బీజేపీ ఎందుకు మాట్లాడలేదు: శోభా ఓఝా | aicc general secretary shobha ojha fires on bjp | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎందుకు మాట్లాడలేదు: శోభా ఓఝా

Jun 8 2015 5:08 PM | Updated on Mar 29 2019 9:31 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఓటుకు నోటు వైఖరిపై భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి శోభా ఓజా ప్రశ్నించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఓటుకు నోటు వైఖరిపై భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి శోభా ఓఝా ప్రశ్నించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

 

ఆ కేసుకు సంబంధించి జ్యుడీషియల్ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. జ్యుడీషియల్ విచారణ ప్రారంభం కావడానికి ముందే ఏపీ సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీతో పాటుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు పెదవి విప్పలేదని ఆమె మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement