బెదిరింపులు, ప్రలోభాలతో ఏకగ్రీవం | Anarchic of ruling party in MLC election of local bodies | Sakshi
Sakshi News home page

బెదిరింపులు, ప్రలోభాలతో ఏకగ్రీవం

Published Sat, Mar 4 2017 1:58 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

Anarchic of ruling party in MLC election of local bodies

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టారాజ్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఐదు జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులను బలవంతంగా పోటీ నుంచి తప్పించారు. గెలిచేందు కు తగిన బలం లేకపోవడంతో ఒత్తిళ్లు, బెదిరింపు లు, దౌర్జన్యాలు, ప్రలోభాలు, కొనుగోళ్లకు తెరతీశా రు. ఇతర పార్టీల సభ్యులను లొంగదీసుకున్నారు. మాట వినని వారి వ్యాపారాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరిపి దారికి తెచ్చుకున్నారు. మొత్తం ఆరు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా కుట్రలకు పాల్పడ్డారు. స్థానిక సంస్థల కోటాలో ఎనిమిది జిల్లాల్లో మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.

అధికార తెలుగు దేశం పార్టీ తొమ్మిది స్థానాలకు నామినేషన్‌ దాఖలు చేయగా, వైఎస్సార్‌సీపీ తనకు మెజారిటీ ఉన్న నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో అభ్యర్థుల ను రంగంలోకి దింపింది. మిగిలిన ఐదు జిల్లాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకు నేలా అధికార పార్టీ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొ చ్చింది. దీంతో ఆరు స్థానాలు ఏకగ్రీవం అయినట్టు ఆయా జిల్లాల అధికారులు శుక్రవారం ప్రకటించారు.

పైగా టీడీపీ తనకు బలం లేని నెల్లూరు,  కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత వైఎస్సార్‌ జిల్లాలో మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. వైఎస్సార్‌సీపీ తరపున వైఎస్‌ వివేకానందరెడ్డి, టీడీపీ నుంచి ఎం.రవీంద్రనా«థ్‌ రెడ్డి(బీటెక్‌ రవి) పోటీలో ఉన్నారు. 8 మంది స్వతం త్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆనం విజయకుమార్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ), వాకాటి నారాయణరెడ్డి(టీడీపీ) పోటీ పడుతున్నారు. కర్నూ లు జిల్లాలో గౌరు వెంకటరెడ్డి (వైఎస్సార్‌సీపీ), శిల్పా చక్రపాణిరెడ్డి(టీడీపీ) బరిలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement