తాడేపల్లి గూడెం: ఈ నెల 26న నిట్ శాశ్వత భవనాలకు శంకు స్థాపన చేయనున్నట్లు దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారని పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.