పుడమికి మనిషి భారమా..
తండ్రికి బిడ్డ భారమా..!
ఎన్నాళ్లకో కురిసింది వాన. అదును దాటుతున్న వేళ.. నాలుగు చినుకులు రాలి, నేల పదునెక్కడంతో ఏజెన్సీ గ్రామమైన గుమ్మిడి గూడ పంచాయతీ దండుసూర గ్రామంలో రైతులు వరి నారుమడిని సిద్ధం చేసుకుంటున్నారు. ఇంటిల్లిపాదీ కష్టపడి తే గానీ సమయూనికి మడిని సిద్ధం చేయలేరు. అందుకేనేమో ఈ గిరిజన దంపతులుతలో చేరు వేస్తున్నారు.
మరి ఇంటి వద్దే తమ చిన్నారిని వదిలి రాలేరు.. అందుకే తమ బిడ్డను భుజంపై వేసుకొని దుక్కు దున్నసాగారు. ఇది చూసినవారంతా.. భూమికి మనిషి ఏనాడైనా భారమవుతాడా.. తండ్రికి బిడ్డ ఎప్పుడైనా భారమవుతుందా..! అని చర్చించుకున్నారు. ఈ చిత్రం శుక్రవారం ఏజెన్సీలో తారసపడింది.
- కురుపాం