సాక్షి, అమరావతి : ప్రకాశం జిల్లాలో నవంబరు 14న నాడు- నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలల నవీకరణ మూడు దశల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మొదటి దశలో భాగంగా 15 వేల పాఠశాలలను మెరుగుపరుస్తామని తెలిపారు. అదే విధంగా వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి 9, ఆ తదుపరి 10వ తరగతుల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేపెట్టనున్నట్లు వెల్లడించారు. (చదవండి : సీఎం జగన్ సమీక్ష.. నవంబర్ 14 నుంచి నాడు-నేడు)
వాటిని జూనియర్ కాలేజీలుగా
‘గత ప్రభుత్వం పాఠశాలలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసింది. కానీ మేము ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గంలో 160 స్కూళ్లను బాగు చేస్తున్నాం. అదే విధంగా మండలంలో 500 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తాం. పాఠశాలల్లో ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డులు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం’ అని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment