సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. చలి గజ గజ వణికిస్తోంది. శుక్రవారం ఆదిలాబాద్‌లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైం ది. హైదరాబాద్‌లో 14.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముం దని ప్రకటించింది. గురువారం రాత్రి చలికి తట్టుకోలేక మొయినాబాద్ మండలం కనకమామిడికి చెందిన అంజయ్య(50) మరణించాడు. రాత్రి మైలార్‌దేవ్‌పల్లిలోని ప్రగతిభవన్ వద్ద నిద్రపోయిన అంజయ్య రాత్రంతా చలిలోనే పడుకోవడంతో తెల్లవారేసరికి మృతిచెందాడని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు తెలిపారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైకి ఆగ్నేయ దిశలో 490 కిలోమీటర్ల దూరంలోను, నాగపట్నానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణ, రాయలసీమ జిల్లాలతో పోలిస్తే కోస్తాంధ్ర ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పుల్లేవని భారత వాతావరణ శాఖ శుక్రవారంనాటి తన నివేదికలో వెల్లడించింది. రాగల 48 గంటల్లో కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోను, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్టు తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. గరిష్ట/కనిష్ట ఉష్ణోగ్రతలు 28, 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
పెరుగుతున్న చలి
Published Sat, Nov 16 2013 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement