
సచివాలయంలో పనిచేయని ఏటీఎంలు
సచివాలయంలోని ఏటీఎంలు పని చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకూ కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. తాత్కాలిక సచివాలయంలో ఏర్పాటుచేసిన ఏటీఎంలు కూడా పని చేయడం లేదు. దీంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పూర్తి జీతం పడలేదని కిందిస్థాయి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటవ తేదీ రావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు జీతంలో 10 వేల రూపాయలు నగదు చేతికిచ్చే విధంగా ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పిస్తే ఇబ్బందులు తప్పేవని ఉద్యోగులు వాపోతున్నారు.