హమ్మయ్య..
ఏలూరు : వరుణుడు కరుణించాడు. అల్పపీడన ప్రభావం నుంచి జిల్లా రైతులను రక్షించాడు. హుదూద్ తుపాన్ తొలుత అల్పపీడనంగా, ఆ తరువాత వాయుగుండంగా మారుతుందని.. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం నుంచి సమాచారం అందటంతో జిల్లాలోని అన్నదాతలు ఆందోళనకు గురయ్యూరు. తుపాను ముప్పు తప్పినా.. వర్షాల వల్ల పంటలు పాడైపోతాయని భయపడ్డారు. వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాలు, పంటలు నీటమునిగే ప్రమాదం ఉందన్న సమాచారంతో అధికార యంత్రాంగం సోమవారం కూడా అప్రమత్తంగా వ్యవహరించింది. అరుుతే, వాతావరణం సాధారణంగా ఉండటంతో తీర గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారంతా ఇళ్లకు వెళ్లిపోయూరు. దీంతో ఆ కేంద్రాలన్నీ ఖాళీ అయ్యూరుు.
నష్టాలు నిల్
ఉత్తరాంధ్రలో పెను విధ్వంసం సృష్టించిన హుదూద్ తుపాను వల్ల జిల్లాలో ఎక్కడా, ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఇతర శాఖల పరంగా ఎలాంటి నష్టాలు నమోదు కాలేదు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, విద్యుత్ తీగలు తెగిపడటంతో ఆ శాఖకు కొంతమేర నష్టం వాటిల్లింది.
నేలనంటిన వరి
ఆదివారం ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 30 వేల ఎకరాల్లో వరి పంట నేలకొరిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. దీనివల్ల పంట లకు పెద్దగా నష్టం లేదని చెబుతోంది. పెరవలి, ఉండ్రాజవరం, అత్తిలి, చాగల్లు, భీమవరం, కొవ్వూరు, తాళ్లపూడి, ఉండి, తాడేపల్లిగూడెం, భీమడోలు, వీరవాసరం, పెనుగొండ, కొయ్యలగూడెం, నల్లజర్ల, దేవరపల్లి తదితర మండలాల్లో పలుచోట్ల వరి చేలు నేలకొరిగారుు. వరి దుబ్బులను నిలబెట్టి కట్టలు కట్టించే పనుల్లో రైతులు నిమగ్నమయ్యూరు. మెట్ట గ్రామాల్లో వరి కోతలు పూర్తి కావడంతో వర్షాలకు తడిసిన ధాన్నాన్ని ఆరబెట్టుకుంటున్నారు.
ఉత్తరాంధ్రకు 1,500 మంది
హుదూద్ తుపాను తాకిడితో ఛిద్రమైన ఉత్తరాంధ్ర జిల్లాల్లో చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి 1,500 మంది అధికారులు, సిబ్బంది తరలివెళ్లారు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, డీపీవో ఎ.నాగరాజువర్మ, ఇతర శాఖల ముఖ్య అధికారులు ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లి పునరావాస చర్యలను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యూరు.
పునరావాస కేంద్రాలు ఎత్తివేత
జిల్లాలోని ఐదు మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సోమవారం ఉదయం ఉపసంహరించారు. నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, భీమవరం, కాళ్ల మండలాల్లో హుదూద్ తుపానును దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. వీటిలో దాదాపు 8 వేల మందికి భోజనం, వసతి సౌకర్యాలు కల్పించారు. తుపాను, అల్పపీడనం ముప్పు తప్పడంతో వీటిని ఎత్తివేశారు. ఇదిలావుండగా మంగళవారం నుంచి పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని అధికారులు స్పష్టం చేశారు.