అభిరుచులకు అనుగుణంగా సినీ సాహిత్యంలో మార్పు
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
సింహాచలం: సినిమా రంగంలో ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సాహిత్య విలువలు మారిపోతుంటాయని, దాన్ని ఆపలేమని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని శనివారం ఆయన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడారు. సినిమాల్లో సాహిత్య విలువలు తగ్గిపోతున్నాయని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ప్రేక్షకుల అభిరుచులను బట్టి సాహిత్యం తీరుతెన్నుల్లో మార్పులు వస్తుంటాయన్నారు. తన వరకు సాహిత్య విలువలను కాపాడుకునేందుకే ప్రయత్నం చేస్తున్నానన్నారు. సమాజాన్ని, సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదవాలని నేటి రచయితలకు తాను సూచిస్తున్నానన్నారు.
గీతం యూనివర్శిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ అందుకోవడం సింహాచల లక్ష్మీనృసింహస్వామి వరస్రాదంగా భావిస్తునానన్నారు. డాక్టరేట్ అందుకునే ముందు స్వామిని దర్శించుకోవాలని వచ్చానన్నారు. అశోకతేజ దంపతులు కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో అష్టోత్తర పూజను నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రాకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు.