తిరుపతి : అక్టోబర్ 2 నుంచి నిరంతరాయంగా గృహావసరాలకు 24 గంటలు, వ్యవసాయానికి 9 గంటలు కరెంట్ సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కో కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రూరల్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను రెండు గ్రూపులుగా విడదీసి గ్రామీణ ప్రాంతాలకు కనీసం సింగిల్ ఫేజ్ కరెంట్‌ను 24 గంటలూ సరఫరా చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఇందులో భాగంగా వ్యవసాయ కనె క్షన్లకు హై ఓల్టేజి డిస్ట్రిబ్యూషన్(హెచ్‌వీడీఎస్) సిస్టంను అభివృద్ధి చేసేందుకు రూ.15 వేల కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపారు. ప్రభుత్వం నిరే్దశించిన ప్రకారం పల్లెప్రాంతాలకు త్రీఫేజ్ కరెంట్ ఇవ్వాలంటే సబ్‌స్టేషన్లను పటిష్టపరచాల్సి ఉంది.
రూరల్ కరెంట్‌ను వ్యవసాయం నుంచి విడదీసి రెండు మూడు వ్యవసాయ కనె క్షన్లకు నేరుగా హెచ్‌వీడీఎస్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. డిస్కం పరిధిలోని 11 జిల్లాల్లో హెచ్‌వీడీఎస్ పనులు 80 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. ఇంత చేసినా వ్యవసాయానికి నిరంతరాయంగా 9 గంటలు కరెంట్ ఇవ్వడం కుదరదని అయితే రెండు విడతలుగా ఇస్తామంటున్నారు.
అనంతపురం, గుంటూరులో సోలార్ పవర్
కరెంట్ కొరత నివారణ చర్యల్లో భాగంగా అనంతపురం, గుంటూరు జిల్లాల్లో సోలార్ పవర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయనున్నట్లు డిస్కం చైర ్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ హెచ్‌వై.దొర చెప్పారు. ప్రస్తుతానికి పట్టణ ప్రాంతాలకు కరెంట్ కొరత లేదన్నారు. అనంతపురం జిల్లాలోని గాలిమరల విద్యుత్ ఉత్పత్తి కేం ద్రం నుంచి 550 మెగావాట్ల విద్యుత్ అందుతోందని, కృష్ణపట్నం నుంచి 3వ తేదీ 270 మెగావాట్ల విద్యుత్ డిస్కం కోటాగా అందిందని దొర తెలిపారు. ఆప్పర్ సీలేరు నుంచి అంతరాయం లేకుండా 200 మెగావాట్ల విద్యుత్ అందుతోందన్నారు.
9 గంటల విద్యుత్ సరఫరాపై ట్రాన్స్‌కో కసరత్తు : రూ.15 కోట్లతో ప్రతిపాదనలు
Published Tue, Aug 5 2014 1:20 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement