
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లాలోని సత్యసాయి ట్రస్టుకు దేవదాయ శాఖ చట్టంలోని పలు సెక్షన్‌ల కింద ఇస్తున్న మినహాయింపులను మరో పదేళ్ల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ట్రస్టు ఆదాయ వ్యయాలపై ఆ సంస్థకే స్వయంప్రతిపత్తి అధికారం కల్పించడం, ట్రస్టు నిర్వహణకు దేవదాయశాఖ నుంచి ఒక అధికారిని నియమించడం వంటి 25 సెక్షన్లకు సంబంధించిన మినహాయింపులు చాలా ఏళ్ల నుంచి అమలవుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌తో వీటి కాలపరిమితి ముగియడంతో మరో పదేళ్లు.. అనగా 2029 సెప్టెంబర్ వరకు ఈ మినహాయింపులను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment