
వైఎస్ జగన్మోహన రెడ్డి
హైదరాబాద్: చిత్రకళ, సాహిత్యం, సినిమా వంటి రంగాలలో తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి బాపు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు. బాపు మృతికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు. బాపు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
బాపు బొమ్మ ఎంతో ప్రాముఖ్యత కలిగినదని అన్నారు. భారత దేశం ఓ మహానుభావుడిని, మహా మనిషిని కోల్పోయిందని జగన్ అన్నారు.