ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులకు అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జిల్లా గిరిజన
జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి నారాయణుడు
గుంటూరు వెస్ట్ : ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులకు అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి(డీటీడబ్ల్యుఓ) వి.నారాయణుడు తె లిపారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారిగా ఇటీవల నూతనంగా బాధ్యత లు స్వీకరించిన ఆయన జిల్లాలో గిరి జనుల సంక్షేమానికి, గిరిజన హాస్టళ్లల్లో ఉంటున్న విద్యార్థుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జి ల్లాలో ఉన్న 31గిరిజన హాస్టళ్లు, 3 ఆశ్ర మ పాఠశాలలు ఉన్నాయని వాటిలో ఉంటున్న విద్యార్థినీ, విద్యార్థులకు అ వసరమైన అన్ని సౌకర్యాలను కల్పిం చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూస్తానని, హాస్టళ్లలో మెన్ సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వసతిగృహాలలో ఉం టున్న విద్యార్థులు మంచిఫలితాలు సా ధించేలా ప్రణాళికలు రూపొందించి, అ మలుచేస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి ఎన్‌టీఆర్ విద్యాజ్యోతి, అంబేద్కర్ ఓవర్‌సీస్, గిరిపుత్రిక కల్యాణ పథకం తదితర పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ పథకాల అమలుపై విసృ్తత ప్రచారం నిర్వహించి, అర్హులైన వారికి అందజేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని నారాయుణుడు వివరించారు.
అనంతపురం జిల్లాలోని రొద్దం మండలం తిమ్మాపురానికి చెందిన ఆయన 1991లో తొలిసారి హైదరాబాద్‌లోని ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 20 ఏళ్ల సర్వీస్ అనంతరం 2011 ఆగస్టులో నె ల్లూరు జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారిగా (డీటీడ బ్ల్యూఓ)గా పదోన్నతిపై నియమితులయ్యారు. ప్రస్తుతం నెల్లూరు నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు.