అన్నింటికీ చట్టసభే దిక్సూచి: కోడెల | assembly shows index to all govts, says Kodela shiva prasada rao | Sakshi
Sakshi News home page

అన్నింటికీ చట్టసభే దిక్సూచి: కోడెల

Published Thu, Mar 26 2015 4:35 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

అన్నింటికీ చట్టసభే దిక్సూచి: కోడెల - Sakshi

అన్నింటికీ చట్టసభే దిక్సూచి: కోడెల

హైదరాబాద్: అన్నింటికీ చట్టసభే దిక్సూచి' అంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలకు దశదిశా నిర్దేశాలు కూడా ఇక్కడే జరిగాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సభా హక్కుల ఉల్లంఘనపై సభలో జరిగిన చర్చలో పార్టీల సభ్యులు మాట్లాడిన అనంతరం కోడెల స్పందించారు.


హక్కులు ఏమిటో నిబంధనలు ఏమిటో అందరికీ తెలుసునని స్పీకర్ కోడెల అన్నారు. అంతకుముందు ఏపీ శాసన సభలో ప్రవేశ పెట్టిన సభా హక్కుల ఉల్లంఘనపై గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభలో పార్టీ సభ్యులు స్పీకర్ కోడెల శివప్రసాద్కి క్షమాపణలు తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement