సాక్షి, కర్నూలు : తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ అక్షయ గోల్డ్ బాధితులు గురువారం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. పత్తికొండ నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను ఈరోజు ఉదయం నర్సాపురం క్రాస్‌రోడ్ సమీపంలో అక్షయ గోల్డ్ బాధితులు కలిసి, తమ ఆవేదన తెలిపారు. రూపాయి రూపాయి కూడబెట్టి అక్షయ గోల్డ్‌లో పొదుపు చేసుకుంటే మోసం చేశారని వాపోయారు. ఈ సందర్భంగా సురేష్ బాబు అనే ఏజెంట్...జగన్ ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించాడు.
బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. యాజమాన్యం ఆస్తులు అమ్మి బాధితులకు డబ్బులు చెల్లించాలని, న్యాయస్థానం ఆదేశించినా ప‍్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ‘అక్షయ గోల్డ్ యాజమాన్యం సుమారు రూ.600 కోట్లు బకాయి పడింది. ఇప్పటికే 100మంది ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. అగ్రి గోల్డ్, అక్షయ గోల్డ్ లాంటి మోసాలపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాను. అయినా ప్రభుత్వం బాధితులకు ఎలాంటి న్యాయం చేయడం లేదు. ఏడాది పాటు ఓపిక పట్టండి. బాధితులందరికీ న్యాయం చేస్తా.’ అని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment