
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మావోయిస్టుల సమస్యలపై ప్రభుత్వం ఓ సబ్‌కమిటీని నియమించింది. అర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన ఈ ఉపసంఘం పనిచేయనుంది. ఈ సబ్‌కమిటీలో హోం, రెవెన్యూ, గిరిజన సంక్షేమం, రోడ్లు, భవనాల శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. లొంగిపోయిన నక్సల్స్‌కు పునరావాసం, తీవ్రవాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లింపులో విధాన రూపకల్పన, ధ్వంసమైన ఆస్తులకు పరిహారం, నక్సల్స్ సమస్య నియంత్రణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పన, తదితర అంశాలను ఈ సబ్‌కమిటీ సమీక్షించనుంది. మంత్రివర్గ ఉపసంఘం సిపార్సులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తామని జీవోలో పేర్కొంది.