అనంతపురం జిల్లా హిందుపురం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా,
అనంతపురం : అనంతపురం జిల్లా హిందుపురం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఈరోజు ఉదయం బెంగళూరు నుంచి హిందుపురం వస్తుండగా రాజన్నకుంట సమీపంలో లారీని ఢీకొంది. గాయపడినవారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.