హైదరాబాద్: అవినీతి జలగలు రోజూ ఏదో మూల పట్టుబడుతూనే ఉన్నారు. వాణిజ్య పన్నులశాఖలో ఓ ఉన్నతాదికారి చిక్కిన ఘటన మరువకముందే మరో అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. బాచుపల్లి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులకు దొరికిపోయాడు. ఓ బిల్డర్‌ను లంచం డిమాండ్ చేసిన సంగతి తెలుసుకున్న ఏసీబీ అధికారులు అకస్మికంగా దాడి చేశారు. బిల్డర్ లంచం ఇస్తుండగా అడ్డంగా దొరికిపోయాడు.
మంగళవారం వాణిజ్య పన్నులశాఖ హైదరాబాద్ రూరల్ డిప్యూటీ కమిషనర్ నీలకొట్టం శ్రీనివాసులు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు జరిపి పలు అక్రమ ఆస్తులు గుర్తించారు. శ్రీనివాసులు అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న సమాచారం మేరకు హైదరాబాద్ వింగ్ ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు ఇతర అధికారులతో కలిసి బల్కంపేటలోని ఆయన నివాసంతోపాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరపారు. ఈ ఘటనలో భారీ అక్రమ ఆస్తులతో అతను పట్టుబడ్డ సంగతి తెలిసిందే.