Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Indian Airforce Key Announcement On Operation Sindoor1
ఆపరేషన్‌ సిందూర్‌పై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సంచలన ప్రకటన

ఢిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌పై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్‌ ిసిందూర్‌ కొనసాగుతుందని తెలిపింది. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియ లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కాసేపట్లో ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు వివరాలను వెల్లడించనున్నారు. మాకు అప్పగించిన టార్గెట్‌లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాం. విచక్షణ, వివేకంతో ఆపరేషన్‌ సిందూర్‌ కొనసాగించాం. ఆపరేషన్స్‌ ఇంకా కొనసాగుతున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌పై ఊహాగానాలు, ఫేక్‌ వార్తలు నమ్మవద్దు అని అధికారులు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఆపరేషన్‌ సిందూర్‌కు విరామం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం మొదలైంది. త్రివిధ దళాధిపతులు, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ భేటీకి హాజరయ్యారు. భారత్‌-పాక్‌లు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం.. ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్‌ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు.. సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. #OperationSindoor | Indian Air Force tweets, "...Since the Operations are still ongoing, a detailed briefing will be conducted in due course. The IAF urges all to refrain from speculation and dissemination of unverified information." pic.twitter.com/tRSoEEZj8t— ANI (@ANI) May 11, 2025#WATCH | Delhi: Prime Minister Narendra Modi chairs a meeting at 7, LKM. Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar, NSA Ajit Doval, CDS, Chiefs of all three services present. pic.twitter.com/amcU1Cjmbu— ANI (@ANI) May 11, 2025

Trump Says Will work with India And Pak solution to Kashmir2
భారత్‌, పాక్‌పై ట్రంప్‌ ఆసక్తికర కామెంట్స్‌.. ఈసారి కశ్మీర్‌ అంటూ..

వాషింగ్టన్‌: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం అమెరికా మధ్యవర్తిత్వంతో సద్దుమణిగింది. ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఇరుదేశాల నేతలతో చర్చించి కాల్పుల విరమణకు వచ్చేలా చేశారు. అయితే, భారత్‌-పాక్‌ అంశంపై తాజాగా ట్రంప్‌ మరోసారి స్పందించారు. ఈసారి కశ్మీర్‌ అంశం ప్రస్తావించి కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌ వేదికగా ట్రుత్‌తో స్పందిస్తూ..‘కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి భారత్‌-పాక్‌తో కలిసి పనిచేస్తాం. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాను. వెయ్యి సంవత్సరాల కశ్మీర్‌ విషయంలో ఒక పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నాను. అలాగే, భారత్‌, పాకిస్తాన్‌ను చూసి నేను గర్వపడుతున్నాను. ప్రజల మరణానికి, నాశనానికి దారితీసే ప్రస్తుత యుద్ధాన్ని ఆపాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయం పూర్తిగా అర్థం చేసుకునే శక్తి, జ్ఞానం, ధైర్యాన్ని రెండు దేశాలు కలిగి ఉన్నాయి. అచంచలమైన శక్తివంతమైన నాయకత్వం రెండు దేశాలకు ఉందని కితాబిచ్చారు.యుద్ధం కారణంగా లక్షలాది మంది అమాయక ప్రజలు చనిపోయే అవకాశం ఉంది!. మీ ధైర్యవంతమైన చర్యల ద్వారా మీ వారసత్వం బాగా మెరుగుపడింది. ఈ చారిత్రాత్మక, వీరోచిత నిర్ణయం తీసుకోవడంలో అమెరికా మీకు సాయం చేయగలిగినందుకు నేను గర్విస్తున్నాను. ఇలాంటి చారిత్రక నిర్ణయంలో అమెరికా సాయపడటం గర్వంగా ఉంది. ఈ రెండు గొప్ప దేశాలతో నేను వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నాను’ అని చెప్పుకొచ్చారు.( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - May 10, 2025, 11:48 PM ET )I am very proud of the strong and unwaveringly powerful leadership of India and Pakistan for having the strength, wisdom, and fortitude to fully know and understand that it was time to stop… pic.twitter.com/RKDtlex2Yz— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) May 11, 2025ఇదిలా ఉండగా.. జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్‌ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపేశారు. దాంతో భారత ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. పాకిస్తాన్‌, పాక్‌‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ఆ తర్వాత ప్రతీకారం అంటూ పాకిస్తాన్‌.. భారత్‌పై సైనిక చర్యకు దిగింది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతూ, సాధారణ పౌరులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి తెగబడింది. భారత్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ వాటిని అడ్డుకోవడంతో పాటు పాక్‌పై ప్రతిదాడి చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి మరింత తీవ్రమవుతున్న క్రమంలో అమెరికా జోక్యం చేసుకొని కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించింది.

TG EAPCET 2025 Results: Check Direct Link3
TG EAPCET: తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో చెక్‌ చేస్కోండిలా

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగం ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు నేరుగా విద్యార్థుల మొబైల్‌కే వచ్చే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు.ఇంజనీరింగ్‌లో ఏపీకి చెందిన భరత్‌చంద్ర ఫస్ట్‌ ర్యాంక్‌, రామ్‌చరణ్‌రెడ్డి(రంగారెడ్డికి) సెకండ్‌ ర్యాంక్‌ సాధించారు. అగ్రికల్చర్‌ విభాగంలో మేడ్చల్‌కు చెందిన సాకేత్‌ ఫస్ట్‌ ర్యాంక్, లలిత్‌ వరేణ్య(కరీంనగర్‌) రెండో ర్యాంక్‌ సాధించారు. ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో జరిగిన ఎప్‌సెట్‌ అగ్రికల్చర్‌ విభాగంలో 81,198 మంది.. మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఇంజినీరింగ్‌ విభాగంలో 2,07,190 మంది హాజరయ్యారు.విద్యార్థులు తమ ఎప్‌సెట్‌ ఫలితాలను కింద ఇచ్చిన సాక్షి అధికారిక ఎడ్యుకేషన్‌ వెబ్‌ సైట్‌లో పొందవచ్చు. 👇👉TG EAPCET 2025 Results Direct Links👉TG EAPCET Engineering Resultshttps://education.sakshi.com/sites/default/files/exam-result/TG-EAPCET-Engineering-Results-2025.html👉TG EAPCET Agriculture and Pharmacy Resultshttps://education.sakshi.com/sites/default/files/exam-result/TG-EAPCET-Agriculture-pharmacy-Results-2025.html

Shubman Gill Set To Lead India In Tests Vice Captain Will Be: Report4
IND vs ENG: టీమిండియా కెప్టెన్‌గా గిల్‌.. వైస్‌ కెప్టెన్‌గా అతడే!

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా కొత్త కెప్టెన్‌ నియామకం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రోహిత్‌ శర్మ (Rohit Sharma) నిష్క్రమణ నేపథ్యంలో యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించేందుకు బోర్డు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. అతడికి డిప్యూటీగా మరో యువ ఆటగాడినే ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఈసారి కనీసం ఫైనల్‌ చేరకుండానేగతేడాది టెస్టుల్లో పరాభవాల పాలైన టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC)-2025 ఫైనల్‌కు దూరమైన విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచిపోయిన భారత్‌.. ఈసారి ఆలోటు తీర్చుకుంటుందనుకుంటే ఇలా మొత్తానికే మోసం వచ్చింది.స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్‌ కావడం.. ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ (BGT)-2025లో 3-1తో ఓడటం ఇందుకు ప్రధాన కారణాలు. ఈ రెండు సందర్భాల్లోనూ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమైన రోహిత్‌ శర్మ బుధవారమే సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.విరాట్‌ కోహ్లి కూడా రోహిత్‌ బాటలోనే!ఈ క్రమంలో మరో సీనియర్‌ బ్యాటర్‌, దిగ్గజ ఆటగాడు విరాట్‌ కోహ్లి కూడా రోహిత్‌ బాటలోనే నడుస్తాడనే వార్తలు వినిపించాయి. కోహ్లి ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నా.. బోర్డు అందుకు సమ్మతించలేదని.. అందుకే అతడు ఈ మేర తీవ్ర నిర్ణయానికి వచ్చినట్లు వదంతులు వ్యాపించాయి.వైస్‌ కెప్టెన్‌గా పంత్‌డబ్ల్యూటీసీ 2025-27 కొత్త సీజన్‌లో యువ రక్తంతో నిండిన జట్టును ఇప్పటి నుంచే సిద్ధం చేయాలనే యోచనలో ఉన్న బోర్డు.. కోహ్లికి నో చెప్పిందన్నది వాటి సారాంశం. తాజా సమాచారం ప్రకారం.. శుబ్‌మన్‌ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే ఆఖరి వారంలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.అదే విధంగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించాలని సెలక్టర్లు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి గిల్‌ కంటే పంత్‌ సీనియర్‌. అంతేకాదు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి విదేశీ గడ్డలపై సమర్థవంతంగా ఆడిన అనుభవం అతడికి ఉంది.అయితే, ఇటీవల ఆసీస్‌ పర్యటనలో పంత్‌ పూర్తిగా విఫలమయ్యాడు. షాట్ల ఎంపిక విషయంలో పదే పదే తప్పులు చేస్తూ విమర్శల పాలయ్యాడు. ఇలాంటి తరుణంలో గిల్‌ వైపు మొగ్గు చూపిన యాజమాన్యం.. అతడి చుట్టూ భవిష్యత్‌ జట్టును నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించే పంత్‌పై అదనపు భారం మోపకుండా.. బ్యాటింగ్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టేలా బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య టెస్టులతో డబ్ల్యూటీసీ 2025-27 సీజన్‌ ఆరంభం కానుంది. జూన్‌ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఇంగ్లండ్‌ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ జరుగుతుంది. చదవండి: SRH: బ్యాటర్ల వైఫల్యం... బౌలర్ల నిస్సహాయత

India And Pakistan Related Live Updates5
Ind Vs Pak: ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం

War Related Updates..ఢిల్లీ..ప్రధాని మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్పాకిస్తాన్ సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీసమావేశానికి హాజరైన ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌, నేవీ చీఫ్‌ అమృత్‌సర్‌లో రెడ్‌ అలర్ట్‌ ఎత్తివేత.తాజా పరిణామాలపై ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ మీడియా సమావేశంకాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పరిస్థితులపై వివరణ ఢిల్లీ..భారత్, పాక్ సరిహద్దులలో సాధారణ పరిస్థితిఆగిపోయిన కాల్పులు, కనిపించని డ్రోన్లుకాల్పుల విరమణ అవగాహన అతిక్రమిస్తే పాక్‌దే బాధ్యత అని రాత్రే స్పష్టం చేసిన భారత్#WATCH | Rajasthan | Situation seems normal this morning in Barmer. No drones, firing, or shelling were reported overnight. pic.twitter.com/lJOcUvMwY4— ANI (@ANI) May 11, 2025#WATCH | J&K | Visuals this morning in Kupwara. After days of heavy shelling by Pakistan, situation seems normal today. No drones, firing or shelling was reported overnight. pic.twitter.com/3S2s8WFiVQ— ANI (@ANI) May 11, 2025#WATCH | J&K | Situation seems normal this morning in Samba. No drones, firing, or shelling were reported overnight. pic.twitter.com/QPOnrefFHw— ANI (@ANI) May 11, 2025అమృత్‌సర్‌లో రెడ్‌ అలర్ట్‌అమృత్‌సర్‌లో ఇంకా మోగుతున్న సైరన్లు.ప్రజలు ఎవరూ బయటకు రావద్దని డిప్యూటీ కమిషనర్‌ సూచన.ఇళల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ.నగరంలో విద్యుత్‌ సరఫరా పునరుద్దణ. 👉కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్‌ మరోసారి తన వక్ర బుద్ధిని చాటుకుంది. విరమణ అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్‌ మళ్లీ దాడులకు తెగబడింది. శనివారం రాత్రి జమ్ము కశ్మీర్‌తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్‌ డ్రోన్‌ దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం.బ్లాకౌట్‌ ఎత్తివేత.. మళ్లీ విధింపు 👉కాల్పుల విరమణ ప్రకటన రాగానే పంజాబ్‌లో బ్లాకౌట్‌ను అధికారులు ఎత్తేశారు. ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించినట్లు వార్తలు రాగానే దానిని తిరిగి విధించారు. గుజరాత్, కశ్మీర్, రాజస్థాన్‌లలో బ్లాకౌట్‌ను కొనసాగిస్తున్నారు. గుజరాత్‌లోని కచ్‌లోనూ డ్రోన్లు కనిపించాయి. కశ్మీర్‌లోని నగ్రోటా వద్ద చొరబాట్లకు జరిగిన యత్నాన్ని కాల్పులతో సైన్యం వమ్ము చేసింది. #WATCH | J&K: Red streaks seen and explosions heard as India's air defence intercepts Pakistani drones amid blackout in Srinagar(Visuals deferred by unspecified time) pic.twitter.com/XObqcbiQCe— ANI (@ANI) May 10, 2025👉కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వెంబడి శనివారం రాత్రి అనేక ప్రాంతాల్లో పాక్‌ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపుర్‌, శ్రీనగర్‌లలో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పాక్‌ డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోఖ్రాన్‌లో, శ్రీనగర్‌లోని ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్ సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం.#WATCH | Punjab: A complete blackout has been enforced in Pathankot(Visuals deferred by an unspecified time) pic.twitter.com/z8ovHXi0sT— ANI (@ANI) May 10, 2025👉మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌, ఫిరోజ్‌పుర్‌, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌, బాడ్‌మేర్‌లలో పూర్తిగా కరెంటు నిలిపివేశారు. కఠువాలో బ్లాక్‌అవుట్‌ పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. పంజాబ్‌లోని మోగాలోనూ కరెంటు నిలిపివేశారు.గుజరాత్‌లోనూ డ్రోన్‌ దాడులు?👉గుజరాత్‌లోనూ డ్రోన్‌ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. కచ్‌ జిల్లాలో అనేక చోట్ల డ్రోన్లు కనిపించాయని గుజరాత్‌ హోంమంత్రి హర్ష్‌ సంఘవి వెల్లడించారు. ప్రస్తుతం పూర్తి బ్లాక్‌అవుట్‌ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, భయాందోళనలకు గురికావద్దని ‘ఎక్స్‌’ వేదికగా సూచించారు.#WATCH | Haryana: A complete blackout has been enforced in Ambala(Visuals deferred by an unspecified time) pic.twitter.com/nyGQK8Jet2— ANI (@ANI) May 10, 2025👉శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ సంగతేంటని ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. #WATCH | Gujarat | A complete blackout has been enforced in Bhuj in Kachchh(Visuals deferred by an unspecified time) pic.twitter.com/vBnYnoIkfm— ANI (@ANI) May 10, 2025

Pakistan PM Shehbaz Sharif declares victory6
భారత్‌పై పాక్‌ ప్రధాని ఓవరాక్షన్‌ కామెంట్స్‌.. నెటిజన్లు ఫైర్‌

ఇస్లామాబాద్‌: సరిహద్దుల్లో మూడు రోజులుగా జరుగుతున్న భీకర పోరులో అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్‌ తన వక్రబుద్ధిని చాటుకుంటూ రెచ్చగొట్టే విధంగా సరిహద్దులో కాల్పులు జరిపింది. అంతటితో ఆగకుండా.. పాక్‌ ప్రధాని విచిత్రంగా తమదే గెలుపు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత షెహబాజ్ షరీఫ్ పాకిక్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా షరీఫ్‌ మాట్లాడుతూ.. భారత్‌తో యుద్ధంలో తాము విజయం సాధించినట్టు పేర్కొన్నారు. తమ దేశాన్ని, తమ పౌరులను రక్షించుకోవడానికి తాము ఏది చేయడాకైనా వెనుదిరిగేది లేదన్నారు. పాక్‌ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు. భారత్ తమ దేశంలోని మసీదులు, సామాన్య పౌరులపై డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులు చేసిందని.. అనేకమంది సాధారణ పౌరుల చావుకు భారత్ కారణమైందని మండిపడ్డారు. తమదేశంపై నిరాధార ఆరోపణలు కూడా చేస్తుందని.. భారత్‌కు తగిన బుద్ధి చెప్పామని.. తమ జోలికి వస్తే ఏదైనా చేయగలమని చూపించామంటూ ఓవరాక్షన్‌ కామెంట్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.JUST IN: 🇵🇰🇮🇳 Pakistani PM Shehbaz Sharif declares victory over India.pic.twitter.com/go5V3JsGN8— Whale Insider (@WhaleInsider) May 10, 2025 12 Pakistan air bases destroyed, many of their jets shot down by the Indian Army… hundreds of terrorists killed deep inside Pakistan territory.Yet this man, with zero iota of shame, Shehbaz Sharif, says we have won against India. 🤡🤡 pic.twitter.com/qoI7u7NKYY— BALA (@erbmjha) May 10, 2025 ఇక, ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. పాక్‌ ప్రధాని తీరును ఎండగడుతున్నారు. అమెరికా మధ్యలోకి రాకపోతే పాకిస్తాన్‌ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. భారత్‌ దాడులను తట్టుకోలేక తోక ముడిచి.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌కు ఇంత నష్టం జరిగినా మీది ఎలా గెలుపు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. 🇵🇰Pakistan Prime Minister Shehbaz Sharif tweets, praises trump & declares victory over India: “We have won, this is victory.”Also, Pakistani people are celebrating victory all over the country.THIS IS SHAMELESS 🤮🤮 pic.twitter.com/1N9YhfGrya— Vaishnavi (@vaishu_z) May 10, 2025 Shehbaz Sharif won the war in twitter 😂 pic.twitter.com/TTGaMKN86t— Mr. Nice Guy (@Mr__Nice__Guyy) May 10, 2025 ఇదిలా ఉండగా.. ఒకవైపు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే, మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా, సౌదీ అరేబియా తదితర దేశాలకు పాక్ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడాన్ని యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీ అరేబియా స్వాగతించాయి. ఉద్రిక్తతల నివారణకు ఇది కీలకమైన ముందడుగు అని యూరోపియన్ యూనియన్ పేర్కొంది. ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండేలా అన్ని ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించింది. Shehbaz Sharif knows the nation is uneducated and will believe whatever they're told, so he quickly declared victory. He's totally an army puppet. It's honestly laughable to watch him.🤣🤣🤣 #ceasefire #PakistanIndianWar pic.twitter.com/dDUr5ONLhI— Sandeep Pathak⛳ (@iPandit_Pathak) May 10, 2025Pakistan PM Shahbaz Sharif, "we won the war against India. Our attack destroyed the enemy's Air Bases".- Welcome to comedy nights hosted by a country's PM in front of the media. pic.twitter.com/gbcaKX64En— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2025

Dr Thethali Dasharathara Reddy is one of the rare orthopedic specialists7
Mother's Day: అమ్మ వల్లే డాక్టర్‌నయ్యా!

తెలుగు రాష్ట్రాల్లోని అరుదైన ఆర్థోపెడిక్‌ నిపుణుల్లో డాక్టర్‌ తేతలి దశరథరామారెడ్డి ఒకరు. తండ్రి నారాయణ రెడ్డి పేరు మీద సొంతూర్లో ఒక ట్రస్ట్‌ పెట్టి.. అవసరంలో ఉన్న వాళ్లకు వైద్యసహాయం అందిస్తున్నారు. అమ్మ సంకల్పబలం వల్లే తాను డాక్టర్‌నయ్యానని చెప్పే ఆయన ఇంటర్వ్యూ మదర్స్‌ డే సందర్భంగా..! ‘‘మా సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి. మా నాన్న నారాయణ రెడ్డి. ఆ రోజుల్లో బీఏ హానర్స్‌ చేశారు. అమ్మ అచ్చాయమ్మ.. పెద్దగా చదువుకోలేదు. నాకు రెండున్నరేళ్లున్నప్పుడు మా నాన్న రోడ్‌ యాక్సిడెంట్‌ పాలయ్యారు. మేం మొత్తం ఆరుగురం. నాకు ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య, ఒక చెల్లి. అమ్మ మోటివేషన్‌.. నేను చిన్నప్పుడు యావరేజ్‌ స్టూడెంట్‌ని. బాగా అల్లరిచేసే వాడిని కూడా! నేను డాక్టర్‌ అవడానికి స్ఫూర్తి మా చిన్నాన్న (కంటి డాక్టర్‌ సత్యనారాయణ రెడ్డి) అయితే మోటివేషన్‌ మాత్రం అమ్మదే! అమ్మ చాలా డిసిప్లిన్డ్‌.. కష్టపడే తత్వం.. చాలా ఫోకస్డ్‌.. డెడికేటెడ్‌. కమాండింగ్‌ నేచర్‌! మమ్మల్ని పొద్దున నాలుగింటికి లేపి చదువుకు కూర్చోబెట్టేది. మాతోపొటే తనూ కూర్చుని.. మేం చదువుకుంటుంటే ఆమె రామకోటి రాసేది. అమ్మ ఆశయమల్లా మాలో ఎవరినైనా డాక్టర్‌ చేయాలన్న నాన్న కోరికను నెరవేర్చడమే! ఏమాత్రం చదువును నిర్లక్ష్యం చేసినా.. మా చిన్నాన్నను ఉదాహరణగా చూపిస్తూ చక్కగా చదువుకుంటే అలా గౌరవం పొందుతారని చెప్పేది! మా బద్ధకాన్ని ఏమాత్రం సహించేది కాదు. తండ్రిలేని పిల్లలు కదా.. తనేమాత్రం అశ్రద్ధ చేసినా పాడైపోతారనే భయం అమ్మకు. అందుకే మమ్మల్ని పెంచడంలో ఎక్కడా రాజీ పడలేదు ఆవిడ. గారాబం గారాబమే. స్ట్రిక్ట్‌నెస్‌ స్ట్రిక్ట్‌నెసే! బద్ధకం అనేది ఆమె డిక్షనరీలో లేదు. ఎవరి పనులు వాళ్లు చేసుకోవాలి అనేవారు. మా అందరినీ సమర్థులైన ఇండివిడ్యువల్స్‌గా తయారు చేశారు. ఇటు మరుదులు.. అటు తమ్ముళ్లు అందరూ ఆమె మాటను గౌరవించేవారు. నిజానికి మా ఇంట్లో నానమ్మ తర్వాత మా మేనత్త మాణిక్యం. ఆ తర్వాత అమ్మే! నాన్న లేకపోయినా ఆ ఉమ్మడి కుటుంబాన్ని చెదరనివ్వలేదు అమ్మ. అందుకే చిన్నాన్నలకు అమ్మంటే చాలా గౌరవం. అలా అమ్మ మోటివేషన్, నాన్న కోరిక, చిన్నాన్న స్ఫూర్తితో నేను డాక్టర్‌ను అయ్యాను. మా మేనమామలకైతే ఆవిడ వాళ్లమ్మతో సమానం. మేమెప్పుడైనా అమ్మను చిన్నగా విసుక్కున్నా మా మేనమామలు మమ్మల్ని కేకలేసేవారు. ఆమె ఎప్పుడు హైదరాబాద్‌కి వచ్చినా.. ఇంట్లోకి రావడం రావడమే తిరుగు ప్రయాణానికి టికెట్‌ ఎప్పుడు రిజర్వ్‌ చేస్తావని అడిగేది. ఆ రావడం కూడా ఒంట్లో బాలేక΄ోతేనే వచ్చేది. ఆసుపత్రిలో చూపించుకుని వెంటనే వెళ్లిపోయేవారు. ఎంత అడిగినా ఉండేవారు కారు. ఎక్కువగా తన తమ్ముళ్లతో ఉండటానికి ఇష్టపడేవారు. మా అమ్మ విషయంలో నాకున్న ఒకే ఒక అసంతృప్తి.. మా ఇంట్లో ఇప్పుడు దాదాపు 17 మంది దాకా డాక్టర్లున్నారు. అమ్మ మా సక్సెస్‌ చూశారు కానీ.. మా పిల్లల సక్సెస్‌ చూడకుండానే పోయారు. 2016లో చనిపోయారావిడ.మహాగొప్ప మేనమామలు..మా నాన్నగారు పోయాక అమ్మ మానసికంగా కుంగిపోతే.. అమ్మమ్మ వాళ్లు తీసుకెళ్లి కొన్నాళ్లు అక్కడే పెట్టుకున్నారు. అప్పుడు అమ్మను కంటికి రెప్పలా కాచుకుంది మా మేనమామలే! ఆ కష్టకాలంలో మా ఫ్యామిలీ నిలబడ్డానికి ప్రధాన కారణం మా అమ్మమ్మ గారి కుటుంబమే! మా అమ్మాయి డాక్టర్‌. అమెరికాలో మాస్టర్స్‌ చేస్తోంది. అబ్బాయేమో ఆస్ట్రేలియాలో సప్లయ్‌ అండ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ చేస్తున్నారు. నా భార్య సింధు. హోమ్‌ మేకర్‌. ఆమె కూడా అమ్మలాగే మంచి డిసిప్లిన్డ్‌. ఈ విషయంలో ఆమె మీద అమ్మ ఇన్‌ఫ్లుయెన్స్‌ చాలా ఉంది. గ్రేట్‌ మదర్‌. మా పెద్ద కుటుంబంలో చక్కగా ఇమిడిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే సింధు.. స్వీట్‌ హార్ట్‌ ఆఫ్‌ అవర్‌ ఫ్యామిలీ.’’– సరస్వతి రమ (చదవండి: అమ్మ మనసు తెలుసా?)

Sumanth Comments On Mrunal Thakur Relation8
మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సుమంత్‌

హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో సుమంత్‌ (Sumanth) పెళ్లి.. కొద్దిరోజులుగా వస్తున్న ఈ వార్తలపై తాజాగా సుమంత్‌ రియాక్ట్‌ అయ్యాడు. ఆయన నటించిన కొత్త సినిమా ‘అనగనగా’ (Anaganaga) ఓటీటీలో డైరెక్టగా మే 15న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మృణాల్ ఠాకూర్‌, సుమంత్‌ కలిసి దిగిన ఫోటో వెనుక ఉన్న అసలు విషయం చెప్పాడు.అక్కినేని కుటుంబంలో మరో పెళ్లి బాజా మోగబోతోందని, హీరోయిన్‌ మృణాల్ ఠాకూర్‌ను సుమంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాటిపై ఇద్దరూ మౌనంగా ఉండటంతో నెటిజన్లలో అనుమానాలు మరింత పెరిగాయి. అయితే, ఎట్టకేలకు హీరో సుమంత్ క్లారిటీ ఇచ్చేశాడు. మృణాల్‌తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని కుండ బద్దలు కొట్టేశాడు. ఒక సినిమా సమయంలో తీసుకున్న ఫోటో కొద్దిరోజులుగా వైరల్‌ అవుతుందంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తనను ఎక్కడా కూడా కలిసింది లేదన్నాడు. 'సీతా రామం' సినిమాలో మృణాల్ ఠాకూర్‌, సుమంత్‌ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ టైమ్‌లోనే వారిద్దరిలో స్నేహం మొదలైంది.పెళ్లి గురించి క్లారిటీపెళ్లి మీద తనకు ఎలాంటి ఆసక్తి లేదని సుమంత్‌ చెప్పాడు. ఇలా సింగిల్‌గా ఉండడమే లైఫ్‌ బాగుందని తెలిపాడు. ఈ క్రమంలో తానెప్పుడు ఒంటరితనాన్ని ఫీలవ్వలేదని క్లారిటీ ఇచ్చేశాడు. జీవితంలో ఒక తోడు కావాలని కూడా ఎప్పుడూ అనిపించలేదని చెప్పుకొచ్చాడు. అసలు లైఫ్‌లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదని సుమంత్‌ హింట్ ఇచ్చేశాడు. సుమంత్‌కు గతంలో పెళ్లి అయి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయం నుంచి ఆయన సింగిల్‌గానే ఉంటున్నాడు.

