడం నేర్పిద్దాం ఇలా..!)

పాప ప్రక్షాళన కోసం.. అద్భుతమైన ఆలయం
పురాణ పరిచయం పెద్దగా లేని ఈ యువతరంలో కూడా చలనచిత్రాల పుణ్యమా అని బాగా తెలిసిన ΄ పౌరాణిక పాత్ర చిత్రగుప్తుడు. యముడికి ధర్మనిర్వహణలో సహాయకుడిగా, భూలోకవాసుల మరణానంతరం వారి పాప పుణ్యాలకు పద్దులు రాసే వ్యక్తిగా చిత్రగుప్తుడు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో గరుడ పురాణంలోని చిత్రగుప్తుడి జననంతో పాటు ఆయన ఆలయాల గురించిన కథనం మీ కోసం.ఈ విశ్వం ప్రారంభం తర్వాత భూలోకంలోని జీవులు చనిపోయినప్పుడు వారి ఆత్మలు స్వర్గానికి లేదా నరకానికి వెళ్లేవి. ఇలా వెళ్లిన ఆత్మల పాపాలను నిర్ణయించడంలో యమధర్మరాజు కొంత గందరగోళానికి గురయ్యేవాడు. ఎందుకంటే ఎవరు ఎంత పాపం చేసింది సరిగా నిర్ణయించలేక పోయేవాడు. దీంతో తన ఇబ్బందిని యమధర్మరాజు సృష్టికర్త అయిన అయిన బ్రహ్మకు విన్నవించాడు. సమస్య పరిష్కారం కోసం బ్రహ్మ యోగనిద్రలోకి వెళ్లాడు. కళ్లుతెరిచిన తర్వాత ఆయనకు ఎదురుగా ఓ ఆజానుబాహుడు కనిపించాడు. చేతిలో పుస్తకం, ఘటం ( కలం), నడుముకు కత్తి ఉన్నాయి. తర్వాత తన దివ్యదృష్టితో జరిగిన విషయం తెలుసుకొంటాడు. ఆ వ్యక్తి తన చిత్తం (శరీరం)లో గుప్తంగా (గుప్తంగా) నివాసమున్నవాడని అర్థమవుతుంది. అతనికి చిత్రగుప్తుడని పేరుపెడతాడు. అటుపై నీవు ఈ విశ్వంలోని ప్రతి జీవిలో రహస్యంగా ఉంటూ వారి మంచి చెడులను గూర్చి తెలుసుకొంటూ ఉంటావు.ఈ విషయాలన్నీ యమధర్మరాజుకు చెబుతూ పాపాత్ములకు శిక్షలు పడేవిధంగా సహాయపడతావు. అదేవిధంగా ఏక కాలంలో కొన్ని కోట్ల రూ΄ాలను ధరించే శక్తి కూడా నీకు ఉంటుందని బ్రహ్మ చిత్రగుప్తుడికి వరమిస్తాడు. అంతేకాకుండా చిత్రగుప్తుడికి ఈ విషయంలో సహాయపడటానికి కొంతమంది సహాయకులుగా కూడా ఉంటారు. వారిలో బ్రహ్మమానసపుత్రులైన శ్రవణులు. శ్రవణులు ఈ భూలోకం పైనే కాకుండాపాతాళ, మత్స్య, స్వర్గ లోకాల్లో కూడా వివహరిస్తూ జీవుల పాప పుణ్యాలను ఎప్పటికప్పుడు చిత్రగుప్తుడికి తెలియ జేస్తూ ఉంటారు. అందువల్లే ఈ విశ్వంలోని జీవుల పాపపుణ్యాలను చిత్రగుప్తుడు ఖచ్చితంగా నిర్ణయించగలుగుతున్నాడని గరుడ పురాణం చెబుతోంది.చిత్రగుప్తుడికి కూడా గుడులున్నాయంటే ఆశ్చర్యమే. మనదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలోనూ, తమిళనాడులోని కంచిలోనూ చిత్రగుప్తుడికి గుడులు ఉన్నాయి. తెలంగాణలో కూడా చిత్రగుప్తుడి దేవాలయం ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైదరాబాద్ పాతబస్తీ కందికల్ గేట్ ప్రాంతంలో ఉంది.చిత్రగుప్తుని సంస్కృతంలో కాయస్త్ అంటారు. చిత్రగుప్తుడు హిందువులలోని కాయస్త్ కులానికి చెందినవాడిగా అందరూ భావిస్తుంటారు. కాయస్తుల కులదైవం కూడా చిత్రగుప్తుడే. న్యాయం, శాంతి, అక్షరాస్యత, విజ్ఞానం ఈ నాలుగు గుణాలు ΄ పొందదడానికి చిత్రగుప్తుడిని పూజిస్తారు. చిత్రగుప్తుడి పూజలో ఉపయోగించే వస్తువులు కలం, కాగితం, సిరా, తేనె, వక్క పొడి, అగ్గిపెట్టె, చక్కెర, గంధం చెక్క. ఆవాలు, నువ్వులు, తమల పాకులు. హైదరాబాద్‌లోని చిత్రగుప్తుని ఆలయంలో దీపావళి రెండో రోజు ఘనంగా ఉత్సవం జరుగుతుంది. మామూలు రోజుల్లో పెద్దగా పూజలు జరగవు. దీపావళి రెండో రోజు యమద్వితీయ సందర్భంగా, ఆ రోజు చిత్రగుప్తుడి పుట్టినరోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది. ఆయనకు విశేషపూజలను చేస్తారు. దీన్నే భాయ్ దూజ్ అంటారు. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం ఇక్కడ అభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాదు ఆరోగ్యం, చదువు, పెళ్ళి, సంతానం ఇలా అనేక సమస్యలకు పరిష్కారం కోసం భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. కేతుగ్రహ దోష నివారణకు కూడా ఈ దేవాలయంలో పూజలు చేస్తారు. స్త్రీల వ్రతాలలో చిత్రగుప్తుడి నోము కూడా ఉంది. (నిద్ర.. గురక.. గుండెపోటు! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?)మనుషుల పాప పుణ్యాలను అనుసరించి వారికి శిక్ష విధించడం యమధర్మరాజు విధి అని మనకు తెలిసిందే. యముడికి భారత దేశంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. వీటిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇదిలా ఉండగా ఈ విశ్వంలో కోట్లాది జీవుల పాపపుణ్యాలను యమధర్మరాజు ఒక్కడే లెక్కగట్టలేడు కదా. ఆయనకు ఈ విషయంలో సహకారం అందించేది చిత్రగుప్తుడు. మనుషులు తెల్లవారి లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకుపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరనుకుంటారు, కానీ మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి చిట్టా తయారు చేసేది చిత్రగుప్తుడేనని గరుడ పురాణం చెబుతుంది. (Gayatri Mantra : విశిష్టత ఏంటి? తెలుసుకుందాం!)

Gayatri Mantra : విశిష్టత ఏంటి? అర్థం తెలుసుకుందాం!
ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ అనేది గాయత్రి మంత్రం. ఇందులోని ప్రతి బీజాక్షరం మహిమాన్వితమైంది.వేదాల ప్రకారం సవితా దేవి గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవత. గాయత్రీ మంత్రం ప్రాచీనమైనది. నాలుగు వేదాల సృష్టికి ముందు బ్రహ్మ 24 అక్షరాలతో కూడిన గాయత్రీ మంత్రాన్ని రచించాడని చెబుతారు.ఈ గాయత్రీ మంత్రం సవితా దేవిని, సూర్యదేవుని కీర్తిస్తూ, సూర్య (పింగళా) నాడిని ముఖ్యంగా స్వాధిష్టాన చక్రాన్ని చైతన్యపరచడానికి చదివే మంత్రం. సుమారు 5000 సం.క్రితం విశ్వామిత్రునిచే స్తుతింపబడిన ఈ మంత్రం ఋగ్వేదంలోనిది. గాయత్రి మంత్ర పరమార్థం ఏమిటో, ఎప్పుడు ఆ మంత్ర పఠనం చేయాలో అనే అవగాహన వుండడం మంచిది. అతి సర్వత్రా వర్జయేత్ .. ఏది అతిగా చేయడం, ఆచరించడం శ్రేయస్కరం కాదు. దానివలన ఒక్కోసారి ప్రతికూల ప్రభావాలు కూడా ఉండవచ్చు. గాయత్రి మంత్రం మన సూక్ష్మ నాడీవ్యవస్థలోని చక్రాలలో ఉన్న పంచ మహాభూతాల సారాన్ని మనకుబోధిస్తుంది. మంత్రాల గురించి చాలా పెద్ద శాస్త్రమే ఉందని చెప్పవచ్చు. మానవ అంతర్గత సూక్ష్మశరీర వ్యవస్థలో చక్రాలలోనూ, నాడులలోను దేవీదేవతలు అధిష్టాన దేవతలుగా ఉంటారు. దేవీకవచంలో చెప్పినట్లు మన శరీరంలోని అంగప్రత్యంగాలన్నీ కూడా ఏదో ఒక దేవత అధీనంలో ఉండి వారి చేత రక్షింపబడుతుంటాయి. మన సమస్య ఏ అవయవంలో ఉంటే ఆయా అవయవానికి సంబంధించిన అదిష్టాన దేవతా మంత్రాన్ని పఠించుకుని ఆ దేవతని సంతృప్తిపరుచుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చును. అంటే మనకున్న సమస్య కాలికి అయితే, వైద్యం చేతికి చేసినట్లు కాకుండా మన ప్రార్థన కూడా ఏ ఏ చక్రాలలో, లేదా ఏ నాడిలో లోపం వుందో వాటికి సంబంధించిన అధిష్టాన దేవీ దేవతలను ప్రసన్నం చేసుకునేదిలా ఉండాలి. మన శరీరంలోని కుడి పార్శ్వపు నాడి (పింగళా నాడి)లో గాయత్రి దేవి నివాస స్థానం ఉంటుంది. నా అంతటి వాడు లేడనే అత్యహంకారం వలన ఈ పింగళా నాడి సమస్యకు లోనవుతుంది. దీనివలన ఈ నాడి అసమతుల్యతకు లోనై అనారోగ్య సమస్యలు కలగవచ్చు. అలా కుడి పార్శ్వంలో సమస్యలు ఉన్నవారు అతిగా గాయత్రి మంత్ర పారాయణ చేయటం వలన వారు మరింత కోపిష్టిగా, అహంకారిగా మారి విజ్ఞతను కోల్పోయే అవకాశం ఉంది. పూర్వ కాలంలో ఎంతో కఠోర తపస్సు చేసి భగవంతుని అనుగ్రహం పొందిన మునీశ్వరులు, ఋషులలో కొందరు ఇటువంటి కారణం చేతనే భగవంతుని ఆగ్రహానికి గురయ్యారని మనకు తెలిసున్నదే. పంచ మహాభూతాలైన మూలకాలన్నీ మన కుడి పార్శ్వంలో ఉన్న పింగళనాడిలో నిక్షిప్తమై ఉంటాయి. గాయత్రీ మంత్రంలోని బీజాక్షరాలు మన చక్రాలలోని పంచ భూత తత్వాలతో అనుసంధానిపబడి ఉంటాయి. ఇదే గాయత్రి మంత్ర విశిష్టత, పరమార్థం.కుండలినీ జాగృతి చెంది బ్రహ్మ రంధ్రం ఛేదించుకుని వచ్చి సహస్రారం మీద భగవంతుని పరమ చైతన్యశక్తితో ఏకీకృతమైనప్పుడు మనం ఆత్మ సాక్షాత్కార అనుభూతి పొందుతాం. అలా ఆత్మసాక్షాత్కారంపొంది సహజయోగ సాధన చేస్తున్న వారికి గాయత్రి మంత్రం ప్రాధాన్యత గాయత్రి మంత్రోచ్ఛారణ ఫలితం బాగా అవగతమవుతుంది. – డా. పి. రాకేశ్( శ్రీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)

Miss World 2025 నమస్తే నేర్చుకున్నాను : లెబనాన్ బ్యూటీ నద
నద... అంటే అరబిక్ భాషలో పిల్లల స్వచ్ఛమైన మనసు, ఉషోదయపు మంచు బిందువులు అని అర్థం. మిస్ వరల్డ్ లెబనాన్2025 పేరు నద (Nada Koussa). మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీల కోసం హైదరాబాద్‌కి వచ్చిన నద తన పేరుకు అర్థం చెప్పుకుంటూ తమ దేశంలో పిల్లల బాల్యం, యువత భావోద్వేగాలు అంత స్వచ్ఛంగా ఏమీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యూటీ పాజంట్ కావాలనే కోరిక కలగడానికి కారణం తెలియదు కానీ బాల్యం నుంచి తనతోపాటు పెరిగి పెద్దయిందన్నారామె.ఈ అవకాశం కోసం ఎదురు చూశాను!‘‘ఎనిమిదేళ్ల వయసు నుంచి నాకు జ్ఞాపకం ఉంది. నా ఆకాంక్ష తీరడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ బ్యాచులర్స్ పూర్తయింది. మాస్టర్స్ ఇన్ సైకాలజీ కూడా పూర్తయింది. క్లినికల్ సైకాలజిస్టుగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను సందర్శిస్తూ పిల్లలకు, యువతకు మనోధైర్యాన్నిస్తున్నాను. అంతర్యుద్ధంతో అట్టుడిగిన దేశం మాది. అలాగే ఇరుగు పొరుగు యుద్ధాల తాకిడి కూడా దేశాన్ని కుదిపేసింది. అలాంటి దేశంలో మానసిక స్థైర్యం కల్పించడం చాలా అవసరం. ఇందుకోసం నేను ఐదు ఎన్జీవోలతో కలిసి పని చేస్తున్నాను.మహిళలు నలిగిపోతున్నారు!మా దేశంలో సగటు మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక దేశం ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొంటోందీ అంటే ఆ పరిణామాలకు క్షేత్రస్థాయిలో నేరుగా బాధితులయ్యేది మహిళలే. విద్య, ఉద్యోగం, పిల్లలను చక్కబెట్టుకుంటూ, ఆర్థికపరమైన సర్దుబాట్లు చేసుకుంటూ కుటుంబాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను తమ భుజాల మీద మోస్తున్నారు మా దేశంలో మహిళలు.ఎక్కడో ఒకరిద్దరు కాదు, దాదాపుగా ప్రతి మహిళా వీటన్నింటినీ భరిస్తోంది. వీటికితోడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోజులు గడపడం అనేది ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. ఎయిర్ క్రాఫ్ట్‌లు మన తల మీద నుంచి వెళ్తున్నట్లే ఉంటాయి. రోజూ ఒకదాని తర్వాత ఒకటిగా యుద్ధవిమానాలు ఇళ్ల మీద నుంచి వెళ్తుంటే వచ్చే ‘ఉమ్మ్మ్’ అనే శబ్దం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎంత చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కి పడుతుంటారు. రాత్రిళ్లయితే టేబుల్ మీద నుంచి పుస్తకం కింద పడిన శబ్దం వచ్చినా సరే గుండె వేగం పెరిగిపోతుంటుంది. ఇంట్లో అందరినీ ఒకసారి కలయచూసుకుని ‘హమ్మయ్య ఏమీ కాలేదు, అందరూ క్షేమం’ అని ఊపిరి పీల్చుకోవాల్సిన దుస్థితి. ఈ పరిస్థితుల్లో జీవించడం వల్ల వారిని మెంటల్ ట్రామా పీడిస్తోంది. ఇది ఏ ఒకరిద్దరిదో, ఒకటి-రెండు ప్రదేశాలదో కాదు. దేశమంతటా ఇదే పరిస్థితి. వారిలో మానసికాందోళనలు పోగొట్టి ధైర్యం, మానసిక ప్రశాంతత నెలకొల్పడానికి పని చేయాల్సిన అవసరం ఉంది. ఈ కలెక్టివ్ ట్రామాను తొలగించడానికి కార్యక్రమాలను రూపొందించుకుంటున్నాను. ఇన్నింటి మధ్య కొనసాగుతూ కూడా బ్యూటీ పాజంట్ కావాలనే కోరికను మాత్రం పక్కన పెట్టలేదు. సమాజం కోసం చేయాల్సిన కర్తవ్యాలను నిర్వర్తిస్తూనే బ్యూటీ కాంటెస్ట్ విజేతనయ్యాను. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీ కోసం మీ ముందుకు వచ్చాను. బ్యూటీ విత్ పర్పస్ థీమ్‌లో భాగంగా... నా విజయంతో నా దేశంలో ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. శాంతి కోసం పని చేయడానికి బ్యూటీ పాజంట్ గుర్తింపు ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: దేశానికి సేవ చేయాలని కలగన్నాడు..కానీ, పెళ్లైన నాలుగునాళ్లకేనమస్తే నేర్చుకున్నాను!బ్యూటీ పాజంట్ పోటీల కోసం వచ్చేటప్పుడు ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకున్నాను. నమస్తే చెప్పడం నేర్చుకున్నాను. హైదరాబాద్ నగరం చాలా నచ్చింది. కలర్ఫుల్గా, వైబ్రెంట్‌గా ఉంది. ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. చౌమొహల్లా ప్యాలెస్ ఒక అద్భుతం. నిర్మాణంలో సునిశితమైన క్రాఫ్ట్మన్షిప్కి ఫిదా అయ్యాను. ప్రతి అంగుళాన్ని వదలకుండా ఫొటోలు తీసుకున్నాను. ఆ కట్టడం గొప్ప చారిత్రక వారసత్వం, అలాగే హైదరాబాద్ మెహందీ కూడా’’ అంటూ మంగళవారం నాడు చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్ సందర్శన సమయంలో పెట్టించుకున్న మెహందీని చూపించారు నద కౌస్సా.చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా? – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు : ఎస్.ఎస్. ఠాకూర్
ఫొటోలు
అంతర్జాతీయం

మన వేలితో మన కన్నే..!
రెండేళ్ల క్రితం భయానక భూకంపం వేళ తుర్కియేకు అందరికంటే ముందు ఆపన్న హస్తం అందించింది భారతే. ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట భారీ సాయం చేసింది. కానీ ఆ దేశం మాత్రం తిన్నింటి వాసాలే లెక్కబెడుతోంది. సాయుధ సంఘర్షణ వేళ దాయాది పాకిస్తాన్‌కు ఎడాపెడా డ్రోన్లు, ఇతర ఆయుధాలను అందజేసి కృతఘ్నుతకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. విశ్వాస ఘాతుకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. వాటితో పాటు సైనికులను, శిక్షణా సిబ్బందిని కూడా పాక్‌కు తుర్కియే భారీగా పంపినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. డ్రోన్ల వాడకం తదితరాల్లో వాళ్లు పాక్ జవాన్లకు పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చినట్టు తేలింది. పాక్‌కు తుర్కిష్ కంపెనీ ఆసిస్‌గార్డ్ సోంగార్ పంపిన బైరక్తార్ టీబీ2, ఈహా డ్రోన్లు ఆత్మాహుతి తరహావి. లక్ష్యంపై పడి పేలిపోతాయి. ఈ డ్రోన్ల తయారీలో భారత్ ఎగుమతి చేసే కీలకమైన మూలకాలు, ముడి సరుకులే ప్రధాన వనరులు కావడం విశేషం! మనకు వ్యతిరేకింగా ఇలా నిస్సిగ్గుగా బరితెగించిన తుర్కియేకు ఆ కీలక ఎగుమతులను తక్షణం నిలిపేయాలని రక్షణ నిపుణులు సూచిస్తున్నారు. కంట్రోలర్ల నుంచి రిసీవర్ దాకా... ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రశిబిరాలను భారత్ కుప్పకూలి్చన కొద్ది గంటలకే పాక్ దాదాపు 400 డ్రోన్లతో సరిహద్దు ప్రాంతాలపై దాడికి తెగించడం తెలిసిందే. తుర్కియేకు భారత ఎగుమతుల్లో సింహభాగం అల్యూమినియం, అల్యూమినియం సంబంధ ఉపకరణాలు, ఆటో ఉత్పత్తులు, విమానాల విడిభాగాలు, టెలికం ఉపకరణాలు, ఎలక్ట్రిక్ వస్తువులు, పరికరాలు తదితరాలే. వీటిలో చాలావరకు డ్రోన్ల తయారీలో కీలకం. డ్రోన్లలోని కంట్రోలర్, ఫ్రేమ్, మోటార్, ప్రొపెల్లర్, కెమెరా, ఫైట్ కంట్రోల్, రిసీవర్, వీడియో ట్రాన్స్మిటర్, యాంటెన్నా, స్పీడ్ కంట్రోలర్, కంట్రోలర్లను కూడా భారత్ నుంచే తుర్కియే దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ ఎగుమతులు ఎక్కువచయ్యాయి. ఆ విడిభాగాలతో రూపొందించిన డ్రోన్లను పాక్‌కు అందజేయాలన్నది తుర్కియే అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ నిర్ణయమేనని తెలుస్తోంది. అతనికి అంతులేని భారత విద్వేíÙగా పేరుంది. తమ డ్రోన్లు, ఆయుధాలను భారత్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించకూడదనే ఒట్టు పెట్టుకున్నారు! మన విమానాశ్రయాల భద్రతతుర్కియే సంస్థ చేతుల్లో! భారత్‌లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా అంశాల్లో కూడా తుర్కియే పరోక్షపాత్ర ఉందని వెలుగులోకి వచ్చింది. వాటిలో కార్గో హ్యాండ్లింగ్ వంటి కీలక కాంట్రాక్టులను తుర్కియేకు చెందిన సెలెబీ ఏవియేషన్ కంపెనీ చెందిన అనుబంధ సంస్థ సంపాదించిందని తేలింది. భారత్‌లో 2008 నుంచి ఈ సంస్థ సేవలందిస్తోంది. ఏటా 58,000 విమానాలు, 5.4 లక్షల టన్నుల సరకు రవాణా బాధ్యతలను చూసుకుంటోంది. అందులో 7,800 మంది సిబ్బంది ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్ వంటి కీలక విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ బాధ్యతలు సెలెబీవే! గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ విధులను ఈ సంస్థే చూస్తోంది. విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్‌సైడ్ జోన్లన్లా సంస్థ సిబ్బందే విధుల్లో ఉంటున్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను చూసుకునేదీ వాళ్లే. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లకే అప్పగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆరు దేశాల్లోని 70 విమానాశ్రయాల్లో కూడా సెలెబీ కాంట్రాక్టులు సంపాదించింది.ముమ్మరంగా ‘బ్యాన్ తుర్కియే’ పాక్‌కు సైనికసాయం చేస్తున్నందుకు నిరసనగా తుర్కియే ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. ఇకపై తుర్కియే యాపిల్ పండ్లను దిగుమతి చేసుకోవద్దని మహారాష్ట్రలోని కీలకమైన పుణె పండ్ల మార్కెట్ ట్రేడర్లు నిర్ణయించుకున్నారు. ‘‘మన సైన్యానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నాం. తుర్కియేకు బదులు ఇక హిమాచల్, ఉత్తరాఖండ్ ఇరాన్ నుంచి ఆపిల్స్ తెప్పిస్తాం’’ అని పుణె వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ ట్రేడర్ సుయోగ్ జిందే చెప్పారు. పుణెలో తుర్కియే యాపిల్స్ టర్నోవర్ రూ.1,200 కోట్ల పై చిలుకే. దాంతో ఈ నిర్ణయం ఆ దేశానికి పెద్ద దెబ్బే కానుంది. తుర్కియే నుంచి తెల్ల చలువరాయి దిగుమతులనూ నిషేధించాలన్ల డిమాండ్లు విని్పస్తున్నాయి.యాత్రలూ బంద్! తుర్కియేకు మనోళ్ల విహార యాత్రలు కూడా భారీగా తగ్గాయి. ఆ దేశానికి క్యాన్సలేషన్లు భారీగా పెరుగుతున్నాయని ఈజ్‌మైట్రిప్, ఇగ్జిగో వంటి ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫాంలు తెలిపాయి. తుర్కియే ప్రభుత్వ వార్తా చానల్ ‘టీఆర్టీ’ తాలూకు ‘ఎక్స్’ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. టర్కీతో మన వాణిజ్యం కూడా తగ్గుముఖం పడుతోంది. 2024–25 మధ్య తుర్కియేకు మన ఎగుమతులు 5.2 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు బాహాటంగా మద్దతు ప్రకటించిన అజర్‌బైజాన్‌కు కూడా ఇదే సెగ తగులుతోంది. దాని రాజధాని బకు ఇటీవలి దాకా భారత పర్యాటకులకు ఫేవరెట్ డెస్టినేషన్లలో ఒకటిగా ఉండేది. ఏటా లక్షలాది మంది అక్కడికి వెళ్లేవారు. బకుకు బుకింగులు కూడా ఇప్పుడు భారీగా తగ్గిపోతున్నాయి. జేఎన్‌యూ కటీఫ్ తుర్కియే విద్యాసంస్థలతోనూ తెగదెంపులు చేసుకోవాలనే డిమాండ్ల నేపథ్యంలో ఆ దేశంలోని ఇనోను వర్సిటీతో అవగాహన ఒప్పందాన్ని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) రద్దు చేసుకుంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. గత ఫిబ్రవరిలో కుదిరిన ఈ మూడేళ్ల ఒప్పందం ప్రకారం రెండు వర్సిటీల విద్యార్థులు, అధ్యాపకుల మారి్ప డికి అవకాశముండేది. – సాక్షి, నేషనల్ డెస్క్

కెనడా కేబినెట్లో మనోళ్లు
ఒట్టావా: కెనడాలో మార్క్ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి నేతలకు కీలక పదవులు దక్కాయి. విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్ (58) , అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రిగా మణీందర్ సిద్ధూ (41) బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ వ్యవహారాల సహాయ మంత్రిగా రణ్‌దీప్ సరాయ్ (50), నేర నియంత్రణ శాఖ సహాయ మంత్రిగా రూబీ సహోటా (44) ప్రమాణస్వీకారం చేశారు. అనిత భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. ‘‘ఇది నాకు గర్వకారణం. కెనడియన్లకు సురక్షితమైన, న్యాయమైన ప్రపంచాన్ని అందించడానికి ప్రధాని మార్క్ కార్నీ బృందంతో కలిసి పని చేయనున్నా’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. అనిత కెనడా లిబరల్ పారీ్టలో సీనియర్ సభ్యురాలు. గతంలో ప్రజా సేవలు, ఇన్నొవేషన్, సైన్స్, పరిశ్రమలు, రక్షణ మంత్రిగా పలు పదవులు నిర్వహించారు. మంత్రివర్గంలో స్థానం దక్కడం తనకు జీవిత కాలపు గౌరవమని సిద్ధూ పేర్కొన్నారు. ఆమెకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయం సాధించిన రెండు వారాల అనంతరం కార్నీ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. మంత్రివర్గం సంఖ్యను 39 నుంచి 28కి కుదించారు. వారిలో సగం మహిళలే కావడం విశేషం! కెనడా–యూఎస్ సంబంధాల ఉద్రిక్తతల మధ్య కెనడియన్లు కోరుకునే, అవసరమైన మార్పును అందించడానికి మంత్రివర్గాన్ని ఎన్నుకున్నట్లు కార్నీ తెలిపారు. కెనడాలోనే పుట్టి పెరిగిన అనిత అనిత ఆనంద్ 1967 మే 20న కెనడాలోని కెంట్విల్లేలో భారతీయులైన వైద్య దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి ఎస్వీ ఆనంద్‌ది తమిళనాడు కాగా తల్లి సరోజ్ డి రామ్ పంజాబీ. వారు 1960ల్లో భారత్ నుంచి కెనడాకు వలస వెళ్లారు. 1985లో ఒంటారియోలో పొలిటికల్ సైన్స్‌లో అకడమిక్ డిగ్రీ, ఆక్స్ఫర్డ్ నుంచి న్యాయశాస్త్రంలో ఆనర్స్, డల్హౌసీ వర్సిటీ నుంచి బ్యాచిలర్స్, టొరంటో వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. న్యాయవాద వృత్తిలో, బోధన, ప్రజా సేవలో బలమైన కెరీర్‌ను నిర్మించుకున్నారు. 1995లో న్యాయవాది, వ్యాపారవేత్త జాన్ నోల్టన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు. అనిత 2019లో కెనడా మంత్రివర్గంలో అడుగుపెట్టారు. ఆ ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. రక్షణ మంత్రిగా ఆమె క్రమశిక్షణ, పనితీరుకు ప్రశంసలు లభించాయి. నిరసనల ఫలితంగా గతేడాది జస్టిన్ ట్రూడో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాక ఆయన వారసునిగా అనిత పేరు ప్రముఖంగా విని్పంచింది. ఇక సిద్ధూవి పంజాబీ మూలాలు. తల్లిదండ్రులతో కలిసి బాల్యంలోనే కెనడా వెళ్లారు. బ్రాంప్టన్ ఈస్ట్ ఎంపీగా ఉన్నారు. పలువురు మంత్రులకు పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేశారు. రూబీవీ పంజాబీ మూలాలే. ఆమె టొరంటోలో జని్మంచారు. సరాయ్ తల్లిదండ్రులు కెనడా వలస వెళ్లారు. బ్రిటిష్ కొలంబియాలో జన్మించిన ఆయన నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. ఇటీవలి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 22 మంది భారత సంతతి నేతలు ఎంపీగా గెలవడం తెలిసిందే.

‘నవాజ్ షరీఫ్ కనుసన్నుల్లోనే పాక్ సైనిక దాడులు’
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ను కోలుకోలేని విధంగా చావుదెబ్బ తీసింది. అయితే ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో భారత్‌పై పాక్ సైనిక దాడికి దిగింది. ఆ దాడికి వ్యూహ రచన చేసింది పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంటూ ఆ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఆజ్మా బుఖారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆజ్మా బుఖారీ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో భారత్‌పై పాక్ సైనిక దాడికి దిగింది. పాక్ సైన్యం.. భారత్‌పై ఎలా దాడి చేయాలనే ప్లాన్ మొత్తం నవాజ్ షరీఫ్ పర్యవేక్షణలో జరిగింది. ఆయన చిన్న స్థాయి నాయకుడు కాదు.. ఆయన చేసిన పనే ఆయన గురించి చెబుతుంది’ అని అజ్మా బుఖారీ వ్యాఖ్యానించారు. ఇటీవల భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్లో బీభత్సం సృష్టించింది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. వాళ్లకు శిక్షణ ఇచ్చే స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్.. భారత్‌పై మే 8, 9, 10 తేదీల్లో భారత సైనిక స్థావరాలపై ప్రతిదాడికి ప్రయత్నించింది. అయినప్పటికీ భారత్ శక్తి, యుక్తులు ముందు అవి తేలిపోయాయి. దీంతో పాకిస్తాన్ సైన్యంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆజ్మా బుఖారీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

భారత్‌కు పాకిస్తాన్ లేఖ
ఇస్లామాబాద్: భారత్‌కు పాకిస్తాన్ లేఖ రాసింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, సింధూ జలాల ఒప్పందంపై (indus waters treaty) సమీక్షించుకోవాలని ప్రాధేయపడింది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సిందూర్‌పై (operation sindoor) జాతినుద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదం, వ్యాపారం కలిసి సాగలేవు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు’ అంటూ ఉగ్రవాదంపై భారత్ వైఖరి గురించి పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్‌పై భారత్ విధించిన ఆంక్షలు కొనసాగుతాయని సూచించారు.👉పాక్‌పై భారత్ సింధూ అస్త్రం.. ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి (2025 Pahalgam attack) తర్వాత పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దీనిలో భాగంగా సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు నిలిపివేసే వరకు సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ దేశంతో వాణిజ్యం రాకపోకలను నిషేధించింది. గగనతలాన్ని మూసివేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో ఈ వివరాల్ని వెల్లడించారు. అయితే, సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపి వేయడంతో దాయాది దేశంలో నీటి కటకట మొదలైంది. ఈ ఏడాది మొత్తం ఖరీఫ్ పంటపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో బుధవారం పాకిస్తాన్.. భారత్‌కు లేఖ రాసింది. ఆ లేఖలో సింధూ జలాల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయం విషయంలో పునఃసమీక్ష చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా.. భారత జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఓ అధికారిక లేఖ రాసారు. సింధు జలాల ఒప్పందాన్ని కొనసాగించేలా భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని లేఖలో కోరారు.
జాతీయం

టర్కీకి భారత్ ఫస్ట్ స్ట్రోక్.. ఇక సర్దేసుకోవడమే!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పై ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సిందూర్ ను భారత్ చేపట్టగా, దానికి వ్యతిరేకంగా పని చేసింది టర్కీ(తుర్కియే). ఇక్కడ ప్రత్యక్షంగా పాకిస్తాన్ కు సాయం చేసి భారత్ ను దెబ్బ కొట్టాలని యత్నించింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లలో సింహ భాగం టర్కీకి చెందినవే కావడమే కాకుండా, ఆ డ్రోన్లకు ఆపరేటర్లను కూడా సప్లై చేసింది టర్కీ. ఇది భారత్ కు మరింత కోపం తెప్పించింది. టర్కీ నుంచి ఏమైనా డ్రోన్లను కొనుగోలు చేశారా అని తొలుత భావించినా, ఆ డ్రోన్ల ఆపరేటర్లు కూడా ఆ దేశానికే చెందిన వారే కావడంతో వారి పన్నాగం బయటపడింది.దాంతో టర్కీపై విమర్శలు వెల్లువెత్తాయి. వరదల సమయంలో ఏ దేశం కూడా సాయం చేయడానికి ముందుకు రాకపోతే భారత్ వారికి ఆపన్న హస్తం అందించింది. దానిని మరిచిపోయి మన వేలితో మనల్నే పొడాలని చూసింది టర్కీ. ఇప్పుడు టర్కీకి బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది.సెక్యూరిటీ క్లియరెన్స్ అనుమతులు రద్దు..!భారతదేశంలోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాలలో సింహభాగాన్ని నిర్వహిస్తున్న టర్కిష్ సంస్థ తన భద్రతా అనుమతిని కోల్పోయింది. ఈ రోజు(గురువారం) సాయంత్రం భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ టర్కీకి చెందిన సంస్థకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. జాతీయ భద్రత దృష్ట్యాసెలెబి గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అనుమతిని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి ఇది..!భారత్‌లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా అంశాల్లో కూడా తుర్కియే పరోక్షపాత్ర ఉంది. .వాటిలో కార్గో హ్యాండ్లింగ్ వంటి కీలక కాంట్రాక్టులను తుర్కియేకు చెందిన సెలెబీ ఏవియేషన్ కంపెనీ చెందిన అనుబంధ సంస్థ సంపాదించింది. భారత్‌లో 2008 నుంచి ఈ సంస్థ సేవలందిస్తోంది. ఏటా 58,000 విమానాలు, 5.4 లక్షల టన్నుల సరకు రవాణా బాధ్యతలను చూసుకుంటోంది. అందులో 7,800 మంది సిబ్బంది ఉన్నారు.హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్ వంటి కీలక విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ బాధ్యతలు సెలెబీవే! గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ విధులను ఈ సంస్థే చూస్తోంది. విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్‌సైడ్ జోన్లన్లా సంస్థ సిబ్బందే విధుల్లో ఉంటున్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను చూసుకునేదీ వాళ్లే. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లకే అప్పగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దాంతో భారత ప్రభుత్వం.. చర్యలు చేపట్టి ఆ సంస్థకు చెందిన అనుమతులను రద్దు చేసింది. ఇది తుర్కియేగా పిలువబడుతున్న టర్కీకి భారత్ ఇచ్చిన తొలి స్ట్రోక్.

జూమ్ కాల్‌తో భార్య రెండో పెళ్లి గుట్టురట్టు.. నాలుగేళ్ల కోర్టు పోరాటంలో భర్త విజయం
సాక్షి, బెంగళూరు: భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ నాలుగేళ్ల కోర్టు పోరాటంలో ఓ భర్త విజయం సాధించాడు. అంతేకాదు భర్త నుంచి తనకు రూ.3 కోట్ల భరణం కావాలన్న భార్య డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. కోర్టు ఖర్చుల కింద రూ.30వేలు ఇస్తే సరిపోతుందంటూ భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు తీర్పును వెలువరించింది.కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ దంపతులకు 2018లో వివాహం జరిగింది. అయితే, ఏ చీకు చింతా లేని దాంపత్య జీవితంలో వివాహానికి ముందు భార్య నెరిపిన ప్రేమాయణం చిచ్చుపెట్టింది.వివాహం తర్వాత భార్య.. భర్తతో అన్యోన్యంగా మెలుగుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా అదే భార్య ప్రేమ పేరుతో ప్రియుడికి దగ్గరైంది. భర్తకు తెలియకుండా అతన్ని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తతో కలిసి జీవించేది. డబ్బులు అవసరం అయినప్పుడల్లా రెండో భర్తకు డబ్బులు పంపిస్తుండేది. దీంతో భార్య చేస్తున్న ఖర్చులపై మొదటి భర్తకు అనుమానం మొదలైంది. ఇదే విషయంపై భార్యను నిలదీయాలని అనుకున్నాడు.కానీ అలా చేయలేదు. భార్య గుట్టు రట్టు చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. తన స్నేహితుడి సాయంతో భార్యకు జూమ్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఆ జూమ్ ఇంటర్వ్యూలో తనకు అన్వేక కారణాల వల్ల మొదటి వివాహం జరిగిందని, ఇప్పుడు ఆ వివాహ బంధానికి ముగింపు పలికి రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.ఈ పరిణామం తరువాత ఆర్టీఐ ద్వారా.. తన భార్యకు రెండో వివాహం ఎప్పుడు జరిగిందో తెలుసుకున్నాడు. మ్యారేజీ సర్టిఫికెట్లు, పాన్ కార్డ్‌లతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించాడు. వాటి ఆధారంగా 2023 మార్చి నెలలో భార్య తన ప్రియుడిని రెండో వివాహం చేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే మంగళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డాడు. భార్య నుంచి విడాకులు కోరాడు. భార్య మానసిక హింస, వివాహం నిబంధనలను ఉల్లంఘించడం, ప్రతిష్టకు భంగం కలిగించిందని ఆరోపించాడు. ఆర్టీఐ ద్వారా సేకరించిన ఆధారాల్ని కోర్టుకు అందించాడు. విచారణ చేపట్టిన కోర్టు విడాకుల విషయంలో భార్య నిర్ణయం తెలపాలని ఆదేశించింది. దీంతో భార్య.. భర్తపై గృహ హింస, డౌరీ హింస, గర్భం తొలగించమని బలవంతం చేశారని ఆరోపించింది. అంతేకాదు భరణం కింద రూ.3 కోట్లు, నెలకు ఖర్చుల కింద రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. 2025,ఏప్రిల్ 23న భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేసింది. భార్య అడిగిన భరణాన్ని తిరస్కరించింది. న్యాయవాద ఖర్చుల నిమిత్తం రూ.30వేలు ఇవ్వాలని ఆదేశించింది.

కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసు: జైశంకర్
ఢిల్లీ: పాక్ ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాల్సిందేనని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసునంటూ ఆయన వ్యాఖ్యానించారు. భారత్ కేవలం పీవోకే, టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతోంది. సింధూ జలాల నిలిపివేతపై యథాతథ స్థితి కొనసాగుతోంది. ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పించే వ్యవస్థను రుపుమాపాలి’’ అని జైశంకర్ పేర్కొన్నారు.పాకిస్థాన్‌తో చర్చలు ఉగ్రవాదంపై మాత్రమే ఉంటాయని ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారని జైశంకర్ గుర్తు చేశారు. ఉగ్రవాదంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని జైశంకర్ చెప్పారు. #WATCH | Delhi | "Our relations and dealings with Pakistan will be strictly bilateral. That is a national consensus for years, and there is absolutely no change in that. The prime minister made it very clear that talks with Pakistan will be only on terror. Pakistan has a list of… pic.twitter.com/j9lugNSpsd— ANI (@ANI) May 15, 2025కాగా, ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌తో తాజా ఉద్రిక్తతలు, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారుల భద్రతపై కేంద్రం నిశితంగా దృష్టి పెట్టింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. మంత్రి కాన్వాయ్‌లో మరో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను చేరుస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జైశంకర్‌కు భద్రతను 2023లో వై నుంచి జెడ్ కేటగిరీకి పెంచారు. ఇప్పటికే రెండో అత్యున్నత స్థాయి భద్రత. అందులో భాగంగా 33 మందితో కూడిన సీఆర్పీఎఫ్ కమాండోల బృందం 24 గంటలూ ఆయనను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది.జెడ్ కేటగిరీలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), 4 నుండి ఆరుగురు స్థానిక పోలీసు మంది కమాండోలతో సహా 22 మంది సిబ్బంది, ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్ వాహనాలుంటాయి. సాధారణంగా ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, బెదిరింపులను ఎదుర్కొంటున్న వారికి ఈ స్థాయి భద్రత అందిస్తారు. కేంద్ర రక్షణ జాబితాలోని వీఐపీ భద్రతా కవర్ జెడ్–ప్లస్ (అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్), జెడ్, వై, వై–ప్లస్, ఎక్స్ దాకా ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా దాదాపు 200 మందికి సీఆర్పీఎఫ్ వీఐపీ భద్రతా సంరక్షణ ఉంది.

మిలటరీ చేతలకు.. నేతల మాటలకు పొంతనేది?
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా కాదు.. సరదా అంతకంటే కాదు. భారత ఆర్మీ మాజీ ఛీఫ్ మనోజ్ నరవణే చేసిన అర్థవంతమైన వ్యాఖ్య ఇది. ఆపరేషన్ సింధూర్ నిలిపివేతపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. యుద్ధం ఎల్లప్పుడు ఆఖరి ఆస్త్రం మాత్రమే కావాలని అన్నారు. అయితే.. ఇక విశ్రాంత మిలటరీ అధికారిగా ఆయన వ్యాఖ్యలకు ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ నేతల మాటలకు మధ్య తేడా ఉండటమే సమస్య అవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన ప్రసంగంలో పాక్‌కు గట్టి హెచ్చరికలే చేసినప్పటికీ వివిధ వర్గాల్లో వ్యక్తమవుతున్న అనుమానాలకు మాత్రం బదులిచ్చినట్లు కనిపించదు.👉ఆపరేషన్ సింధూర్ను హఠాత్తుగా ఎందుకు ఆపేశారు అన్నది వీటిల్లో ఒకటి. మిలటరీ అధికారుల స్థాయిలో పాక్ శరణు కోరినంత మాత్రాన అంగీకరించడం సబబేనా అన్నది కొందరి అనుమానం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం జరగాల్సిందేనని దేశ ప్రజలు వాంఛించిన మాట వాస్తవం. అలాగే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తూ భారత సైన్యం సాగించిన అపరేషన్ సింధూర్‌పై కూడా ప్రశంసల వర్షం కురిసింది. కానీ యుద్ధం ఆకస్మిక నిలిపివేత.. పహల్గామ్ దాడికి దారితీసిన నిఘా వైఫల్యాల వంటివి మాత్రం ప్రశ్నలుగా మిగిలిపోయాయి.👉కశ్మీర్లో కాల్పులు కొత్త కాకపోవచ్చు. పాక్ సైన్యం జరిపే కవ్వింపు కాల్పులు, చొరబాట్ల కోసం ఉగ్రవాదులు అప్పుడప్పుడూ భారత సైన్యంపైకి కాల్పులు జరుపుతూనే ఉంటారు. అయితే పహల్గామ్ మాత్రం రాక్షస కృత్యం. అమాయకులైన టూరిస్టులను, అది కూడా పేర్లు అడిగి మరీ హిందువులను హత్య చేయడంపై దేశం యావత్తు ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనను ఆకస్మికంగా విరమించుకుని వెనక్కు రావడం, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపడం వరకూ బాగానే ఉంది. కానీ.. ఆ వెంటనే బీహార్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొనడం మాత్రం చాలామందికి ముఖ్యంగా ప్రతిపక్షాలకు రుచించలేదు. అయినా సరే.. పాక్‌పై మోడీ తీసుకునే చర్యలకు మద్దతిస్తామని స్పష్టం చేశాయి.👉ఈ తరుణంలో మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ పిమ్మట భారత సైన్యం ఉగ్ర శిబిరాలను విజయవంతగా ధ్వంసం చేసి వచ్చింది. సుమారు వంద మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ సమయంలో పాకిస్తాన్ కూడా సరిహద్దులలో కాల్పులకు, ఇతరత్రా దాడులకు పాల్పడడానికి ప్రయత్నించగా భారత సైన్యం తిప్పికొట్టగలిగింది. అంతేకాక రావల్పిండి, తదితర పాక్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. నిజానికి భారత్ సైనిక శక్తి ముందు పాక్ ఎందుకు కొరగాదన్నది వాస్తవం. ఈ సమయంలో కేంద్రంలోని పెద్దలు కాని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు కాని యుద్దం చేయబోతున్న సంకేతాలు ఇచ్చారు. మనం తలచుకుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం కష్టం కాదని, అసలు పాక్ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని ప్రకటనలు చేశారు.👉వీటి ఆధారంగా చాలా మంది యుద్దం ఆరంభమైనట్లే భావించారు. సాంకేతికంగా భారత్ యుద్ధ ప్రకటన చేయకపోయినప్పటికీ ఇకపై పాక్ నుంచి ఎలాంటి చికాకు ఎదురుకాకుండా పీఓకే మన ఆధీనంలోకి వస్తుందని భావించారు. పాక్ నాలుగుగా చీలిపోయే అవకాశం ఉందని కొంతమంది జోస్యం కూడా చెప్పారు. కానీ అలా జరగలేదు. కానీ ఆకస్మాత్తుగా పాక్ మిలటరీ శరణు కోరడంతో కాల్పుల నిలిపివేతకు అంగీకరించామని మోదీ చెప్పడంతో అప్పటివరకూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలకు, జరిగిన పరిణామాలకు మధ్య తేడా రావడంతో కేంద్రంపై విమర్శలు వచ్చాయి. కాల్పుల విరమణతో మోదీ ప్రభుత్వం సాధించంది ఏమిటి? అని విపక్షాలు ప్రశ్నించాయి.👉ఈ లోగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేలు పెట్టి ఇదంతా తన ఘనత అని చెప్పుకోవడం మరింత చికాకైంది. దానిని విదేశాంగ శాఖ ఖండించినప్పటికీ, ప్రధాని బహుశా దౌత్యనీతి లేదా మరే కారణం వల్లనో తన ప్రసంగంలో ఆ ప్రస్తావన చేయలేదు. కశ్మీర్ విషయంలో మూడో పక్ష రాయబారానికి అంగీకరించబోమని భారత్ చెబుతుండగా, ట్రంప్ తాను మధ్యవర్తిత్వం చేస్తానని అనడం బాగోలేదు. అంతేకాక, అమెరికా తన స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించి భారత్, పాక్‌లను ఒకే దృష్టితో చూడడం ఆశ్చర్యపరిచింది. భారత్ విదేశాంగ విధానంలో ఏమైనా లోపం ఉందా అన్న ప్రశ్నకు తావిచ్చింది. మరో వైపు పాకిస్తాన్ పహల్గామ్ దుశ్చర్యతో తమకు సంబంధం లేదని అబద్ధాలు చెప్పింది.👉ఆ ఉగ్ర ముష్కరులను భారత భద్రత దళాలు పట్టుకుని, వారి మూలాలు అన్నిటిని చెప్పగలిగి ఉంటే పాకిస్తాన్ ప్రపంచంలో ఒంటరై ఉండేది. వారికి పరోక్ష మద్దతు ఇస్తున్న చైనా కూడా బహిరంగంగా పాక్‌ను తప్పు పట్టవలసి వచ్చేది. అయితే పాకిస్తాన్ భారతదేశం వద్ద ఉన్న ఎస్.4 సుదర్శన రక్షణ కవచాన్ని ఏమీ చేయలేక పోయిందన్న విషయాన్ని మోదీ అన్ని దేశాలకు తెలిసేలా అదంపూర్ వెళ్లి ఆ బేస్ నుంచి ప్రసంగించడం బాగుందని చెప్పాలి. అలాగే భారత్‌కు ఉన్న స్వదేశీ పరిజ్ఞాన ఆయుధ సంపత్తి శక్తి సామర్థ్యాలు కూడా దేశ ప్రతిష్టను పెంచాయి. అయినప్పటికీ యుద్దం ఎందుకు ఆగిందన్నది సగటు భారతీయుడికి ఎదురయ్యే ప్రశ్న.👉దానికే మాజీ ఆర్మీ ఛీప్ నరవణే ఇచ్చిన ప్రకటన అర్థవంతమైన జవాబు అవుతుంది. యుద్ధం అంటే సినిమా కాదు..అది చివరి అస్త్రం కావాలన్న ఆయన మాటలు అక్షర సత్యం. పాక్‌కు భారీ నష్టం జరిగినా, మనకు కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది. భారత సైన్యం సాధించిన విజయానికి సెల్యూట్ చేద్దాం. యుద్ధం జరగాలని కోరుకునేవారు కొంత అసంతృప్తికి గురై ఉండవచ్చు.. మిలటరీ ఆపరేషన్స్ వరకు ప్రామాణికంగా తీసుకుంటే భారత్ గొప్ప విజయం సాదించిందని ఒక రిటైర్డ్ మేజర్ వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ పార్టీలు భావోద్వేగ అంశాలపై బాధ్యతతో మాట్లాడకపోతే అవి ఆత్మరక్షణలో పడతాయని కూడా ఈ అనుభవం తెలుపుతోందని అనుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
ఎన్ఆర్ఐ

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్‌లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.

న్యూజెర్సీ, పార్సిప్పనీలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
న్యూజెర్సీలోని పార్సిప్పనీలో శ్రీ సీతారాముల కల్యాణం రమణీయంగా, కమనీయంగా సాగింది. న్యూయార్క్‌లోని శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తులు చేయించిన అభరణాలను వధూవరులకు ధరింపజేశారు. రాముల వారికి, సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు, తాళిబొట్టు, మెట్టలు, ఆభరణాలు, ముత్యాల తలంభ్రాలను సమర్పించారు. మేళంతో ఊరేగింపుగా పట్ట వస్త్రాలను తీసువచ్చారు. సీతమ్మ, రామయ్యల ఎదుర్కోలు ఘట్టం కనులారా తిలకించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. భక్తజనంతో న్యూజెర్సీలో పండగ వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయలకు అనుగుణంగా వివాహ వ్యవస్థపై కృష్ణ దేశిక జీయర్ స్వామిజీ చేసిన వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. దండలు మార్చుకునే క్రమంలో అర్చకులు నృత్య ప్రదర్శన చేసి సంప్రదాయాన్ని గుర్తు చేశారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!అనంతరం గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, మహాసంకల్పం, మంగళఅష్టకాలు, కన్యాదానం, తలంబ్రాల ఘట్టం, పూలదండల మార్పు, మహా హారతి, నివేదన తదితర ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ జగదభిరాముడు జానమ్మను మనువాడారు. కోదండ రాముడు సీతమ్మ మెడలో మూడుముళ్లు వేసిన వేళ, రఘునందనుడి దోసిట తలంబ్రాలు ఆణిముత్యాలే నీలపురాశులుగా, జగన్మాత లోకపావని సీతమ్మ దోసిట అక్షింతలు మణిమాణిక్యాలై సాక్షాత్కారించిన వేళ కల్యాణ ప్రాంగణం భక్తిపారవశ్యంతో ఓలలాడింది.ఈ సీతారాముల కాళ్యానికి పార్సిప్పనీకి మేయర్ జేమ్స్ బార్బెరియోతో పాటు 300 మందికి ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72 పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నాయి. ఈ కల్యాణాన్ని ప్రవాసులు కన్నులారా వీక్షిం చి తరించారు. ఈ ఉత్సవం.. భద్రాచల రాముల వారి కళ్యాణమహోత్సవాన్ని తలపించింది. కల్యాణం అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందజేశారు.

పహల్గామ్ విషాదం, ఎన్ఆర్ఐల శాంతి ర్యాలీ
పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ అమెరికాలో ప్రవాస భారతీయులు శాంతి ప్రదర్శన చేపట్టారు. ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో న్యూయార్క్ ఐజాక్ హోవర్ పార్క్ లో శాంతిని కాంక్షిస్తూ కొవ్వత్తుల ప్రదర్శన చేశారు.అందమైన కాశ్మీర్ లోయ మరోసారి రక్తసిక్తం కావటం, ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను పొట్టన పెట్టుకోవటంపై ప్రవాస భారతీయులు ఆవేదన వ్యక్తం చేశారు. హింసామార్గంలో ఎవరూ కూడా లక్ష్యాలను సాధించలేరన్న విషయాన్నిపాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.ఉగ్రవాదుల అణిచేతకు భారత ప్రభుత్వం చేపట్టే చర్యలకు అండగా ఉంటామని ఇండో అమెరికన్ కమ్యూనిటీ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం(నైటా), వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారతీయ జెండాలను ప్రదర్శిస్తూ, కొవ్వత్తులతో శాంతి ర్యాలీలో పాల్గొన్నారు.
క్రైమ్

తాళిబొట్లు తెంచి పడేసి హిజ్రాల ఆవేదన..!
తమిళనాడు: కూవాగంలో గత కొద్ది రోజులు సందడి చేసిన హిజ్రాలు బుధవారం విషాదంతో స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం ఎంతో ఆనందంగా కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి ఒప్పారి పెట్టారు. తెల్ల చీరలు ధరించి వితంతువులుగా మారి కూవాగం నుంచి తిరుగు పయనం అయ్యారు. ముందుగా ఉదయం కూత్తాండవర్ రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్ పేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో రెండు వారాల పాటు చిత్తిరై ఉత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజులు హిజ్రాల సందడితో కూవాగం కళకళలాడింది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా మంగళవారం హిజ్రాలు తాళిబొట్లు కట్టించుకున్నారు. రాత్రంతా ఆట పాటలతో సందడి చేశారు. రథోత్సవం బుధవారం ఉదయం కూత్తాండవర్ రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా జనసందోహం తరలివచ్చారు. ఈ వేడుక కోసం కూవాగం, పందలాడి, కిలక్కు కుప్పం, శిరులాయం కుళం గ్రామాల నుంచి ప్రజలు చేతులు, కాళ్లు, భుజాలు, శిరస్సు ఆకారాలను తీసుకొచ్చి రథంపై ఉంచారు. బ్రహ్మాండంగా కూత్తాండవర్ రథోత్సవ సేవ జరిగింది. అనంతరం బలిదానం జరిగింది. బలిదానంలో తమ ఆరాధ్యుడు బలి కావడంతో తమ భర్తను కోల్పోయినంతగా తీవ్ర వేదనతో ఒక్కసారిగా హిజ్రాలు విషాదంలో మునిగారు. తాము కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి కన్నీటి సంద్రంలో మునిగారు. ఏడుపులు, పెడ»ొబ్బలతో ఒప్పారి పెట్టారు. అక్కడి కొలనులో స్నానం చేసి తెల్ల చీరల్ని ధరించి తమ స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు.

చేయి విరిగిందని వెళితే.. ప్రాణం పోయింది
తగరపువలస(విశాఖపట్నం): వాష్‌రూమ్‌లో జారిపడి చేయి విరిగిన ఓ మహిళ తొలుత సంగివలసలోని అనిల్ నీరుకొండ(ఎన్ఆర్ఐ) ఆసుపత్రిలో చికిత్స పొంది. అక్కడ పరిస్థితి విషమించడంతో నగరంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తన భార్య మృతికి అనిల్ నీరుకొండ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె భర్త జనార్థన్ ఆరోపించారు. కుటుంబసభ్యులతో ఆసుపత్రి ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వివరాలివి. భీమిలి మండలం చిప్పాడలో నివాసముంటున్న దివీస్ ఉద్యోగి జనార్థన్ భార్య యర్రంశెట్టి రేవతి ఈ నెల 10న ప్రమాదానికి గురైంది. వెంటనే ఆమెను ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేర్పించగా.. అక్కడ వైద్యం వికటించి అపస్మారక స్థితికి చేరుకుంది. మెరుగైన వైద్యం కోసం జనార్థన్ ఆమెను నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందింది. దీంతో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రేవతి మృతదేహంతో ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎదుట ఆందోళన జరిగే అవకాశం ఉందని ముందే ఊహించిన సిబ్బంది.. మృతదేహాన్ని హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఆమె స్వగ్రామమైన అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరుకు మృతదేహాన్ని పంపే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కేజీహెచ్ వద్ద ఆమె భర్త ఆందోళనకు సన్నద్ధమయ్యారు. తన భార్య అపస్మారక స్థితికి చేరుకోవడానికి కారణమైన వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. జనార్థన్‌కు సంఘీభావంగా ఆయన స్వగ్రామానికి చెందిన బంధువులు, దివీస్ ఉద్యోగులు, పలు ప్రజా సంఘాల నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సాయంత్రం 8 గంటల తర్వాత వారంతా కలిసి సంగివలసలోని ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆసుపత్రి యాజమాన్యం ఆందోళనకారులు, బాధితుల తరపున వచ్చిన ప్రజా సంఘాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది. భీమిలి పోలీసులు ఆసుపత్రి వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మహిళ ఆత్మహత్య
నాగోలు(హైదరాబాద్): భర్త వేధింపుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఖమ్మం పట్టణానికి చెందిన కట్టా వెంకటేశ్వర్లు కుమార్తె జాస్మిన్(29)కు ఎల్బీనగర్, శివపురి కాలనీ చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెండెం రాజశేఖర్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 25 లక్షల నగదు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. వివాహం జరిగిన కొన్నాళ్లకే రాజశేఖర్, అతడి కుటుంబ సభ్యులు జాస్మిన్ను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్ద మనుషులు ఆమెకు నచ్చజెప్పి కాపురానికి పంపించారు. అయినా తన వైఖరి మార్చుకోని రాజశేఖర్ కొన్నాళ్లకే జాస్మిన్ను కొట్టి పుట్టింటికి పంపించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజశేఖర్‌ను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మంగళవారం ఆఫీస్‌కు వెళ్లిన రాజశేఖర్ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూడగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. జాస్మిన్ను పిలిచినా స్పందన లేకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు పగలకొట్టి చూడగా జాస్మిన్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. కిందకు దింపి చూడగా అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. దీంతో అతను ఎల్బీనగర్ పోలీసులు, జాస్మిన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. జాస్మిన్ శరీరంపై గాయాలను గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు రాజశేఖర్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భార్యతో విడాకులు తీసుకుంటున్నానని చెప్పి..!
బంజారాహిల్స్(హైదరాబాద్): నా తల్లితో ఆస్తి గొడవలు ఉన్నాయి..నా భార్య నాతో సఖ్యంగా ఉండదు..అందుకే విడాకులు తీసుకుంటున్నాం..అందుకు సంబంధించిన విడాకులు పత్రాలు ఇవిగో అంటూ వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. చివరకు సదరు వైద్యుడి అసలు నిజ స్వరూపం తెలియడంతో తాను మోసపోయానని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన భరత్ గెరా నగరంలోని కొండాపూర్ ప్రైమ్ స్ప్లైండర్లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని డెరెడియా లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హెచ్ఆర్ ఆపరేషనల్ హెడ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ వైద్యురాలితో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో గత ఏప్రిల్‌లో భరత్ సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తనకు గతంలోనే వివాహం జరిగిందని, తన భార్యతో గొడవల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. న్యాయవాది ఎదుట ఇద్దరూ సంతకం చేసిన పత్రాలను కూడా ఆమెకు చూపించాడు. తన తల్లికి తనకు ఆస్తి గొడవలు ఉన్నాయని, తల్లి, సోదరుడు ఢిల్లీలో ఉంటారని చెప్పాడు. ఈ క్రమంలో మార్చి 31న కంపెనీ పనిపై చంఢీఘడ్ వెళుతున్న భరత్ సదరు వైద్యురాలిని కూడా తీసుకెళ్లి అక్కడ హోటల్ రూంలో బస చేశారు. ఆ సమయంలో భరత్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత భరత్‌ను కంపెనీ యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించగా, అతడితో పాటు సదరు యువతి కూడా ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇద్దరూ కలిసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెట్టుబడి నిమిత్తం ఆమె నుంచి భరత్ రూ.2.5 లక్షలు తీసుకున్నాడు. అంతేగాక భరత్ సదరు యువతి ఫోన్లో లోకేషన్‌ను ట్రాక్ చేసి ఆమె ఎక్కడికి వెళ్తుందని ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె భరత్‌తో మాట్లాడేందుకు అతని ఇంటికి వెళ్లగా అతడి భార్య ఇంట్లో ఉండటాన్ని చూసి షాక్‌కు గురైంది. ఆరు నెలల గర్భవతిగా ఉన్న అతని భార్య కూడా వైద్యురాలిని అసభ్యంగా దూషించడమేగాక వివాహితుడితో ఎందుకు సంబంధం కొనసాగిస్తున్నావంటూ నిలదీసింది. ఆ తర్వాత భరత్, అతని భార్య పూణెకు మకాం మార్చారు. కొన్ని రోజుల తర్వాత గర్భం దాల్చిన బాధితురాలు భరత్ తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని మోసం చేశాడంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.