భీమడోలు, న్యూస్‌లైన్ : వాళ్లంతా గర్భిణులు.. బాలింతలు.. ఎంత నిరుపేదలైనా.. ఎంతటి మొరటు మనుషులైనా వాళ్లని అపురూపంగా చూసుకుంటారు. అమృత హస్తం పథకం నిర్వాహకులు మాత్రం గర్భిణులు.. బాలింతలపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. పౌష్టికాహారం కోసం అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ఆ మహిళలను కటిక నేలపై కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తున్నారు. ఈ పరి స్థితి కొందరు గర్భిణులు, బాలింతలకు ప్రాణసంకటంగా మారుతోంది. నేలపై కూర్చుని భోజనం చేసేందుకు వారు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నారుు.
భీమడోలు ప్రాజెక్ట్ పరిధిలో ఇంతే...
భీమడోలు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని భీమడోలు, ద్వారకాతి రుమల, దెందులూరు మండలాల్లో 180 వరకూ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో నిరుపేద కుటుంబాలకు చెందిన 3,500 మంది గర్భిణులు, బాలింతలు నమోదయ్యూరు. వారందరికీ అమృతహస్తం పథకం కింద పాలు, కోడిగుడ్లు, పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందించాల్సి ఉంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో గతంలోనే ఈ పథకం అమలు చేస్తుం డగా, భీమడోలు ప్రాజెక్ట్ పరిధిలోని మూడు మండలాల్లో ఈనెల 20 నుంచి అమల్లోకి వచ్చింది. అన్ని కేంద్రాల్లోనూ గర్భిణులు, బాలింతల్ని కింద కూర్చోబెట్టి పౌష్టికాహారం అందిస్తున్నారు. వారికి బెంచీలు లేదా కుర్చీలు వేయూల్సి ఉండగా, ఎక్కడా అలాంటి ఏర్పాట్లు లేవు. గర్భిణులను, బాలింతలను నేలపై కూర్చోబెట్టకూడదని, ఇలా చేయడం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
పేదలంటే అలుసా?
అంగన్‌వాడీ కేంద్రాల్లో కటిక నేలపై కూర్చోబెట్టి పౌష్టికాహారం అందిస్తున్న తీరుపై గర్భిణులు, బాలింతల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదరికాన్ని అలుసుగా తీసుకుని అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి పథకం మాకు అవసరం లేదని కొందరు గర్భిణులు, బాలింతలు నిర్వాహకులకు చెప్పేస్తున్నారు. దీనిపై ఐసీడీఎస్ పీవో టి.స్వరాజ్యలక్ష్మిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.. బెంచీలు, కుర్చీల వంటివి ఏర్పాటు చేసేం దుకు నిధులు లేవన్నారు. దాతల సహకారంతో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హవ్వ.. నేలపైనా బువ్వ
Published Wed, Dec 25 2013 3:00 AM | Last Updated on Fri, Jun 1 2018 7:32 PM
Advertisement
Advertisement