విశాఖకు ‘పశ్చిమ’ సేనలు | AP government gets ready to tackle Cyclone Hudood | Sakshi
Sakshi News home page

విశాఖకు ‘పశ్చిమ’ సేనలు

Published Mon, Oct 13 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM

విశాఖకు ‘పశ్చిమ’ సేనలు

విశాఖకు ‘పశ్చిమ’ సేనలు

 ఏలూరు అర్బన్/ఏలూరు టూటౌన్ :హుదూద్ తుపాను విసిరిన జల ఖడ్గం ధాటికి కకావికలమైన విశాఖపట్నంలో పరిస్థితులను చక్కదిద్దేం దుకు జిల్లా నుంచి మునిసిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆదివారం రాత్రి పెద్దఎత్తున తరలి వెళ్లారు. అక్కడ చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాల్లో వీరంతా పాలు పంచుకుంటారు. ఏలూరు నగరపాలక సంస్థ, ఐదు మునిసిపాలిటీల నుంచి 550 మంది పారిశుధ్య సిబ్బంది, 17 మంది శానిటరీ ఇన్స్‌పెక్టర్లు విశాఖపట్నానికి తరలి వెళ్లారు. వీరిలో ఏలూరు నుంచి 200 మంది పారిశుధ్య కార్మికులు, 9మంది శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, భీమవరం మునిసిపాలిటీ నుంచి 100 మంది పారిశుధ్య సిబ్బంది, ముగ్గురు శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, నరసాపురం నుం చి 50 మంది పారిశుధ్య కార్మికులు ఇద్దరు శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, పాలకొల్లు నుంచి 50 మంది పారిశుధ్య కార్మికులు,
 
 ఒక శానిటరీ ఇన్స్‌పెక్టర్, తాడేపల్లిగూడెం నుంచి 50 మంది పారిశుధ్య సిబ్బంది, ఒక శానిటరీ ఇన్స్‌పెక్టర్, తణుకు నుంచి 100 మంది పారిశుధ్య కార్మికులు, ఒక శానిటరీ ఇన్స్‌పెక్టర్ ఉన్నారు. వీరంతా సోమవారం విశాఖ చేరుకుని జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ జీవీఎస్‌ఎన్ మూర్తికి రిపోర్ట్ చేస్తారని మునిసిపల్ వర్గాలు తెలిపారుు. ఇదిలావుండగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నలుగురు తహసిల్దార్లు, 30మంది వీఆర్వోలను తుపాను బాధిత ప్రాంతాలకు పంపిస్తున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు. వీరందరికీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. తుపాను తీరం దాటిన అనంతరం కలెక్టర్ భాస్కర్ శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. తుపాను సహాయక చర్యల్లో పాలు పంచుకునేందుకు అవసరమైతే  ఆధునిక యంత్రాలనుకూడా పంపిస్తామని అక్కడి కలెక్టర్లకు చెప్పారు.
 
 తరలివెళ్లిన విద్యుత్ ఉద్యోగులు
 విశాఖపట్నంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యల్లో పాలు పంచుకునేందుకు జిల్లా నుంచి విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని అక్కడికి పంపించినట్టు ఎస్‌ఈ సీహెచ్.సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఏడుగురు డీఈలు, 20 మంది ఏడీఈలు, 37 మంది ఏఈలు, నైపుణ్యం గల 360 మంది సిబ్బందిని విశాఖపట్నం తరలించామని ఆయన వివరించారు. 100 కిలోమీటర్ల నిడివి గల కండక్టర్ వైర్, 90 ట్రాన్స్‌ఫార్మర్లను కూడా పంపించామన్నారు. ఈపీడీసీఎల్ సీఎండీ మిరియూల శేషగిరిరావు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టామని తెలిపారు.
 
 జిల్లాలో 40 ట్రాన్స్‌ఫార్మర్లు
 దెబ్బతిన్నాయ్
 హుదూద్ తుపాను ప్రభావంతో వీచిన ఈదురు గాలులకు జిల్లాలో 33 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు 6, 12 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు 34 దెబ్బతిన్నాయని ఎస్‌ఈ చెప్పారు. వాటికి వెంటనే మరమ్మతులు చేరుుంచి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. యలమంచిలి మండలం కత్తవపాలెం, దొడ్డిపట్ల, నిడదవోలు మండలం ప్రక్కిలంక, రామన్నగూడెం, వీరవాసరం మండలం శృంగవృక్షం, భీమవరం, తాడువాయి, ఎ.పోలవరం తదితర గ్రామాల్లో ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్టు ఎస్‌ఈ వివరించారు. పెరవలిలో చెట్టుకూలి విద్యుత్ లైను పాడైందని, వెంటనే మరమ్మతులు చేయించామని చెప్పారు. ఆకివీడు, కోళ్లపర్రు గ్రామాల్లో 5 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని, వాటికి కూడా తక్షణమే మరమ్మతులు చేయించామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement