సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా బార్ లైసెన్సులకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం సచివాలయంలో జారీ చేసింది. ఈ మేరకు వచ్చే జనవరి 1నుంచి కొత్త బార్ పాలసీని అమలు చేయాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా కొత్త బార్ పాలసీ విధానం కింద రూ. 10 లక్షలు బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది.
వచ్చే జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు రెండేళ్ల పాటు లైసెన్సులు జారీ చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను యూనిట్లుగా నిర్థారించి ప్రభుత్వం బార్లను కేటాయించనుంది. నేటి నుంచి డిసెంబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. కాగా, డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ తీయనున్న కలెక్టర్లు అదేరోజు రాత్రి 7 గంటలకు బార్ల కేటాయింపుల జాబితాను విడుదల చేయనున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన కొత్త బార్ల నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్, లైసెన్సు ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి
- 50 వేలు లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్ల కు ఏడాదికి రూ. 25 లక్షలు
- 5 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో బార్ల కు రూ. 50 లక్షలు
- 5 లక్షల కంటే అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్లకు రూ. 75 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment