ఒంగోలు: జూలైలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. సంతపేటలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మేలో పరీక్షలు నిర్వహిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment