
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విభాగాల వారీగా ప్రశ్నల సంఖ్య, మార్కుల విధానాలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ ఏ.సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి నమూనా పత్రాలను విడుదల చేశారు. నాలుగు పేపర్ల నమూనా పత్రాలను బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు వివరించారు. గతంలో 11 పేపర్లకు ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించగా ఈసారి 6కి కుదించిన సంగతి తెలిసిందే. ఇందులో నాలుగు పేపర్ల మార్కుల నమూనా పత్రాలను విభాగాల వారీగా ప్రకటిస్తున్నామని డైరెక్టర్ పేర్కొన్నారు. మిగతావి కూడా త్వరలోనే వెబ్‌సైట్లో పొందుపరుస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment