ఓటు హక్కు నమోదుకు సంబంధించి 86,148, తొలగింపునకు సంబంధించి 3,300 దరఖాస్తులు బూత్‌లెవల్ ఆఫీసర్లకు అందాయి.
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో నిర్వహించిన ఓటరు నమోదు ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. గత నవంబర్ 19 నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓటు హక్కు నమోదు, తొలగింపు, తప్పుల సవరణ, పోలింగ్ కేంద్రాల మార్పులకు సంబంధించి అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయి. ఓటు హక్కు నమోదుకు సంబంధించి 86,148, తొలగింపునకు సంబంధించి 3,300 దరఖాస్తులు బూత్‌లెవల్ ఆఫీసర్లకు అందాయి.
తప్పుల సవరణకు 2,459, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పోలింగ్ కేంద్రం మార్పిడికి సంబంధించి 823 దరఖాస్తులు అందాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నియమితులైన బూత్ లెవల్ ఆఫీసర్లు తమ పరిధిలో వచ్చిన దరఖాస్తులను విచారించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి పది మంది బూత్ లెవల్ ఆఫీసర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించారు. ఈ నెల 31వ తేదీలోపు విచారణ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు రావడంతో ముమ్మరం చేశారు.