Small Medium companies out performance than large companies9
ఐటీలో ‘చిన్న’ హిట్టు.. ‘పెద్ద’ యావరేజు..

గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లోని పలు స్మాల్, మిడ్‌ క్యాప్‌ కంపెనీలు గణనీయంగా రాణించాయి. పెద్ద సంస్థలను మించిన పనితీరును కనపర్చాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సర్వీసుల సంస్థలు అటు క్యూ4లోను ఇటు పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ అదరగొట్టాయి. కోఫోర్జ్, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్, హెక్సావేర్‌ టెక్నాలజీస్, ఎంఫసిస్‌ వంటి సంస్థలు 2025 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం నుంచి 32 శాతం వరకు ఆదాయ వృద్ధి సాధించాయి.మరోవైపు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్‌లాంటి కంపెనీల ఆదాయ వృద్ధి మాత్రం సుమారు 4 శాతానికే పరిమితమైంది. పైపెచ్చు విప్రో ఆదాయం రెండు శాతం క్షీణించింది. జనవరి–మార్చి త్రైమాసికంలోను ఇదే తరహా ఫలితాలు కనిపించాయి. సీక్వెన్షియల్‌గా కోఫోర్జ్‌ ఆదాయం 4.7 శాతం పెరిగి రూ. 3,410 కోట్లకు, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ ఆదాయం 12.4 శాతం వృద్ధితో రూ. 2,982 కోట్లకు చేరాయి. భారీ డీల్స్‌ను దక్కించుకున్నప్పటికీ పెద్ద కంపెనీలు మిశ్రమ ఫలితాలు కనపర్చాయి. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.కొత్త టెక్నాలజీలు, నాయకత్వం దన్ను.. చిన్న కంపెనీలు మెరుగ్గా రాణించడానికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు తెలిపారు. జెన్‌ఏఐలాంటి కొత్త టెక్నాలజీలను వేగవంతంగా అందిపుచ్చుకోవడం, ప్రాజెక్టులను సత్వరం ఎగ్జిక్యూట్‌ చేయగలగడం, స్థిరమైన నాయకత్వం మొదలైన అంశాలు ఇందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. జెన్‌ఏఐలాంటి విప్లవాత్మకమైన టెక్నాలజీలనేవి, పరిస్థితులకు తగ్గట్లుగా వేగంగా తమను తాము మల్చుకోగలిగే చిన్న సంస్థలకు అవకాశంగా, ప్రస్తుతమున్న భారీ సంస్థలకు కొంత సవాలుగా మారొచ్చని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ (కేఐఈ) ఒక నివేదికలో తెలిపింది.వ్యయాలను తగ్గించే కొత్త టెక్నాలజీలను వెనువెంటనే అందించేలా తమ సర్వీస్‌ పోర్ట్‌ఫోలియోలను పునర్‌వ్యవస్థీకరించుకోవడమనేది పెద్ద సంస్థలకు కాస్త సవాలుగా ఉంటుందని పేర్కొంది. వాటి భారీ పరిమాణమే ఇందుకు కారణమని వివరించింది. అదే మధ్య స్థాయి కంపెనీలు, దీర్ఘకాలికంగా వ్యూహాత్మక ప్రయోజనాలు పొందేందుకు స్వల్పకాలికంగా ఆదాయాన్ని పణంగా పెట్టేందుకు సాహసం చేయడానికి వీలుంటుందని వివరించింది. స్థిరమైన నాయకత్వం కూడా కంపెనీల పనితీరులో కీలక పాత్ర పోషిస్తోంది.చాలా మటుకు మధ్య స్థాయి కంపెనీల సీఈవోలు అయిదేళ్లకు పైగా కొనసాగుతుండటం వల్ల విజన్, ఎగ్జిక్యూషన్‌ నిలకడగా ఉంటోంది. పెద్ద కంపెనీల లీడర్‌షిప్‌లలో మాత్రం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. 2023 జూన్‌లో టీసీఎస్‌ సీఈవోగా కె. కృతివాసన్‌ నియమితులు కాగా, 2023 డిసెంబర్‌లో టెక్‌ మహీంద్రాకు మోహిత్‌ జోషి, 2024 ఏప్రిల్‌లో విప్రోకు కొత్త సీఈవోగా శ్రీనివాస్‌ పల్లియా నియమితులయ్యారు.ఈసారీ జోరు .. గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ చిన్న, మధ్య స్థాయి సంస్థల జోరు కొనసాగవచ్చని అంచనాలు నెలకొన్నాయి. స్థిర కరెన్సీ ప్రాతిపదికన కోఫోర్జ్‌లాంటి కంపెనీల ఆదాయ వృద్ధి 16.4 శాతం స్థాయి నుంచి 20.8 శాతానికి పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్డర్లు పెద్ద సంఖ్యలో లభిస్తుండటం, అలాగే డీల్స్‌ పరిమాణం కూడా భారీ స్థాయిలో ఉండటం ఇందుకు దోహదపడొచ్చని పేర్కొన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.56 బిలియన్‌ డాలర్ల మెగా డీల్‌ కుదుర్చుకున్న ఏకైక దేశీ కంపెనీగా కోఫోర్జ్‌ నిల్చిందని వివరించాయి.అమెరికాకు చెందిన సేబర్‌కు 13 ఏళ్ల పాటు సర్వీసులు అందించేందుకు ఈ కాంట్రాక్టు ఉపయోగపడనుంది. మరోవైపు, పెద్ద కంపెనీలే కాస్త అనిశ్చితి ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీల్స్‌ బాగానే ఉంటున్నా, అమెరికాలో టారిఫ్‌లపరమైన అనిశ్చితులు, డిస్క్రిషనరీ వ్యయాల విషయంలో క్లయింట్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం వంటి అంశాలతో స్థూలఆర్థిక పరిస్థితులపై ఆందోళన నెలకొనడం ఇందుకు కారణం.ఎఫ్‌ఎంసీజీలోనూ అదే తీరు.. నీల్సన్‌ఐక్యూ నివేదిక ప్రకారం వినియోగదారుల బడ్జెట్‌కి అనుగుణమైన ఉత్పత్తులను అందించడంలో పెద్ద బ్రాండ్లకు చిన్న బ్రాండ్లు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. మార్చి త్రైమాసికంలో ఇవి 17.8 శాతం మేర వృద్ధి సాధించాయి. మిడ్‌ సైజ్‌ సంస్థలు 14.6 శాతం మేర పెరిగాయి. దాదాపు రూ. 5 లక్షల కోట్ల దేశీ ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లో చిన్న, మధ్య స్థాయి సంస్థల వాటా సుమారు 35 శాతం ఉంటుంది. లో బేస్, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ కాస్త మెరుగుపడటం, ద్రవ్యోల్బణం నెమ్మదించడం తదితర అంశాలు వీటికి సానుకూలంగా నిల్చాయి.మరోవైపు, రూ. 5,000 కోట్లకు పైగా రెవెన్యూ ఉండే దిగ్గజాలు క్యూ4లో 6.4 శాతం మాత్రమే వృద్ధి కనపర్చాయి. బడా కంపెనీల ఉత్పత్తుల ధరలు 4.7 శాతం పెరగ్గా, అమ్మకాల పరిమాణం 1.7 శాతంగా నమోదైంది. అంతక్రితం క్యూ4లో ధరలు 0.3 శాతం తగ్గగా అమ్మకాల పరిమాణం ఏకంగా 8.1 శాతంగా నమోదైంది. నివేదిక ప్రకారం.. చిన్న ప్యాక్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం దన్నుతో జనవరి–మార్చి త్రైమాసికంలో ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) రంగం 11 శాతం వృద్ధి చెందింది.

Sakshi Editorial On India Pakistan10
విరమణ సరే, విధానం సంగతి!

భారత్‌ – పాకిస్తాన్‌ల మధ్య వివాదాలన్నీ ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేది చాలా కాలంగా భారత్‌ అనుసరిస్తున్న స్థిరమైన విధానం. కశ్మీర్‌ అంశాన్ని తొలి రోజుల్లో ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకుపోవడం వలన నష్టం జరిగిందనే అభిప్రాయం ఇండియాకు ఏర్పడింది. పాక్, భారత్‌ల మధ్య రెండు కీలకమైన ఒప్పందాలున్నాయి. 1972 నాటి సిమ్లా ఒప్పందం, 1999లో ప్రకటించిన లాహోర్‌ డిక్లరేషన్‌. రెండు దేశాల నడుమ ఏ వివాదం తలెత్తినా ఈ రెండు ఒప్పందాల పరిధిలో, ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్‌ చాలా కాలంగా దృఢమైన వైఖరితో ఉండేది. మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్‌ ఏనాడూ అంగీకరించలేదు.ఇందుకు భిన్నంగా రెండు దేశాల వివాదంలో ఇప్పుడు మూడో పక్షం తలదూర్చిందా? కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్‌ దేశాలు అంగీకరించాయనీ, ఇది వెంటనే అమల్లోకి వస్తుందనీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా సాయంత్రం 5.30కి ప్రకటించారు. అమెరికా మధ్య వర్తిత్వం వహించి, రాత్రంతా చర్చలు జరిపిన ఫలితంగా ఈ ఒప్పందం సాధ్యమైందని కూడా ఆయన వెల్లడించారు. కామన్‌ సెన్స్‌నూ, తెలివిడినీ ఉపయోగించినందుకు రెండు దేశాలనూ ఆయన అభినందించారు.ఆ తర్వాత అరగంటకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయని ఆయన ధ్రువీకరించారు. సాయంత్రం ఐదు గంటలకే అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. అయితే ఆయన ట్రంప్‌ ట్వీట్‌ ప్రస్తావన గానీ, అమెరికా మధ్యవర్తిత్వం గురించి గానీ మాట్లాడలేదు. ఈరోజు మధ్యాహ్నం 3:30కు పాకిస్తాన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంవో), ఇండియా డీజీఎంవోకు ఫోన్‌ చేశారు. కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని మిస్రీ చెప్పారు.మూడో పక్షం జోక్యం లేకుండానే ఇరు దేశాలూ ఒప్పందానికి వచ్చాయనే విధంగానే ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ట్వీట్‌ చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్‌ కూడా రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంగానే దీన్ని అభివర్ణించారు. రేపు సోమవారం నాడు రెండు దేశాల మధ్య చర్చలు జరగబోతు న్నాయని అధికారిక ప్రకటన వెలువడింది. రెండు దేశాల డీజీఎంవోలు మాట్లాడుకోవడానికి ముందు నుంచే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రెండు దేశాల ముఖ్య నేతలతో మాట్లాడుతున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి.ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా నిర్వహించిన పాత్రేమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉద్రిక్తతల సడలింపునకు కాల్పులు విరమణ పాటించాలని స్నేహపూర్వక సలహా మాత్రమే రెండు దేశాలకు ఇచ్చిందా? లేక చర్చల ప్రాతిపదికను తయారు చేసే మధ్యవర్తిత్వ పాత్ర పోషించిందా? ఒకవేళ మధ్యవర్తిగానే చర్చల ప్రాతిపదికను కూడా సిద్ధం చేసి ఉంటే దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పు వచ్చినట్టే భావించాయుద్ధం అమానుషమై నది. అనాగరికమైనది. యుద్ధం కారణంగా దేశాలు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. యుద్ధ ప్రమాదాన్ని నివారించడం వివేకవంతమైన చర్యే! కాల్పుల విరమణ ఆహ్వానించదగ్గదే! అయితే ఈ విరమణ వల్ల దేశం సాధించేది ఏమిటి? పోగొట్టుకునేదేమిటనే విశ్లేషణ కూడా అవసరం. యుద్ధం భారత్‌ ప్రారంభించలేదు. ఉగ్రవాదాన్ని ప్రయోగించి పాకిస్తానే కయ్యానికి కాలు దువ్వింది. బదులుగా పాక్‌లోని ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే భారత్‌ దాడులు చేసింది. నూరు శాతం కచ్చితత్వంతో చేసిన ఈ దాడులు పదును దేలిన భారత రణ వ్యూహానికీ, అద్భుతమైన సైనిక పాటవానికీ అద్దం పట్టాయి.భారత దాడులకు పాక్‌ నివ్వెరపోయింది. అధీన రేఖ వెంబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. జనావాసాలను టార్గెట్‌గా చేసుకొని దాడులకు దిగింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగానే జరిగినట్టు కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పరోక్షంగా అంగీకరించారు. మిగిలిన సరిహద్దు రాష్ట్రాల కంటే జమ్మూకశ్మీర్‌ ఈ దారుణాన్ని ఎక్కువగా భరించవలసి వచ్చింది. పసిపిల్లలతో సహా సాధారణ ప్రజలను బలి తీసుకుంటున్న మహమ్మారి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని కశ్మీర్‌ ప్రతిపక్ష నేత మెహబూబా ముఫ్తీ కన్నీళ్ళతో వేడుకున్నారు.యుద్ధాలను వేగిరపడి ప్రారంభించడం కాకుండా పూర్తి ప్రణాళికను రచించుకొని మొదలుపెట్టాలనీ, వీలైనంత వేగంగా ముగించాలనీ, శత్రువు ప్రతిఘటనా శక్తిని దెబ్బకొట్టి పోరాడకుండానే యుద్ధాలను గెలిచే మార్గాలను అన్వేషించాలనీ సన్‌షూ తన యుద్ధతంత్ర గ్రంథమైన ‘ఆర్ట్‌ ఆఫ్‌ వార్‌’లో చెబుతాడు. ఈ నాలుగు రోజుల భారత దాడుల్లో సన్‌షూ చెప్పిన ‘ఆర్ట్‌ ఆఫ్‌ వార్‌’ కనిపించింది. ఉగ్రవాద స్థావరాలపై గురి తప్పకుండా, సరిహద్దులు దాటకుండా దాడి చేయడం, పలువురిని మట్టు పెట్టడంతోనే భారత్‌ సగం యుద్ధాన్ని గెలిచింది. పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను ధ్వంసం చేయడం, ఎనిమిది కీలకమైన ఎయిర్‌ బేస్‌లను దెబ్బతీయటం, బాలిస్టిక్‌ మిసైల్‌ను గాల్లోనే పేల్చేయడంతో పాకిస్తాన్‌ దాదాపుగా చేతు లెత్తేసింది.ఈ దశలోనే పాక్‌ నేతలు అమెరికా శరణు కోరి ఉంటారనీ, అవమానకరమైన ఓటమి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేసి ఉంటారనీ అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికా జోక్యం చేసుకున్న విషయం యథార్థం. అది ఏ మేరకు అన్నది తేలవలసి ఉన్నది. సాధారణ ప్రజలపై మారణ హోమం చేయడం తప్ప పాకిస్తాన్‌ సాధించిందేమీ లేదు. భారత్‌ సాధించిన ఈ వేగవంతమైన విజయం రేపు జరిగే చర్చల్లో ప్రభావవంతమైన పాత్రను పోషించాలి. భారత్‌ కోరుతున్న విధంగా ఉగ్ర హంతకులకు స్థావరం లేకుండా చేస్తామని అంగీకరించాలి. భారత్‌లో నేరాలకు పాల్పడిన ఉగ్రవాదులను అప్పగించడానికి అంగీకరించాలి. భారత కశ్మీర్‌లో వేలు పెట్టబోమని అంగీ కరించే విధంగా పాక్‌పై ఒత్తిడి తేవాలి. సింధూనదీ జలాల ఒప్పందం నిలిపివేత విషయంలో పునఃసమీక్షకు అంగీకరించరాదు. అప్పుడే ఇది విజేత షరతుల మేరకు జరిగే ద్వైపాక్షిక చర్చలుగా పరిగణించవలసి ఉంటుంది. లేకుంటే మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమన్న చారిత్రక విధానానికి వీడ్కోలు పలికినట్లవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే... కాల్పుల విరమణ ప్రకటించిన మూడు గంటల తర్వాత సరిహద్దుల వెంబటి పాకిస్తాన్‌ ఆర్మీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వార్తలు వస్తున్నాయి. భారత భూభాగంపై కాల్పులు జరుపుతున్నాయి. ఇది పాకిస్తాన్‌ రాజకీయ నాయకత్వానికీ, ఆర్మీ నాయకత్వానికీ మధ్య సమన్వయ లోపమా? లేక రేపటి చర్చల్లో బేరమాడేందుకు తమ శక్తిని పెంచు కోవడానికి ఆ దేశం ఆడుతున్న నాటకమా? అదీ త్వరలోనే తేలుతుంది.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement