విశాఖ జిల్లాలో 60 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నలుగురు మహిళలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
జి.మాడుగుల : విశాఖ జిల్లాలో 60 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నలుగురు మహిళలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. జి.మాడుగుల మండలం ఉరుము జంక్షన్ వద్ద మంగళవారం ఉదయం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ జీపులో బ్యాగుల్లో 60 కిలోల గంజాయి ఉంచి రవాణా చేస్తున్నట్లు వెలుగు చూసింది.
జీపులో ఉన్న చిత్తూరు జిల్లా మునకల చెరువు గ్రామానికి చెందిన నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో ఆవుల మణిరత్నమ్మ, ఆవుల ఈశ్వరమ్మ, ఆవుల నారాయణమ్మ, నల్లావుల సుగుణ ఉన్నారు. విశాఖ జిల్లా చింతపల్లి నుంచి పాడేరు మీదుగా చిత్తూరు జిల్లాకు గంజాయిని తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది.