బాబును సంతృప్తిపరచడమే పోలీస్ లక్ష్యం | babu targets to police! | Sakshi
Sakshi News home page

బాబును సంతృప్తిపరచడమే పోలీస్ లక్ష్యం

Aug 27 2016 4:40 AM | Updated on Aug 21 2018 5:54 PM

బాబును సంతృప్తిపరచడమే పోలీస్ లక్ష్యం - Sakshi

బాబును సంతృప్తిపరచడమే పోలీస్ లక్ష్యం

చంద్రబాబును సంతృప్తిపరచడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తోందని హోంమంత్రి చెప్పారు.

డీజీపీ కార్యాలయ శంకుస్థాపనలో హోంమంత్రి
మంగళగిరి: కృష్ణా పుష్కరాల్లో పోలీసులు విధులు సక్రమంగా నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబును తృప్తిపరిచారని, అంతకంటే ఎక్కువగా చంద్రబాబును సంతృప్తిపరచడమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తోందని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ఆవరణలో రూ.3 కోట్లతో నిర్మించనున్న డీజీపీ కార్యాలయానికి శుక్రవారం శంకుస్థాపన చే శారు. మరోవైపు  వెలగపూడి లోని తాత్కాలిక సచివాలయంలోని నాలుగో భవనాన్ని శుక్రవారం అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ సచివాలయం నుంచి అధికారులు రాకపోయినా.. అటవీశాఖ సిబ్బంది మాత్రం పాల్గొన్నారు. ఐదో భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ తన చాంబర్‌న ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement