Top Stories
ప్రధాన వార్తలు

పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారీ పేలుళ్లు.. నివాసం నుంచి షరీఫ్ తరలింపు
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారత సైన్యం దాడితో భారీ పేలుళ్లు జరిగాయి. దాంతో ఇస్లామాబాద్‌లోని తన నివాసం నుంచి షెహబాజ్ షరీఫ్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.పాక్ రాజధాని ఇస్లామాబాద్‌పై భారత సైన్యం దాడి చేసింది. ఇస్లామాబాద్ టార్గెట్‌గా భారత్ డ్రోన్లు, మిస్సైల్లతో దాడికి దిగింది. పాక్ మిస్సైల్లను గాల్లోనే కూల్చి వేసిన భారత సైన్యం. జమ్మూలోని ఎయిర్‌పోర్టుపై 8 సూసైడ్ డ్రోన్లతో పాక్ దాడి చేయగా వాటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. జైసల్మేర్, అక్నూర్లో ఇద్దరు పాక్ పైలట్లను పట్టుకున్న భారత ఆర్మీ. మొత్తం 20కి పైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత సైన్యం. లాహోర్ , సియాల్ కోర్టులో కౌంటర్ ఎటాక్‌కు దిగిన భారత్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 14 మంది పాక్ సైనికులు హతమైనట్టు సమాచారం.S-400, L-17 సిస్టమ్‌ను యాక్టివేట్ చేసిన భారత్. జమ్మూ ఎయిర్‌పోర్టు టార్గెట్‌గా పాక్ దాడులు. ఈ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని, పాక్ దాడులను సమర్ధవంతగా తిప్పికొట్టామని భారత ఆర్మీ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులను హై అలర్ట్ చేసిన భారత్ సైన్యం. వరుస డ్రోన్ దాడులతో పాక్ ఉక్కిరిబిక్కిరి అయింది. ఇదిలా ఉండగా అమెరికా, యూకే, యూఏఈలతో టచ్‌లో భారత్. రంగంలోకి SZU-23, శిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. తాజా పరినామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ సమావేశం అయ్యారు. త్రివిధ దళాధిపతులు, CDSతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. రంగంలోకి భారత నౌకాధళం రంగంలోకి దిగిన భారత నౌకాధళం పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ సీ పోర్టుపై ప్రతీకార దాడి చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత నుంచి మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగించింది. ఈ పోర్టులో ఏడు భారీ పేలుళ్లు, ఎగిసిపడుతున్న మంటలు. కరాచీ పోర్టులో మొత్తం 10 పాక్ కార్గో నౌకలను ద్వంసం చేసిన ఇండియన్ నేవీ. ఈ దాడుల్లో అనేక షిప్పులు ధ్వంసం అయ్యాయి. అరేబియా సముద్రంలో పాక్‌పై గురి పెట్టిన భారత నేవీ ఏకంగా 26 యుద్ధ నౌకలతో విరుచుకుపడుతూ పాక్‌ను వణికిస్తోంది.దేశంలో పలు ప్రాంతాల్లో రైళ్లు నిలిపివేతతాజా పరినామాలతో దేశంలో ఢిల్లీ నుంచి జమ్మూ,గుజరాత్, రాజస్థాన్ వెళ్లే రైళ్లన్నీ రద్దు చేశారు. ఢిల్లీలో హై అలర్ట్తాజా పరినామాలతో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ధ భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం. ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించింది. భారీగా NSG కమాండర్ల మోహరింపు.మరోవైపు పాకిస్తాన్‌పై బలూచిస్తాన్ దాడిఓవైపు భారత సైన్యం, ఇండియన్ నేవీ జరుపుతున్న దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాక్‌కు మరోవైపు నుంచి బలూచిస్తాన్ దాడికి దిగింది. పాక్ చమురు క్షేత్రాలపనా బలూచిల దాడులు. ఇదిలా ఉండగా పాక్‌పై భారత్ దాడులను బలూచి రేడియో హైలెట్ చేస్తోంది.పాక్ రక్షణ వ్యవస్థల కూల్చివేతపాక్లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చేసిన భారత్. సర్గోదా, ఫైసలాబాద్‌లోని రక్షణ వ్యవస్థలను కూల్చినట్లు ప్రకటించిన భారత్. భారత్ దాడులతో దిక్కు తోచని పాక్ బలగాలు.15 భారత సైనిక స్థావరాలపై గురిన్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకోబోయి పాక్ బొక్కబోర్లా పడింది. భారత్‌లోని 15 సైనిక స్థావరాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటాక అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఉదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడీ, ఉత్తర్లాయ్, భుజ్ సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది. అందుకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను తుత్తునియలు చేసింది. గురువారం మధ్యాహ్నం పాక్‌పై ప్రతి దాడులకు దిగింది. ఇస్లామాబాద్, సియాల్కోట్, లాహోర్, రావల్పిండిలపై విరుచుకుపడింది. లాహోర్‌లోని పాక్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన హెచ్‌క్యూ–9 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ యూనిట్లను హర్పీ కామికాజ్ డ్రోన్లతో నేలకూల్చింది. ఈ దాడులను పాక్ కూడా ధ్రువీకరించింది. ‘‘లాహోర్ సమీపంలో ఒక డ్రోన్ నేలకూలింది. గుర్జన్‌వాలా, చాక్వాల్, బహవల్పూర్, మియానో, కరాచీ, ఛోర్, రావల్పిండి, అతోక్ ప్రాంతాల్లో మరో 12 డ్రోన్లు ధ్వంసమయ్యాయి’’ అని అంగీకరించింది. లాహోర్‌లో నలుగురు సైనికులు గాయపడ్డారని, ఒక పౌరుడు మరణించాడని చెప్పింది. ‘‘పాక్ దుశ్చర్యకు అదే స్థాయిలో బదులిచ్చాం. ఎస్–400తో పాటు ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్‌తో పాక్ క్షిపణులు, డ్రోన్లను కూల్చేశాం’’ అని సైన్యం ప్రకటించింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను నాశనం చేసినట్లు కేంద్రం పేర్కొంది. యుద్ధ వాతావరణం భారత దాడులతో లాహోర్‌లో యుద్ధ వాతావరణం కనిపించింది. వాల్టన్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. సైరన్లు మోగడంతో జనం భయభ్రాంతులయ్యారని తెలిపింది. గాల్లో దట్టమైన పొగ వ్యాపించినట్లు వెల్లడించింది. యుద్ధ భయంతో పాక్‌లో సియాల్కోట్, కరాచీ, లాహోర్ సహా పలు ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. పాక్ నగరాల్లోని తమ పౌరులు తక్షణం దేశం వీడాలని, లేదా సురక్షిత ప్రాంతాలకు తరలాలని అమెరికా సూచించింది. పీఎంఓ భేటీ జరుగుతుండగానే!ఇస్లామాబాద్‌పై భారత్ దాడుల సమయంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో ఉన్నారు. ఆ సమయంలో పేలుళ్లతో నగరమంతా దద్దరిల్లిపోయింది. దాంతో సమీక్షను అర్ధంతరంగా నిలిపేసి ప్రధాని బృందం సురక్షిత ప్రాంతానికి తరలినట్టు సమాచారం. కాసేపటికే షహబాజ్ నివాస పరిసరాలు నేలమట్టం కావడంతో ఆయనను హుటాహుటిన పాతిక కి.మీ. దూరంలోని బంకర్లోకి తరలించినట్టు చెబుతున్నారు. పలుచోట్ల బ్లాకౌట్పాక్ దాడుల నేపథ్యంలో గురువారం రాత్రి సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సైరన్ల మోత మోగింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్‌ల్లో పలుచోట్ల వైమానిక దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. దాంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, అమృత్సర్, హోషియార్పూర్, మొహాలీ, చండీగఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని జైసల్మేర్ దాకా పలు నగరాల్లో కరెంటు సరఫరా నిలిపేశారు. ఆయాచోట్ల రాత్రిపూట పలు డ్రోన్లతో పాటు పేలుడు శబ్దాలను గమనించినట్టు భద్రతా బలగాలు తెలిపాయి. ప్రజలు లైట్లన్నీ ఆర్పేసి ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొన్నాయి.

‘సాక్షి’పై కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’పై చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు, వేధింపులకు బరితెగిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తుండటంతో కక్షకట్టి పోలీసులను ఉసిగొలిపి బెదిరింపులకు దిగుతోంది. రాజ్యాంగాన్ని కాలరాస్తూ, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ ఎమర్జెన్సీ నాటి దురాగతాలకు పాల్పడుతోంది. ఏకంగా సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి విజయవాడ నివాసంలో గురువారం సోదాల పేరుతో బెదిరింపు చర్యలకు పాల్పడటం ప్రభుత్వ కుట్రకు పరాకాష్టగా నిలుస్తోంది. కనీసం సెర్చ్ వారంట్ కూడా లేకుండా, నోటీసు కూడా ఇవ్వకుండా గురువారం ఉదయం 9 గంటలకే విజయవాడ ఏసీపీ దామోదర్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు సాక్షి ఎడిటర్ నివాసంలోకి ప్రవేశించి సోదాల పేరుతో హల్చల్ చేశారు. అసలు పోలీసులు ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదు. తన నివాసంలో సోదాలు చేసేందుకు సెర్చ్ వారంట్ చూపించాలని అడిగితే పట్టించుకోకుండా అన్ని గదుల్లో తనిఖీలు కొనసాగించడం గమనార్హం. ఏ కేసులో సోదాలు చేస్తున్నారు.. ఏం కావాలని ఎడిటర్ ధనంజయ రెడ్డి ఎంతగా అడిగినా ఏసీపీ దామోదర్ కనీస సమాధానం కూడా ఇవ్వలేదు. సమాచారం తెలిసిన పాత్రికేయ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు హుటాహుటిన ఆయన నివాసానికి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఇంటి తలుపులు వేసి.. ధనంజయ రెడ్డిని ఎవరూ కలవకుండా అడ్డుకున్నారు. ధనంజయ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేని అంశాలపై ప్రశ్నించారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు... మీరు ఎప్పుడు వచ్చారు.. అంటూ ప్రశ్నలు వేయడం గమనార్హం. ఎందుకు అలా ప్రశ్నిస్తున్నారని అడిగితే సమాధానం మాత్రం చెప్ప లేదు. తమను లోపలికి అనుమతించాలని పాత్రికేయులు ఎంతగా కోరినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక వైఖరి, దౌర్జన్యపూరిత తీరుకు నిరసనగా పాత్రికేయులు అక్కడే ఆందోళన చేపట్టారు.సెర్చ్ వారంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుఉదయం 11 గంటల సమయంలో తాము సోదాలు చేసినట్టు ఓ కాగితంపై రాసి సంతకం చేయాలని ధనంజయ రెడ్డికి చెప్పారు. సిట్ దర్యాప్తు చేస్తున్న మద్యం కేసులో నిందితులు ఉన్నారేమోనని తెలుసుకునేందుకు తాము సెర్చ్ వారంట్‌తో వచ్చి సోదాలు నిర్వహించినట్టు పేర్కొనడం గమనార్హం. దీనిపై ఎడిటర్ ధనంజయ రెడ్డి అభ్యంతరం తెలిపారు. అసలు మద్యం కేసులో నిందితులు తన నివాసంలో ఎందుకు ఉంటారని ఆయన పోలీసులను నిలదీశారు. కొంత కాలం నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న తాను బుధవారం రాత్రే విజయవాడ వచ్చానని తెలిపారు. కేవలం సాక్షి పత్రికను బెదిరించేందుకే ఎడిటర్ నివాసంలో సోదాల పేరుతో హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సెర్చ్ వారంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు.. అనంతరమే సోదాలు నిర్వహించినట్టు ఎలా రాస్తారని.. తాను ఎందుకు సంతకం చేయాలని ఆయన ప్రశ్నించారు. తన న్యాయవాదితో సంప్రదించిన తర్వాతే సంతకం చేస్తానన్నారు. దాంతో న్యాయవాది మనోహర్ రెడ్డిని పోలీసులు లోపలికి అనుమతించారు. పోలీసుల తీరును న్యాయవాది మనోహర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఏదైనా సరే నిబంధనల ప్రకారం చేయాలని, పోలీసులు ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదని న్యాయస్థానాలు స్పష్టం చేస్తూ ఇచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. వ్యక్తి స్వేచ్ఛే అత్యున్నతమైందన్న న్యాయస్థానాల తీర్పులను కూడా ఖాతరు చేయరా అని పోలీసులను నిలదీశారు. కాసేపు తర్జనభర్జనల అనంతరం పోలీసులు సెర్చ్ వారంట్‌ను అప్పటికప్పుడు పెన్‌తో రాసి ఇచ్చి.. తాము సోదాలు చేసినట్టు పంచనామా నివేదికను సమర్పించి వెళ్లిపోయారు. దాదాపు మూడు గంటలపాటు పోలీసులు సోదాల పేరుతో సాక్షి ఎడిటర్ నివాసంలో హల్చల్ చేశారు. కేవలం సాక్షి గొంతు నొక్కేందుకే ఇలా బెదిరింపులకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది.

ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా?: ఆర్.ధనంజయరెడ్డి
సాక్షి, అమరావతి: ఎలాంటి నోటీసులు లేకుండా ఓ పత్రిక ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడి సోదాలు చేయడం దేశ చరిత్రలో ముందెన్నడూ జరగలేదని, ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా.. అని సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాకుండా, ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగానే భావిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రాజకీయ కుట్రలో భాగంగా సోదాల పేరిట పోలీసులు వ్యవహరించిన నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. విజయవాడలోని తన నివాసంలో గురువారం పోలీసుల సోదాల ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక, లిక్కర్, మైనింగ్, విద్యుత్ స్కామ్‌లతో పాటు విజయవాడలో వరదలు, తిరుమలలో తొక్కిసలాట, సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు మద్దతు ధర కల్పించకపోవడం వంటి వరుస వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి గొంతునొక్కాలనే యత్నమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల మూడ్‌ను రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నంలో సాక్షి తన బాధ్యతను నిర్వర్తిస్తోందని చెప్పారు. దాన్ని ఓర్వలేకనే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగడుతున్నారని, దీనిని ఖండించకపోతే ఎవరింట్లోకైనా సరే ఇలాగే చొరబడతారన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఎవరి మీదా కేసు పెట్టకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. పోలీసులకు చట్టం, న్యాయం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేనట్టుగా కన్పిస్తోందని చెప్పారు. ‘ఉదయం ఉన్న ఫళంగా పది మంది పోలీసులు ఇంట్లోకి చొర బడ్డారు. ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఒక డీఎస్పీ, సీఐలతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వచ్చి, ఇల్లు సెర్చ్ చేస్తాం.. ఇది ఓపెన్ చేయండి.. అది ఓపెన్‌చేయండి.. ఇంట్లో ఉన్న వాళ్లను వాళ్లెవరు.. వీళ్లెవరు.. అంటూ ఆరాలు తీయడం దుర్మార్గం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే.. నాపై ఇప్పటికే 3–4 కేసులు పెట్టారుఇప్పటికే నాపై మూడు నాలుగు కేసులు పెట్టారు. ఒకటి సభా హక్కుల ఉల్లంఘన కేసు అన్నారు. ఒక వార్త రాస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి కాటమనేని భాస్కర్ ద్వారా ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి జారీ చేశారు. మొన్నటికి మొన్న తెలంగాణ, ఏపీ ఎడిషన్‌లో ఒకే వార్త వేర్వేరుగా రిపోర్టు అయ్యిందని మరో కేసు పెట్టారు. జర్నలిజం మౌలిక నియమాలు, ఓనమాలు తెలిసిన వారెవరికైనా ఇదేంటని తెలుసు. ఎక్కడన్నా ఒక ఘటన జరిగితే ఆ ప్రాంత రిపోర్టర్ స్పాట్ రాస్తారు. సొంత ఊళ్లో ఉన్న రిపోర్టర్‌కు మరిన్ని వివరాలు తెలుస్తాయి కాబట్టి మరింత లోతుగా ప్రజంట్ చేస్తారు. దాన్ని అడ్డం పెట్టుకొని నాపై కేసు పెట్టారు. కొంత మంది సాక్షి పాత్రికేయులపై కూడా కేసులు పెట్టారు. ఇదంతా సాక్షి గొంతునొక్కే ప్రయత్నంగా చూడాల్సి వస్తుంది. రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాలు ఎందుకొచ్చారు.. సెర్చ్ నోటీసు ఉందా? దాంట్లో నా పేరు ఏమైనా ఉందా? అని సోదాలకు వచ్చిన పోలీసు అధికారులను చాలా స్పష్టంగా అడిగాను. ‘లేదు సర్.. ఇన్ అండ్ అరౌండ్ సెర్చ్ చేస్తున్నాం.. జస్ట్ ఊరికే మీ ఇల్లు చూసేసి పోతాం’ అని చెప్పారు. కానీ వాళ్లు వ్యవహరించిన తీరు చూస్తుంటే రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాల పేరిట వచ్చారని స్పష్టంగా కన్పించింది. నా కార్ నంబర్, నా ఫోన్ నంబర్లు తీసుకున్నారు. వారు స్పష్టమైన లక్ష్యం, ఉద్దేశంతోనే వచ్చినట్టుగా స్పష్టమైంది. వారు చెబుతున్న లిక్కర్ కేసులో నిందితులు నా ఇంట్లో ఎందుకు ఉంటారు? వారికి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడకు ఎందుకు వస్తారు? ఏమైనా అడిగితే పై నుంచి ప్రెజర్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా పొలిటికల్ మోటివేషన్‌తో జరుగుతోందని అర్థమవుతోంది.

జమ్మూపై పాక్ డ్రోన్లతో దాడి.. తిప్పికొట్టిన భారత్
జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్‌గా పాక్ డ్రోన్లతో దాడి చేసింది. ఎఫ్-16ను పాక్ ఆర్మీ ప్రయోగించింది. భారత్ బలగాలు ధీటుగా ఎదుర్కొన్నాయి. 10 పాక్ డ్రోన్లను భారత్ కూల్చివేసింది. సైరన్లతో ప్రజలను ఆర్మీ అప్రమత్తం చేసింది. సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో రాకపోకలు బంద్ చేశారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. జమ్మూ నగరమంతా విద్యుత్‌ను నిలిపివేశారు. పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.జమ్మూ వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. సాంబ సెక్టార్లో పాక్ కాల్పులకు తెగబడింది. ఎస్-400 సిస్టమ్‌తో పాక్ మిస్సైళ్లను భారత్ ధ్వంసం చేసింది. సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించిన ఎఫ్-16, రెండు జేఎఫ్-17లను కూల్చివేసిన ఇండియన్ ఆర్మీ.. పాక్‌ను మరో చావు దెబ్బ కొట్టింది. మూడు ఫైటర్ జెట్లను భారత్ సైన్యం కూల్చివేసింది.జమ్మూ, సివిల్ ఎయిర్పోర్ట్, సాంబ, ఆర్ఎస్పుర, చానీ మహిత్, అర్నియా ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు పాల్పడింది. పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై ఎఫ్-16 దాడికి ప్రయత్నించింది. పాక్ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని భారత్ ఆర్మీ ప్రకటించింది. పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టామని పేర్కొంది.కాగా, పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై భారత సైన్యం ఇవాళ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ మిస్సైళ్లను భారత దళాలు కూల్చివేశాయి. యాంటి మిస్సైల్ సిస్టమ్ ద్వారా పాకిస్థాన్ మిస్సైళ్లను గాల్లోనే భారత్ పేల్చేసింది. ఎస్-400 మిస్సైళ్లను ఉపయోగించి పాక్‌కు భారత్ బుద్ధి చెప్పింది. గత రెండు రోజులుగా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నిస్తుండగా, వీటిని భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుంటున్నాయి.

పాక్ కుయుక్తులు.. భారత్ సీరియస్ వార్నింగ్
ఢిల్లీ: భారత్‌లోని పలు ప్రాంతాలను పాక్ టార్గెట్ చేసిందని.. ఉత్తర, పశ్చిమ, భారత్‌లోని 15 ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్ సైన్య స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని.. ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశామని ఆమె స్పష్టం చేశారు. విదేశాంగశాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాక్ దాడులను తిప్పికొట్టామని.. పాక్ మిస్సైళ్లను కూల్చేశామని వెల్లడించారు.నియంత్రణ రేఖ వెంబడి పాక్ జరుపుతున్న విచక్షణారహిత కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా 16 మంది మృతి చెందినట్లు ఆమె వెల్లడించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి,భుజ్‌లో పాక్ సైన్యం దాడులు చేసిందని.. మేం చేసిన దాడులు ఎక్కడా రెచ్చగొట్టేలా లేవన్నారు.నియంత్రణ కచ్చితత్వంతో మేం కేవలం ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశాం. మిలటరీ స్థావరాలపై మేం దాడి చేయలేదు. పాక్ దాడుల్లో 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. కుప్పారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ సెక్టార్లలో పాక్ సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతోంది. పాకిస్తాన్ తనకేమీ సంబంధం లేదంటూ చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తోందని విక్రమ్ మిస్త్రీ అన్నారు.‘‘పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగితే.. ఇంతకంటే ధీటుగా సమాధానం ఇస్తాం. 65 ఏళ్ల నుంచి భారత్‌ను పాక్ రెచ్చగొడుతున్నా సహనంగా ఉన్నాం. పాకిస్థాన్‌తో ఎలాంటి దౌత్యపరమైన చర్చలు జరపడం లేదు. ఐరాసతోనే పాకిస్థాన్ అబద్ధాలు చెప్పింది. పాక్‌లో ఉన్న టీఆర్ఎఫ్.. లష్కరే తొయిబాకు అనుబంధ సంస్థ. ఉగ్రవాదులతో తమకు సంబంధం లేదని పాక్ బుకాయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులకు పాకిస్థాన్ కేంద్రం. మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదులు పాక్‌లో రక్షణ పొందుతున్నారు.బిన్ లాడెన్‌కు కూడా పాకిస్థాన్ ఆశ్రయం కల్పించింది. పాకిస్థాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదులే.. పఠాన్‌కోట్, ముంబైలో దాడులు చేశారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ అధికారులు హాజరయ్యారు. ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో పాక్ అంత్యక్రియలు చేసింది. ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేశామని అబద్ధాలు చెప్తోంది. మేం ఎక్కడా ప్రార్థనా కేంద్రాలను టార్గెట్ చేయలేదు. పూంఛ్‌లో సిక్కు పౌరులపై పాక్ కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల్లో ముగ్గురు సిక్కులు చనిపోయారు, పహల్గాం ఉగ్రదాడి వల్లే ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. పల్గాహం ఉగ్రదాడికి నిన్న భారత్ సమాధానం చెప్పింది’’ అని విక్రమ్ మిస్త్రీ చెప్పారు.

ఐపీఎల్ వాయిదా?
ధర్మశాల: ఉగ్రవేటకు తలపెట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ఏమాత్రం జీర్ణించుకోలేని పాకిస్తాన్ మిలిటరీ కుటిలబుద్ధితో క్రూరమైన దాడులకు తెగబడుతోంది. సరిహద్దు రాష్ట్రాల పౌరులపై విచక్షణారహితంగా మోర్టార్లు, ఫిరంగులతో దాడులు చేస్తోంది. దీంతో భారత బలగాలు దీటుగా బదులిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కాస్తా యుద్ధభూమిని తలపించడంతో భారత రక్షణ దళాలు కీలక నగరాల్లో విద్యుత్ సరఫరా (పవర్ బ్లాక్ అవుట్)ను నిలిపివేసింది. ఇంటర్నెట్, మొబైల్ సేవల్ని నిలిపివేసింది. పాక్ ప్రయోగించిన మిస్సైళ్లు, డ్రోన్లను నిర్వీర్యం చేసేందుకు భారత సాయుధ బలగాలు రాత్రంతా శ్రమిస్తున్నాయి. ఇలా ప్రస్తుతం దేశం కోసం భారత త్రివిధ దళాలు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే స్టేడియాల్లో ఐపీఎల్ వినోదం పట్ల నెట్టింట తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. భారత పౌరులు, ప్రధాన నగరాలే లక్ష్యంగా పాక్ ఆర్మీ విచక్షణా రహితంగా జరిపే దాడుల్ని తిప్పికొడుతున్నప్పటికీ... పొరపాటున ఏ మిసైల్, డ్రోన్ దాడి అయిన స్టేడియంలో పడితే... వేలల్లో ప్రేక్షకులు, పదుల సంఖ్యలోని విదేశీ, భారత క్రికెటర్లకు జరిగే ప్రాణనష్టం ఊహకందదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వినోదం కంటే కూడా దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమకు ప్రధానమని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అందుబాటులో ఉన్న బీసీసీఐ ఉన్నతాధికారులతో నేడు సమావేశమై ఐపీఎల్‌పై తుది నిర్ణయం తీసుకుంటారు. శుక్రవారం ఐపీఎల్ రద్దు లేదంటే వాయిదా ప్రకటన వెలువడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నేటి మ్యాచ్ యథాతథం ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాల్ని పాటిస్తాం. ఇప్పటివరకైతే కేంద్రం నుంచి మాకెలాంటి సూచనలు రాలేదు. ఆటగాళ్ల భద్రత, రవాణా తదితర పరిస్థితుల్ని సమీక్షించాకే తుది నిర్ణయం తీసుకుంటాం. లక్నోలో శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ఏ ఇబ్బందులు లేవు. కాబట్టి మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలే ఉన్నాయి. –ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఐపీఎల్లో నేడులక్నో X బెంగళూరువేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

స్టార్‌లింక్ శాట్‌కామ్ వచ్చేస్తోంది..!
న్యూఢిల్లీ: భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌కామ్) సర్వీసులు ప్రారంభించే దిశగా తదుపరి పూర్తి చేయాల్సిన ప్రక్రియపై అమెరికన్ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్‌లింక్ దృష్టి పెట్టనుంది. ఇప్పటికే టెలికం శాఖ (డాట్) నుంచి ప్రాథమిక అనుమతులు (లెటర్ ఆఫ్ ఇంటెంట్–ఎల్వోఐ) లభించడంతో, ఇక ఒప్పంద నియమాలను అంగీకరిస్తున్నట్లు కంపెనీ సంతకాలు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటుపైన నిర్దేశిత ఎంట్రీ ఫీజును చెల్లించాక తుది లైసెన్సు లభిస్తుందని పేర్కొన్నాయి. శాట్‌కామ్ స్పెక్ట్రం ధరను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసే ప్రక్రియ తుది దశలో ఉందని, ఎప్పుడైనా దీనిపై ప్రకటన వెలువడొచ్చని వివరించాయి. గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్), ఐఎస్పీ, వీశాట్ సేవలకు సంబంధించి స్టార్‌లింక్‌నకు ఎల్వోఐ జారీ అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డాట్ లైసెన్సుతో నెట్‌వర్క్‌ను నిర్మించుకోవడానికి స్టార్‌లింక్‌కు అనుమతులు లభించినా, కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) ఆమోదం, ప్రభుత్వం నుంచి స్పెక్ట్రం అవసరమవుతుంది. ఇప్పటికే వన్‌వెబ్, జియో శాటిలైట్‌కు లైసెన్స్.. ఇప్పటికే యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థలకు ఈ లైసెన్సులు వచ్చాయి. స్పెక్ట్రంను కేటాయించిన తర్వాత అవి సర్వీసులు ప్రారంభించనున్నాయి. భారత్‌లో లైసెన్సు కోసం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న స్టార్‌లింక్ ఈమధ్యే దేశీ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనితో భారత్‌లో తమ సొంత పంపిణీ, కస్టమర్ సర్వీస్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సిన భారం లేకుండా, సంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లోకి సేవలను విస్తరించే వీలు చిక్కుతుంది. సుదూరంగా ఉండే జియోస్టేషనరీ ఉపగ్రహాలపై ఆధారపడే సాంప్రదాయ శాటిలైట్ సర్వీసులతో పోలిస్తే భూమికి కొంత సమీపంగా (550 కి.మీ. పైన ) ఉండే ’లో ఎర్త్ ఆర్బిట్’ (లియో) శాటిలైట్లను ఉపయోగిస్తుంది. ప్రస్తు తం ఇవి 7,000 ఉండగా, వీటి సంఖ్య 40,000కు పెరగనుంది.

సుందరీమణులు సిద్ధం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలకు సమయం ఆసన్నమైంది. శనివారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో అంగరంగ వైభవంగా ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. మిస్ వరల్డ్ సంస్థతో కలిసి ప్రభుత్వం.. ఈ పోటీలు నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పోటీల నిర్వహణ ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పటంపై ప్రత్యేక స్థానం పొందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. విదేశీ ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించడం ద్వారా రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచ దేశాల సుందరీమణులతో పాటు అంతర్జాతీయ మీడియా సైతం రానుండటంతో రాష్ట్ర రాజధాని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ధింది. పటిష్ట భద్రత సహా అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి అయినట్లు అధికరావర్గాలు వెల్లడించాయి. పలు దఫాలుగా సీఎం సమీక్షలురాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకు, పెట్టుబడుల ఆకర్షణకు అందాల పోటీలను వినియోగించుకోవాలని భావిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే పలు దఫాలుగా సమీ క్షలు నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను సమీక్షించడంతో పాటు, కార్యక్రమా లు జరిగే ప్రదేశాలను కూడా సందర్శించారు. కంటెస్ట్లతోనూ ఒకసారి భేటీ అయ్యారు. పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రకృతి, పర్యా వరణ పరంగా అన్ని హంగులు ఉన్నా, తెలంగాణ ఆ రంగంలో వెనుకబడిందని భావిస్తున్న ప్రభుత్వం.. ఇకపై ‘తెలంగాణ జరూర్ ఆనా’(తప్పకుండా తెలంగాణ రండి) అనే నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేయా లని నిర్ణయించింది. తద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తోంది. సర్వాంగ సుందరంగా నగరంఈ పోటీల్లో పాల్గొనడానికి దాదాపు 100 మందికి పైగా సుందరీమణులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. నిర్వహణ సంస్థ మిస్ వరల్డ్ లిమిటెడ్‌కు చెందిన 28 మంది ప్రతినిధులు, మరో 17 మంది సహాయకులు కూడా వచ్చేశారు. రానున్న రెండురోజుల్లో మరికొంత మంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి వస్తారని నిర్వాహకులు తెలిపారు. అధికారులు నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా.. ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ విమానాశ్రయాల్లో కూడా ప్రపంచ సుందరి పోటీలకు వచ్చే వారికి ఆహ్వానం పలుకుతూ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయించింది. గత వారం రోజులుగా వస్తున్న అతిథులు అందరికీ తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతున్న పర్యాటక శాఖ, వారి బసకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేసింది. విదేశీ ప్రతినిధులు బస చేసిన ట్రైడెంట్ హోటల్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.అలరించిన రిహార్సల్స్ప్రపంచ సుందరి పోటీల కోసం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం రిహార్సల్స్ ఉత్సాహంగా కొనసాగాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న వివిధ దేశాల పోటీదారులు ఆకర్షణీయమైన వ్రస్తాలు ధరించి ర్యాంప్ వాక్ చేశారు. తమ ప్రతిభకు తగిన కార్యక్రమాలను ఎంపిక చేసుకుని ప్రాక్టీస్ చేశారు. ఇక సమయాను కూలంగా స్టేజ్ ఎంట్రీలు, గ్రూప్ మూవ్మెంట్స్, లైటింగ్, మ్యూజిక్ సెట్ అప్ తదితర అంశాలను నిర్వాహకులు పరిశీలించారు. ప్రధాన కార్యక్రమానికి ముందస్తుగా ప్రతి అంశాన్ని శ్రద్ధగా పరిశీలిస్తూ రిహార్సల్స్ పూర్తిచేశారు.సామాన్యులకూ వీక్షించే చాన్స్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెలా ఖరు వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని పరిమిత సంఖ్యలో సామాన్యులకూ కల్పించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టూరిజం వెబ్సైట్ ( https://tourism.telangana.gov. in/events&single/miss& world& event)లో రిజిస్టర్ చేసుకున్న వారికి పోటీలు జరిగే ఒక్కో కేంద్రంలో వెయ్యి మంది చొప్పున మొత్తం 5 కేంద్రాల్లో 5వేల మందికి మిస్ వరల్డ్ పోటీలను వీక్షించే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.

‘మీ బాధలు చూశా.. ఇబ్బందిపెట్టిన వారి పేర్లు రాసుకోండి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. రాజంపేట, మడకశిర, మున్సిపాలిటీలతో పాటు రామకుప్పం, రొద్దం మండలాల నేతలతో భేటీ అయిన ఆయన... ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను ప్రస్తావించారు. పచ్చగూండాల దాడులను ఎదుర్కొన్నవారిని అభినందించారు.‘‘రాష్ట్రంలో కూటమి సర్కార్.. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య తులసి మొక్కల్లా.. తెగువ చూపించి, విలువలతో కూడిన రాజకీయాలకు అర్ధం చెప్పి.. వాటిని చంద్రబాబుకు చూపారు.. నిలబడిన మీ అందరికీ హ్యాట్సాఫ్. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. కానీ వాటన్నింటినీ దిగజార్చారు చంద్రబాబు. ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.స్థానిక సంస్థల్లో చంద్రబాబు అనైతిక చర్యలు:రామకుప్పంతో ఒక ఎంపీటీసీ చనిపోతే, ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మొత్తం 16 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. అయినా అక్కడ చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి, ఆరుగురిని లాక్కునే ప్రయత్నం చేయడంతో పాటు, మన పార్టీ ఎంపీటీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. కోరం లేకపోయినా, కేవలం ఆరుగురు మాత్రమే అటువైపు వెళ్లినా, ఏకపక్షంగా డిక్లేర్ చేసుకున్నారు. రొద్దం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు వైఎస్సార్సీపీకి చెందిన వారే. అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశాడు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పని చేస్తూ.. మార్గం చూపాడు. పెనుకొండలో ఎంత ప్రలోభపెట్టినా ఒక్కరూ వెళ్లలేదు. మడకశిర ఎస్సీ నియోజకవర్గం. అక్కడా 15 మంది మన పార్టీ వారే. అక్కడా కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశాడు. అంత కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లు. కేవలం ముగ్గురు టీడీపీ. ఇంకొకరు ఇండిపెండెంట్. అయినా అక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు.చంద్రబాబు సిగ్గు పడాలిఏ నాయకుడు అయినా ఆదర్శంగా ఉండాలి. మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారు. చంద్రబాబు సిగ్గుపడి తల దించుకునేలా మన వాళ్లు రాజకీయాల్లో ఉన్నారు. మనం మాట తప్పలేదు. విలువలు వదల్లేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. రెండేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు. ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. కానీ, ఏనాడూ సాకు చూపలేదు. ఎగొట్టే పని చేయలేదు. మాట తప్పలేదు. చిక్కటి చిరునవ్వుతో ఉన్నాం. మ్యానిఫెస్టోలో చెప్సిన ప్రతి మాటకు కట్టుబడ్డాం. పథకాలు అమలు చేశాం. బటన్ నొక్కాం. మాట తప్పకుండా పని చేశాం కాబట్టే, కోవిడ్‌లో అలా పని చేశాం కాబట్టే.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచాంఅవకాశం ఉన్నా తాడిపత్రి వదులుకున్నాంనాడు కేవలం రెండు మున్సిపాలిటీల్లోనే టీడీపీకి మెజారిటీ వచ్చింది. తాడిపత్రి మున్సిపాలిటీలో మన పార్టీ వారు 16 మంది గెలిస్తే, టీడీపీ నుంచి 18 మంది గెలిస్తే.. ఎవరినీ లాక్కోవాలని చూడలేదు. అప్పుడు నేను మన ఎమ్మెల్యేను నేను హౌజ్ అరెస్టు చేశాను. దాంతో తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని టీడీపీ గెల్చింది. మనం ఆనాడు అలా రాజకీయం చేస్తే, అదే మాజీ ఎమ్మెల్యేను ఇప్పుడు తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు.మీ బాధలు చూస్తున్నాను.. హామీ ఇస్తున్నా..ఇవన్నీ చూశాక, నేను ఒకటే చెబుతున్నాను. కేవలం వైఎస్సార్సీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను. అందుకే జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను. మిమ్మల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకొండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం. ఈరోజు నువ్వు (చంద్రబాబు, పోలీసులు) చేస్తున్న దుర్మార్గం. వారు ఈరోజు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం. అది మామూలుగా ఉండదు.చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే..ఈ రోజు తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు. సంబంధం లేకున్నా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి, ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటాడు. ఇంకోరోజు సినీ నటి కేసు.ఈ రోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్ళినా.. ఏం జరుగుతుంది?. నా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు, మా రూ.26 వేలు ఏమయ్యాయని రైతులు, అవ్వలు వారి రూ.48 వేలు, యువత తమ రూ.36 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి, మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి.అన్ని వ్యవస్థలు నాశనం చేసేశారు..ఈరోజు అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియ లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్ద సక్రమంగా లేదు. గవర్నమెంటు బడులు రివర్స్లోకి వెళ్లాయి. పిల్లలు ఎదగాలంటే, ఆ కుటుంబం బాగు పడాలంటే, ఆ పిల్లవాడు బాగా చదవాలి. అందుకే ఫీజు చెల్లించాలి. మన ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్మెంట్ విద్యాదీవెన ఇచ్చాం. అందుకే ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు, అలా ఏటా రూ.2800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1100 కోట్లు ఇవ్వాలి. ఇచ్చాం. కానీ, ఈ పెద్దమనిషి చంద్రబాబు గత ఏడాది రూ.3900 కోట్లకు బదులు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ ఏడాది ఏమీ ఇవ్వలేదు.దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు.ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. మనం పక్కాగా అమలు చేశాం. ఇంకా ఆరోగ్య ఆసరా అమలు చేశాం. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు కావాలి. రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా ఇవ్వడం లేదు. దీంతో పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు ఈరోజు దళారుల పాలయ్యాడు. టమోటా కిలో రూ.2 కూడా రావడం లేదు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. మన ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా, ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది. సీజన్ ముగిసేలోగా వారిని ఆదుకునే వాళ్లం. ఇంకా మనం పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇస్తే, రూ.26 వేలు ఇస్తానన్న చంద్రబాబు, వారినీ మోసం చేశాడు.అవినీతి రాజ్యమేలుతోంది..విచ్చలవిడిగా ఎక్కడ చూసినా అవినీతి యథేచ్ఛగా రాజ్యమేలుతోంది. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం కోసం యూనిట్ విద్యుత్ కొనుగోలు కోసం సెకీతో రూ.2.49కి ఒప్పందం చేసుకుంటే, ఈ రోజు రూ.4.60కి ఒప్పందం చేసుకున్నారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూపాయికి రూ.3 వేల కోట్ల విలువైన భూమి. లులూ కంపెనీకి కూడా రూ.1500 కోట్ల విలువైన భూమి ఇచ్చారు. ఇక మద్యం. ఎక్కడ చూసినా అందుబాటు. ఊరూరా బెల్టుషాప్‌లు. ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. డోర్ డెలివరీ చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుకే. కానీ, ఎక్కువ ధరకు ఇస్తున్నారు. మనం వర్షాకాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 80 లక్షల టన్నులు స్టాక్ పెడితే, ఈ ప్రభుత్వం వచ్చీ రాగానే ఎక్కడికక్కడ అమ్మేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కంపెనీ నడపాలన్నా, ఎక్కడ ఏ మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే.బాండ్ల పేరుతో కొత్త అవినీతి:ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దాన్ని గత మన ప్రభుత్వం మీదకు నెడుతూ, అదే పనిగా తప్పుడు ఆరోపణలు. విమర్శలు చేస్తున్నారు. ఇంకా వాటికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా బాండ్ల పేరుతో అవినీతి. ఏపీ ఎండీసీలో కొత్తగా బాండ్లు జారీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. అలా కోరుకున్న వారికి గనులన్నీ ఇచ్చుకునే తంతు చేస్తున్నారు. ఇలాంటి అవినీతి వ్యవహారం ఇప్పటి వరకు చూడలేదు.మళ్లీ వచ్చేది మనమే:చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోము. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతాం.

పాకిస్థాన్‌కు భారత్ మరో షాక్.. ఇకపై అవన్నీ బంద్
పాకిస్థాన్‌కు భారత్ వరుస షాక్‌లు ఇస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్.. బాగ్లిహార్ ఆనకట్ట నుంచి కూడా పాక్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది. ఇప్పటికే పాకిస్థాన్‌పై పలు ఆంక్షలు విధించగా.. ఆ దేశంపై డిజిటల్ యుద్ధం కూడా ప్రారంభించింది. పాకిస్థాన్ ఓటీటీ, వెబ్‌సీరీస్‌లు, సినిమా పాటలపై నిషేధం విధించింది. పాడ్‌కాస్ట్‌లు, మీడియా కంటెంట్‌పై కూడా నిషేధం విధించాలని నిర్ణయించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని భారత సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది.పాక్‌ను అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తోంది. ముప్పేట దాడి చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ విడిచి పెట్టడం లేదు. తాజాగా, వినోద రంగం విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు సహా మీడియా కంటెంట్ ఏదీ కూడా ఇక భారత్‌లో అందుబాటులో ఉండదు. సబ్స్క్రిప్షన్, సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్ పొందుతున్న వారికీ ఇందులో ఏ మినహాయింపు లేదు. ఓటీటీలు పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో స్ట్రీమింగ్ చేయడానికి వీల్లేదు’ అని కేంద్రం స్పష్టం చేసింది.కాగా, దేశవ్యాప్తంగా 27 ఎయిర్ పోర్టులను మూసివేశారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాల రాకపోకలు రద్దు చేశారు. ఢిల్లీకి వచ్చే, వెళ్లే 90 విమానాలను రద్దు చేశారు. రద్దయిన విమానాల్లో ఐదు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి.
‘సాక్షి’పై కక్ష సాధింపు
మార్కెట్లకు సైబర్ దాడి ముప్పు
సుందరీమణులు సిద్ధం..
ఆపరేషన్ సిందూర్
మౌనమే మారణ హోమం
మందుపాతర్లు పేల్చిన మావోయిస్టులు
మోదీ చేస్తే గొప్ప... మేం చేస్తే తప్పా?
ఇది ప్రజల ప్రభుత్వం
ఐపీఎల్ వాయిదా?
అది అతని వ్యక్తిగత నిర్ణయం
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. శుభవార్తలు వింటారు
మొదట్నుంచి మీరే ఏదో రకంగా విదేశీయులకు హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూపిస్తున్నారుగా సార్!!
ఫ్లాష్ ఫ్లాష్: పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..30 మంది ఉగ్రవాదుల హతం
ఆపరేషన్ సిందూర్ అప్డేట్స్.. రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం
భారత్ దాడులు.. పాక్ ప్రధాని రియాక్షన్ ఇదే..
ప్రసాదంలో పాము పిల్ల
టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: హార్దిక్
MI vs GT: ముంబై జోరుకు బ్రేక్
పవన్, విజయ్ ఇద్దరూ ఒక్కటే.. అవగాహన శూన్యం: ప్రకాష్‌రాజ్
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్.. లైవ్
భారత్‌కే మా మద్ధతు- భారత్‌కు ప్రపంచ దేశాల మద్ధతు
భారత్ తడాఖా.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ విలవిల (ఫొటోలు)
Operation Sindoor: శాంతించండి.. ‘ఆపరేషన్ సిందూర్’పై.. భారత్‌కు చైనా రిక్వెస్ట్
అక్కడ జరిగిందేమిటి?.. మీరు చేస్తున్నదేమిటి?
కన్నీటి నిశ్చితార్థం
Operation Sindoor: ‘ఆపరేషన్ సింధూర్’ అంటే ఏమిటి?
ఆపరేషన్ సిందూర్.. అర్ధరాత్రి ఎప్పుడేం జరిగింది..
భారత్ విమానాలు కూల్చివేత అంటూ పాక్ ప్రచారం.. నిజమెంత?
ఒక తార పుట్టింది!
భారత్ మెరుపు దాడులపై స్పందించిన ట్రంప్, పాక్
సినిమా

ఆ దర్శకుడు నన్ను కొట్టలేదు.. బాగా చూసుకున్నాడు: హీరోయిన్
తమిళ దర్శకుడు బాలా గురించి ఇప్పటి జనరేషన్ కి పెద్దగా తెలియదు. ఎందుకంటే అప్పట్లో శివపుత్రుడు, సేతు, నేనే దేవుడిని, వాడు వీడు, పరదేశి తదితర చిత్రాలతో ఆకట్టుకున్నారు. తర్వాత కాలంలో పూర్తిగా దర్శకత్వం తగ్గించేశారు. అయితే సెట్ లో హీరోహీరోయిన్లని ఈయన కొడతారనే టాక్ ఉంది. ఇప్పుడు ఈ విషయమై యువ హీరోయిన్ ఇవానా రియాక్ట్ అయింది.'లవ్ టుడే' సినిమాతో హీరోయిన్ గా ఫేమస్ అయిన ఇవానా.. అంతకు ముందే తమిళంలో బాలా దర్శకత్వంలో 'నాచియార్'(తెలుగులో ఝాన్సీ) సినిమాలో ఈమె ఓ పాత్ర పోషించింది. అయితే ఈ మూవీ చేసేటప్పటికీ తాను 12వ తరగతి చదువుతున్నానని, సెట్ అంతా చాలా కొత్తగా అనిపించేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న భారీ సినిమా) అయితే బాలా తనని ఎప్పుడు కొట్టలేదని, షూటింగ్ టైంలో చాలా బాగా చూసుకున్నారని ఇవానా చెప్పుకొచ్చింది. కాకపోతే యాక్టింగ్ స్కూల్ లా సెట్ వాతావరణం అంతా చాలా స్ట్రిక్ట్ గా ఉండేదని అప్పటి విషయాల్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది.'లవ్ టుడే' తర్వాత అదే హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'లో అతిథి పాత్రలో కనిపించింది. తెలుగులోనూ ఈమెకు రెండు చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. అందులో ఒకటైన '#సింగిల్' ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారం (మే 09) థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: నా కొడుకు దేవుడితో మాట్లాడాడు.. 'హిట్ 3' డైరెక్టర్ ట్వీట్)

నా కొడుకు దేవుడితో మాట్లాడాడు.. 'హిట్ 3' డైరెక్టర్ ట్వీట్
తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఒక్కొక్కరూ ఒక్కో రకమైన అనుభూతికి లోనవుతారు. 'హిట్ 3' దర్శకుడు శైలేష్ కొలను కూడా ఇప్పుడు అలాంటి అనుభూతికి లోనయ్యాడు. ఈసారి దర్శనం మాత్రం జీవితంలో మర్చిపోలేనని, అదొక అనిర్వచనీయమైనది అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఆసక్తికర ట్వీట్ చేశాడు.(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. పాక్ నటులపై నిషేధం) 'నా జీవితంలోనే ఈ రోజు (మే 08) స్వామి దర్శనం అద్భుతంగా జరిగింది. థ్యాంక్స్ టూ అభయ్(కొడుకు). నిన్న రాత్రి స్వాతి(భార్య)-నేను మా రూంలో నిద్రపోతుంటే.. అభయ్ ఎవరితోనూ మాట్లాడుతున్నట్లు అనిపించి వచ్చి చూశాం. చేతిలో స్వామి కీ చైన్ పట్టుకుని దేవుడితో మాట్లాడుతూ కనిపించాడు. తనతో పాటు ఇంటికి వచ్చేయమని వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నాడు. ఇదంతా చూసి నాకు చాలా ముద్దుగా అనిపించింది. ఈ రోజు ఉదయం దర్శనం ముగిసిన తర్వాత బయటకొచ్చేస్తుంటే అయ్యగారు(దేవుడు) నుంచి మరోసారి పిలుపు వచ్చింది. దాదాపు 10 నిమిషాల పాటు గర్భగుడిలో కూర్చున్నాం. ఇదంతా అనిర్వచనీయమైన అనుభూతి. అభయ్ కి దేవుడి ఇచ్చిన బహుమతిలా అనిపించింది. నమో వెంకటేశాయ' అని శైలేష్ కొలను రాసుకొచ్చాడు.స్వతహాగా డాక్టర్ అయిన శైలేష్ కొలను.. ఆస్ట్రేలియాలో జాబ్ చేశాడు. కానీ సినిమాలపై ఆసక్తితో తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. 2020లో 'హిట్' మూవీతో సక్సెస్ అందుకున్నాడు. దీని తర్వాత హిట్ 3, సైంధవ్, తాజాగా హిట్ 3 చిత్రాలతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశాడు. త్వరలో కొత్త ప్రాజెక్ట్ గురించి ప్రకటించనున్నాడు.(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న భారీ సినిమా) Had the best darshan of my life at Tirumala today. Thanks to Abhay. Swathi and I were in our room last night and suddenly heard Abhay talking something. We were surprised to see him hold a swamy keychain in his hand and talking to it asking the lord to come home with him and live… pic.twitter.com/6grOp80qvy— Sailesh Kolanu (@KolanuSailesh) May 8, 2025

రజనీ,నాగార్జున... ఎన్టీయార్ , హృతిక్ ‘వార్’ తప్పదా?
భారీ తారాగణం, సాంకేతిక నిపుణులు, భారీబడ్జెట్తో రూపొందే సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాలు రెండు ఒకే సమయంలో విడుదలయే పరిస్థితి ఏర్పడితే అది మరింత ఉత్కంఠ కలిగించేదే. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకూ, దక్షిణాది సినిమాలకు నడుమ ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సౌత్ సినిమాలు పాన్ ఇండియా మూవీస్‌గా జాతీయస్థాయిలో సత్తా చాటడం మొదలుపెట్టాయో... అప్పటి నుంచి వీటి మధ్య పోటీ కూడా సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఓ బాలీవుడ్ సినిమాతో మరో దక్షిణాది సినిమా విడుదల తేదీల మధ్య అలాంటి ఉత్కంఠే నెలకొంది.తమిళ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కూలీ(Coolie) పేరుతో ఓ మాస్ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు వచ్చింది ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్రలు కూడా నటిస్తూండడంతో, ఇది మల్టీ స్టారర్ హోదా తెచ్చుకుంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఆగస్ట్ 14న విడుదల చేస్తారని అంచనాలు ఉన్నాయి. నిజానికి కూలీ సినిమా సమ్మర్లో రిలీజ్ అనుకున్నారు కానీ అది తర్వాత ఆగస్ట్‌కు మారింది. లోకేష్ గత సినిమాల కంటే ఈ సినిమాకు ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడని అందుకే ఈ ఆలస్యం అంటున్నారు.మరోవైపు బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ అగ్రనటుడు జూ.ఎన్టీఆర్‌ల సెన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం వార్ 2(War 2) కూడా అదే సమయంలో రిలీజ్ అవనుంది. దీనితో కూలీ అనుకున్న టైమ్ కి వస్తాడా రాడా అనే సందేహాలు రజనీకాంత్ అభిమానుల్లో మొదలయ్యాయి. అన్ని హంగులతో వార్ 2 భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మక సంస్థ యష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ జోడీ కట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయ్. మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీ ఆగస్టు 14గా ఇప్పటికే ప్రకటించేశారు. అనుకోని అవాంతరం ఏర్పడితే తప్ప అది మారే అవకాశం కనిపించడం లేదు, సో అదేన రోజు కూలీ వస్తే నేరుగా క్లాష్ తప్పదు. రెండు సినిమాల జోనర్ వేరువేరు..అయినప్పటికీ... ఒకవేళ కూలీ నిజంగానే ఆగస్ట్ 14న వస్తే, బాక్సాఫీస్ వద్ద సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ యుద్ధం జరుగుతుందని అనొచ్చు. ఒకవైపు రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర వంటి సీనియర్ హీరోలు మరోవైపు ఎన్టీఆర్, హృతిక్‌ల వంటి ఆ తర్వాతి తరం హీరోల మధ్య ఈ పోటీ ఫ్యాన్స్ కు సినీ పండితులకు ఖచ్చితంగా సెంట్రాఫ్ టాపిక్స్ అవుతుంది అంతేకాదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యి కలెక్షన్ల వేట మొదలుపెడితే అది కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశాలూ లేకపోలేదు.

'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. పాక్ నటులపై నిషేధం
మన దేశం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వల్ల 80 మంది పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ పై పాక్ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ కామెంట్స్ చేయడంపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఖండించింది. వీరిని తక్షణమే బాలీవుడ్ నుంచి నిషేధిస్తున్నట్లు లేఖ విడుదల చేసింది. ఇలాంటి వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వొద్దని కోరింది.'వారి (ఫవాద్-మహిరా) కామెంట్స్ మన దేశాన్ని అగౌవరపరిచేలా ఉన్నాయి. అలానే ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయకులని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులని కూడా అవమానించేలా ఉన్నాయి. మన ఇండస్ట్రీలో పనిచేసే పాక్ నటీనటులు, చిత్రనిర్మాతలపై పూర్తిగా నిషేధం విధించాలి. భారతీయులెవరూ వీరిని అభిమానించొద్దు'(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' టైటిల్ కోసం క్యూ కట్టిన నిర్మాతలు)'కళ పేరుతో ఇలాంటి నటీనటుల్ని గుడ్డిగా మద్దతు ఇవ్వడం జాతీయ గౌరవాన్ని అగౌవరపరచం లాంటిదే. చిత్రపరిశ్రమ దీన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం ఐక్యంగా నిలబడదాం' అని ఆల్ ఇండియా సినీ వర్కర్క్ అసోసియేషన్ పేర్కొంది.గత నెలలో పహల్గామ్ లో జరిగిన దాడికి ప్రతీకార చర్యగా.. మంగళవారం అర్థరాత్రి పాక్ ఆక్రమిత కశ్మీర్ పై 'ఆపరేషన్ సిందూర్' పేరుతో దాడి చేసింది. 9 స్థావరాలపై దాడి చేయగా 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇకపోతే ఫవాద్ ఖాన్ నటించిన హిందీ సినిమా 'అబిర్ గులాల్'. మే 9న రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడా సినిమా అటకెక్కిపోయినట్లే.(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న భారీ సినిమా)
న్యూస్ పాడ్‌కాస్ట్

పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం
క్రీడలు

ధర్మశాలలో బ్లాక్ అవుట్..? పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మ్యాచ్ రద్దు
ఐపీఎల్-2025లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రద్దు అయింది. భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను నిర్వహకులు రద్దు చేశారు. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నడుమ స్ధానికంగా బ్లాక్ అవుట్ విధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ స్వయంగా రంగంలోకి దిగి ప్రేక్షకులను స్టేడియం నుంచి బయటకు పంపించారు. జమ్మూలో జారీ చేయబడిన రెడ్ అలర్ట్ ఆధారంగా ముందు జాగ్రత్త చర్యగా ఈ మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ధుమాల్ పేర్కొన్నారు. వర్షం కారణంగా గంట ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్ స్కోర్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య ఔటైన వెంటనే స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ఫ్లడ్ లైట్ల సమస్య తలెత్తడంతో మ్యాచ్ ఆగిపోయిందని అంతా భావించారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఉద్డేశ్వపూర్వకంగానే ఫ్లడ్ లైట్స్ ఆపి, మ్యాచ్ రద్దు చేశారు. అయితే టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగానే మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టుగా బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. మ్యాచ్ రద్దు కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు చెరో పాయింట్ లభించింది.#WATCH | Dharamshala: Sudhir, a cricket fan says, "The match has been called off because of security reasons. What do we have to be afraid of? We are in our country. If anyone, it should be Pakistan who should be afraid. Bharat Mata ki Jai." https://t.co/N3YDWolW07 pic.twitter.com/QjiNCQn9sZ— ANI (@ANI) May 8, 2025IPL Chairman requesting fans to leave the Dharamshala Stadium. pic.twitter.com/9rVqVfPa12— Bhagavad Gita 🪷 (@Geetashloks) May 8, 2025

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. దుబాయ్ వేదికగా పీఎస్ఎల్ మ్యాచ్‌లు?
పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరిట దాయాది పాకిస్తాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తొలుత మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇండియన్ ఆర్మీ.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది.ఈ ఆపరేషన్ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం బదులుగా పాకిస్తాన్ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడటంతో పాటు.. మిసైళ్లతో దాడికి దిగింది. ఇందుకు భారత్ సైతం ధీటుగా బదులిస్తోంది. భారత బలగాలు పాక్ మిస్సైల్ ను గాల్లోనే పేల్చివేశాయి. పాక్ పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. లాహోర్ లోని కీలక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉండే రావల్పిండిపై కూడా డ్రోన్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో ఓ డ్రోన్ కూలిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇదే మైదానంలో గురువారం రాత్రి పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్ జరగాల్సి ఉంది.షెడ్యూల్ ప్రకారం పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ తలపడాల్సింది. కానీ రావల్పిండిలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాయిదా వేసింది. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు పీసీబీ లహోర్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. పీఎస్ఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లను వేరో చోటకు తరలించాలని పీసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దుబాయ్ లేదా దోహాలను వేదికగా మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించాలని పీసీబీ భావిస్తోందంట. దీనిపై ఒకట్రెండు రోజుల్లో పీసీబీ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. అయితే టోర్నీని వేరో చోటకు మార్చడం పాకిస్తాన్‌కు అదనపు ఖర్చుతో కూడుకున్న వ్యవహరం. మరి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏమి చేస్తుందో వేచి చూడాలి.

IPL 2025: ఆయుశ్ మాత్రే నుంచి మయాంక్ అగర్వాల్ వరకు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గాయపడిన ఆటగాళ్ల సంఖ్య చాలా పెద్దగా ఉంది. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ సీజన్లో 17 మంది ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. వీరికి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను ఆయా జట్లు ఇదివరకే ప్రకటించాయి. ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగా వచ్చిన వారిలో చాలా మంది తుది జట్లలో చోటు దక్కించుకుని మ్యాచ్‌లు ఆడారు. కొందరికి ఇంకా అవకాశాలు రాలేదు. సీజన్ ప్రారంభానికి ముందే గాయాల కారణంగా వైదొలిగిన వారిలో హ్యారీ బ్రూక్, ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. మిగిలిన ఆటగాళ్లు సీజన్ మధ్యలో గాయపడి లీగ్ నుంచి వైదొలిగారు.ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి గాయాల కారణంగా వైదొలిగిన ఆటగాళ్లు..ఆర్సీబీదేవ్దత్ పడిక్కల్- మయాంక్ అగర్వాల్ (రీప్లేస్మెంట్)సీఎస్కేరుతురాజ్ గైక్వాడ్- ఆయుశ్ మాత్రేగుర్జప్నీత్ సింగ్- డెవాల్డ్ బ్రెవిస్వన్ష్ బేడి- ఉర్విల్ పటేల్ముంబై ఇండియన్స్అల్లా ఘజన్ఫర్- ముజీబ్ రెహ్మాన్లిజాడ్ విలియమ్స్- కార్బిన్ బాష్విజ్ఞేశ్ పుతుర్- రఘు శర్మకేకేఆర్ఉమ్రాన్ మాలిక్- చేతన్ సకారియాగుజరాత్ టైటాన్స్గ్లెన్ ఫిలిప్స్- దసున్ షనకపంజాబ్ కింగ్స్గ్లెన్ మ్యాక్స్‌వెల్- మిచెల్ ఓవెన్లక్నో సూపర్ జెయింట్స్మొహిసిన్ ఖాన్- శార్దూల్ ఠాకూర్ఎస్ఆర్హెచ్బ్రైడన్ కార్స్- వియాన్ ముల్దర్ఆడమ్ జంపా- స్మరణ్ రవిచంద్రన్‌స్మరణ్ రవిచంద్రన్- హర్ష్ దూబేఢిల్లీ క్యాపిటల్స్హ్యారీ బ్రూక్- సెదిఖుల్లా అటల్రాజస్థాన్ రాయల్స్నితీశ్ రాణా- లుహాన్ డ్రి ప్రిటోరియస్సందీప్ శర్మ- నండ్రే బర్గర్రీప్లేస్మెంట్ ఆటగాళ్ల ద్వారా అత్యధిక లబ్ది పొందింది సీఎస్కే. రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ జట్టులో స్థిరపడిపోయారు. వచ్చీ రావడంతోనే అవకాశం దక్కించుకున్న ఉర్విల్ పటేల్ కూడా తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు.

పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ రద్దు
IPL 2025 PBKS vs DC Live Updates: పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ రద్దుధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రద్దు అయింది. భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను నిర్వహకులు రద్దు చేశారు.పంజాబ్ తొలి వికెట్ డౌన్..ప్రియాన్ష్ ఆర్య రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన ఆర్య.. టి. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10.1 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య హాఫ్ సెంచరీపంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య హాఫ్ సెంచరీ సాధించాడు. ఆర్య 56 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 9 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. క్రీజులో ఆర్యతో పాటు ప్రభుసిమ్రాన్ సింగ్(45) ఉన్నారు.6 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 69/06 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో ఆర్య(42), ప్రభ్సిమ్రాన్ సింగ్(26) ఉన్నారు.2 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 20/02 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య(12), ప్రభ్సిమ్రాన్ సింగ్(3) ఉన్నారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్..ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మరి కాసేపట్లో టాస్అభిమానులు గుడ్ న్యూస్. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ 8:30 గంటలకు ప్రారంభం కానుంది. వర్షం తగ్గుముఖం పట్టడంతో 8:00 గంటలకు టాస్ పడనుంది.టాస్ మరింత ఆలస్యం..ధర్మశాలలో ప్రస్తుతం వర్షం భారీగా కురుస్తోంది. దీంతో టాస్ మరింత ఆలస్యం కానుంది.ఐపీఎల్-2025లో ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. ప్రస్తుతం వర్షం ఆగినప్పటికి, మైదానాన్ని మాత్రం కవర్లతో కప్పి ఉంచారు. దీంతో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది.
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 411.97 పాయింట్లు లేదా 0.51 శాతం నష్టంతో 80,334.81 వద్ద, నిఫ్టీ 140.60 పాయింట్లు లేదా 0.58 శాతం నష్టంతో 24,273.80 వద్ద నిలిచాయి.గిన్ని ఫిలమెంట్స్, పావ్నా ఇండస్ట్రీస్, శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్, గ్రిండ్‌వెల్ నార్టన్, శ్రీరామ్ పిస్టన్స్ & రింగ్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరగా.. అవలోన్ టెక్నాలజీస్, గోధా క్యాబ్కాన్ అండ్ ఇన్సులేషన్, రవీంద్ర ఎనర్జీ, కృతి ఇండస్ట్రీస్ (ఇండియా), డీబీ కార్ప్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

Operation Sindoor: కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు..
భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో పాక్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. గురువారం పాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ గంటసేపు నిలిచిపోయింది. కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో డ్రోన్ దాడులు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో భయాందోళనలు చెలరేగాయి. దీంతో పాకిస్తాన్ బెంచ్ మార్క్ ఇండెక్స్ కేఎస్ఈ -30 గురువారం 7.2 శాతం వరకు పడిపోయి.. వరుసగా రెండవ సెషన్లో కూడా భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది.ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, కేఎస్ఈ 100 13 శాతం క్షీణించగా, కేఎస్ఈ 30 ఇప్పటివరకు 14.3 శాతం పడిపోయింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ జరిపిన దాడుల నేపథ్యంలో పాక్ బెంచ్ మార్క్ షేర్ ఇండెక్స్ బుధవారం దాదాపు 6 శాతం నష్టంతో ప్రారంభమై, చివరకు 3.1 శాతం నష్టంతో సెషన్ ముగిసింది. ఈ రోజు కూడా భారీ నష్టాలనే చవిచూడాల్సి వచ్చింది.

రైల్వే టికెట్‌తో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 50వేలు
టికెట్ లేకుండా ట్రైన్లలో ప్రయాణించేవారి సంఖ్య చాలానే ఉంది. దీనిని నివారించడానికి ఇండియన్ రైల్వే ఓ విన్నూత చర్యకు శ్రీకారం చుట్టింది. ప్రతి రోజూ సుమారు 24 మిలియన్ల మంది ప్రయానికులకు సేవలందిస్తున్న ముంబై డివిజన్.. ఎఫ్‌సీబీ ఇండియా యాడ్ ఏజన్సీతో జతకట్టి.. 'లక్కీ యాత్ర' అనే ప్రచారం ప్రారంభించింది.ఇండియన్ రైల్వే.. ప్రారంభించిన ఈ లక్కీ యాత్ర ప్రచారంలో భాగంగా ప్రతి రోజూ ఒక ప్రయాణికునికి రూ. 10వేలు, వారానికి ఒక ప్రయాణికునికి రూ. 50వేలు ఫ్రైజ్ మనీ అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ టికెట్ కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం ప్రారభించడం జరిగింది. ఇది వచ్చే వారం నుంచి ప్రారంభమై ఎనిమిది వారాలు పాటు అమలులో ఉంటుందని తెలుస్తోంది.టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఎక్కువ కావడం వల్ల.. ఇండియన్ రైల్వే ప్రతి ఏటా కోట్ల రూపాయలను కోల్పోతోంది. అయితే ఇప్పుడు ప్రైజ్ మనీ అనే ప్రచారం ప్రారభించడంతో.. ప్రైజ్ కోసమైనా కొందరు ట్రైన్ టికెట్ కొనుగోలు చేస్తారు. ప్రైజ్ మనీ కేవలం ట్రైన్ టికెట్ తీసుకునే వారికి మాత్రమే కాకుండా.. సీజన్ పాస్‌లు తీసుకున్నవారికి కూడా లభిస్తుంది.ప్రతిరోజు.. సబర్బన్ స్టేషన్లో టికెట్ ఎగ్జామినర్ ఒక ప్రయాణికుడిని ఎంపిక చేస్తారు. అతడు చెల్లుబాటు అయ్యే రోజువారీ టికెట్ లేదా సీజన్ పాస్‌ను కలిగి ఉన్నట్లయితే.. రూ. 10,000 నగదు బహుమతిని అక్కడికక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే వారానికి ఒకరిని ఎంపిక చేసి రూ. 50000 ప్రైజ్ మనీ అందిస్తారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్సెంట్రల్ రైల్వే ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌ల సమయంలో రోజుకు 4,000 నుంచి 5,000 మంది టికెట్ లేని ప్రయాణికులను పట్టుకుంటుంది. టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్యను తగ్గించడానికి.. 'లక్కీ యాత్ర' అనే ప్రచారం ప్రారంభమైంది. దీని ద్వారా ఎక్కివమందిని టికెట్స్ కొనేలా చేయొచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రచారం ప్రస్తుతం ముంబైలో మాత్రమే అమలులో ఉన్నట్లు తెలుస్తోంది.

‘హిందీ నేర్చుకుని ఉంటే రూ.లక్ష కోట్లు సంపాదించేవాడిని’
దేశ టెలికం పరిశ్రమలో ఒకప్పుడు రారాజులా వెలుగొందిన పారిశ్రామికవేత్త ఆయన. సొంతంగా రెండు ఐలాండ్లు.. విదేశాలలో వందల కోట్ల విలువైన విలాస భవనాలతో రాజభోగం అనుభవించిన ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ తర్వాత కాలం కలిసిరాక నష్టాలలో కూరుకుపోయి దివాళా తీశారు. జీవితంలో ప్రతిఒక్కరికీ గతంలో చేసిన పొరపాట్ల గురించి పశ్చాత్తాపం ఉంటుంది. అప్పుడా తప్పు చేయకపోయింటే బాగుండు అని అనుకుంటుంటారు. శివశంకరన్ కూడా అలాంటి పశ్చాత్తాపాలనే వ్యక్తం చేశారు.రెండే తప్పులుదివాళా తీసిన సెల్యులార్ ఆపరేటర్ ఎయిర్ సెల్ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ ఇటీవల తనలో ఇంకా ఉన్న పశ్చాత్తాపాల గురించి నోరు విప్పారు. రణ్వీర్ అల్లాబాడియాతో కలిసి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఈ పారిశ్రామికవేత్త రూ.7,000 కోట్లు కోల్పోయి తిరిగి పుంజుకున్న తన ప్రయాణం గురించి వెల్లడించారు. తన జీవితకాల అదృష్టాన్ని పోగొట్టిన రెండు చిన్న తప్పులను బయటపెట్టారు. అవి ఒకటి హిందీ నేర్చుకోకపోవడం, మరొకటి తన కెరీర్ ప్రారంభంలో ఢిల్లీ లేదా ముంబై వంటి ప్రధాన నగరాలకు మకాం మార్చకపోవడం.హిందీ నేర్చుకుని ఉంటే..తాను హిందీ నేర్చుకుని ఉంటే 140 కోట్ల మంది భారతీయులను ఆకర్షించేవాడినని శివశంకరన్ అన్నారు. కచ్చితంగా రూ.లక్ష కోట్లు సంపాదించేవాడిని. భౌగోళికం, భాష తనను భారతదేశ అధికార కారిడార్ల నుంచి ఎలా దూరం చేశాయో స్వయంకృషితో ఎదిగిన ఈ బిజినెస్ టైకూన్ వివరించారు.అప్పు ఎప్పుడూ చేయలేదు'నేను ఎప్పుడూ అప్పులు చేయాలనుకోను. నేను డబ్బును ఆకర్షిస్తాను" అని శివశంకరన్ అన్నారు. 68 ఏళ్ల జీవితంలో తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ రూ.100 కూడా అప్పు తీసుకోలేదన్నారు. వ్యవస్థాపక ప్రవృత్తి, బిజినెస్ పరిజ్ఞానం ఉన్నప్పటికీ అతిపెద్ద డీల్స్ చేజారడానికి కారణం తనకు దూరదృష్టి లేకపోవడం కాదని, బహుశా కనెక్షన్ లేకపోవడం వల్ల కావచ్చునని వెల్లడించాడు.రియల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబడులుదివాలా దాఖలు చేయడానికి ముందు తన అత్యంత ఖరీదైన కొనుగోళ్లను కూడా శివశంకరన్ వెల్లడించాడు. రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టానని, ప్రపంచవ్యాప్తంగా అనేక ఇళ్లు కొన్నానని చెప్పారు. సీషెల్స్ లో తనకు రెండు ద్వీపాలు ఉండేవని, వాటిని ఇప్పుడు అమ్మేశానని వెల్లడించారు. రిపబ్లిక్ ఆఫ్ శివ పేరుతో సొంత దేశంలా ఏర్పాటు చేసుకుని అక్కడ నివాసం ఉండాలని ఈ దీవులను కొనుగోలు చేశానని చెప్పారు. అన్ని ఖండాల్లో నివాసం ఉండాలనే కోరికతో సీషెల్స్, అమెరికా, కెనడా, లండన్‌లో ఇళ్లు కొన్నట్లు శివశంకరన్ చెప్పుకొచ్చారు.
ఫ్యామిలీ

వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా!
మనం సాధారణంగా ఏదైనా పిండి వంటలు చేసినపుడు ఎక్కువ వాడుతుంటాం. ముఖ్యంగా జంతికలు, కారప్పూస, అరిసెలు, బూందీ తదితర పిండివంటలు చేయాలంటే ఆయా పదార్థాలను నూనెలో ఫ్రై చేస్తుంటాం. అలాగే పకోడీ, బజ్జీ లాంటి స్నాక్స్ చేసినప్పుడు కూడా డీప్ ప్రై చేస్తాం. అప్పుడు వాటికి సంబంధించిన మడ్డి, చిన్న చిన్న తునకలు నూనెలో మిగిలిపోతాయి. అవి మాడిపోయి నల్లగా కనిపిస్తుంటాయి. అంతేకాదు అవి ఫ్రెష్‌గా వేయిస్తున్న వాటికి అంటుకుని చూడ్డానికి బాగా అనిపించవు. మరి అలాంటి నూనెను పూర్తిగా క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? ఒకసారి వాడిన నూనెను పాప్‌కార్న్ పిండి సహాయంతో సులభంగా శుభ్రం చేయవచ్చని మీకు తెలుసా? ఈ ఈజీ టిప్ గురించి తెలుసుకుందాం.పిండి వంటలు, స్నాక్స్ చేసినపుడు వండినపుడు కొంత నూనె మిగిలిపోతుంది. అలాగే గిన్నె అడుగు భాగంలో కొంత వేస్ట్, మడ్డి లాంటి పేరుకుపోతుంది. ఈ నూనెని మళ్ళీ వాడాలన్నా, అందులో కొన్ని మిగిలిన పదార్థాలను క్లీన్ చేయడం,నూనెను ఫిల్టర్ చేయడం కొంచెం కష్టమైన పనే. ఆయిల్ ఫిల్టర్‌తో వడ కట్టినా, పల్చటి బట్టతో వడపోసినా పూర్తిగా శుభ్రం కాదు. మరి అలాంటి నూనెని ఎలా క్లీన్ చేయాలి. దీనికి సంబంధించిన ఒక వీడియో ఎక్స్‌లో ఆసక్తికరంగా మారింది. దీనికి ఏకంగా 16.4 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.तेल से गंदगी/अवशेष साफ करने का ये सबसे सही जुगाड़ है। pic.twitter.com/ieS62WWQaM— Dr. Sheetal yadav (@Sheetal2242) May 7, 2025 "> కార్న్‌ఫ్లోర్ చిట్కాముందుగా కార్న్‌ఫ్లోర్ తీసుకోండి. అందులో కొద్దిగా నీరు కలిపి బజ్జీ పిండిలా చేయాలి. దీనిని మరిగే నూనెలో వేయండి. అప్పుడు అది నూనె అడుగు భాగంలో ముద్దలాగా మారి, నూనెలోని మడ్డిని, మాడిపోయిన పిండి వంటల తునకలను ఎట్రాక్ట్ చేస్తుంది. మొక్క జొన్న పిండి ముద్దను అలా గుండ్రంగా తిప్పాలి. అంతే ఈజీగా నూనెలోని మొత్తం అవశేషాలు అయస్కాంతం లాగా పని చేస్తుంది. డస్ట్ అంతా పిండిముద్దకు అతుక్కుని పోయి.. నూనె పూర్తిగా శుభ్రపడి , తేటగా కనిపిస్తుంది. ఆ ముద్దను పారవేసి దీనికి మిగిలిన వంటల్లో వాడుకోవచ్చు. ఇలా చేయడం నూనెలోని మాడు వాసన కూడా పోతుంది.జపాన్‌లో, టెంపురా చెఫ్‌లు 100 సంవత్సరాలుగా నూనెను శుభ్రం చేయడానికి స్టార్చ్‌ను ఉపయోగిస్తున్నారు. మరిగించిన నూనెలో మళ్లీ వేయించడం వల్ల అక్రిలామైడ్ వంటి కేన్సర్ కలిగించే సమ్మేళనాలు రెట్టింపు అవుతాయి. అయితే FDA డేటా ప్రకారం కార్న్‌స్టార్చ్ ఆ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే కార్న్‌స్టార్చ్ ఫ్రైస్‌తో శుభ్రం చేసిన నూనె ఫిల్టర్ చేయని నూనెతో పోలిస్తే 25 శాతం తక్కువ తడిగా ఉంటుందట.ఇదీ చదవండి: World Ovarian Cancer Day : సైలెంట్‌గా..స్త్రీలకు గండంగా!నోట్ : ఆయిలీ ఫుడ్స్, వేపుళ్లు ఆరోగ్యానికి హానికరం. అందులోనూ ఒకసారి వాడిన నూనెని పదే పదే వేడి చేయడం ఆరోగ్యానికి అంత మంచిది. ఎక్కువ సార్లు మరిగించిన పరిమితంగా వాడుకోవడం ఉత్తమం. వీలైతే అలాంటి ఆయిల్‌ను ఉపయోగించక పోవడమే మంచిది. ముందుగానే తక్కువ నూనెలో వేయించేలా జాగ్రత్తపడాలి.

నిండుగర్భిణి జోష్‌ఫుల్ స్టెప్పులు..చూస్తే షాకవ్వడం ఖాయం!
ప్రెగ్నెంట్‌తో ఉన్న మహిళలు ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిసిందే. నడవడం కూడా చీమచిటుక్కు మనకుండా సుతారంగా నడుస్తారు. కొందరు కొద్దిపాటి శారీరక శ్రమ మంచిదని నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు కూడా చేస్తుంటారు. అంతేతప్ప మైకేల్ జాక్సన్ మాదిరిగా బాడీ అంతా స్ప్రింగ్‌లు ఉన్నట్లుగా డ్యాన్స్‌లు చేసే డేరింగ్ మాత్రం చేయరు. కానీ ఇక్కడొక మహిళ నిండు గర్భంతో ఏ రేంజ్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిందో చూస్తే.. కళ్లు ఆర్పడమే మర్చిపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో సునిధి చౌహాన్ అనే నిండు గర్భిణి బాలీవుడ్ ఫేమస్ సాంగ్ 'డింగ్ డాంగ్ డోల్'కి ఉత్సాహభరితంగా డ్యాన్స్ చేస్తుంది. తన కొరియోగ్రాఫర్ సాయంతో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది వీడియోలో. చూడటానికి ఆమె తొమ్మిదోనెల గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె మాత్రం ఎంతో జోష్‌గా తన కొరియోగ్రాఫర్‌ని బీట్చేసేలా నృత్యం చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు మాతృత్వానికి ఉత్సాహభరితమైన నివాళిగా అభివర్ణించారు. మరికొందరు ఈ సమయంలో ఇలాంటి అవసరమా..? అని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఒక డాక్టర్ ఆ పోస్టులకు స్పందిస్తూ..ఆలోచనాత్మక వివరణను అందించారు. గర్భంతో ఉన్నప్పుడూ మహిళలు డ్యాన్స్‌లు చేయొచ్చా..? అంటే..అవుననే అంటానని చెప్పారు. ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే నిర్భయంగా ఎలాంటి ఉత్సాహభరితమైన యాక్టివిటీల్లో అయినా పాల్గొనవచ్చు అని అన్నారు. అంతేగాదు శారీరక శ్రమ అనేది గర్భస్రావం, తక్కువ బరువుతో జననం లేదా ముందస్తు ప్రసవ ప్రమాదం వంటివి పెంచవని తేల్చి చెప్పారు. ఆయా మహిళల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్యులు జాగ్రత్తలు చెబుతారే తప్ప, అందరికీ వర్తించవు అని పోస్టులో రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Artist_Dance_Community (@artist_dance_community_) (చదవండి: World Thalassaemia Day: శెభాష్ సమర్థ్ లాంబా ..! వయసుకి మించిన సేవతో ..)

రూ. లక్షల్లో ఫీజులు.. ప్రై‘వేటు’ పడేనా?
దిల్సుఖ్నగర్: విద్యా సంవత్సరం ప్రారంభం కావస్తున్నా అనుమతి లేని ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించలేదు. ఇప్పటి నుంచే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల కోసం ఇంటింటికి వెళ్తున్నారు. అంతేకాక రకరకాల ప్రకటనలతో ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు విద్యార్థుల తల్లితండ్రులను ఆకర్షించే ప్రయత్నం ముమ్మరం చేస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులపై ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి జీఓను విడుదల చేయకపోవడంతో ఏ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలనే అయోమయంలో తల్లితండ్రులు ఉన్నారు. రూ. లక్షల్లో ఫీజులు.. మలక్‌పేట్ జోన్ పరిధి వివిధ ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో ఉండాల్సిన కనీస సౌకర్యాలు లేవు. కానీ కార్పొరేట్ పాఠశాలల పేరుతో రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఫీజులు వసూలు చేçస్తున్నారు. సరూర్‌నగర్, సైదాబాద్, బాలాపూర్ మంండలాల్లో గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలు సుమారు 70కి పైగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నా వారి దృష్టికి రాని పాఠశాలలు మరెన్నో ఉన్నాయి. గుర్తింపు లేని పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుండగా వాటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఉన్నతాధికారులతో కుమ్మకై.. పేరుకు కార్పొరేట్ పాఠశాలలు, కానీ.. విద్యార్థులు ఆడుకోవడానికి కావాల్సిన ఆట స్థలాలు, మంచినీటి సౌకర్యం, రవాణా, సరైన తరగతి గదులు ఉండవు. పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని ఆట స్థలంగా అధికారులకు చూపిస్తూ, ఇరుకు గదుల్లో పరిమితికి మించి విద్యార్థులతో కనీస అర్హత లేని ఉపాధ్యాయులతో చదువులు చెప్పిస్తున్నారు. జిల్లా అధికారులతో నేరుగా సంబంధాలు పెట్టుకుని కార్పొరేట్ స్థాయి పాఠశాలలు స్థానిక అధికారులు ఇచ్చిన నోటీసులను ఏ మాత్రం ఖాతరు చేయకుండా అడ్మిషన్లను కొనసాగిస్తున్నారు. జిల్లా అధికారుల కనుసన్నలలోనే గుర్తింపులేని పాఠశాలలు కొనసాగుతున్నాయని, వారి అండతోనే ఎలాంటి సౌకర్యాలు లేని పాఠశాలలు వేలల్లో ఫీజులు దండుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. విద్యాశాఖ అధికారుల ఉదాసీనత.. ఎలాంటి గుర్తింపు లేకుండా ఏళ్ల తరబడి పాఠశాలలు కొనసాగుతున్నా విద్యాశాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు కఠినంగా వ్యవహరిస్తే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులుండవని పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు పేర్కొంటున్నారు. పాఠశాలల అనుమతులు లేని విషయం తెలియని అమాయక తల్లితండ్రులు తమ పిల్లల్ని ఆ పాఠశాలల్లో చేర్పించి వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గుర్తింపులేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

దేవుడిని ఎందుకు చూడలేకపోతున్నాం.. చూడాలంటే...!
భగవంతుడు అనేవాడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే, మనం ఆయన్ని ఎందుకు చూడలేకపోతున్నాం? మనం సినిమా చూడడానికి ప్రదర్శన శాల (సినిమా హాలు)కు వెళ్లినప్పుడు తెరపై చిత్రాలు ఏ విధంగా కనపడతాయో కొంత అవగాహన ఉంది కదా! ఒక చిన్నగదిలోయంత్రాన్ని (ప్రొజెక్టర్) నడిపిస్తూ తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించి తెరపై బొమ్మలు పడేలా చేస్తాడు ఒక వ్యక్తి. అతడు లేకుండా సినిమా ప్రదర్శన సాధ్యమే కాదు. సినిమా నడిపే వ్యక్తి మాత్రం మనకు కనబడకుండా ఉంటాడు. నీవు అతనిని కలవాలని అనుకుంటే అతడితో పరిచయం ఉన్నవాని (మధ్యవర్తి) సహాయంతో కలవవచ్చు. ఆ సినిమా నడిపే అతనితో స్నేహం పెంచుకొన్న తర్వాత నీకు ఇష్టం వచ్చినప్పుడు అతని గదిలోకి ప్రవేశించవచ్చు, అతనితో మాట్లాడ వచ్చు కదా!ఈ ప్రపంచమే ఒక విశాలమైన చిత్ర ప్రద ర్శనశాల. దీనియందు మనకు ఎప్పుడూ సంభ వించే సంఘటనలే ప్రదర్శనలు. సినిమాలో ఉన్నట్లు, ఇక్కడ కూడా యంత్రాన్ని నడిపించేవాడు ఉన్నాడు. అతను కూడా కనిపించడు. సరైన పరికరాలు, మధ్యవర్తి ఉంటేనే ఆయన కనిపిస్తాడు. ఈ సందర్భంలో మైత్రి అంటే ‘భక్తి’ అని పిలిచే ఒక సాధనాన్ని ఈ కార్య సాధనలో ఉపయోగిస్తూ సద్గురువు అనే మధ్యవర్తి ద్వారా భగవంతుని చూడవచ్చు. సద్గురువు సహాయంతో భగవంతుని దర్శించుకొన్నవారుఎందరో ఉన్నారు. అటువంటివారి అనుభవాలే మన పవిత్రగ్రంథాల్లో దృష్టాంతాలుగా ఉన్నాయి. భగవంతుని దర్శించుకొనదల చిన వారికి పూర్వం భక్తులు ఏ బాటలో నడచి భగవత్ సాక్షాత్కారాన్ని పొందారో అటువంటివారు నడచిన మార్గాన్ని ఇతిహాసాలు తేట తెల్లం చేస్తున్నాయి. ఆ మార్గంలోనే భక్తి విశ్వాసాలు, ధైర్యంతో నీవు నడచిన ట్లయితే గమ్యాన్ని చేరుకోగలవు. నిన్ను చెడగొడుతున్న సందేహాలు అన్నీ అప్పుడు తొలగిపోతాయి.శ్రీ గణపతిసచ్చిదానందస్వామి
ఫొటోలు


నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని గ్లామరస్ స్టిల్స్ (ఫొటోలు)


అరుణాచల దర్శనం చేసుకున్న నటుడు ప్రభాకర్ ఫ్యామిలీ (ఫొటోలు)


మీ తెగువకు హ్యాట్సాఫ్: వైఎస్ జగన్ (ఫోటోలు)


‘శుభం’ మూవీ దెయ్యం బయట ఇంత అందంగా ఉందా? (ఫోటోలు)


తిరుపతి : రెండో రోజు గంగమ్మ జాతర.. బైరాగి వేషంలో మొక్కుల చెల్లింపులు (ఫొటోలు)


హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా ‘ఆపరేషన్ అభ్యాస్’ మాక్ డ్రిల్ (ఫొటోలు)


భార్యకు సీమంతం చేసిన హీరో కిరణ్ అబ్బవరం (ఫొటోలు)


Miss World 2025: సుందరీమణులకు స్వాగతం


తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు (ఫొటోలు)


భారత్ తడాఖా.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ విలవిల (ఫొటోలు)
అంతర్జాతీయం

ఐదు విమానాలు కూల్చేశాం: పాక్ ప్రధాని షరీఫ్
ఇస్లామాబాద్: భారత్ చేపట్టిన వైమానిక దాడులను తమ సైన్యం గట్టిగా తిప్పికొట్టిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చెప్పారు. భారత్ చేసే దాడి కోసం పాక్ సైనిక దళాలు ముందుగానే సర్వసన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. భారత్ దాడి చేయగానే అత్యంత వేగంగా ప్రతిస్పందించాయని అన్నారు. తమ సైన్యం ఐదు భారత యుద్ధ విమానాలను ధ్వంసం చేసిందని తేల్చిచెప్పారు. అయితే, అందుకు ఎలాంటి ఆధారాలు ఆయన చూపలేకపోయారు. షెహబాజ్ షరీఫ్ బుధవారం పాకిస్తాన్ పార్లమెంట్లో మాట్లాడారు. తాజా పరిణామాలను వివరించారు. ఇండియా యుద్ధ ప్రణాళికల గురించి తమ సైనిక దళాలకు ముందస్తుగానే సమాచారం ఉందన్నారు. ఇండియా దాడుల పట్ల పాక్ వైమానిక దళం ప్రతిస్పందన అద్భుతం అని కొనియాడారు. ఇండియాకు సంబంధించిన రఫేల్ జెట్లు సహా ఐదు యుద్ద విమానాలకు కూల్చేసినట్లు ప్రకటించారు. అలాగే రెండు ఇండియన్ డ్రోన్లను సైతం ధ్వంసం చేసినట్లు తెలిపారు. గత రాత్రి 80 ఇండియన్ యుద్ధ విమానాలు దాడికి దిగాయని, తమ సైన్యం గట్టిగా బదులివ్వడంతో అవి తోకముడిచాయని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. మాతృభూమిని రక్షించుకోవడానికి తమ సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉందని స్పష్టంచేశారు. పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శకంగా అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని చెప్పారు. దర్యాప్తునకు సహకరించాల్సిన భారత ప్రభుత్వం ఆవేశంతో తమపై దాడికి దిగిందని మండిపడ్డారు. భారత్ దాడిని యుద్ధ చర్యగా పరిగణిస్తున్నాం భారత ప్రభుత్వం తమపై యుద్ధం ప్రారంభించిందని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. పాక్‌తోపాటు పీఓకేలో భారత సైన్యం జరిపిన క్షిపణి దాడులను ‘యుద్ధ చర్య’గా పరిగణిస్తున్నట్లు చెప్పారు. భారత్‌కు తగిన సమాధానం చెప్పే హక్కు తమకు ఉందని స్పష్టంచేశారు. పాకిస్తాన్లో ఐదు చోట్ల భారత సైన్యం దాడులు చేసినట్లు తెలిపారు. ఇందుకు గట్టిగా బదులివ్వక తప్పదని అన్నారు. ఈ మేరకు షహబాజ్ షరీఫ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శత్రువుకు ఎలా బుద్ధి చెప్పాలో తమ సైన్యానికి బాగా తెలుసని ఉద్ఘాటించారు. శత్రువు ఆటలు సాగవని అన్నారు. తమపై హేయమైన దాడులకు పాల్పడినవారిని నెగ్గనిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తమ చేతిలో భారత్‌కు ఓటమి తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. ఇదిలా ఉండగా, క్షిపణి దాడులను పాక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్ ఖండించారు. పాకిస్తాన్ సార్వభౌమతాన్ని దెబ్బతీయడానికి భారత్ కుట్ర పన్నిందని మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని విమర్శించారు. ప్రాంతీయంగా శాంతి ప్రమాదంలో పడిందని, ఇందుకు భారత్ పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

భారత్‌ను దెబ్బకొట్టాల్సిందే: పాకిస్తాన్
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఆగ్రహంతో రగిలిపోతోంది. భారత్‌ను గట్టిగా దెబ్బకొట్టాల్సిందేనని నిర్ణయానికి వచ్చింది. భారత్‌పై ప్రతీకార చర్యల విషయంలో సైన్యానికి పూర్తిస్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలన్న దానిపై బాధ్యతను సైన్యానికే అప్పగించింది. పాక్ ప్రధానమంత్రి షెహవాజ్ షరీఫ్ నేతృత్వంలో బుధవారం పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎన్ఎస్సీ) సమావేశం నిర్వహించారు. కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు, సీనియర్ ఆర్మీ అధికారులు హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్‌తో పాటు తదనంతర పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. భారత సైన్యం నిర్వహించిన తాజా దాడుల్లో సామాన్య ప్రజలు బలైనట్లు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆరి్టకల్–51 ప్రకారం ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేసే హక్కు తమకు ఉందని ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. అమాయక ప్రజలను బలితీసుకున్నందుకు భారత్‌పై ప్రతీకారం తప్పదని తేల్చిచెప్పింది. ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టే అధికారాన్ని తమ సైనిక దళాలకు అప్పగించినట్లు వెల్లడించింది. సామాన్యులపై దాడులు సిగ్గుచేటు పాక్‌తోపాటు పీఓకేలో భారత్ దాడులను ఎన్ఎస్సీ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీయాలని చూస్తే సహించబోమని హెచ్చరించింది. భారత్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని, ఇది ముమ్మాటికీ తమపై యుద్ధ ప్రకటనేనని పేర్కొంది. అంతర్జాతీయ చట్టం ప్రకారం భారత్ దాడిని యుద్ధ చర్యగానే పరిగణిస్తున్నామని వెల్లడించింది. మహిళలు, చిన్నారులు సహా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం అత్యంత హేయం, దారుణం, సిగ్గుచేటు అని మండిపడింది. మానవత్వానికి సంబంధించిన అన్ని నియమాలను భారత సైన్యం ఉల్లంఘించినట్లు ఆరోపించింది. భారతదేశ చట్టవ్యతిరేక చర్యలను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని ఎన్ఎస్సీ విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించినందుకు భారత్ దోషిగా పరిగణించాలని స్పష్టంచేసింది. ఉగ్రవాదుల శిబిరాలు ఉన్నాయన్న సాకుతో సాధారణ జనావాసాలపై భారత సైన్యం దాడులు చేసిందని ఆక్షేపించింది. ఈ దాడుల్లో మసీదులు సహా పౌర సదుపాయాలు ధ్వంసమయ్యాయని ఆందోళన వ్యక్తంచేసింది.

పాక్ పీఎం యాక్షన్.. ఆర్మీ చీఫ్ నో యాక్షన్!
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ ‘యాక్టింగ్ కెప్టెన్’ పాత్రకు రెడీ అయ్యారు. భారత్‌తో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. భారత్ తమపై దాడి చేసిందని, అందుకు ప్రతీకారం తీర్చుకుంటామనీ అన్నారు. రైట్ టు రెస్పాండ్ హక్కు మాకూ ఉందన్నారు. ఈ మేరకు అత్యవసరం సమావేశం కూడా ఏర్పాటు చేశారు.ఆర్మీ చీఫ్ ఎక్కడ..?ఈ మేరకు హై లెవిల్ సెక్యూరిటీ మీటింగ్ కు పాక్ ప్రధాని షరీఫ్ పిలుపునిచ్చారు. అయితే దీనికి ఆ దేశ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ హాజరుకాలేదు. కనీసం మునీర్ నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల నడుమ మునీర్ ఎక్కడో కీలక ప్రాంతంలో దాక్కున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తో యుద్ధాన్ని ఆర్మీ చీఫ్ మునీర్ వద్దనుకునే కీలక మీటింగ్ లకు దూరంగా ఉంటున్నాడనే వాదన కూడా తెరపైకి వచ్చింది.ఇప్పుడు పాక్ ప్రధాని షరీప్ కాస్త యాక్టింగ్ లోకి దిగుదామని ప్రయత్నిస్తున్నా అక్కడ సైన్యం పూర్తిగా సహకరించడం లేదనడానికి మునీఫ్ గైర్హాజరీనే ఒక ఉదాహరణ. ప్రస్తుతం భారత్ పై తిరుగుబాటు చేస్తే పాక్ కే నష్టమని పలువురు దేశ, విదేశీ రాజకీయనాయకులు చెబుతున్న మాట. ఇదే ఫాలో అవుతున్నట్లున్నాడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. పాక్ లో అత్యంత శక్తివంతుడుగా విస్తృత ప్రచారంలో ఉన్న మునీర్.. మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్లో పాక్ పెద్దలకు అర్థం కావడం లేదు. హైలెవిల్ మీటింగ్ కు రావాలని పాక్ భద్రతా దళాల అధికారులకు ప్రధాని ఆదేశాలు ఇచ్చిన తరుణంలో మునీర్ ఎందుకు దూరంగా ఉన్నట్లు. పాక్ పీఎం యాక్షన్ ప్లాన్ కు ఆ దేశ ఆర్మీ చీఫ్ నుంచి ఎటువంటి యాక్షన్ లేకపోవడం ఏంటనేది ఇప్పుడు ఆ దేశంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు..మునీర్.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. తమ పార్టీ మాత్రం ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాల్లో పాల్గొదనే సంకేతాలిచ్చాడు. దాంతోనే ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీలోని పార్లమెంట్ సభ్యులు కూడా ప్రభుత్వంపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్మీ చీఫ్ కూడా కీలక సమయంలో పాక్ హ్యాండిచ్చాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తూ భారత్ వార్నింగ్ ఇచ్చిన మునీఫ్.. సరైన సమయానికి మాత్రం ఎస్కేపింగ్ ప్లాన్ చేసుకున్నట్లు కనబడుతోంది.మరో ముషారఫ్ రాజ్యం రాబోతుందా..?పాకిస్తాన్ లో ప్రభుత్వాలను కూల్చేసి ఆర్మీ చీఫ్ లు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గతంలో చూశాం. మరి మునీఫ్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని కొంతమంది విశ్లేషిస్తున్నారు. అయితే మునీఫ్ అంత సీన్ లేదనే కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతం పాక్ లో ప్రభుత్వాన్ని మునీర్ కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకే సైలెంట్ మోడ్ లోకి మునీఫ్ వెళ్లాడని, ఇది పరోక్షంగా ఇమ్రాన్ ఖాన్ కు మేలు చేయడం కోసమేనని పాక్ లోనే వినిపిస్తోంది. గతంలో పాక్ మాజీ సైనాకాధికారి ముషారఫ్.. సైన్యం మద్దతు విశేషంగా కూడగట్టుకుని పాక్ ప్రభుత్వాన్ని కూల్చేసి అధ్యక్షుడయ్యాడు.ముషారఫ్.. 1999 నాటి కుట్రలో ప్రధాని నవాజ్ షరీఫ్ నుంచి అధికారం హస్తగతం చేసుకొని, ‘ఛీఫ్ ఎగ్జిక్యూటివ్’గా, ఆ పైన సైనికాధ్యక్షుడిగా, చివరకు పౌర అధ్యక్షుడిగా తొమ్మిదేళ్ళ కాలం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొన్నారు. ఆఖరికి మెడ మీద అభిశంసన కత్తితో 2008లో గద్దె దిగక తప్పలేదు.

అక్కడ జరిగిందేమిటి?.. మీరు చేస్తున్నదేమిటి?
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల్ని ప్రాణాలు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల వేరివేత లక్ష్యంగా భారత్ ‘ ఆపరేషన్ సిందూర్’ నిర్వహించింది. పాక్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసిన భారత్.. 90 మంది వరకూ టెర్రర్ మూకలను మట్టుబెట్టింది. అయితే భారత్ విజయవంతంగా పూర్తి చేసిన ఆపరేషన్ సిందూర్ పై చైనా మీడియా విషం కక్కింది. చైనాలోని గ్గోబల్ టైమ్స్’ అనే మీడియా సంస్థ ఆపరేషన్ సిందూర్ భారత్ విమానాలను పాక్ కూల్చిందంటూ తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. కొన్ని పాత ఫోటోలను జత చేసి వాటిని ప్రస్తుత ఆపరేషన్ సిందూర్ కు ఆపాదించింది. దీనిపై చైనాలోని భారత్ ఎంబాసీ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అక్కడ జరిగింది ఏమిటి.. మీరు చేస్తున్నదేమిటి అంటూ మండిపడింది ఒక విషయాన్ని వార్త రూపంలో ప్రచురించేటప్పుడు వాస్తవాలను తెలుసుకోవాలని, దానికి మూలాలను అన్వేషించి వార్తలు వేయాలని గ్లోబల్ టైమ్స్ కు చురకలంటించింది. అక్కడా ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసి విజయవంతంగా దాన్ని పూర్తి చేస్తే మీరు దాన్ని వక్రీకరించడం తగదంటూ హితవు పలికింది. కాగా, ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులు హతమయ్యారు.
జాతీయం

పహల్గాం దాడికి తగిన నివాళి
‘ఆపరేషన్ సిందూర్’పై పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ నుదుటన సిందూరాన్ని తుడిపేసినవారిపై దాడితో న్యాయం జరిగిందని మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దాడులతో మరోసారి దాడి చేయాలంటే ఉగ్రవాదులు వణికిపోతారంటూ బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కొంత ఉపశమనం పొందారు. భారత సైన్యం, కేంద్ర ప్రభుత్వాలను ప్రశంసించారు. మోదీని అడగండి అన్నారు.. ఆయన సమాధానం ఇచ్చారు: హిమాన్షి నర్వాల్ ఆపరేషన్ సిందూర్‌ను పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ స్వాగతించారు. ‘నా పెళ్లి జరిగి ఆరు రోజులే అయింది.. మమ్మల్ని వదిలేయండని ఉగ్రవాదులను వేడుకున్నా. కానీ ఉగ్రవాదులు మాత్రం ‘మోదీని అడగండి’ అని బదులిచ్చారు. ఈ రోజు మోదీ, మన సైన్యం వారికి సమాధానం చెప్పారు’ అని హిమాన్షి వ్యాఖ్యానించారు.బాధితులకు సరైన నివాళి: ప్రగతి జగ్దాలే ‘ఆపరేషన్ సిందూర్’ పహల్గాం దాడిలో మరణించిన వారికి సరైన నివాళి అని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన పుణేవాసి సంతోష్ జగ్దాలే భార్య ప్రగతి జగ్దాలే అభివరి్ణంచారు. ‘మా సిందూరాన్ని ఉగ్రవాదులు తుడిచిపెట్టేశారు. మన సాయుధ దళాలు పాక్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసినందుకు సంతోషిస్తున్నా. ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని నాకు తెలుసు’’అని ఆమె వ్యాఖ్యానించారు.ప్రతీకారం తీర్చుకున్నాం..: సంగీతా గన్బోటే ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నందుకు తాము చాలా సంతోషంగా ఉన్నామని పహల్గాం దాడిలో మరణించిన మరో పుణే వాసి కౌస్తుభ్ గన్బోటే భార్య సంగీతా గన్బోటే అన్నారు. ‘‘ఉగ్రదాడికి భారత్ ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందోనని మేమంతా ఎదురు చూశాం. ఈ రోజు ఆపరేషన్ సిందూర్‌తో భారత సాయుధ దళాలు పహల్గాంలో పిరికిపంద దాడికి ధీటైన సమాధానం ఇచ్చాయి’’అని తెలిపారు. ఇదే నిజమైన నివాళి: అషన్య ద్వివేది ఉగ్రవాదులు భవిష్యత్తులో అమాయకులపై ఎలాంటి దాడులకు పాల్పడకుండా ఆపరేషన్ సింధూర్ బుద్ధి చెప్పిందని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కాన్పూర్ వాసి శుభమ్ ద్వివేది భార్య అషన్య సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇదే నా భర్తకు, పహల్గాం దాడిలో మరణించిన వారికి నిజమైన నివాళి. నా భర్త ఎక్కడున్నా ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు’ అని ఆమె పేర్కొన్నారు. ‘పహల్గాం’ఉగ్రవాదులను కూడా అంతమొందించాలి: జెన్నీఫర్ ఆపరేషన్ సిందూర్ బాగుందని, కానీ.. తన భర్తను చంపిన నలుగురు ఉగ్రవాదులను కూడా అంతమొందించాలని పహల్గాం దాడిలో మృతి చెందిన సుశీల్ నథానియేల్ భార్య జెన్నీఫర్ అన్నారు. ఒక జంతువు కూడా చేయని పనిని ఆ నలుగురూ చేశారని, వారు కూడా అదే శిక్షను పొందాలని, నలుగురూ చనిపోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. నా కుమారుడి హత్యకు ప్రతీకారం తీరింది: పోనీవాలా ఆదిల్ తండ్రి హైదర్ షాఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడులు తన కుమారుడి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాయని పహల్గాం ఉగ్రదాడి సమయంలో పర్యాటకులను కాపాడుతూ ప్రాణాలు అరి్పంచిన పోనీవాలా సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తండ్రి హైదర్ షా అన్నారు. ఇప్పుడు తనకు సంతోషంగా ఉందన్నారు. తన సోదరునితోపాటు మరో 25 మంది బాధిత కుటుంబాలకు న్యాయం చేశారని ఆదిల్ సోదరుడు సయ్యద్ నౌషాద్ వ్యాఖ్యానించారు.ప్రాణాల విలువ ఇప్పుడు తెలిసొస్తుంది: ప్రియదర్శిని ఆచార్య ప్రాణాల విలువేంటో ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసొస్తుందని పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఒడిశాకు చెందిన ప్రశాంత్ సత్పతి భార్య ప్రియదర్శని ఆచార్య అన్నారు. చర్యలు తీసుకుంటామని భర్త మృతదేహం వద్ద ఆర్మీ సిబ్బంది తనకు హామీ ఇచ్చారని, ఈరోజు అది చేసి చూపించారని సంతోషం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా తరిమికొట్టాలని, ఈ భూమ్మీద ప్రజలు స్వేచ్ఛగా, భయం లేకుండా జీవించాలని ఆశాభావం వ్యక్తం చేవారు. సరైన నిర్ణయం: మంజునాథ్ రావు తల్లి సుమతి ఆపరేషన్ సిందూర్‌తో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని పహల్గాంలో హత్యకు గురైన కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్ రావు తల్లి సుమతి అన్నారు. అమాయకులకు ఏమీ జరగకూడదని, అణచివేతకు, దౌర్జన్యాలకు పాల్పడేవారిని వదిలిపెట్టకూడదని చెప్పారు. ఎంతోమంది నుదుటి తిలకాన్ని చెరిపేసినవారిని తుదముట్టించడానికి ఆపరేషన్ సింధూర్ సరైనదని పహల్గాం దాడిలో మరణించిన బెంగళూరుకు చెందిన భరత్ భూషణ్ తండ్రి చెన్నవీరప్ప అన్నారు. కొంత ఉపశమనం: ఆరతి ఆపరేషన్ సిందూర్ బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగిస్తుందని పహల్గాం దాడిలోమృతి చెందిన కొచి్చకి చెందిన ఎన్ రామచంద్రన్ కుమార్తె ఆరతి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నేను సంతృప్తిగా ఉన్నాను. నా దివంగత తండ్రి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు. విడిచిపెట్టాలంటూ మా మేనమామలు ఉగ్రవాదులను వేడుకున్నారు. కానీ వారు కనికరం చూపలేదు. వారిని కాల్చి చంపారు’అంటూ దాడి రోజును గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టాలి: బాధిత కుటుంబాలు ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టేంతవరకూ దాడులు కొనసాగించాలని పహల్గాం దాడిలో మరణించిన పశి్చమబెంగాల్ వాసులు సమీర్ గుహా, బితాన్ అధికారి కుటుంబీకులు కోరారు. పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోయే వరకు ఆ దేశంపై చర్యలు కొనసాగించాలని ఉగ్రదాడిలో భర్త యతీష్ పర్మార్, కుమారుడు స్మిత్‌లను కోల్పోయిన గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన కాజల్ బెన్ పర్మార్ ప్రభుత్వాన్ని కోరారు. పాక్‌పై భారత్ చర్య పట్ల తనకు సంతృప్తిగా ఉందని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సూరత్‌కు చెందిన శైలేష్ కలతియా భార్య శీతల్ బెన్ కలతియా చెప్పారు. హిందువులు, ముస్లింల పేరుతో నా భర్తను, ఇతరులను కాల్చి చంపిన ప్రజలకు న్యాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం ఏం చేసినా సరేనన్న శీతల్‌బెన్.. ప్రభుత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ సహా ఇతర బరాజ్‌ల పునరుద్ధరణ అంశంపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్‌జైన్‌తో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్చలు జరిపారు. వేల కోట్లతో నిర్మించిన బరాజ్‌లను తిరిగి వినియోగంలోకి తేవాలనే దృఢమైన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, సీడబ్ల్యూసీ నిర్దిష్ట మార్గదర్శకాలు సూచిస్తే, వాటికి అనుగుణంగా ముందుకు వెళతామని ఈ సందర్భంగా ఉత్తమ్ వివరించారు. తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో బుధవారం జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనా«థ్ దాస్, ఈఎన్సీ అనిల్‌కుమార్, సీఈలు బస్వరాజు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై చర్చించారు. అతుల్ జైన్ మాట్లాడుతూ.. ఈ బరాజ్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను తమకు నివేదిక రూపంలో అందిస్తే, పరిశీలించి తగు మార్గదర్శకాలు సూచిస్తామని హామీ ఇచ్చారు. నీటి కేటాయింపులు జరపండి: అతుల్ జైన్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్‌గా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు ఉండే ముంపు సమస్యపై సమగ్ర అధ్యయనం చేయించాలని మంత్రి ఉత్తమ్ కోరారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు 44 టీఎంసీలు, పాలమూరు–రంగారెడ్డికి అవసరమైన 90 టీఎంసీల నీటిలో మొదటి దశ కింద 45 టీఎంసీల నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పునరుద్ధరణ మార్గాలు అన్వేషిస్తున్నాం: మంత్రి ఉత్తమ్ మేడిగడ్డ సహా కాళేశ్వరం మూడు బరాజ్‌లను తిరిగి వినియోగంలోకి తేవడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కాకూడదన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, డిజైన్, లొకేషన్, నిర్మాణం, ఓఅండ్ఎం లోపాల వల్లే ప్రాజెక్టుకు భారీ నష్టం వాటిల్లిందని విమర్శించారు. కృష్ణా జలాల్లో సమర్ధ నీటి వినియోగం ఉండేలా, అక్రమంగా ఆంధ్రప్రదేశ్ నీటిని మళ్లించకుండా నీటి లెక్కలు పక్కాగా ఉండేలా టెలీమెట్రీ వ్యవస్థను తక్షణమే ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ను కోరినట్లు మంత్రి తెలిపారు.

సీబీఐ చీఫ్ ప్రవీణ్ సూద్‌కు ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని పొడిగించారు. ప్రవీణ్ 2023 మేలో సీబీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సుబోధ్ జైస్వాల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్–2003 ప్రకారం సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు. ప్రవీణ్ సూద్ రెండేళ్ల పదవీకాలం మే 24తో ముగియనుంది. దీంతో సీబీఐ చీఫ్‌ను ఎన్నుకోవడానికి ప్రధాని మోదీ ఎంపిక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కూడా హాజరయ్యారు. అయితే ఈ భేటీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రవీణ్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రవీణ్ సూద్ 1986 బ్యాచ్, కర్ణాటక కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. 1989లో మైసూరులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. బళ్లారి, రాయచూర్ ఎస్పీగా పనిచేసి బెంగళూరులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ)గా నియమితులయ్యారు. డిప్యూటేషన్‌పై మూడేళ్ల పాటు మారిషస్‌లో పనిచేశారు. 2004 నుంచి 2007 వరకు మైసూరు నగర పోలీసు కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2011 వరకు బెంగళూరు ట్రాఫిక్ పోలీస్‌లో అడిషనల్ పోలీస్ కమిషర్, 2013–14 వరకు కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఆ తరువాత రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ ఏడీజీపీగా, అడ్మినిస్ట్రేషన్ ఏడీజీపీగా, కర్ణాటక డీజీపీగా పనిచేశారు.

2040 నాటికి చంద్రుడిపై మన పాదముద్ర: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ ముందంజలో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. 2040 నాటికి చందమామపై మన వ్యోమగాములు అడుగు పెట్టబోతున్నారని చెప్పారు. అంగారక(మార్స్), శుక్ర(వీనస్) గ్రహాలపైనా ప్రయోగాలు చేయబోతున్నట్లు వెల్లడించారు. గ్లోబల్ స్పేస్ ఎక్ప్‌ప్లోరేషన్ కాన్ఫరెన్స్(గ్లెక్స్–2025) సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. అంతరిక్ష ప్రయోగ ప్రణాళికలు వివరించారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత 2040 నాటికి చంద్రుడిపై మన పాదముద్ర ఉంటుందని పేర్కొన్నారు. మరో 15 ఏళ్లలో భారతీయ వ్యోమగాములు చందమామపై అడుగుపెట్టడం తథ్యమని స్పష్టంచేశారు. మన అంతరిక్ష ప్రయాణం ఇతరులతో పోటీకి సంబంధించింది కాదని, అందరినీ కలుపుకొని ఈ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరాలన్నదే అసలు లక్ష్యమని ఉద్ఘాటించారు. మొత్తం మానవాళికి లబ్ధి చేకూరేలా అంతరిక్ష ప్రయోగాల్లో తమ ఉమ్మడి లక్ష్యాన్ని అందరితో పంచుకుంటామని వ్యాఖ్యానించారు. జీ20 ఉపగ్రహం ప్రయోగిస్తాం దక్షిణాసియా దేశాల కోసం ఒక శాటిలైట్ ప్రయోగించామని ప్రధాని మోదీ గుర్తుచేశారు. గ్లోబల్ సౌత్ దేశాలకు బహుమతిగా జీ20 ఉపగ్రహం ప్రయోగించబోతున్నామని చెప్పారు. గగన్‌యాన్ ప్రాజెక్టు మన దేశ ఆకాంక్షలకు ప్రతిబింబిస్తోందని అన్నారు. మన తొలి మానవసహిత స్పేస్–ఫ్లైట్‌ను త్వరలో అంతరిక్షంలోకి పంపించబోతున్నామని చెప్పారు. ఇస్రో–నాసా ఉమ్మడి మిషన్‌లో భాగంగా భారతీయ వ్యోమగామి మరికొన్ని వారాల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) చేరుకోబోతున్నాడని వివరించారు. అంతరిక్షం అంటే కేవలం ఒక గమ్యం కాదని.. ఉత్సకత, ధైర్యం, సమీకృత ప్రగతికి ఒక ప్రతీక అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశ అంతరిక్ష ప్రయాణం ఆ దిశగానే సాగుతోందని చెప్పారు. 1963లో ఒక చిన్న రాకెట్ ప్రయోగంతో మన అంతరిక్ష యాత్ర ఆరంభమైందని గుర్తుచేశారు. అనంతరం ఈ రంగంలో ఎంతగానో పురోగమించామని, చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్పేస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా రికార్డు సృష్టించామని పేర్కొన్నారు. మన ప్రయాణం చరిత్రాత్మకమని అభివరి్ణంచారు. మన రాకెట్లు పేలోడ్స్ కంటే అధికంగా 140 కోట్ల మంది భారతీయుల కలలను మోసుకెళ్తుంటాయని వివరించారు. తొలి ప్రయత్నంలోనే మార్స్ వద్దకు చేరుకున్న దేశంగా ఇండియా చరిత్ర సృష్టించిందన్నారు. చంద్రయాన్ ప్రయోగాలతో చంద్రుడిపై నీటి జాడ కనిపెట్టామని, అత్యంత నాణ్యమైన చంద్రుడి ఫొటోలు చిత్రీకరించామని, అక్కడి దక్షిణ ధ్రువం గురించి మరింత సమాచారం తెలుసుకున్నామని వెల్లడించారు. రికార్డు సమయంలో క్రయోజెనిక్ ఇంజన్లు తయారు చేశామని, ఒకేసారి 100 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించామని గుర్తుచేశారు. 34 దేశాలకు చెందిన 400కుపైగా శాటిలైట్లను మన అంతరిక్ష నౌకల ద్వారా ప్రయోగించామని అన్నారు. ఈ ఏడాది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించామని, ఇదొక గొప్ప ముందడుగు అని తెలియజేశారు.
ఎన్ఆర్ఐ

వైట్‌హౌస్‌లో కోనసీమ వాసికి కీలక బాధ్యత
ఐ.పోలవరం: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు (Gottumukkala Madhu) నియమితులయ్యారు. మధు తల్లిదండ్రులు గొట్టుముక్కల వెంకట సూర్య సత్యనారాయణరాజు (కొండరాజు), సత్యవాణి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు (Kesanakurru) గ్రామానికి చెందినవారు. మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఎంఎస్, ఎంబీఏ చేశారు. మోటోరోలా, శాంసంగ్ కంపెనీల్లో పనిచేశారు. ప్రస్తుతం అమెరికన్ సైబర్ సెక్యూరిటీ విభాగం (CISA)లో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.చదవండి: అమరావతి ఐకానిక్.. అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.
క్రైమ్

అంతుచూసిన అనుమానం..!
శ్రీకాకుళం: కోటబొమ్మాళిలో బ్యూటీపార్లర్, లేడీస్ కార్నర్ షాపు నిర్వహిస్తున్న మహిళ తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. సంతబొమ్మాళి మండలం నర్సాపురం గ్రామానికి చెందిన నర్సిపురం లక్ష్మి (30) తన భర్త తిరుపతిరావుతో కలిసి కోటబొమ్మాళి విద్యుత్‌నగర్‌లో నివాసముంటోంది. లక్ష్మి స్థానికంగా హర్షిణి పేరుతో బ్యూటీ పార్లర్, లేడీస్ కార్నర్ నిర్వహిస్తోంది. తిరుపతిరావు కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. భార్యపై అనుమానంతో ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతుండేవి. గతంలో పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో భార్య లక్ష్మిని భర్త తిరుపతిరావు దారుణంగా గొంతు కోశాడు. దీంతో లక్ష్మి తీవ్ర రక్తస్రావంతో విగత జీవిగా పడిపోయింది. అనంతరం తిరుపతిరావు మద్యం షాపునకు వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకున్న కోటబొమ్మాళి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న లక్ష్మిని పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు మద్యం షాపు వద్ద ఉన్న తిరుపతిరావును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భార్యపై అనుమానంతోనే ఈ హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతురాలికి భర్తతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇన్చార్జి సీఐ విజయకుమార్, ఎస్ఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలంలో దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేశారు.

ఏసీకి షార్ట్ సర్క్యూట్..కొరియోగ్రాఫర్ మృతి
మణికొండ(హైదరాబాద్): గాఢ నిద్రలో ఉన్న ఓ కొరియోగ్రాఫర్ గదిలోని ఏసీకి షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి, దట్టమైన పొగ పీల్చటంతో మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్, పుప్పాలగూడ శ్రీరాంనగర్ కాలనీలో బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.ఎస్ మునీందర్ తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లాకు చెందిన పోరేటి వీరేందర్‌రెడ్డి (38) కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీరాంనగర్ కాలనీలోని కుతుబ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్లోని 301 ప్లాట్‌లో నివాసం ఉంటున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి తన గదిలో వీరేందర్‌రెడ్డి నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో అతని గదిలోని ఏసీకి షార్ట్ సర్క్యూట్ కావటంతో మంటలు చెలరేగాయి. దుస్తులు, ఫర్నిచర్ కాలిపోయి పొగలు వ్యాపించాయి.గమనించిన చుట్టు పక్కల వారు డయల్ 100 ద్వారా పోలీసు, అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలార్పి గదిలోకి వెళ్లగా వీరేందర్‌రెడ్డి అపస్మారక స్థితిలో కనిపించాడు. సీపీఆర్ చేసినా అప్పటికే దట్టమైన పొగను పీల్చటంతో మృతి చెందినట్టు 108 సిబ్బంది ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించామని, షార్ట్ సర్క్యూట్ కారణాలను తెలపాలని విద్యుత్ శాఖకు లేఖ రాశామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.

బావ మా అక్క మరో పెళ్లి చేసుకుంటుంది..!
బంజారాహిల్స్(హైదరాబాద్): భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా..భర్తకు దూరంగా ఉంటున్న భార్య మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని ప్రశ్నించగా..అతనిపై రోకలితో దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నేపాల్ దేశం బరాండ్కు చెందిన కృష్ణదమత్ బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. 2013లో సునీత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో హౌస్‌కీపింగ్‌గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నాడు. 2024 అక్టోబర్‌లో కుటుంబాన్ని తన గ్రామానికి పంపించేందుకు స్నేహితుడి నుంచి రూ.1.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇదే విషయమై సునీతకు, కృష్ణకు గొడవలు జరిగాయి. ఇదే క్రమంలో జనవరి 3న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కృష్ణకు భార్యతో మరోసారి గొడవ జరిగింది. దీంతో సునీతను ఇంటి నుంచి పంపించివేశాడు. అప్పటి నుంచి భార్యతో ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. ఇదిలా ఉండగా మంగళవారం సునీత సోదరుడు దీపక్..కృష్ణదమత్కు ఫోన్‌చేసి తన సోదరి అమర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు. దీంతో కృష్ణదమత్ వెంటనే నందినగర్‌లోని సునీత ఉండే నివాసానికి వెళ్లి నిలదీశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా సునీత అల్యుమినియం రోకలితో భర్తపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కుడికంటి వద్ద తీవ్రంగా గాయమై రక్తస్రావం జరిగింది. ఆమెతో పాటు అమర్ కూడా కృష్ణదమత్పై దాడి చేయగా బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

డాడీ.. లే డాడీ..
తంగళ్లపల్లి (సిరిసిల్ల): తండ్రి నిద్రపోయాడనుకున్న ఆ రెండేళ్ల చిన్నారి చనిపోయిన తండ్రిని ‘డాడీ.. లే డాడీ’.. అంటూ పిలవడం అందరినీ కంటతడి పెట్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్‌నగర్ (డబుల్ బెడ్రూం సముదాయం)లోని బ్లాక్ నంబర్ 18, రూం నంబర్ 6లో నివాసముంటున్న తాడూరి రామ్‌కుమార్ (38) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. రామ్‌కుమార్ 14 ఏళ్ల కిత్రం వేములవాడకు చెందిన అనితను కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం సుఖజిత్ (11), శ్రీవాస్తవ్ (5), విహాన్ (2). రామ్‌కుమార్ జిరాక్స్ మెషీన్ మెకానిక్‌గా, వివాహ ఈవెంట్లలోనూ పనిచేస్తుండేవాడు. పనులు సరిగాలేక రామ్‌కుమార్‌కు రూ.3 లక్షల వరకు అప్పులు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం మధ్యాహ్నం భార్య వంట గదిలో ఉన్న సమయంలో పెద్ద కొడుకు సుఖజిత్తో మాట్లాడిన రామ్‌కుమార్, తమ్ముళ్లను బాగా చూసుకోమని చెప్పి గదిలోకి వెళ్లి డోర్ వేసుకుని ఉరేసుకున్నాడు. ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో భార్య కేకలతో స్థానికులు వచ్చి తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే మృతిచెందాడు. ట్రెయినీ ఎస్సై వినీతారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


YS Jagan: మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే..!


పాక్ మిస్సైళ్లను కూల్చేసిన భారత్


పెద్ద ఎత్తున పాక్ మిస్సైళ్లను కూల్చేసిన భారత్


YSRCP అధికారంలో ఉన్నా విలువలతో కూడిన రాజకీయాలే చేశాం: YS Jagan


ఎలాంటి నోటీసులు లేకుండా నేరుగా R.ధనుంజయ రెడ్డి ఇంటికి ఏపీ పోలీసులు


ఆపరేషన్ సిందూర్... మసూద్ అజార్ కు కోలుకోలేని దెబ్బ


మీ బాధలు చూస్తున్నాను.. హామీ ఇస్తున్నా..


YS Jagan: మీ ప్రేమ, అభిమానం, తెగువకు హ్యాట్సాఫ్


ఎక్కడ దాక్కున్నా.. తీసుకొచ్చిమరీ... వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు


కర్రిగుట్టలో శవాల గుట్టలు.. ఆపరేషన్ కగార్ వెనుక..?