'సమైక్య శంఖారావం’బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు రేపటికి వాయిదా పడింది.
హైదరాబాద్ : 'సమైక్య శంఖారావం’ పేరుతో ఈ నెల 19న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు రేపటికి వాయిదా పడింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. శాంతి భద్రతల సమస్య అంటూ కుంటి సాకులు చూపుతూ హైదరాబాద్‌లో సమైక్య సభకు అనుమతిచ్చేది లేదని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ఈ మేరకు శనివారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సమాచారం అందించిన విషయం తెలిసిందే.