ప్లాట్ల ఆప్షన్లకు 15 రోజుల గడువు
29 గ్రామాల్లో 9.18(ఎ), 9.18(బి) ఫారాల పంపిణీ
సాక్షి, విజయవాడ బ్యూరో: భూ సమీకరణకు భూములిచ్చిన రైతులు తమకు ఏ తరహా ప్లాట్లు కావాలో కోరుకునేందుకు సీఆర్‌డీఏ గురువారం నుంచి 15 రోజుల గడువు ఇచ్చింది. ఇందుకోసం 9.18(ఎ), 9.18(బి) ఫారమ్స్‌ను 29 గ్రామాల్లో పంపిణీ చేయిస్తోంది. తన వాటా ఏకమొత్తం ప్లాటు కావాలంటే 9.18(ఎ), కామన్ ప్లాట్ కావాలంటే 9.18(బి) ఫారమ్‌ను పూర్తి చేయాలి. రైతులు తనకు రావాల్సిన నివాస, వాణిజ్య ప్లాట్లను అర్హత మేరకు అతిపెద్ద ప్రామాణిక ప్లాటుగా గాని, లేకపోతే వివిధ సైజుల్లో ఉన్న ప్రామాణిక ప్లాటుగానీ కోరుకోవచ్చు. 15 రోజుల్లోపు రైతులు ఆప్షన్లు తెలుపుతూ ఏ ఫారమ్ ఇవ్వకపోతే అర్హతల ప్రకారం వారికొచ్చే ప్రామాణిక ప్లాటును, మిగిలిన విస్తీర్ణానికి చిన్న ముక్కల ప్లాట్లలో వాటా కేటాయిస్తారు.